• TFIDB EN
  • అన్న తమ్ముడు
    UTelugu2h 6m
    సూపర్ స్టార్ కృష్ణ తన సినీ ప్రయాణంలో రజతోత్సవం సందర్భంగా అన్న- తమ్ముడు చిత్రాన్ని స్వయంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన కుమారుడు మహేష్ బాబు నటించాడు. కృష్ణ సరసన గౌతమి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    కృష్ణ
    మహేష్ బాబు
    మురళి
    గౌతమి
    రాణి పద్మిని
    జెవి సోమయాజులు
    వాసుదేవ ప్రసాద్
    ఎం. ప్రభాకర్ రెడ్డి
    యుగంధర్ రావు
    గిరి బాబు
    శేషగిరి
    విజయచందర్
    రాజ మహేంద్ర ప్రతాప్
    సారథి
    గంటయ్య
    శ్రీహరి రఘుముద్రి
    గూన్
    జీవా
    KR విజయ
    రాజేశ్వరి దేవి
    అంజనాసుధ
    సిబ్బంది
    కృష్ణ
    దర్శకుడు
    కృష్ణనిర్మాత
    సంగీతకారుడు
    సాయినాథ్ తోటపల్లి
    కథ
    కథనాలు
    <strong>Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!</strong>
    Raksha Bandhan 2024: తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న సెలబ్రిటీలు.. ఓ లుక్కేయండి!
    అన్నను కొండంత అండగా స్త్రీలు భావిస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రేమను, వారి యోగ క్షేమాలను చూసుకునేది కూడా అన్న లేదా తమ్ముడు మాత్రమే. కష్టసుఖాల్లో పాలుపంచుకునే తొలి మిత్రుడిగా సోదరుడ్ని చెబుతుంటారు. అన్న-చెల్లెళ్లు, అక్క-తమ్ముడి మధ్య ఉండే అప్యాయతలకు ప్రతీకగా ప్రతీ ఏటా రాఖీ పండగను జరుపుకుంటారు. ఒకరికొకరు అండగా ఉంటామని ఈ పండగ ద్వారా చాటి చెప్పుకుంటారు. అటు సెలబ్రిటీలు సైతం రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 19) సందర్భంగా సెలబ్రిటీలు తమ సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో సైతం పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మెగా డాటర్స్‌ సుస్మిత కొణిదెల, నిహారిక కొణిదెల యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌కు రాఖీ కట్టారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు కూడా మెగా డాటర్‌ నిహారిక కొణిదెల రాఖీ కట్టి అతడి ఆశీస్సులు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను చరణ్‌ స్వయంగా పంచుకున్నారు.&nbsp; View this post on Instagram A post shared by RamCharan.k 🔵 (@ramcharankonidella.k) యువ నటుడు సుధీర్‌ బాబు కూడా తన సోదరితో కలిసి రాఖీ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. తన అక్కతో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.&nbsp; నటుడు సందీప్‌ కిషన్‌ సైతం సోదరి మౌనికతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. చెల్లెలితో చిన్నప్పుడు దిగిన ఫొటోను పంచుకున్నారు.&nbsp; బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపింది. వారితో వీడియోకాల్‌లో మాట్లాడిన ఫొటోను షేర్ చేసింది.&nbsp; స్టార్‌ నటి రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.&nbsp; ప్రముఖ నటి జెనీలియా, సోదరుడు నిగెల్‌ డిసౌజాకు రాఖీ పర్వదినంగా సందర్భంగా విష్‌ చేశారు. అవసరం వచ్చిన ప్రతీ చోట అతడు అండగా నిలిచాడంటూ కొనియాడారు.&nbsp; రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. చెల్లెళ్లు ప్రసీద, ప్రదీప్తి ప్రభాస్‌కు రాఖీ కట్టి శుభాంకాక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి రక్షాబంధన్‌ సందర్భంగా సోదరులతో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. అలాగే బన్నీ కూతురు అల్లు అర్హా తన సోదరుడు అయాన్‌కు రాఖీ కడుతున్న ఫొటోలను కూడా పంచుకుంది. అల్లు అర్హ ఓ బేబీ డాగ్‌కు కూడా రాఖీ కట్టడం ఫొటోల్లో చూడవచ్చు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇంట్లో రాఖీ వేడుకలు జరిగాయి. మహేష్‌ బాబు కూతురు సితార తన అన్న గౌతమ్‌కు రాఖీ కట్టి విషెస్‌ తెలియజేసింది.
    ఆగస్టు 20 , 2024
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    Gam Gam Ganesha Review: అన్న ఫెయిల్‌ అయినా తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు!
    నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ్‌, రాజ్‌ అర్జున్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, క్రిష్ణ చైతన్య డైరెక్టర్‌ : ఉదయ్‌ బొమ్మిశెట్టి సంగీతం : చైతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వడి ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్‌ నిర్మాతలు : వంశీ కృష్ణ, కేదర్‌ సెలగంశెట్టి విడుదల తేదీ : 31-05-2024 విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. జబర్దస్త్‌ ఇమ్మాన్యుయెల్‌, వెన్నెల కిశోర్‌, రాజ్‌ అర్జున్‌, సత్యం రాజేష్‌, ప్రిన్స్‌ యావర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది విజయ్‌ దేరరకొండ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మరి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా అయినా సక్సెస్‌ కావాలని విజయ్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే 31న విడుదలైన ‘గం గం గణేశా’ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిచిందా? లేదా? కథేంటి గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ.. గణేష్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ చిత్రం తర్వాత నటుడిగా మరింత పరిణితి సాధించాడు. ఇమ్మాన్యుయెల్‌తో కలిసి అతడు చేసిన కామెడీ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అటు హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ అదరగొట్టింది. నీలవేణి పాత్రలో మెప్పించింది. హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. మరో కథానాయిక నయన్‌ సారిక కూడా శ్రుతి పాత్రలో ప్రేక్షకులను అలరించింది. హాస్యనటులు వెన్నెల కిషోర్‌, ఇమ్మాన్యుయెల్‌ తమదైన కామెడీ ఆకట్టుకున్నారు. విలన్‌గా రాజ్‌ అర్జున్‌ నటన మెప్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఉదయ్‌ బొమిశెట్టి రొటీన్‌ కథనే తీసుకున్నప్పటికీ సినిమాను క్రైమ్‌ &amp; ఎంటర్‌టైనింగ్‌ ఫార్మెట్‌లో అద్భుతంగా రూపొందించారు. కథనం, కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బాగా వర్కౌట్‌ చేశాడు. ముఖ్యంగా హీరో - ఇమ్మాన్యుయెల్‌ - వెన్నెల కిషోర్‌ చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఆడియన్స్‌కు థ్రిల్‌ను పంచేలా దర్శకుడు ఆ సీన్లను తీర్చిదిద్దాడు. అయితే కొన్ని చోట్ల అసంబద్ద నారేషన్‌ సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ట్విస్టులు, థ్లిల్లింగ్‌ క్లైమాక్స్‌తో ఒక మంచి చిత్రాన్ని అందించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు.  టెక్నికల్‌గా ఈ సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరిచింది. మరి ముఖ్యంగా నేపథ్య సంగీతం మూవీకి హైలెట్‌గా నిలిచింది. చైతన్ భరద్వాజ్‌ తన క్యాచీ బీజీఎంతో సన్నివేశాలకు అదనపు ఆకర్షణను అందించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య జవ్వడి పనితనం బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ఆనంద్‌ దేవరకొండ నటనకామెడీట్విస్టులు మైనస్‌ పాయింట్స్ కథలో కొత్తదనం లేకపోవడంస్టోరీ నారేషన్‌లో తడబాటు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; పబ్లిక్‌ టాక్‌ ఎలా ఉంది? గం గం గణేశా చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. ఈ వీకెండ్‌ ఫుల్లుగా నవ్వుకోవచ్చని ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆనంద్ ఖాతాలో మరో హిట్‌ చేరిందని కామెంట్‌ పెట్టాడు.&nbsp; https://twitter.com/OfficialSreeNu/status/1796180578644926755 ‘గం గం గణేశా’ డీసెంట్‌ సినిమా అని.. ట్విస్టులు, వినోదం సినిమాకు హైలెట్‌గా నిలిచాయని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/review_rowdies/status/1796384723033596372 స్టోరీలో కంటెంట్‌ మిస్‌ అయ్యిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఆనంద్‌ దేవరకొండ తన శక్తిమేర నటించాడని పేర్కొన్నాడు. కానీ అప్‌ టూ ద మార్క్ చేరుకోలేకపోయడని పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/Mjcartels/status/1796394003979800864 ‘గం గం గణేశా’.. రిలాక్స్‌గా సీట్‌లో కూర్చొని ఎంజాయ్‌ చేసే మూవీ అని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించాడు. సందర్భానుసారంగా వచ్చే కామెడీ సూపర్బ్‌గా వర్కౌట్ అయ్యిందని చెప్పాడు. https://twitter.com/tcsblogs/status/1796341604845867293
    మే 31 , 2024
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!&nbsp;
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!&nbsp;
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి&nbsp; పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.&nbsp; 3. తమ్ముడు&nbsp; 1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.&nbsp; 4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో&nbsp; అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.&nbsp; 9. వకీల్‌సాబ్‌&nbsp; వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి&nbsp; లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం.&nbsp;
    జూలై 31 , 2023
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.&nbsp; 2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.&nbsp; https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.&nbsp; 4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.&nbsp; 5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.&nbsp; 6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.&nbsp; 7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.&nbsp; 8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.&nbsp; 9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.&nbsp; 10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు.&nbsp;
    మే 09 , 2023
    <strong>Naga Babu: ఏపీ మంత్రి వర్గంలోకి నాగబాబు.. మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్‌!</strong>
    Naga Babu: ఏపీ మంత్రి వర్గంలోకి నాగబాబు.. మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్‌!
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సోదరుడు నాగబాబు (Nagababu)కు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) అధికారికంగా ప్రకటించారు. తాజా నిర్ణయంతో నాగబాబు త్వరలోనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మరోవైపు జనసేనలో చురుగ్గా పనిచేస్తోన్న నాగబాబు ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రిపదవి వస్తుండటంతో జనసేన క్యాడర్‌తో పాటు, మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే నాగబాబును కేబినేట్‌లోకి తీసుకోవడాన్ని సోషల్‌ మీడియా వేదికగా కొందరు తప్పుబడుతున్నారు.&nbsp; నాగబాబుపై తీవ్ర విమర్శలు.. మెగా బ్రదర్‌ నాగబాబును మంత్రి ఎంపిక చేయడాన్ని నెట్టింట కొందరు తప్పుబడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు ఎక్స్‌ వేదికగా సెటైర్లు వేశారు. 'ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్‌ మూవీ అనుకుంటున్నారు.. పాపం' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.&nbsp; మంత్రిగా చేయడానికి ఆయనకు ఏ అర్హత ఉందని నిలదీస్తున్నారు. ప్రజా ఆశీస్సులు లేకుండా మంత్రి పదవి ఎలా ఇస్తారా? అని మండిపడుతున్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పే పవన్‌ ఇప్పుడు సొంత అన్నకి మంత్రి పదవి ఇప్పించాడని ఆరోపిస్తున్నారు. ‘అన్న రూల్స్‌ పెడతాడు.. కానీ ఫాలో అవ్వుడు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.&nbsp; https://twitter.com/Swathi_ysj/status/1866315425623216201 https://twitter.com/PerliNithin/status/1866386345830301917 https://twitter.com/2024evm/status/1866382435849818568 https://twitter.com/UttarandhraNow/status/1866371575353852287 బాలయ్య ఫ్యాన్స్ అలక.. నాగబాబుకు మంత్రి పదవి ఖరారైన నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. తమ హీరో హిందూపురంలో హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా నిలిచారని గుర్తు చేస్తున్నారు. హిందూపురం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని అంటున్నారు. అటువంటి బాలయ్యకి సైతం మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ అలకను విపక్ష వైకాపా పార్టీ పావుగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. గతంలో బాలయ్యను విమర్శిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్‌ను నెట్టింట వైరల్ చేస్తోంది.&nbsp; https://twitter.com/bala_chowdary_/status/1866188543368057329 https://twitter.com/Memuchalabusy_2/status/1866407818926211092 https://twitter.com/the_devilmahe/status/1866387914655240199 https://twitter.com/MnyLivesMtr/status/1866342253871931583 త్వరలో ఎమ్మెల్సీగా ప్రమాణం.. జనసేన ముఖ్యనేత నాగబాబు ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా లేరు. ఆయన ఏపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయలేదు. అయితే ఏపీ తరపున ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఆయన్ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. దీనిపై పవన్‌ ఢిల్లీ వెళ్లి మరి భాజపా అధినాయకత్వంతో చర్చలు జరిపారు. కానీ, కొన్ని రాజకీయ సమీకరణాల రిత్యా ఆ సీటును బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యకు భాజపా కేటాయించింది. ఈ నేపథ్యంలో ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నాగబాబుకు స్టేట్‌ మినిస్ట్రీని కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణం చేసే ఛాన్స్‌ తొందర్లో ఉంది.&nbsp; మెగా ఫ్యామిలీ అరుదైన రికార్డు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన చిన్న తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన రెండో సోదరుడు నాగబాబు సైతం మంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో దేశ రాజకీయ, సినీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలో ఏ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు ఇలా మంత్రులుగా వ్యవహరించలేదు. దేశ రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి లభించిన అరుదైన ఘనతగా దీనిని చెప్పవచ్చు.&nbsp;
    డిసెంబర్ 10 , 2024
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే!&nbsp;
    Amazon Prime 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’ టూ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. అమెజాన్‌లో రిలీజయ్యే టాప్‌ మూవీస్‌ ఇవే!&nbsp;
    సాధారణంగా సినిమా విడుదల తర్వాత ఆ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్‌ వేదిక ఖరారవుతుంది. కానీ, ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ మాత్రం ఈ విషయంలో మిగిలిన వాటి కంటే ఎంతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా షూటింగ్‌ దశలోనే ఉన్న టాలీవుడ్‌ అగ్ర హీరోల చిత్రాలను సైతం విడుదలకు ముందే తన ఖాతాలో వేసుకుంటోంది. ఆయా సినిమా పోస్ట్‌ థియేట్రికల్‌ ఓటీటీ హక్కులను ముందుగానే తన పేరిట రిజర్వ్‌ చేసుకుంటోంది. ఇలా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కు కన్ఫార్మ్‌ అయిన టాలీవుడ్‌ బడా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ క్రిష్‌ (Krish) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్‌ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. పవన్‌.. ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్‌ పెట్టడంతో ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా అమెజాన్‌ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గతంలో అమెజాన్‌ స్వయంగా పోస్టర్‌ రూపంలో వెల్లడించింది. అంతేకాదు మూవీకి సంబంధించిన ప్లాట్‌ను సైతం రివీల్‌ చేసి వార్తల్లో నిలిచింది. కాగా, డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ఖరారు కానుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా అమెజాన్‌ను స్ట్రీమింగ్‌ వేదికగా ఫిక్స్ చేసింది. కాగా ఇటీవల విడుదలైన ఉస్తాద్‌ భగత్‌ సింగ్ టీజర్‌ తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను క్రియేట్‌ చేసుకుంది. ముఖ్యంగా గాజు గురించి పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.&nbsp; ఫ్యామిలీ స్టార్‌ (Family Star) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.&nbsp; ఓం భీమ్‌ బుష్‌ (Om Bheem Bush) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హాస్య నటులు ప్రియదర్శి (Priyadarsi), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకుంది. ఏప్రిల్‌ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది.&nbsp; తమ్ముడు (Thammudu) స్టార్‌ హీరో నితిన్‌ (Nithiin) అప్‌కమింగ్‌ చిత్రం ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ హక్కులను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’.&nbsp; ఘాతీ (GHAATI) స్టార్‌ హీరోయిన్‌ అనుష్క (Anusha Shetty) అప్‌కమింగ్‌ మూవీ 'ఘాతీ' కూడా ప్రైమ్‌లోనే ఓటీటీలోకి రానుంది. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో స్వీటీ వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుక్కున్న మహిళ.. తన సాధికారతను నిరూపించుకోవడం కోసం ఎలా పోరాడింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది. కాంతారా 2 (Kantara 2) రిషబ్‌ శెట్టి (Rishab Shetty) హీరోగా ఆయన స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ చిత్రం.. దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా రూపొందుతోంది. ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సైతం అమెజాన్‌ దక్కించుకోవడం విశేషం.&nbsp; కంగువా (Kanguva) 2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ ఒకటి. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిషా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల అనంతరం అమెజాన్‌లోనే స్ట్రీమింగ్‌లోకి రానుంది.
    ఏప్రిల్ 03 , 2024
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Ayesha Khan: ‘ఓం భీమ్‌ బుష్‌’ భామ అయేషా ఖాన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ అయేషా ఖాన్‌.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్‌ బుష్‌' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్‌ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయేషా ఖాన్‌ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అయేషా ఖాన్‌‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది. అయేషా ఖాన్‌‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది. అయేషా ఖాన్‌‌ పుట్టిన తేదీ? 13 సెప్టెంబర్‌, 1992 అయేషా ఖాన్‌‌ తల్లిదండ్రులు ఎవరు? అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్‌ ఖాన్‌ &amp; Mrs ఖాన్‌&nbsp; అయేషా ఖాన్‌‌కు సోదరులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్‌ ఖాన్‌ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్‌ ఖాన్‌ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయేషా ఖాన్‌ ఎత్తు ఎంత? 162 సెం.మీ అయేషా ఖాన్‌‌ ఏం చదివారు? ఈ భామ ఇంటర్‌ వరకూ చదువుకుంది.&nbsp; అయేషా ఖాన్‌‌ ఎక్కడ చదివారు? ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? కెరీర్‌ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది. అయేషా ఖాన్‌‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన? హిందీలో 'బిగ్‌ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.&nbsp; అయేషా ఖాన్‌ నటనా ప్రవేశం ఎలా జరిగింది? హిందీలో స్టార్‌ప్లస్‌ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్‌ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్‌ రిటర్న్స్‌' అనే సీరియల్‌లోనూ కనిపించింది.&nbsp; అయేషా ఖాన్‌ తొలి చిత్రం? తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.&nbsp; అయేషా ఖాన్‌ లేటెస్ట్‌ చిత్రం? అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్‌ షో చేసింది.&nbsp; అయేషా ఖాన్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘లక్కీ భాస్కర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.&nbsp; అయేషా ఖాన్‌ ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్‌ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్‌, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.&nbsp; అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ నటుడు? ఈ భామకు అక్షయ్‌ కుమార్‌ నటన అంటే చాలా ఇష్టమట. అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌? ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.&nbsp; అయేషా ఖాన్‌ ఇష్టమైన కలర్‌? నలుపు, తెలుపు అయేషా ఖాన్‌ ఫేవరేట్‌ రియాలిటీ షో? బిగ్‌బాస్‌ అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మునావర్‌ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; అయేషా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ? https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
    మార్చి 23 , 2024
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్‌ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్‌ చేసుకొని హిట్స్‌ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్‌ క్లైమాక్స్‌ సీన్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దసరా (Dasara) నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్‌ 'దసరా'. నూతన డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్‌ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/IUCbmWfVd8g?si=CPovFG1Ig_7cdS9b ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) రామ్‌చరణ్‌, తారక్‌ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్‌ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్‌, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్‌ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్‌ సైన్యాన్ని ఏరిపారేస్తాడు. https://youtu.be/8HTrv_MAuSE?si=CMqWkW8LRa3GqLA9 బాహుబలి 2 ‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్‌ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్‌ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్‌ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.&nbsp; https://youtu.be/4s6k7UpFnKc?si=7G-OJDfUuey9hKVV గ్యాంగ్‌ లీడర్‌ (Gang Leader) మాస్‌ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్‌ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో ‌అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్‌ మీద వేసి చిరు హతమారుస్తాడు.&nbsp; https://youtu.be/v0_E2uqVeaM?si=8z1LFqnzEJ3Wzy4x ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్‌ విలన్‌ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్‌ ఫైర్‌ అయ్యి విలన్‌ చనిపోయే సీన్స్‌ క్లాప్స్ కొట్టిస్తుంది.&nbsp; https://youtu.be/1SCFGWtXtDE?si=r1AnoKHjBFFyrNXu పోకిరి (Pokiri) తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్‌ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్‌ &amp; కోపై క్లైమాక్స్‌లో రివేంజ్‌ తీర్చుకునే సీన్ నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/PvkITH66FEc?si=2CJl4283NO85bYmd తమ్ముడు (Thammudu) స్పోర్ట్స్‌ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్‌ జగన్నాథ్‌ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్‌ కోర్టులో నిలిచిన పవన్‌ కల్యాణ్‌.. తొలుత విలన్‌ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్‌ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు.&nbsp; https://youtu.be/CZY-tl5JbSo?si=Ui97I0J_rOAi5s5j ఖుషి (kushi) పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్‌.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్‌ ప్లాన్‌ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్‌ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్‌ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు.&nbsp; https://youtu.be/R9VXMjfP6Kc?si=nt00kn-z4dqexdCZ విరుపాక్ష (Virupaksha) సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్‌ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్‌ తెలియడంతో ఆడియన్స్‌ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్‌ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.&nbsp; https://youtu.be/C1vmB8G2oTw?si=hcLk1a9tPl1WC6xQ సై (Sye) నితిన్‌ - జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్‌ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్‌ అయిన నితిన్‌ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.&nbsp; https://youtu.be/oc4J_qQcNkw?si=rSuIQ2jUftA4c4Mx రోబో 2.0 (Robo 2.0) డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్‌&nbsp; స్టేడియంలో విలన్‌ పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)తో రోబో (రజనీకాంత్‌) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు.&nbsp; https://youtu.be/I04BTA2fl-E?si=9hCEwzbPcG-m81VM అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo) అల్లుఅర్జున్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్‌ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు.&nbsp; https://youtu.be/ljHApHUTWeo?si=90dOM8aTCAWsSHoU అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్‌ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్‌ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్‌ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=42tjl5fOTTS4xEz6 సుస్వాగతం (Suswagatham) భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ క్లైమాక్స్‌ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్‌ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్‌ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్‌ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్‌ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్‌ చెప్పే డైలాగ్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్‌ పేర్కొంటాడు.&nbsp; https://youtu.be/323OoE0Figo?si=pm-8iXzG8DleERw1
    మార్చి 12 , 2024
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్‌ ఆ హీరో పాత్రలను ఓన్‌ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్‌ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ (Aadavari Matalaku Arthale Verule)&nbsp; సినిమాలో హీరో వెంకటేష్‌ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్‌ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్‌ క్లాస్‌ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.&nbsp; రఘువరన్‌ బీటెక్‌ ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్‌ (ధనుష్‌) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.&nbsp; తమ్ముడు ఈ (Thammudu) సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్‌ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్‌ కోర్టులో బుద్ది చెప్తాడు.&nbsp; అలా వైకుంఠపురంలో ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్‌ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని&nbsp; భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్‌ క్లాస్‌ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు. గ్యాంగ్‌ లీడర్‌ గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.  అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్‌ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్‌ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.  అ ఆ ఇందులో (A Aa) నితిన్‌ (Nithin) పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్‌ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.&nbsp; జెర్సీ (Jersey) క్రికెటర్‌ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్‌ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.&nbsp; నేనింతే&nbsp; ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.&nbsp; యోగి ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్‌ క్లాస్‌ యువతకు చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది. 
    మార్చి 01 , 2024
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    Shanmukh Jaswanth: భయపెట్టి అబార్షన్ చేయించాడు.. మౌనిక సంచలన కామెంట్స్!
    ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) గంజాయితో పోలీసులకు పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు అతడి ప్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి తీసుకుంటూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ను హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయి పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది.  షణ్ముఖ్‌ ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే! షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ (Sampath Vinay) ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మౌనిక అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం వారికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే యువతి తల్లి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స ఇప్పించే క్రమంలో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. మరో ఆరు రోజుల్లో వీరి పెళ్లి ఉందనగా.. సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని మౌనికకు షాకిచ్చాడు. దీంతో ఆమె సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని తీసుకొని సంపత్, షణ్ముఖ్‌ ఉంటున్న ఫ్లాటుకు వెళ్లింది. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేసినట్లు సమాచారం. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దర్ని అరెస్టు చేసి.. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు సమాచారం.&nbsp;&nbsp;&nbsp; https://twitter.com/InformedAlerts/status/1760553942201852102 మౌనిక సంచలన ఆరోపణలు! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని మౌనిక తెలిపింది. మరోవైపు సంపత్‌ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి మనకు నిశ్చితార్థం అయిపోయిందని సంపత్ చెప్పాడని పేర్కొంది. సంపత్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; https://twitter.com/i/status/1760553061007937805 బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది.
    ఫిబ్రవరి 22 , 2024
    <strong>Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!</strong>
    Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
    ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్‌ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; మత్తు వదలరా 2 (Mathu vadalara 2) బ్లాక్‌ బస్టర్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’ ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్‌ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ గానుంది. సెప్టెంబర్‌ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'డెలీవరీ బాయ్‌ ఏజెంట్స్‌ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?' అన్నది స్టోరీ. గొర్రె పురాణం (Gorre Puranam) సుహాస్ న‌టించిన రీసెంట్‌ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబ‌ర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో క‌లిసి చూసేయ‌చ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్‌) ఉన్న సెల్‌లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. పైలం పిలగా (Pailam Pilaga) సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. సెప్టెంబర్ 20న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే 'శివ దుబాయ్‌ వెళ్లి బాగా సెటిల్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ. శబరి (Sabari) విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్‌ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్‌ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్లాట్‌ ఏంటంటే 'సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్‌ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్‌ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్‌ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ. లెవల్‌ క్రాస్‌ (Level Cross) అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; వెయ్‌ దరువేయ్‌ (Vey Dharuvey) ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన రీసెంట్‌ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ యాక్షన్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజై ఆకట్టుకోలేకపోయింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ వచ్చిన ఈ చిత్రం ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘శంకర్.. ఫేక్‌ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం ఫ్లై కన్సల్టెన్సీని సంప్రదిస్తాడు. అందులో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఇష్టపడతాడు. అయితే ఈ ఫేక్‌ సర్టిఫికేట్స్‌ మాఫియాకు శంకర్‌కు సంబంధం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే హీరో నగరానికి వచ్చాడా? ఏదైనా ప్లాన్ ఉందా?’ అన్నది కథ. కృష్ణం ప్రణయ సఖీ (Krishnam Pranaya Sakhi) కృష్ణ‌మ్ ప్రణ‌య స‌ఖి మూవీలో కన్నడ గోల్డెన్ స్టార్ గ‌ణేష్ హీరోగా న‌టించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాళ‌వికానాయ‌ర్‌తో పాటు శ‌ర‌ణ్య శెట్టి హీరోయిన్లుగా చేశారు. కన్నడలో సూపర్‌ సక్సెస్‌ అయిన ఈ చిత్రం అక్టోబర్‌ 11 నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌ వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘కృష్ణ (గ‌ణేష్‌) ఫ్యామిలీ బిజినెస్‌ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్‌ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ. ది గోట్‌ (The Greatest Of All Time) గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్‌ ప్లాన్‌ చేసుకోండి. విజయ్‌ హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘ది గోట్‌’ (The Greatest Of All Time). వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ అక్టోబర్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్‌ (విజయ్‌) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ. 35 చిన్న కథ కాదు (35 Chinna katha kadu) ప్రముఖ నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ప్రసాద్‌ (విశ్వదేవ్‌), సరస్వతి (నివేదా థామస్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్‌. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ. భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌తరుణ్‌ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్‌ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘రాధ (రాజ్‌త‌రుణ్‌) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్‌ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్‌ బాక్స్‌ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
    అక్టోబర్ 10 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.&nbsp; టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి&nbsp; ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.&nbsp; 'కర్మ' అనే సినిమాతో&nbsp; డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.&nbsp; విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.&nbsp; మరో నాలుగేళ్ల తర్వాత&nbsp; దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు.&nbsp;అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &amp;సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే&nbsp; అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే&nbsp; డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    S. S. Rajamouli Style:&nbsp; రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    S. S. Rajamouli Style:&nbsp; రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్‌ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా&nbsp; స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు.&nbsp; రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్‌ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు,&nbsp; మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను ఎమోషన్‌తో బైండ్‌ చేసి సినిమాకి మంచి ఊపు తీసుకొస్తాడు.&nbsp; స్టూడెంట్ నం.1 సినిమాలో కొడుకుగా తన తండ్రి ఆదరణ కోసం ఆరాటే పడే కుర్రాడి పాయింటు.&nbsp; అందు కోసం&nbsp; జైలు నుంచి కాలేజీకి వెళ్ళడమనే ట్విస్టు. బ్రాగ్రౌండ్‌లో ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ వ్యక్తిని చంపడం,&nbsp; దీంతో అక్కడ ప్రేక్షకులను రాజమౌళి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగాడు.&nbsp; సింహాద్రిలో ఒక పనిపై హీరో కేరళ వెళ్ళినపుడు అక్కడ అన్యాయన్ని ఎదురించి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం అనే అంశం ఆధారంగా సినిమా తీశాడు. భూమిక ఎన్టీఆర్‌ను పొడవటం ట్విస్ట్. సైలో రగ్బీ ఆట మేయిన్ పాయింట్ అయితే... తన కాలేజీని ఆక్రమించకున్న విలన్ భిక్షు యాదవ్‌పై పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ కనెక్టివిటీని తీసుకొచ్చాడు. ఇందులో విలనే రగ్బీకి సవాలు చెయ్యటం ట్విస్టు. ఛత్రపతిలో హీరో వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండిస్తాడు హీరో.&nbsp; తల్లీ కొడుకుల మధ్య దూరం మెయిన్ పాయింటు అయితే.. తన తమ్ముడు తనను తల్లికి దూరం చేయాలనుకోవడం ట్విస్ట్. ఈగ సినిమాలో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగా మారి ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్ పాయింట్. చివర్లో ఈగ ఆత్మార్పణ చేసుకుని విలన్‌ను చంపే విధానాన్ని ఎమోషనల్ బైండింగ్ చేశాడు రాజమౌళి. &nbsp;RRRలో రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట ఇచ్చి అందు కోసం పోలీస్ ఆఫీసర్ అవడం మెయిన్ పాయింట్. తన లక్ష్య సాధనలో అడ్డుగా ఉన్న భీంను హింసించడం ఎమోషనల్ కనెక్టివిటీ. చివరకు భీంతో కలిసి బ్రిటీష్ వారిపై పోరాడి ఆయుధాలు సంపాందించి తన నాన్న కల నెరవేరుస్తాడు రామ్. అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు. 1st హాఫ్‌లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఉంటుంది. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ... ఆ స్టోరీ ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో ఆది సాధిస్తాడు.
    జూలై 06 , 2023
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘నా సినిమాకు వెళ్లండన్నా’ ‘బూట్‌కట్‌ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్‌ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.&nbsp; https://twitter.com/i/status/1753489890397098009 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే! బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్‌ సాబ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.&nbsp; తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్‌ (Sohel) డిమాండ్‌ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ సినిమాలకే కంటెంట్‌ ఉన్న ఆడియన్స్‌ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్‌ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్‌ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.&nbsp; నటుడు సోహెల్‌ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్‌ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.&nbsp; ఇండస్ట్రీలో సక్సెస్‌ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్‌ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్‌ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.&nbsp; సోహెల్‌ ఫ్రస్టేషన్‌కు కారణమిదే! బిగ్‌బాస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్‌ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్‌’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్‌ అల్లుడు’, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం 'బూట్‌కట్‌ బాలరాజు' సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్‌ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్‌ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు.&nbsp;
    ఫిబ్రవరి 03 , 2024
    <strong>Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :&nbsp; సాయి కిషోర్ మచ్చా సంగీతం:&nbsp; గోపీ సుందర్&nbsp; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;</strong>
    HBD Mokshagna Teja: ‘జై హనుమాన్‌’తో మోకజ్ఞ సినిమా లింకప్‌.. ఏం ప్లాన్‌ చేశావ్‌ ప్రశాంత్ మామా!&nbsp;
    నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశాడు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ‘హనుమాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఈ అరంగేట్ర చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇవాళ (సెప్టెంబర్‌ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే సమయంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి ఎగిరిగంతేసే న్యూస్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ పోస్టర్ ఎలా ఉందంటే నందమూరి మోక్షజ్ఞ తేజ, డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గొప్ప సంతోషంగా ఉందంటూ మూవీలోని ఆయన లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో మోక్షజ్ఞ హ్యాండ్స్‌మ్‌ లుక్‌లో స్మైలింగ్‌ ఫేస్‌తో కనిపించారు. అంతేకాదు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి పక్కా హీరో మెటీరియల్‌గా అనిపిస్తున్నారు. మోక్షజ్ఞ లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌ మోక్షజ్ఞకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1831921862609154407 తారక్‌ స్పెషల్‌ విషెస్‌ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డేతో పాటు ఆయన డెబ్యూ ఫిల్మ్‌ పోస్టర్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) స్పందించారు. మోక్షజ్ఞను విష్‌ చేస్తూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ’ అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షూ. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్స్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు. రెండ్రోజులుగా వరుస హింట్స్‌ రెండు రోజులుగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి హింట్స్‌ ఇస్తూనే వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని తొలుత అతడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ పెట్టిన మరో పోస్టు కూడా నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు ప్రశాంత్ వర్మ. https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1831604468355391886 ‘జై హనుమాన్‌’తో లింకప్‌! ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మోక్షజ్ఞ ఫస్ట్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ప్రస్తుతం 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్‌ వర్మ వివరించారు. ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా విడుదల చేస్తానని ఆయన (Prasanth Varma) స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి&nbsp; తొలుత హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ రిలీజ్‌ చేశారు. సెకండ్‌ ఫిల్మ్‌గా మోక్షజ్ఞ ఫిల్మ్‌ రాబోతోంది. ఈ విషయాన్ని ‘సింబా ఈజ్‌ బ్యాక్‌’ అనే పోస్టర్‌లో 'PVCU 2' ప్రాజెక్ట్‌ అంటూ ప్రశాంత్‌ వర్మనే స్పష్టం చేశారు. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో రానున్న ప్రతీ చిత్రానికి తన తర్వాతి ఫిల్మ్‌తో లింకప్‌ ఉంటుందని గతంలో ప్రశాంత్‌ వర్మనే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 'PVCU 2' ప్రాజెక్ట్‌ తర్వాత ‘జై హనుమాన్‌’ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ పట్టాలెక్కిించనున్నారు. దీంతో మోక్షజ్ఞ చిత్రానికి కచ్చితంగా 'జై హనుమాన్‌'తో కనెక్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ లింకప్‌ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ మామా ఏం ప్లాన్‌ చేశాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/theBuzZBasket/status/1831944240831852919 శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
    సెప్టెంబర్ 06 , 2024
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    అంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ - జనసేన - భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 'పవన్‌ అనే నేను'.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాహుబలి రేంజ్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్‌ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.&nbsp; https://twitter.com/i/status/1800799485137944671 చిరు.. ఆనంద బాష్పాలు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది.&nbsp; https://twitter.com/i/status/1800778127129595985 అపూర్వ కలయిక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్‌.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్‌ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్‌తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్‌ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్‌ వైరల్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1800806930975449376 అతిథుల కోలాహలం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్‌ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్‌చరణ్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్‌ హీరోలు నిఖిల్‌, నారా రోహిత్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.&nbsp; https://twitter.com/i/status/1800778957174051224 23 మందితో నూతన మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.
    జూన్ 12 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    #90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్‌ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి? 
    నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్‌ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు. ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈటీవి విన్‌ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ  వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని  ఓసారి విశ్లేషిద్దాం. చంద్రశేఖర్(శివాజీ):&nbsp; ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్‌. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.&nbsp; ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.&nbsp; https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20 రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది. https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20 ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు.&nbsp; సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి.&nbsp; ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20 ప్రశాంత్ &amp;దివ్య: పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది. https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20 https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
    జనవరి 16 , 2024

    @2021 KTree