• TFIDB EN
 • అథర్వ (2023)
  U/ATelugu
  స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌

  ఓ హత్య కేసును క్లూస్‌ టీమ్‌ సాయంతో ఛేదించేందుకు హీరో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దర్యాప్తు కూడా మరింత సంక్లిష్టంగా మారుతుంది. చివరికీ ఆ కేసును ఎలా ఛేదించారు? అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  @srihari

  అథర్వ.. అక్కడక్కడ మెప్పిస్తాడు

  హీరో క్లూస్‌ టీం విభాగంలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో సినీ కథానాయిక, ఆమె ప్రియుడు హత్యకు గురవుతారు. ఇందుకు కారణమైన నిందుతుల్ని క్లూస్ ఆధారంగా హీరో...read more

  3 months ago

  సిబ్బంది
  మహేష్ రెడ్డిదర్శకుడు
  సుభాష్ నూతలపాటినిర్మాత
  శ్రీచరణ్ పాకాలసంగీతకారుడు
  కథనాలు
  <strong>This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!</strong>
  This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో 22 చిత్రాలు/సిరీస్‌లు.. చూసేయండి!
  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్‌’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్‌’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పది రోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలాంటి కొత్త సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్‌ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ కానుందో ఇప్పుడు చూద్దాం.&nbsp; అథర్వ కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న&nbsp; ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.&nbsp;&nbsp; ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా రాజశేఖర్‌ ఓ కీలక పాత్రలో నటించారు.&nbsp; ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ పోలీస్‌ కథలతో తరచూ ప్రేక్షకులను అలరించే బాలీవుడ్‌ దర్శకుల్లో రోహిత్‌ శెట్టి (Rohit Shetty) ఒకరు. తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో ఈ సిరీస్‌ సిద్ధమైంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateDusty Slay: Workin' ManSeriesEnglishNetflixJan 16American NightmareDocumentaryEnglishNetflixJan 17Merry Men 3MovieEnglishNetflixJan 18Full CircleSeriesEnglish&nbsp;NetflixJan 19Love on the Spectrum 2SeriesEnglish&nbsp;NetflixJan 19The KitchenMovieEnglishNetflixJan 19Where the Crawdads SingMovieEnglishSonyLIVJan 19Death and Other DetailsSeriesEnglishHotstarJan 16A Shop for KillersSeriesEnglish/KoreanHotstarJan 17Coleen Rooney: The Real Wagatha StoryDocumentaryEnglishHotstarJan 16Snakes SOS: Goa's Wildest 4DocumentaryEnglish&nbsp;HotstarJan 16Blue BeetleMovie&nbsp;English&nbsp;Jio CinemaJan 18Chicago Fire 12SeriesEnglishJio CinemaJan 18Law &amp; Order: Special Victims UnitSeriesEnglishJio CinemaJan 18Mayalo&nbsp;MovieTeluguAmazon primeJan 15Hazbin HotelSeriesEnglishAmazon primeJan 19LOL: Last One Laughing IrelandSeriesEnglishAmazon primeJan 19
  జనవరి 17 , 2024
  <strong>Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!</strong>
  Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.&nbsp; అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.&nbsp; విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna&nbsp;MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside&nbsp;MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
  డిసెంబర్ 11 , 2023

  @2021 KTree