UATelugu
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
YouSay Review
Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే ఓ వీర సైనికుడి గాథ
భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన...read more
How was the movie?
తారాగణం
శివకార్తికేయన్
సాయి పల్లవి
భువన్ అరోరా
రాహుల్ బోస్
లల్లూ
శ్రీకుమార్ గణేష్
శ్యామ్ మోహన్
అజయ్ నాగ రామన్
మీర్ సల్మాన్
గౌరవ్ వెంకటేష్
సిబ్బంది
రాజ్‌కుమార్ పెరియసామిదర్శకుడు
కమల్ హాసన్
నిర్మాతజివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడుCH సాయిసినిమాటోగ్రాఫర్
ఆర్. కలైవానన్ఎడిటర్ర్
కథనాలు
Amaran Collections: తెలుగులో 500% లాభాలతో దుమ్మురేపిన ‘అమరన్’.. ఎంత వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కిన చిత్రం అమరన్ (Amaran). అమరుడైన మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై 19 రోజులు అయినా ఇప్పటికీ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అటు తెలుగులోనూ రికార్డు వసూళ్ల (Amaran Collections)ను రాబడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. థియేటర్లలో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీతో అదరగొడుతోంది. ఫలితంగా నటుడు శివకార్తికేయన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.
రూ.300 కోట్ల క్లబ్‌లోకి..
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని అక్టోబర్ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి 19 రోజుల్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ (Amaran Collections)ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు ‘మెగా బ్లాక్ బాస్టర్’ అంటూ మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకోలేదు. అమరన్‌తోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.
https://twitter.com/Dasarathan_1720/status/1858698464630063231
తెలుగులో లాభాలే లాభాలు..
‘అమరన్’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ తెలుగు హక్కులు రూ.4 కోట్లకు అమ్ముడు పోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా నిలిచింది. అయితే తెలుగులో ఎవరు ఊహించని స్థాయిలో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటివరకూ రూ.41 కోట్ల గ్రాస్ (Amaran Collections) వసూళ్లను అమరన్ సాధించింది. 500% లాభాలతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అటు తమిళనాడులోనే రూ.143 కోట్లను ‘అమరన్’ తన ఖాతాలో వేసుకుంది. అలాగే కేరళలో రూ.11.50 కోట్లు, కర్ణాటకలో రూ.22 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా రూ.79 కోట్లను కొల్లగొట్టింది. ఈ స్థాయి రెస్పాన్స్ చూసి అమరన్ టీమ్ తెగ ఖుషీ అవుతోంది.
కలిసొచ్చిన కంగువా ఫ్లాప్..
నిజానికి అమరన్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించినా ఈ స్థాయి వసూళ్లు వస్తాయని వారు కూడా ఊహించలేదు. ఎందుకంటే సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ వల్ల తమ లాంగ్ రన్ కలెక్షన్స్ దెబ్బతింటాయని భావించారు. అయితే నవంబర్ 14న వచ్చిన ‘కంగువా’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినీ లవర్స్ అమరన్ మెయిన్ ఛాయిస్‌గా మారిపోయింది. థియేటర్‌లో మంచి సినిమాను అస్వాదించాలని అనుకునేవారంతా కుటుంబంతో సహా అమరన్‌కు వెళ్తున్నారు. దీని కారణంగానే మూవీ వచ్చి మూడు వారాలు అవుతున్న బాక్సాఫీస్ (Amaran Collections) వద్ద జోరు తగ్గలేదు. ఈ వారం కూడా పెద్ద స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడంతో కలెక్షన్స్ ఇదే రీతిలో పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెలాఖరులో ఓటీటీలోకి..
థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘అమరన్’ (Amaran OTT Release) ఈ నెలాఖరులో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ వసూళ్ల (Amaran Collections) దృష్ట్యా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే డిసెంబర్ 5వ తేదీనైనా పక్కాగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ థియేటర్లలో చూడని వారంతా ‘అమరన్’ ఓటీటీ రాకకోసం తెగ ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 19 , 2024
OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
దీపావళి సందర్భంగా ‘క’, ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో ఎంటర్‌టైన్ చేసేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈసారి చిన్న చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర మూవీస్, వెబ్‌సిరీస్ రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రుక్మిణీ వసంత్ కథానాయిక. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
ధూం ధాం (Dhoom Dhaam)
చేతన్ కృష్ణ (Chethan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జితేందర్‌రెడ్డి (Jithender Reddy)
రాకేశ్ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8నప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్లడీ బెగ్గర్ (Bledy Beggar)
ఈ వారం ఓ తమిళ డబ్బింగ్ ఫిల్మ్ కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల దీపావళికి విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ‘బ్లడీ బెగ్గర్’ (Bledy Beggar) చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కవిన్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించారు.
జాతర (Jathara)
సతీష్‌బాబు రాటకొండ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాతర’ (Jathara). రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలు. నవంబర్ 8న ఈ మూవీ బాక్సాఫీస్ ముందుకు రానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా చిత్రంగా దీనిని రూపొందించినట్లు మేకర్స్ తెలియజేశారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
దేవర (Devara)
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ వేట్టయన్ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు.
ఏఆర్ఎం (ARM)
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏఆర్‌ఎం’ (ARM). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)
సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ'. ఈ సిరీస్ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమెజాన్ వేదికగా నవంబర్ 7 నుంచి స్టీమింగ్ కాబోతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.
TitleCategoryLanguagePlatformRelease DateMeet Me Next ChristmasMovieEnglishNetflixNov 6Outer Banks 4SeriesEnglishNetflixNov 7Mr. PlanktonMovieEnglish/ KoreanNetflixNov 8The Buckingham MurdersMovieHindiNetflixNov 8Vijay 69MovieHindiNetflixNov 8Its end with usMovieEnglishNetflixNov 9Countdown: Paul vs. TysonSeriesTelugu DubAmazon Nov 1Investigation AllienSeriesEnglishAmazon Nov 8Despicable Me 4MovieTeluguJio CinemaNov 5Explorer: EnduranceMovieEnglishHotstarNov 3Janaka Ithe GanakaMovieTeluguAhaNov 8
నవంబర్ 04 , 2024
Sai Pallavi: సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్లు.. నటి ఎమోషనల్ పోస్టు!
నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ చిత్రం ’అమరన్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సినిమాల నుంచి సాయిపల్లవిని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. #BoycottSaiPallavi హ్యాష్‌ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ చేస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిందంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వీడియోను గత మూడ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే?
‘అమరన్’ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి (Sai Pallavi) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
బాయ్‌కాట్ చేయాలని డిమాండ్
భారత సైన్యంతో పాటు సనాతన ధర్మాన్ని కూడా కించపరిచారంటూ అదే ఇంటర్వూలో సాయిపల్లవి (Sai Pallavi) మాట్లాడిన వీడియోను సైతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సాయిపల్లవి చిత్రాలను బహిష్కరించాలను సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నడుపుతున్నారు. జాతీయ వాద, సనాతన భావాలు కలిగిన వారు నూటికి నూరు శాతం సాయి పల్లవి చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని ఓ నెటిజన్ పిలుపునిచ్చారు. సాయిపల్లవి పాక్‌కు అనుకూలంగా స్టాండ్ తీసుకున్నప్పుడు అక్కడే సినిమాలు చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఆమె అసలు నేషనల్ క్రష్ కానేకాదని మరో విధమైన క్రష్ అంటూ ఘాటు పదజాలంతో విమర్శిస్తున్నారు. సాయిపల్లవితో పాటు ఆమె లేటెస్ట్ చిత్రం 'అమరన్'ను కూడా బహిష్కరించాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. అంతేకాదు హిందీలో తెరకెక్కుతోన్న 'రామాయణ' చిత్రంలో సీతగా ఆమెను తీసివేయాలని కోరారు. సనాతన ధర్మం గురించి కించపరుస్తూ మాట్లాడే వారిని కఠినంగా శిక్షించాలని మరో నెటిజన్ డిమాండ్ చేశారు. మరోవైపు సాయిపల్లవి ఫ్యాన్స్ దీటుగా బదులిస్తున్నారు. ఆమె మాటలను వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తిప్పికొడుతున్నారు.
https://twitter.com/Bhav1212B/status/1850791387672801479
https://twitter.com/cinematicfreak0/status/1850791153928745098
https://twitter.com/devx_18k/status/1850791086458831193
https://twitter.com/Chhuparustam91/status/1850790246012653618
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/itz_meprabhat/status/1850787660815855924
https://twitter.com/MissDD114/status/1850829733895737441
సాయిపల్లవి ఎమోషనల్ పోస్టు
ఇదిలా ఉంటే అమరన్ ప్రమోషన్స్‌లో భాగంగా నటి సాయిపల్లవి (Sai Pallavi) ఇటీవల నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. దేశం కోసం మరణించిన సైనికులకు నివాళులు అర్పించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వాటికి ఎమోషనల్ పదాలను సైతం సాయిపల్లవి జోడించింది. ‘నేను అమరన్ ప్రమోషన్స్ మొదలుపెట్టే ముందు నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించాలి అనుకున్నా. కొన్ని రోజుల క్రితం వెళ్ళాను. మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల గురించి వివరాలు ఉంచే పవిత్రమైన ఆలయం ఇది. మేజర్ ముకుంద్ వరదరాజన్, సిపాయి విక్రమ్ సింగ్ (Vikram Singh)లకు నివాళులు అర్పిస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను’ అని రాసుకొచ్చింది.
https://twitter.com/Sai_Pallavi92/status/1850571262755582363
కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారే పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
అక్టోబర్ 28 , 2024
Diwali Movies Weekend Collections: దీపావళి చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. ఏకైక చిత్రంగా ఆ మూవీ రికార్డ్!
దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘లక్కీభాస్కర్’ (Lucky Bhaskar), ‘క’ (KA), ‘అమరన్’ (Amaran) చిత్రాలు మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సైతం సాధిస్తున్నాయి. తొలి రోజు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూడు చిత్రాలు వీకెండ్‌కు వచ్చే సరికి తమ వసూళ్లను గణనీయంగా పెంచుకున్నాయి. తొలి నాలుగు రోజుల్లో ఏ మూవీ, ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్కీ భాస్కర్ (Lucky Bhaskar Weekend Collections)
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్ 31) రిలీజైన ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.55.4 కోట్ల (GROSS) కలెక్షన్స్‌ను 'లక్కీ భాస్కర్' రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, దర్శకుడితో పాటు నిర్మాత నాగవంశీ ఉన్న స్పెషల్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ట్రేడ్ వర్గాల విశ్లేషణల ప్రకారం ఒక్క ఏపీ, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.19.10 కోట్లు (GROSS) రాబట్టింది. కేరళలో రూ.8.75 కోట్లు, కర్ణాటకలో రూ. 2.65 కోట్లు, తమిళనాడులో రూ. 3.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.13.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి.
క (KA Weekend Collections)
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ (KA Movie). అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. గురువారం ఈ మూవీ రిలీజవ్వగా శని, ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగినట్లు సమాచారం. తొలి నాలుగు రోజుల్లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. అటు తొలి మూడు రోజుల్లోనే ‘క’ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై వచ్చేవన్ని లాభాలే అంటూ తెలిపాయి. అంతేకాదు రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.
అమరన్
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో తెరకెక్కిన ‘అమరన్’ (Amaran Movie) పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చితక్కొడుతోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.136 కోట్ల (GROSS) వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ. 65.05 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.15.45 కోట్లు, కర్ణాటకలో రూ.8.05 కోట్లు, కేరళలో రూ.4.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ.41.85 రాబట్టినట్లు స్పష్టం చేశాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళికి రిలీజైన చిత్రాల్లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా ‘అమరన్’ నిలిచింది.
నవంబర్ 04 , 2024
Sai Pallavi: సాయిపల్లవి పాత వీడియో వైరల్.. తప్పు చేశావంటూ ట్రోల్స్!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తన తొలి ఫిల్మ్‌తోనే చెరగని ముద్ర వేసింది. తాజాగా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సాయిపల్లవికి సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగలింది. గతంలో ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింలోకి వచ్చాయి. దీంతో నెటిజన్లు సాయిపల్లవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అమర జవాన్ బయోగ్రఫీ
శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. నటుడు శివకార్తికేయన్ ముకుంద్ పాత్ర పోషించగా, సాయిపల్లవి ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ రోల్‌లో పోషించింది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పూర్తిగా భావోద్వేగాలతో నిండిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Siva_Kartikeyan/status/1839559422332346584
సాయిపల్లవి వీడియో వైరల్
అమరన్ చిత్రం ఆర్మీ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో భారత ఆర్మీపై సాయిపల్లవి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విరాటపర్వం మూవీ ప్రమోషన్ సమయంలో సాయి పల్లవి ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉగ్రవాదం, హింస అంశాల గురించి ప్రస్తావిస్తూ ‘పాకిస్థాన్ సైనికులను మన భారతీయులం ఉగ్రవాదుల్లా చూస్తాం. అలాగే పాకిస్థాన్‍లో ఉంటున్న వారు మన భారత సైనికులను ఉగ్రవాదుల్లా చూస్తారు. వాళ్లకు మనం చేటు చేస్తామని అనుకుంటుంటారు. సమస్యల పరిష్కారానికి హింస ఏ మాత్రం పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్దాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు' అని ఆమె అన్నారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/ViralVidox/status/1850064411202932830
కశ్మీర్ హింసాకాండ పైనా..
ఇదే ఇంటర్వ్యూలో కశ్మీరి పండిట్ల హత్యాకాండపైనా సాయి పల్లవి మాట్లాడారు. ‘కొన్ని రోజుల క్రితం ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. ఆ టైమ్‌లో ఉన్న కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు. మనం మత ఘర్షణలా వాటిని చూస్తే రీసెంట్‌గా ఓ బండిలో ఆవులని తీసుకెళ్లున్నారని ఆ వెహికిల్‌ని నడుపుతున్న వ్యక్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడుంది’ అంటూ సాయిపల్లవి ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సాయిపల్లవిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున మండిపడ్డాయి. అయితే అమరన్ రిలీజ్ సందర్భంలో ఈ వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే సాయిపల్లవిని టార్గెట్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
https://twitter.com/divya_gandotra/status/1784199470219251986
వాళ్లే టార్గెట్ చేస్తున్నారా?
'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి ఓ వ్యక్తి వచ్చి పీఆర్ ఏజెన్సీ తరపున తన ఇమేజ్‌ను మరింత పెంచుతానని అన్నారని తెలిపింది. అయితే దానిని తాను రిజక్ట్ చేశానని ఆమె చెప్పారు. అలాంటి అవసరం తనకు లేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు వారే సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పేరును డ్యామేజ్ చేసేందుకు వారు యత్నిస్తున్నట్లు టాక్. సీత పాత్ర నుంచి సాయి పల్లవిని తొలగించాలని కూడా వారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కావాలనే బాలీవుడ్ పీఆర్ టీమ్ సాయి పల్లవిని టార్గెట్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
https://twitter.com/bollywooddadi/status/1849561000456179910
అక్టోబర్ 26 , 2024
Sai Pallavi: నాని సినిమా షూట్‌లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అద్భుతమైన నటన, మిస్మరైజింగ్ డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. రీసెంట్‌గా తమిళంలో ఆమె నటించిన ‘అమరన్’ (Amaran) చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ సక్సెస్‌కు సంబంధించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాని (Nani)తో చేసిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ షూటింగ్ సమయంలో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చింది.
కారణం ఏంటంటే?
శివకార్తికేయన్ హీరోగా సాయిపల్లవి (Sai Pallavi) నటించిన ‘అమరన్’ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించారు. అమరుడైన ఆర్మీ జవాన్ జీవత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సాయిపల్లవి సినిమా గురించి మాట్లాడారు. అదే సమయంలో శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో తను పడ్డ ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. రాత్రిళ్లు షూటింగ్ తనకు అస్సలు అలవాటు లేదని సాయిపల్లవి తెలిపింది. అయితే శ్యామ్ సింగరాయ్‌లో తన సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించినట్లు చెప్పింది. దీంతో తెల్లవారే వరకూ మేల్కొనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. దాదాపు 30 రోజులు ఇలాగే కొనసాగిందని పేర్కొంది. నైట్ షూట్ వల్ల తన పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేదంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
‘చెల్లికి చెప్పుకొని ఏడ్చేశా’
రాత్రి ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) షూటింగ్ చేస్తునే పగలు మరో మూవీ సెట్‌లో పాల్గొనేదానినని సాయిపల్లవి (Sai Pallavi) తెలిపింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల మానిసిక ఒత్తిడికి గురైనట్లు వాపోయింది. ఒకరోజు రాత్రి తనను చూడటానికి చెల్లి పూజా కన్నన్ వచ్చిందని, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఏడ్చేశానని తెలిపింది. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదని, ఒకరోజు విశ్రాంతి దొరికితే బాగుంటుందంటూ తన బాధను ఆమెతో చెప్పుకున్నానని అన్నది. ‘దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి ‘మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి’ అని అడిగింది. ఇది విన్న నిర్మాత వెంకట్ బోయనపల్లి వెంటనే స్పందించారు. ‘పదిరోజులు సెలవు తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్‌కు రావచ్చు’ అన్నారు’ అని నాటి రోజులను సాయిపల్లవి గుర్తు చేసుకుంది.
దేవదాసిగా అదరగొట్టిన సాయిపల్లవి
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్స్ చేశాడు. వాసు, శ్యామ్ సింగరాయ్ (1970నాటి పాత్ర) రోల్స్‌లో అలరించారు. ఇక దేవదాసి మైత్రీ పాత్రలో సాయిపల్లవి అదరగొట్టింది. తనదైన నటనతో ఆ పాత్రకు వన్నెలద్దింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకులని కట్టిపడేసింది. డ్యాన్స్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకుంది. మైత్రి పాత్ర నటిగా సాయిపల్లవిని మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. దేవదాసిల జీవితాలను అద్దం పట్టేలా ఆమె నటించిన తీరు ఎంత పొగిడిన తక్కువే. ‘శ్యామ్ సింగరాయ్’ రిలీజ్ అనంతరం నానితో సమానంగా సాయి పల్లవి నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి (Sai Pallavi) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ (Thandel)లో నటిస్తోంది. ఇందులో నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు. 'లవ్‌స్టోరీ' (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరు మరోమారు జంటగా నటిస్తుండటంతో 'తండేల్'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. నితేశ్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ' (Ramayana)లో సీతగా ఆమె నటిస్తోంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫొటోలు లీకవ్వగా సీతగా సాయిపల్లవి లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
నవంబర్ 12 , 2024
Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ సినిమా 'క' (Ka Movie). యువ డైరెక్టర్లు సుజీత్ - సందీప్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటించింది. 2024 దీపావళి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. తొలి 4 డేస్‌లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కంటెంట్ పరంగా చూస్తే అంతకంటే ఎక్కువ వసూళ్లనే ‘క’ రాబట్టి ఉండేది. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయం వల్ల ఈ మూవీ కలెక్షన్స్‌లో భారీ కోత పడింది. ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్‌లో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నాకర్థంగా మారవచ్చు.
థియేటర్ల కేటాయింపులో అన్యాయం
కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రాన్ని దీపావళికి తీసుకొస్తున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చేటప్పటికీ దివాలీ రేసులో ఏ చిత్రం లేదు. ఆ తర్వాత దీపావళి బరిలోకి ‘క’ (Ka)తో పాటు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar), ‘అమరన్’ (Amaran), ‘బఘీరా’ (Bagheera) వచ్చి చేరాయి. ఇందులో ‘లక్కీ భాస్కర్’ మినహా మిగిలిన రెండు చిత్రాలు పరభాష చిత్రాలే. తమిళ, కన్నడ చిత్రాలైనా ‘అమరన్’, ‘బఘీరా’ను తెలుగులో రిలీజ్ చేయడం వల్ల ‘క’ సినిమాకు ఆశించిన థియేటర్లు లభించలేదు. పైగా అమరన్ చిత్రాన్ని ప్రదర్శించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆసక్తికనబరిచాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి బలమైన నిర్మాణ సంస్థ లక్కీ భాస్కర్‌ను నిర్మించడంతో థియేటర్ల విషయంలో ఆ సినిమాకు పెద్దగా సమస్య ఏర్పడలేదు. కానీ ‘క’ చిత్రానికి మాత్రం తీవ్ర నష్టం ఎదురైంది. చిన్న సినిమా కావడం, పెద్ద స్టార్ హీరో లేకపోవడంతో ‘క’ సినిమాను ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముందుకు రాలేదు. దీనివల్ల తెలుగు స్టేట్స్‌లో కేవలం 147 థియేటర్లలోనే ‘క’ రిలీజ్ కావాల్సి వచ్చింది. ఒకవేళ ముందుగానే అమరన్, బఘీరా చిత్రాలను దీపావళికి రాకుండా అడ్డుకొని ఉంటే ‘క’ చిత్రానికి థియేటర్లు పుష్కలంగా లభించేవి. మంచి హిట్ టాక్ వచ్చినందున సులువుగానే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ఉండేది.
తెలుగు చిత్రాలను పట్టించుకోని ‘కోలీవుడ్’!
తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తారు. కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ, విక్రమ్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తెలుగు రాష్ట్రాల్లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించడంలో తెలుగు ఆడియన్స్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, మన చిత్రాల విషయానికి వచ్చే సరికి తమిళనాడులో ఆ స్థాయి ఆదరణ లేదు. తమిళ దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులకు తెలుగు చిత్రాలంటే కాస్త చిన్నచూపు. ‘క’ విషయంలో ఇది మరోమారు బయటపడింది. పాన్ ఇండియా రిలీజ్‌లో భాగంగా ‘క’ చిత్రాన్ని తమిళనాడులో రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ, తమిళ దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ‘క’ చిత్రాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. తమిళంలో దీపావళికి వస్తున్న సినిమాలకు ‘క’ అడ్డుతగులుతుందని భావించి ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రకటించారు. అదే తమిళనాడులో ‘క’ రిలీజై ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో పెరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లు దొరకని కారణంగా ‘క’ వారం రోజులు ఆలస్యంగా అక్కడ రిలీజ్ కాబోతోంది.
పట్టించుకోని మీడియా!
తమిళనాడుతో పాటు, తెలుగు స్టేట్స్‌లోనూ ‘క’ సినిమాకు అన్యాయం జరిగితే టాలీవుడ్ పెద్దలు, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కిరణ్ అబ్బవరం ఫెయిల్యూర్స్ గురించి పదే పదే ప్రస్తావించే తెలుగు ఫిల్మ్ సైట్స్, జర్నలిస్టులు, సోషల్ మీడియా.. భారీ విజయం సాధించినప్పటికీ జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. మీ సినిమాకు అంత బడ్జెట్ అవసరమా? తిరిగి రికవరీ చేయగలరన్న నమ్మకం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించే విలేఖరులు కలెక్షన్స్ దారుణంగా కోతకు గురవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. మంచి సినిమాను బతికించాల్సిన బాధ్యత ఎంటర్‌టైన్ మీడియాకు లేదా?. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో చిన్న సినిమాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ముఖ్యంగా పండగ సీజన్లలో చిన్న సినిమాను రిలీజ్ చేయాలంటే యంగ్ హీరోలు, డైరెక్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి తలెత్తవచ్చు.
మార్పు తప్పనిసరి!
బాలీవుడ్, కోలివుడ్, శాండిల్‌వుడ్, మల్లువుడ్, హాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా విడుదలైనా, అది ఎలాంటి సీజన్ అయినా వాళ్లకు థియేటర్లు ఇచ్చేస్తారు. అవసరమైతే పోటీగా నిలిచిన చిన్న చిత్రాలు సైడ్ అయ్యేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, దసరా, దీపావళి, సమ్మర్ లాంటి సీజన్లలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు చెక్ పెట్టాలి. ఓ వారం ఆలస్యంగా విడుదల చేయమనాలి. అప్పుడు తెలుగు సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతాయి. ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడం లేదు. తమిళనాట తమిళ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు వర్తింపజేయకూడదు. దీనిపై టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు ఆలోచన చేయాలి.
నవంబర్ 04 , 2024
OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
క
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్ - సుదీప్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
లక్కీ భాస్కర్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar). మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
సింగమ్ అగైన్
భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్ చిత్రం ‘సింగమ్ అగైన్’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్ దేవ్‌గన్ నటించాడు. నవంబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్‌సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అమరన్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్' (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
బఘీర
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం 'బఘీర' (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు
తంగలాన్
తమిళ నటుడు చియాన్ విక్రమ్ నటించిన రీసెంట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబర్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
అర్థమైందా అరుణ్‌కుమార్ 2
హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ 'అర్ధమయ్యిందా..? అరుణ్ కుమార్'. సీజన్ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో పవన్ సిద్దు మెయిన్ లీడ్‌గా నటించాడు.
TitleCategoryLanguagePlatformRelease DateTime Cut MovieEnglishNetflixOct 30Murder MindfullyMovieEnglishNetflixOct 31The Diplomat Season 2 SeriesEnglishNetflixOct 31Love Mocktail Season 2SeriesTeluguETV WinOct 31Wizards Beyond Waverly PlaceSeriesEnglishHotstarOct 30Lubber PandhuMovieTelugu DubHotstarOct 31Koshkinda KandamMovieTelugu DubNetflixNov 1Joker: Folie à DeuxMovieEnglishAmazon Oct 29AnjamaiMovieTamilAha Oct 31Somebody Somewhere S3SeriesHindiAmazon Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon Nov 7Mithya: The Dark ChapterSeriesTelugu, HindiZee 5Nov 1
అక్టోబర్ 28 , 2024
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ (Tollywood), కోలివుడ్ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్ ఇండస్ట్రీస్ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్ వార్స్ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ vs కోలీవుడ్
గతంలో ఫ్యాన్ వార్ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ చేసిన చిత్రాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.
https://twitter.com/iammvengence/status/1758435868799377642
https://twitter.com/RAO_Offl/status/1759121949656318267
నష్టం ఏంటంటే?
కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోల్స్ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్ ట్రోల్స్ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్ కంటే కలెక్షన్స్ పరంగా వెనకబడిపోతున్నాయి.
ఆ సినిమాలకు దెబ్బ!
త్వరలో రిలీజ్ అయ్యేందుకు సౌత్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోగా కోలీవుడ్ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్స్ రచ్చకు చెక్ పెట్టాల్సిందే!
సౌత్‌లో బిగ్ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్’, ‘రాయన్’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.
పొలిటికల్ టర్న్
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.
https://twitter.com/i/status/1841876236840374698
పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్
టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17 , 2024
Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్’ నుంచి అదిరిపోయే పోస్టర్స్!
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
శివరాత్రి స్పెషల్ సాంగ్
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శివరాత్రి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్. షూటింగ్ స్పాట్ ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.
https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016
తండేల్ స్టోరీ ఇదే
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.
చైతూ ఆశలన్నీ తండేల్ పైనే!
ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
సాయిపల్లవి ప్రాజెక్ట్స్
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.
సెప్టెంబర్ 30 , 2024
Sai Pallavi Record: సాయిపల్లవి సరికొత్త రికార్డు.. ఏకైక హీరోయిన్‌గా అరుదైన ఘనత!
మలయాళ బ్యూటీ సాయి పల్లవి (Actress Sai Pallavi) అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయిన్పపటికీ తనదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. బికినీ, ముద్దు సీన్లతో రెచ్చిపోతున్న ఈ కాలంలో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ నటన, డ్యాన్స్‌తోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (Filmfare Awards South 2023) ప్రకటించగా అందులో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది.
ఏకైక హీరోయిన్‌గా ‘సాయిపల్లవి’
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 2022, 2023 చిత్రాలను పరిగణలోకి తాజాగా 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో వచ్చిన 'గార్గీ' (Gargi) చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటి పురస్కారం లభించింది. అటు తెలుగులో చేసిన 'విరాట పర్వం' (Virataparvam) సినిమాకు సైతం క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ ఫీమేల్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లో ఒకే ఏడాదిలో అవార్డు దక్కించిన ఏకైక హీరోయిన్‌గా సాయిపల్లవి చరిత్ర సృష్టించింది. దీంతో సాయిపల్లవిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
తమిళ చిత్రం 'ప్రేమమ్' (Premam)తో సినీరంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి (Sai Pallavi) యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' (Fidaa) చేసి భానుమతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ 19 చిత్రాలు చేసిన సాయిపల్లవి ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకుంది. దక్షిణాదిలో ఇంత తక్కువ కాలంలో ఆ ఫీట్ సాధించిన హీరోయిన్‌గానూ సాయిపల్లవి నిలిచింది.
సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు
ప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్)
ప్రేమ చిత్రాలకు చిరునామా
‘ప్రేమమ్’ (Premam) తర్వాత నుంచి సాయిపల్లవి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకంగా, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు కూడా వార్తలు వచ్చాయి.
జూలై 13 , 2024
Vijay Deverakonda - Sai Pallavi: విజయ్ దేవరకొండతో సాయిపల్లవి రొమాన్స్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి.. తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవి.. రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
క్రేజీ లవ్‌స్టోరీ..
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇది నిజమైతే విజయ్ - సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
లవ్ స్టోరీలకు కేరాఫ్
తమిళంలో వచ్చిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రంతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న సాయిపల్లవి (Sai Pallavi).. ఆ తర్వాత నుంచి ఆచితూచి సినిమాలు చేసింది. స్కిన్ షోకు పూర్తి వ్యతిరేకమైన ఈ భామ.. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో హృదయాలకు హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించింది. ‘ప్రేమమ్’ సహా ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేశాయి. ఆ తర్వాత రానాతో చేసిన ‘విరాట పర్వం’ సినిమాలో చక్కటి నటన కనబరిచి సాయిపల్లవి నటిగా మరో మెట్టు పైకెక్కింది.
ఫుల్ స్వింగ్‌లో సాయిపల్లవి
ప్రస్తుతం సాయి పల్లవి.. సినిమాల పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి ‘తండేల్’ (Thandel) చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అటు తమిళంలో శివకార్తికేయన్ (Sivakarthikeyan)తో కలిసి ‘అమరన్’ (Amaran) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ రెండు భారీ ప్రాజెక్టులకు సాయిపల్లవి ఓకే చెప్పింది. ఇందులో ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న 'రామయణం' కూడా ఉంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మెుదలైంది.
పోలీసు ఆఫీసర్‌గా విజయ్
'ఫ్యామిలీ స్టార్' చిత్రం తర్వాత ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్‌లో 12వ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సీరియస్ పోలీసు ఆఫీసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటీవల అతడు నటించిన 'కృష్ణమ్మ' ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.
జూన్ 06 , 2024
Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్ అప్‌డేట్.. ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్‌లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్ (KGF) ఫేమ్ యష్ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్‌కు ‘దంగల్’ (Dangal) లాంటి బ్లాక్ బాస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్ అప్‌డేట్ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.
షూటింగ్ ప్రారంభం ఆ రోజే!
లేటెస్ట్ బజ్ ప్రకారం.. 'రామాయణం' చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్‌కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్.
ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం!
‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్కార్ విన్నింగ్ కంపెనీతో గ్రాఫిక్స్!
రామాయణం చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని డైరెక్టర్ నితేష్ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్స్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అమీర్‌ఖాన్ కొడుకుతో సినిమా
ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.
సాయిపల్లవి ఫూచర్ ప్రాజెక్ట్స్
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్‌గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో ‘అమరన్’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.
మార్చి 02 , 2024
Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్, ‘క’ చిత్రాల్లో దీపావళి విన్నర్ ఎవరంటే?
దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది.
లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections)
మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections)
ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
“క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections)
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
నవంబర్ 02 , 2024
Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే ఓ వీర సైనికుడి గాథ
చిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024
భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం.
కథ
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి.
ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి.
అలాగే కశ్మీర్‌లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి ఖాజీపత్రి ఆపరేషన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది.
సాంకేతికత
ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి.
బలాలు
బలమైన కథ
సెకాండాఫ్
బలమైన ఎమోషన్స్
శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ
బలహీనతలు
పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు
చిరవగా
మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది.
రేటింగ్: 4/5
నవంబర్ 01 , 2024
Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్ హ్యాట్రిక్ కొట్టినట్లేనా!
నటీనటులు: షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, దియా మిర్జా, సతీశ్ షా, అనిల్ గ్రోవర్ తదితరులు
దర్శకత్వం: రాజ్‌కుమార్ హిరాణీ
సంగీతం: అమన్ పంత్, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్, మనుశ్ నందన్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్
విడుదల తేదీ: 21-12-2023
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ - షారుక్‌ఖాన్ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్ హిట్స్ (పఠాన్, జవాన్)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశాల్ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి జవాన్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లండ్‌లోకి ప్రవేశించాలని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్ పాత్రలో షారుక్ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. నవ్విస్తూ, హృదయాలను బరువెక్కిస్తూ, సాహసోపేతమైన డంకీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని భాగం చేశారు. మన్ను, బుగ్గు, బల్లిల కుటుంబ నేపథ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్రయాణంలో వలసదారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. హార్డీ, మన్ను ప్రేమకథను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. పతాక సన్నివేశాల్లోనూ ఆ జంట మధ్య సాగే ప్రేమ నేపథ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరు కనబరిచాయి. ‘లుట్ పుట్ గయా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ మరోసారి తనదైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం
రేటింగ్ : 3/5
డిసెంబర్ 21 , 2023
Citadel Honey Bunny Review: ఇండియన్ స్పైగా అదరగొట్టిన సామ్.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ ధావన్, సమంత, కేకే మేనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్ తదితరులు
రచన: సీత.ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్ నిడిమోరు
సంగీతం : అమన్ పంత్
సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్
ఎడిటింగ్ : సుమిత్ కొటియన్
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : నవంబర్ 7, 2024
హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man), 'ఫర్జీ' (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్‌గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్ సిరీస్ ‘సిటాడెల్’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), గ్లామర్ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్) ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్ గ్యాంగ్ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review)
ఎవరెలా చేశారంటే
బన్నీ పాత్రలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తనమార్క్ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్ లిప్‌లాక్ సీన్స్ యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్ మెుత్తం వరుణ్, సామ్ స్క్రీన్ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్, సిమ్రన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్ అండ్ డీకే టీమ్ తమ మార్క్ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్‌గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్ గ్యాంగ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సమంత, వరుణ్‌ధావన్‌యాక్షన్ సీక్వెన్స్‌టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా?
నటీనటులు : గోపిచంద్, కావ్యా థాపర్, నరేష్, ముఖేష్ రిషి, జిషూ సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సునీల్, శ్యామ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వీ తదితరులు
దర్శకత్వం : శ్రీను వైట్ల
సంగీతం : చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : కె. వి. గుహన్
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి. విశ్వ ప్రసాద్
విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్ల, యాక్షన్ హీరో గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న (Viswam Movie Review) విడుదలైన ‘విశ్వం’ వారికి విజయాజాన్ని అందించిందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమె పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే గోపిరెడ్డి ఆ కుటుంబానికి పరిచయం కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇటలీలో కలిసిన సమైరా (కావ్య థాపర్)కు గోపిరెడ్డి ఎందుకు దూరమయ్యాడు? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నటుడు గోపిచంద్ ఎప్పటిలాగే తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని విశ్వంతో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే గత చిత్రాలతో పోలిస్తే గోపిచంద్ పాత్రలో పెద్దగా వైవిధ్యం లేదు. రొటీన్ పాత్రనే చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కావ్యా థాపర్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. అయితే గ్లామర్‌గా మాత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, రాహుల్ రామకృష్ణ పాత్రలు సినిమాలో బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్‌లో వారి పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఆనందం’, ‘సొంతం, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు తీసిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో కాస్త ట్రాక్ తప్పారు. అయితే తన బలాబలాలు గుర్తించి ‘విశ్వం’తో మళ్లీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఔట్‌డేటేడ్ స్టోరీని ఎంచుకోవడం మైనస్‌గా చెప్పవచ్చు. పంచ్‌లు, కామెడీ ట్రాక్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, పృథ్వీ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటలీ ట్రాక్‌లో కొత్త దనం కనిపించదు. విలన్ పాత్ర కూడా బలహీనంగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా విశ్వం పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం డీసెంట్‌గా అనిపిస్తుంది. రెండు, మూడు సాంగ్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కె.వి గుహన్ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. అమర్ రెడ్డి కుడుముల తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టే ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్‌గా కనిపించింది.
ప్లస్ పాయింట్స్
గోపిచంద్ నటనకామెడీ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఔట్‌డేటెడ్ స్టోరీ సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Hide N Seek Movie Review: సిటీలో భయభ్రాంతులకు గురిచేసే మిస్టరీ మర్డర్స్.. ‘హైడ్ అండ్ సీక్’ మెప్పించిందా?
నటీనటులు : విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవా, తేజస్విని నాయుడు, వైవా రాఘవ, సుమంత్ వెరేళ్ల తదితరులు
రచన, దర్శకత్వం : బాసిరెడ్డి రానా
సంగీతం : లిజో కె. జోస్
ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల
నిర్మాత : నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
విడుదల తేదీ: 20-09-2024
‘కేరింత’, ‘మనమంతా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విశ్వంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘హైడ్ ఎన్ సీక్’. సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 20) థియేటర్లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కర్నూల్ నేపథ్యంలో కథ సాగుతుంది. శివ (విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్దేవ్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సిటీలో ఒక డెలివరీ బాయ్‌ని ఒకతను ఏ కారణం లేకుండా రాడ్‌తో కొట్టి హత్య చేస్తాడు. అదే తరహాలో కారణం లేని హత్యలు, అర్థం కానీ నేరాలతో నగరం మొత్తం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ వరుస మర్డర్ మిస్టరీలను ఛేదించేందుకు పోలీసు ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్) రంగంలోకి దిగుతుంది. అయితే ఆ హత్యలకు సంబంధించి పోలీసులు కూడా కనిపెట్టలేని క్లూస్‌ను శివ కనిపెడుతుంటాడు. దీంతో తమకు సాయం చేస్తున్నప్పటికీ శివనే సైకో కిల్లర్ అని పోలీసులు భావిస్తారు. అసలు శివను ఈ హత్యల్లో ఇరికించింది ఎవరు? ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివ పాత్రలో యువ నటుడు విశ్వాంత్ చక్కటి నటన కనబరిచాడు. హావభావాలను చక్కగా ప్రదర్శించాడు. కన్నడ హీరోయిన్ శిల్పా మంజునాథ్ లుక్స్ వైజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సూట్ అయ్యింది. తెలుగు డైలాగ్స్ విషయంలో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడిన తీరు ప్రశంసనీయం. హీరోయిన్‌గా రియా సచ్ దేవా కొన్ని సీన్లకే పరిమితమైంది. నటుడు సాక్షి శివ తన వాయిస్‌లోని బేస్‌తో నెగిటివ్ క్యారెక్టర్‌కు మంచి వేల్యూ యాడ్ చేశాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు బసిరెడ్డి రానా ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు చాలా వరకూ సఫలీకృతమయ్యాడు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లేను ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా తెరపై ప్రెజెంట్ చేశారు. కథలో భాగంగా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ స్టోరీని చెప్పడం ఆకట్టుకుంది. అయితే ఈ మోడ్రన్ వార్ ఫేర్‌ను కర్నూల్ లాంటి చిన్న సిటీలో ఇరికించడం కన్విన్సింగ్‌గా అనిపించదు. గేమింగ్‌కు యువత ఏ విధంగా బానిస అవుతున్నారో అన్న పాయింట్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అక్కడక్కడ హ్యూమన్ ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు. ఓవరాల్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి ప్రతిభ కనబరిచాడు. లిజో కె. జోస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సస్పెన్స్ ఇంకాస్త బాగా ఎలివేట్ చేయడంలో బీజీఎం ఉపయోగపడింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వాంత్ నటనకథలో కొత్తదనంథ్రిల్లింగ్ అంశాలు
మైనస్ పాయింట్స్
బలహీనమైన డ్రామాస్పష్టత లేని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
సెప్టెంబర్ 20 , 2024
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ నటించిన ‘జిబ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్న సినిమా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి కుర్ర హీరోల్లో ఉత్సాహాన్ని నింపారు.
చిన్న చిత్రాలపై ప్రశంసలు..
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ (Sathya Dev) నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి అక్కడ చిరు ప్రస్తావించారు. సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ - తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'టిల్లు స్క్వేర్' సైతం విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు కూడా విజయాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ, కమెడియన్ సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. చిరు లాంటి బిగ్‌స్టార్ తమ సినిమాలను ప్రస్తావిస్తూ ప్రశంసించడంపై ఆయా చిత్ర బృందాలు సంతోషంలో మునిగాయి.
https://twitter.com/GulteOfficial/status/1856370891417932076
యంగ్ హీరోలకు భరోసా
తనను ప్రేరణగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ జనరేషన్ హీరోలకు మెగాస్టార్ చిరు అండగా నిలుస్తూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ హాజరయ్యారు. అంతేకాదు తన ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సత్యదేవ్‌ను విలన్‌గా సజెస్ట్ చేసి అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చారు. గతంలో ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన చిరు, యంగ్ హీరో సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. కలర్ ఫొటోలో సుహాస్ నటన బాగుందంటూ ప్రశంసించారు. చిరు మాటలకు సుహాస్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ‘శ్రీకారం’ మూవీ ప్రీరిలీజ్‌కు హాజరై యువ హీరో శర్వానంద్‌ను ఆశీర్వదించాడు. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రాళ్లు’ టీమ్ చిరు ఇంటికి వెళ్లగా అందులో లీడ్ రోల్ చేసిన యశ్వంత్‌ను అశీర్వచనాలు అందజేసాడు. ఫొటో దిగే క్రమంలో చిరుపై యశ్వంత్ చేయివేయగా ఆప్యాయంగా వేయించుకున్నారు. ఇలా అవకాశం దొరికనప్పుడల్లా కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ చిరు అండగా నిలుస్తున్నారు.
జపాన్ వెళ్లనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం 'విశ్వంభర' (Viswambhara) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీ కోసం చిరు జాపన్ వెళ్లనున్నారు. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌లో పాటలతో పాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 'విశ్వంభర' సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం చిరు వెనక్కి తగ్గారు.
ఈ ఏడాది మూడు విశిష్ట గౌరవాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 13 , 2024