• TFIDB EN
  • బరోజ్
    UATelugu
    పోర్చుగీసు రాజవంశానికి చెందిన నిధిని బ‌రోజ్ (మోహ‌న్ లాల్‌) నాలుగు శతాబ్దాలుగా కాపాడుతుంటాడు. వార‌సులు వ‌స్తే వాళ్ల‌కి నిధిని అప్ప‌గించాల‌ని ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో ప‌ద‌మూడో త‌రానికి చెందిన ఇసబెల (మాయా రావు) త‌న తండ్రితో క‌లిసి గోవాకు వ‌స్తుంది. మ‌రి ఆమెకి బ‌రోజ్ నిధిని అప్ప‌గించాడా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Barroz 3D Review: విజువల్‌ వండర్‌గా ‘బరోజ్‌ 3D’.. కానీ!

    మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బరోజ్‌ 3డీ’ (Barroz 3D). ఫాంటసీ అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా...read more

    How was the movie?

    తారాగణం
    మోహన్ లాల్
    సిబ్బంది
    మోహన్ లాల్
    దర్శకుడు
    నవీన్ యార్నినేనినిర్మాత
    ఆంటోనీ పెరుంబవూరు
    నిర్మాత
    లిడియన్ నాదస్వరంసంగీతకారుడు
    సంతోష్ శివన్సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    <strong>Barroz 3D Review: విజువల్‌ వండర్‌గా ‘బరోజ్‌ 3D’.. కానీ!</strong>
    Barroz 3D Review: విజువల్‌ వండర్‌గా ‘బరోజ్‌ 3D’.. కానీ!
    నటీనటులు: మోహన్‌లాల్‌, మాయా రావు వెస్ట్‌, తుహిన్‌ మేనన్‌, గోపాలన్‌, తదితరులు దర్శకత్వం: మోహన్‌లాల్‌ సంగీతం: మార్క్‌ కిలియన్‌ సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎడిటర్‌: అజిత్‌కుమార్‌ నిర్మాణ సంస్థ: ఆశీర్వాద్‌ సినిమాస్‌ నిర్మాత: అంటోనీ పెరుబవూర్‌ విడుదల తేదీ: 25-12-2024 మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బరోజ్‌ 3డీ’ (Barroz 3D). ఫాంటసీ అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను మెహన్‌లాల్‌ తెరకెక్కించారు. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి ఒక‌ప్పుడు గోవాని పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ క‌థ తిరుగుతుంది. రాజుకి న‌మ్మిన బంటు అయిన బ‌రోజ్ (మోహ‌న్ లాల్‌) నాలుగు శతాబ్దాలుగా నిధిని కాపాడుతుంటాడు. డి గామా వార‌సులు వ‌స్తే వాళ్ల‌కి నిధిని అప్ప‌గించాల‌ని ఎదురు చూస్తుంటాడు. ఎట్ట‌కేల‌కి రాజ‌వంశం ప‌ద‌మూడో త‌రానికి చెందిన ఇసబెల (మాయా రావు) త‌న తండ్రితో క‌లిసి గోవా వ‌స్తుంది. మ‌రి ఆమెకి బ‌రోజ్ నిధిని అప్ప‌గించాడా? లేదా? నాలుగు వంద‌ల ఏళ్లుగా బ‌రోజ్ ఆ నిధిని ఎలా కాపాడుతూ వ‌చ్చాడు? ఇసబెల అదే రాజ‌వంశానికి చెందిన యువ‌తి అని బరోజ్‌కు ఎలా కనుగొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే బరోజ్ పాత్ర‌లో మలయాళ నటుడు మోహ‌న్‌లాల్ చక్కగా ఒదిగిపోయాడు. క‌ట్ట‌ప్ప త‌ర‌హా లుక్‌లో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసాడు. న‌ట‌న ప‌రంగా లోటేమీ చేయ‌లేదు. కానీ, ఆయన పాత్ర‌లోనే బ‌లం లేదు. ఇసబెల పాత్ర‌లో మాయారావు క‌నిపించిన తీరు బాగుంది (Barroz 3D Review). ఆమె న‌ట‌న ఫర్వాలేద‌నిపించే స్థాయిలోనే ఉంది. మిగిలిన పాత్రల్లో ఎక్కువగా హాలీవుడ్‌ నటులే కనిపించారు. వారు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే హాలీవుడ్ స్థాయిలో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ (Barroz 3D Review In Telugu)గా దర్శకుడు మోహన్‌లాల్‌ ఈ సినిమా రూపొందించారు. కథ బాగున్నప్పటికీ కథనం విషయంలోనే మోహన్‌లాల్‌ పూర్తిగా తడబడ్డారు. పోర్చుగీసు పాత్రలు, సంభాషణలు ఎక్కువగా కనిపించడంతో పాశ్చాత్య ప్రేక్షకులే లక్ష్యంగా తీసినట్లు అనిపిస్తుంది. నిధి చూట్టూ కథ అనగానే సహజంగానే అడ్వెంచరస్‌ సీన్స్ ఆశిస్తాం. కానీ బరోజ్‌లో అలాంటి ఉత్కంఠరేపే సన్నివేశాలు ఏమీ కనిపించలేదు. ఇసబెల పాత్ర కూడా పెద్దగా అంత బలంగా రాసుకోలేదు. కథలో ఎంతో కీలకమైన భావోద్వేగాలను దర్శకుడు మిస్‌ చేశారు. అయితే త్రీడీ విజువల్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రం మెప్పించాయి. అయితే చిన్నారులకు మాత్రం బరోజ్‌ నచ్చే అవకాశముంది. సాంకేతికంగా.. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నిర్మాణం విష‌యంలో రాజీప‌డ‌లేదు. సంతోష్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. సంగీతం హాలీవుడ్‌ స్థాయిలో ఉంది. పాశ్చాత్య&nbsp; పోక‌డ‌లకి త‌గ్గ‌ట్టే సాగుతుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. సాగదీత సన్నివేశాలను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. ప్లస్‌ పాయింట్స్‌ కథా ప్రపంచంత్రీడీ విజువల్స్‌టెక్నికల్‌ విభాగం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిలేని కథనంకొరవడిన భావోద్వేగాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    డిసెంబర్ 26 , 2024
    <strong>Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్‌.. కారణం ఇదే!</strong>
    Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్‌.. కారణం ఇదే!
    మలయాళంలో వచ్చిన 'దృశ్యం' (Drishyam) చిత్రం ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రీమేకై ఘన విజయాన్ని అందుకుంది. మెుత్తం రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతో థ్రిల్‌కు గురిచేసింది. మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్టులతో కట్టిపడేసింది. దీంతో ‘దశ్యం పార్ట్ 3’ (Drishyam 3) కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దృశ్యం మాతృకలో నటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఈ మూవీకి సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో ‘దృశ్యం 3’ చిత్రం మరోమారు చర్చకు వచ్చింది.&nbsp; మోహన్‌లాల్‌ ఏమన్నారంటే? మలయాళ నటుడు మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బరోజ్‌ 3D’ (Baroz 3D) విడుదలకు సిద్ధమైంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న రిలీజ్ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనటి సుహాసిని (Suhasini) ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌లాల్‌ ‘దృశ్యం 3’ గురించి స్పందించారు. ఆ చిత్రం (Drishyam 3) త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు పేర్కొన్నారు. 'దృశ్యం' (Drishyam) సబ్జెక్ట్‌ తొలుత చాలా మంది వద్దకు వెళ్లిందని మోహన్‌లాల్‌ తెలిపారు. దర్శకుడు జీతు జోసెఫ్‌ తన వద్దకు తీసుకొచ్చినప్పుడు సబ్జెక్ట్‌ విని స్టన్‌ అయ్యాయని చెప్పారు. దానికి సీక్వెల్‌గా తీసిన 'దృశ్యం 2' (Drishyam 2) పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించిందని పేర్కొన్నారు. షూటింగ్‌ కోసం గుజరాత్‌ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి లోకల్స్ తనను గుర్తుపట్టారని మోహన్‌లాల్‌ తెలిపారు. మలయాళ ఇండస్ట్రీకి ‘దృశ్యం 2’.. పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. 'దృశ్యం 3'తో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోహన్‌లాల్‌ తెలిపారు. 2025లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. https://twitter.com/NiiHasH/status/1871469608655552934 'దృశ్యం 3'పై భారీ అంచనాలు మలయాళ ‘దృశ్యం’లో మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా.. పార్ట్‌ 2కు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ్‌ విషయానికొస్తే కమల్‌ హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో చేశారు. మలయాళంలో ‘దృశ్యం 3’ రూపొందితే అది మిగిలిన భాషల్లోనూ రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో మలయాళ వెర్షన్‌ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆడియన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. గత రెండు భాగాలకు మించిన ట్విస్టులు ‘పార్ట్‌ 3’లో ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. దీంతో పట్టాలెక్కకముందే ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; పార్ట్‌ 3తో ముగింపు..! దర్శకుడు జీతు జోసెఫ్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని రూపొందించినప్పుడు సీక్వెల్‌ గురించి అసలు ఆలోచించలేదు. ఆ చిత్రానికి వచ్చిన భారీ రెస్పాన్స్‌ చూసి ‘పార్ట్‌ 2’ను తీశారు. స్టోరీ డెవలప్‌మెంట్‌ కోసం చాలా సమయమే తీసుకున్నారు. ఇక ‘పార్ట్‌ 3’తో దృశ్యం సిరీస్‌కు ముగింపు పలకాలని దర్శకుడు జీతు జోసెఫ్‌, మోహన్‌లాల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో పార్ట్‌కు వెళ్తే మరి సాగదీతలాగా అనిపిస్తుందని వారు భావించారట. సాలిడ్‌ స్క్రిప్ట్‌తో ‘దృశ్యం 3’ని తెరకెక్కించి మంచి క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌కు స్వస్థి పలకాలని వారిద్దరు ఫిక్సయినట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరెకెక్కించే యోచనలో దర్శకుడు జీతు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చివరి దశకు చేరుకుందని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు.&nbsp; దృశ్యం 3 స్టోరీ ఇదే? దృశ్యం పార్ట్‌ 3 (Drishyam 3) స్టోరీ ఇదేనంటూ ఓ ప్లాట్‌ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం తొలి రెండు పార్ట్స్‌లో లాగానే మూడో భాగంలోనూ హీరోతో హత్యకు సంబంధించిన నిజం చెప్పించేందుకు పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తారట. అయితే వారికి ఏ మాత్రం దొరక్కుండా హీరో మరోమారు ఎత్తుకు పైఎత్తులు వేస్తారని తెలుస్తోంది. గత రెండు పార్ట్స్‌కు మించిన ట్విస్టులు మూడో భాగంలో ఉంటాయని సమాచారం. అలాగే పోలీసుల బెడద తప్పించుకునేందుకు హీరో ఓ జాతీయ పార్టీలో కూడా చేరతారట. అలా ఒక పార్టీ నేతగా ఎదిగిన హీరోను పోలీసులు ఏమి చేయలేకపోతారట. చివరికీ కేసును కూడా క్లోజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp;
    డిసెంబర్ 24 , 2024
    <strong>This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే</strong>
    This Week OTT Releases: ఈ ఏడాది చివర్లో రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే
    2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్‌ నుంచి చాలా సూపర్‌ హిట్స్ వచ్చాయి. ‘హనుమాన్‌’ మెుదలుకొని రీసెంట్ ‘పుష్ప 2’ ఎన్నో బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు పాన్‌ స్థాయిలో సత్తాచాటాయి. ఇప్పుడు డిసెంబర్‌ ఆఖరి వారంలోనూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది రాబోతున్న చివరి చిత్రాలు అవే. అటు ఓటీటీలోనూ ఆసక్తి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు బరోజ్‌ త్రీడీ మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బరోజ్‌ 3డీ’ (Barroz 3D). ఫాంటసీ అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25 రిలీజ్‌ కానుంది. ‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.&nbsp; శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ (Srikakulam Sherlock Holmes). ప్రముఖ రచయిత మోహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. వెన్నెల కిశోర్‌ ఇందులో డిటెక్టివ్‌ పాత్ర పోషించాడు. ఓ హత్య చుట్టూ కథ తిరుగుతుందని చిత్ర బృందం తెలియజేసింది.  పతంగ్ గాలిపటాల స్పోర్ట్స్‌ డ్రామాతో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘పతంగ్‌’ (Patang). పణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌషిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలో నటించారు. రిషస్‌ సినిమాస్‌ బ్యానర్‌పై విజయ్‌ శేఖర్‌, సంపత్‌, సురేష్‌ కొత్తింటి నిర్మించారు. డిసెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.  మాక్స్ (తెలుగు డబ్) కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’ (Max) కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రలు చేశారు. విజయ్ కార్తికేయ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగులో విడుదల కానుంది. సుదీప్‌ ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.  బేబీ జాన్‌ మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ (Keerthi Suresh) నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘బేబీ జాన్‌’ (Baby John) క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా కాలీస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 25న రిలీజ్‌ కానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తెరి’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. కీర్తికి ఇదే తొలి హిందీ చిత్రం కావడంతో ‘బేబీ జాన్‌’పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న ధీమాలో ఉంది.  ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్క్విడ్‌ గేమ్‌ 2 వరల్డ్ మోస్ట్‌ వాంటెడ్ వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌ 2’ (Squid Game 2) ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. 2021లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’కు సీక్వెల్‌గా ఇది రాబోతోంది. డిసెంబర్‌ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా చూడవచ్చు. తెలుగు, హిందీ సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కొద్ది రోజుల క్రితమే రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ సిరీస్‌పై భారీగా అంచనాలు పెంచేసింది. ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.  Telugu Movies OTT Release Dates 2024 TitleCategoryLanguagePlatformRelease DateSquid Game 2SeriesTelugu DubNetflixDec 26ZebraMovieTelugu&nbsp;AhaDec 20Leela VinodamSeriesTelugu&nbsp;ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu&nbsp;AmazonDec 13HarikathaSeriesTelugu&nbsp;Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu&nbsp;ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu&nbsp;AhaDec 12Thangalaan&nbsp;MovieTelugu&nbsp;NetflixDec 10 OTT Releases This Week 2024 TitleCategoryLanguagePlatformRelease DateThe FourgeMovieEnglishNetflixDec 22OriginMovieEnglishNetflixDec 25Bhool Bhulaiyaa 3MovieHindiNetflixDec 27SorgavaasalMovieTamilNetflixDec 27Singham AgainMovieHindiAmazonDec 27ThanaraMovieMalayalamAmazonDec 27DoctorsSeriesHindiAmazonDec 27What If..? 3SeriesEnglishHotstarDec 22Doctor wooMovieEnglishHotstarDec 26Khoj&nbsp;MovieHindiZee 5Dec 27
    డిసెంబర్ 23 , 2024
    బర్త్‌డే స్పెషల్: రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ పంచ్‌ డైలాగ్స్‌
    బర్త్‌డే స్పెషల్: రజనీకాంత్‌ సూపర్‌ హిట్‌ పంచ్‌ డైలాగ్స్‌
    ]Angry is the cause of all miseries one should know how to control it otherwise life will become miserable&nbsp;- నరసింహా
    ఫిబ్రవరి 13 , 2023
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా రెజీ గురించి ఆసక్తికర విషయాలు
    ]సినిమాల విషయంలో తనకు తానే స్ఫూర్తి అని, ఎవరూ తనని ప్రభావితం చేయబోరని చెబుతుంటుంది.
    ఫిబ్రవరి 13 , 2023
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు
    ]శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరీ’ ఎటువంటి క్రెడిట్స్‌ తీసుకోకుండానే వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. అంతే రానా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. సినిమాయే తన ప్రపంచమని సురేశ్‌ బాబు చెబుతుంటారు.వాయిస్ ఓవర్‌
    ఫిబ్రవరి 13 , 2023
    Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
    Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
    ప్రస్తుతం యావత్‌ దేశం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, AI సాయంతో ఆలోచించే మెషీన్‌.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. అసలు భైరవ, బుజ్జి ఎవరు? ఎలా కలిశారు? అన్న పాయింట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు కల్కి టీమ్ వినూత్న ఆలోచన చేసింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava Review) పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో యానిమేటెడ్‌ సిరీస్‌ను విడుదల చేసింది. తొలిగా రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేయనున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌లో ఏం ఉంది? బుజ్జి, బైరవ పాత్రలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. బుజ్జి ఎవరో తెలుసా? బుజ్జికి సంబంధించిన సమాచారాన్ని ఈ యానిమేటెడ్‌ సిరీస్‌లో క్లుప్తంగా చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌యే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక శక్తివంతమైన షిప్‌కు కనెక్ట్‌ చేయడం సిరీస్‌లో చూపించారు. ఆ షిప్‌ 99 మిషన్లను విజయవంతంగా&nbsp; పూర్తి చేసి 100వ మిషన్‌లో ఉండగా దానిపై దాడి జరుగుతుంది. వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన ప్రధాన డివైస్ మాత్రం మిగులుతుంది. ఈ దాడితో కాంప్లెక్స్‌ (గ్లింప్స్‌లో చూపించిన పెద్ద ట్రయాంగిల్‌)కి షిఫ్ట్&nbsp; అయిపోవాలన్న బుజ్జి కల చెల్లాచెదురైపోతుంది. అయితే ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది. క్రేజీగా భైరవ పాత్ర? బుజ్జిలాగానే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలని కలలు కంటుంటాడు. కానీ, దానికి ఒక మిలియన్ యూనిట్స్ (క్రిప్టో కరెన్సీలాంటిది) అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు భైరవ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో భైరవ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. రెండు ఎపిసోడ్‌ల సిరీస్‌లో బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి. శంభల నగరం మహా విష్ణువు పదో అవతారమైన కల్కి... శంభల నగరంలో పుడతాడని మన పురాణాల్లో ఉంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ సిరీస్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు. కల్కి- భైరవ వేర్వేరు పాత్రలా! మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలపై కల్కి సినిమాలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.&nbsp; సిరీస్‌ స్టోరీ ఏంటి? కల్కి సినిమా మెుదలయ్యే రెండేళ్ల కాలానికి ముందు కథ జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా కార్గో వెహికల్‌లో పనిచేసే ఏఐ మెషీన్‌ బుజ్జికి ప్రమోషన్‌ వస్తుంది. కాంప్లెక్స్‌ మెంబర్‌ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్‌ కావడానికి సిద్ధమవుతుంటుంది. ఈ క్రమంలో చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుండగా రెబల్స్‌ అటాక్‌ చేసి, ఆ షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్‌ సిటీతో కనెక్షన్‌ కట్‌ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ పట్టణంలోని చిల్లర దొంగతనాలు చేసే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌లో మెంబర్‌ కావాలని అనుకుంటాడు. దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్‌ ముక్కలైపోవడంతో దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్‌ కారును ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సిరీస్‌ స్టోరీ. Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 01 , 2024
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇటీవల కల్కీ మూవీ యూనిట్‌.. ‘బుజ్జి’ అనే కొత్త క్యారెక్టర్‌ను ఓ స్పెషల్‌ ఈవెంట్ ద్వారా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు ఫ్రెండ్‌గా చేసిన ఓ రోబోటిక్‌ వెహికల్‌ను హీరో ప్రభాస్‌ స్వయంగా నడిపి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కార్లను అమితంగా ఇష్టపడే స్టార్‌ హీరో నాగ చైతన్య కన్ను.. బుజ్జిపై పడింది. అప్పుడు అతడు ఏం చేశాడో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; బుజ్జిని డ్రైవ్‌ చేసిన చైతూ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు కార్లు అంటే యమా క్రేజ్‌. మార్కెట్‌లోకి ఏ కొత్త స్పోర్ట్స్‌ కారు వచ్చిన కొనేందుకు అతడు ఆసక్తి కనబరుస్తాడు. అయితే తాజాగా బుజ్జి అనే స్పెషల్‌ మేకింగ్‌ వెహికల్‌పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో చైతూ దృష్టి దీనిపై పడింది. ఇంకేముందు తాను ఓసారి బుజ్జిని నడపాలని నిర్ణయించుకొని చైతూ చిత్ర యూనిట్‌ సంప్రదించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో చైతూ ఆ కారును నడిపి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును చైతు డ్రైవ్ చేసాడు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా నాగచైతన్య దానిని రీట్వీట్ చేశాడు.&nbsp; This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024 ‘ఇంజనీరింగ్ అద్భుతం..’ కల్కి మేకర్స్‌ షేర్‌ చేసిన వీడియోను రీట్విట్‌ చేస్తూ.. బుజ్జిని నడిపిన అనుభవాన్ని నాగ చైతన్య తెలియచేశాడు. తమ విజన్‌ను విజయవంతంగా రియాలిటీలోకి అనువదించినందుకు మెుత్తం టీమ్‌కి నాగ చైతన్య హ్యాట్సఫ్‌ చెప్పాడు. నిజంగా ఇదోక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జి కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇంజనీరింగ్‌ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మెుత్తంగా బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; Witness the epic entry of Bhairava (#Prabhas) with Bujji at the #Bujji event! Feel the energy and excitement! ❤️‍🔥 @deepikapadukone @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms#BhairavaEntry #Tollywood #EventHighlights #Kalki2898AD #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin… pic.twitter.com/XaQJvWvoqa— SIIMA (@siima) May 22, 2024 బుజ్జి ప్రత్యేకతలు ఇవే బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; #Bujji has arrived! 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #ActorPrabhas @deepikapadukone @DishaPatani @VyjayanthiFilms @DjokerNole pic.twitter.com/IDYUiFMHNz— INOX Movies (@INOXMovies) May 23, 2024 రూ. 600 కోట్ల బడ్జెట్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 25 , 2024
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    Vijay Devarakonda: బర్త్‌డే బాయ్‌ విజయ్‌ గురించి మీకు తెలియని టాప్‌ - 10 సీక్రెట్స్
    టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో విజయ్‌ స్టార్‌ హీరోగా గుర్తింపు సంపాదించాడు. ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు పలు సినిమాల్లో విజయ్‌ నటించినప్పటికీ అవి చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి… విజయ్‌ కెరీర్‌ను పీక్స్‌లో నిలబెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా రౌడీ హీరో అన్న ట్యాగ్‌ను విజయ్‌ సంపాదించాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. విజయ్‌ గురించి తెలియని ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సినిమాల్లోకి రాకముందు విజయ్‌ ఏం చేశాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటీ? రౌడీ బాయ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న టర్నింగ్‌ పాయింట్స్‌ ఏవి? వంటి టాప్‌-10 ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. విజయ్‌ తండ్రి కల విజయ్‌ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు.. సినిమా యాక్టర్‌ అవ్వాలని కలలు కన్నారట. దానికోసమే 1986లో మహబూబ్‌నగర్‌ నుంచి హైదరబాద్‌కు ఆయన వచ్చారు. అవకాశాల కోసం గోవర్ధన రావు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్‌ తండ్రి తీవ్ర నిరాశ చెందాడు. కానీ కళామ్మతల్లిని విడిచిపెట్టలేదు. సినిమాల్లో ఛాన్స్‌ రాకపోతేనేం అని భావించి టెలివిజన్‌ రంగం వైపు గోవర్ధనరావు వెళ్లారు. పలు సీరియళ్లకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.&nbsp; 2. బాల నటుడిగా.. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ ఇద్దరూ ఏపీలోని పుట్టపర్తి శ్రీసత్యసాయి ఉన్నత పాఠశాలలో చదివారు. ఈ పాఠశాలలోనే విజయ్‌ 10వ తరగతి పూర్తి చేశాడు. టీవీలు, ఫోన్లు లేని ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పాఠశాలలోనే విజయ్ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. ‘షిర్డి సాయి దివ్య కథ’ అనే సీరియల్‌లో బాల నటుడిగా విజయ్‌ మెరిశాడు. అందులో ఒక డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విజయ్‌ స్టార్‌ హీరోగా మారిన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది.&nbsp; https://youtu.be/iQYaUQ55mo8 3. ఇంగ్లీష్‌ టీచర్‌గా.. విజయ్‌ తల్లి మాధవికి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అందులో విజయ్‌ ఇంగ్లీష్‌ క్లాసులు చెప్పేవాడు. అయితే విజయ్‌ తరచూ క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. ఇది గమనించిన తండ్రి గోవర్ధనరావు ఓ రోజు విజయ్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. కెరీర్‌ పరంగా నీకున్న ఆసక్తి ఏంటో చెప్పాలని విజయ్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన విజయ్‌ తనకు సినిమాలపై ఇంట్రస్ట్‌ ఉన్నట్లు తెలియజేశాడు. విజయ్‌ మాటలతో సంతోషించిన తండ్రి వెంటనేే అతడ్ని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేర్పించాడు.&nbsp; 4. నటనలో ఓనమాలు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన అనంతరం 3 నెలల పాటు నటనలోని ఓనమాలను విజయ్‌ అవపోసనపట్టాడు. అనంతరం పలు స్టేజీ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. అసైన్‌మెంట్‌లో భాగంగా ‘మేడం మీరేనా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను కూడా విజయ్ నిర్మించాడు. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఈ రౌడీ బాయ్‌ మెరిశాడు.&nbsp; 5. తొలి సినిమా ‘నువ్విలా’ సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు విజయ్‌. 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు. 2015లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రతో మెప్పించాడు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా నటించి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఊపందుకుంది. అర్జున్‌ రెడ్డితో పూర్తిగా మారిపోయింది.&nbsp; 6. సెన్సార్‌ బోర్డుపై విమర్శలు అర్జున్‌ రెడ్డి సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పలు సీన్లను తొలగించాలని మేకర్స్‌కు సూచించింది. అందుకు అర్జున్‌ రెడ్డి యూనిట్ ‌అంగీకరించడంతో మూవీకి A సర్టిఫికేట్‌ జారీ చేస్తూ విడుదలకు అనుమతించింది. సెన్సార్ బోర్డు తీరుపై అప్పట్లో బహిరంగంగానే విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అర్జున్‌రెడ్డి ఆడియో ఫంక్షన్‌లో విమర్శలు గుప్పించాడు. అయితే తాము చేయలేని పనిని విజయ్‌ చేసినందుకు సినీ తారలు అభినందనలు కూడా తెలిపారు.&nbsp; 7. ఒకేసారి 6 సినిమాలు 2018లో విజయ్‌ చేసిన ఆరు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ రిలీజ్‌ అయ్యాయి. ఏ మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాల ద్వారా విజయ్‌ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. అటు మహానటి సినిమాలోనూ కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు.&nbsp; 8. ఫోర్భ్స్‌ జాబితాలో స్థానం 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ - 30 జాబితాలో విజయ్‌ స్థానం సంపాదించాడు. అదే ఏడాది గూగుల్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సౌత్‌ ఇండియన్‌ యాక్టర్‌గానూ విజయ్‌ గుర్తింపు పొందాడు.&nbsp; 9. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్ 2018లో విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచాడు. అనతికాలంలో అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోల్లో అల్లుఅర్జున్‌ తొలిస్థానంలో ఉండగా, విజయ్ రెండోస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాలో 18.2 మిలియన్ల మంది రౌడీ బాయ్‌ను ఫాలో అవుతున్నారు.&nbsp; 10. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షల నగదును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విజయ్‌ డొనేట్‌ చేశాడు. అవార్డుల కంటే అభిమానుల ప్రశంసలే తనకు ఎంతో విలువైనవని ఆ సందర్భంలో విజయ్‌ అన్నాడు.&nbsp;
    మే 09 , 2023
    <strong>HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!</strong>
    HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్‌.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
    తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్‌ ఒకరు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్‌ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం. శ్రియా శరణ్‌ 1982 సెప్టెంబర్‌ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్‌ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్‌ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్‌ చేశారు. 2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.&nbsp; ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్‌ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.&nbsp; ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్‌’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్‌ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.&nbsp; తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.&nbsp; రామ్‌చరణ్, తారక్‌ నటించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్‌ రోల్‌లో నటించింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.&nbsp; గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా ‘షోటైమ్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్‌ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్‌ పాత్రలో ఆకట్టుకుంది.&nbsp; ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది.&nbsp; సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్‌ వీడియోలలోనూ శ్రియా శరణ్‌ మెరిసింది. 'తిరకటి క్యూన్‌ హవా', 'కహిన్‌ దూర్‌', 'రంగ్‌ దే చునారియా', 'బరి బరి సాంగ్‌' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.&nbsp; ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 11 , 2024
    <strong>HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!</strong>
    HBD Nagarjuna: నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. ఆయన వేసిన ఈ డేరింగ్‌ స్టెప్స్‌ ఏ హీరో వేయలేదు భయ్యా!
    అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున (Akkineni Nagarjuna) ఏ హీరో చేయనన్నీ ప్రయోగాలు తనపై తాను చేసుకున్నారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన చిత్రాలతో కెరీర్‌లో ముందుకు సాగారు. మాస్‌, క్లాస్‌, ఆధ్యాత్మికం, లవ్‌ ఇలా అన్ని జానర్స్‌లో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తండ్రిగానూ సక్సెస్‌ ‌అయ్యారు. ఇండస్ట్రీలో నాగార్జున సక్సెస్‌ వెనుక కొన్ని డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి. ఇవాళ (ఆగస్టు 29) నాగార్జున బర్త్‌డే సందర్భంగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; 'శివ'తో సెన్సేషన్‌ సాధారణంగా కెరీర్‌ తొలినాళ్లలో ఏ హీరో అయినా సేఫ్‌ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున ‘శివ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. కనీసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయని రామ్‌గోపాల్‌ వర్మకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చి గొప్ప సాహసమే చేశారు. నాగార్జున వేసిన ఆ డేరింగ్‌ స్టెప్‌ ‌అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎవరూ ఊహించిన విధంగా&nbsp; ‘శివ’ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నాగ్‌ కెరీర్‌తో పాటు టాలీవుడ్‌ దిశను కూడా శివ పూర్తిగా మార్చేసింది. హీరో అంటే ఇలాగే ఉండాలన్న మూసధోరణికి ‘శివ’తో నాగ్‌ - రామ్‌గోపాల్‌ వర్మ చెక్‌ పెట్టారు.&nbsp; వైవిధ్యతకు ప్రాధాన్యం శివ సినిమాతో నాగార్జున ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఒక సినిమా హిట్‌ అయ్యిందంటే అదే ప్యాట్రన్‌లో చాలా కథలు వచ్చి పడేవి. అయితే నాగార్జున వాటికి తలొగ్గకుండా సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘గోవిందా గోవిందా’లాంటి సూపర్‌ నేచురల్‌ హెయిస్ట్‌ ఫిల్మ్‌, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి ఫ్యామిలీ డ్రామా, ‘హలో బ్రదర్‌’లాంటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యాన్స్‌ను అలరించారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా మారిపోయాడు.&nbsp; ‘అన్నమయ్య’ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి హీరోలు కమర్షియల్‌ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో నాగార్జున ‘అన్నమయ్య’ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటికే మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నాగార్జున డివోషనల్ చిత్రం చేయడమేంటని ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయి. నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన నాగార్జున ఏమాత్రం సంకోచించకుండా అన్నమయ్య సినిమాలో నటించారు. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నాగార్జున తన నటనతో నిజమైన అన్నమయ్యను గుర్తుచేశారు. ఈ చిత్రానికి ఏకంగా రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ రావడం విశేషం.&nbsp; మరిన్ని ఆధ్యాత్మిక చిత్రాలు.. ‘అన్నమయ్య’ సక్సెస్‌తో నాగార్జున సరిపెట్టుకోలేదు. ఓవైపు కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే మరిన్ని భక్తిరస సినిమాల్లో ఆయన నటించారు. రాఘవేంద్రరావు-నాగార్జున కాంబోలో వచ్చిన ‘రామదాసు’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’, ‘జగద్గురు ఆది శంకర’ వంటి ఆధ్యాత్మిక చిత్రాల్లో నాగార్జున మెరిశారు.&nbsp; కొత్తవారికి ఛాన్స్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రిస్కే కాదు, విజయమూ ఉందని ఎన్నోసార్లు నిరూపించారు నాగార్జున. సుదీర్ఘ నట ప్రస్థానంలో సుమారు 40 మంది దర్శకులను ఆయన టాలీవుడ్‌కి పరిచయం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ (శివ), వైవీఎస్‌ చౌదరి (శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి), లారెన్స్‌ (మాస్‌), విజయ్‌ బిన్నీ (నా సామిరంగ) తదితరులు ఆ జాబితాలోకే వస్తారు. తాను స్టార్‌ కావడానికి కారణం ఓ రకంగా నూతన దర్శకులే అంటుంటారు నాగ్‌. తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలను మార్చిన హీరోగా నాగార్జునను చెబుతుంటారు. ఈ విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ చేసిన హీరో నాగార్జున అని కొనియాడారు. ఇతర ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లను తీసుకొచ్చి తన సొంత డబ్బుతో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారని గుర్తుచేశారు. తద్వారా ఆడియన్స్‌ విజన్‌ను నాగార్జున మార్చేశారని పేర్కొన్నారు. మణిరత్నం, ప్రియదర్శన్‌, ఫాజిల్‌, రవిచందర్‌, మహేష్‌ భట్‌ ఇలా మలయాళం, కన్నడ, హిందీ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లతో నాగార్జున వర్క్‌ చేశారని గుర్తుచేశారు. చిన్న క్యారెక్టర్‌ అయినా బాంబే వెళ్లి వచ్చేవారని పేర్కొన్నారు. పాన్‌ ఇండియా అనే మాటకు మెుదట ఫౌండేషన్‌ వేసిందే నాగార్జున అని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/thokkaloteja/status/1828863171152757038 బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా.. సాధారణంగా స్టార్‌డమ్‌ వచ్చిన హీరోలు బుల్లితెర షోలలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనిపించరు. వారి దృష్టంతా సినిమాలపైనే ఉంటుంది. అయితే నాగార్జున అలా కాదు. బిగ్‌బాస్‌ తెలుగు షోకు గత కొన్నేళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, తారక్‌ వంటి కుర్ర హీరోలు ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాగా నాగ్‌ మాత్రం అలవోకగా సీజన్‌లపైన సీజన్‌లు చేసుకుంటూ వెళ్తున్నారు. వరుసగా ఐదు సీజన్ల (Bigg Boss 3,4,5,6,7)కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న ప్రారంభం కానున్న 8వ సీజన్‌కూ ఆయనే వ్యాఖ్యాత. అంతేకాదు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా నాగ్‌ హోస్ట్‌గా వ్యవహించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1829013612117230039 ఫిట్‌నెస్‌ మంత్ర నాగార్జున ఫిట్‌నెస్‌ను చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతుంటారు. శివ సమయంలో నాగ్‌ ఫిజిక్‌ ఎలా ఉందో ఇప్పటికే అదే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం, వర్కౌట్ చేయడమే తన అందం సీక్రెట్‌ అంటూ పలు వేదికల్లో నాగార్జున చెప్పుకుంటా వచ్చారు. 1986లో ‘విక్రమ్‌’(Vikram)తో హీరోగా పరిచయమైన నాగ్‌ వంద చిత్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ (Kubera)లో నటిస్తున్నారు.
    ఆగస్టు 29 , 2024
    <strong>HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?</strong>
    HBD Chiranjeevi: చిరు బర్త్‌డే స్పెషల్‌.. ఆయన్ను మెగాస్టార్‌ను చేసిన ఈ సంఘటనల గురించి తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజును మెగా అభిమానులు ఒక పండగలా భావిస్తుంటారు. అటు సెలబ్రిటీలు సైతం మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతున్నారు. అయితే కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా ఉన్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవిగా కోట్లాదిమంది అభిమానాన్ని చొరగానే స్థాయికి ఈజీగా చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.&nbsp; తద్వారా మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపిన సంఘటనలు, అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరులో కసి పెంచిన ఘటన ఇండస్ట్రీలోకి రాకముందు హరి ప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి చిరంజీవి మద్రాసులో ఉండేవారు. పూర్ణా పిక్చర్స్‌ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి ఆ ముగ్గురు రేటింగ్‌ ఇచ్చేవారు. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారు. అదే సమయంలో సినిమాలోని హీరో డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌ తదితరులు వచ్చి ఆ ముగ్గురిని లేపి వారి స్థానంలో బలవంతంగా కూర్చున్నారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్‌ నిల్చొనే మూవీ చూసింది. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత సతీమణి అడగ్గా ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరు ఆవేశంతో సవాలు విసిరారట. అన్నట్టుగానే ఆ స్థాయికి చేరుకున్నారు. చిన్నపాత్రల నుంచి హీరో స్థాయికి 1978లో చిరు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 'పునాది రాళ్లు' సినిమాలో చిరుకు అవకాశం దక్కింది. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలవడం గమనార్హం. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే సమయంలో.. ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాలని కొందరు డిమాండ్‌ చేసేవారట. తనని తాను నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే వాటిలో నటించినట్లు చిరు ఓ సందర్భంలో చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాజిటివ్‌గా ఉంటే లక్ష్యం చేరుకోవచ్చని చెప్పకనే చెప్పారు. చిరు మెస్మైరైజింగ్‌ డ్యాన్స్‌కు కారణం ఇదే! కెరీర్‌ తొలినాళ్లలో చిరంజీవి డ్యాన్స్ గొప్పగా ఉండేది కాదట.&nbsp; సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకొని చిరు మేనేజర్‌ వద్దరు వెళ్లారట. తన పెర్ఫామెన్స్ ఎలా ఉందని ఆయన్ను అడగ్గా 'అందులో ఏముంది? మీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో అదే మీరూ చేశారు. మీ ప్రత్యేకత చూపించాలి కదా?' అని మేనేజర్ అన్నారట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికన్నా అదనంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నారు చిరు. ఇక తన నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు.&nbsp; రివ్యూవర్‌ నుంచి పద్మ విభూషణ్‌ స్థాయికి.. మెగాస్టార్‌ చిరంజీవి నెగెటివిటీకి వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినడం వల్ల నిరుత్సాహం ఆవహించే అవకాశం ఉంటుందని చిరు స్ట్రాంగ్‌ ఫీలింగ్. తనపై తనకున్న అపారమైన నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటుంటారు చిరు. అలా రివ్యూవర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకుగానూ దేశంలో రెండో అత్యున్నతమైన పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అంతకుముందు పద్మభూషణ్‌ అవార్డు సైతం అందుకోవడం గమనార్హం.&nbsp; కుర్ర హీరోలకు అండగా.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కుర్ర హీరోల సినిమా ఈవెంట్లకు ఆహ్వానం అందిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా ఆ వేడుకకు వెళ్తుంటారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ ‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’ అని చిరంజీవి తెలిపారు. కళామతల్లి ముద్దు బిడ్డగా.. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు, సినీ కార్మికుల కష్టాలపై చిరంజీవి తరచూ స్పందిస్తుంటారు. తనకు తోచినంత సాయాన్ని చేస్తుంటారు. ఆ క్రమంలోనే ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే దానిని చిరు సున్నితంగా తిరస్కరించేవారు. ‘నేను కళామతల్లి ముద్దు బిడ్డగా ఉంటా.. పెద్దగా కాదు’ అని ఓ సందర్భంలో స్పష్టం చేశారు కూడా. సేవా కార్యక్రమాల్లో ముందజ.. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తెలుగు హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తుంటుంటారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 156వ చిత్రం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
    ఆగస్టు 22 , 2024
    <strong>Spirit Updates: ‘స్పిరిట్‌’పై దిమ్మతిరిగే బజ్‌.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఆమె భర్త!</strong>
    Spirit Updates: ‘స్పిరిట్‌’పై దిమ్మతిరిగే బజ్‌.. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. విలన్‌గా ఆమె భర్త!
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. అటు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్‌' (Animal) భారతీయ చిత్ర పరిశ్రమను ఎంతగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'స్పిరిట్‌' (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ‘స్పిరిట్‌’కి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హీరోయిన్‌ ఎవరంటే? ప్రభాస్‌ (Prabhas) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయినా కరీనా కపూర్‌ ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఓ స్టార్‌ హీరో పక్కన హీరోయిన్‌గా చేయనున్నట్లు వార్తలు రావడం ఆసక్తి రేపుతోంది. ప్రభాస్‌, కరీనా జోడీ ఎలా ఉంటుందోనని ఇప్పటినుంచే ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారు. దీనిపై స్పిరిట్‌ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; ప్రభాస్‌ విలన్‌ మళ్లీ రిపీట్‌! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ఇటీవల కాలంలో విలన్ రోల్స్‌ కేరాఫ్‌గా మారుతున్నారు. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణాసురుడిగా నటించినా సైఫ్‌ అలీఖాన్‌ ‘దేవర’లో తారక్‌కు ప్రత్యర్థిగా నటించారు. ఇటీవల రిలీజైన ‘దేవర’ ట్రైలర్‌లో క్రూరంగా కనిపించి ఆకట్టుకున్నారు. స్పిరిట్‌పై వచ్చిన మరో బజ్‌ ప్రకారం సైఫ్‌ అలీఖాన్‌ ఇందులోనూ నెగిటివ్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్‌ పాత్రలో సైఫ్‌ కనిపించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే స్పిరిట్‌లో హీరోయిన్‌ అంటూ రూమర్లు ఎదుర్కొంటున్న కరీనా కపూర్‌.. సైఫ్‌ అలీఖాన్‌కు భార్య. దీంతో భార్య హీరోయిన్‌గా, భర్త విలన్‌గా కనిపిస్తారన్న టాక్‌ ఆసక్తి రేపుతోంది. ఇదే నిజమైతే స్పిరిట్‌పై అంచనాలు మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.&nbsp; పోలీసు vs మాఫియా డాన్‌! ‘స్పిరిట్‌’ సినిమాలో ప్రభాస్‌ ద్విపాతాభినయం చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని డైలాగ్స్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్స్‌ విషయానికి వస్తే ఒక పాత్రలో పోలీసుగా మరో పాత్రలో మాఫియా డాన్‌గా ప్రభాస్‌ కనిపిస్తారని బజ్ ఉంది. డాన్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే అక్టోబర్‌ 10న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజవుతుందని, వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్‌. మరోవైపు ప్రభాస్‌ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో ద్విపాత్రిభినయం చేశారు. తొలి చిత్రం ‘బిల్లా’ కాగా ఆపై ‘బాహుబలి’, ‘బాహుబలి 2’లోనూ డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా తెరకెక్కుతున్న రాజాసాబ్‌లోనూ ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది.&nbsp; స్పిరిట్‌ బడ్జెట్ అన్ని కోట్లా? పాన్ ఇండియా రెబల్​​ స్టార్​​ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్​​ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా. అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్​ సినిమాల బడ్జెట్​ వందల కోట్ల​తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగా చిత్రానికి సంబంధించి ఓ వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో స్పిరిట్‌ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం మేకర్స్‌ రూ.500 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో కలిసి డైరెక్టర్ సందీప్‌ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రభాస్ కెరీర్లో ఆదిపురుష్ రూ.700 కోట్ల బడ్జెట్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యే వచ్చిన కల్కి రూ.600 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌ సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రాబోతున్న మూడో ఫిల్మ్‌గా ‘స్పిరిట్‌’ నిలవనుంది.
    సెప్టెంబర్ 18 , 2024
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్‌ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్‌ వెహికల్‌ పాత్రను కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆడియన్స్‌ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోహినిగా దిశా పటానీ! లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్‌ అయిన కమల్‌ హాసన్‌.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్‌) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్‌తో ప్రభాస్‌ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; ఆ లాజిక్‌ మాటేంటి? ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్‌ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్‌ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్‌ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్‌పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌లో నిజం లేకపోవచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు. &nbsp; దిశాతో ప్రభాస్ స్పెషల్‌ సాంగ్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్‌కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్‌ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్‌ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్‌ను ఢీకొట్టే పాత్రలో కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.&nbsp;
    మే 24 , 2024
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. రెండేళ్లు.. అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1672478971827720192 మూడేళ్లు.. అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664273686810198024 గుంటూరు కారం 2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.&nbsp; కారణాలు.. సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.&nbsp; https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192 త్రివిక్రమ్ డైవర్ట్? ‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664248261442678784 నిరాశలో ఫ్యాన్స్ సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
    ఆగస్టు 09 , 2023
    POONAM BAJWA: బీచ్‌లో ఎద, నాభి అందాలతో కిర్రెక్కిస్తున్న పూనమ్ బజ్వా
    POONAM BAJWA: బీచ్‌లో ఎద, నాభి అందాలతో కిర్రెక్కిస్తున్న పూనమ్ బజ్వా
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    ఏప్రిల్ 06 , 2023
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    Allu vs Mega Families: మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌? చిరు బర్త్‌డే విషెస్‌లోనూ కానరాని ఎఫెక్షన్‌!
    పాలు, నీళ్లలా కలిసి ఉండే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌కు వ్యతిరేకంగా వైకాపా అభ్యర్థికి బన్నీ మద్దతు తెలపడం, ఓటు వేయాలని ప్రచారం కూడా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో మరోమారు ఫ్యాన్ వార్‌కు కారణమయ్యాయి. దీంతో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వివాదం మరోమారు బట్టబయలైందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఈ దెబ్బతో రెండు కుటుంబాల మధ్య ఉన్న రిలేషన్‌ కటీఫేనా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ‘నా మనసుకు నచ్చితే వస్తా’ రావు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' ప్రిరీలిజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్‌ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సుకుమార్‌ భార్య తబిత సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో వారిద్దరూ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్‌కు చురకలు అంటించారు. ‘మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమాని సుకుమార్‌ భార్య తబిత ప్రెజెంట్‌ చేస్తున్నారు. మేం పుష్ప 2 క్లైమాక్స్‌ షూట్‌లో ఉండగా ఆమె వచ్చి సుకుమార్‌, మిమ్మల్ని కాకుండా నేను నా సినిమా ఈవెంట్‌కు ఎవరిని పిలవగలను అని అన్నారు. ఇప్పటి వరకూ నేను నటించిన వాటిలో అతికష్టమైన క్లైమాక్స్‌ పుష్ప 2ది. అలాంటి పరిస్థితిలోనూ ఆమె ఆహ్వానించారని వచ్చా. ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. వైకాపా అభ్యర్థి తరపున ప్రచారం చేసిన బన్నీ పవన్‌ కోసం కూడా చేయవచ్చు కదా అన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ ఈవిధంగా బదులిచ్చి ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  https://twitter.com/i/status/1826302303244091491 ‘నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి’ ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులైన అల్లు అర్మీ గురించి బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ఆకాశానికెత్తుతూ మాట్లాడారు. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌. నా ఆర్మీ. ఐ లవ్‌ యూ. నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా' అని అన్నారు. అయితే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఫ్యాన్స్ గురించి బన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. వైకాపా నేతకు మద్దతు తెలిపినప్పటి నుంచి బన్నీని జనసైనికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున టార్గెట్‌ చేస్తూ వచ్చారు. సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. ఆ సమయంలో అల్లు అర్మీ తమ హీరోకి మద్దతుగా నిలిచి గొప్పగా పోరాడింది. మెగా ఫ్యాన్స్ ఆరోపణలకు ఎక్కడికక్కడ చెక్‌ పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు తనదైన శైలిలో ఐ లవ్ యూ చెబుతూ బన్నీ కృతజ్ఞతలు చెప్పి ఉండొచ్చు. అయితే బన్నీ స్పీచ్‌లో గమనించాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. ఆయన గతంలో ఎప్పుడు మెగా ఫ్యాన్స్‌, అల్లు ఆర్మీని సెపరేట్‌ చేసి మాట్లాడింది లేదు. కానీ ఈ సారి అల్లు అర్మీ అంటూ బన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో చీలికలను బన్నీ ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చిరుకి సింపుల్‌ విషెస్‌..! నేడు (ఆగస్టు 22) మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్‌ హీరోగా నిలిచిన తమ హీరోకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ కూడా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. అయితే తనకు లైఫ్‌ ఇచ్చిన చిరంజీవికి సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై మెగా అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే' అంటూ బన్నీ పోస్టు పెట్టాడు. అయితే గతంలో బన్నీ ఈ విధంగా ట్వీట్ ఎప్పుడు పెట్టలేదు. చిరు బర్త్‌డే అంటే ఎంతో హడావిడి చేసే బన్నీ ఇలా సింపుల్‌గా విషెస్‌ చెప్పి చేతులు దులిపేసుకోవడం వెనకు ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదమే కారణమై ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1826438293350711467 బన్నీకి పవన్‌ చురకలు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని పవన్ కల్యాణ్‌ అన్నారు. అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అలా పరిస్థితి మారిపోయిందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీనిపై జనసైనికులు, మెగా ఫ్యాన్స్‌ - అల్లు ఆర్మీ మధ్య పెద్ద ఫ్యాన్‌ వారే జరిగింది. 
    ఆగస్టు 22 , 2024
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. అంచనాలు అందుకోలేకపోయిన చరణ్‌ బర్త్‌డే ట్రీట్‌!&nbsp;
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. అంచనాలు అందుకోలేకపోయిన చరణ్‌ బర్త్‌డే ట్రీట్‌!&nbsp;
    ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Gamer Changer). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తుండటం, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు రీజన్స్‌తో సినిమా షూట్‌ వాయిదా పడుతూ వస్తుండటంతో రిలీజ్‌ కూడా జరుగుతూ వస్తోంది. ఇక రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ తేదీని ప్రకటిస్తారని అంతా భావించినా లిరికల్‌ సాంగ్‌తో మేకర్స్‌ చేతులు దులుపుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ఓ వార్త బయటకొచ్చింది.&nbsp; రిలీజ్‌ డేట్‌ లాక్‌? పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ (Pushpa 2), ‘దేవర’ (Devara) వంటి చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) పై అందరి దృష్టి పడింది. అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా ఓ దశలో ఫ్యాన్స్‌లో మెుదలయ్యాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా రిలీజ్‌ తేదీ లాక్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండోచ్చని అంటున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; కాస్త ఓపిక పట్టండి: దిల్‌రాజు రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నిర్మాత దిల్‌రాజ్.. తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని కీలక అప్‌డేట్స్‌ కోసం కాస్త ఓపిక పట్టమని ఫ్యాన్స్‌ను కోరారు. ‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ కాదు.. గ్లోబల్‌ స్టార్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్‌ అయ్యేలా శంకర్‌ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్‌ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్‌ చేస్తాం' అని అన్నారు.&nbsp; రెస్పాన్స్ అంతంతమాత్రమే! మార్చి 27న చరణ్‌ బర్త్‌డే కానుకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నుండి ‘జరగండి’ పాట విడుదలైంది. అయితే ఈ పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తమన్ రొటీన్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ఉన్నా కూడా రామ్ చరణ్‌, కియారా స్టెప్స్ సో సోగానే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం ఉ. 9 గంటలకు ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో రిలీజ్‌ కాగా.. గురువారం ఉ. 9 గంటల సమయానికి 4.5 మిలియన్‌ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. ఇక హిందీ, తమిళంలలో అయితే మరీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక దాంట్లో 3 లక్షలు, మరో దాంట్లో 5 లక్షల వ్యూస్‌తో జరగండి సాంగ్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.&nbsp; ఒక్క సాంగ్‌కు అన్ని కోట్లా? యూట్యూబ్‌లో రిలీజైన ‘జరగండి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను పరిశీలిస్తే అందులో రంగు రంగు భవనాలను చూడవచ్చు. ఈ సాంగ్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే అవన్ని ఒరిజినల్‌ భవనాలు కాదని.. చూడటానికి నిజమైన ఇల్లులా కనిపించే సెట్స్‌ అని టాక్‌ వినిపిస్తోంది. ఈ సెట్‌ నిర్మించడం కోసం ఏకంగా రూ.16 కోట్లను ఖర్చు చేశారని ఫిలింనగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే శంకర్‌ గురించి తెలిసినవారు ఇది మామూలు విషయమేనని అంటున్నారు.&nbsp;
    మార్చి 28 , 2024
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో  పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
    "పుష్ప 2" క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది.&nbsp; ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్‌ఫుల్‌ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నా స్ఫూర్తిదాయకమైన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకోనుంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్&nbsp; అందించిన సంగీతం అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రతీ సీన్‌లోని భావోద్వేగాలను, కథలోని ప్రధాన అంశాలను దృశ్యమాలికగా మన కళ్ల ముందు కదిలేలా చేస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" చిత్రానికి కొనసాగింపుగా, "పుష్ప 2: ది రూల్"లో పాటలు కథనానికి మరింత జీవం పోసేలా ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పుష్ప: ది రూల్ చిత్రంలోని పాటల లిరిక్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి. Peelings Song Lyrics in Telugu మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో ఆరుంటికోసారి యేడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి యేమి తోసక కూసుంటే ఓసారి యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి పూలెడ్తే ఓసారి నాగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారి వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు ఆఁ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నముకలో ముళ్ల మలార్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు సాయం సేత్తో సెయ్యేసినప్పుడు సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో https://www.youtube.com/watch?v=8RAd-_Qj_ac&amp;ab_channel=T-SeriesTelugu Kissik Song Lyrics in Telugu కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు మావయ్యోచ్చాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దించర దించర దించు బావయ్యోచాడు దించు కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్ మచ్చా వచ్చాడు దించు కిస్సిక్ పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్ పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్ మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో సేతులు తిన్నగా వుండకపోతే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ సింగల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ ఏ పోసైన ఫోటో తీస్కో ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో బాడ్ అంగెల్లో చూసావంటే దెబ్బలు పడతయి రో కిస్సిక్ దెబ్బలు పడతయి రో కిస్సిక్ తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా సూసుకో కళ్ళకు పండగ సేసుకో కాదనేది లేదు కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో దెబ దెబ దెబ్బలు పడతయి రో కిస్ కిస్ కిస్ కిస్సిక్ కిస్సా కిస్సా కిస్ కిస్సిక్ కిస్ కిస్ కిస్ కిస్సిక్ Pushpa Title Song Lyrics In Telugu పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే Suseki Song lyrics In Telugu వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ
    డిసెంబర్ 03 , 2024
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఏ డ్రెస్‌ వేసుకుని ఫొటో షూట్ చేసినా… ఆరోజు సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురవాల్సిందే. తాజాగా పూనమ్ బజ్వా మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ.. నాభిని ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. నడుము అందాలతో కుర్రకారుకు హుషారెక్కిస్తోంది. చేతులు పైకి లేపి నాభి అందాలను సంపూర్ణంగా చూపించి రెచ్చిపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కొద్ది నెలల నుంచి ఈ సుందరి హద్దులు దాటి సోయగాల ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు బీచ్‌లో బికినీ అందాలతో మత్తెక్కిస్తోంది పూనమ్. పూనమ్ 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'మొదటి సినిమా'తో తెరంగ్రేటం చేసింది. తర్వాత నాగ్ సరసన బాస్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసినప్పటికీ అవకాశాలు తలుపు తట్టలేదు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటంతో తమిళ్‌, మళయాళం చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్‌లో రెండు ఐటెమ్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ చిన్నది. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఈ హీరోయిన్‌కు పెద్దగా హిట్లు రాకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమాలతో ఆకట్టుకోలేకపోయినా అందచందాలు ప్రదర్శించి యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది పూనమ్. గత కొద్ది నెలలుగా వరుసగా హాట్‌ లుక్స్‌తో ఫొటోలు పెట్టి సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది ఈ అమ్మడు. మూడు పదులు దాటిన వయసులోనూ తనలో అందాల ఎసరు ఎమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది
    అక్టోబర్ 27 , 2023

    @2021 KTree