• TFIDB EN
  • అతిధి
    ATelugu2h 59m
    అమృత తల్లిదండ్రులను ఒక యువకుడు అతని సోదరుడు హత్య చేస్తారు. అయితే అతిధి నేరానికి పాల్పడినట్లు భావించి అరెస్టు చేశారు. పద్నాలుగు సంవత్సరాల తరువాత, అతిధి నిజమైన హంతకుడిని వేటాడేందుకు ప్రయత్నిస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    అతిధి
    అమృత రావు
    అమృత
    అన్నీ
    యువ అమృత
    మురళీ శర్మ
    ఇన్స్పెక్టర్ అజయ్ శాస్త్రి/ఖైజర్
    ఆశిష్ విద్యార్థి
    డానీ భాయ్
    కోట శ్రీనివాసరావు
    ఖైజర్ కింద పనిచేసే ఎమ్మెల్యే
    అజయ్
    ఖైజర్ సోదరుడు
    నాసర్
    హోం మంత్రి
    బ్రహ్మానందం
    శివరామ్
    సునీల్
    అమృత కాబోయే భర్త
    రవి ప్రకాష్
    అతిధి స్నేహితుడు
    సుబ్బరాజు
    గన్ని భాయ్
    మాధవి లత
    అమృత స్నేహితురాలు
    అశ్మిత కర్ణానిఅమృత తల్లి
    రాజేంద్రన్
    హెంచ్మాన్
    ప్రభాకర్
    గూన్
    బేబీ కర్మన్ సంధు
    హేమ
    శంకర్ మెల్కోటే
    ఇంద్రాయుధ మండల్ (అతిధి పాత్ర)
    వేణు మాధవ్
    రాజీవ్ కనకాల
    అమృత తండ్రి (అతిధి పాత్ర)
    మలైకా అరోరా
    సిబ్బంది
    సురేందర్ రెడ్డి
    దర్శకుడు
    రమేష్ బాబు
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    Konidela Pawan Kalyan Ane Nenu: బాహుబలిని తలపించిన పవన్‌ ప్రమాణ స్వీకారం.. ఆనందంతో ఉప్పొంగిన చిరంజీవి!
    అంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ - జనసేన - భాజపా ముఖ్యనేతలు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 'పవన్‌ అనే నేను'.. అంటూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపూర్వమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  బాహుబలి రేంజ్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన నూతన మంత్రి వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పవన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘పవన్‌ అనే నేను’ అని జనసేనాని అనగానే సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ సర్వ సైన్యాధ్యాక్షుడిగా ప్రమాణం చేసే సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.  https://twitter.com/i/status/1800799485137944671 చిరు.. ఆనంద బాష్పాలు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తన తమ్ముడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని భావిస్తూ ఆనందంతో ఉప్పొంగారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ వేదికపై ఉన్న అతిథులందరికీ అభివాదం చేశారు. ఆపై సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. తాను ఎంత ఎదిగిన అన్న ముందు చిన్నవాడినేనన్న విధంగా చిరు పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేశారు. అనంతరం చిరు.. పవన్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం సభా ప్రాంగణంలోని వారందరినీ ఉద్వేగానికి గురి చేసింది.  https://twitter.com/i/status/1800778127129595985 అపూర్వ కలయిక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరో గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవిని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన పవన్‌.. తన అన్న గురించి ప్రస్తావించారు. దీంతో వెంటనే మెగాస్టార్‌ను గమనించిన మోదీ.. స్వయంగా పవన్‌తో కలిసి అతడి వద్దకు వెళ్లారు. కొద్దిసేపు చిరంజీవితో ముచ్చటించారు. అనంతరం మెగా బ్రదర్స్‌ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా మరోమారు హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మెగా ఫ్యాన్స్‌ వైరల్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1800806930975449376 అతిథుల కోలాహలం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) ముఖ్య అతిథి హోదాలో చిరు పక్కన స్టేజీపైన కూర్చున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేశ్‌ భార్య, బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో రామ్‌చరణ్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచి.. కార్యక్రమంలో సందడి చేశారు. యంగ్‌ హీరోలు నిఖిల్‌, నారా రోహిత్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.  https://twitter.com/i/status/1800778957174051224 23 మందితో నూతన మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ సహా మెుత్తం 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెదేపా నుంచి 19 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రిపదవి కల్పించారు.
    జూన్ 12 , 2024
    Deviyani Sharma: “సేవ్‌ ది టైగర్స్” ఫేమ్  దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Deviyani Sharma: “సేవ్‌ ది టైగర్స్” ఫేమ్  దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers S1 & S2)సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేవియాని శర్మ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యువ నటి.  దేవియాని శర్మ ఎక్కడ పుట్టింది? న్యూఢిల్లీ దేవియాని శర్మ పుట్టిన తేది? మే 30, 1993  దేవియాని శర్మ వయసు ఎంత? ఈ భామ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు (2024) దేవియాని శర్మ తల్లిదండ్రులు ఎవరు? సునీల్ శర్మ, నీనా శర్మ దేవియాని శర్మ తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఒక సోదరి ఉంది. ఆమె పేరు సోనం శర్మ దేవియాని శర్మ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? ఈ నటి విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది.  దేవియాని శర్మ ఏం చదివింది? ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది.  దేవియాని శర్మ ఎత్తు ఎంత? 165 సెం.మీ దేవియాని శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? 2019 నుంచి ఆమె హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.  దేవియాని శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? కెరీర్‌లో ప్రారంభంలో ఈ బ్యూటీ మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో సైతం నటించింది.  దేవియాని శర్మ తొలి చిత్రం? 2020లో వచ్చిన ‘భానుమతి & రామకృష్ణ’ (Bhanumathi & Ramakrishna)సినిమాలో ఓ అతిధి పాత్రతో తొలిసారి తెరంగేట్రం చేసింది.  దేవియాని శర్మ తొలి వెబ్‌సిరీస్‌? 2020లో జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'అనగనగా' (Anaganaga).. ఆమె చేసిన తొలి సిరీస్‌. ఇందులో లీడ్‌ రోల్‌లో కనిపించి దేవియాని గుర్తింపు పొందింది.  దేవియాని శర్మ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు/ సిరీస్‌లు? ‘భానుమతి & రామకృష్ణ’, 'రొమాంటిక్‌' (Romantic), సైతాన్‌ (Shaitan), సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2 (వెబ్‌సిరీస్‌) దేవియాని శర్మకు పాపులారిటీ తీసుకొచ్చిన చిత్రం/ వెబ్‌సిరీస్‌? హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ‘సేవ్‌ ద టైగర్స్‌’ ఆమెకు తెలుగులో మంచి బ్రేక్‌ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌ ద్వారా అందం, అభినయంతో దేవియాని యూత్‌ను ఆకర్షించింది.  దేవియాని శర్మ హామీలు ఏంటి? దేవియానికి ట్రావెలింగ్‌, పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టమట.  దేవియాని శర్మకు ఇష్టమైన పెంపుడు జంతువు? డాగ్‌ దేవియాని శర్మ పేవరేట్‌ హీరో, హీరోయిన్‌ ఎవరు?ఈ విషయాన్ని దేవియాని శర్మ ఏ ఇంటర్యూలోనూ పంచుకోలేదు.  దేవియాని శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా? https://www.instagram.com/deviyyani/?hl=en https://www.youtube.com/watch?v=4ZnkBGYa4Gg
    ఏప్రిల్ 04 , 2024
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    Anjali : ఆయనపై ఎప్పటికీ నాకు అదే ఉంటుంది.. బాలకృష్ణ ఇష్యూపై అంజలి కామెంట్స్!
    ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యవహార శైలిపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. ప్రముఖ నటి అంజలి (Actress Anjali)ని బాలకృష్ణ నెట్టివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంజలి పట్ల బాలయ్య అనుచితంగా ప్రవర్తించారంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను రెండ్రోజులుగా వైరల్‌ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా హీరోయిన్‌ అంజలి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రోలర్స్‌కు ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్ ఇచ్చింది.  ‘మేము గొప్ప స్నేహితులం’ స్టార్‌ హీరోయిన్‌ అంజలి (Anjali).. బాలకృష్ణపై వస్తోన్న విమర్శలపై పరోక్షంగా స్పందించింది. ఎక్స్‌ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు పెట్టింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలయ్యతో పాటు ఉన్న ఓ మెమోరబుల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. దీంతో అంజలి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అంజలి పోస్టును షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.  https://twitter.com/yoursanjali/status/1796260781551682021 నెటిజన్లు భిన్నాభిప్రాయాలు అంజలి పోస్టుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని ఆమెపై మండిపతున్నారు. బాలకృష్ణ తోసేసిన వ్యవహారం రెండ్రోజులుగా సోషల్‌ మీడియాను ఊదరకొడుతున్న క్రమంలో కాస్త త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటి స్పందించే లోపే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందని బాలయ్య ఫ్యాన్స్ వాపోతున్నారు. మరోవైపు బాలయ్య యాంటి ఫ్యాన్స్‌ నటి అంజలిపై సానుభూతి చూపిస్తున్నారు. కొందరి ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ పోస్టు చేయాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. https://twitter.com/GoneWorse/status/1796158320778117123 నిర్మాత ఏమన్నారంటే.. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నిర్మాత నాగవంశీ కూడా బాలయ్య వైరల్‌ వీడియోపై ఇటీవలే స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు. పూర్తి వీడియోను ఓ సారి చూసేయండి.  https://twitter.com/DeepikaBhardwaj/status/1796143784851325044 నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ నటుడు బాలకృష్ణ.. నటి అంజలిని ఏ ఉద్దేశ్యంతో తోసిన అది.. నేషనల్‌ వైడ్‌గా మాత్రం ట్రెండ్‌ అయింది. ప్రముఖ జాతీయ మీడియాలు సైతం ఆ వీడియోను ప్రసారం చేశాయి. ఎంత చనువు ఉన్నా ఒక నటితో అలా ప్రవర్తిస్తారా అంటూ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సైతం పక్కకు వెళ్లింది. అంతా బాలయ్య-అంజిలి గురించే చర్చించుకున్నారు. 
    మే 31 , 2024
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.  ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.  మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. 
    మే 28 , 2024
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ సినిమా? క్లారిటీ!
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. గత కొంత కాలంగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రం.. కలెక్షన్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో విజయ్‌ కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి దృష్టంతా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ మీదనే ఉంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్లు అందించిన  ప్రశాంత్‌ నీల్‌తో విజయ్‌ భేటి కావడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరి కాంబోలో ఏమైనా సినిమా ఉంటుందా? అన్న ఆసక్తి టాలీవుడ్‌ వర్గాల్లో మెుదలైంది.  ఎందుకు కలిశారంటే! హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ వెళ్లి కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్‌.. ప్రశాంత్‌ నీల్ లాంటి డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ‘సలార్‌ 2’లో విజయ్‌ అతిథి పాత్ర పోషించబోతున్నట్లు టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఈ పాత్ర గురించి చర్చించడానికే ప్రశాంత్‌ నీల్‌.. విజయ్‌ ఇంటికి వెళ్లారని సమాచారం. 'సలార్‌ 2' క్లైమాక్స్‌లో విజయ్‌ కనిపిస్తాడని అంటున్నారు. ఆయన రోల్‌ సినిమాకు చాలా కీలకంగా ఉండనుందని టాక్‌. అయితే దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  చిక్కుల్లో విజయ్‌ కెరీర్‌! విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీగా నష్టాలు చవిచూసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు తనకు ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కును మార్చలేకపోయాడు. దీంతో విజయ్‌కు బ్లాక్‌ బాస్టర్‌ తప్పనిసరిగా మారింది. మరో ప్లాపు విజయ్‌ ఖాతాలో పడితే అతడి కెరీర్‌ సమస్యల్లో పడవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పడేనా? విజయ్‌(Vijay Deverakonda) తన తర్వాతి చిత్రం 'VD12'ను గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. ఇందులో విజయ్‌కు జోడీగా 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు (Mamita Baiju)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో మమితా బైజును తీసుకుంటే సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పైగా కొత్త తరహా లవ్‌ స్టోరీ కావడం, విజయ్‌ మమితా తొలిసారి జోడీ కడుతుండటం సినిమాకు ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అభిప్రాయపడుతోంది. మరి ఈ కేరళ బ్యూటీ విజయ్‌ ఫ్లాప్స్‌కు చెక్‌ పెడుతుందో లేదో చూడాలి. https://telugu.yousay.tv/exclusive-premalu-heroine-romance-with-vijay-deverakonda.html
    ఏప్రిల్ 24 , 2024
    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : రజనీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, కపిల్‌ దేవ్‌, నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు దర్శకత్వం:  ఐశ్వర్య రజనీకాంత్‌ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి నిర్మాత: సుభాస్కరణ్‌ అల్లిరాజా విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024 సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ తిరు (విష్ణు విశాల్‌), మెుయిద్దీన్ భాయ్‌ (రజనీకాంత్‌) కొడుకు షంశుద్దిన్‌ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్‌ స్థాపించిన త్రీ స్టార్‌ క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్‌ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్‌ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్‌ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ అంటే అది ఇండియా - పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే? లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్‌ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ  వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్‌ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్‌ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌. ముస్లింలను రిప్రెజెంట్‌ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.  టెక్నికల్‌గా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్‌ పాత్రకు ఎలివేషన్స్‌ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరజనీకాంత్‌ నటనసంగీతం మైసన్‌ పాయింట్స్‌ స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating: 3/5
    ఫిబ్రవరి 09 , 2024
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..! 
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..! 
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.  భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.  వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.  రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది. 
    ఆగస్టు 14 , 2023
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    Payal Rajput:  ఒంటిపై నూలు పోగు లేకుండా పాయల్‌ రాజ్‌పుత్‌… ‘మంగళవారం’ సినిమా కోసం అందాల తెగింపు
    RX 100 కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఈ సారి మరింత డోసు పెంచారు. “మంగళవారం” అనే టైటిల్‌ పెట్టి పాయల్ రాజ్‌పుత్‌ టాప్‌ లెస్‌ ఫోటోను విడుదల చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రూపుదిద్దుకుంటుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ మెుదటి సినిమా నుంచే అందాల ఆరబోతతో  హద్దుల్లేకుండా చెలరేగిపోతుంది. RX 100లో కార్తీకేయతో రొమాన్స్‌ చేసి యువతను ఆకర్షించింది ఈ అమ్మడు.  ఆ సినిమా తర్వాత RDX లవ్‌, అనగనగా ఓ అతిథి చిత్రాల్లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది పాయల్‌. అందచందాలు ప్రదర్శించి ఆకట్టుకోవాలని చూసింది.  సామాజిక మాధ్యమాల్లోనూ హాట్‌ఫొటోస్‌తో చెలరేగుతుంది పంజాబీ సుందరి. బాత్‌రూమ్‌లో కేవలం టవల్‌పై ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి షేక్ చేసింది. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న హాట్‌ పిక్స్‌ వైరల్ అయ్యాయి. ఇందులోనూ టాప్‌లెస్‌గా కనిపించింది పాయల్ రాజ్‌పుత్‌.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి అలాంటి ఫోజులు ఇవ్వటంపై ట్రోల్స్‌ ఎదుర్కొంది ఈ హీరోయిన్.  జిన్నా సినిమాలోనూ అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. వీలైనంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించింది.  మంగళవారం సినిమాలో మరోసారి బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుంది ఈ భామ. శైలజ అనే పాత్రలో టాప్‌లెస్‌గా చేతి వద్ద సీతాకోక చిలుక ఉన్నట్లు కనిపించే ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. RX 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుత్‌కు తెలుగులో మంచి హిట్‌ లేదు. అందాల విందు చేసినా ఆఫర్లు మాత్రం పెద్దగా రావటం లేదు.  ఆఫర్లు లేని కారణంగానే బోల్డ్ పాత్రల్లోనూ నటించేందుకు పాయల్ రాజ్‌పుత్‌  సిద్ధపడుతున్నట్లు  తెలుస్తోంది.  RX 100, మహా సముద్రం చిత్రాలు తీసిన దర్శకుడు అజయ్‌ భూపతి మంగళవారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మంగళవారం సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.  అజయ్‌ భూపతి రిలీజ్‌ చేసిన ఈ లుక్‌పై ఆసక్తి నెలకొంది. వర్మ కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ దర్శకుడు మెుదట్నుంచే విభిన్నమైన సినిమాలు తీస్తున్నాడు. 
    ఏప్రిల్ 25 , 2023
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్‌ ‌అండ్ ఫ్యూచరిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్‌ చేయని కమల్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి కమల్‌ ఏమన్నారంటే దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్‌.. కల్కిలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్‌.. ఈ చిత్రాన్ని హవర్‌ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్‌ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  కల్కిలో భారీ కాస్టింగ్‌ ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా గెస్ట్‌ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్‌ వాహనానికి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తన వాయిస్‌ అందించింది. ఇలా ఇంతమంది స్టార్‌ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.  అలనాటి నటి గ్రాండ్‌ ఎంట్రీ! కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్‌ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌! విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్‌ భైరవ' అనే యానిమేటెడ్‌ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్‌ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్‌ కూడా మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్‌ వండర్‌లా ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందో చూడాలి. 
    జూన్ 04 , 2024
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.  బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.  టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)  స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.  సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు& టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.  ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.  టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.  మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్  (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్ లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్  ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ & మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద  ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది. 
    మే 22 , 2024
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush). నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అనన్య జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దులేదురా ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహించారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.  ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.  సుందరం మాస్టార్ టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.  ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు. అబ్రహాం ఓజ్లర్‌ జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu ETV WinMarch 22
    మార్చి 18 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు గామి విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్‌. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్‌ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.  భీమా గోపీచంద్‌ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షైతాన్‌ బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షైతాన్‌’ (హిందీ) (Shaitaan). వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్‌. మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ప్రేమలు మలయాళంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్‌ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్‌ కె. గఫూర్‌ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్‌ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్‌ కానుంది. రికార్డ్ బ్రేక్ నిహార్‌, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్‌, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్‌ బ్రేక్‌’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌ అజయ్‌, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా సత్య రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు హనుమాన్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. లాల్ సలామ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. యాత్ర 2 యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. వళరి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
    మార్చి 04 , 2024
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    Gaami Prabhas: ‘గామి’ విజువల్‌ ట్రీట్‌పై ప్రభాస్‌ క్రేజీ కామెంట్స్‌.. టైటిల్‌కు అర్థం ఏంటో తెలుసా?
    యంగ్‌ హీరో విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా.. విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన 'గామి' (Gaami) చిత్రం.. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. విష్వక్‌ తొలిసారి అఘోరా పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా  'గామి' ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేయగా.. దానికి విశేష స్పందన వస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విష్వక్‌కు ఈ చిత్రం మైలురాయిగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌ను మరోస్థాయికి ‘గామి’ తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘గామి’ ట్రైలర్‌ చూసిన పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ప్రభాస్‌ ఏమన్నాడంటే! విజువల్‌ వండర్‌గా విడుదలైన 'గామి' (Gaami) ట్రైలర్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. హీరో ప్రభాస్‌ ‘గామి’ ట్రైలర్‌పై స్పందిస్తూ ఏకంగా ఓ వీడియో బైట్‌నే రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. ఈ ట్రైలర్ చూసాక తానే స్వయంగా వీడియో బైట్ ఇచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలని అనుకున్నానని తెలిపాడు. విశ్వక్ సేన్ ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటాడని ప్రశంసించాడు. ట్రైలర్ ఎగ్జైటింగ్‌గా ఉందని.. మార్చి 8 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. ప్రతీ ఒక్కరి హార్డ్ వర్క్ ట్రైలర్ లో కనిపిస్తోందంటూ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.  https://twitter.com/i/status/1763423427510370770 ‘గామి’ అరుదైన చిత్రం’ ‘గామి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ లాంచ్‌ చేశాడు. అనంతరం సందీప్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గామి ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది చాలా అరుదైన సినిమా అనిపిస్తోంది. ఆరేళ్ల పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా ప్యాషన్‌ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మూవీ సౌండ్‌ డిజైన్, కలర్‌ గ్రేడింగ్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసినప్పుడు మంచి అనుభూతి వస్తుంది’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా అన్నారు.  https://twitter.com/HanuNews/status/1763062517746831765 ‘గామి’ అంటే అర్థం ఇదే! ఈ సినిమా పేరును అనౌన్స్‌ చేసినప్పటి నుంచి 'గామి' టైటిల్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికి అర్థం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థంపర్థం లేని టైటిల్‌గా అనిపిస్తోందంటూ కొందరు విమర్శలు సైతం చేశారు. అయితే దీనిపై ట్రైలర్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ విద్యాధర్‌ కాగిత క్లారిటి ఇచ్చారు. ‘గామి అంటే గమ్యాన్ని గమించేవాడు’ అని మీనింగ్ వస్తుందని తెలిపాడు. చిన్నగా మెుదలైన ‘గామి’.. విష్వక్‌, నిర్మాత ప్రోత్సాహంతో పెద్ద చిత్రంగా మారిందని అన్నారు. విజువల్‌ వండర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చారు. మార్చి 8న కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.  https://twitter.com/NtvTeluguEnt/status/1763212759653810231 ‘ఫీచర్ ఫిల్మ్ అంటే నమ్మలేదు’ డెఫ్‌ & డంబ్‌ నటి అభినయ (Actress Abhinaya) ‘గామి’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దేవదాసి పాత్రలో ఆమె కనిపించనుంది. మాటలు రాకపోయినా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా అభినయ సైగలతో చేసిన స్పీచ్‌ ఆసక్తి రేపుతోంది. ‘విశ్వక్ సేన్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మీ ఎక్స్‌ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి. ‘గామి’ ఫీచర్ ఫిల్మ్ అంటే తొలుత నమ్మలేదు. వైజాగ్‌ షూటింగ్‌లో ఒక చిన్న కెమెరా పట్టుకొని 15 రోజుల్లో నా షూట్‌ పూర్తి చేసేశారు డైరెక్టర్‌’ అంటూ ‘గామి’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది అభినయ. https://twitter.com/i/status/1763209148253213116
    మార్చి 01 , 2024
    Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
    Nani HBD: నాని గురించి స్టార్‌ హీరోలు ఏమన్నారో తెలుసా? చూస్తే.. గూస్‌బంప్సే!
    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని.. తన కృషి, పట్టుదలతో స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఇవాళ నాని పుట్టిన రోజు (#HappyBirthdayNani) కావండంతో ఆయనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నాని అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ (#SaripodhaaSanivaaram) విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆ సినిమా హ్యాష్‌ట్యాగ్‌తోనూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియోను షేక్‌ చేస్తున్న నాని వీడియోలపై ఓ లుక్కేద్దాం.  ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ నచ్చిన హీరో నాని. పలు వేదికలపై మహేష్‌, రాజమౌళి, అల్లు అర్జున్‌, రవితేజ, డైరెక్టర్‌ సుకుమార్‌ వంటి ప్రముఖులు నానిపై చేసిన ప్రశంసల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.  https://twitter.com/i/status/1761065464669864301 నాని సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో ముఖ్య అతిథి పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. నేచురల్ స్టార్‌ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నానికి భగవంతుడు గొప్ప విజయాలను ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఈ వీడియోను నాని బర్త్‌డే సందర్భంగా పవన్‌ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1761097491502772606 టాలీవుడ్‌ సంచలనాల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా సైతం ఓ ఇంటర్యూలో హీరో నానిని కొనియాడాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అందరితో కలిసి స్టీల్‌ ప్లేట్‌ను తుడుచుకొని తిన్న నాని.. ఈ రోజు ఏ స్థాయికి ఎదిగాడో అంటూ సందీప్‌ ప్రశంచించాడు. .  https://twitter.com/i/status/1761098448496115970 ‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి.. నానితో ‘కృష్ణగాడి ప్రేమకథ’ చిత్రం తీశారు. ఆ సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆయన నానిపై ప్రశంసలు కురిపించారు. నాని ఒక్క క్షణం కూడా పాత్ర నుంచి బయటకు రాడని.. ఆ క్యారెక్టర్‌లోనే కూర్చుండిపోతాడని పేర్కొంటాడు.  https://twitter.com/i/status/1761214343755256110 నాని హీరోగా చేసిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని ఓ ఆడియో ఫంక్షన్‌లో ‌అల్లుఅర్జున్ పేర్కొంటాడు. నాని నటన చాలా బాగుందంటూ ప్రశంసిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియోను సైతం నాని పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.  https://twitter.com/i/status/1480588099688153089 నాని బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో మరో ఆసక్తిర వీడియో వైరల్ అవుతోంది. తోటి స్టార్స్ అయిన ప్రభాస్, తారక్‌ ఇతర హీరోల గురించి నాని చేసిన హెల్తీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాని ఏమన్నాడో కింద వీడియోలో మీరే చూడండి.  https://twitter.com/i/status/1761060076645711983 ఈ జనరేషన్‌ యువతలో ప్రేరణ కలిగిస్తూ నాని చేసిన ఓ వీడియో సైతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమ కలలను నేరవేర్చుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా బలంగా నిలబడాలని నాని ఈ వీడియో సూచించాడు.  https://twitter.com/i/status/1761106534715797807 మరోవైపు నాని స్ఫూర్తిదాయక వీడియోలు సైతం #HappyBirthdayNani హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌ ప్రారంభంలో తాను పడ్డ ఇబ్బందులను నాని స్వయంగా పలు వేదికలపై చెప్పుకొస్తాడు. వాటన్నింటిని జోడిస్తూ ఫ్యాన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.  https://twitter.com/i/status/1761124945327747406 ఒక అమీతాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి ఆ తర్వాత నాని.. అంటూ సాగే వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సౌత్‌ ఇండియాలో నాని ఓ అద్భుతమైన నటుడు అంటూ రవితేజ ఈ వీడియో ప్రశంసిస్తాడు. https://twitter.com/i/status/1761229505295745273 నాని కెరీర్‌లో ఇప్పటివరకూ జరిగిన మెమోరబుల్‌ మూమెంట్స్‌, హైలెట్‌ మూవీ సీన్లను ఒక చోట చేర్చి చేసిన మరో వీడియో కూడా ఆకట్టుకుంటోంది.  https://twitter.com/i/status/1761018169005584453 ఇక నాని బర్త్‌డే సందర్భంగా.. తన అప్‌కమింగ్‌ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ఆసక్తికర పోస్టు విడుదలైంది. చుట్టూ మంటలు.. ముఖాన ముసుగుతో నాని చాలా అగ్రెసివ్‌గా పోస్టర్‌లో కనిపించాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 14 లేదా ఆగస్టు 28 తేదీల్లో రిలీజయ్యే అవకాశముందని సినీ వర్గాల టాక్. https://twitter.com/TheAakashavaani/status/1761255871374614584?s=20
    ఫిబ్రవరి 24 , 2024
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    Bramayugam Review In Telugu : మమ్ముట్టి ‘భ్రమయుగం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
    నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు దర్శకుడు: రాహుల్ సదాశివన్ సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్ ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్ విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024 మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్‌ సదాశివన్ రూపొందించిన డార్క్‌ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌ 'భ్రమయుగం'. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని రిలీజ్‌ చేసింది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ తేవన్ (అర్జున్ అశోకన్) (Bramayugam Review In Telugu) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కుడుమోన్‌ బాగా ఆదరిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు? కుడుమోన్ పొట్టి ఎవరు ? అడవిలో పాడుబడ్డ భవంతిలో ఏం చేస్తున్నాడు? తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి (Bramayugam Review In Telugu).. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. కుడుమోన్ పొట్టి మిస్టీరియస్ పాత్రలో అద్బుత నటన కనబరిచాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను చాటుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే భ్రమయుగం మూవీ ప్రారంభం నుంచే చాలా ఇంటెన్స్‌తో, హై ఎనర్జీతో మెుదలవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్‌ తెరకెక్కించారు. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, భయానకంగా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది. అయితే స్లోగా ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు. టెక్నికల్‌గా  ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలంగా మారింది. యాక్టర్ల నటనకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సన్నివేశాలు హై రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్‌ షెహనాద్ జలాల్ సినిమా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సాయపడ్డాయి. ప్లస్‌ పాయింట్స్ కథ, స్క్రీన్‌ప్లేనటీనటులుసంగీతంకెమెరా పనితనం మైనస్‌ పాయింట్స్‌ స్లోగా సాగే కథనంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్‌ ఉమెన్‌ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్‌, సీరత్‌ కపూర్‌, చైతు జొన్నలగడ్డ, సుదీప్‌ వేద్‌, అనీష్ తదితరులు రచన, దర్శకత్వం: అభిమన్యు సంగీతం: ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫీ: దీపక్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషద్‌ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా విడుదల తేదీ: 16-02-2024 ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.  కథ అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్‌-1లో బయటపడుతుంది. ఇక సెకండ్‌ పార్ట్‌ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్‌ కపూర్‌) రోల్‌ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్‌ ఉమెన్‌ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్‌, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్‌ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్‌.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్‌ ఆర్‌.విహారి నేపథ్య సంగీతం, దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ నైషధ ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్‌ పనితీరు మైనస్‌ పాయింట్స్‌ కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 16 , 2024
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే? 
    #90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్‌ ఎలా ఉందంటే? 
    నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్ సంగీతం: సురేష్‌ బొబ్బలి సినిమాటోగ్రఫీ: అజాజ్‌ మహ్మద్‌ ఎడిటింగ్‌: శ్రీధర్‌ సోంపల్లి నిర్మాత: రాజశేఖర్‌ మేడారం శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘#90's. ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్‌ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం. కథ చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్‌. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్‌ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్‌ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్‌ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎవరెలా చేశారంటే చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్‌ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు. టెక్నికల్‌గా సాంకేతికంగా #90’s సిరీస్‌ బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్‌ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం  మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం రేటింగ్‌: 3/5
    జనవరి 05 , 2024
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    Dunki Review: హాస్యం, భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘డంకీ’.. షారుక్‌ హ్యాట్రిక్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ సంగీతం: అమన్‌ పంత్‌, ప్రీతమ్ సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌ నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌  విడుదల తేదీ: 21-12-2023 ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ - షారుక్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘డంకీ’ (Dunki). హిరాణీ డైరెక్షన్‌లో వచ్చిన  ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది రెండు సూపర్‌ హిట్స్‌ (పఠాన్‌, జవాన్‌)తో ఊపుమీదున్న షారుక్‌తో హిరాణీ చిత్రం తీయడంతో 'డంకీ'పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సి నటించింది. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశాల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది? షారుక్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించిందా? దర్శకుడు హిరాణీ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ పంజాబ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌) ఒక్కో స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. వాటి నుంచి గ‌ట్టెక్క‌డానికి ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ, వీసాల‌కి త‌గినంత చ‌దువు, డ‌బ్బు వీరి వద్ద ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ఆ ఊరికి జ‌వాన్ హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. ఆ న‌లుగురి ప‌రిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఏన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒకరికి మాత్ర‌మే వీసా వ‌స్తుంది. అయినా స‌రే, అక్ర‌మ మార్గాన (డంకీ ట్రావెల్‌) ఇంగ్లండ్‌లోకి ప్ర‌వేశించాల‌ని వారు నిర్ణయించుకుంటారు. ఆ క్ర‌మంలో వాళ్ల‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఇంగ్లాండ్‌కు వెళ్లారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే 'డంకీ' చిత్రం షారుక్‌లోని మరో నట కోణాన్ని ఆవిష్కరించింది. మాట తప్పని జవాన్ హర్డీసింగ్‌ పాత్రలో షారుక్‌ ఒదిగిపోయారు. ప్రథమార్థంలో ఎంతగా నవ్వించారో, ద్వితియార్థంలో అంతగా భావోద్వేగాల్ని పంచారు. మన్ను పాత్రలో తాప్సి అదరగొట్టింది. చాలా చోట్ల ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఇక  విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నిడివి తక్కువే అయినా సినిమాలో విక్కీ పాత్ర చాలా కీలకం. ఇక మిగిలిన నటులు తమ పాత్రపరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తన గత చిత్రాల మాదిరిగానే సామాజికాంశాలు, హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేశారు. మ‌న్ను, బుగ్గు, బ‌ల్లిల కుటుంబ నేప‌థ్యాలను గుండెకు హత్తుకునేలా చూపించారు. డంకీ ప్ర‌యాణంలో వ‌లస‌దారుల దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టారు. విదేశాల్లో వారి బ‌తుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. హార్డీ, మ‌న్ను ప్రేమ‌క‌థను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆ జంట మ‌ధ్య సాగే ప్రేమ‌ నేప‌థ్యం క‌న్నీళ్లు పెట్టిస్తుంది.  సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికొస్తే.. సంగీతం, కెమెరా విభాగాల‌ు చక్కటి పనితీరు కనబరిచాయి.  ‘లుట్ పుట్ గ‌యా’ అనే హుషారైన పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అమ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగానే కాకుండా ఎడిట‌ర్‌గానూ మ‌రోసారి త‌న‌దైన ముద్ర వేశారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీనటులుహాస్యం, భావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్ఊహకందే కథ, కథనం రేటింగ్‌ : 3/5
    డిసెంబర్ 21 , 2023
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
    నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ సంగీతం : అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస  నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023   తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్‌ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.  కథ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్‌ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విజయ్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసింది. ఫైట్స్‌లో విజయ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.   డైరెక్షన్ ఎలా ఉందంటే 'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తన స్టైల్‌ను అనుసరించాడు.  సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్‌ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్‌ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్‌, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్‌ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్‌ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.   టెక్నికల్‌గా  టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్‌ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్‌ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్‌ మార్క్‌ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.   ప్లస్‌ పాయింట్స్‌ విజయ్‌ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ పాటలుసాగదీత సీన్స్‌ చివరిగా : లోకేష్‌ కనగరాజ్‌ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్‌) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది. రేటింగ్‌: 2.5/5
    అక్టోబర్ 19 , 2023
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    MAD Movie Review: కడుపుబ్బా నవ్వించే ‘మ్యాడ్’... తారక్‌ బావమరిది హిట్‌ కొట్టినట్లేనా!
    నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫ్రీ: శ్యామ్ దత్ -దినేష్ క్రిష్ణన్ బి నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య విడుదల తేదీ: 06-10-2023 ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‌అలాగే యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్‌ పదే పదే చెబుతూ వచ్చింది. మరి సినిమా నిజంగా నవ్వులు పూయించిందా? మంచి హిట్‌ సొంతం చేసుకుందా? అసలు మూవీ కథేంటి? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాం.  కథ మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) మంచి స్నేహితులు. వారు  రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లలో చదువుతుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి వారు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారతారు. ఇక మనోజ్.. శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్‌ను ఇష్టపడుతుంటుంది. దామోదర్ (డీడీ)కు గుర్తుతెలియని అమ్మాయి ప్రేమ లేఖలు రాయడంతో అతడు ఆమె ప్రేమలో పడతాడు. ఇలా వెన్నెల అనే అమ్మాయిని చూడకుండానే నాలుగేళ్లు గడిపేస్తాడు డీడీ. ఇంతకీ వెన్నెల ఎవరు?. ఆమెను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మనోజ్‌, అశోక్‌, దామోదర్‌ తమ ప్రేమను గెలిపించుకున్నారా? వంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా సాగిందంటే ప్రథమార్ధం ప్రధాన పాత్రల పరిచయం, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగిపోతుంది. ద్వితీయార్ధంలో వెన్నెల కోసం డీడీ వెతుకులాట, మనోజ్, అశోక్ ప్రేమ జంటల ఊసులు, లేడీస్ హాస్టల్‌లో డీడీ గ్యాంగ్ హంగామా కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. కథగా చూసుకుంటే పెద్దగా చెప్పడానికి లేకపోయినా కథనంలో పాత్రలు ప్రవర్తించే తీరు, వారి మధ్య సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశం వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ప్రేక్షకులకు రెండు గంటలపాటు ఇంజనీరింగ్ కాలేజిలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఎవరెలా చేశారంటే తారక్‌ బావమరిది నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమై నటించాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఎలివేషన్ సీన్స్ మెప్పించాడు. ఇక సంగీత్ శోభన్ , విష్ణుల పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత్ శోభన్ వేగంగా చెప్పే సంభాషణలు, తన నటన తీరుతో మంచి మార్కులు కొట్టేశాడు. లడ్డూగా విష్ణు తన కామెడి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ లవ్లీ బాయ్‌గా కనిపించి సందడి చేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. ఇతర పాత్రల్లో కనిపించిన నూతన నటీనటులంతా బాగా చేశారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే కాలేజి క్యాంపస్‌లో చదువులు, విద్యార్థుల మనస్తత్వాలు, పోటీ ప్రపంచంలో విద్యార్థులు నలిగిపోయే తీరు ఎప్పటికీ కథా వస్తువులే. అయితే ‘మ్యాడ్‌’ సినిమాలో వాటిని దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కథను తీర్చిదిద్దన విధానం బాగుంది. గతంలో వచ్చిన సినిమాల తాలుకు ఛాయలు కనిపించకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టర్‌ చాలా సులభంగా చెప్పేశారు. చదువులు, ర్యాగింగ్ , ర్యాంకులు జోలికి పోకుండా విద్యార్థులు ప్రవర్తించే తీరు, వారి మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. కాలేజిలో దొరికే స్నేహం ఎంత మధురంగా, స్వచ్ఛంగా ఉంటుందనే విషయాన్ని మ్యాడ్ రూపంలో చక్కగా వివరించారు. డైరెక్టర్‌ కల్యాణ్‌ రాసిన మాటలు ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి..  టెక్నికల్‌గా పాటల విషయంలో సంగీత దర్శకుడు భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. శ్యామ్ దత్ - దినేష్ క్రిష్ణన్‌ల సినిమాటోగ్రఫి సినిమాను మరో మెట్టు ఎక్కించింది. వారు క్యాంపస్ వాతావరణాన్ని, పాత్రలను అందంగా చూపించింది. నిర్మాణం పరంగా సినిమా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.  ప్లస్‌ పాయింట్స్‌ నటీనటుల నటనకామెడీ సీన్స్‌సంభాషణలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పాటలుకథ పెద్దగా లేకపోవడం రేటింగ్‌: 3.5/5
    అక్టోబర్ 06 , 2023

    @2021 KTree