ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్SunNextఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
రాజశేఖర్
జీవిత రాజశేఖర్
జీవితరామి రెడ్డి
ఎంఎస్ రెడ్డి
బాబూ మోహన్
ప్రసాదబాబు
సిబ్బంది
కోడి రామకృష్ణ
దర్శకుడుశ్యామ్ ప్రసాద్ రెడ్డి
నిర్మాతసత్యం
సంగీతకారుడుకథనాలు
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్‌గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
Chiranjeevi Remake Movies: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమెక్ చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 50 రీమేక్ చిత్రాల్లో నటించి, తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ రీమేక్ చిత్రాలు చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల ప్రాధాన్యతను సుదీర్ఘంగా చూస్తే, అందులో కొన్ని డిజాస్టర్ అయ్యినా, కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.
[toc]
భోళా శంకర్
ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళంకు రీమేక్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించారు.
గాడ్ ఫాదర్
చిరంజీవి మలయాళ సూపర్‌హిట్ "లూసిఫర్" రీమేక్‌లో నటించారు. తెలుగులో "గాడ్ ఫాదర్" టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2022లో దసరా కానుకగా విడుదలైంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ నటించిన "లూసిఫర్" సూపర్ హిట్ కాగా, "గాడ్ ఫాదర్" తెలుగులో మోస్తరు విజయాన్ని సాధించింది.
ఖైదీ నంబర్ 150
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇది తమిళ సూపర్‌హిట్ "కత్తి"కు రీమేక్‌గా రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
అంజి
చిరంజీవి నటించిన "అంజి" సినిమా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ మూవీ "ఇండియానా జోన్స్" ప్రేరణతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది.
శంకర్ దాదా జిందాబాద్
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన "శంకర్ దాదా జిందాబాద్" హిందీ సూపర్‌హిట్ "లగే రహో మున్నాభాయ్" రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
శంకర్ దాదా M.B.B.S
"మున్నాభాయ్ MBBS" హిందీ చిత్రానికి రీమేక్‌గా "శంకర్ దాదా MBBS" రూపొందింది. చిరంజీవి నటనతో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
ఠాగూర్
తమిళం "రమణ"కి రీమేక్‌గా వచ్చిన "ఠాగూర్" చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు.
మృగరాజు
హాలీవుడ్ మూవీ "ది హోస్ట్ అండ్ ది డార్క్‌నెస్" ప్రేరణతో రూపొందిన "మృగరాజు" గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
స్నేహం కోసం
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన "స్నేహం కోసం" తమిళ సినిమా "నట్పుక్కగ" రీమేక్. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
హిట్లర్
మలయాళంలో మమ్ముట్టి నటించిన "హిట్లర్" రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. చిరంజీవి నటనతో ఈ సినిమా ఆయన అభిమానులను అలరించింది.
ముగ్గురు మొనగాళ్లు
కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "ముగ్గురు మొనగాళ్లు" హిందీ "యాదోంకి బారాత్" చిత్రానికి రీమేక్. ఈ సినిమా చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అయినప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు.
మెకానిక్ అల్లుడు
"శ్రీరంగనీతులు" అనే సినిమా ప్రేరణతో రూపొందిన "మెకానిక్ అల్లుడు" సినిమా సరైన విజయాన్ని సాధించలేకపోయింది. చిరంజీవి నటనకు మంచి మార్కులు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆజ్ కా గూండా రాజ్
"గ్యాంగ్ లీడర్" హిందీ రీమేక్‌గా రూపొందిన "ఆజ్ కా గూండా రాజ్" హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచింది.
ఘరానా మొగుడు
"అనురాగ అరాలితు" కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన "ఘరానా మొగుడు" చిరంజీవికి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.
పసివాడి ప్రాణం
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పుంతెన్నెల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘పసివాడి ప్రాణం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
చక్రవర్తి
రవిరాజా పినిశెట్టి దర్శకత్వలో తెరకెక్కిన ‘చక్రవర్తి’ సినిమా తమిళంలో శివాజీ గణేషణ్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
ఆరాధన
భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరాధన’ మూవీ.. తమిళంలో భారతీరాజా డైరెక్షన్‌లో సత్యరాజ్ హీరోగా నటించిన ‘కవితోరా కవితైగల్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
దొంగ మొగుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ మొగుడు’ సినిమా హాలీవుడ్ మూవీ ‘ట్రాడింగ్ ప్లేసెస్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ‘దొంగ మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లుకు ఇదే కాన్సెప్ట్‌తో ‘రౌడీ అల్లుడు’సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
వేట
ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట’ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిష్టో’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ సినిమా.. హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన ‘అర్ధ్ సత్య’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాజా విక్రమార్క
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన ‘మై డియర్ మార్తాండన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రతిబంధ్
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ‘ప్రతిబంధ్’ . ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
త్రినేత్రుడు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘త్రినేత్రుడు’ సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘జల్వా’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన ‘త్రినేత్రుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
ఖైదీ నంబర్ 786
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 786’ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘అమ్మన్ కోవిల్ కిళావలే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అడవి దొంగ
చిరంజీవి హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’ సినిమా హాలీవుడ్‌తో పాటు హిందీలో తెరకెక్కిన ‘టార్జాన్’ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు ‘చిరంజీవి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ‘నానే రాజ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
నాగు
తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగు’ సినిమా.. హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన ‘తీస్రి మంజిల్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది.
ఇంటిగుట్టు
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఇంటిగుట్టు’ సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన ‘పనక్కర కుటుంబం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
దేవాంతకుడు
దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన ‘గెలుపు నన్నదే’ పినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది.
హీరో
విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమా హాలీవుడ్ సినిమా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు.
‘ఖైదీ’
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ‘ఫస్ట్ బ్లడ్’ సినిమా ప్రేరణ తీసుకొని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది.
అభిలాష
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ మూవీని హాలీవుడ్ మూవీ ‘ది మ్యాన్ హు డేర్‌డ్’తో పాటు ‘బియైండ్ ఏ రీజనబుల్ డౌట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ప్రేమ పిచ్చోళ్లు
ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన ‘షౌకిన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.
బంధాలు అనుబంధాలు
‘బంధాలు అనుబంధాలు’ సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన ‘అవళ హెజ్జే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
మంచు పల్లకీ
వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంచు పల్లకీ’ మూవీ తమిళంలో సుహాసిన ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
యమ కింకరుడు
యమ కింకరుడు ’ సినిమా హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’ తో పాటు ‘మ్యాడ్ మాక్స్’ మూవీలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.
పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన 'పట్ణణక్కే బంధ పత్‌నియారు' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
చట్టానికి కళ్లులేవు
చిరంజీవి హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'చట్టానికి కళ్లులేవు' సినిమా.. తమిళంలో విజయకాంత్ హీరోగా ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'సట్టమ్ ఓరు ఇరుత్తారాయ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.
47 రోజులు
కే.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన '47 రోజులు' సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో రూపొందించారు. తమిళంలో '47 నాట్కల్' పేరుతో రూపొందితే, తెలుగులో '47 రోజులు' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాతో చిరంజీవి తమిళ ఇండస్ట్రీలో తన తొలి అడుగులు వేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మొగుడు కావాలి
చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు కావాలి' సినిమా.. హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మంచలి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా సాయి ధరమ్ తేజ్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే సినిమాను చేశారు.
మోసగాడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించిన 'మోసగాడు' సినిమా.. హిందీలో రాజ్‌కపూర్, శతృఘ్న సిన్హా నటించిన 'ఖాన్ దోస్త్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
ప్రేమ తరంగాలు
'ప్రేమ తరంగాలు' సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన 'ముఖద్దర్ కా సికందర్' సినిమాకు రీమేక్. తెలుగులో బిగ్‌బీ పాత్రలో కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
పున్నమి నాగు
'పున్నమి నాగు' సినిమా కన్నడలో హిట్టైన 'హున్నిమేయ రాత్రియల్లి' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
ఇది కథ కాదు
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలతో రూపొందిన 'ఇది కథ కాదు' సినిమా.. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, రవికుమార్ ప్రధాన పాత్రలతో రూపొందిన 'అవర్‌గళ్' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
మనవూరి పాండవులు
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన 'మనవూరి పాండవులు' సినిమా.. కన్నడలో 'పాడువారళ్లి పాండవరు' సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
సెప్టెంబర్ 25 , 2024
Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ పవర్‌ఫుల్ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బాహుబలి (Baahubali)
బాహుబలిలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా చేశాడు.
https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN
శివ (Siva)
హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ తెంపే సీన్ ఇప్పటికీ చాలా ఫేమస్.
https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g
ఆర్ఆర్‌ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్‌చరణ్(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.
https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&v=Y8rREdo1LqU&feature=youtu.be
సలార్ (Salaar)
ఇందులో హీరో ప్రభాస్ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ దుమ్మురేపాడు.
https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID
యానిమల్ (Animal)
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్ రీవెంజ్ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.
https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit
సింహాద్రి (Simhadri)
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్ విజిల్స్ వేయిస్తాయి.
https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS
విక్రమార్కుడు (Vikramarkudu)
స్టార్ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్ మాత్రం నెవర్ బీఫోర్ అన్నట్లుగా ఉంటుంది.
https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY
కర్తవ్యం (Karthavyam)
టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti) చేసిన రోల్ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.
https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg
అంకుశం (Ankusam)
హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.
https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మెగాస్టార్ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.
https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
టాలీవుడ్‌లోని క్లాసిక్ హీరోగా ‘రామ్ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్ తొలిసారి సిక్స్ ప్యాక్ చేయడం విశేషం.
https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a
పోకిరి (Pokiri)
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.
https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
మార్చి 28 , 2024
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు.
‘నా అనుమతి తీసుకోలేదు’
సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.
View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)
'అన్యాయంగా నాపై నిందలు'
జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు.
ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు.
https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611
తారా స్థాయికి గొడవలు!
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు
1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
The Elephant Whisperers: ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు.. భరతభూమికి అంకితం ఇచ్చిన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్
ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ భారతీయ సినిమాకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందిన తొలి డాక్యుమెంటరీ లఘు చిత్రం ఇదే కావడం విశేషం. 95వ ఆస్కార్ మహోత్సవంలో ఇతర భాషల లఘుచిత్రాలతో పోటీ పడి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.
భరతభూమికి అంకితం..
95వ ఆస్కార్ వేడుకలకు హాజరైన డైరెక్టర్ కార్తికి గొన్సాల్వేస్ వేదికపై అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును జన్మభూమి భారత్‌కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రబృందానికి, కుటుంబానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్తికి గొన్సాల్వేస్ తల్లి ప్రిసిల్లా గొన్సాల్వేస్ ఈ సినిమాకు కథను అందించారు.
వీటితో పోటీ..
హాలౌట్(Haulout), హౌ డు యు మెజర్ ఎ ఇయర్(How Do You Measure a Year?), ద మార్తా మిచెల్ ఎఫెక్ట్(The Martha Mitchell Effect), స్ట్రేంజర్ ఎట్ ద గేట్(Stranger at the Gate) చిత్రాలతో పోటీ పడి ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ లఘు చిత్రం 2022 డిసెంబర్ 8న విడుదలైంది.
కథేంటి..?
ఏనుగు, ఓ కుటుంబం మధ్య ఏర్పడే అనుబంధం గురించి ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ వివరిస్తుంది. బొమ్మన్, బెల్లి దంపతులు ‘రఘు’ అనే అనాథ ఏనుగును చిన్నప్పుడే దత్తత తీసుకుని అపురూపంగా పెంచుకుంటారు. గాయపడిన ‘రఘు’కు ఎన్నో సపర్యలు చేసి పెంచుకునే క్రమంలో బంధుత్వం ఏర్పడుతుంది. ఈ షార్ట్‌ఫిలిం ప్రేక్షకులకు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అదే సమయంలో గిరిజనుల జీవన విధానం, పచ్చని అడవి అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ కార్తికి.
షార్ట్ ఫిలిం వెనక ఎంతో శ్రమ
షార్ట్ ఫిలిం అయినప్పటికీ ఈ లఘుచిత్రాన్ని తీయడానికి డైరెక్టర్ కార్తికి అండ్ టీం ఎంతో శ్రమ పడ్డారు. ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కార్తికి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మూడు నెలలు వయసు ఉన్నప్పుడే పిల్ల ఏనుగు ‘రఘు’ను కలిసినట్లు కార్తికి చెప్పారు. ఏడాదిన్నర పాటు ఈ ఏనుగుతో గడిపారట. తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కొలువై ఉన్న ‘ముదుమలై నేషనల్ పార్క్’లో ఈ సినిమాను చిత్రీకరించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
39 నిమిషాల నిడివితో కూడిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ కింద ఈ సినిమా తెరకెక్కింది. గునీత్ మొంగా ప్రొడ్యూస్ చేశారు.
మూడో చిత్రం..
భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న మూడో సినిమా ఇది. గతంలో రెండు లఘు చిత్రాలు ఆస్కార్‌కు పోటీపడ్డాయి. 1969లో ద హౌజ్ దట్ ఆనంద బిల్ట్(The House That Ananda Built), 1979లో యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్(An Encounter With Faces) నామినేషన్లు దక్కించుకున్నాయి. కానీ, అవార్డును పొందలేకపోయాయి. ద ఎలిఫెంట్ విస్పరర్స్ ఈ లోటును తీర్చింది.
మార్చి 13 , 2023
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంట్రవర్సీలు
]రష్మిక మందన్నా కావాలానే చేస్తుందని కొంతమంది అంటుంటే, తను సాధారణంగా మాట్లాడిన వాటిని కాంట్రవర్సీ చేస్తున్నారని కొందరు మద్దతు ఇస్తున్నారు.కావాలానే చేస్తుందా?
ఫిబ్రవరి 13 , 2023
జూ.NTR గురించి మీకు తెలియని టాప్ 20 విషయాలు
]పలు అంతర్జాతీయ మీడియా కథనాలు ఆస్కార్ - ఉత్తమ నటుడు అవార్డు పొందే అవకాశం ఎన్టీఆర్‌కు ఉందని తెలిపాయి. Jr.NTR ఆస్కార్ అవార్డు పొంది భారత చలన చిత్ర ప్రతిష్టను మరింత విస్తరించాలని YouSay కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.Jr.NTRకు ఆస్కార్ వస్తుందా?
ఫిబ్రవరి 13 , 2023
Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!
ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
[toc]
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
అక్టోబర్ 22 , 2024
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) టాలీవుడ్‌ను టార్గెట్ చేశారంటూ విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
‘అనుమతి లేకున్నా వచ్చారు’
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటన జరిగిన తీరు, హీరో నిర్లక్ష్య ధోరణి గురించి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ రెండో తారీఖున అప్లికేషన్ పెట్టుకుంటే మూడో తారీఖు పోలీసులు తిరస్కరించారు. నాలుగో తారీఖున ఎవరూ థియేటర్‌కి రావొద్దు మేము పర్మిషన్ ఇవ్వము అని పోలీసులు తిరస్కరించినా హీరో రాత్రి 9.30కి థియేటర్‌కు వచ్చారు’ అని రేవంత్ తెలిపారు.
https://twitter.com/Aale_Baale/status/1870403630509277346
‘సైలెంట్‌గా వెళ్లలేదు’
అల్లు అర్జున్ అనుమతి లేకుండా రావడమే కాకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి భారీ జన సమీకరణకు కారణమయ్యాడని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘బన్నీ సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత జరిగేది కాదేమో. క్రాస్ రోడ్ చౌరస్తా ముందు నుంచే కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి హాయ్ చెప్తూ వెళ్లారు. దీనివల్ల చుట్టుపక్కల థియేటర్ల ఆడియన్స్ బన్నీని చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. దీంతో రోడ్లపై వేలాది మంది పోగయ్యారు. దీంతో అక్కడ ఒక విధమైన రద్దీ వాతావరణం ఏర్పడింది’ అని రేవంత్ అన్నారు.
‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’
ర్యాలీగా బన్నీ రావడంతో అతడితో పాటే థియేటర్‌లోకి ఫ్యాన్స్ బలంగా తోసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతని ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసలాట జరిగిందని సీఎం తెలిపారు. చివరికి అక్కడ ఉన్న జనాలను పోలీసులు చెల్లాచెదురు చేయడంతో అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడి కనిపించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకేసారి అంతమంది తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగి ఆమె (రేవతి) చనిపోయిందని అసెంబ్లీలో స్పష్టం చేశారు.
‘బిడ్డను రక్షించేందుకు రేవతి యత్నించింది’
తొక్కిసలాట సమయంలో బిడ్డను కాపాడుకునేందుకు తల్లిగా రేవతి ఎంతో ప్రయత్నించిందని సీఎం రేవంత్ తెలిపారు. సొమ్మసిల్లిపడిపోయినా కూడా బిడ్డ చేతిని మాత్రం గట్టిగానే పట్టుకొని ఉండిపోయిందని అన్నారు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని, బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడని సీఎం అన్నారు. అటు థియేటర్లో కూడా హీరోని కలవాలని తొక్కిసలాట జరిగినట్టు తెలిసిందని రేవంత్ చెప్పారు.
https://twitter.com/CoreenaSuares2/status/1864377538631328021
‘వెళ్లమని చెప్పినా వినలేదు’
తొక్కిసలాట అనంతరం హీరోను వెళ్లిపోమని పోలీసులు సూచించారని కానీ ఆయన వినలేదని సీఎం రేవంత్ తెలిపారు. సినిమా చూసే వెళ్తానని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. ‘హీరో థియేటర్‌లో ఉండగా బాల్కనీలో కూడా అభిమానులు నిల్చొని ఒకరిపై ఒకరు పడే పరిస్థితి ఏర్పడింది. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో హీరోను వెళ్లిపోమని చెప్పడానికి వెళ్తే ఏసీపి కూడా రావొద్దని థియేటర్ వాళ్లు చెప్పారు. అందరిపై కేసులు నమోదు చేస్తానని హెచ్చరిస్తే అప్పుడు లోపలికి అనుమతించారు’ అని రేవంత్ చెప్పారు.
‘రిటర్న్‌లోనూ చేతులు ఊపుకుంటూ వెళ్లాడు’
అల్లు అర్జున్ వద్దకు ఏసీపీ వెళ్లి బయట పరిస్థితిని వివరించిన ఆయన పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘బయట ఒకరు చనిపోయారని ఏసీపీ హీరోకి చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుంటే బయట ఉన్న చాలా మందిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు వెళ్ళిపోవాలి అంటే లేదు సినిమా చూసి వెళ్తా అని ఆ హీరో చెప్పినట్టు నాకు సిటీ కమిషనర్ చెప్పడం జరిగింది. దాంతో పై అధికారి రంగంలోకి దిగి హీరోకి చెప్పి ఇక్కడ్నుంచి మీరు వెళ్ళాలి అని అతన్ని తీసుకెళ్లి బండి ఎక్కిస్తే మళ్ళీ అతను సైలెంట్ గా వెళ్లకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ అభిమానులను చూసుకుంటూ రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కొంతమంది థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్లి హీరోని మీరు A11 అని చెప్తే అతను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు ఆ తర్వాత అరెస్ట్ చేసారు’ అని సీఎం అన్నారు.
https://twitter.com/M9News_/status/1870405933672911317
‘అతడి కాలు, చేతులు పోయాయా’
జైలు నుంచి విడుదలయ్యాక సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టడం పైనా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ సినీ ప్రముఖులు.. ఒక్క రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఇంటికెళ్లి ప్రభుత్వాన్ని తిడుతండ్రు. నన్ను తిడుతుండ్రు. అతడ్ని పరామర్శిస్తుండ్రు. ఏమైంది అధ్యక్ష.. అతడి కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా. అతడ్ని (బన్నీ) ఇంతమంది సినీ ప్రముఖులు పలకరించారు గానీ, ఆస్పత్రిల్లో ఉన్న పిల్లాడ్ని (శ్రీతేజ్) కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాలేదు' అని అన్నారు.
https://twitter.com/M9News_/status/1870407972058447983
ఇక పై నో బెనిఫిట్ షోస్
సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఇకపై ఊరుకోనని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకు సీఎం కూర్చీలో కూర్చున్నన్ని రోజులు అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే మైక్ అందుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 'తెలంగాణలో ఇకపై బెన్ ఫీట్ షోలు, టికెట్ల రేట్ల పెంపును రద్దు చేస్తున్నాం' అని ప్రకటించారు. బన్నీపై చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి MIM నేత అక్బరుద్ధీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం.
https://twitter.com/Trends4TDP/status/1870406612038598805
డిసెంబర్ 21 , 2024
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..
డైరెక్టర్ : మల్లీ అంకం
సినిమాటోగ్రాఫర్ : సూర్య
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 3 మే, 2024
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
గణపతి పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్ ఎక్స్‌ప్రెషన్స్, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రాజ్ సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
I Saw The Devil: ఓటీటీలో ఔట్ స్టాండింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే!
ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్ కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్, థ్రిల్లర్, మర్డర్స్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఆ సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆ మూవీ ఏదంటే?
ఓటీటీలో తప్పకచూడాల్సిన కొరియన్ చిత్రాల్లో ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil) ముందు వరుసలో ఉంటుంది. 2010లో కొరియాలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లీ బైంగ్-హమ్ (Lee Byung-Hun) కథానాయకుడిగా, చోయ్ మైనా-సిక్ (Choi Myna-Sik) ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) దర్శకత్వం వహించారు. 2 గం. 22 ని.ల నిడివితో డార్క్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ రివేంజ్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
పెద్దలకు మాత్రమే!
ఒక సైకో కిల్లర్ మనస్తత్వం ఎలా ఉంటుందో దర్శకుడు కిమ్ జీ-వూన్ ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టాడు. పగలు సాధారణ మనుషుల్లాగే ఉంటూ రాత్రి అయితే ఎంత వైలెంట్‌గా మారతారో ఇందులో చూపించారు. ఆడవారిని కిల్లర్ హత్య చేయడాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించాడు దర్శకుడు. శరీర భాగాలను కట్ చేసి అందులో ఆనందాన్ని వెతుక్కోవడం వీక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. అటువంటి కిల్లర్ చేతిలో తనకు ప్రాణానికి ప్రాణమైన యువతి మరణిస్తే ఆ హీరో రియాక్షన్ ఇంకెంత వైలెంట్‌గా మారుతుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే ఇందులో బోల్డ్ కంటెంట్, క్రైమ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
కథేంటి?
ఓ సీరియల్ కిల్లర్ పగలు స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ రాత్రిళ్లు ఒంటరిగా కనిపించే ఆడ వారిని కిడ్నాప్ చేస్తుంటాడు. వారిని వివస్త్రలను చేసిన విచక్షణారహితంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో ఓ NIS (The National Intelligence Service) ఏజెంట్ భార్య ఒంటరిగా కారులో వెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. కిల్లర్ గమనించి ఆమెపై దాడి చేస్తాడు. ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఈ ఘటనతో బాగా డిస్టర్బ్ అయిన హీరో.. విలన్ ఆచూకీ తెలుసుకుని అతడ్ని పట్టుకుంటాడు. అయితే చంపకుండా చిత్రహింసలు పెట్టి వదిలేస్తాడు. కిల్లర్ కడుపులో జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. అతడు ఎక్కడకు వెళ్తే అక్కడికి వెళ్లి నరకం చూపిస్తుంటాడు. తన బాడీలో జీపీఎస్ ఉందని గ్రహించిన కిల్లర్.. దాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కిల్లర్ ఆచూకీని హీరో కనిపెట్టాడా? లేదా? అన్నది కథ.
Telugu.yousay.tv Rating : 3/5
ఏప్రిల్ 27 , 2024
NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. హృతిక్ రోషన్‌తో తలపడనున్న తారక్..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ సహా పాన్ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.
అధికారిక ప్రకటన
తరణ్ ఆదర్స్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ‘అయాన్ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.
ముందే తెలుసా?
బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్ కపూర్, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.
బిజీబిజీగా జూ.NTR
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్ పూర్తైన వెంటనే వార్-2 సినిమాపై ఎన్టీఆర్ ఫోకస్ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
అతి పెద్ద సంస్థ
వార్-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ సంస్థకు భారీ బడ్జెట్ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన పఠాన్ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి చేసిన ‘వార్’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్ వర్సస్ పఠాన్’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 05 , 2023
Deepika padukone Bday Special: డిప్రెషన్ నుంచి ప్రపంచ వేదికకు ప్రయాణం
]తెలుగులో మరికొందరి పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో అవకాశం వస్తే వదులుకోనంటుంది.తెలుగు హీరోలంటే ఇష్టం
ఫిబ్రవరి 13 , 2023
Pushpa 2: ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఈ యాడ్స్ గమనించారా? ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది దీనిని గమనించకపోవచ్చు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
సాంగ్స్‌లో యాడ్స్..
‘పుష్ప 2’ చిత్రంతో పాటు అందులోని టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ పాటలో బన్నీ తన మ్యానరిజంతో మెస్మరైజ్ చేశాడు. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సాంగ్‌లో మనం గమనించాల్సిన అంశం మరోటి కూడా ఉంది. దర్శకుడు సుకుమార్ పాట మధ్యలో వచ్చే సీన్స్‌లో పలు బ్రాండెడ్ కంపెనీలను ప్రమోట్ చేశారు. ఓ లారిపై జేకే టైర్స్, కజారియా (Kajaria Ceramics), షాప్ డోర్స్‌పై కల్యాణ్ జ్యూయలర్స్, అంబూజ సిమెంట్స్, టాటా చక్రా గోల్డ్ (బన్నీ తాగే టీ గ్లాస్‌పై) వంటి కంపెనీ పేర్లు దర్శనమిచ్చాయి. అలాగే ‘పీలింగ్స్’ పాటలో ‘అస్ట్రాల్’ అనే ప్రముఖ పైపుల కంపెనీ పేరు ఓ సీన్‌లో కనిపించింది. దీంతో సుకుమార్ సాంగ్స్‌ను అడ్వర్‌టైజ్‌మెంట్స్ కోసం కూడా ఉపయోగించుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.
డబ్బుల కోసమేనా!
సాధారణంగా ఒక పాటలో ఇలా కంపెనీ బ్రాండ్స్‌ను దర్శక నిర్మాతలు ఉపయోగించారు. ఓపెన్ ప్లేస్‌లో సాంగ్ షూట్ చేసే క్రమంలో ఒరిజినల్ పేర్లకు బదులుగా వాడుకలో లేని పేర్లను వినియోగిస్తుంటారు. ఉచిత ప్రమోషన్స్ ఇవ్వడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో మేకర్స్ ఇలా చేస్తుంటారు. మరి ‘పుష్ప 2’ వంటి నేషనల్ వైడ్ బజ్ ఉన్న సినిమాలో ఇలా పలు కంపెనీ బ్రాండ్ల పేర్లు కనిపించడం ఆసక్తి రేపుతోంది. అయితే సుకుమార్ కావాలనే వాటిని పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలా పెట్టడం ద్వారా ఆయా కంపెనీల నుంచి మేకర్స్ కొంత మెుత్తంలో వసూలు చేసి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
కొత్త ట్రెండ్ షురూ!
‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ప్రముఖ కంపెనీల ప్రొడక్ట్స్‌ను ఇలా ప్రమోట్ చేయడం ద్వారా దర్శకుడు సుకుమార్ కొత్త ట్రెండ్‌ను సృష్టించారని చెప్పవచ్చు. కొత్త వ్యాపార అవకాశాన్ని టాలీవుడ్ మేకర్స్‌కు ఆయన అందించారు. ఇకపై ఇలా పబ్లిక్ సాంగ్స్ చేసేటప్పుడు ప్రముఖ బ్రాండ్లకు అడ్వర్‌టైజింగ్ చేసే అవకాశాన్ని దర్శక నిర్మాతలు పరిశీలించే ఛాన్స్ ఉంది. తద్వారా కొంత మెుత్తాన్ని సినిమా కోసం సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, తారక్ వంటి బడా హీరోల చిత్రాలకైతే కోట్లలో యాడ్స్ రూపంలో వసూలు చేసే అవకాశం లభిస్తుంది. మరి నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.
‘పుష్ప 2’ రెండు వారాల కలెక్షన్స్..
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై బుధవారంతో (డిసెంబర్ 18) సరిగ్గా రెండు వారాలు (14 రోజులు) పూర్తయింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ రూ.1450 కోట్ల మైలురాయి (Pushpa 2 Box Office Collections)ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఇంకో రూ.50 కోట్ల దూరంలో మాత్రమే పుష్పరాజ్ ఉన్నాడని పేర్కొన్నారు. రేపో, మాపో ఆ ఘనత కూడా ‘పుష్ప 2’ ఖాతాలో వచ్చి చేరుతుందని తెలిపారు. సంక్రాంతి వరకూ పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడంతో పుష్పరాజ్ జైత్రయాత్ర ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ప్రస్తుతం ‘పుష్ప 2’ మూడో స్థానంలో కొనసాగుతోంది. దంగల్ (రూ. 2,051 కోట్లు), బాహుబలి 2 (రూ.1,810.60) చిత్రాలు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
https://twitter.com/ManobalaV/status/1869609840668270618
డిసెంబర్ 19 , 2024
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టును ఖండిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరోవైపు బన్నీ అరెస్టును భారాస కీలక నేత కేటీఆర్ సైతం ఖండించంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బన్నీ నివాసానికి మెగా బ్రదర్స్
బన్నీ అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అటు సోదరుడు నాగబాబు కూడా చిరంజీవి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను తోడుగా ఉన్నామని మెగా బ్రదర్స్ అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
https://twitter.com/DailyCultureYT/status/1867498589523783717
https://twitter.com/SureshPRO_/status/1867498295825678422
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం మేజిస్ట్రేట్ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీకి రిమాండ్ విధించే విషయమై కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వనున్నారు.
బన్నీ కోసం చిరంజీవి..
అల్లు అర్జున్ (Allu Arjun Arrest) అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను ఆయన ఉన్నపళంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రనిర్మాత దిల్ రాజు, మరికొందరు డైరెక్టర్స్‌తో కలిసి ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు సోదరుడు అల్లు శిరీష్ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బన్నీని కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.
https://twitter.com/Abhinaytweets06/status/1867492787072938070
బన్నీ అరెస్టుపై కేటీఆర్ ఫైర్..
అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టుపై భారస నేత, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయెుద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌ను కూాడా అరెస్టు చేయాలి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ రాసుకొచ్చారు.
https://twitter.com/KTRBRS/status/1867480142085578958
https://twitter.com/NAR_Handle/status/1867482837689282809
అరెస్టుపై సీఎం రియాక్షన్ ఇదే..
అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టంం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పకొచ్చారు.
హైకోర్టులో క్వాష్ పిటిషన్
అరెస్టు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ తరపున అతడి లాయర్లు న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద తమ పిటిషన్ స్వీకరించి బన్నీ అరెస్టును సోమవారం వరకూ వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను స్థానిక కోర్టులో చిక్కడపల్లి పోలీసులు హాజరు పరిచే అవకాశముంది. ఈలోపు హైకోర్టు ధర్మాసనం తీర్పు వస్తే దాని ప్రభావం పోలీసులపై పడొచ్చు.
డిసెంబర్ 13 , 2024
Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
ప్రియాంకా హాల్దర్(Priyanka Halder) బెంగాల్‌కి చెందిన నటి, టీవీ మరియు వెబ్ సిరీస్‌లలో సెన్సేషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘క్రైమ్ పాట్రోల్’, ‘గాందీ బాత్’, ‘ఉతా పటాక్’ వంటి ప్రసిద్ధ షోల్లో నటించి గుర్తింపు పొందింది. థియేటర్ నుండి టీవీ స్క్రీన్ వరకూ తన ప్రయాణంలో ఆమె వివిధ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
తాజా వివాదం
తాజాగా, ఆమె ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే కామెడీ షోలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. షోలో ఆమె 'కాస్ట్యూమ్ కట్టర్', ఆమె స్నేహితుడు మోహమ్మద్ ఆదిల్ తో కలసి చేసిన ‘డ్రెస్ కట్టింగ్ స్టంట్’ నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. మోహమ్మద్ ఆదిల్ ఆమెను అసభ్యంగా తాకుతూ ఆమె డ్రెస్ కట్ చేసిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ప్రియాంక హల్దర్ డ్రెస్ కట్టర్‌ను ఏమి(Priyanka Halder) అనకుండా ప్రొత్సహించడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ డ్రెస్ కట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక హాల్దర్‌కు పెళ్లై.. 15 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ వయసులో ఇలాంటివి చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
View this post on Instagram A post shared by India’s Got Latent (@indiasgotlatent)
ప్రస్తుతం ప్రియాంక హల్దర్ పేరు సోషల్ మీడియాతో పాటు… ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌గా మారడంతో ఆమె పర్సనల్ లైఫ్, సినిమా కెరీర్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ప్రియాంక హల్దర్ కోల్‌కతాలో పుట్టి పెరిగింది. అక్కడే ఆమె 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేసింది.
View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial)
సాదాసీదా జీవితంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, చాలా చిన్న వయస్సులో (Priyanka Halder Viral Video)పెళ్లి కావడంతో ఒక్కసారిగా మారిపోయింది. 18 సంవత్సరాల వయస్సులోనే ప్రియాంక గర్భవతి అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2024 నాటికి ఆమె కుమారుడు 15 సంవత్సరాలు.
ప్రియాంక హల్దర్ భర్త భారతీయ రైల్వేలో నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మీడియాకు దూరంగా ఉంటున్నారు.
ఆమె బెంగాళీ కాగా, హిందూ ధార్మిక విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
తాను సినిమా రంగంలో ఉన్న విషయం మొదట తన భర్తకు తెలియకుండా ఉన్నట్లు సమాచారం. ప్రియాంక ప్రధానంగా బి-గ్రేడ్ సినిమాల‌్లో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య సమస్యలు ఎదురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక ఆమె భర్త వెర్వేరుగా జీవిస్తున్నారు.
View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial)
ప్రియాంక తన కుడి చేతిపై "A" అనే అక్షరంతో ఉన్న టాటూ వేయించుకుంది. అయితే దాని అర్థం మాత్రం తెలియదు. త్రికాల జ్ఞానుడైన శివుని భక్తురాలిగా, ఆమె తరచుగా ఆలయాలకు వెళ్తుంటుంది.
నట ప్రస్థానం
ప్రియాంక హల్దర్ తన నటనా జీవితాన్ని బి-గ్రేడ్ సినిమాలతో ప్రారంభించింది. ఆమె పాత్రలు(Priyanka Halder) బోల్డ్, సెన్సువల్‌గా ఉండటంతో ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచేది. హిందీ వెబ్‌సిరీస్ రంగంలో, ముఖ్యంగా ALT బాలాజీ నిర్మించిన "గందీ బాత్" అనే వెబ్‌సిరీస్‌తో ఆమె మంచి గుర్తింపు పొందింది.
ప్రియాంక హల్దర్ నటించిన రీసెంట్ వెబ్ సిరీస్‌లు
సెకండ్ హనీమూన్.సాజిష్ ప్యాస్ మాంటీ బెలాగం
టీవీ కెరీర్
ప్రియాంకా హాల్దర్ తన కెరీర్‌ను ‘క్రైమ్ పాట్రోల్ డయల్ 100’ ద్వారా ప్రారంభించింది. ఈ షోలో ఆమె పలు కథలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షోలో న్యాయపరమైన కేసులు, బాధితుల కథలు ప్రధానంగా టెలీకాస్ట్ అవుతుంటాయి. ఈ షోతో పాటు ఆమె ‘క్రైమ్ వరల్డ్’, ‘షీమారూ టీవీ’ షోల్లో కూడా కనిపించింది.
అనంతరం ఆమె ALT బాలాజీ వెబ్ సిరీస్ ‘గాందీ బాత్’ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రధాన ప్రాజెక్టులలో ‘ఉతా పటాక్’, ‘ప్యాస్’, ‘సజిష్’ లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఉతా పటాక్ 4 ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది.
ప్రియాంకా హాల్దర్ ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కామెడీ షోలో ‘కాస్ట్యూమ్ కట్టర్ స్టంట్’ కి సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఆమె రెడ్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించి, షోలో ఆమె గౌనును కత్తిరిస్తూ కట్-అవుట్ డ్రెస్ గా మార్చడం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. పబ్లిక్‌లో అనైతిక ప్రవర్తన అని కొందరు విమర్శించగా, ప్రమోషనల్ స్టంట్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా లింకులు
ఇన్‌స్టాగ్రామ్: Priyanka Halder Officialఫేస్‌బుక్: Priyanka Halder Facebookయూట్యూబ్: Priyanka Halder YouTube
డిసెంబర్ 10 , 2024
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు.
ఆయన మరింత ఆసక్తికరంగా మాట్లాడుతూ, “ఈ రోజు ఇక్కడ నేను ఉండగలగడం సుకుమార్ గారి ప్రేమ కారణం. ఇంతకంటే నేను మరేం చెప్పగలను? డార్లింగ్” అంటూ సుకుమార్‌ను ప్రశంసించారు. ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్, “నాకు సినిమా కలెక్షన్ల గురించిపెద్దగా నంబర్లు గుర్తులేవు. కానీ ఈ సినిమా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మామయ్యకు కృతజ్ఞతలు
అల్లు అర్జున్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “మా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు,” అని అన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలిపారు. “సినీ పరిశ్రమపై మీ ప్రేమ ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది,” అని కొనియాడారు.
ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రస్తావిస్తూ, “ఈ ప్రత్యేక జీవోకి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. పర్సనల్‌గా కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్యూ సో మచ్!” అంటూ చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలతో కొన్ని రోజులుగా అల్లు Vs మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్‌కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
ఇది వివాదం!
గత కొంతకాలంగా అల్లు అర్జున్ అభిమానులు – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని కోరగా, “చెప్పను బ్రదర్,” అని చెప్పిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఇక ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి పర్సనల్‌గా వెళ్లి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత పెరిగింది.
ఫ్యాన్స్‌కు బన్నీ సందేశం
అయితే ఇప్పుడు సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ పేరు స్పెషల్‌గా ప్రస్తావిస్తూ “కళ్యాణ్ బాబాయ్” అని చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలకు తావులేదనే విషయాన్ని అభిమానుల్లోకి స్పష్టంగా తీసుకెళ్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కొన్ని మాటల వలన అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ సక్సెస్ మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసును దోచుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్‌కి, తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్, టికెట్ ధరల పెంపు నిర్ణయంపై కూడా అభినందనలు తెలిపారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వివాదాలకు ఎప్పటికైనా ముగింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బన్నీ చేసిన కామెంట్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీసి వివాదాలు తగ్గుతాయని అంతా ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పుష్ప విజయాన్ని మించిపోయేలా బన్నీ మాటలు అభిమానుల హృదయాలను దోచుకున్నాయి.
డిసెంబర్ 07 , 2024
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!
ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే ముందుగా నాగ చైతన్య - సమంత జోడీనే గుర్తుకు వచ్చేది. రీల్ స్క్రీన్‌తోపాటు నిజ జీవితంలోనూ అప్పట్లో ఈ జంట చూడముచ్చటగా కనిపించేది. గతంలో సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఆహా షోకు వచ్చిన చైతూ తమ రిలేషన్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. దీంతో ఉంటే సమంత-చైతూలా ఉండాలని అప్పట్లో చాలా జంటలే భావించాయి. అయితే అనూహ్యంగా విడాకులు తీసుకొని ఈ జంట అందర్నీ షాక్‌కు గురిచేసింది. చైతూ డిసెంబర్‌లో రెండో పెళ్లి సైతం చేసుకోబోతున్నాడు. ఇదిలాఉంటే తాజాగా విడాకులపై సమంత (Samantha) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్'..
నటుడు నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అంశంపై స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు సమాజం కొన్ని ట్యాగ్స్ ఇస్తున్నట్లు చెప్పింది. సెకండ్ హ్యాండ్, ఆమె లైఫ్ వృథా, యూజ్డ్' అంటూ కొన్ని ట్యాగ్స్ తలిగిస్తున్నట్లు పేర్కొంది. అలా ఎందుకు తగిలిస్తారో అర్థం కావడం లేదని తెలిపింది. ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్నిఈ విమర్శలు ఎంతో బాధిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని, వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సామ్ థ్యాంక్స్ చెప్పింది.
https://twitter.com/prasanna_dbc/status/1861296316782882884
పెళ్లి గౌను రీమోడల్ పైనా..
సమంత (Samantha) తన పెళ్లి గౌనును ఇటీవల రీ మోడల్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ వెడ్డింగ్ గౌను అప్పట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిని సామ్ రీడిజైన్ చేయించినట్లు తెలవడంతో అక్కినేని ఫ్యాన్స్ సమంతపై విమర్శలు చేశారు. చైతూ రెండో పెళ్లి నేపథ్యంలో ప్రతీకారం కోసమే ఆమె ఇలా చేసిందని నెట్టింట ఆరోపించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వెడ్డింగ్ గౌను వ్యవహారంపైనా సామ్ స్పందించింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. ఆ గౌను రీడిజైన్ ద్వారా తాను ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. తన జీవితంలో జరిగిన విషయాలను ఎప్పుడూ దాచాలని అనుకోలేదని తెలిపింది. ఎన్నో కష్టాలు దాటుకొని ఈ దశకు వచ్చినట్లు సమంత తెలిపింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.
‘ఇంకా సాగదీయడం తప్పు’
నటుడు నాగచైతన్య సైతం తాజాగా విడాకుల అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. సమంత (Samantha)తో విడాకులు అనుకోకుండా జరిగిందని చైతూ అన్నట్లు సమాచారం. 'ఆ ఫేజ్‌పై తనకు చాలా గౌరముంది. వార్తల్లో హెడ్‌లైన్స్ కోసం ఇంకా సాగదీయడం తప్పు. ఇండస్ట్రీకి వచ్చింది ప్రొఫెషనల్ లైఫ్‌తో ఎంటర్‌టైన్ చేయడానికి, పర్సనల్ లైఫ్‌తో కాదు' అని చైతూ అన్నట్లు తెలుస్తోంది. అయితే సమంత వ్యాఖ్యల నేపథ్యంలోనే చైతూ ఈ కామెంట్ చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండో పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న ఈ తరుణంలో సామ్‌తో విడాకుల అంశం చర్చకు రావడం నచ్చకే ఈ కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు. పలు సోషల్ మీడియా, యూట్యూబ్ హ్యాండిల్స్‌కు సైతం చైతూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
https://twitter.com/theBuzZBasket/status/1861279225036112156
నెట్‌ఫ్లిక్స్‌లో చైతూ పెళ్లి లైవ్!
ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను నాగచైతన్య రెండో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అయితే పెళ్లిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు స్ట్రీమింగ్ హక్కులు అందించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. నయనతార-విఘ్నేశ్ జంట కూడా గతంలో తమ పెళ్లిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు ఇచ్చారు. అయితే ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించిందట. అయితే శోభిత-చైతు పెళ్లి కోసం ఏకంగా రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ఓటీటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైతూ రెండో పెళ్లిపై గత కొంతకాలంగే పెద్ద ఎత్తున బజ్ నడుస్తుండటంతో నెట్‌ఫ్లిక్స్ ఆ స్థాయిలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/UrsSureshR9/status/1861313291290607990
నవంబర్ 26 , 2024
Nayanthara: ధనుష్‌తో వివాదం.. చిరు, రామ్‌చరణ్‌ను ఆకాశానికెత్తిన నయనతార!
తమిళ హీరోయిన్ నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆమె జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) డాక్యుమెంటరీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)పై ఇటీవల నయన్ తీవ్ర విమర్శలు చేసింది. అది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా అదే డాక్యుమెంటరీకి సంబంధించి టాలీవుడ్ స్టార్ హీరోలు, తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
‘వారంటే నాకెంతో గౌరవం’
లేడీ సూపర్ స్టార్‌కు సంబంధించిన 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' (Nayanthara: Beyond the Fairy Tale) నవంబర్ 18న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు, తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచిన వారికి తాజాగా నాయనతార ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్ (Ram Charan) ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. అటు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పేరును సైతం ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. వీరితో పాటు షారుక్ భార్య గౌరీ ఖాన్, తెలుగు, మలయాళ, తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. తన డాక్యుమెంటరీ కోసం వారిని సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని నయన్ అన్నారు. నిర్మాతలు వారి వద్దకు వెళ్లినప్పుడు చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. వీరంతా అత్యంత విలువైన క్షణాలను అందించారని కొనియాడారు. వీరిందరిపై తనకెంతో గౌరవం ఉందని నయన్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)
ధనుష్‌తో గొడవ ఎందుకుంటే?
2015లో నయనతార (Nayanthara) చేసిన 'నానుమ్ రౌడీ' (తెలుగులో నేను రౌడీనే) చిత్రానికి ఆమె భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధనుష్ (Dhanush) నిర్మాత. 'నానుమ్ రౌడీ'తో నయన్‌కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నటిగా మంచి పేరు రావడంతో పాటు ఎంతో విలువైన ప్రేమ సైతం ఆ సినిమా ద్వారానే దక్కింది. ఈ నేపథ్యంలో తన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale)ను హైలెట్ చేయాలని నయనతార భావించింది. ఆ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను వినియోగించుకునేందుకు ధనుష్ అనుమతి కోరింది. అయితే రెండేళ్ల నుంచి ధనుష్‌ను అడుగుతున్నా ఆయన స్పందించకపోవడం, పైగా డాక్యుమెంటరీ ప్రోమోలో 3 సెకన్ల 'నానుమ్ రౌడీ దాన్' కంటెంట్‌ను వాడటంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపడం నయనతారను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ధనుష్‌ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. ధనుష్ చర్యలతో తన హృదయం ముక్కలైందని పేర్కొంది. మీ మంచి తనాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని మండిపడింది.
https://twitter.com/NayantharaU/status/1857680582773551362
నయనతారకు మద్దతుగా మహేష్!
ధనుష్ - నయనతార మధ్య వివాదానికి కారణమైన డాక్యుమెంటరీ (Nayanthara: Beyond the Fairy Tale)పై సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల స్పందించాడు. డాక్యుమెంటరీ చూసిన మహేష్ అందులో నయన్ - విఘేష్ లవ్ ఎపిసోడ్ చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా నయన్, విఘ్నేష్, ఇద్దరు పిల్లలతో ఉన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను మహేష్ ఇన్‌స్టా స్టేటస్‌గా పెట్టాడు. మూడు లవ్ సింబల్స్‌ను దానికి జత చేశాడు. ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. ధనుష్ - నయనతార (Nayanthara Vs Dhanush) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నయనతార- మహేష్ బాబు కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీరి జోడిని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. మరి భవిష్యత్‌లోనైనా వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
https://twitter.com/GulteOfficial/status/1858556384079761643
దూకుడు ప్రదర్శిస్తున్న లేడీ సూపర్ స్టార్!
ప్రస్తుతం ఫిల్మ్ కెరీర్ పరంగా నయనతార దూసుకుపోతోంది. గతేడాది షారుక్ ఖాన్‌తో 'జవాన్' చిత్రం చేసి తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ అమ్మడు అడుగుపెట్టింది. అదే ఏడాది 'అన్నపూర్ణి'గా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ఈ లేడీ సూపర్‌స్టార్ బిజీ బిజీగా ఉంది. తమిళంలో 'టెస్ట్', 'మన్నన్‌గట్టి సిన్స్ 1960', 'తని ఓరువన్ 2', 'ముకుతి అమ్మన్ 2' సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘డియర్ స్టూడెంట్స్’ అనే చిత్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివర, వచ్చే సంవత్సరంలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే 2022లో డైరెక్టర్ విఘ్నేశ్‌ను పెద్దల సమక్షంలో నయన్ వివాహం చేసుకుంది. వీరికి సరోగసి విధానంలో పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.
నవంబర్ 21 , 2024
Tejaswi Madivada: బికినిపై తేజస్వి హాట్ కామెంట్స్ వైరల్
తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస చిత్రాలు, సిరీస్‌లు చేస్తోంది. తాజాగా బికినీపై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
రీసెంట్‌గా ఆమె చేసిన 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సీన్‌లో బికినీలో కనిపించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ బికినీకి సంబంధించిన ఫొటోలను సైతం తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
బికినీలో ఆమె లుక్ పర్పెక్ట్‌గా ఉందంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. దీనిపై తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తేజస్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రతీ యాక్టర్‌కు అందంగా, ఫిట్‌గా ఉండటం అవసరమని తేజస్వి స్పష్టం చేసింది. ఈ సిరీస్‌లోనే తాను తొలిసారి బికినీ వేశానని గుర్తుచేసింది. దీనిని గొప్ప అవకాశంలా భావించాని చెప్పింది.
ఓటీటీ సిరీస్‌కు బికిని అవసరమా? అన్న ప్రశ్నకు ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తానేమి ఊరికే బికినీ వేసుకొని రోడ్లమీద తిరగట్లేదని, సన్నివేశం కోసం మాత్రమే అలా చేశానని చెప్పింది.
https://www.youtube.com/watch?v=tZHrZBu_TAY&t=82s
ఇక తేజస్వి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో జర్నలిజం చదివింది. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించింది. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్ అటాక్’ వంటి చిత్రాల్లో తేజస్వి నటించింది.
2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది.
'కేరింత' చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్ లభించలేదు.
దీంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టిన తేజస్వి మదివాడ అక్కడ పలు షోలలో హల్‌చల్ చేసింది. 2018లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది.
తర్వాత స్టార్‌మాలో 'ది గ్రేటర్ తెలుగు లాఫర్ ఛాలెంజ్' సీజన్ 1లో కనిపించి సందడి చేసింది. 2022లో 'బిగ్‌బాస్ నాన్ స్టాప్ 1'లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది.
ఇటీవల 'హైడ్ ఎన్ సీక్' (Hide N Seek) మూవీలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేకపోవడంతో ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ 2’ సిరీస్‌లో చాలా ఆశలు పెట్టుకుంది.
మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో తేజస్వి ఉంది. ఇందుకోసం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తేజస్వి ఏ ఫొటో షేర్ చేసినా దానిని వెంటనే షేర్ చేస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024