• TFIDB EN
 • యానిమల్‌
  ATelugu3h 21m
  దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  YouSay Review

  Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?

  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బ...read more

  How was the movie?

  తారాగణం
  రణబీర్ కపూర్
  అర్జన్ వైలీ సింగ్
  అనిల్ కపూర్
  బల్బీర్ సింగ్
  బాబీ డియోల్
  అబ్రార్ హక్
  రష్మిక మందన్న
  గీతాంజలి సింగ్
  త్రిప్తి డిమ్రి
  జోయా
  పృథివీరాజ్
  అస్రార్ హక్
  శక్తి కపూర్
  మిశ్రా
  సురేష్ ఒబెరాయ్
  దాదాజీ
  ప్రేమ్ చోప్రా
  బడే దార్జీ
  సిబ్బంది
  సందీప్ రెడ్డి వంగ
  దర్శకుడు
  భూషణ్ కుమార్
  నిర్మాత
  క్రిషన్ కుమార్
  నిర్మాత
  మురాద్ ఖేతానినిర్మాత
  ప్రణయ్ రెడ్డి వంగనిర్మాత
  ప్రీతమ్ చక్రబర్తి
  సంగీతకారుడు
  విశాల్ మిశ్రా
  సంగీతకారుడు
  జాని
  సంగీతకారుడు
  సందీప్ రెడ్డి వంగ
  కథ
  అమిత్ రాయ్సినిమాటోగ్రాఫర్
  సందీప్ రెడ్డి వంగ
  ఎడిటర్ర్
  ఎడిటోరియల్ లిస్ట్
  కథనాలు
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  Animal Park Villain: ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా స్టార్‌ హీరో.. సందీప్‌ రెడ్డి వంగా లక్ష్యమదే!
  యానిమల్‌’ (Animal) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. యాక్షన్‌ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు ‘యానిమల్‌ పార్క్‌’(Animal Park) అనే టైటిల్‌తో ఈ సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.  విలన్‌గా స్టార్‌ హీరో! ‘యానిమల్‌ పార్క్‌’లో విలన్‌గా రణ్‌బీర్‌ను పోలిన వ్యక్తినే ఉంటాడని తొలి పార్ట్‌ క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చూపించారు. అయితే తాజా బజ్‌ ప్రకారం బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో.. అందులో ప్రతినాయకుడిగా కనిపిస్తాడని టాక్‌ వినిపిస్తోంది. షారుక్‌ ఖాన్‌ 'డంకీ' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన 'విక్కీ కౌశల్‌' (Vicky Kaushal).. యానిమల్‌ పార్క్‌లో మెయిన్‌ విలన్‌గా చేయనున్నట్లు రూమర్స్‌ మెుదలయ్యాయి. ఇదే నిజమైతే రణ్‌బీర్‌ వర్సెస్‌ విక్కీ కౌశల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. వీరిద్దరు ప్రత్యర్థులు అయితే తెరపై విధ్వంసమేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  ‘యానిమల్‌ పార్క్‌’ ఇప్పట్లో లేనట్లే! 'యానిమల్‌' సినిమా దెబ్బకు దేశంలోని టాప్‌ డైరెక్టర్ల జాబితాలోకి సందీప్‌ రెడ్డి వంగా చేరిపోయాడు. ప్రస్తుతం అతడు యానిమల్‌ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే సందీప్‌ తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై చాలా రోజుల నుంచి స్పష్టత లేదు. ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ఇప్పటికే సందీప్ ఇప్పటికే ప్రకటించగా.. మరోవైపు యానిమల్‌ పార్క్‌కు సంబంధించిన కథను కూడా అతడి టీమ్‌ సిద్ధం చేస్తోంది. దీంతో ఈ రెండు చిత్రాల్లో తొలుత ఏది పట్టాలెక్కుతుందోనన్న సందేహం సినీ వర్గాల్లో ఏర్పడింది. అయితే దీనిపై తాజాాగా సందీప్‌ క్లారిటీ ఇచ్చాడు. ఓ వేడుకలో పాల్గొన్న సందీప్‌.. యానిమల్‌ పార్క్‌ ఇప్పట్లో రాదని క్లారిటీ ఇచ్చేశాడు. ముందు ప్రభాస్‌ స్పిరిట్ చేయాలని దాని తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.  యానిమల్‌ సీక్వెల్ లక్ష్యమదే! గతంలో ‘యానిమల్‌’ సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యంగా చెప్పుకొచ్చాడు. ‘యానిమల్‌ పార్క్‌లో ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది. ‘యానిమల్‌’ చిత్రం ప్రేక్షకుల్లో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన అత్యంత సాహసోపేతమైన.. అసాధారణమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది’’ అన్నారు.  ‘విక్కీ కౌశల్‌’ ఎవరో తెలుసా? యానిమల్‌ పార్క్‌లో విక్కీ కౌశల్‌ విలన్‌గా చేస్తారన్న వార్తలతో సోషల్‌ మీడియాలో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. విక్కీ గురించి తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, బాలీవుడ్‌లో అతడు స్టార్‌ హీరో. ప్రముఖ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif)కు స్వయాన భర్త. 2019లో వచ్చిన ‘ఉరి’ (Uri: The Surgical Strike) సినిమా ముందు వరకూ చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన విక్కీ ఆ సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. రీసెంట్‌గా షారుక్‌ ఖాన్‌ ‘డంకీ’ చిత్రంలో సుఖి పాత్రలో అదరగొట్టాడు.
  ఫిబ్రవరి 29 , 2024
  Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
  Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
  బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది.  మ్యూజిక్‌ రికార్డు ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది.  హైలేట్‌ సంగీతం యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే 'ఎవరెవరో' సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే 'నాన్న నువ్వు నా ప్రాణం'.. క్లైమాక్స్‌తో వచ్చే 'యాలో యాలో' పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు. బీజీఎంతో గూస్‌బంప్స్‌ అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. లాభాలే లాభాలు.! డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.    
  ఫిబ్రవరి 12 , 2024
  Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
  Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
  ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.  నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.  https://twitter.com/i/status/1751124216349638941
  జనవరి 27 , 2024
  Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
  Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
  నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా  విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023   రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో  హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.  హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.  ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
  డిసెంబర్ 01 , 2023
  Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
  Pushpa 2 Latest Song: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌పై ఊహించని ట్విస్ట్‌.. తెరపైకి ‘యానిమల్‌’ బ్యూటీ!
  అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌' కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ వాటిని రెట్టింపు చేసింది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది విన్న ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  తృప్తి దిమ్రితో ఐటెం సాంగ్‌! బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులో నటించిన బాలీవుడ్‌ నటి తృప్తి దిమ్రీ.. తన గ్లామర్‌తో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ‘పుష్ప 2’లో ఈ భామ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.  ప్రోమోలో ఏముందంటే? సెకండ్‌ సాంగ్‌ ప్రోమోలో పూర్తిగా హీరోయిన్‌ రష్మిక మందన్ననే కనిపించింది. సాంగ్‌ సెట్‌లో రష్మిక మేకప్‌ వేసుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో కేశవ వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారంటగా కదా ఆ పాటేందో చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు రష్మిక ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ పాట పాడుతుంది. మీరు కూడా ఈ ప్రోమోను ఓసారి చూసేయండి.  https://www.youtube.com/watch?v=sbp9M95-2rQ&t=19sv పూర్తి సాంగ్‌ ఎప్పుడంటే? పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు. ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్ అంటూ వివరించారు. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ పాట కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఆ రోజున ఫ్యాన్స్‌కు పండగే భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. 
  మే 23 , 2024
  Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
  Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌!
  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది.  ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో నెట్టింట వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1750390548165472508 ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది.  డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix  బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు.  యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో 'యానిమల్‌' (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు.  ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.  హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.  డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని 'కబీర్‌ సింగ్‌' (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..  రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/animal-movie-review-ranbir-looks-fierce-in-action-scenes-how-is-animal.html
  జనవరి 25 , 2024
  Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
  Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
  బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌ (Animal). బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ రిలీజవ్వగా ఇందులో ర‌ణ్‌బీర్‌ క‌పూర్‌ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) లిప్‌లాక్‌ల‌తో అద‌ర‌గొట్టారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట‌లో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు. https://twitter.com/ilysmnojk/status/1712018933333778570?s=20 డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సాంగ్‌ను ముద్దుతో ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. చూడండి ఏం చేశాడో’ అని రణ్‌బీర్‌పై రష్మిక ఫ్యామిలీ ఫైర్‌ అవుతుంటారు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని రణ్‌బీర్‌, రష్మిక.. కుటుంబ సభ్యుల ముందే లిప్‌లాక్‌ చేసుకోవడం షాక్‌కి గురిచేస్తుంది.  ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక, ర‌ణ్‌బీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు. ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లుగా చూపించి పాట‌ను ఎండ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌లో ర‌ణ్‌భీర్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. రష్మికకు ఇది హిందీలో మూడో చిత్రం. అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్ బై (Good Bye), సిద్దార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్నూ’ (Mission Majnu) చిత్రాలు చేసినప్పటికీ గ్లామర్‌ షో చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. తాజాగా రణ్‌బీర్‌ సినిమాలో మాత్రం ఈ భామ రెచ్చిపోయినట్లే కనిపిస్తోంది. రష్మికకు లిప్‌లాక్‌ సీన్‌ కొత్తేమి కాదు. గతంలో విజయ్‌ దేవరకొండతో చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనూ ఈ భామ ముద్దు సీన్‌లో నటించింది. తాజాగా యానిమల్‌ చిత్రంలో ఇలా లిప్‌లాక్‌ సీన్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌కు గట్టి సందేశాన్ని రష్మిక ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎటువంటి సాహసాలకైనా రెడీ అనే మెసేజ్‌ను ఈ భామ పంపింది.   అటు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తన మార్క్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించాడు. గతంలో అర్జున్‌ రెడ్డి మూవీ పోస్టర్‌ను సందీప్‌ లిప్‌లాక్‌తోనే రిలీజ్‌ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. తాజాగా యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌ పోస్టర్‌ను సైతం ఘాటైన ముద్దుతో చూపించడం సందీప్‌ వంగాకే చెల్లింది.    ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ సీన్లను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రష్మిక, అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. డియర్‌ కామ్రేడ్‌ సినిమా నుంచే వీరి ప్రేమాయణం ప్రారంభమైందని సోషల్‌ మీడియాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఫ్యాన్స్‌ రష్మికపై మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌పై ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. లిరిక్స్‌, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయని పేర్కొంటున్నారు. పాట చూస్తుంటే యానిమ‌ల్ మూవీ అర్జున్‌రెడ్డికి మ‌రో వెర్ష‌న్‌లా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా అంటూ మ‌రో నెటిజ‌న్ ప్రశ్నించాడు.  యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషించారు. 
  అక్టోబర్ 11 , 2023
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  Spirit Heroine: ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌.. 16 ఏళ్ల ఎదురుచూపులకు తెర!
  ‘అర్జున్‌రెడ్డి’తో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) కూడా జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై అందరి దృష్టి పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా తీయబోతున్నట్లు గతంలోనే సందీప్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో షూట్‌ ప్రారంభానికి ముందే వీరి కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.  ప్రభాస్‌ సరసన స్టార్ హీరోయిన్‌! ప్రభాస్‌ - సందీప్‌ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్న.. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇటీవల నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) ప్రభాస్ పక్కన చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లో హీరోయిన్‌ ఎవరన్న విషయం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఫిల్మ్‌ సైట్‌ IMDB.. ‘స్పిరిట్‌’ మూవీ క్యాస్ట్ విభాగంలో త్రిషను హీరోయిన్‌గా చేర్చింది. స్పిరిట్‌లో ఆమె పాత్ర పేరును ‘గీత’ పేర్కొంది. అలాగే సీనియర్‌ నటుడు అనంత నాగ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు IMDB తన సైట్‌లో పేర్కొంది. దీంతో త్రిష ఎంపిక కన్ఫార్మ్‌ అయి ఉండవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  గతంలోనే స్టార్‌ జోడీగా గుర్తింపు! ప్రభాస్‌ - త్రిష జంటగా నటించడం ‘స్పిరిట్‌’తోనే తొలిసారి కాదు. వారి కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2004లో వచ్చిన ‘వర్షం’ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభాస్‌ - త్రిష మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా కుదరడంతో మెస్మరైజింగ్‌ జోడీగా వారు గుర్తింపు పొందారు. ఆ తర్వాత పౌర్ణమి (2006), బుజ్జిగాడు (2008) సినిమాలోనూ ఈ జంట కలిసి నటించింది. బుజ్జిగాడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా.. పౌర్ణమి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ హ్యాట్రిక్‌ సినిమాల జోడి తిరిగి తెరపై కనిపించనుందని వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.  అర్జున్‌ రెడ్డి, యానిమల్‌కు భిన్నంగా..! దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయనున్నట్లు ‘స్పిరిట్‌’ (Spirit) సినిమాకు సంబంధించిన ప్లాట్‌లో IMDB పేర్కొంది. అయితే దీన్ని చిత్ర యూనిట్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పడం విశేషం.  ‘స్పిరిట్‌’ నిర్మాత ఏమన్నారంటే? స్పిరిట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ నిర్మించనున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించి ఆయన కీలక అప్‌డేట్స్‌ ఇచ్చారు. స్పిరిట్‌ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన అన్నారు. ఇందులో ప్రభాస్‌ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి లాఠీ ఝుళిపిస్తారని పేర్కొన్నారు. ‘అలాగే ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’ అని భూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఈ వార్త విన్నప్పటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.  భారీ ఆఫర్లతో దూసుకెళ్తున్న త్రిష! గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక టాలీవుడ్‌కు దూరమైన నటి త్రిష.. తిరిగి గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ భామ ముగ్గురు స్టార్‌ హీరోల సరసన నటించబోతోంది! ఇప్పటికే చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్‌ చేశారు. అటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్‌ 4’ మూవీలో వెంకటేష్‌ సరసన త్రిష పేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. తాజాగా ప్రభాస్‌ సరసన ‘స్పిరిట్‌’లో త్రిష ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తుండటం ఆమె ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతోంది. 
  ఫిబ్రవరి 27 , 2024
  Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
  Tamannaah Bhatia: ఎద పొంగుల అందంతో రచ్చ రేపుతున్న మిల్కీ బ్యూటీ!
  మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిగుతైన అవుట్‌ఫిట్‌లో యద అందాలను ఆరబోసింది. ముంబయిలో జరిగిన యానిమల్‌ సక్సెస్‌ పార్టీలో పాల్గొన్న తమన్నా.. తాజా లుక్‌తో అక్కడి వారిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.  View this post on Instagram A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus) మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.  https://twitter.com/Zoom_News_India/status/1743860862207803778?s=20 గతేడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.  అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు.  View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.  ఇప్పటికే 11th అవర్,  నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది. ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో అర్జిస్తోంది. మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ఎప్పటికప్పుడు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. 
  జనవరి 08 , 2024
  <strong>Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!</strong>
  Spirit Movie: ఒక్క కామెంట్‌తో ‘స్పిరిట్‌’పై అంచనాలు పెంచేసిన సందీప్‌ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సందీప్‌ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’ డేరింగ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్‌ ఒక్కరే ఫిక్స్‌ కాగా ఇతర నటీనటులను ఫైనల్‌ చేసే పనిలో సందీప్‌ ఉన్నారు. అయితే స్పిరిట్‌ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్‌ తాజాగా ఒక హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ‘కొందరు యానిమల్‌ నా బెస్ట్ వర్క్‌ అంటున్నారు. నా బెస్ట్ వర్క్‌ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్‌ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సందీప్‌ తీసిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలకంటే 'స్పిరిట్‌' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్‌ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops) విలన్‌గా కొరియన్‌ సూపర్‌ స్టార్? ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్‌ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్​తో డాంగ్ సూ (Ma Dong-seok) వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కొరియాలో అతడు చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం ఓటీటీ వేదికగా భారతీయ భాషల్లో డబ్‌ కూడా అవుతున్నాయి. దీంతో భారత్‌లోనూ అతడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ప్రభాస్‌ విలన్‌గా డాంగ్ సూ గనుక నటిస్తే స్పిరిట్‌ ప్రాజెక్ట్ గ్లోబల్‌ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పారు. అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
  జూలై 17 , 2024
  Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
  Anchor Rashmi: వ్యభిచారంపై యాంకర్‌ రష్మి సంచలన పోస్టు.. షాకవుతున్న నెటిజన్లు!
  తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఫీమేల్ యాంకర్లలో రష్మి (Rashmi) ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రష్మీ.. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. ఓవైపు బుల్లితెర, మరోవైపు వెండితెరను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తన కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకుంటోంది. యానిమల్‌ లవర్‌ అయిన రష్మి.. సోషల్‌ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారం, సెక్స్‌కు సంబంధించి ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ఘాటు కొటేషన్‌..! యాంకర్‌ రష్మి.. ఓ వైపు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలు, జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తిక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌ రాసిన ఈ కొటేషన్‌ను రష్మి పంచుకుంది. ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన ప్రస్తావన ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కొటేషన్‌లో 'మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఆహారం ఇవ్వడం అంతేకానీ డిక్‌ కాదు’ అని రాసి ఉంది.&nbsp; కొటేషన్‌కు మూలం ఇదే ప్రముఖ రచయిత రచల్‌ మోరన్‌.. ఈ కొటేషన్‌ను ఓ వేశ్య నుంచి తీసుకున్నారు. ఆమె చెప్పిన వ్యాఖ్యలంటూ దానిని కొటేషన్‌ రూపంలో పేర్కొన్నారు. రష్మి పెట్టిన ఈ పోస్టును అంతర్లీనంగా పరిశీలిస్తే పెద్ద అర్థమే అందులో దాగుంది. ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం ఉండదు.. దాని మనుగడ అసలే ఉండదు’ అన‌్నది రష్మిక పోస్టు వెనుక దాగున్న ఉద్దేశం. అయితే రష్మిక లేటెస్ట్ పోస్టు చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వ్యభిచారానికి సంబంధించి పోస్టు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రష్మి ఫ్యాన్స్‌ మాత్రం ఆమె పనిని సమర్థిస్తున్నారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. దేశంలో బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై గతంలో రష్మిక ఇలాగే ఘాటుగానే స్పందించింది. సె** పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రతి ఒక్కరికి మినిమం సె** ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ అప్పట్లో సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొందరు రష్మి మాటలను సమర్ధిస్తే.. మరికొందరు విమర్శించారు.&nbsp; రష్మి సినిమా కెరీర్‌.. హోలీ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మీ గౌతమ్‌.. థ్యాంక్స్‌, కరెంట్‌, ఎవరైనా ఎప్పుడైనా, వెల్‌ డన్‌ అబ్బా, బిందాస్‌, చలాకి, ప్రస్తానం తదితర చిత్రాల్లో నటించింది. ‘జబర్దస్త్‌’లో యాంకర్‌గా చేరినప్పటి నుంచి ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మి చేసింది. ఆ తర్వాత లీడ్‌ రోల్స్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది చిరంజీవి 'భోళాశంకర్‌' సినిమాలోనూ యాంకర్‌ రష్మి మెరిసింది.&nbsp;
  మే 01 , 2024
  Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
  Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
  టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఓ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలంతా దాదాపు తమ చిత్రాల్లో సిగరేట్లతో దర్శనమిస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఉద్దేశ్యంతో డైరెక్టర్లు కూడా స్మోకింగ్‌ వైపు హీరో పాత్రలను ప్రోత్సహిస్తున్నారు. సిగరేట్‌ పీకను నోట్లో పెట్టించి స్టైల్‌గా హీరోల చేత దమ్ము లాగిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌ సైతం తమ హీరోను మాస్‌ లుక్‌లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే సిగరేట్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవచ్చని కొన్ని సినిమాలలోని సీన్లు నిరూపించాయి. వాటిలో హీరోలు నోట్లో సిగరేట్‌తో చాలా కూల్‌గా కనిపిస్తారు. అటువంటి క్రేజీ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌ చాలా క్రేజీగా ఉంటుంది. లాంగ్‌ హెయిర్‌ &amp; గడ్డం, ముఖాన బ్లాక్‌ కళ్లద్దాలు.. నోట్లో సిగరేట్‌తో ఓ అమ్మాయి వద్దకు వెళ్లే సీన్‌ అదిరిపోతుంది.&nbsp; https://youtu.be/fguH-dGjfVs?si=lOjPlRybnmb-RZkp యానిమల్‌ (Animal) యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం పదే పదే సిగరేట్లు తాగుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా సూట్‌లో లాంగ్‌ హెయిర్‌తో రణ్‌బీర్‌ సిగరేట్‌ తాగుతూ నడవడం ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. అలాగే నోట్లో సిగరేట్‌తో రణ్‌బీర్‌ ఎంట్రీ సీన్‌ చాలా క్లాసిక్‌గా అనిపిస్తుంది. https://youtu.be/jeQYEIQ6eHw?si=9frMB1-0RO0Wx8p4 సలార్‌ (Salaar) సినిమాల్లో ప్రభాస్‌ (Prabhas) చాలా రేర్‌గా స్మోక్‌ చేస్తూ కనిపిస్తాడు. కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘సలార్‌’లో మాత్రం డార్లింగ్‌.. సిగరేట్‌ తాగుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రౌడీలను చితకబాదిన ప్రభాస్ ఆ తర్వాత కూల్‌గా సిగరేట్‌ తాగడం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1734970904613126484 రెబల్‌ (Rebel) రెబల్‌ సినిమాలో ప్రభాస్‌ సిగరేట్‌ తాగే స్టైల్‌ చాాలా యునిక్‌గా ఉంటుంది. ఓ సీన్‌లో విలన్లు అటాక్‌ చేయడానికి రాగా.. ప్రభాస్‌ ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా స్టైల్‌గా సిగరేట్‌ తాగుతూ ముందుకు వెళ్తాడు.&nbsp; https://youtu.be/LUWy8Kv-SuU?si=EpInRjYM0ukrR-1u గుంటూరు కారం (Guntur Kaaram) గుంటూరు కారం చిత్రంలో మహేష్‌ బాబు (Mahesh Babu) ఎంట్రీ సీన్‌ అదరహో అనిపిస్తుంది. నోట్లో బీడితో కారు నుంచి మహేష్‌ దిగే ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల చేత విజిల్‌ వేయిస్తుంది.&nbsp; https://youtu.be/DAa3crqj5-c?si=0IXCK7j_-kwXYdNv ఒక్కడు (Okkadu) ఒక్కడు సినిమాలో మహేష్‌ బాబు (Mahesh Babu)&nbsp; స్మోకింగ్‌ స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మహేష్‌ సిగరేట్‌ వెలుగించుకొని దాన్ని ఆస్వాదించిన తీరు అద్భుతంగా మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/cPDWfvdj0ug?si=MU_TQkIlEWb9nnuf పుష్ప (Pushpa) పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ బీడీ తాగే యాటిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మంగళం శ్రీను (సునీల్‌) అగ్గిపెట్టే అవసరం అవుతుంది. సరిగ్గా అప్పుడే పుష్ప చాలా స్టైల్‌గా అగ్గిపుల్లను కాల్చి తన బీడీని వెలుగించుకుంటాడు. ఆ తర్వాత కొంత మంగళం శ్రీనుకు కొంత దూరంలో కాలుతున్న అగ్గిపుల్లను పెట్టగా అతడు వంగి సిగరేట్‌ వెలుగించుకునే సీన్‌ హైలెట్‌ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/31woB__nwHU?si=yMBs9-OdpbLRTIBr అంతపురం (Anthahpuram) ఈ సినిమాలో హీరో జగపతి బాబు (Jagapathi Babu)కు సిగరేట్‌ అంటే అమితమైన ఇష్టం. క్లైమాక్స్‌లో ఒంటి నిండా గాయాలతో రైలు పట్టాల పక్కన కదలలేని స్థితిలో కూర్చుండిపోతాడు. అప్పుడు సిగరేట్‌ తాగుతూ అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెవర్‌ బీఫోర్ అన్నట్లు అనిపిస్తాయి. https://youtu.be/TqU-51z0ct4?si=_T7lNiqeWgM5YSlL రక్త చరిత్ర (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో ఓ సీన్‌లో వివేక్‌ ఓబరాయ్‌ రౌడీలందర్నీ ఇంటికి పిలిపిస్తాడు. తన ఏరియాలో ఇకపై ఎవరూ నేరాలు చేయడానికి వీల్లేదని సిగరేట్‌ తాగుతూ చాలా ప్రశాంతంగా వార్నింగ్‌ ఇస్తాడు. ఈ సీన్‌ సినిమాకే హైలేట్‌.&nbsp; https://youtu.be/Qw7fa7583_0?si=QJXZqptCp4jeYOPm వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్‌ సీన్ మెప్పిస్తుంది. సుమో నుంచి సిగర్‌ తాగుతూ బాలయ్య బయటకు వచ్చే ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/YUAhLONLVs8?si=hFjdcNcUWR_lw2jP ‘వి’ (V) హీరో నాని (Nani) ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ది బెస్ట్‌ ఎంట్రీ సీన్‌ ఈ సినిమాలోనే లభించిందని చెప్పవచ్చు. నోటి నుంచి వచ్చే సిగరేట్‌ పొగతో నాని ఇచ్చే క్లాసిక్‌ ఎంట్రీ వాహ్వా అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/hNgs0iFDhik?si=P8rZK2EtBXNk6-Ym కొదమ సింహం (Kodama Simham) ఈ సినిమాలో మెగాస్టార్‌.. కౌబాయ్‌ డ్రెస్‌లో సిగర్‌ తాగుతూ చాలా సీన్లలో కనిపిస్తాడు. ముఖ్యంగా ఓ క్లబ్‌లో సిగర్‌ తాగుతూ కూల్‌గా పేకాట ఆడే సీన్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/ldmg-QK0bYM?si=ZNdkNWLUjlMPRQhx
  మార్చి 01 , 2024
  Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
  Sandeep Reddy Vanga: బాలీవుడ్‌లో తెలుగోడి సత్తా.. ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ రెడ్డి వంగా!
  సంచలనాలకు మారుపేరుగా మారిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) జాతీయ స్థాయిలో మరోమారు సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF) - 2024 అవార్డు కైవసం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచాడు. మంగళవారం రాత్రి ముంబయిలో జరిగిన ఈ అవార్డు వేడుకల్లో ఉత్తమ దర్శకుడు విభాగంలో సందీప్‌ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాడు. ‘యానిమల్‌’ (Animal) చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. అటు ‘జవాన్’ మూవీలో డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టిన షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా అవార్డు గెలుపొందాడు. ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకుంది. నెట్టింట సందీప్‌ మేనియా ప్రతిష్టాత్మక DPIFF అవార్డు అందుకోవడంతో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా పేరు నెట్టింట మారుమోగుతోంది. #SandeepReddyVanga హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రధానంగా దాదా సాహేబ్‌ అవార్డు అందుకుంటున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పలువురు ప్రముఖులు, సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1760151102740464016 https://twitter.com/i/status/1760137348128358646 ‘నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా’ సందీప్‌ రెడ్డి వంగాకు తనపైన తనకు నమ్మకం ఎక్కువ. ఆ విశ్వాసం వల్లే యూనిక్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయగల్గుతున్నారు. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే సందీప్‌లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాపై అప్పట్లో మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ఓ న్యూస్ ఛానెల్‌ ప్రతినిధి సందీప్‌ వద్ద లేవనెత్తగా.. అందుకు సందీప్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏంటో కింద వీడియోలో చూడండి. https://twitter.com/i/status/1758682406754861236 సందీప్‌ ఫేవరేట్‌ స్టార్లు వారే! సందీప్‌ రెడ్డి వంగా.. ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడంపై మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. గతంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఉద్దేశించి సందీప్‌ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో తాను చిరు, పవన్‌లకు పెద్ద ఫ్యాన్ అని సందీప్‌ చెబుతాడు. తన గురించి కొంత సమాచారం తెలిసిన వారికైనా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంటాడు. చిరంజీవి ఫ్యాన్స్‌ అందరికీ కాంపీటిషన్‌ పెడితే తాను ఫస్ట్‌ వస్తానని ఓ అవార్డు వేడుకలో సైతం సందీప్‌ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.&nbsp;&nbsp; https://twitter.com/i/status/1757377128511778830 ఓ వైపు విమర్శలు.. మరోవైపు అవార్డులు గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. రూ.900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ ఈ సినిమా దుమ్ము రేపింది. ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. థియేటర్లలోనే కాదు తర్వాత ఓటీటీలోనూ యానిమల్ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన ఇండియన్ సినిమాగా యానిమల్‌ నిలవడం విశేషం. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా అదే స్థాయిలో అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం విశేషం.&nbsp; సందీప్‌పై హీరోయిన్‌ సెటైర్! డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు దాదా సాహేబ్ అవార్డు రావడంతో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 'మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం 'యానిమల్స్' మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం పూనం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌ రెడ్డి ఫ్యాన్స్‌ పూనం పోస్టును తప్పుబడుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన సందీప్ రెడ్డి వంగా ఎదుగుదలను ఆపలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; మిగతా అవార్డులు.. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే.. ఉత్తమ విలన్ అవార్డు కూడా యానిమల్ చిత్రానికే వరించడం విశేషం. విలన్ పాత్రలో ఉత్తమ నటుడిగా బాబీ డియోల్ (ANIMAL) అవార్డు అందుకున్నారు. అటు క్రిటిక్స్‌ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్‌ (సామ్‌ బహదూర్‌), ఉత్తమ గీత రచయితగా జావేద్‌ అక్తర్‌ (నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (మేల్)గా వరుణ్‌ జైన్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (ఫీమేల్)గా శిల్పా రావు ఎంపికయ్యారు. ఇక ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ అవార్డు ఏసుదాసుకి, ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అవార్డ్ మౌషుమీ ఛటర్జీలకు దక్కాయి. టీవీ విభాగంలో.. అటు టెలివిజన్‌ విభాగంలో దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుల విషయానిసి వస్తే.. టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌‌గా ‘ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌’ నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌), ఉత్తమ నటిగా రూపాలీ గంగూలీ (అనుపమ) అవార్డులు అందుకున్నారు. ఇక వెబ్‌సిరీస్‌ విభాగంలో క్రిటిక్స్‌ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా (స్కూప్‌) నిలిచారు.
  ఫిబ్రవరి 21 , 2024
  69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
  69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్‌ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
  బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్‌ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్‌.. ఫిల్మ్‌ఫేర్‌ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్‌ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.&nbsp; బాలీవుడ్‌లో ‘యానిమల్‌’ తుఫాన్‌! డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్‌ మూవీ ‘యానిమల్‌’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్‌ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. అదరగొట్టిన ‘12th ఫెయిల్‌’ ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్‌’ (12th Fail) చిత్రం కూడా యానిమల్‌ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్‌ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. బెస్ట్‌ యాక్టర్స్‌గా భార్య భర్తలు ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగంలో విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌), ఉత్తమ నటి (క్రిటిక్స్‌) రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.&nbsp; 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌ ఉత్తమ దర్శకుడు: &nbsp;విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌) ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ) ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే) ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌&nbsp; ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌) ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌) ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2) ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  జనవరి 29 , 2024
  Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
  Akira Nandan: మెగా లెగసీకి అకిరానే భవిష్యత్ ఆశాకిరణం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ!
  పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రేణూ దేశాయ్‌ (Renu Desai) కొడుకు అకిరా నందన్‌ (Akira Nandan) గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా యానిమల్‌ (Animal) సినిమాలోని ఓ పాటకు పియానో వాయించిన వీడియో మరోమారు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1747251367033577947 పవన్ కొడుకు పియానో వాయించిన ఈ వీడియోను ఉపాసన (Upasana) షేర్‌ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదు.. కానీ, అకీరా జస్ట్ సూపర్’ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా యానిమల్‌(Animal)లోని 'నాన్న నువ్వు నా ప్రాణం అనినా...' అనే పాటకు అకిరా పియానా వాయించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. తండ్రి ప్రేమకోసం తపన పడే కొడుకుకి సంబంధించిన పాటను అకిరా ఎంచుకోవడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. తన తండ్రిని అకిరా ఎంతగా మిస్‌ అవుతున్నాడో అకిరా ఈ ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పాడని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అకిరా నందన్‌ (Akira Nandan)కు సంబంధించిన లేటెస్ట్‌ పిక్స్‌ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అతడి లుక్‌ వింటేజ్‌ పవన్‌ను (Pawan Kalyan) గుర్తు చేసేలా ఉండటంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.&nbsp; ఇదిలా ఉంటే అకీరా నందన్‌కు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. అకిరా లేటెస్ట్‌ ఫొటోలను చూసిన ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తర్వాత మెగా లెగసీకి అసలైన వారసుడు అకీరానే అవుతాడని అంటున్నారు.&nbsp; రామ్ చరణ్ ఎరా (Era) అయ్యాక మెగా లెగసీ బాధ్యత అంతా అకిరా నందన్ మీదే ఉంటుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకసారి అకిరా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అతడి కటౌట్‌కు రికార్డులన్నీ పరారవుతాయని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; అకిరా నందన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్‌. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్‌ బాల్‌ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్‌ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్‌ టాలెంట్‌ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్‌ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది.
  జనవరి 23 , 2024
  Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
  Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
  ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
  జనవరి 17 , 2024
  Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
  Biggest Telugu Hit Movies 2023: ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపిన తెలుగు చిత్రాలు ఇవే!
  గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్లు కలెక్షన్లు కష్టమంటూ అవహేళనలు ఎదుర్కొన్న టాలీవుడ్ వెయ్యి కోట్ల మార్క్‌ను సైతం అవలీలగా చేరుకుని ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఒక్కో ఏడాది ఒక్కో మార్క్‌ను దాటుకుంటూ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. అందులో టాప్-10 చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్‌’, క్రిస్మస్‌ కానుకగా విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.393 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి గణనీయమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లతో సలార్‌ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.&nbsp; యానిమల్‌ (Animal) అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకూ రూ.869 కోట్లను వసూలు చేసింది.&nbsp; వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల్లో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.219 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క తెలుగులోనే రూ.159.68 నెట్ వసూళ్లను సాధించింది.&nbsp; ఆదిపురుష్ (Adipurush) ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లను వసూలు చేసింది.&nbsp; ఒక్క తెలుగు భాషలోనే రూ.133.28 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత అనేక వివాదాలను మూటగట్టుకుంది.&nbsp; వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.130కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.97.64 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp; భగవంత్‌ కేసరి (Bhagavanth Kesari) అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'భగవంత్‌ కేసరి'. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.114.5 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.84.78 కోట్లు రాబట్టింది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించింది. బ్రో (Bro) పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'బ్రో'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.114 కోట్లు రాబట్టింది. ఒక్క తెలుగు భాషలోనే రూ.82.68 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఈ చిత్రంలోని నటుడు పృథ్వీ పాత్ర ఏపీలో రాజకీయ వివాదానికి కారణమైంది.&nbsp; దసర (Dasara) నాని హీరోగా నటించిన ‘దసరా’ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.118.5 వసూళ్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం తెలుగులో రూ.75.81 వసూళ్లను రాబట్టింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల మార్క్‌ దాటిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బేబీ (Baby) చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ'.. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. యూత్‌ను విపరీతంగా ఆకర్షించి వరల్డ్‌వైడ్‌గా రూ.81.05 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 64.12 కోట్లు వసూలు చేయడం విశేషం.&nbsp;
  డిసెంబర్ 27 , 2023
  Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
  Tollywood Roundup 2023: గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
  టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వారిలో ఎంత మంది సక్సెస్‌ అవుతారో చెప్పలేం. అందం, అభినయం, నటన వంటివి మాత్రమే వారిని హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్‌ అంటే చెప్పటం కష్టమే. అయితే 2023 ఏడాదిలో గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌ జాబితా బయటకొచ్చింది. అందులోని హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; రష్మిక మందన్న గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తెలుగు హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ నటించిన యానిమల్‌ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక పేరు మారుమోగింది. అంతకుముందు ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ‌అయ్యాయి. దీంతో రష్మిక గురించి ఎక్కువ మంది నెట్టింట శోధించారు. మృణాల్‌ ఠాకూర్‌ ‘సీతారామం’ మూవీతో మృణాల్‌ ఠాకూర్‌ స్టార్‌ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో సెల్ఫీ సినిమాలో నటించింది. అలాగే గుమ్రా, లస్ట్‌ స్టోరీస్‌-2, పిప్పా వంటి చిత్రాల్లో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా మోస్ట్‌ సెర్చ్‌డ్‌ హీరోయిన్ల జాబితాలో ఆమె రెండోస్థానంలో నిలిచింది.&nbsp; శ్రీలీల ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరికంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్‌గా శ్రీలీల నిలిచింది. ఈ సంవత్సరం ఆమె నటించిన నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్కంద, భగవంత్‌ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ చిత్రాల ద్వారా ఈ భామ ప్రేక్షకులను పలకరించింది. మరో నాలుగు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ఆమె పేరు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేయబడింది.&nbsp; తమన్న భాటియా మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో ఆమె ప్రేమాయణం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. లస్ట్‌ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌లో వీరిద్దరు స్క్రీన్ షేర్‌ చేసుకోవడంతో పాటు ఒకరిపైఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వాటికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. సమంత ఈ ఏడాది సమంత గురించి కూడా చాలా మందే శోధించారు. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో సమంత పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే సామ్ రీసెంట్‌ మూవీ ‘ఖుషి’ హిట్‌ కావడంతో ఆమె పాపులారిటి మరింత పెరిగింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలను పెడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తుండటంతో ఎక్కువ మంది సమంత పేరును సెర్చ్‌ చేశారు.&nbsp; అనుష్క శెట్టి అనుష్క శెట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదే వెండితెరపై తళ్లుక్కుమంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సినిమా షూట్ మెుదలైనప్పటి నుంచి రిలీజ్‌ అయ్యేవరకూ ఏదోక రూపంలో ఆమె వార్తల్లో నిలుస్తూనే వచ్చారు.&nbsp; కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్‌.. ఈ ఏడాది స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. బాలయ్య సరసన ఆమె చేసిన ‘భగవంత్‌ కేసరి’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కాజల్‌ చేసిన ఘోస్ట్‌, కరుంగపియం వంటి చిత్రాలు కూడా ఈ ఏడాదే వచ్చాయి.&nbsp; కీర్తి సురేష్‌ ఈ ఏడాది దసరా సినిమా ద్వారా కీర్తి సురేష్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది. వెన్నెల పాత్రలో అద్భుత నటన కనబరిచి అందర్ని ఆశ్చర్యపరిచింది. పాన్‌ ఇండియా స్థాయిలో దసరా రిలీజ్‌ కావడంతో కీర్తి సురేష్‌ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో కీర్తి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది నెటిజన్లు శోధించారు.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. ఈ ఏడాది తెలుగులో ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు. కానీ ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫోటోలు కారణంగా రకుల్‌ తరుచూ ట్రెండింగ్‌లో నిలుస్తూ వచ్చారు.&nbsp; కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి వరుసగా సినిమా అవకాశాలను దక్కించుంది. ఈ భామ గురించి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్‌ చేశారట. ఈ ఏడాది నాగ చైతన్య సరసన ఆమె చేసిన ‘కస్టడీ’ మూవీ ఫ్లాప్ టాక్‌ తెచ్చుకుంది.&nbsp;
  డిసెంబర్ 14 , 2023
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.&nbsp; అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.&nbsp; విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna&nbsp;MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside&nbsp;MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
  డిసెంబర్ 11 , 2023
  <strong>Prabhas New Movie: ప్రభాస్‌ నెక్స్ట్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. ‘స్పిరిట్‌’ ప్లేస్‌లో మరో చిత్రం!</strong>
  Prabhas New Movie: ప్రభాస్‌ నెక్స్ట్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. ‘స్పిరిట్‌’ ప్లేస్‌లో మరో చిత్రం!
  ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్‌ మరో స్థాయికి వెళ్లింది. దీంతో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రభాస్‌ ఇప్పటికే డైరెక్టర్‌ మారుతీతో ‘రాజా సాబ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి’ సీక్వెల్‌లోనూ ప్రభాస్‌ నటించాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్‌ తర్వాతి చిత్రం కోసం స్టార్‌ డైరెక్టర్లు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యూలో ఉన్నారు. వీరిద్దరిలో ముందుగా సందీప్‌ రెడ్డి సినిమాను ప్రభాస్‌ సెట్స్‌పైకి తీసుకెళ్తారని అంతా భావించారు. అయితే వీటిని కాదని ప్రభాస్‌ మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ డైరెక్టర్‌కే ప్రిఫరెన్స్‌! 'కల్కి 2898 ఏడీ' తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటిస్తారని ఫ్యాన్స్‌ సహా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా సందీప్‌ ప్లేస్‌లోకి డైరెక్టర్‌ హను రాఘవపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్‌ గతంలోనే ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. ఆ సినిమా టైటిల్‌ను 'ఫౌజి'గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్‌ 'ఫౌజి'కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీంతో అక్టోబర్‌లో షూటింగ్‌ మెుదలు పెట్టేందుకు డైరెక్టర్‌ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.&nbsp; జవాన్‌గా ప్రభాస్‌! ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రానున్న ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్‌ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించే అవకాశముంది. ఇక ఫౌజీ అంటే జవాన్‌ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్‌డేట్స్‌ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ‘రాజా సాబ్‌’ టీమ్ బిగ్‌ ప్లాన్‌! ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతీ కాంబోలో 'రాజా సాబ్‌' (Raja Saab) తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇందులో ఒకప్పటి సూపర్ హిట్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేయాలని డైరెక్టర్‌ మారుతీ భావిస్తున్నారట. అయితే అది తెలుగు పాట కాదని సమాచారం. 1980లో హిందీలో వచ్చిన ఓ సూపర్‌ హిట్‌ పాటను రీమిక్స్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు టాక్‌. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ 'ఓ కైకే పాన్‌ బనారస్‌ వాలా' పాటను రీమేక్‌ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’ డేరింగ్ డాషింగ్‌ డైరెక్టర్‌ పేరు తెచ్చుకున్న సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్‌ ఒక్కరే ఫిక్స్‌ కాగా ఇతర నటీనటులను ఫైనల్‌ చేసే పనిలో సందీప్‌ ఉన్నారు. అయితే స్పిరిట్‌ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్‌ తాజాగా ఒక హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. ‘కొందరు యానిమల్‌ నా బెస్ట్ వర్క్‌ అంటున్నారు. నా బెస్ట్ వర్క్‌ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్‌ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. సందీప్‌ తీసిన ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలకంటే 'స్పిరిట్‌' అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్‌ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; పవర్‌ఫుల్ పోలీసుగా ప్రభాస్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్‌ రెడ్డి (Arjun Reddy), యానిమల్‌ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్‌ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్‌ చెప్పారు. అత‌డి క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్‌తో పాటు మేన‌రిజ‌మ్స్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
  జూలై 18 , 2024

  @2021 KTree