రివ్యూస్
How was the movie?
తారాగణం
జోజు జార్జ్
ఆంటోనీ ఆంత్రాపర్కళ్యాణి ప్రియదర్శన్
ఆన్ మరియానైలా ఉష
మాయఆశా శరత్
జెస్సీ, ఆన్ తల్లిచెంబన్ వినోద్ జోస్
Fr. పాల్ కట్టకాయంవిజయరాఘవన్
అవరన్హరిప్రశాంత్ ఎం. జి.టార్జాన్
అప్పని శరత్
కీచేరి సైమన్బిను పప్పు
ఆంటోనీ తండ్రి చాకో ఆంత్రప్పర్సిజోయ్ వర్గీస్
కళాశాల ప్రిన్సిపాల్ జాన్ ఫెర్నాండెజ్జ్యువెల్ మేరీ
ప్రియంవధ / ప్రియసుధీర్ కరమణ
కందన్కేరి నారాయణన్అసిమ్ జమాల్
SI మార్టిన్కొట్టాయం రమేష్అడ్వా. మాధవన్
మోహన్ రామన్
అడ్వా. దండపాణిసిబ్బంది
జోషి
దర్శకుడుఐన్స్టిన్ జాక్ పాల్నిర్మాత
రాజేష్ వర్మరచయిత
జేక్స్ బిజోయ్
సంగీతకారుడుశ్యామ్ శశిధరన్ఎడిటర్ర్
కథనాలు
This Week OTT Movies: ఉగాది, రంజాన్ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
గీతాంజలి మళ్లీ వచ్చింది
అంజలి లీడ్ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
లవ్ గురు
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ చిత్రం.. ‘లవ్ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్ కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం.
డియర్
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘డియర్’ (Dear). తమిళంలో ఏప్రిల్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 12న రాబోతోంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.
బడేమియా ఛోటేమియా
బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
మైదాన్
భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్’ (Maidaan). బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో లీడ్ రోల్‌లో చేశాడు. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్ నిర్మాత. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
ఓం భీమ్ బుష్
ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్ బుష్’ (Om Bheem Bush). ఏప్రిల్ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గామి
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.
ప్రేమలు
మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్ కాబోతోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu AhaApril 09PremaluMovieTelugu AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
ఏప్రిల్ 08 , 2024
REVIEW: కోనసీమ థగ్స్
దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం.
చిత్రబృందం:
దర్శకత్వం: బృందా గోపాల్
సంగీతం: సామ్ CS
నటీనటులు: హ్రిదు హరూన్, అనస్వర రాజన్, బాబీ సింహా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి
కథ:
శేషు( హ్రిదు హరూన్) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?. దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ.
ఎలా ఉందంటే:
దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ చక్కగా సెట్ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.
సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.
నటీ,నటుల పెర్ఫార్మెన్స్
హ్రిదు హరూన్ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్ అనిపించుకున్నాడు. హీరోయిన్ అనస్వర రాజన్ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
బలాలు:
కథ,
సెకండాఫ్
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
బీజీఎం
బలహీనతలు
ఫస్టాఫ్
కథనం
సమీక్ష:
ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది.
రేటింగ్: 2.75
ఫిబ్రవరి 24 , 2023
Antony Thattil: కీర్తి సురేష్ పెళ్లాడే ఆంటోని తట్టిల్ ఎంత గొప్పోడో తెలుసా?
యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంటోనిగురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోని తట్టిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంటోని తట్టిల్ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేసే యంగ్ బిజినెస్ మ్యాన్‌గా ఆంటోని రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు.
తొలుత ‘ఎస్పిరోస్ విండో సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించారు. దానిని దుబాయ్‌కు విస్తరించి అక్కడ కేంద్రంగా పని చేస్తున్నారు.
ఆ తర్వాత కైపాలత్ హబీబ్ ఫారుఖీ అనే బిజినెస్ మెన్‌తో కలిసి మరో కంపెనీని చెన్నైలో రిజిస్టర్ చేశారు. వారితో పాటు మరో ముగ్గురు కంపెనీలో షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు.
ఈ రెండు కంపెనీలతో పాటు ఆంటోనీకి పలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి. హోమ్ టౌన్ కొచ్చిలో వాటి ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
ప్రముఖ నటి కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు.
కీర్తి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తుండగా ఆంటోని ఆమెతో రిలేషన్‌ను కొనసాగిస్తూనే చదువుపై ఫోకస్ పెట్టాడు.
మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని ఆంటోని (Antony Thattil) చిన్నప్పటి నుంచి కలలు కనేవారు. తన లక్ష్యానికి కీర్తితో ఉన్న రిలేషన్ అడ్డురాకుండా రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు.
ఫలితంగా అటు బిజినెస్, ఇటు లవ్ లైఫ్‌లోనూ సక్సెస్ అయ్యి ప్రస్తుత యువతకు ఆంటోని ఎంతో ప్రేరణగా నిలస్తున్నారు.
డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి (Keerthy Suresh Marriage) జరగనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. పెళ్లి పనులు కూడా మెుదలైనట్లు సమాచారం.
అంటోనీ (Antony Thattil)కి తమ కూతుర్ని ఇచ్చేందుకు కీర్తి తల్లిదండ్రులు సురేశ్, మేనక ఎంతో సంతృప్తిగా ఉన్నారట. వీరి పెళ్లికి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట.
ఇదిలా ఉంటే ఇటీవల తన పెళ్లి (Keerthy Suresh Marriage) గురించి కీర్తి సురేష్ స్పందించింది. పెళ్లి ఎప్పుడని ఆంగ్ల పత్రిక ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అంటూ బదులిచ్చింది.
గతేడాది కూడా అంటోనితో ఉన్న రిలేషన్ గురించి పరోక్షంగా కీర్తి హింట్ ఇచ్చింది. సరైన సమయం వచ్చిన మిస్టరీ మ్యాన్‌ను బయటపెడతానంటు చెప్పుకొచ్చింది.
2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేశ్. ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించి ఇంప్రెస్ చేసింది.
తెలుగులో చేసిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్ లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది.
ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
నవంబర్ 19 , 2024
Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్ ఉమెన్ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సుదీప్ వేద్, అనీష్ తదితరులు
రచన, దర్శకత్వం: అభిమన్యు
సంగీతం: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫీ: దీపక్
ఎడిటింగ్: విప్లవ్ నైషద్
స్ట్రీమింగ్ వేదిక: ఆహా
విడుదల తేదీ: 16-02-2024
ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.
కథ
అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్ ఛానెల్ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్-1లో బయటపడుతుంది. ఇక సెకండ్ పార్ట్ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్ కపూర్) రోల్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్ ఉమెన్ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధ ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్ పనితీరు
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 16 , 2024
This Week Movies: ఈ వారం వస్తోన్న మోస్ట్ వాంటెడ్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు (Tollywood Upcoming Movies), వెబ్‌సిరీస్‌లు (Upcoming Web Serieses) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఫిబ్రవరి 12 - 18 తేదీల మధ్య అవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భ్రమయుగం
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వారం ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజధాని ఫైల్స్
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ (Rajdhani Files) ఈ వారం థియేటర్లలోకి రాబోతుంది. అఖిలన్, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఊరు పేరు భైరవకోన
సందీప్‌కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
సైరెన్
జయం రవి (Jayam Ravi), కీర్తి సురేష్ (Keerthi Suresh) కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘సైరెన్’ (Siren Movie). ‘108’ అనేది ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసి క్రిమినల్‌గా మారిన ఓ వ్యక్తి కథ’ ఈ చిత్రం. కీర్తి ఇందులో పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు
నాసామి రంగ
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) ఒకటి. థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ది కేరళ స్టోరీ
గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మూవీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. 9 నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది.
TitleCategoryLanguagePlatformRelease DateSunderland 'Till I Die 3SeriesEnglishNetflixFeb 13Love Is Blind SeriesEnglishNetflixFeb 13PlayersMovieEnglishNetflixFeb 14Einstein and the BombMovieEnglishNetflixFeb 16Five Blind Dates SeriesEnglishAmazon PrimeFeb 13This is me.. NowMovieEnglishAmazon PrimeFeb 16Queen ElizabethMovieMalayalamZee5Feb 14The Kerala StoryMovieHindiZee5Feb 16TrackerSeriesEnglishDisney+HotStarFeb 12Saba NayaganMovie TamilDisney+HotStarFeb 14Abraham OzlerMovieMalayalamDisney+HotStarFeb 15SlaarMovieHindi Disney+HotStarFeb 16Raisinghani v/s RaisinghaniSeries Hindi Sony LIVFeb 12Vera Maari Love StoryMovieTamilAhaFeb 14
ఫిబ్రవరి 12 , 2024
Pindam Movie Review: హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భయపెట్టిన ‘పిండం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, బేబీ చైత్ర, బేబీ లీషా, విజయలక్ష్మి, శ్రీలత, రవివర్మ, తదితరులు
దర్శకుడు : సాయికిరణ్ దైదా
సంగీతం : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి
విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023
ఒకప్పుడు టాలీవుడ్‌లో హారర్ జానర్ చిత్రాలు ఎక్కువగా కనిపించేవి. ఇటీవల కాలంలో వాటి తాకిడి కాస్త తగ్గింది. అయితే ఆడపాదడపా ఈ జానర్‌ని స్పృశిస్తూ దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఈ కోవలో రూపొందిన చిత్రం ‘పిండం’ (Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్’ అనే ఉపశీర్షికతో సినిమా రూపుదిద్దుకుంది. ప్రచార చిత్రాలు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ(ఈశ్వరి రావు)ను తన రీసెర్చ్ కోసం లోక్ నాథ్ (శ్రీనివాస్ అవసరాల) ఇంటర్వ్యూ చేస్తాడు. ఆమె కెరీర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అందుకు బదులిస్తూ 1990 దశకంలో సుక్లాపేట్‌లోని ఓ కుటుంబానికి జరిగిన ఘటనను ఆమె చెప్పుకొస్తుంది. ఆంటోనీ (శ్రీరామ్).. గర్భవతి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, తమ ఇద్దరు పిల్లలతో ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? అంతకు ముందు ఆ ఇంట్లో ఏమన్నా జరిగిందా? దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయట పడింది? అన్నది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
శ్రీరామ్, ఖుషి రవి మధ్య తరగతి కుటుంబానికి చెందిన జంటగా ఇమిడిపోయారు. హారర్ సీన్లలో శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. ఖుషి రవి గర్భవతిగా, ఇద్దరు బిడ్డల తల్లిగా పాత్రకి తగ్గట్టుగా నటించింది. తాంత్రిక శక్తులున్న మహిళగా ఈశ్వరీరావు నటన మెప్పిస్తుంది. ఇద్దరు చిన్నారుల్లో తారగా నటించిన అమ్మాయి సైగలతో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. రవివర్మ తదితరులు పాత్రల ప్రాధాన్యం మేరకు నటించారు
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాయికిరణ్ దైదా కథనంపైన, కథలోని భావోద్వేగాలపైన ఇంకొంచెం దృష్టిపెట్టాల్సింది. అయితే ఆంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించే సన్నివేశాల్ని భయం కలిగించేలా తీయడంలో ఆయన సఫలమయ్యాడు. కానీ, అవే సీన్లు పదే పదే పునరావృతం కావడంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత ఉండదు. విరామంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కడుపులో పిండానికీ, బయటి ఆత్మకీ ముడిపెట్టడంలో పెద్దగా లాజిక్ కనిపించదు. ఓవరాల్‌గా సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. శబ్దాలతోనే భయపెట్టడంలో సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సక్సెస్ అయ్యాడు. విష్ణు నాయర్ కళా ప్రతిభ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు భయపెట్టే సన్నివేశాల్ని ఆయన బాగా డిజైన్ చేసుకున్నారు. నిర్మాణంపరంగా లోపాలేమీ లేవు.
ప్లస్ పాయింట్స్
హారర్ సన్నివేశాలునటీనటులుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5
డిసెంబర్ 15 , 2023
Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 - డిసెంబర్ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
యానిమల్
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్ రెడ్డి’ తీసిన సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉండటంతో ‘యానిమల్’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.
అథర్వ
కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాలింగ్ సహస్ర
జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీ రూపొందింది.
ఉపేంద్ర గాడి అడ్డా
ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్రమ్ రాథోడ్
విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
దూత
యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
డిసెంబర్ 11 , 2023
Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023
తమిళ స్టార్ నటుడు విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఫైట్స్‌లో విజయ్ తన మార్క్ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన స్టైల్‌ను అనుసరించాడు. సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్ మార్క్ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
పాటలుసాగదీత సీన్స్
చివరిగా : లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 19 , 2023
September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!
ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం.
స్కంద
యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రామ్ మాస్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. శ్రీలీల హీరోయిన్‍గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించాడు.
చంద్రముఖి 2
సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న మరొక సినిమా చంద్రముఖి 2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2005లో వచ్చిన బ్లాక్‌బాస్టర్ మూవీ చంద్రముఖికి ఇది సీక్వెల్. చంద్రముఖి 2 చిత్రాన్ని డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించగా.. MM కీరవాణి సంగీతం అందించారు.
మార్క్ ఆంటోనీ
తమిళ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పాన్‌ఇండియా రేంజ్‌లో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కింది.
మరోవైపు ఈ వారం ఓటీటీల్లో పెద్దసంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఏకంగా 25 సినిమాలు- వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. రామబాణం, భోళాశంకర్, అనీతి, బార్బీ, మాయపేటిక ఇంట్రెస్టింగ్ బజ్‌ను కలిగిస్తున్నాయి. మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు- వెబ్‌సిరీస్‌లను లిస్ట్‌వైజ్‌గా చూద్దాం.
TitleCategoryLanguagePlatformRelease DateJourney of Love 18+ MovieMalayalam Sony LivSeptember 15Dil Se MovieTeluguEtv winSeptember 16Wife Like movieEnglishNetflixSeptember 11Wrestlers seriesFrenchNetflixSeptember 13ErengardMovieDanishNetflixSeptember 14RambanamMovieTeluguNetflixSeptember 14Bhola Shankar) MovieteluguNetflixSeptember 15Love at First SightMovieEnglishNetflixSeptember 15Miss EducationSeriesEnglishNetflixSeptember 15Surviving Summer: Season 2 SeriesEnglishNetflixSeptember 15Kelsey September 12 MovieEnglish PrimeSeptember 12 The Kidnapping Day SeriesKorean PrimeSeptember 13Bombay Mary SeriesHindi primeSeptember 14A Million Miles Away MovieEnglish PrimeSeptember 15 Wilderness SeriesEnglishPrimeSeptember 15 Aneethi movieTelugu Dubbed Movie PrimeSeptember 15Mayapethika Movie TeluguPrimeSeptember 15Animals Up Close with Bertie Gregory SeriesEnglishHotstarSeptember 13 Elemental MovieEnglishHotstarSeptember 13 Han River Police SeriesEnglish HotstarSeptember 13 Welcome to the Wrexham Season 2(Documentary) English HotstarSeptember 13KaalaSeriesHindiHotstarSeptember 15Lang Place Movie EnglishHotstarSeptember 15 The Other Black Girl movieenglishHotstarSeptember 15 Barbie MovieEnglish Book My ShowSeptember 12 A Honeymoon to RemembermovieenglishBook My ShowSeptember 15Pappachan Olivilan MovieMalayalamSaina playSeptember 14
సెప్టెంబర్ 11 , 2023
Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్ ఫేమస్’ రచ్చ రచ్చ..!
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్ ఫేమస్’ను ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
విశ్వక్‌సేన్
‘దాస్ కా ధమ్కీ’ మూవీ హిట్‌తో విశ్వక్ సేన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వక్‌ను కలిసిన ‘మేమ్ ఫేమస్’ చిత్ర యూనిట్ ఆయన చేత వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయించింది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
తిరువీర్
హారర్ చిత్రం ‘మసూద’లో లీడ్ రోల్ చేసిన నటుడు తీరువీర్ కూడా ‘మేమ్ ఫేమస్’ ప్రమోషన్స్‌లో భాగమయ్యాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
రాహుల్ సిప్లిగంజ్
ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌ను కూడా చిత్ర యూనిట్ కలిసింది. ఊరమాస్ స్టెప్పులతో తమ మూవీని ప్రమోట్ చేయించుకుంది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
సింగర్ మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ధూమ్ ధామ్ డ్యాన్స్‌తో ‘మేమ్ ఫేమస్’ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అడివి శేష్
యంగ్ హీరో అడివి శేష్‌ను కూడా చిత్ర యూనిట్ వదల్లేదు. తమ డప్పులకు చిందేయించి మరి హీరోతో ప్రమోషన్ చేయించుకుంది.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
విజయ్ ఆంటోనీ
బిచ్చగాడు-2 సినిమా హీరో ‘విజయ్ ఆంటోనీ’ సైతం ఎంతో ఉత్సాహాంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
రానా దగ్గుబాటి
‘మేమ్ ఫేమస్’ యూనిట్‌తో కలిసి హీరో రానా కూడా రచ్చ రచ్చ చేశాడు. కిర్రాక్ స్టెప్పులతో అలరించాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
తరుణ్ భాస్కర్
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎంతో హుషారుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
సుహాస్
‘కలర్ ఫొటో’ సినిమా హీరో సుహాస్ చేసిన ప్రమోషన్స్ అన్నింటి కంటే హైలెట్ అని చెప్పొచ్చు. సినిమా ఫంక్షన్స్‌లో ఎంతో బిడియంగా కనిపించే సుహాస్ తన డ్యాన్స్‌తో ఇరగదీశాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అనిల్ రావిపూడి
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా మూవీ ప్రమోషన్స్‌లో తళుక్కుమన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
నవదీప్
హీరో నవదీప్ ఇటీవల ‘న్యూసెన్స్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో పాటు తెలివిగా తన వెబ్‌సిరీస్‌ను కూడా నవదీప్ ప్రమోట్ చేసుకున్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
హరీశ్ శంకర్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా మేమ్ ఫేమస్ చిత్ర ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
నాగచైతన్య
ఎప్పుడూ సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండే హీరో నాగచైతన్య కూడా దుమ్ములేపాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తనదైన శైలిలో కొత్త మూవీని ప్రమోట్ చేశాడు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట కూడా ‘మేమ్ ఫేమస్’ టీమ్ హల్‌చల్ చేసింది. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుఅరవింద్.. మే 26న థియేటర్స్‌లో కలుద్దాం అంటూ మూవీ బృందంతో అన్నారు.
View this post on Instagram A post shared by Sumanth Prabhas (@sumanth.prabhas)
మే 23 , 2023
Bichagadu 2 Review: సెంటిమెంట్ సీన్లు ఓకే.. సెకండాఫ్ కొంపముంచిందా?
నటీనటులు : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, హరీష్ పేరడి, జాన్ విజయ్
దర్శకత్వం & సంగీతం: విజయ్ ఆంటోని
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
సినిమా నిడివి: 2 గం. 28 నిమిషాలు
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో 0విజయ్ ఆంటోనికి ఆ సినిమా ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని బిచ్చగాడు-2 సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రానికి విజయ్ కథానాయకుడిగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం చేశాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. బిచ్చగాడు-2కు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, ఇవాళ (మే 19) బిచ్చగాడు 2 సినిమా రిలీజైంది. తొలిపార్ట్ లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? విజయ్‌కు మరో హిట్‌ను తెచ్చిపెట్టిందా? అసలు సినిమా కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా కథ
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) దేశంలో అత్యంత సంపన్నుడు. రూ.లక్ష కోట్లకి వారసుడు అయిన గురుమూర్తికి చాలా మంది శత్రువులు ఉంటారు. అయితే గురుమూర్తి అనుకోకుండా చనిపోతాడు. గురుమూర్తి పోలికలతో ఉన్న బిక్షగాడైన (సత్య)ను పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే సత్య సడెన్‌గా గురుమూర్తిగా ప్రవర్తించడం చేస్తుంటాడు. అతడిలా మాట్లాడటం, ఆలోచించడం చేస్తాడు. అసలు గురుమూర్తిని పోలిన వ్యక్తి ఎవరు? అతడు అతనిలా ప్రవర్తించడానికి కారణమేంటి? అసలు కోటీశ్వరుడైన గురుమూర్తి మరణానికి కారణమేంటి? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
హీరో విజయ్ అంటోని ఇందులో తన అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో తనదైన మార్క్‌ను చూపించి మెప్పించాడు. అయితే క్లైమాక్స్‌లో వచ్చే సెంటిమెంట్ సీన్‌లో మాత్రం విజయ్ నటన తేలిపోయిందని చెప్పొచ్చు. ఇది సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపింది. హీరోయిన్ కావ్య థాపర్‌కు సినిమాలో పెద్ద స్కోప్ లేకపోయిన తన పరిధిమేరకు నటించి ఆకట్టుకుంది. ఆడియన్స్‌ను తన అందచందాలతో అలరించే ప్రయత్నం చేసింది. తెరపై కావ్య ఎంతో గ్లామర్‌గా కనిపించింది. ఇక ఇతర నటీనటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడిగా విజయ్ అంటోని రొటిన్ కథనే బిచ్చగాడు 2 కోసం ఎంచుకున్నాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిగా ఏమంత కొత్తదనంగా అనిపించదు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ తేలిపోయిందని చెప్పొచ్చు. సాగదీత సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. విజయ్ ఆంటోని స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కాస్త గాడితప్పినట్లు కనిపిస్తుంది. సినిమా ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నాడో విజయ్ సమర్థవంతంగా కన్‌వే చేయలేకపోయాడు. ఇక సినిమాలో ఫస్ట్ ఆఫ్ మాత్రమే బాగుంది. సెకండాఫ్ మాత్రం కాస్త ట్రాక్ తప్పింది. విజయ్ ఆంటోనీ ఎలివేషన్ సీన్స్ మరీ అతిగా అనిపిస్తాయి. ఇక తెలుగు డబ్బింగ్ కూడా సింక్ అయినట్లు అనిపించదు.
సాంకేతికంగా..
బిచ్చగాడు 2 సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సాంగ్స్ ఆకట్టుకునేలా లేవు.
పాజిటివ్ పాయింట్స్
విజయ్ నటనతొలి భాగంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
నెగిటివ్ పాయింట్స్
సాగదీత సీన్లుహీరో ఎలివేషన్ సీన్స్‌స్క్రీన్ ప్లేడబ్బింగ్
రేటింగ్ 2.25/5
మే 19 , 2023
UPCOMING MOVIES: మూవీ లవర్స్‌కి సమ్మర్ ట్రీట్.. ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలుసా?
కస్టడీ (మే 12)
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా చేసిన సినిమా ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్ చేశారు
భువన విజయం (మే 12)
భువన విజయంలో సునీల్ లీడ్ రోల్‌లో చేశారు. యలమంద చరణ్ దర్శకత్వం వహించారు.
కథ వెనుక కథ (మే 12)
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘కథ వెనుక కథ’ను తెరకెక్కించారు. సునీల్, విశ్వంత్ లీడ్ రోల్స్ చేశారు
మ్యూజిక్ స్కూల్ (మే 12)
ఈ సినిమాలో శ్రియ శరణ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు
ఛత్రపతి (మే 12)
ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. V.V వినాయక్ డైరక్టర్
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (మే 12)
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నిహాల్, దృషికా జంటగా నటించారు.
ఫర్హానా (మే 12)
ఐశ్వర్య రాజేశ్ కీ రోల్‌లో డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించిన చిత్రం ‘ఫర్హానా’.
అన్నీ మంచి శకునములే (మే 18)
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం.
సామజవరగమన (మే 18)
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందింది. రెబా మోనికా కథానాయిక
బిచ్చగాడు 2 (మే 19)
ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య తాపర్ జంటగా చేశారు. బిచ్చగాడు మూవీకి సీక్వెల్ ఇది.
మళ్ళీ పెళ్లి (మే 26)
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా చేసిన చిత్రం మళ్ళీ పెళ్లి. MS రాజు దర్శకత్వం వహించారు.
టక్కర్ (మే 26)
సిదార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా చేసిన చిత్రం ‘టక్కర్'. కార్తీక్.జి.క్రిష్ దర్శకత్వం వహించారు.
మేమ్ ఫేమస్ (మే 26)
మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ప్రభాస్ డైరెక్షన్ చేశారు.
అహింస (జూన్ 02)
రాణా బ్రదర్ అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోయిన్‌గా గీతిక చేసింది.
విమానం (జూన్ 02)
సముద్రఖని నటించిన ద్విభాషా చిత్రం ‘విమానం’. అనసూయ కీలక పాత్ర పోషించింది.
ఆదిపురుష్ (జూన్ 16)
రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ డైరెక్షన్ చేశాడు.
స్పై (జూన్ 29)
హీరో నిఖిల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఎడిటర్ ‘గ్యారీ. BH డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
మే 11 , 2023
ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
తల్లి కాబోతుంది
గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్ న్యూస్ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
ఇలియానా జీవితం
కెరీర్ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం.
ఆమె సోదరుడితో డేటింగ్
ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.
తండ్రి ఎవరు?
ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
పరిచయం చేస్తుందా?
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
టాప్ హీరోయిన్
దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
ఏప్రిల్ 18 , 2023
IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు!
సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27నుంచి 29 మధ్య మూడురోజుల పాటు జరగనున్న ఈవెంట్‌లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ హాజరై సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఈ ఇద్దరు అగ్రహీరోలు ఒకే వేదికపై అవార్డులు తీసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్‌కు మరో గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఈ ఏడాది వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నుంచి పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ -2024 వేడుకల్లో మరో అవార్డును సొంతం చేసుకున్నారు. అవుడ్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును కైవసం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ జావేద్ అక్తర్ చేతుల మీదగా మెగాస్టార్ ఈ అవార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/PulagamOfficial/status/1839749384667316719
https://twitter.com/PROSaiSatish/status/1839938794956439677
https://twitter.com/PraveeGv/status/1839930181143703686
బాలకృష్ణకు సైతం..
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ల నటన జీవితం పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించి టాలీవుడ్‌లో పెద్ద ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఐఫా - 2024 వేడుకల్లో బాలయ్యను అవార్డుతో నిర్వాహకులు గౌరవిచంారు. ప్రతిష్టాత్మక గోల్డెన్ లెగసీ అవార్డ్‌ను బాలకృష్ణకు అందజేశారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందచేశారు. అవార్డు ఇవ్వడానికి ముందు బాలయ్య కాళ్లకు కరణ్ జోహర్ నమస్కారం చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ వీటిని తెగ ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/SureshPRO_/status/1839855063390454090
ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ
అబుదాబిలో జరుగుతున్న ఐఫా వేడుకలకు టాలీవుడ్ నుంచి దిగ్గజ నటుడు వెంకటేష్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గుర్ని ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో ఈవెంట్లో ఒక్కసారిగా సందడి వచ్చింది. ఒకే వేదికపై ఈ ముగ్గురు స్టార్ హీరోలను చూసి అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేదికపైన బాలయ్య, చిరు, వెంకీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవికి అవుడ్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంతో ఆ అవార్డుని పట్టుకొని వెంకటేష్, బాలకృష్ణలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫొటోల్లో నాగార్జున కూడా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/TeluguCinema7/status/1839748107602444312
ఐఫా - 2024 అవార్డు విజేతలు..
ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- చిరంజీవి ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్ ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంత గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్ ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా ఉత్తమ నటుడు (తెలుగు)- నాని ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ) ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర) ఉత్తమ విలన్ (కన్నడ) - జగపతి బాబు ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉత్తమ సాహిత్యం - జైలర్ (హుకుం) ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ నేపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2) ఉత్తమ విలన్ (మలయాళం) - అర్జున్ రాధాకృష్ణన్
సెప్టెంబర్ 28 , 2024
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్ డేస్ తిరిగి వచ్చినట్లేనా?
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
గౌరి ప్రియ (Gouri Priya)
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్ పక్కన ‘లవర్’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
https://www.youtube.com/watch?v=8dwrE0OCq40
ఆనందిని (Anandhi)
వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్ హీరోగా చేసింది.
చాందిని చౌదరి (Chandini Chowdary)
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్ సేన్ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.
https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI
దివ్య శ్రీపాద (Divya Sripada)
టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్ కామ్రేడ్’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala)
ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్ రాఘవ్ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్, మేజర్, పొన్నిసెల్వన్ వంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.
రితు వర్మ (Ritu Varma)
హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్ షా' (Badshah) సినిమాలో కాజల్ ఫ్రెండ్ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.
https://www.youtube.com/watch?v=4hNEsshEeN8
స్వాతి రెడ్డి (Swathi Reddy)
వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా, గోల్కొండ స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్ ఆఫ్ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.
https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE
డింపుల్ హయాతి (Dimple Hayathi)
ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606
శివాని నగరం (Shivani Nagaram)
ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి.
మానస చౌదరి (Maanasa Choudhary)
ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.
https://twitter.com/i/status/1762802318934950146
అంజలి (Anjali)
తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, సరైనోడు, వకీల్‌సాబ్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.
https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
మార్చి 06 , 2024
Buddy Movie Review: అల్లు శిరీష్ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?
నటీనటులు : అల్లు శిరిష్, గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్, అజ్మల్ అమీర్, శ్రీరామ్ రెడ్డి, మహమ్మద్ అలీ, ముకేష్ కుమార్ తదితరులు
డైరెక్టర్ : సామ్ ఆంటోన్
సంగీతం : హిప్‌హాప్ తమీజా
సినిమాటోగ్రఫీ : క్రిష్ణన్ వసంత్
ఎడిటర్ : రూబెన్
నిర్మాత : కే.ఈ. జ్ఞానవేల్ రాజా
విడుదల తేదీ : ఆగస్టు 2, 2024
మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish) చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'బడ్డీ' (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj), ప్రిషా సింగ్ (Prisha Singh) హీరోయిన్లుగా చేశారు. శామ్ ఆంటోన్ (Sam Antone) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అడ్వెంచర్, యాక్షన్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లు శిరీష్‌కు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఆదిత్య రామ్ (అల్లు శిరిష్) పైలెట్‌గా చేస్తుంటాడు. వైజాగ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్) అతడ్ని ప్రేమిస్తుంది. ఆదిత్య కూడా చూడకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. పల్లవి మెడికల్ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్ అవుతుంది. కోమాలోకి వెళ్తుంది. ఆ స్థితిలో ఆమె ఆత్మ ఒకప్పుడు ఆదిత్య గిఫ్ట్‌గా ఇచ్చిన టెడ్డీలోకి వెళ్తుంది. అలా ఆమె ఆత్మ టెడ్డీ ద్వారా ఆదిత్యను ఎలా కలిసింది? విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది? ఇందుకు ఆదిత్య, టెడ్డీ చేసిన పోరాటం ఏంటి? అసలు పల్లవి బాడీని విలన్ గ్యాంగ్ ఏం చేయాలని అనుకుంది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ అద్భుత నటన కనబరిచాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. నటుడిగా ఈ సినిమాలో గొప్ప పరిణితిని సాధించాడు. అటు గాయత్రి భరద్వాజ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. స్క్రీన్‌పై కనిపించినంత సేపు ఆడియన్స్‌ను కనువింద్ చేసింది. విలన్‌గా అజ్మల్ అమీర్ ఆకట్టుకున్నాడు. అల్లు శిరీష్‌ను ఢీకొట్టే పాత్రలో అతడి నటన మెప్పిస్తుంది. సెకండ్ హీరోయిన్ ప్రిషా సింగ్ ఎయిర్ హోస్టెస్‌గా అలరించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు శామ్ ఆంటోన్ విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అల్లు శిరిష్, గాయత్రి భరద్వాజ్ మధ్య లవ్ ట్రాక్‌ను చాలా అందంగా తెరకెక్కించారు. దూరంగా ఉంటూనే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. మూవీ మధ్యలో వచ్చే ‘కల్కి’, ‘జై బాలయ్య స్లోగన్స్’ ఆడియన్స్‌లో జోష్‌ను తీసుకొచ్చాయి. బడ్డీతో కలిసి అల్లు శిరీష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ మెప్పిస్తాయి. అయితే తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని రగిలించడంతో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ముందే ప్రిడిక్ట్ చేసేలా సన్నివేశాలు ఉన్నాయి. అక్కడక్కడ వచ్చే అసందర్బమైన కామెడీ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. కీలకమైన క్లైమాక్స్‌లో అనవసరంగా హాస్యాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాలను పరిశీలిస్తే హిప్‌హాప్ తమీజా అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సాంగ్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. క్రిష్ణన్ వసంత్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటర్ రూబెన్ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ కూడా బెటర్ ఔట్‌పుట్ ఇచ్చుంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్
అల్లు శిరీష్ నటనలవ్ ట్రాక్‌బడ్డీతో చేసే యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
స్క్రీన్‌ప్లేకొరవడిన క్యూరియాసిటీ కొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 02 , 2024
Mirnalini Ravi: ‘లవ్ గురు’ ఫేమ్ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ మృణాళిని రవి (Mirnalini Ravi).. తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్ గురు' ఏప్రిల్ 11న తెలుగులో విడుదల కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని ఇందులో హీరోగా చేశాడు. కాగా, ఇటీవల ట్రైలర్‌లో మృణాళిని నటన అందర్నీ ఫిదా చేసింది. ముఖ్యంగా శోభనం గదిలో భర్త విజయ్ ఆంటోనికి గ్లాసులో మందు పోసే సీన్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ తెగ వెతుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
మృణాళిని రవి ఎక్కడ పుట్టింది?
తమిళనాడులోని పాండిచ్చేరిలో మృణాళిని జన్మించింది.
మృణాళిని రవి పుట్టిన తేదీ ఏది?
10 మే, 1995
మృణాళిని రవి విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
బెంగళూరు
మృణాళిని రవి.. ఏ స్కూల్‌లో చదువుకుంది?
లేక్ మౌంట్‌ఫోర్ట్ స్కూల్, బెంగళూరు
మృణాళిని రవి ఏం చదువుకుంది?
బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మృణాళిని బీటెక్ చేసింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.
మృణాళిని రవి తల్లిదండ్రులు ఎవరు?
తండ్రి పేరు విశాల్ రవి, తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు.
మృణాళిని రవి వయసు ఎంత?
29 సంవత్సరాలు (2024)
మృణాళిని రవి బరువు ఎంత?
60 కేజీలు
మృణాళిని రవి ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
మృణాళిని రవి ఎలా ఫేమస్ అయ్యింది?
టిక్ టాక్, డబ్‌స్మాష్‌లో రీల్స్ చేసి మృణాళిని అందరి దృష్టిని ఆకర్షించింది.
మృణాళిని రవి తొలి చిత్రం?
2019లో వచ్చిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'.. మృణాళిని చేసిన మెుట్ట మెుదటి చిత్రం. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా సోషల్ మీడియాలో ఈ భామ వీడియోలు చూసి అవకాశం ఇచ్చారు.
మృణాళిని రవి తొలి తెలుగు చిత్రం?
గద్దల కొండ గణేష్
మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు?
గద్దల కొండ గణేష్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తమిళ చిత్రాలు?
‘సూపర్ డీలక్స్’, ‘ఛాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జంగో’, ‘కోబ్రా’..
మృణాళిని రవి హాబీస్?
ట్రావెలింగ్, రీడింగ్, సింగింగ్
మృణాళిని రవికి పెళ్లైందా?
కాలేదు
మృణాళిని రవి నాన్-వెజ్ వంటకాలు తింటుందా?
ఆమెకు నాన్ వెజ్ ఐటెమ్స్‌ను ఆమె ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుందట.
మృణాళిని రవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు?
ఫేవరేట్ హీరో, హీరోయిన్ల గురించి మృణాళిని ఎక్కడా రివీల్ చేయలేదు.
మృణాళిని రవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్?
https://www.instagram.com/mirnaliniravi/
ఏప్రిల్ 10 , 2024
Rudrudu Review: రుద్రుడిగా లారెన్స్ రివేంజ్ తీర్చుకున్నాడా.. సినిమా ఎలా ఉందంటే?
నటినటులు: రాఘవ లారెన్స్, ప్రియా భవాని, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్
దర్శకత్వం: కదిరేసన్
సినిమాటోగ్రఫీ: R.D. రాజశేఖర్
సంగీతం: G.V. ప్రకాష్
ఎడిటర్ : ఆంటోని
నేపథ్య సంగీతం: శామ్ C.S
రాఘవ లారెన్స్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత డైరెక్టర్‌గా మారి పలు హిట్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూప్రేక్షకులను అలరిస్తున్నాడు. లారెన్స్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ అందుకున్నాయి. దీంతో లారెన్స్ మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రుద్రుడు సినిమా ఇవాళ (ఏప్రిల్ 14) రిలీజ్ అయింది. మరి ఈ సినిమా విజయం సాధించిందా? లారెన్స్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? అసలు సినిమా కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
రుద్రుడు (లారెన్స్), అనన్య (ప్రియా భవానీ శంకర్) భార్య భర్తలు. ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే రుద్రుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఆనందంగా సాగిపోతున్న రుద్రుడు జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంటుంది. ఎంతగానో ప్రేమించిన భార్యను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేస్తారు. దీంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. తన భార్యను హతమార్చిన వారిని వదిలిపెట్టకూడదని రుద్రుడు నిర్ణయించుకుంటాడు. వారిని ఎలాగైన పట్టుకొని చంపేయాలని వేట మెుదలెడతాడు. అసలు అనన్యను ఎందుకు చంపారు? దుండుగల వెనక ఎవరు ఉన్నారు? విలన్లపై రుద్రుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు? అనేది అసలు కథ.
ఎవరెలా చేశారంటే:
రుద్రుడు పాత్రలో రాఘవ లారెన్స్ చాలా బాగా నటించాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లలో తనదైన నటనతో లారెన్స్ మెప్పిస్తాడు. ఇక డ్యాన్సుల్లో లారెన్స్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. ప్రతీకారంతో రగిలిపోయే వ్యక్తిగా లారెన్స్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీన్స్‌లో లారెన్స్ పర్‌ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అటు ప్రియా భవాని నటన కూడా పర్వేలేదనిపిస్తుంది. ఉన్న కొద్దిసేపైన లారెన్స్‌తో పోటీ పడి మరీ ఆమె నటించింది. ఇక విలన్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి పాత్రకు ప్రాణం పోశాడు.
టెక్నికల్‌గా
డైరెక్టర్ కదిరేసన్ ఒక రొటిన్ స్టోరీతో సినిమాను తెరకెక్కించాడు. నటీనటులు ఎంత బాగా చేసినప్పటికీ సినిమాను ఎప్పుడో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. హీరో, హీరోయిన్ లవ్ సీన్స్, పెళ్లి చేసుకోవడం అంతా బాగుందనుకునే లోపే ప్రియా భవానీ హత్య జరగడం పెద్ద సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కానీ, ఆ తర్వాత హీరో రీవెంజ్ తీర్చుకునే సన్నివేశాలన్నీ పేలవంగా అనిపిస్తాయి. ఇకపోతే సినిమాటోగ్రఫీ బాగుంది. G.V ప్రకాష్ సంగీతం ఆకట్టుకోలేదు. పాటల్లో ఒకటిమాత్రమే వినసొంపుగా ఉంది. అయితే శామ్ C.S ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
లారెన్స్ నటననేపథ్య సంగీతంపతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసంగీతం
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్!
కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గాయత్రి భరద్వాజ్ - ప్రిషా రాజేశ్ సింగ్
అల్లు శిరీష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు.
మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్ తరణ్ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
తన్వీ ఆకాంక్ష - సీరత్ కపూర్
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్ భాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్ కపూర్ గతంలో రన్ రాజా రన్, టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది.
మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky). రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్ లవ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్ కేస్’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్ సైతం జెర్సీ, సైంధవ్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.
తమన్నా - రాశి ఖన్నా
అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
తమన్నా - కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
జూలై 31 , 2024