• TFIDB EN
  • అప్పుల అప్పారావు
    UTelugu2h 20m
    అప్పులు చేసి జీవనం సాగించే అప్పారావు, సుబ్బలక్ష్మి ప్రేమలో పడుతాడు. అయితే, ఒక జ్యోతిష్యుడు సుబ్బ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోతుందని చెప్పడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాజేంద్ర ప్రసాద్
    అప్పుల అప్పారావు
    శోభన
    సుబ్బలక్ష్మి
    సింధూజబంగారి
    బ్రహ్మానందం
    శాస్త్రి
    బాబూ మోహన్
    నాదెండ్ల అంజయ్య
    అలీ
    లాటరీ టిక్కెట్టుదారు
    తనికెళ్ల భరణి
    చిలిపి దొంగ
    మల్లికార్జునరావు
    తాతా రావు
    జెవి సోమయాజులు
    ఈశ్వర శాస్త్రి
    సుతి వేలు
    బ్రహ్మాజీ
    ఐరన్‌లెగ్ శాస్త్రి
    ఐరన్ లెగ్ శాస్త్రి
    పొట్టి ప్రసాద్
    చిడతల అప్పారావుజ్యోతి చిత్ర
    అన్నపూర్ణ
    మంగతాయారు
    రమాప్రభ
    అమ్మాజీ
    జయలలిత
    టాటారావు భార్య
    చంద్రికసావిత్రి
    లతశ్రీచిట్టి
    శివ పార్వతి
    సిబ్బంది
    ఈవీవీ సత్యనారాయణ
    దర్శకుడు
    జి. ఆనంద్ బాబునిర్మాత
    బి. సురేష్నిర్మాత
    రమాప్రభ
    నిర్మాత
    రాజన్-నాగేంద్రసంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌!</strong>
    Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
    ప్రస్తుతం యావత్‌ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్‌ పరంగా పుష్పరాజ్‌ సృష్టిస్తున్న రికార్డ్స్‌ చూసి సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్‌ నడుస్తున్న సమయంలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్‌ కామెంట్స్‌ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్‌ యాక్టర్‌ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  హరికథ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ హరికథ వెబ్‌ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్‌ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్‌ బృందమంతా పాల్గొంది.  రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్‌ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్‌ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.&nbsp; https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM ‘రూ.1000 టికెట్‌ పెట్టి వెళ్లక్కర్లా’ ‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్‌ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా ఒక్కో టికెట్‌ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546 తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్‌.. ‘హరికథ’ సిరీస్‌ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్‌ చేశారు. ఈ సిరీస్‌ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.&nbsp; https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
    డిసెంబర్ 09 , 2024
    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో
    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. https://twitter.com/Theteluguone/status/1842470053838524558 రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గాయత్రి అంటే ఎంత ఇష్టమో పలు వేదికలపై చర్చించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకుందని ఆమెతో కొన్నేళ్లు మాట్లాడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒక తల్లిలేని వాడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు అని తెలిపారు. తనలో తన చనిపోయిన అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తన బిడ్డ రెండో తల్లి లాంటిది అని చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తను ఏడవలేదని కానీ తన కూతురుకు ఏమైన అయితే మాత్రం తట్టుకోలేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. https://twitter.com/Marx2PointO/status/1842423836060406267 సినీలోకం సంతాప సందేశం ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం ఎంతో విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - ఏపీ మంత్రి లోకేశ్‌ ‘‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తెలిసి మనసు తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పుత్రికను కోల్పోవడం ఎంతటి పెద్ద విషాదమో, ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ - ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ‘‘కుమార్తెలో అమ్మను చూసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి పుత్రిక వియోగం కావడం నిజంగా అంతులేని బాధ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ధైర్యంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ - సాయి ధరమ్ తేజ్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాయత్రి మరణం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ - జూ.ఎన్టీఆర్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా గాఢ సానుభూతి. ఈ కష్టాన్ని వారికి ఎప్పటికీ తలచుకునే విషాదం. దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ - వరుణ్ తేజ్‌ ‘‘గాయత్రి మరణం నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో రాజేంద్రప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి’’ - నవదీప్‌ ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా సానుభూతి. వారి బాధకు మాటలు సరిపోవు. చాలా బాధగా ఉంది’’ - కీర్తి సురేశ్‌ ‘‘నా సోదరుడు రాజేంద్రప్రసాద్ గారికి సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబం ఈ విపత్కర సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను’’ - నరేశ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. 'అహ నా పెళ్లంట', లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, 'ఆ నలుగుగురు' చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు.
    అక్టోబర్ 05 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024
    <strong>Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?</strong>
    Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?
    సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024 ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం. కథ భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. సినిమా ఎలా ఉందంటే? చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి. భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది. ఎవరెలా చేశారంటే? భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది.&nbsp; వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు. బలాలు బలమైన కథ దుల్కర్ సల్మాన్ నటన నేపథ్య సంగీతం, ట్విస్టులు బలహీనతలు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చివరగా ‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి. రేటింగ్: 4/5
    నవంబర్ 01 , 2024
    <strong>OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?</strong>
    OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions) అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. మట్కా (Matka) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్‌ ఏంటి?’ అన్నది స్టోరీ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ&nbsp; భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ. జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్‌ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ. మందిర (Mandira) సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్‌. యువన్‌ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్‌ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చింది. నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్‌ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ. కంగువా (Kanguva) తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. క (Ka) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ. వికటకవి (Vikkatakavi) యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్‌)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.&nbsp; ‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్‌ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్‌ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్‌ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
    డిసెంబర్ 05 , 2024
    సమాజాన్ని తట్టి లేపే టాప్-5 తెలుగు చిత్రాలు (part-1)
    సమాజాన్ని తట్టి లేపే టాప్-5 తెలుగు చిత్రాలు (part-1)
    ]రఘురామయ్య సంపాదించిన దాంట్లో సగం పేదలకే పంచుతాడు. ఆయన అవినీతి వ్యతిరేకి. ఇది తన కుటుంబసభ్యులకు నచ్చదు. చివరకు ఆయన కూడా &nbsp;బ్యాంకుల్లో అప్పులు చేసి.. ఆత్మహత్యకు పాల్పడతాడు. మనిషి చనిపోయాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడంలో దర్శకుడి పనితీరును మెచ్చుకోవాల్సిందే.
    ఫిబ్రవరి 14 , 2023
    <strong>Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్‌ సుందరం, శశాంక్‌, సాయి చంద్‌, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు దర్శకత్వం : అభిలాష్ కంకర సంగీతం : జై కృష్ణ సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి ఎడిటింగ్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత : సునీల బలుసు విడుదల తేదీ: 11-10-2024 సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్‌ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్‌ బాబుకు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి ప్రకాష్‌ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్‌ బాబు)ని స్టాక్‌ బ్రోకర్‌ శ్రీనివాస్‌ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్‌ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్‌ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్‌ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌ సుధీర్‌ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్‌ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్‌ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్‌ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్‌ కంకర ఎమోషనల్‌ టచ్‌ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్‌ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ మెుత్తం సుధీర్‌ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్‌ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్‌ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్లో న్యారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5 
    అక్టోబర్ 10 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    <strong>Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!</strong>
    Peka Medalu Movie Review: ‘పేక మేడలు’.. ఇది గుండెకు హత్తుకునే మిడిల్‌ క్లాస్ ఎమోషన్స్‌!
    నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు. దర్శకత్వం: నీలగిరి మామిళ్ల సంగీతం: స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కె. ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ నిర్మాత: రాకేష్ వర్రే నిర్మాణ సంస్థ: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ విడుదల తేది: జులై 19, 2024 హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటించిన చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu Movie Review). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? కథేంటి లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష క్రిష్ణ) దంపతులు. మూసీ నది ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్‌ ఇంజనీరింగ్‌ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదించాలని గాల్లో మేడలు కడుతుంటాడు. మరోవైపు భార్య వరలక్ష్మీ కుటుంబ భారం మెుత్తం తానే మోస్తుంటుంది. ఈ క్రమంలో అమెరికా నుంచి రియల్‌ ఎస్టేట్‌ కోసం వచ్చిన శ్వేతా (రితికా శ్రీనివాస్‌)తో లక్ష్మణ్‌కు పరిచయమవుతుంది. శ్వేతను ట్రాప్‌ చేసేందుకు తాను డబ్బున్న వ్యక్తినని లక్ష్మణ్‌ కటింగ్ ఇస్తాడు. భార్య పేరు వాడుకొని బస్తీ మెుత్తం అప్పులు చేస్తాడు. ఆ విషయం తెలిసి వరలక్ష్మీ ఏం చేసింది? లక్ష్మణ్‌కు శ్వేత భర్త ఎలా గుణపాఠం చెప్పాడు? పేక మేడలు లాంటి హీరో కలలు నిజమయ్యాయా? లేదా? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే తమిళ నటుడు వినోద్‌ కిషన్‌ తెలుగులో నేరుగా చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ఇదే. లక్ష్మణ్‌ పాత్రలో అతడు చక్కగా ఒదిగిపోయాడు. గాల్లో మేడలు కడుతూ కాలక్షేపం చేసే భర్త పాత్రలో అద్భుతన నటన కనబరిచాడు. మరోవైపు కుటుంబ భారం మోసే మిడిల్‌ క్లాస్‌ వైఫ్‌ పాత్రలో అనూష క్రిష్ణ ఒదిగిపోయింది. వరలక్ష్మీ పాత్రలో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఎన్నారై లేడీగా రితికా శ్రీనివాస్ కూడా మంచి నటన కనబరిచింది. సినిమా మెుత్తం ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. ఇతర క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే హైదరాబాద్‌ బస్తీలో ఉండే నిరుపేదల జీవితాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు నీలగిరి మామిళ్ల కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలు కూడా అలాగే ఉంటుందనే సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చారు. బస్తీల్లో ఉండే పరిస్థితులు అక్కడి పిల్లలను ఎలా తప్పుదోవ పట్టిస్తాయో చూపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే దానికి ఫన్‌ టచ్‌ ఇచ్చారు డైరెక్టర్‌. అంతేకాదు మహిళ సాధికారతను సైతం చూపించే ప్రయత్నం చేశారు. జీవితంలో కష్టపడందే ఏది సాధ్యం కాదన్న సందేశాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఇచ్చాడు. ఫస్టాఫ్‌ మెుత్తం చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌ మాత్రం కొంచెం సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్‌ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, రొటిన్‌ స్టోరీ, కొన్ని సన్నివేశాలు గతంలోనే చూసిన భావనను కలిగించడం వంటివి మూవీకి మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయాలకు వస్తే సంగీతం బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమానే అయినా చాలా రిచ్‌గా నిర్మించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనకథనం, స్క్రీన్‌ప్లేసందేశం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్‌ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
    సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్‌ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్‌ ఆ హీరో పాత్రలను ఓన్‌ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్‌ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ (Aadavari Matalaku Arthale Verule)&nbsp; సినిమాలో హీరో వెంకటేష్‌ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్‌ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్‌ క్లాస్‌ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.&nbsp; రఘువరన్‌ బీటెక్‌ ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్‌ (ధనుష్‌) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.&nbsp; తమ్ముడు ఈ (Thammudu) సినిమాలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్‌ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్‌ కోర్టులో బుద్ది చెప్తాడు.&nbsp; అలా వైకుంఠపురంలో ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్‌ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని&nbsp; భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్‌ క్లాస్‌ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు. గ్యాంగ్‌ లీడర్‌ గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.  అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్‌ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్‌ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.  అ ఆ ఇందులో (A Aa) నితిన్‌ (Nithin) పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్‌ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.&nbsp; జెర్సీ (Jersey) క్రికెటర్‌ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్‌ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.&nbsp; నేనింతే&nbsp; ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.&nbsp; యోగి ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్‌ క్లాస్‌ యువతకు చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది. 
    మార్చి 01 , 2024
    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!
    Sarath Babu: శరత్‌ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్‌-10 చిత్రాలు ఇవే..!
    టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్‌బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్‌-10 చిత్రాలు మీకోసం.. 1. సీతాకోక చిలుక 1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్‌ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్‌ కరుణకు అన్నగా శరత్‌ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్‌బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది. https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0 2. అన్వేషణ 1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్‌ అనే ఫారెస్టు రేంజ్‌ అధికారి పాత్రను శరత్‌ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్‌ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 3. సితార 1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్‌ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్‌కు అన్నగా శరత్‌ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్‌బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.&nbsp; https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc 4. సంసారం చదరంగం ‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్‌బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్‌ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్‌ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్‌ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=esucI1zKcM4 5. సాగర సంగమం కె. విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్‌ హసన్‌ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో&nbsp; రఘుపతి పాత్ర పోషించిన శరత్‌బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్‌కు స్నేహితుడిగా ఇందులో శరత్‌బాబు నటించారు.&nbsp; https://www.youtube.com/watch?v=CtBi8524GAc 6. స్వాతి ముత్యం కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్‌బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి. 7. ముత్తు రజనీకాంత్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్‌తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.&nbsp; https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk 8. అన్నయ్య చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్‌బాబు విలన్‌ పాత్ర పోషించారు.&nbsp; సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్‌బాబు మంచి నటన కనబరిచాడు.&nbsp; https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg 9. మగధీర రామ్‌చరణ్‌ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్‌ కుమార్‌ నటించారు. కాజల్‌కు తండ్రిగా, విక్రమ్‌ సింగ్ మహారాజ్‌గా మెప్పించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw 10. వకీల్‌సాబ్‌ పవన్‌ కల్యాణ్‌ రీసెంట్ మూవీ వకీల్‌సాబ్‌ సినిమాలోనూ శరత్‌కుమార్‌ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నటించారు. పవన్‌ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్‌ బాబు చెప్పిన డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.&nbsp;
    మే 22 , 2023
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.&nbsp; తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు తదితరులు దర్శకత్వం: వేణు ఎల్దండి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc కథ: ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు.&nbsp; సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ. ఎలా ఉంది:&nbsp; చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.&nbsp; నటీ నటులు: సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్‌ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. సాంకేతిక పనితీరు: దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్‌ క్యాస్ట్‌ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్‌ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.&nbsp; బలాలు కథ కథా నేపథ్యం భావోద్వేగాలు కామెడీ పాటల్లో సాహిత్యం బలహీనతలు కొన్ని చోట్ల సాగదీత సీన్లు స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం ఒక్కమాటలో చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్‌ కాకూడని సినిమా. రేటింగ్‌ 3/5
    మార్చి 03 , 2023
    Shivathmika Rajashekar: అప్పుడు క్యూట్.. ఇప్పుడు హాట్.. అందాలతో అరాచకం
    Shivathmika Rajashekar: అప్పుడు క్యూట్.. ఇప్పుడు హాట్.. అందాలతో అరాచకం
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 25 , 2023
    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ!
    నటీనటులు : నిఖిల్‌, దివ్యాంన్ష కౌషిక్‌, సత్య, అజయ్‌, సాయిరామ్‌ రెడ్డి, రుక్మిణి వసంత్‌, హర్ష చెముడు తదితరులు రచన, డైరెక్టర్‌ : సుధీర్ వర్మ సంగీతం: &nbsp;కార్తిక్‌ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌ విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review) ఎవరెలా చేశారంటే హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్‌ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్‌, గ్లామర్‌ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి.&nbsp; సాంకేతికంగా .. టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ నిఖిల్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్టోరీబోరింగ్ లవ్‌ట్రాక్స్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.&nbsp; సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.&nbsp;
    మార్చి 12 , 2024
    D50: స్టార్లతో ధనుష్ ఫిల్మ్.. రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘రాయన్’
    D50: స్టార్లతో ధనుష్ ఫిల్మ్.. రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘రాయన్’
    హీరో ధనుష్ 50వ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. బడా తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనుంది.&nbsp; సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్, ధనుష్ సోదరీమణులు, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరాం, దసరా విజయన్, తదితరులు ఇందులో నటిస్తున్నారు.&nbsp; ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.&nbsp; ఫ్యామిలీ చుట్టూ తిరిగే రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు.&nbsp; ఇందులో ధనుష్, సందీప్ కిషన్ అన్నదమ్ములుగా నటించనున్నారు. సందీప్‌కు జోడీగా అపర్ణను తీసుకున్నారు.&nbsp; ధనుష్‌కి హీరోయిన్‌ని ఇంకా ఎంపిక చేయలేదు. ఈ సినిమా కోసం ధనుష్ తన జుట్టును కత్తిరించుకున్నాడట.&nbsp; చెన్నై వీధుల్లో జులై 1 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఓ గ్లింప్స్‌ని రిలీజ్ చేయనున్నారు.&nbsp; తొలుత ఏకధాటిగా 90 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.&nbsp; ఈ సినిమాను ధనుషే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే 1 నిమిషం ఉన్న వీడియో గ్లింప్స్‌ని రెడీ చేశారట.&nbsp; కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం ధనుష్ గడ్డం, జుట్టు పెంచాడు. ఇప్పుడు రాయన్ కోసం బొత్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది.&nbsp;&nbsp;
    జూన్ 13 , 2023
    మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న‌ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే
    మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న‌ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే
    ]కొన్ని రోజుల క్రిత‌మే మాల్దీవ్స్ వెళ్లిన పూజా అప్పుడు పెట్టిన ఫోటోలు &nbsp;వైర‌ల్‌గా మారాయిమాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌. ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుందిమాల్దీవ్స్ ఈ బుట్ట‌బొమ్మ‌కు ఫేవ‌రెట్ హాలిడే స్పాట్‌ఖాళీ దొరికితే అక్క‌డ వాలిపోయి ఎంజాయ్ చేస్తుంది
    అక్టోబర్ 21 , 2022
    <strong>Appudo Ippudo Eppudo OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న నిఖిల్‌ ప్లాప్‌ చిత్రం.. కారణం ఏంటంటే?</strong>
    Appudo Ippudo Eppudo OTT: ఓటీటీలో దూసుకెళ్తోన్న నిఖిల్‌ ప్లాప్‌ చిత్రం.. కారణం ఏంటంటే?
    యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha) కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo OTT). సుధీర్‌ వర్మ (Sudhir Varma) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిఖిల్‌ జోడీగా రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth), దివ్యాంశ కౌషిక్‌ (Divyansha Kaushik) నటించారు. నవంబర్‌ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో 20 రోజుల వ్యవధిలోనే మేకర్స్‌ ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని ఈ చిత్రం ఓటీటీ మాత్రం అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్‌ సహా, అంతా షాకవుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.&nbsp; ట్రెండింగ్‌లో నిఖిల్‌ చిత్రం.. నిఖిల్‌ హీరోగా చేసిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' నవంబర్‌ 27న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోకపోవడంతో ఓటీటీ రిలీజ్‌కు ముందు పెద్దగా హడావిడి జరగలేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రానికి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ నిమిషాలు పెరుగుతున్నట్లు ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అమెజాన్‌ ప్రైమ్‌లో దేశంలోనే తొలిస్థానంలో నిఖిల్‌ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా అమెజాన్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో మూవీ టీమ్‌తో నిఖిల్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/baraju_SuperHit/status/1862098192877437096 ఓటీటీలో ఆదరణ ఎందుకంటే నిఖిల్‌ లేటెస్ట్ చిత్రం 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' (Appudo Ippudo Eppudo OTT) యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అయితే థియేటర్లలో రిలీజ్‌కు ముందు పెద్దగా ప్రమోషన్స్‌ చేయకపోవడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. పైగా కరోనా కాలంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు పదే పదే చిత్ర బృందం చెప్పడం కూడా సినిమాను చూడాలన్న కోరికను సన్నగిల్లేలా చేసింది. దీంతో థియేటర్లలో చూసేందుకు పెద్దగా ఎవరు ఆసక్తి కనబరచలేదు. ఓటీటీలోకి వచ్చాక చూడచ్చులే అని అంతా భావించారు. రీసెంట్‌గా ఓటీటీలోకి రావడంతో యూత్ అంతా ఈ సినిమా చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ‘లక్కీ భాస్కర్‌’, ‘క’ చిత్రాలను అల్రెడీ థియేటర్లలో చూసిన నేపథ్యంలో ఓటీటీలో తమ తొలి ప్రాధాన్యతను 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'కి ఇచ్చారు. దీంతో నిఖిల్‌ చిత్రం ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది.&nbsp; సినిమా చూడొచ్చా! దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo OTT)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. కానీ, కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తన మార్క్‌ చూపించాడు. మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్స్‌ బోరింగ్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. హీరో పరిచయం, అతడి పసలేని లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలిగింది. సెకండాఫ్‌ పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి.&nbsp; కథేంటి హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది స్టోరీ.
    నవంబర్ 29 , 2024
    <strong>Pushpa 2: పుష్ప2 ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌? ఒక్కటి కాబోతున్న మెగా-అల్లు ఫ్యామిలీ!&nbsp;</strong>
    Pushpa 2: పుష్ప2 ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌? ఒక్కటి కాబోతున్న మెగా-అల్లు ఫ్యామిలీ!&nbsp;
    అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘పుష్ప’పై పవన్‌ కల్యాణ్‌ నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం, ఆ తర్వాత ‘నాకు ఇష్టమైతే వస్తా’ అంటూ బన్నీ వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అయితే ఈ వివాదానికి ‘పుష్ప 2’తో చెక్‌ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్‌, బన్నీ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.&nbsp; ‘పుష్ప 2’ ఈవెంట్‌కు పవన్‌! అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్ ఉంది. డిసెంబర్‌ 5న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ ఆఖరి వారంలో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని పుష్ప టీమ్ భావిస్తోంది. ఏపీలో భారీ ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించి దానికి ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో అల్లు అర్జున్‌ త్వరలోనే పవన్‌ కల్యాణ్‌తో భేటి అవుతారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బన్నీ రిక్వెస్ట్‌ను పవన్‌ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పవన్‌, బన్నీ ఒకే వేదికపై కనిపించనున్నారు. తద్వారా గత కొంతకాలంగా జరుగుతున్న అల్లు vs మెగా ఫ్యాన్‌ వార్‌కు చెక్‌ పడే ఛాన్స్ ఉంది. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య ఏమైనా వివాదాలు ఉన్నా కూడా ఈ దెబ్బతో తొలగిపోతాయని చెప్పవచ్చు.&nbsp; మాస్టర్‌ ప్లాన్ ఉందా? ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించడం వెనుక ఓ వ్యూహం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ డిజాస్టర్‌ చేస్తామంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాయ్‌కాట్‌ చేయాలంటూ పిలుపు సైతం ఇస్తున్నారు. తొలి నుంచి బన్నీకి అండగా నిలిచిన మెగా ఫ్యాన్స్‌ నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తుండటంతో ‘పుష్ప 2’ టీమ్ ఆలోచనల్లో పడినట్లు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ‘పుష్ప 2’ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతోంది. దీంతో ఎలాగైన ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ఉద్దేశ్యంతో పవన్‌ను గెస్ట్‌గా పిలవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. దానివల్ల బన్నీపై ఉన్న నెగిటివ్‌ తగ్గి ఎప్పటిలాగే ‘పుష్ప 2’ను మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.&nbsp; హైప్‌ పెంచిన అనసూయ ‘పుష్ప 2’ చిత్రంలో ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ (Anasuya) కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఇటీవల బిగ్‌బాస్‌ షోకు అతిథిగా వచ్చిన అనసూయకు 'పుష్ప 2'కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. హోస్ట్ నాగార్జున ఈ మూవీకి సంబంధించి చెప్పాలని కోరారు. దీంతో అనసూయ స్పందిస్తూ ‘పుష్ప 2’లో ఇదే క్లైమాక్స్ అనిపించే ఎపిసోడ్ ప్రతి పది నిమిషాలకూ ఒకటి వస్తుందని చెప్పింది. గతంలో వచ్చిన ‘పుష్ప’ కేవలం ఇంట్రడక్షన్‌ మాత్రమేనని ‘పుష్ప 2’ లోనే అసలు సినిమా అని వ్యాఖ్యానించింది. ఇందులోనే చాలా కథ, ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంచనాలు పెంచేసింది.&nbsp; ‘పుష్ప 3’ పక్కా ‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్‌ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్ సైతం మూడో పార్ట్‌ గురించి హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్‌ 3 కి సంబంధించి సాలిడ్‌ లీడ్‌ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని పునరుద్ఘటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్‌ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్‌ చేయలేదు.&nbsp; https://twitter.com/i/status/1849383805657690194 రూ.1000 కోట్ల బిజినెస్‌! 'పుష్ప 2' చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్‌ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్‌ హక్కులు విక్రయించినట్లు(Pushpa 3)&nbsp; తెలిపాయి. నార్త్‌ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్‌ రూ.120 కోట్ల మేర బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్‌ రైట్స్‌ రూ.65 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.&nbsp;
    అక్టోబర్ 29 , 2024

    @2021 KTree