UTelugu2h 28m
గోపాలుడు అనే రైతు అనాథలైన రాజు, లక్ష్మీలకు సాయం చేస్తాడు. గ్రామంలో వైద్య శిబిరానికి వచ్చిన డా.రేఖను గోపాలుడు ఆటపట్టిస్తాడు. ఆమె కొన్ని రోజుల తర్వాత మారువేషంలో గ్రామానికి వచ్చి గోపాలుడికి దగ్గరవుతుంది. చివరికి అతడ్ని అవమానించి వెళ్లిపోతుంది. అప్పుడు గోపాలుడు ఏం చేశాడు? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
How was the movie?
తారాగణం
నందమూరి బాలకృష్ణ
బంగారు మువ్వ బాల గోపాలంసుహాసిని మణిరత్నం
రేఖరావు గోపాల్ రావు
నరసింహంలింగయ్య
జగ్గయ్య
చంద్ర శేఖర్ రావుమోహన్ బాబు
గోవింద బాబుగిరి బాబు
తిక్కన్నమల్లికార్జునరావు
స్కూల్ మాస్టర్చిట్టి బాబు
రాజ్హేమ సుందర్నరసయ్య
భీమేశ్వరరావు అధికారి
మదన్ మోహన్డ్రామా ఆర్టిస్ట్
జయ భాస్కర్అనాథ శరణాలయం వార్డెన్
చిడతల అప్పారావుకుంగ్ ఫూ మాస్టర్
తాతా అప్పారావుడాక్టర్
గాదిరాజు సుబ్బారావు ఆఫీసర్
జుట్టు నరసింహంమృతదేహం
హేమ
హేమ $రేఖ స్నేహితురాలురేఖకంఠం
మమతఅంబా శెట్టి
కుయిలినాగరత్నం
సంయుక్తరేఖ స్నేహితురాలు
నందమూరి కళ్యాణ్ రామ్
రాజారాశి
లక్ష్మిసిబ్బంది
కోడి రామకృష్ణ
దర్శకుడుMRV ప్రసాద్నిర్మాత
సంగీతకారుడు
కథనాలు
కళ్యాణ్ రామ్ (Kalyan Ram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
'తొలి చూపులోనే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. నందమూరి హరికృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బింబిసారా, పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాడు. టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని సీక్రెట్స్ మీకోసం.
కళ్యాణ్ రామ్ ముద్దు పేరు?
కళ్యాణ్ బాబు
కళ్యాణ్ రామ్ ఎత్తు ఎంత?
5 అడుగు 11 అంగుళాలు
కళ్యాణ్ రామ్ తొలి సినిమా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలగోపాలుడు(1989) చిత్రంలో నటించాడు. హీరోగా మాత్రం అతని మొదటి సినిమా 'తొలిచూపులోనే'
కళ్యాణ్ రామ్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
కళ్యాణ్ రామ్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జులై 5, 1978
కళ్యాణ్ రామ్ భార్య పేరు?
స్వాతి
కళ్యాణ్ రామ్ పెళ్లి ఎప్పుడు జరిగింది?
ఆగస్టు 10, 2006
కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరోయిన్?
సాయిపల్లవి, శ్రీదేవి
కళ్యాణ్ రామ్ ఫెవరెట్ హీరో?
Sr.NTR, రజనీకాంత్
కళ్యాణ్ రామ్ తొలి హిట్ సినిమా?
అతనొక్కడే చిత్రం తొలి హిట్ అందించింది. ఆ తర్వాత పటాస్, బింబిసార చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అందించాయి.
కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన కలర్?
వైట్ అండ్ బ్లాక్
కళ్యాణ్‌రామ్‌కు ఇష్టమైన సినిమా?
దానవీర సూరకర్ణ
కళ్యాణ్ రామ్ తల్లి పేరు?
లక్ష్మి హరికృష్ణ
కళ్యాణ్ రామ్‌కు ఇష్టమైన ప్రదేశం?
కేరళ, మనాలి
కళ్యాణ్ రామ్ చదువు?
MS(USA)
కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాడు.
కళ్యాణ్ రామ్ ఇష్టమైన ఆహారం?
చేపల కూర
కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడు?
దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు
కళ్యాణ్ రామ్ అభిరుచులు?
బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం
కళ్యాణ్ రామ్ వ్యాపారాలు?
NTR క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఇప్పటివరకు 10 చిత్రాలను నిర్మించారు
కళ్యాణ్ రామ్ నికర ఆస్తులు(Net Worth)?
రూ.110కోట్లు
https://www.youtube.com/watch?v=xmZT13t7xxI
మార్చి 21 , 2024
Suhani Bhatnagar: ‘దంగల్’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ చిత్రం 'దంగల్'లో బాల నటిగా చేసిన ‘సుహాని భట్నాగర్’ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ షాక్‌కి గురి చేసింది.
https://twitter.com/kadak_chai_/status/1758784936247746905?s=20
కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి.
సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సుహానీ ఈ ఉదయం ప్రాణాలు విడిచింది.
సుహానికి సంబంధించిన అంత్యక్రియలను ఫరిదాబాద్ సెక్టార్ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.
సుహానీ 2016లో వచ్చిన ‘దంగల్’ (Dangal) సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అమీర్‌ఖాన్‌తో పాటు కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్‌కు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమా తరువాత ఈ ఫాతిమా, సన్యాస, సుహానిలకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్‌ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకున్నారు.
కానీ సుహాని (Suhani Bhatnagar) మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై చదువులో బిజీ అయ్యింది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను సుహాని పలకరిస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని వారితో పంచుకునేది.
ఈ క్రమంలో సుహాని పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్, అందం చూసి ఆశ్చర్యపోయేవారు.
సుహాని అందాన్ని కచ్చితంగా వెండితెరపై చూడాల్సిందేనని బాలీవుడ్ ఆడియన్స్ భావించారు. ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ ఎదురైంది.
సుహాని అకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 17 , 2024
Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్ సక్సెస్ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
నటీనటులు : చైతన్యరావు, సునీల్, హర్ష చెముడు, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు
దర్శకుడు : సంతోష్ కంభంపాటి
సంగీతం : రీ
సినిమాటోగ్రాఫర్ : బాల సరస్వతి
ఎడిటర్ : శశాంక్ ఉప్పుటూరి
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్ శ్రీనివాసన్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చైతన్య (చైతన్యరావు) డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. స్నేహితుడ్ని (హర్ష) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో చివరికి తానే నిర్మాతగా మారి సినిమా తీయాలని ఫిక్సవుతాడు. డబ్బు కోసం శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) సెకండ్ సెటప్‌ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తాడు. మరోవైపు బారు శ్రీను (సునీల్), పారు (శ్రద్దా దాస్) కూడా ఆమెను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బారు శ్రీను ఎవరు? అతడి కథేంటి? చైతన్య డైరెక్టర్ అయ్యాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. బార్ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సంతోష్ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్ మూవీగా మారిపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథకామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఏప్రిల్ 19 , 2024
అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
అఖిల్ అక్కినేని ఎవరు?
అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు
అఖిల్ ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
అఖిల్ ఎక్కడ పుట్టారు?
కాలిఫోర్నియా, అమెరికా
అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు?
1994 ఏప్రిల్ 08
అఖిల్ వివాహం అయిందా?
లేదు ఇంకా జరగలేదు
అఖిల్‌కి ఇష్టమైన రంగు?
బ్లాక్
అఖిల్ అభిరుచులు?
డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం
అఖిల్‌కు ఇష్టమైన ఆహారం?
ఫిష్ ఫ్రై
అఖిల్ అభిమాన నటుడు?
నాగార్జున, పవన్ కళ్యాణ్
అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు?
మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
అఖిల్ ఏం చదివాడు?
BBA
అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 8 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=-Qq6ff-0uQM
అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు.
అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.
మార్చి 21 , 2024
‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు…. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే
]10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.Watch Now
ఫిబ్రవరి 13 , 2023
Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
నటీనటులు : అలియా భట్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా, అకాంక్ష రంజన్ కపూర్, మనోజ్ పహ్వా, యువరాజ్ విజయన్, జసన్ షా, ధీర్ హిరా, ఆదిత్య నంద తదితరులు
దర్శకత్వం : వాసన్ బాల
సంగీతం : అచింత్ థక్కర్
సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానే
ఎడిటింగ్ : ప్రేర్నా సైగల్
నిర్మాతలు : కరణ్ జోహార్, అలియా భట్, షాహీన్ భట్, అపూర్వ మెహతా
విడుదల తేదీ : 11-10-2024
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్‌మెంట్ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్ పాత్రలో వేదాంగ్ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వాసన్ బాలా జైల్ బ్రేక్ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్‌ను ఆడియన్స్ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ చక్కగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ మూవీని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అలియా భట్ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Honeymoon Express Review: బోల్డ్ కంటెంట్ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ రివ్యూ!
నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు
డైరెక్టర్ : బాల రాజశేఖరుని
సంగీతం : కల్యాణి మాలిక్
నేపథ్య సంగీతం : ఆర్.పి పట్నాయక్
నిర్మాత : కేకేఆర్, బాలరాజు
విడుదల తేదీ: 21 జూన్, 2024
చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) ఫస్ట్ టైమ్ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుందా? చైతన్యరావు, హెబ్బాపటేల్‌కు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
ఇషాన్ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్ కపుల్స్ పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్ - సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కొన్ని రోజులుగా వరుస చిత్రాలతో అలరిస్తున్న చైతన్య రావు.. ఈ సినిమాలోనూ చక్కటి నటన కనబరిచాడు. రెండు వేరియేషన్స్‌లో నటించి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ మరోమారు తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీరి మధ్య కెమెస్ట్రీ యూత్‌ను మెప్పిస్తుంది. సీనియర్ జంటగా తనికెళ్ల భరణి, సుహాసిని ఎప్పటిలాగే తమ సెటిల్డ్ నటనతో అలరించారు. థియేటర్లలో నవ్వులు పూయించారు. కథ మెుత్తంగా ప్రధానంగా ఈ నలుగురు మధ్యే సాగడం గమనార్హం. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పెళ్లైన కొత్త జంట కొద్ది రోజులకే విడిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యువ జంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకే విడాకుల వరకూ వెళ్తున్నారు. ఈ అంశాన్నే కథాంశంగా తీసుకొని దర్శకుడు బాల శేఖరుని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ మూవీ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కథ చెప్పే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంటూ కథను ఎటెటో తీసుకెళ్లి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు మరీ బోల్డ్‌గా అనిపిస్తాయి. వల్గారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యూచర్ నుంచి రావడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్.పి పట్నాయక్ అందించిన నేపథ్యం సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన పనిని ఇంకాస్త బెటర్‌గా నిర్వహించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
చైతన్య రావు, హెబ్బా పటేల్ నటనసమకాలిన అంశాలు ఉండటంసంగీతం
మైనస్ పాయింట్స్
కథనం, స్క్రీన్‌ప్లేసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 2.5/5
https://telugu.yousay.tv/en/do-you-know-these-top-secrets-about-hebah-patel.html
జూన్ 21 , 2024
Alia Bhatt: ఆ పని చేస్తే అలియాకు చెడ్డ చిరాకు.. RRR ముద్దుగుమ్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రణ్‌బీర్ కపూర్ సతీమణి అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో 100 మోస్ట్ ఇన్‌ప్లూయెన్సియల్ పీపుల్ జాబితలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమై వ్యక్తుల జాబితాను ఏటా టైమ్స్ మ్యగజైన్ విడుదల చేస్తుంటుంది. గతేడాది.. మూవీ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి, షారుక్ ఖాన్ మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది అలియా భట్ చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సినీవర్గాల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ సందర్భంలో అలియా భట్ గురించి టాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
అలియా భట్ ముద్దు పేరు?
అలూ..
అలియా భట్ వయస్సు ఎంత?
అలియా భట్ 1993 మార్చి 15న జన్మించింది
అలియా భట్ తెలుగులో నటించిన తొలి సినిమా?
RRR
అలియా భట్ హిందీలో నటించిన తొలి సినిమా?
సంఘర్ష్(1999) చిత్రంలో బాల నటిగా పరిచయమైంది
అలియా భట్ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం?
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్(2012)
అలియా భట్ ఎత్తు ఎంత?
5 అడుగుల 3 అంగుళాలు (160cm)
అలియా భట్ ఫిగర్ మెసర్‌మెంట్స్ ?
33-26-34
అలియా భట్ ఎక్కడ పుట్టింది?
ముంబై, మహారాష్ట్ర
అలియా భట్ ఏం చదివింది?
హైస్కూల్
అలియా భట్ స్కూలింగ్ ఎక్కడ జరిగింది?
జమ్నాబాయి నార్సీ స్కూల్, ముంబై
అలియా భట్ అభిరుచులు?
సింగింగ్, యోగా చేయడం, షాపింగ్, ట్రావెలింగ్, కూకింగ్
అలియా భట్‌కు ఇష్టం లేని పనులు?
వేడిగా ఉండే ఆహార పదార్థాలను తినడం
అలియా భట్‌కు ఎక్కడ టాటూ ఉంది?
అలియా వీపు వెనుక భాగంలో 'Pataka' అని హిందీలో రాని ఉంటుంది
అలియా భట్‌కి ఇష్టమైన ఆహారం?
పోహా, ఫిష్, రాగి చిప్స్, రసగుల్ల, మూంగ్ దాల్ హల్వా
అలియా భట్‌కు అఫైర్స్ ఉన్నాయా?
అలియా తొలుత వరుణ్ ధావన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత వ్యాపారవేత్త కవిన్ మిట్టల్‌తో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అలియా భట్‌కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
అలియా భట్ వివాహం ఎప్పుడు జరిగింది?
అలియా భట్ వివాహం బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో 2022లో ఏప్రిల్ 14న పెళ్లి జరిగింది
అలియా భట్, రణ్‌బీర్ దంపతులకు ఎంత మంది పిల్లలు?
2022 నవంబర్ 6న ఈ దంపతులకు పాప జన్మించింది. పాప పేరు రహా
అలియా భట్‌కు ఇష్టమైన హీరో?
షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో
అలియా భట్‌కు ఇష్టమైన హీరోయిన్?
కరీనా కపూర్, కంగనా రనౌత్
అలియా భట్‌కు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్?
ఏఆర్ రెహ్మాన్
అలియా భట్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.10 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
అలియా భట్ తల్లిదండ్రుల పేరు?
మహేష్ భట్, సోని రజదాన్
https://twitter.com/DexterBaddie/status/1694933272059642020
అలియా భట్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
అలియా భట్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది
అలియా భట్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/aliaabhatt/
అలియా భట్ నెట్‌వర్త్ ఎంత?
అలియా భట్ నెట్ వర్త్ సుమారు రూ.40 కోట్లు
అలియా భట్ అల్కాహాల్ తాగుతుందా?
అవును తాగుతుంది.
అలియా భట్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి?
ల్యాండ్ రోవర్, ఆడీ క్యూ7, ఆడీ క్యూ5,BMW7 సిరీస్
అలియా భట్ గురించి మరికొన్ని ఆసక్తి విషయాలు
అలియా భట్‌కు చీకటి అంటే భయం, రాత్రి సమయంలో లైట్లు వేసుకునే పడుకుంటుంది.అలియా భట్‌కు హాట్ డ్రింక్స్‌కంటే కూల్ డ్రింక్స్ అంటే ఇష్టంస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం చేసి ఆడిషన్స్‌లో అలియా భట్ 400 మంది అమ్మాయిలతో పోటీ పడి మరి హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.అలియా ఎప్పుడు తన ఫింగర్స్‌ను వాసన చూసే అలవాటు ఉంది.అలియాకు పెంపుడు జంతువులంటే ఇష్టం 'పెటా'తో కలిసి హోమ్‌లెస్ జంతువులను కాపాడుతుంటుంది.అలియా భట్‌కు విమానంలో వెళ్లడమంటే భయం
https://www.youtube.com/watch?v=CgwSY4DZHwM
ఏప్రిల్ 18 , 2024
మహేష్ బాబు గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
తెలుగులో అత్యంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా... తనకంటూ ప్రత్యేకమైన శైలీ, యాక్టింగ్ నేచర్‌తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ.. రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. మరి అలాంటి సూపర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు పుట్టినరోజు ఎప్పుడు?
మహేష్ బాబు ఆగస్టు 9న చెన్నైలే జన్మించారు. నటుడు కృష్ణ, ఇందిరలకు జన్మించిన ఐదుగురు పిల్లలలో అతను నాల్గవవాడు.
మహేష్ బాబు ఎవరు?
మహేష్ బాబు ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత.
మహేష్ బాబు ఎత్తు ఎంత?
6 అడుగులు
మహేష్ బాబు హీరోగా ఎన్ని సినిమాలు ఆడాడు?
సూపర్ స్టార్ మహేష్ నీడ (1979) చిత్రంలో బాల నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తరువాత, అతను బాల నటుడిగా బాల నటుడిగా 9 సినిమాలు చేసాడు. మేయిన్ హీరోగా ఇప్పటి వరకు 28 చిత్రాలకు పనిచేశాడు.
మహేష్ బాబుకు పెళ్లయిందా?
మహేష్ బాబు.. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ను ఫిబ్రవరి 10, 2005న వివాహం చేసుకున్నాడు. వంశీ చిత్రంలో మహేష్ సరసన నమ్రత కలిసి నటించారు.
మహేష్ బాబు ఎక్కడ నివసిస్తున్నారు?
మహేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు. భారతదేశంతో పాటు విదేశాలలో అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నాడు.
మహేష్ బాబు కొత్త సినిమా ఏమిటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో కలిసి # SSMB29లో నటిస్తున్నాడు.
మహేష్ బాబుకి ఇష్టమైన ఆహారం, పుస్తకాలు మరియు అభిరుచులు?
ప్రిన్స్ మహేష్ బాబుకి ఇష్టమైన వంటలలో హైదరాబాదీ బిర్యానీ ఒకటి. మహేష్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం."ఎమోషనల్ ఇంటెలిజెన్స్" మహేష్‌కి ఇష్టమైన పుస్తకం.
మహేష్ బాబుకి ఫిల్మ్ అవార్డ్స్
మహేష్ బాబు ఎనిమిది ప్రతిష్టాత్మక నంది అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, మూడు సిని'మా' అవార్డులు, మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, నాలుగు SIIMA అవార్డులు అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=4TljKLaVuM0
ఏప్రిల్ 08 , 2024
CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్. ఆయన ఎవరో కాదు చియాన్ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.
శివ పుత్రుడు
పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు.
అపరిచితుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
మల్లన్న
విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఐ
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
నాన్న
విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్ ఇప్పటికే చాలామందిని మెప్పించింది.
ఇంకొక్కడు
ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.
తంగలాన్
విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
ఏప్రిల్ 18 , 2023
Jr NTR Sons: టాలీవుడ్ ఫ్యూచర్‌పై కర్చీఫ్ వేసిన తారక్ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లేనా!
దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్ ఏంజలిస్ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిడ్డల సినీ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే!
టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్, భార్గవ్ సినిమా ఎంట్రీని ఎక్స్‌పెక్ట్ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
తారక్.. నందమూరి వారసుడు కాదా?
ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.
హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం!
నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్, కల్యాణ్ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
'దేవర 2'.. తారక్ ఏం చెప్పారంటే?
కలెక్షన్స్ పరంగా దేవర సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర 2'పై తారక్ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్ అన్నారు.
అక్టోబర్ 07 , 2024
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీనిపై తాజాగా ఆయన భార్య ఆర్తి స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. జయం రవి తరహాలోనే సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు.
‘నా అనుమతి తీసుకోలేదు’
సినీ నటుడు జయం రవి విడాకులు అంశంపై అతడి భార్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తెలియకుండానే తన భర్త విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. అతడి బహిరంగ ప్రకటన చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక నోట్‌ను రిలీజ్ చేశారు. ‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు’ అని ఆర్తి రాసుకొచ్చారు.
View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)
'అన్యాయంగా నాపై నిందలు'
జయం రవి చేసిన విడాకుల ప్రకటనతో తనతోపాటు తన పిల్లలు సైతం షాక్‌కు గురైనట్లు అతడి భార్య ఆర్తి అన్నారు. ‘ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు.
ఇష్టపూర్వకంగానే విడాకులు: జయం రవి
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు.
https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611
తారా స్థాయికి గొడవలు!
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రీమేక్‌తో స్టార్‌గా గుర్తింపు
1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?
తమిళ స్టార్ హీరో జయం రవికి కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
‘మా ఇద్దరి మంచి కోసమే..’
నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. ఈ విషయంపై రూమర్స్, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు.
https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611
15 ఏళ్ల బంధానికి బ్రేక్
2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమాతోనే గుర్తింపు
1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్ ఫిల్మ్. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించి పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
సెప్టెంబర్ 09 , 2024
New OTT Releases Telugu: ఈ వారం సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి చిన్న హీరోల చిత్రాలే విడుదల కావడానికి ఓ కారణం ఉంది. జూన్ 27న ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల కానుంది. దీంతో పెద్ద సినిమాలు ఏవి ఈ వారం విడుదలయ్యేందుకు సాహించలేదు. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
నింద
వరుణ్‌సందేశ్ హీరోగా.. రాజేశ్ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై పడింది? అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.
హనీమూన్ ఎక్స్‌ప్రెస్
చైతన్యరావు, హెబ్బా పటేల్ ఫస్ట్ టైమ్ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.ఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
OMG
హస్యనటుడు వెన్నెల కిషోర్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఇటీవల ‘చారి 111’ చిత్రంలో ఫ్లాప్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఈ వారం హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాడు. నందిత శ్వేత హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
రక్షణ
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రక్షణ’ (Rakshana) ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 21 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో పాయల్ తొలిసారి పోలీసు అధికారిణి పాత్ర పోషించింది.
బాక్
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’ (Baak Movie). ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘బాక్’ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా జూన్ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
కోటా ఫ్యాక్టరీ సీజన్-3
నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు విజయవంతం కాగా, మూడో సీజన్ జూన్ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే జీతూ భయ్యా చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.
TitleCategoryLanguagePlatformRelease DateAgent Of MysteriesSeriesEnglish/KoreanNetflixJune 18OutstandingMovieEnglishNetflixJune 18Maha RajSeriesHindiNetflixJune 19America’s SweetheartsSeriesEnglishNetflixJune 13NadigarMovieMalayalamNetflixJune 21Trigger WarningMovieEnglishNetflixJune 21Bad CopMovieHindiDisney + HotstarJune 21The HoldoversMovieEnglishJio CinemaJune 16House Of The Dragon 2SeriesEnglishJio CinemaJune 17IndustrySeriesEnglishJio CinemaJune 19Bigboss OTT 3Reality ShowHindiJio CinemaJune 21
జూన్ 17 , 2024
HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తారక్ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల నైపుణ్యం.. కళ్లు చెదిరే డ్యాన్స్ చేయగల సామర్థ్యం తారక్ సొంతం. అందుకే తారక్ లాంటి హీరోకు అభిమానులుగా ఉన్నందుకు ఫ్యాన్స్ కూడా గర్వపడుతుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) ముందు వరకూ టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రభంజనంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. టాలీవుడ్ గర్వించతగ్గ నటుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇవాళ (మే 20) జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినీ, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (Jr NTR Birthday Special Story)
అసలు పేరు
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు 'తారక్ రామ్' (Jr NTR Life Memorable Moments) . ఓ రోజు తారక్‌ను తీసుకొని తండ్రి హరికృష్ణ.. నందమూరి తారకరామారావు వద్దకు వెళ్లారు. అప్పుడు తారక్‌ను చూసిన ఎన్టీఆర్ ఎంతో మురిసిపోయారట. తన మనవడికి తనే పేరే పెట్టాలని సూచించారట. అంతేకాదు స్వయంగా ఆయనే నందమూరి తారక రామారావుగా తారక్ పేరు మార్చారు.
ఎనిమిదేళ్ల వయసులోనే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నట ప్రస్థానాన్ని బాల్యం నుంచి మెుదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బాల రామయాణం’ కంటే ముందే తారక్ ఓ సినిమాలో నటించాడు. తారక్ తన ఎనిమిదేళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించాడు. (Jr NTR Birthday Special Story)
100కి పైగా ప్రదర్శనలు
తారక్‌కు కూచిపూడి నృత్యంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. 12 ఏళ్ల పాటు కూచిపూడి సాధన చేశాడు. దేశవ్యాప్తంగా 100పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రస్తుతం తారక్ ఈ స్థాయిలో డ్యాన్స్ ఇరగదీస్తున్నాడంటే అందుకు కారణం.. కూచిపూడిలో నేర్చుకున్న మెళుకువలేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఆ విషయంలో ఎప్పటికీ లోటే!
కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో తారక్ ముందు వరుసలో ఉంటాడు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వెంటనే ఫ్యామిలీ ఎదుట వాలిపోతుంటాడు. అయితే తారక్‌కు తొలి నుంచి ఓ కుమార్తె కావాలన్న కోరిక ఉండేదట. అయితే భార్య ప్రణతీకి ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కూతురు లేదన్న లోటు తనకెప్పుడూ ఉంటుందని ఓ ఇంటర్యూలో తారక్ తెలిపాడు.
ఫోర్బ్స్ జాబితా
జాతీయ స్థాయిలో తారక్ (Jr NTR Life Memorable Moments) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ఈ క్రమంలోనే తారక్.. ‘ఫోర్బ్స్ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నాడు.
ఆ దేశంలో యమా క్రేజ్!
టాలీవుడ్ హీరోల క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఆయా దేశాల్లోని తెలుగు వారంతా తమకు ఇష్టమైన హీరోలను అభిమానిస్తూ వారి సినిమాలకు ఓవర్సీస్‌లో సక్సెస్ చేస్తుంటారు. అయితే జపాన్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్ తారక్‌కు ఉంది. అక్కడ జూ.ఎన్టీఆర్‌ను అభిమానించే వారి సంఖ్య గణనీయసంఖ్యలో ఉంటుంది.
ఎన్టీఆర్ మంచి గాయకుడు
ఎన్టీఆర్ అద్భుతంగా నటించడమే కాదు.. మంచిగా పాటలు కూడా పాడగలడు. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్ ఈజ్ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అతడు ఫ్యాన్స్‌ను అలరించాడు.
హోస్ట్‌గానూ సూపర్ సక్సెస్
ప్రముఖ టెలివిజన్ షోలకు తారక్ గతంలో హోస్ట్‌గానూ (Jr NTR Life Memorable Moments) వ్యవహిరించాడు. గొప్ప వ్యాఖ్యాతగా గుర్తింపు పొందాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్ తెలుగు’ షోలకు హోస్ట్‌గా పని చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను సంపాదించాడు.
తారక్ ఫేవరేట్ నెంబర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అందరిలాగే కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తారక్‌కి ‘9’ సంఖ్య అంటే మహా ఇష్టం. దానిని తన లక్కీ నెంబర్‌గా ఫీలవుతుంటాడు తారక్. తన కారు నెంబర్ ప్లేట్ కూడా 9999 వచ్చేలా తీసుకున్నాడు. ట్విటర్
ఫేవరేట్ సాంగ్ & సినిమా
తారక్‌కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాడు. తారక్ ఆల్‌టైమ్ ఫేవరేట్ సాంగ్.. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ). ఇష్టమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.
రికార్డు స్థాయిలో ఆడియో ఫంక్షన్
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మెుట్ట మెుదటి చిత్రం ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏపీలోని నిమ్మకూరులో జరిగిన ఈ ఈవెంట్ కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో సుమారు 10 లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు.
రీరిలీజ్ రికార్డు
గతేడాది ఇదే రోజున (మే 20) తారక్ బర్త్‌డేను పురస్కరించుకొని ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్ చేశారు. 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రసారం చేసి రికార్డు సృష్టించారు. ఒక రీరిలీజ్ చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించడం అదే తొలిసారి.
మే 20 , 2024
This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
సుందరం మాస్టర్
హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!
హాస్యనటుడు అభినవ్ గోమఠం లీడ్ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధార్థ్ రాయ్
బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్ సరోజ్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య గమనిక
విరాన్ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్ వేణు మురళీధర్ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక. రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది.
సైరెన్
జయం రవి, అనుపమ పరమేశర్వన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సైరెన్’ (Siren). ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు.
ఆర్టికల్ 370
అందాల తార యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్టికల్ 370’ (article 370). ఆదిత్య సుహాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu Amazon PrimeFeb 23Will Trent Series EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish Netflix Feb 23 The Buried TruthSeries HindiNetflix March 17
ఫిబ్రవరి 19 , 2024
Lord Rama Movies: ‘శ్రీరామ’ అనగానే గుర్తొచ్చే టాప్ తెలుగు చిత్రాలు ఇవే!
ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్ (Jai Shree Ram) నినాదాలతో యావత్ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆదిపురుష్
రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ (Aadipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.
శ్రీరామ రాజ్యం
బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి.
శ్రీ రామదాసు
శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు.
దేవుళ్లు
తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
బాల రామాయణం
చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం 'బాల రామాయణం' (Bala Ramayanam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.
శ్రీ సీతారామ జననం
1944లో విడుదలైన 'శ్రీ సీతా రామజననం' (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్ కూడా ఇచ్చారు.
సీతారామ కళ్యాణం
నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.
సంపూర్ణ రామాయణం
టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.
లవకుశ
నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.
జనవరి 23 , 2024
Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్.!
బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
https://twitter.com/i/status/1747997141644251346
టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
https://twitter.com/i/status/1746394374546559063
తాజాగా అవంతిక నటించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుదలై మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగుతుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మడు చాలా బోల్డ్‌గా కనిపించడంతో పాటు ఓ పాటలో శృతిమించి అందాల ప్రదర్శన చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
https://twitter.com/i/status/1746552711666094366
మనం చూస్తున్నది అప్పుడు తెలుగు సినిమాలలో చూసిన అవంతికనేనా.. ఇంతలో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది.
https://twitter.com/i/status/1746391190511952308
అవంతిక.. ఇండో-అమెరికన్ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంది.
2014లో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ (నార్త్ అమెరికన్ ఎడిషన్)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.
మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది.
ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం అవంతిక తన ఫోకస్ మెుత్తం హాలీవుడ్ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది.
హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్’ అనే హాలీవుడ్ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్, క్రౌన్ విషెష్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి.
ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) తల్లిదండ్రులు ఉన్నవాళ్లైనప్పటికీ తను ఓ రెస్టారెంట్‌లో పని చేస్తూ మరో వైపు సినిమాలలో నటిస్తూ చాలామంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
జనవరి 19 , 2024
Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.
పూసింది పూసింది పున్నాగ
సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి.
https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s
యమహా నగరి కలకత్తా పురి
చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు.
https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE
యమునాతీరం
ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు.
https://www.youtube.com/watch?v=375j2vlMbxM
ఉప్పొంగెలే గోదావరి
గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.
https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ
తొలిసారి మిమ్మల్ని
శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.
https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE
చుక్కల్లారా చూపుల్లారా
ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.
https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE
పచ్చందనమే
సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.
https://www.youtube.com/watch?v=XruNLPI0yQc
జిలిబిలి పలుకుల
సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా..
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో.
https://www.youtube.com/watch?v=yJNSkGafGJw
మౌనమేళనోయి
సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.
https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs
రెక్కలొచ్చిన ప్రేమ
బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి.
https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
జూన్ 21 , 2023
Vijay Devarakonda: బర్త్‌డే బాయ్ విజయ్ గురించి మీకు తెలియని టాప్ - 10 సీక్రెట్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్ రెడ్డి… విజయ్ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్ పాయింట్స్ ఏవి? వంటి టాప్-10 ఆసక్తికర విషయాలు మీకోసం..
1. విజయ్ తండ్రి కల
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్ రాకపోతేనేం అని భావించి టెలివిజన్ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
2. బాల నటుడిగా..
విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్ మెరిశాడు. అందులో ఒక డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్ స్టార్ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
https://youtu.be/iQYaUQ55mo8
3. ఇంగ్లీష్ టీచర్‌గా..
విజయ్ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్ తనకు సినిమాలపై ఇంట్రస్ట్ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేర్పించాడు.
4. నటనలో ఓనమాలు
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్ మెరిశాడు.
5. తొలి సినిమా
‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.
6. సెన్సార్ బోర్డుపై విమర్శలు
అర్జున్ రెడ్డి సినిమాపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్ రెడ్డి యూనిట్ అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.
7. ఒకేసారి 6 సినిమాలు
2018లో విజయ్ చేసిన ఆరు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.
8. ఫోర్భ్స్ జాబితాలో స్థానం
2019లో ఫోర్బ్స్ ఇండియా అండర్ - 30 జాబితాలో విజయ్ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గానూ విజయ్ గుర్తింపు పొందాడు.
9. ఇన్‌స్టాగ్రామ్ క్రేజ్
2018లో విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.
10. ఫిల్మ్‌ఫేర్ అవార్డు
అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విజయ్ డొనేట్ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్ అన్నాడు.
మే 09 , 2023