• TFIDB EN
  • బలుపు
    ATelugu2h 23m
    హీరో ఓ బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. స్నేహితుడ్ని మోసం చేసిన శ్రుతికి బుద్ది చెబుతాడు. ఈ క్రమంలో శ్రుతి అతడ్ని ప్రేమిస్తుంది. అయితే వీరి నిశ్చితార్థాన్ని విలన్ అడ్డుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రవి గతం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రవితేజ
    రవి/శంకర్
    శృతి హాసన్
    శృతి
    అంజలి
    ప్రకాష్ రాజ్
    మోహన్ రావు/నానా/నానాజీ (రవి తండ్రి)
    అడివి శేష్
    రోహిత్ (శృతి కాబోయే భర్త)
    అశుతోష్ రాణా
    పూర్ణ
    బ్రహ్మానందం
    క్రేజీ మోహన్/ ఫుల్కా
    అలీ
    డా. సావిత్రి
    నాసర్
    శృతి తండ్రి
    బ్రహ్మాజీ
    సూరి
    షానూర్ సనా
    రోహిత్ తల్లి
    ఆదిత్య మీనన్
    నానాజీ సోదరుడు
    రఘు బాబు
    నానాజీ అనుచరుడు
    రావు రమేష్
    AR నాయుడు
    వేణురవి స్నేహితుడు
    జయ ప్రకాష్ రెడ్డి
    సీఐ బసవ
    అజయ్
    బాబ్జీ
    షఫీ
    కాసి
    చత్రపతి శేఖర్
    శేఖర్
    సత్యం రాజేష్
    రవి స్నేహితుడు
    సుప్రీత్
    పూర్ణ అనుచరుడు
    ప్రభాస్ శ్రీను
    రోహిత్ హెంచ్ మాన్
    ఫిష్ వెంకటయ్య
    పూర్ణ అనుచరులు
    రఘు కారుమంచి
    పూర్ణ అనుచరులు
    AVS
    సురేఖ వాణి
    ప్రవీణ్
    రవి స్నేహితుడు
    గుండు సుదర్శన్
    మోహన్ రావు స్నేహితుడు
    తాగుబోతు రమేష్
    శంకర్ డై హార్ట్ ఫ్యాన్
    అర్చన శాస్త్రి
    స్వయంగా
    రాయ్ లక్ష్మి
    ఒక ఐటెమ్ నంబర్ లక్కీ రాయ్
    సిబ్బంది
    గోపీచంద్ మలినేని
    దర్శకుడు
    పొట్లూరి వర ప్రసాద్
    నిర్మాత
    కోన వెంకట్
    రచయిత
    కెఎస్ రవీంద్ర
    రచయిత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    జయనన్ విన్సెంట్ ISC
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    Raai Laxmi: థండర్ థైస్ అందాలతో పంబ రేపుతున్న రాయ్ లక్ష్మి.. కుర్రకారుకు కనుల విందు!
    హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి సోగసుల విందు చేసింది. మల్దీవ్స్‌లో వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాల తెగింపునకు పాల్పడింది. థండర్ థైస్ అందాలతో కుర్రకారుకు కనువిందు చేసింది. వైట్ డ్రెస్‌లో అమ్మడి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. బోట్‌లో ప్రయాణిస్తూ డ్రింక్ స్విప్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక రాయ్ లక్ష్మి థండస్ థైస్ అందాలకు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఫ్యాన్స్  ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఈ హాట్ డాల్ ఎప్పుడు ఫోటోలు పెడుతుందా.. ఎప్పుడూ తమ కామెంట్లకు పనిచెప్పాలా అని ఉబలాటపడుతుంటారు. 3 పదుల వయసులోనూ తరగని అందంతో కుర్రకారు డ్రీమ్‌ గర్ల్‌గా మారింది రాయ్ లక్ష్మి. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో 15 ఏళ్ల క్రితమే తెరంగేట్రం చేసింది తొలి చిత్రం నుంచే అందాల దాడి పెంచిన రాయ్ లక్ష్మి ఇండస్ట్రీలో గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత దక్షిణాది భాషల్లో బిజీగా మారి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.  సర్దార్ గబ్బర్ సింగ్, బలుపు, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఖైదీ 150 సినిమాలో చిరంజీవి సరసన ఐటెం సాంగ్‌లో నటించి ప్రేక్షకుల చేత ముద్దుగా రత్తాలుగా పిలిపించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి... అందాల ఆరబోతకు కెరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తోంది. ఇక సముద్రయానానికి వెళ్లిందంటే.. రాయ్ లక్ష్మి అందాల దాడిని ఎవరు ఆపలేరు. బికినీ అందాలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. సింగిల్ పీస్ ధరించి ఇచ్చే ఫోజులకు, ఆమె కళ్లు చెదిరే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎప్పటికప్పుడూ తన అందాలకు మెరుగులు అద్దుతూ సరికొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది రాయ్ లక్ష్మి. ఇక సినిమా ఈవెంట్లలో అమ్మడు ప్రదర్శించే అందాలకు కొలత కట్టడం అసాధ్యమే. ఆ రీతిలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్.  ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. సోలో రోల్స్‌తో పాటు గ్లామర్‌కు అవకాశం ఉండే పాత్రలను సైతం ఇష్టంగా చేస్తోందీ సొగసుల సంచలనం.
    అక్టోబర్ 23 , 2023
    <strong>Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..!&nbsp;</strong>
    Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..!&nbsp;
    కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్‌ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది.&nbsp; తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.&nbsp; రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మీ రాయ్‌.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్‌ తాగుతూనే హాట్‌ మీటర్లను బద్దలు కొట్టింది.&nbsp; లక్ష్మీ రాయ్‌ లేటెస్ట్‌ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలకు మైమరిచిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ కటౌట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; కర్ణాటకలోని బెంగళూరు జన్మించిన లక్ష్మీ రాయ్‌.. 2005లో వచ్చిన 'కర్క కసధార' అనే తమిళ చిత్రం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.&nbsp; అదే ఏడాది శ్రీకాంత్‌ పక్కన 'కాంచనమాల కేబుల్‌ టీవీ'లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో శిరీష / కాంచనమాల పాత్రల్లో ఈ అమ్మడు అదరగొట్టింది.&nbsp; ఆ తర్వాత 'నీకు నాకు' (2006) సినిమాతో మరోమారు టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ కూడా సక్సెస్‌ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలతో ఫోకస్‌ పెట్టిన లక్ష్మీ రాయ్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; 2011లో లారెన్స్‌ సరసన కాంచన సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌షోతో మంచి మార్కులే కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత తెలుగులో అధినాయకుడు (2012), బలుపు (2013) చిత్రాల్లో కనిపించి ఆకట్టుకుంది. అధినాయుకుడు ఆమె పోషించిన దీప్తి పాత్ర నటిగా లక్ష్మీ రాయ్‌కు గుర్తింపు తీసుకొచ్చింది.&nbsp; మెగాస్టార్‌ రీఎంట్రీ చిత్రం ‘ఖైదీ 150’లో ‘రత్తాలు రత్తాలు’ అనే స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి లక్ష్మీ రాయ్‌ ఆకట్టుకుంది. చిరంజీవితో పోటీపడి మరి స్టెప్పులేసి ప్రశంసలు అందుకుంది.&nbsp; తెలుగులో చివరిగా 2019లో వచ్చిన 'వేర్‌ ఇజ్‌ ద వెంకటలక్ష్మీ' చిత్రంలో లక్ష్మీ రాయ్‌ చేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు దక్కలేదు. ఇటీవల ‘డీఎన్‌ఏ’ అనే మలయాళ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ నటించింది. ఇందులో ఐపీఎస్‌ అధికారిణి పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాపై ఫోకస్‌ పెట్టింది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.&nbsp; క్రమం తప్పకుండా హాట్‌ ట్రీట్‌ ఇస్తుండటంతో లక్ష్మీ రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఎక్కువ మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాను 7.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
    జూన్ 21 , 2024
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్‌ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.&nbsp; తొలి కలెక్షన్స్ ఎంతంటే? తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్‌ దూకుడు ప్రదర్శించింది. యూఎస్‌ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు. రవితేజ టాప్‌-10 కలెక్షన్స్‌! (Ravi Teja Top 10 Highest Grossing Movies) ‘ఈగల్’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్‌ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. ధమాకా (Dhamaka) రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్‌ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.20 కోట్ల వరకూ జరిగింది.&nbsp; బడ్జెట్: 35 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు క్రాక్‌ (Krack)&nbsp; ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్‌, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్‌ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు తీర్పు: బ్లాక్ బస్టర్ రాజా ది గ్రేట్‌ (Raja the Great) రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్‌ కాగా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు తీర్పు: హిట్ బలుపు (BALUPU) రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రవితేజ గత చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.&nbsp; బడ్జెట్: 55 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు పవర్‌ (Power) రవితేజ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్‌’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్‌.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్‌ గణాంకాలను నమోదు చేసింది.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు తీర్పు: సగటు కంటే ఎక్కువ బెంగాల్ టైగర్‌ (Bengal Tiger) ఈ సినిమా బడ్జెట్‌ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు విక్రమార్కుడు (Vikramarkudu) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్‌ హిట్‌ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.&nbsp; బడ్జెట్: 11 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు కిక్‌ (Kick) రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్‌’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ కూడా అంతకే జరగడం గమనార్హం.&nbsp; బడ్జెట్: 14 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు కిక్‌ (KICK 2) అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్‌ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ బిజినెస్‌ రూ.36 కోట్లు. కిక్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; బడ్జెట్:&nbsp; 30Cr ప్రపంచవ్యాప్తంగా గ్రాస్:&nbsp; 43cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
    ఫిబ్రవరి 10 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    <strong>Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్‌ సుందరం, శశాంక్‌, సాయి చంద్‌, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు దర్శకత్వం : అభిలాష్ కంకర సంగీతం : జై కృష్ణ సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి ఎడిటింగ్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత : సునీల బలుసు విడుదల తేదీ: 11-10-2024 సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్‌ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్‌ బాబుకు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి ప్రకాష్‌ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్‌ బాబు)ని స్టాక్‌ బ్రోకర్‌ శ్రీనివాస్‌ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్‌ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్‌ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్‌ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌ సుధీర్‌ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్‌ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్‌ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్‌ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్‌ కంకర ఎమోషనల్‌ టచ్‌ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్‌ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ మెుత్తం సుధీర్‌ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్‌ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్‌ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్లో న్యారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5 
    అక్టోబర్ 10 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా?
    న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్&nbsp; పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ&nbsp; కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా &nbsp; టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ&nbsp; న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    Keerthy Suresh: నలుపు రంగు చీరలో మతిపోగొడుతున్న కీర్తి సురేష్‌..!
    Keerthy Suresh: నలుపు రంగు చీరలో మతిపోగొడుతున్న కీర్తి సురేష్‌..!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    జూన్ 02 , 2023
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    దీపావళి వేడుకల్లో  టాలీవుడ్‌ తారల్లా తారల ధగధగ
    దీపావళి వేడుకల్లో  టాలీవుడ్‌ తారల్లా తారల ధగధగ
    ] నలుపు చీరను బంగారు వర్ణంతో కమ్మేస్తూ దీపావళికి అసలైన నిర్వచనాన్నిచ్చే చీరలో మెరిసింది మన ఈషా రెబ్బా.ఈషా రెబ్బా
    ఫిబ్రవరి 11 , 2023
    పొట్టి గౌనులో శ్రియా శరన్ అందాల విందు
    పొట్టి గౌనులో శ్రియా శరన్ అందాల విందు
    ]తల్లి అయిన తర్వాత కూడా తన అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;</strong>
    Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!&nbsp;
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ ‘పూరి మ్యూజింగ్స్‌’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్‌ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సోషల్‌ మీడియా అనేది జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన సాధనమని, అయితే దానికి దూరంగా ఉంటే కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, విడాకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం పూరి జగన్నాథ్ అభిప్రాయం ప్రకారం.. ‘‘సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ప్రారంభమైన సాధనంగా కనిపించింది. కానీ, ఇప్పుడు మన జీవితాల్లో డిజిటల్‌ దెయ్యంలా మారింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల మనం ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం మొదలుపెట్టాం. కొత్త దుస్తులు కట్టినా, ఇంట్లో సంతోషంగా ఉన్నా, స్నేహితులతో గడిపినా ప్రతి క్షణం ఫొటో తీసి పోస్ట్ చేయడంపై ఆసక్తి పెరిగింది. కానీ దీని వల్ల మానసిక శాంతి పోయి, అసూయ, అసంతృప్తి పెరుగుతున్నాయి.’’ ట్రోలింగ్‌ సమస్య ‘‘మీరు ఏ ఫొటో పోస్ట్ చేసినా అది అందరికి నచ్చదు. మీరు మాల్దీవుల్లో బికినీ ఫొటో పంచుకున్నా ట్రోలింగ్‌ తప్పదు. కొందరు విమర్శిస్తారు, మరికొందరు అసభ్యంగా మాట్లాడతారు. వాటిని చూసి బాధపడుతూ మీ పని మానేసి బాధతో కూర్చుంటారు. ఎందుకంటే, ఆ ఫొటోలు చూసే వాళ్లు కూడా పని లేని వాళ్లే. చివరకు మీరు కూడా అదే స్థితిలో పడిపోతారు.’’ సోషల్ మీడియా కారణంగా విడాకులు ‘‘తాజా సర్వే ప్రకారం, 10 విడాకుల్లో 3 వివాహాలు సోషల్ మీడియా కారణంగా బంధాలు దెబ్బతినడం వల్లే జరుగుతున్నాయి. కుటుంబ సంబంధాల నాశనం ప్రధానంగా డిజిటల్ వేదికల వల్లే జరుగుతోంది. ఇంట్లో గొడవలు, అశాంతికి సోషల్ మీడియా ప్రధాన కారణమని గుర్తించాలి’’ అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలి పూరి ఇంకా మాట్లాడుతూ,‘‘మీ ఇంట్లో జరిగే విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు. మీ వ్యక్తిగత జీవితం గురించి బైట చెప్పకుండా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పెళ్లైన వారైతే ప్రతి ఫొటో, ప్రతి అంశం పంచుకోవడం ఆపేయాలి. మీ జీవితంలోని ఆనందాలు, కష్టాలు మీలోనే ఉంచుకోండి. మీ కుటుంబం మీదే దృష్టి పెట్టండి. దానివల్లనే జీవితానికి స్థిరత్వం వస్తుంది’’ అన్నారు. నెగెటివిటీకి దూరంగా ఉండండి ‘‘మీరు ఏ ఫొటో పెడితే అది నెగెటివిటీని ఆకర్షిస్తుంది. మీ కుక్క ఫొటో పెడితే అది అనారోగ్యానికి గురవుతుంది. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఫోటో పెడితే ఫుడ్‌ పాయిజనింగ్‌ సమస్యలు వస్తాయి. ఈ ప్రవర్తన ద్వారా ఇతరుల అసూయ మీకు సమస్యలను తీసుకురాగలదు’’ అని పూరి పేర్కొన్నారు. కొత్త ఏడాదికి కొత్త తీర్మానం ‘‘కొత్త సంవత్సరం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కనీసం ఒక్క నెల అయినా డిజిటల్‌ డిటాక్స్‌ చేపట్టండి. మీరు మీ జీవితంలో మానసిక శాంతి అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. మీ బంధాలు బలపడతాయి, విడాకులు తగ్గుతాయి, జీవితంలో సంతోషం పెరుగుతుంది’’ అని పూరి పేర్కొన్నారు. సమాజానికి పూరి సూచనలు పూరి చివరగా చెబుతూ..‘‘మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు మీ కుటుంబసభ్యులు. వాళ్లతో గడపడానికి మీరు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. డిజిటల్ ప్రపంచాన్ని వినియోగించండి కానీ అది మిమ్మల్ని మింగివేయకూడదు.’’ ఈ సందేశం ద్వారా పూరి జగన్నాథ్ నేటి యువతికి మరియు కుటుంబాలకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని అందించారు.
    డిసెంబర్ 30 , 2024
    <strong>Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!</strong>
    Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
    ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్‌ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా చూడాలన్న కోరిక బలపడుతుంది. అందుకే మేకర్స్‌ తమ సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వూలు, సోషల్‌ మీడియా ప్రకటనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే యంగ్‌ హీరో సుధీర్‌ బాబు నటించిన మా నాన్న సూపర్‌ హీరో చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్‌ చేస్తోన్న వినూత్న ప్రమోషన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. క్రేజీ ప్రమోషన్స్‌! టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యంగ్‌ హీరోల్లో సుధీర్‌ బాబు (Sudheer Babu) ఒకరు. ఇటీవల ‘హరోం హరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్‌ ఇప్పుడు మరో సినిమాతో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాడు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero) చిత్రం అక్టోబర్‌ 11న రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ వినూత్న ప్రమోషన్స్‌కు తెర లేపింది. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్‌ కనిపించేలా ప్రమోషన్స్ చేస్తోంది. యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, మంచు మనోజ్‌తో పాటు స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా ఈ వినూత్న ప్రమోషన్స్‌లో తమకు తెలియకుండానే భాగమయ్యారు. దీంతో ఈ ప్రమోషన్స్‌కు నెట్టింట విశేష స్పందన వస్తోంది. స్టార్లను భలే బురిడి కొట్టించారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సింపుల్ అండ్‌ న్యాచురల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు తెలిసే జరిగిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్.&nbsp; https://twitter.com/isudheerbabu/status/1843218217977966798 https://twitter.com/i/status/1842791222047367544 https://twitter.com/i/status/1842084097621164229 అవాక్కైనా మంచు మనోజ్‌! తనకు తెలియకుండానే మా నాన్న సూపర్‌ హీరో ప్రమోషన్స్‌లో భాగం కావడంపై మంచు మనోజ్‌ నెట్టింట స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్‌ బాబు తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేయగా దానికి అయోమయంగా చూస్తున్న బ్రహ్మీ జిఫ్‌ను జత చేశాడు. స్మైలీ ఎమోజీ ట్యాగ్‌ చేస్తూ తాను బాగా ఎంజాయ్‌ చేసినట్లు సంకేతం ఇచ్చారు. దీనిపై సుధీర్‌ బాబు కూడా ఆసక్తికర రిప్లే ఇచ్చారు. సారి బ్రో ఇంకో ఆప్షన్‌ దొరకలేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు. మొత్తానికి మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ మాత్రం చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. https://twitter.com/HeroManoj1/status/1842102892628509031 ట్రైలర్‌పై మహేష్ ఏమన్నారంటే! ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Promotions) ట్రైలర్‌ చూసి సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు చాలా మెచ్చుకున్నట్లు నటుడు సుధీర్‌ బాబు తెలిపారు. ‘మహేష్‌ బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్‌ కట్‌ ట్రైలర్‌ పంపిస్తే బాగుందని మెసేజ్‌ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్‌ ట్రైలర్‌ పంపా. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్‌ టచ్చింగ్‌గా ఉందన్నారు. ఆఖర్లో వచ్చే మహేష్‌ పేరున్న డైలాగ్‌ ఫన్నీగా ఉందన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా. అలా తను సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది’ అంటూ తాజా ఇంటర్వ్యూలో సుధీర్‌ చెప్పుకొచ్చారు.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!
    IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!
    భారత్‌లో ఐపీఎల్‌ మేనియా ప్రారంభమైంది. IPLలోని 10 జట్లు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో క్రికెట్‌ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా తలుపు తట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంబటి రాయుడు ఐపీఎల్‌లో దిగ్గజ తెలుగు బ్యాటర్ అంటే ముందుగా అంబటి రాయుడే గుర్తుకు వస్తాడు. తన ధనాధన్‌ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు తమ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అంబటి.. ముంబయి ఫ్రాంచైజీ తరపున అత్యధిక సీజన్లు ఆడాడు. ప్రస్తుతం CSK ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. క్రితం మ్యాచ్‌లో 27(14) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.&nbsp; మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాది పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా తలుపు&nbsp; తట్టాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లలో ఒకటిగా కొనసాగుస్తున్నాడు. RCB జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్‌ ఆ జట్టు కీలక బౌలర్‌గా ఎదిగాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ RCB విజయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.&nbsp;&nbsp; తిలక్‌వర్మ హైదరాబాద్‌కు చెందిన తిలక్‌వర్మ ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌ జట్టుకు తిలక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 వేలంలో తిలక్‌ను ముంబయి ఫ్రాంచైజీ రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో తిలక్ అద్భుతంగా రాణించడంతో అతడ్ని ముంబయి రిటైన్‌ చేసుకుంది. RCBతో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్‌ 84 (46) పరుగులు చేసి సత్తా చాటాడు.&nbsp; KS. భరత్‌ ఏపీలోని రామచంద్రాపురానికి చెందిన KS. భరత్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో RCB తరపున రాణించిన ఈ యంగ్‌ వికెట్‌కీపర్‌ను రూ. 1.2 కోట్లకు GT దక్కించుకుంది. అయితే గుజరాత్‌ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో భరత్‌కు అవకాశం దక్కలేదు. మరోవైపు ఈ ఏడాది కేఎస్‌ భరత్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌.. వికెట్‌ కీపర్‌గా రాణించాడు. https://twitter.com/i/status/1606292956318560256 షేక్‌ రషీద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి చెందిన షేక్‌ రషీద్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కొనుగోలు చేసింది. రూ.20 లక్షలకు దక్కించుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌-2022 గెలిచిన భారత జట్టులో షేక్‌ రషీద్‌ కూడా ఉన్నాడు. రషీద్‌ తన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం చెన్నై తరపున బ్యాటింగ్‌ చేసే అవకాశం లభిస్తే తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని రషీద్ ఉవ్విళ్లూరుతున్నాడు.&nbsp; https://twitter.com/i/status/1606583101110751233 నితీష్‌ కుమార్‌ వైజాగ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. రూ. 20 లక్షలకు ఈ యువ ఆటగాడ్ని సొంతం చేసుకుంది. నితీష్‌ ఆంధ్ర కిక్రెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంచి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఈ ఏడాది SRH జట్టు ద్వారా నితీష్ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ‘మనవాడు వచ్చాడోయ్‌ జరుగు జరుగు’ అంటూ అప్పట్లో సన్‌రైజర్స్‌ చేసిన ట్విట్‌ అందరిని ఆకట్టుకుంది.&nbsp; https://twitter.com/i/status/1606315679963316224 భగత్‌ వర్మ హైదరాబాది క్రికెటర్‌ భగత్‌వర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. 2023 ఐపీఎల్‌ వేలంలో రూ. 20 లక్షలు వెచ్చించి తమ గూటిలో చేర్చుకుంది. భగత్‌ బ్యాటింగ్‌ చేయడంతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ వేయగలడు. హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా భగత్‌ వర్మకు పేరుంది. ఈ నేపథ్యంలోనే CSK జట్టు భగత్‌ను కొనుగోలు చేసింది.&nbsp;
    ఏప్రిల్ 05 , 2023
    <strong>Toxic: ‘క**డోమ్ యాడ్‌లా ఉంది’.. టాక్సిక్ గ్లింప్స్‌పై నెట్టింట ఘోరమైన ట్రోల్స్‌!</strong>
    Toxic: ‘క**డోమ్ యాడ్‌లా ఉంది’.. టాక్సిక్ గ్లింప్స్‌పై నెట్టింట ఘోరమైన ట్రోల్స్‌!
    ‘కేజీఎఫ్‌’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్‌ (Yash) పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) సైతం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడంతో నేషనల్‌ వైడ్‌గా అతడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరింత బలపడింది. దీంతో అతడు చేస్తున్న ‘టాక్సిక్’ (Toxic) ఫిల్మ్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా ఇవాళ యష్‌ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ వీడియోనూ రిలీజ్‌ చేసింది. అయితే ఈ గ్లింప్స్‌పై ఫ్యాన్స్‌ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  గ్లింప్స్‌ ఎలా ఉందంటే? కన్నడ స్టార్‌ హీరో యష్‌ హీరోగా నటిస్తున్న టాక్సిక్‌ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌' అనే సాలిడ్‌ క్యాప్షన్‌ కూడా పెట్టారు. గతేడాది ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ ప్రారంభం కాగా ఏప్రిల్‌ 10న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇవాళ యష్‌ పుట్టిన రోజు నేపథ్యంలో ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో యష్‌ రెట్రో కారులో క్లబ్‌లోకి ఎంతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. క్లబ్‌లోని కుర్రకారు ఎంజాయ్‌ చేస్తుండగా తన వద్దకు వచ్చిన బ్రిటిష్‌ యువతితో చాలా చనుగా ప్రవర్తించాడు. బీర్‌ బాటిల్‌ను ఆమెపై పోస్తూ చాలా రొమాంటిక్‌గా కనిపించాడు. మ్యూజిక్‌ కూడా అదిరిపోయిందని చెప్పవచ్చు. లుక్స్‌ పరంగా యష్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా రొమాంటిక్‌ మోడ్‌లో హీరో గ్లింప్స్‌ను చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/FilmyConnects/status/1876894351881544057 కొందరిలో అసంతృప్తి..! ‘కేజీఎఫ్‌’ మూవీ సిరీస్‌లలో యష్‌ ఎంత పవర్‌ఫుల్‌గా కనిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి తర్వాత చేస్తున్న ‘టాక్సిక్‌’లోనూ యష్ అంతే పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. రెండ్రోజుల క్రితం ‘టాక్సిక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌పై అప్‌డేట్ రాగానే.. పక్కా యాక్షన్‌ ప్యాకేజ్‌గా ఉంటుందని అంతా భావించారు. ఇందుకు భిన్నంగా పూర్తి రొమాంటిక్‌ మోడ్‌లో గ్లింప్స్‌ను కట్‌ చేయడంపై కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్‌ గ్లింప్స్‌ కండోమ్‌ యాడ్‌లా ఉందంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘కేజీఎఫ్‌’ తరహాలోనే యష్‌ లుక్స్ ఉన్నాయని, కొత్తదనం లోపించిందని పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/dummytool/status/1876894667079364649 తొలి నుంచి వివాదాలే.. ‘టాక్సిక్‌’ సినిమాను యష్‌ పట్టాలెక్కించినప్పటీ నుంచి ఏదోక వివాదంలో ఈ మూవీ చిక్కుకుంటూనే వచ్చింది. తొలుత ఈ సినిమా షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ పనితీరుపై యష్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకునే యోచనలో కూడా ఆయన ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొద్ది రోజుల తర్వాత కర్ణాటకలో షూటింగ్‌ కోసం చెట్లను నరికి మరో వివాదాన్ని ‘టాక్సిక్‌’ నెత్తికి ఎత్తుకుంది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు ఈ చిత్ర బృందంపై కేసు కూడా నమోదు చేయడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన జరగ్గా కర్ణాటకలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా గ్లింప్స్‌ను దారుణంగా తప్పుబడుతూ నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.&nbsp; ‘కేజీఎఫ్‌’తో యష్‌ కెరీర్ మలుపు! ‘కేజీఎఫ్‌కు’ ముందు యష్‌ కన్నడలో 19 చిత్రాల్లో నటించాడు. అన్ని మూవీస్‌ చేసినప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో స్టార్‌ డమ్‌ రాలేదు. టైర్‌-2 హీరోగా మాత్రమే శాండిల్‌వుడ్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘కేజీఎఫ్‌’ (KGF) చేశాడో అతడి లైఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో అతడి గురించి చర్చించుకున్నారు. 'కేజీఎఫ్‌ 2' (KGF 2) చిత్రం మరింత సక్సెస్‌ కావడంతో ఆ ఫేమ్‌ మరింత బలపడింది. దానిని నిలబెట్టుకునే క్రమంలోనే యష్‌ ఆచితూచి అడుగువేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌ 2 తర్వాత సరైన సబ్జెట్‌ కోసం రెండేళ్ల పాటు ఎదురు చూశాడు. గతేడాది ‘టాక్సిక్‌’ను పట్టాలెక్కించాడు.&nbsp;
    జనవరి 08 , 2025
    <strong>Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్‌ స్పెషల్‌ వీడియో</strong>
    Vijay Devarakonda: ‘నేను మూర్ఖుడ్ని కాదని చెప్పండి’.. రౌడీ బాయ్‌ స్పెషల్‌ వీడియో
    డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరాలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బులు చోరి చేసేందుకు సైబర్‌ నేరస్తులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సూచించాడు. ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  రౌడీ బాయ్‌ ఏం చెప్పాడంటే? సైబర్‌ నేరాలు, మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సూచించాడు. తాజాగా రిలీజ్‌ చేసిన వీడియోలో తన ఫ్రెండ్‌కు జరిగిన ఘటనను పంచుకున్నాడు. ‘ఫ్రెండ్‌, శ్రేయోభిలాషి అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్లు సైతం మెసేజ్‌లు సృష్టిస్తారు. ఒకవేళ అలాంటివి ఏమైనా వస్తే ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్ చెక్‌ చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడిని కాదు అని చెప్పండి’ అంటూ వీడియోను విజయ్‌ ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాజానికి ఉపయోగపడే వీడియో చేసినందుకు విజయ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  https://twitter.com/pakkatelugunewz/status/1876979601215299644 'VD 14' క్రేజీ అప్‌డేట్‌.. టాక్సీవాలాతో బ్లాక్‌ బాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌తో విజయ్‌ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. VD14 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 1854 - 78 మధ్య కాలంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూవీకి బాలీవుడ్ సంగీత ద్వయం ఎంపికైనట్లు సమాచారం. ఆదిపురుష్‌కు పనిచేసిన అజయ్‌-అతుల్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ సమకూర్చనున్నట్లు ఒక్కసారిగా వార్తలు మెుదలయ్యాయి. ఇక ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్న చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.&nbsp; https://twitter.com/tupaki_official/status/1876903598078009523 ‘VD 12’తో విజయ్‌ బిజీ.. ప్రస్తుతం విజయ్‌.. ‘VD12’ షూటింగ్‌తో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించినా అదే సమయంలో పవన్‌ కల్యాణ్‌ (హరి హర వీరమల్లు) మూవీ రాబోతున్న నేపథ్యంలో విడుదల వాయిదా వేయబోతున్నట్లు తెలిసింది. విడుదలకు ఎలాగూ సమయం ఉండటంతో షూటింగ్‌ మెల్లగా చేస్తున్నారని టాక్‌. ఫిబ్రవరిలో మొత్తం షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీలంక నేపథ్యంలో మెుత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర నిర్మాత కన్ఫార్మ్‌ చేశారు. 
    జనవరి 08 , 2025
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెన్సార్ బోర్డు తొలగించినవి ఇవే!
    మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం మరో 8 రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ వర్క్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్‌తో పాటు 165 నిమిషాల నిడివిని సెన్సార్ సభ్యులు ఫిక్స్‌ చేశారు. అయితే ఓ విషయంలో మాత్రం ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌కు సెన్సార్ బోర్టు (Central Board of Film Certification) చురకలు అంటించినట్లు తెలుస్తోంది.  ఇంగ్లీషు టైటిల్‌పై మండిపాటు! గతంతో పోలిస్తే ఇటీవల సినిమా టైటిల్స్‌ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తెలుగుకు బదులు పరభాష పదాలను తెలుగు టైటిల్స్‌గా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సైతం తెలుగుకి బదులు ఇంగ్లీషు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సంబంధించి సెన్సార్‌ సభ్యులు (Central Board of Film Certification).. మూవీ టీమ్‌కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. సినిమా మెుదట్లో టైటిల్ కార్డ్‌ను సైతం తెలుగు పదాల్లో ఇంగ్లీషు భాషలో ‘Game Changer’ పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యులు తప్పుబట్టినట్లు సమాచారం. తెలుగులో కూడా పెట్టాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు ఇలా ఇంగ్లీషు టైటిల్‌తో రావడంపై ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంటూ పెట్టేందుకు చిత్ర బృందం అంగీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. బ్రహ్మీకి షాక్‌..! చరణ్‌ - శంకర్ కాంబోలో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’లో దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ టైటిల్స్‌ సందర్భంగా ఆయన పేరును ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ అని టీమ్‌ ప్రెజెంట్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన సెన్సార్‌ సభ్యులు పద్మశ్రీ పదాన్ని పేరుకు ముందు తొలగించాలని సూచించింది. కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలను మూవీ టైటిల్స్‌ సందర్భంగా ప్రదర్శించకూడదని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. ‘దేనికైనా రెడీ’ సమయంలో బ్రహ్మీ పేరు ముందు పద్మశ్రీ పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’ మూవీలో ఆ తప్పు రిపీట్‌ కాకుండా సెన్సార్ బోర్డు కత్తెర పెట్టింది.&nbsp; మరిన్ని కత్తెరలు.. తెలుగు టైటిల్‌, పద్మశ్రీ పదం తొలగింపుతో పాటు మరికొన్ని కత్తెరలు సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’కు సెన్సార్‌ బోర్డు (Censor Board) విధించింది. కొన్ని సీన్లలో లిక్కర్‌ బ్రాండ్లను నేరుగా చూపించడాన్ని తప్పుబట్టింది. ఆయా లేబుల్స్‌ను తొలగించాలని చెప్పింది. అలాగే సినిమాలో ఎక్కువ సార్లు ఉన్న ‘చట్ట ప్రకారం’ పదాన్ని ‘లెక్క ప్రకారం’గా ఛేంజ్‌ చేయాలని సూచించింది. దీంతో పాటు కేరళ అనే పదాన్ని కూడా తొలిగించాలని చెప్పింది. ఓ పేపర్‌ కట్టింగ్‌ ఉన్న ‘దుర్గ శక్తి నాగ్‌పాల్’ పేరును ‘సుచిత్ర పాండే’గా మార్చాలని మూవీ టీమ్‌కు స్పష్టం చేసింది. ఇవి మినహా సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/JohnWick_fb/status/1874672597172101375 మరికొద్ది సేపట్లో ట్రైలర్ రిలీజ్‌.. 'గేమ్‌ ఛేంజర్‌' ట్రైలర్‌ను మరికొద్ది సేపట్లో మూవీ టీమ్‌ రిలీజ్‌ చేయబోతోంది. ఇవాళ (జనవరి 2) సాయంత్రం 5:04 గం.లకు దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్‌ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని నాలుగు పాటలు విడుదలవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఎస్‌.జే. సూర్యతో పాటు సముద్రఖని, అంజలి, సునీల్‌, శ్రీకాంత్, నాజర్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
    జనవరి 02 , 2025
    Pawan Kalyan: “అల్లు అర్జున్ ఇష్యూ చాలా చిన్నది.. మాట్లాడాల్సిన పని లేదు”
    Pawan Kalyan: “అల్లు అర్జున్ ఇష్యూ చాలా చిన్నది.. మాట్లాడాల్సిన పని లేదు”
    వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆ తరువాత ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పి, వారిని ఆదుకునేలా చర్చలు జరిపారు. మీడియాతో పవన్ కల్యాణ్&nbsp; కార్యాలయం పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ: ‘‘తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం అనేది చాలా దారుణం. ముఠాల దౌర్జన్యాలకు మేము భయపడే వాళ్లు కాదు’’ అని స్పష్టం చేశారు.‘‘ప్రజలు మార్పు కోసమే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అభివృద్ధి ఆపే ప్రయత్నాలు చేస్తే, ఆ అడ్డంకులను బద్దలుకొడతాం.’’‘‘దాడి చేసినవారిని ఎక్కడున్నా లాక్కొచ్చి జైలుకు పంపుతాం. దాడిలో పాల్పడిన వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అనుచరులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.‘‘సోషల్ మీడియాలో ట్రోల్ వేసినవారిని కూడా సహించం. వారి చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు. https://twitter.com/bigtvtelugu/status/1872954695771451583 సంధ్య థియేటర్ ఘటనపై ప్రశ్నలు ఈ సందర్శన సందర్భంగా, హైదరాబాద్‌లో జరిగిన సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ అరెస్టుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ: ‘‘సమస్యలు చాలా ఉన్నాయి. సినిమా అనేది చిన్న విషయం. ఇలాంటి సందర్భంలో దాని గురించి ఇది మాట్లాడటం సరికాదు’’ అని పేర్కొన్నారు. నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై స్పందన పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్న విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ‘‘నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి ఎలా చేరాడన్నది ఉన్నతాధికారులు చూడాలి. దీనికి ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రి బాధ్యత వహించాలి. నేను నాకు అప్పగించిన పనిని మాత్రమే చేస్తాను,’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
    డిసెంబర్ 28 , 2024
    <strong>Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే</strong>
    Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్‌బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే
    ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో లక్కీ భాస్కర్&nbsp; మంచి జనాదారణ పొందింది. ఆ చిత్రంలోని&nbsp; డైలాగ్‌లు సగటు మధ్యతరగతి జీవి జీవన చిత్రాన్ని కళ్లకు కట్టాయి. ప్రస్తుతం ఈ సంభాషణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డైలాగ్స్‌ కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ చిత్రంలో వచ్చిన టాప్ డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం. lucky Bhaskar Movie Dialogues “ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరుగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు”. “ఒక రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్లుగా జరగలేదు, దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా!” “ఇన్ని కష్టాల్లో నేనున్నా, బోర్డర్‌లైన్‌ దరిద్రంలో బతుకుతున్నా, వాళ్లింట్లో ఇష్టం లేకపోయినా, నేనే కావాలని నన్ను చేసుకుంది. సుమతి, నా బలం, నా భార్య “. “అన్ని సార్లూ డబ్బులతో పని అవ్వదు సార్, కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి.“ “మావాడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. పదండి మనం వెళ్దాం.” లక్కీ భాస్కర్ కొడుకు చెప్పే డైలాగ్ “నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించేవాళ్లు నాన్న, కార్తీక్ గాడు అందరి బర్త్‌డేస్‌లకి వచ్చి, ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడూ బర్త్‌డే పార్టీ ఇవ్వడు అని. ఈరోజు తర్వాత వాళ్లెవరూ నన్ను ఏడిపించరు. ఆ అరుణ్, ఏరా మా ఇంటికి ఎప్పుడొచ్చినా, సేమ్ టీషర్ట్ వేసుకుని వస్తావ్, నీకు వేరే టీషర్టే లేదా అని అరుణ్ అనేవాడు, ఈరోజు నన్ను ఈ టీషర్ట్‌లో చూసి షాక్ అయిపోయాడు అమ్మా. ఈరోజు నుంచి మీరు ఏం చెప్తే, అది చేస్తా, పొద్దున్నే లేస్తా, బాగా చదువుతా. ఇంకా, మీరు పెద్దయ్యే వరకు బొమ్మలు కూడా కొనియ్యొద్దు.“ “జూదం అలవాటైన ప్రతి ఒక్కడూ, మానేద్దామనే అనుకుంటాడు.కానీ, ఆశ తలకి తగలగానే కొత్త కారణం వెతుక్కుని, మళ్లీ మొదలుపెడతాడు, నేనూ మొదలుపెట్టాను, దిస్ టైమ్ బిగ్గర్, బెటర్.“ “ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తప్పు లేదని”. “భాస్కర్ అమ్ముడుపోవాలని డిసైడ్ అయితే, భాస్కర్ రేటు భాస్కర్ చెబుతాడు.” “మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్, ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం, పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.“ నగల షాపులో చెప్పే డైలాగ్ “నేను వెళ్లింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్.“ lucky Bhaskar Movie Dialogues “దిస్ ఈజ్ ఇండియా, వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన వంటి మీద కనపడాలి.“ “సుమతీ, ఐ యామ్ నాట్ బ్యాడ్, ఐ యామ్ జస్ట్ రిచ్, డబ్బు ఉన్నవాడిని ఈ సమాజం ఎప్పుడూ చెడ్డోడిలా చూస్తుంది. అన్‌పోర్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు…! ”ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండూ విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులవి.” “దేవుడు సార్, పొగరు బలిసినప్పుడల్లా జీవితం మీద ఒక్క లెంపకాయ వేస్తుంటాడు సార్, అంతే సెట్ అయిపోతాం.” డబ్బు ఇచ్చే కిక్కు డైలాగ్ “సిగరెట్, ఆల్కహాలు, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా, డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ, స్టాక్ మార్కెట్లో వచ్చేంత డబ్బులు, ఇంకా ఏ వ్యాపారంలో రావు సార్. ఇంతే ఒక రోజు గెలిచినా, ఇంకోరోజు ఓడినా, ఈరోజు ఒకడు చచ్చినా ఆపబుద్ధి కాదు, ఆపలేము సార్.” “వాడు కామన్ మ్యాన్… అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు“ “డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.“ “కుటుంబం కోసం మొదలుపెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం… భాస్కర్, వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి”.(lucky Bhaskar Movie Dialogues) “ఎందుకంటే, జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.” “గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది, ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్.“ దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం! మాటల్లో ఇంత అహంకారం….అహంకారం కాదు.. ధైర్యం!
    డిసెంబర్ 16 , 2024
    <strong>Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!</strong>
    Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!
    యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.&nbsp; భాగ్యశ్రీ ప్రేమలో పడిందా? ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌! ‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.&nbsp; https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196 రౌడీ బాయ్‌తోనూ.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది. భాగ్యశ్రీ నేపథ్యం ఇదే.. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం 'యారియాన్ 2'తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.&nbsp;
    అక్టోబర్ 23 , 2024

    @2021 KTree