రివ్యూస్
How was the movie?
తారాగణం
విజయ్
పూజా హెగ్డే
సెల్వరాఘవన్
షాజీ చెన్
వీటీవీ గణేష్
అంకుర్ వికల్
అపర్ణా దాస్
సతీష్ కృష్ణన్
షైన్ టామ్ చాకో
యోగి బాబు
రెడిన్ కింగ్స్లీ
సునీల్ రెడ్డి
సుజాత బాబు
లిల్లిపుట్
సుబ్బలక్ష్మి
పృధ్వీ రాజ్
సెల్ మురుగన్
పవన్ చోప్రా
సిబ్బంది
నెల్సన్ దిలీప్‌కుమార్
దర్శకుడుకళానిధి మారన్
నిర్మాతఅనిరుధ్ రవిచందర్
సంగీతకారుడుమనోజ్ పరమహంస
సినిమాటోగ్రాఫర్కథనాలు
Anirudh Ravichander: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అనిరుధ్.. తగ్గిన దేవి శ్రీ, థమన్ హవా!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు మార్మోమోగుతోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ‘రఘువరన్ బీటెక్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలతో యమా క్రేజ్ సంపాదించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఉందంటే ఆ మూవీకి ఎనలేని క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా యూత్ అనిరుధ్ ఇచ్చే పాటలు, నేపథ్య సంగీతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా తారక్ నటించిన ‘దేవర’ చిత్రానికి సైతం అనిరుధ్ అదిరిపోయే సంగీతం ఇచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకూ కోలీవుడ్‌పైనే ఫోకస్ ఉంచిన అనిరుధ్ ప్రస్తుతం దానిని టాలీవుడ్‌పైకి మరల్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్లకు కష్టాలు తప్పవన్న చర్చ మెుదలైంది.
ఆ చిత్రాలతో తెలుగులో క్రేజ్!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నేరుగా ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘యూటర్న్’ వంటి చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అయినప్పటికీ అనిరుధ్ గురించి టాలీవుడ్‌లో పెద్దగా చర్చ జరగలేదు. అయితే రీసెంట్‌గా ‘విక్రమ్’, ‘జైలర్’, ‘జవాన్’ చిత్రాలతో అతడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా అతడిచ్చిన నేపథ్య సంగీతానికి యూత్ ఫిదా అయ్యారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో అనిరుధ్ మ్యూజిక్‌ను తెలుగు ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. రిపీట్ మోడ్‌లో అతడి పాటలు వింటూ సంగీతాన్ని అస్వాదించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ వల్లే అనిరుధ్ ‘దేవర’ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు కూడా మేకర్స్ ఇటీవల తెలియజేశారు.
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు!
‘దేవర’ సక్సెస్ తర్వాత టాలీవుడ్‌లో అనిరుధ్ పేరు బాగా వినిపిస్తోంది. మరోమారు థియేటర్లలో అతడి మ్యూజిక్ ఎంజాయ్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన తెలుగు దర్శక నిర్మాతలు అనిరుధ్‌తో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటు తెలుగులో వస్తోన్న ఆదరణ చూసి టాలీవుడ్‌లోనూ తన దూకుడు పెంచాలని అనిరుధ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతం తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాకు సైతం అనిరుధ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు డైరెక్టర్లు కూడా తమ మూవీ కోసం అనిరుధ్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్. రానున్న రోజుల్లో అరడజను ప్రాజెక్ట్స్ వరకూ తెలుగులో అనిరుధ్ చేయవచ్చని అంటున్నారు.
థమన్, దేవిశ్రీకి కష్టమేనా!
సంగీత దర్శకులు థమన్, దేవిశ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో రిలీజయ్యే 10 చిత్రాల్లో కనీసం 5-8 చిత్రాలకు వీరిద్దరే మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ల తొలి రెండు ప్రాధాన్యాలుగా వీరిద్దరే ఉంటూ వచ్చారు. అటువంటి థమన్, దేవిశ్రీకి అనిరుధ్ రాకతో గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న, మెున్నటి వరకూ టాలీవుడ్‌ను అంతగా ప్రాధాన్యత ఇవ్వని అనిరుధ్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం వారికి గట్టి ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. మరి అనిరుధ్ మ్యానియాను తట్టుకొని థమన్, దేవిశ్రీ ఏవిధంగా రాణిస్తారో చూడాలని పేర్కొంటున్నారు.
అవి క్లిక్ అయితే ఆపడం కష్టం!
రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి సైతం థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘హంగ్రీ చీతా’ రిలీజ్ చేసిన సాంగ్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా బాలయ్య-బోయపాటి నాలుగో చిత్రం ‘అఖండ 2’కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మరోవైపు దేవిశ్రీ చేతిలో ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టైటిల్ సాంగ్‌తోపాటు 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆయా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే థమన్, దేవిశ్రీకి తిరుగుండదని చెప్పవచ్చు.
అక్టోబర్ 22 , 2024
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
దిగ్గజ నటుడు వెంకటేష్ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
‘తెలియక రియల్ గన్ గురిపెట్టా’
‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్ గారు నీకు రియల్ గన్ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్ కంగారు పడ్డారు. వెంటనే గన్ నుంచి బుల్లెట్స్ తీశారు. అది జస్ట్ ఇలా టచ్ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్ గన్ అని తెలియక గణేష్ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు' అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్ రావిపూడి తెలిపారు.
https://twitter.com/i/status/1859203309460242668
'అప్పుడే పరిశ్రమ బాగుంటుంది'
‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు. సీనియర్ నటుడు నరేష్ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్ వెంకటేష్ అని కొనియాడారు.
https://twitter.com/i/status/1859532368333373653
https://twitter.com/i/status/1859206087821737998
సంక్రాంతికి హ్యాట్రిక్ చిత్రాలు!
2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్ పెట్టారని వ్యాఖ్యానించారు.
https://twitter.com/i/status/1859522147229573619
70% థియేటర్లు దిల్‌రాజుకే!
2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
నవంబర్ 21 , 2024
Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
తారక్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద సాలిడ్ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.
‘జైలర్’ డైరెక్టర్‌తో పాన్ ఇండియా చిత్రం!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్, జైలర్ హిట్స్‌తో నెల్సన్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
2026 వరకూ ఆగాల్సిందే!
తారక్ - నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్ 'వార్ 2' (War 2) పెండింగ్ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్ సైతం ‘జైలర్ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్ 2’ షూటింగ్ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.
మా స్ట్రెంత్ అతడే: తారక్
'దేవర' బ్లాక్ బాస్టర్ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్యాణ్ రామ్ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు.
బంగ్లాదేశ్ రైతుగా జూ.ఎన్టీఆర్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్ ఫిక్సయ్యిందా?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 05 , 2024
పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే ముద్దు పేరు?
పూజిత
పూజా హెగ్డే వయస్సు ఎంత?
1990, అక్టోబర్ 13న జన్మించింది
పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా?
ఒక లైలా కోసం(2014)
పూజా హెగ్డే ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది?
మంగళూరు, కర్ణాటక
పూజా హెగ్డే ఉండేది ఎక్కడ?
ముంబై
పూజా హెగ్డే ఏం చదివింది?
Mcom
పూజా హెగ్డే అభిరుచులు?
ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం
పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం?
బిర్యాని, ఫిజా
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్
పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్?
మాధురి దీక్షిత్
పూజా హెగ్డే పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
పూజా హెగ్డే తల్లిదండ్రుల పేరు?
లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే
పూజా హెగ్డే రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/hegdepooja/
పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ?
రూ.50కోట్లు
https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
ఏప్రిల్ 16 , 2024
Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్.. మరి సినిమా హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు.
డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20
ఎలా ఉంది?
కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.
https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20
ఎవరెలా చేశారు?
జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.
టెక్నికల్‌గా..
గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్ బాగున్నాయి.
https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20
పాజిటివ్ పాయింట్స్
రజినీ ఎలివేషన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
డార్క్ కామెడీ
నెగెటివ్ పాయింట్స్
బోర్ కొట్టించే సన్నివేశాలు
రేటింగ్.. 2.75/5
ఆగస్టు 11 , 2023
Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్ లెగ్ ట్యాగ్‌కు సల్మాన్ చెక్ పెట్టేనా?
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు.
అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్ లెగ్ ట్యాగ్ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.
‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తనపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
ఏప్రిల్ 10 , 2023
RC16: ఇస్రో శాస్త్రవేత్తల బాటలో డైరెక్టర్ బుచ్చిబాబు.. వర్కౌట్ అయితే చరణ్‌ను ఎవరూ ఆపలేరు!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్ మేకోవర్ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సేమ్ టూ సేమ్..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్‌లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/SriLakshmi_10/status/1679348363546730496
https://twitter.com/i/status/1858591431201317066
‘RC 16’ షూటింగ్ షురూ..
శుక్రవారం (నవంబర్ 22) ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్‌లో మూడు రోజుల పాటు షూట్ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్‌చరణ్ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం.
https://twitter.com/BuchiBabuSana/status/1859777297768681631
టీమ్‌లోకి జగ్గుభాయ్..
'RC 16' ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్‌లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. దీంతో జగ్గుభాయ్ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్‌లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్‌చరణ్ - జగ్గుభాయ్ ప్రత్యర్థులుగా చేసిన 'రంగస్థలం' (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/IamJagguBhai/status/1859820964600742352?
‘RC16’ స్టోరీ ఇదే!
‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ లుక్‌తో పోలిస్తే చరణ్ బాడీతో పాటు, లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నవంబర్ 22 , 2024
Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్.. మరి హైట్ సెట్ అవుతుందా?
టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.
విరూపాక్ష డైరెక్టర్‌తో..
సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast), ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus), ‘కిసి కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.
‘తండేల్’తో వస్తోన్న చైతూ
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి!
టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.
నవంబర్ 16 , 2024
RC16: బుచ్చిబాబు సినిమా కోసం మహేష్ తరహాలో రామ్‌చరణ్ మేకోవర్.. వీడియో వైరల్!
రామ్‌చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రామ్‌చరణ్ పూర్తిచేశారు. త్వరలోనే ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కానున్నాయి. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రామ్‌చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ 'RC16' పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు సంబంధించిన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. అతడి మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
చరణ్ లుక్ వైరల్!
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకోసం చరణ్ కూడా తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చరణ్ ప్రత్యక్షమయ్యాడు. బ్లాక్ కలర్ గ్లాసెస్‌తో లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్‌తో చెర్రీ కనిపించాడు. గేమ్ ఛేంజర్ లుక్‌తో పోలిస్తే చరణ్ మరింత కండలు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్‌చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కూతురు క్లింకార కూడా ఉన్నారు. రామ్‌చరణ్ తాజా లుక్స్ చూస్తుంటే రీసెంట్‌గా మహేష్‌బాబు లుక్స్ గుర్తువస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/BhavanircG46421/status/1837374510724505847
మల్లయోధుడిగా చరణ్!
‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'బీస్ట్ మోడ్ ఆన్' అంటూ ఓ ఫొటోను అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ఈ పిక్‌లో చరణ్ తన ముఖం కనిపించకుండా వెనుకవైపుగా ఉన్న ఫొటోను షేర్ చేశారు.
View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)
'తంగలాన్' కాస్ట్యూమ్ డిజైనర్
'RC16'ను పిరియాడిక్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించనున్నారు. ఈ చిత్రంలో సెట్స్, కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. అందుకే గత కొన్ని వారాలుగా హైదరాబాద్ శివారులో దర్శకుడు సెట్స్ వేయిస్తున్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్స్ కోసం తమిళ డిజైనర్ ఏగన్ ఏకాంబరంను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. తంగలాన్ చిత్రానికి ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో విక్రమ్ సహా ముఖ్య పాత్రదారుల కాస్ట్యూమ్స్, ఔట్ ఫిట్ లుక్ కథకు అనుగుణంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన అయితేనే 'RC16' న్యాయం చేయగలరని దర్శకుడు బుచ్చిబాబు భావించినట్లు తెలుస్తోంది.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీంతో సంవత్సరానికి రెండు చొప్పున చిత్రాలు పట్టాలెక్కించేందుకు చరణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్’ రిలీజ్‌పై తమన్ లీక్!
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజా పోస్ట్ ఆ లోటు తీర్చినట్టైంది. ‘వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి’ అని అప్‌డేట్ ఇచ్చారు. దీంతో, రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/MusicThaman/status/1836412745593286741
సెప్టెంబర్ 21 , 2024
Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్-10 సాంగ్స్ ఇవే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
[toc]
అసలేం జరిగిందంటే?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 19) ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.
తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్
మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
https://twitter.com/HeroManoj1/status/1836692133216174368
జానీ మాస్టర్ టాప్-10 సాంగ్స్
జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్ -10 సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం
మేఘం కరిగేనా (తిరు)
తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ధనుష్, నిత్య స్టెప్పులను నెక్స్ట్ లెవల్లో కంపోజ్ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.
https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY
అరబిక్ కుతు (బీస్ట్)
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్ బెస్ట్ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది.
https://www.youtube.com/watch?v=vOYJmUE_U24
రంజితమే (వారసుడు)
విజయ్, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో విజయ్, రష్మిక డ్యాన్స్ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్ చివరిలో వచ్చే సింగిల్ టేక్ స్టెప్ విజయ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8
రారా రక్కమ్మ (విక్రాంత్ రోణ)
విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్ దేశంలోని మ్యూజిక్ లవర్స్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్ స్టెప్‌పై రీల్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.
https://www.youtube.com/watch?v=aC9KBju5BNY
నువ్వు కావాలయ్యా (జైలర్)
రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్న వేసిన హుక్ స్టెప్‌కు యూత్ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. రీల్స్ సైతం పెద్ద ఎత్తున చేశారు.
https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk
రౌడీ బేబీ (మారి 2)
సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్ చిత్రీకరణ జరిగింది.
https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI
బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు.
https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ
సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం)
‘రేసుగుర్రం’లోని మాస్ బీట్ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA
లైలా ఓ లైలా (నాయక్)
రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=HGgHSi-kg78
ఏం మాయో చేశావే (ద్రోణ)
2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ టాలెంట్ చూసిన నితిన్ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నితిన్ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్ తర్వాత నుంచి జానీ మాస్టర్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
సెప్టెంబర్ 19 , 2024
Devara Movie: ‘దేవర’లో దావూదీ సాంగ్‌ను నిజంగానే తొలగిస్తారా? అసలు నిజం ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తారక్ కూడా సినిమాకు సంబంధించి హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. దీంతో ‘దేవర’ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో తారక్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్‌గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం.
ఆ భయం అక్కర్లేదు!
దేవర చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకూ మూడు సాంగ్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌తో పాటుగా మూడో సింగిల్‌గా ‘దావూదీ’ పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో ఆ మూడు పాటలు యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో సాంగ్ ఎక్కడ కనిపించదని ప్రచారం జరుగుతోంది. రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్‌ను కూడా కట్ చేశారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దావూదీ సాంగ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే సాంగ్‌ను పూర్తిగా తీసే పరిస్థితి ఉండకపోవచ్చు. దావూదీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీ మిడిల్‌లో సాధ్యం కాకపోతే ఎండ్ టైటిల్స్ దగ్గరైనా సాంగ్‌ను ప్లే చేయడం పక్కా అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1832446641393246291
దుమ్మురేపిన తారక్
‘దేవర’ నుంచి సెప్టెంబర్ 4న ‘దావూదీ’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సాంగ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు’ పాటకు కాపీ అంటూ ట్రోల్స్ వచ్చాయి. జాన్వీతో పోలుస్తూ ఎన్టీఆర్ హైట్‌పైనా కొందరు కామెంట్స్ చేశారు. వాటన్నిటినీ తారక్ తన డ్యాన్స్‌తో పక్కకి నెట్టాడు. మాస్ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించాడు. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్‌ను అల్లాడిస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్‌తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్‌ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ తీసివేసే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పవచ్చు.
https://twitter.com/DevaraMovie/status/1835018489784123480
జాతీయస్థాయిలో ట్రెండింగ్
దేవర చిత్రం ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్ఠానాలను దక్కించుకున్నాయి ఈ దేవర సాంగ్స్. ఇందులో దావూదీ (తెలుగు) పాట మొదటి స్థానంలో ఉండగా, దావూదీ(హిందీ) పాట 7వ స్ఠానం కైవసం చేసుకుంది. ఇక చుట్టమల్లె (తెలుగు) సాంగ్ 18వ స్థానంలో ఉండగా, దావూదీ(తమిళ) పాట 25 స్థానంలో నిలిచాయి. ఇదే చిత్రానికి సంబంధించిన నాలుగు పాటలు ట్రెండింగ్ టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
https://twitter.com/DevaraMovie/status/1835682846092226856
'పుష్ప 2'ను దాటేసిన 'దేవర'
విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించిన దేవర చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో పుష్ప2 సినిమాను దాటేసింది. ఈ రెండు సినిమాలు చూడటానికి ఎంత మంది ఆసక్తి చూపుతున్నారో అన్న విషయం గురించి బుక్ మై షో తాజాగా వెల్లడించింది. పుష్ప2 చిత్రం కోసం ఇప్పటివరకూ 3లక్షల 34వేల మంది ఆసక్తి చూపగా, దేవర సినిమా కోసం 3 లక్షల 36 వేల మంది ఆసక్తి చూపిస్తున్నట్లు అందులో తెలిపింది. ఇక దేవర సినిమా విషయానికొస్తే ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మరో సినిమా ఇది. రెండు భాగాలుగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Daavudi Song Trolls: జూ.ఎన్టీఆర్ ’దావూదీ’ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా 22 రోజుల సమయమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 4) థర్డ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'దావూదీ' (Daavudi Song) అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్‌కు సైతం ఈ సాంగ్ గురవుతోంది. ఈ విచిత్ర పరిస్థితి చూసి అటు దేవర టీమ్‌తో పాటు తారక్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘దావూదీ’ పాటపై వస్తున్న ప్రశంసలు, విమర్శల గురించి ఈ కథనంలో పరిశీలిద్దాం.
పెప్పీ బీట్‌తో వచ్చిన ‘దావూదీ’
‘దేవర’ చిత్రం నుంచి ఇటీవల రిలీజైన ‘ఫియర్’ (Fear Song), ‘చుట్టమల్లే’ (Chuttamalle Song) పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో సహజంగానే మూడో పాటపై పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం (సెప్టెంబర్ 4) సాయంత్రం 'దావూదీ' పేరుతో ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో తారక్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అటు తారక్‌కు దీటుగా స్టెప్పులేసి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అదరహో అనిపించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ పాటను అనిరుద్ పెప్పీ బీట్‌తో రూపొందించారు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించారు. నకష్ అజీజ్, ఆకాశ స్వరాన్ని సమకూర్చారు.
యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్..
‘దావూదీ’ సాంగ్‌కు యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. 24 గంటలు పూర్తికాకుండానే ఈ చిత్రం 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవర టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దావూదీ సాంగ్‌లోని తారక్, జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ ఫోజును ఈ పోస్టర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం ‘దావూదీ’ సాంగ్ జాతీయ స్థాయిలో యూట్యూబ్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. గంట గంటకు లక్షల్లో వ్యూస్ పెంచుకుంటూ 50 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది.
https://twitter.com/DevaraMovie/status/1831578339078787537
మెస్మరైజింగ్ డ్యాన్స్
దావూదీ సాంగ్‌లో తారక్ డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తారక్ ఎనర్జిటిక్ స్టెప్పులు పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన అతి కష్టమైన స్టెప్పులను సైతం తారక్ చాలా ఈజీగా వేశారు. దావూదీ సాంగ్‌లో తారక్ జోష్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నాటు నాటు పాటను గుర్తుకు తెచ్చింది. అటు జాన్వీ కపూర్ కూడా తారక్‌కు ధీటుగా స్టెప్పులేసి తానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. అటు సోషల్ మీడియాలోనూ వీరిద్దరి డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తారక్‌ను ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి చూసినా తారక్‌లో ఇదే ఎనర్జీ ఉందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దావూదీ సాంగ్ షూటింగ్ సమయంలో కండరాల నొప్పితో తారక్ బాధపడ్డారని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఆ బాధను భరిస్తూనే అద్భుతంగా డ్యాన్స్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో తారక్‌ను పోలుస్తూ మరో నెటిజన్ పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/Thyview/status/1831302488340725836
https://twitter.com/krrishnolan/status/1831335770289820070
వెంటాడుతున్న ట్రోల్స్
దేవర థర్డ్ సింగిల్ ‘దావూదీ’పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ సాంగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రంలోని 'అరబిక్ కుత్తు'ను తలపిస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. విజయ్, తారక్ వేసిన స్టెప్స్ కూడా సేమ్ టూ సేమ్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్‌ను సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జాన్వీ కంటే ఎన్టీఆర్ తక్కువ ఎత్తు ఉన్నాడని, అందుకే ఆమె బెండ్ అయ్యి మరీ స్టెప్పులు వేయాల్సి వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. ‘దావూదీ’ పాటలో తారక్ హైహీల్స్ లాంటి షూస్‌ను వేసుకోవాడాన్ని కొందరు హైలేట్ చేస్తున్నారు. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలతో ‘దావూదీ’ పాటకు వింత పరిస్థితి ఎదురవుతోంది.
https://twitter.com/iam_venkatsai_/status/1831547990722671066
https://twitter.com/Sunnykesh/status/1831302199160299619
సెప్టెంబర్ 27న థియేటర్లలో 'దేవర'
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా 'దేవర'. దీనికి ముందు వీళ్లిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. అంతకు ముందు 'బృందావనం' చిత్రానికి రచయితగానూ కొరటాల శివ పని చేశారు. దీంతో వీరిద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని తారక్ అభిమానులతో పాటు సినీ ఆడియన్స్‌తో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, 'దేవర' సినిమాకు ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్ 05 , 2024
Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..!
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.
భారీ తారాగణంతో..
జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది.
మ్యూజిక్ అతడేనా
నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.
వీటికి కూడా సీక్వెల్స్?
జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.
రజనీ, విజయ్‌లతో మూవీ
కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
4 రోజుల్లో 300 కోట్లు
జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఆగస్టు 14 , 2023
Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్.. ఎప్పుడూ ఇదే వరస!
మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
రెండేళ్లు..
అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.
https://twitter.com/GunturKaaram/status/1672478971827720192
మూడేళ్లు..
అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.
https://twitter.com/GunturKaaram/status/1664273686810198024
గుంటూరు కారం
2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.
కారణాలు..
సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.
https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192
త్రివిక్రమ్ డైవర్ట్?
‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.
https://twitter.com/GunturKaaram/status/1664248261442678784
నిరాశలో ఫ్యాన్స్
సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
ఆగస్టు 09 , 2023
PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం.
సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం.
RRR
ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.
KGF
రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.
పఠాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది.
బ్రహ్మాస్త్ర
అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.
బీస్ట్
దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.
OG
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.
LEO
లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
మే 02 , 2023
CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్. ఆయన ఎవరో కాదు చియాన్ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.
శివ పుత్రుడు
పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు.
అపరిచితుడు
శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
మల్లన్న
విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఐ
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ చేసిన రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
నాన్న
విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్ ఇప్పటికే చాలామందిని మెప్పించింది.
ఇంకొక్కడు
ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.
తంగలాన్
విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
ఏప్రిల్ 18 , 2023
Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
[toc]
సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.
వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.
https://twitter.com/sarathtarak9/status/1775161795440971956
వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.
విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.
ప్రభాస్ కార్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్‌లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.
Rolls Royce Ghost
ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు
Jaguar XJL
ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన తర్వాత కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.
Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు
BMW X5
ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Lamborghini Aventador Roadster
లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది. ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.
Range Rover SV Autobiography
ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.
అల్లు అర్జున్ లగ్జరీ కార్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.
జాగ్వార్ XJL
దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంటుంది.
హమ్మర్ H2
అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్'గా పిలుచుకుంటారు.
వోల్వో XC90 T8
ఇది వోల్వో ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు
ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.
ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.
రామ్‌చరణ్ లగ్జరీ కార్ కలెక్షన్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే. విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.
Ferrari Portofino
రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.
View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy)
ఈ కార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు
మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు
https://twitter.com/ManobalaV/status/1437059410321309702
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు
ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు
Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి
ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.
https://twitter.com/HelloMawa123/status/1502241248836349956
విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది. అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు. Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.
https://www.youtube.com/watch?v=vkS_uio8ix8
నాగచైతన్య లగ్జరీ కార్ కలెక్షన్లు
అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.
ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)
BMW 740 Li — (రూ. 1.30cr)
నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)
2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)
MV అగస్టా F4 — (రూ. 35L)
BMW 9RT — (రూ. 18.50L)
View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni)
https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280
View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth)
నాని లగ్జరీ కారు కలెక్షన్
నాని దగ్గర లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు, టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.
https://www.youtube.com/watch?v=KuOxAHUisOg
రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్
రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్ అదే స్థాయిలో ఉన్నాడు.
అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా
రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,
రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,
రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .
రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-
రూ. కోటి విలువైన BMW X3.
https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE
విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్
విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు
శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్
శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.
రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు
ఆడి Q7- రూ. 90 లక్షలు
BMW 530D- రూ. 75 లక్షలు
ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు
నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్
హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు
Fiery Red Mercedes Sports Coupe- దీని ధర రూ.3.33కోట్లు
https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128
https://twitter.com/actor_Nikhil/status/612984749645148160
రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు
https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI
సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్
సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.
సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్ తర్వాత కొనుగోలు చేశాడు.
https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
అక్టోబర్ 22 , 2024
Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి.
[toc]
Samantha Ruth Prabhu
సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.
Samantha bikini images
Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.
Kajal Agarwal bikini video
https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250
Tamannaah Bhatia
తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు.
Tamannaah Bhatia Bikini images
View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial)
View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
Anushka Shetty
అనుష్క శెట్టి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు.
Anushka shetty Bikini Images
Disha Patani
దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది.
Disha Patani Bikini images
Pragya Jaiswal
ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి.
Pragya Jaiswal bikini Images
ShwetaTiwari
శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి.
ShwetaTiwari Bikini Images
Deepika Padukone
దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది.
deepika padukone bikini Images
Pooja Hegde
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి.
Pooja Hegde Bikini Images
Pooja Hegde Hot Videos
https://twitter.com/RakeshR86995549/status/978983052364808194
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
Raashii Khanna
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్. ఐఏఎస్ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి.
Raashii Khanna Bikini images
Dimple Hayathi
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్ బీట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్ వేయండి
https://twitter.com/PicShareLive/status/1525365506471231488
Ketika Sharma Bikini Images
కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి
Ketika Sharma Bikini Images
Catherine Tresa
కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి.
Catherine Tresa Bikini images
Mrunal Thakur
మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి.
Mrunal Thakur Bikini images
Mrunal Thakur hot video
https://twitter.com/MassssVishnu/status/1786566946600988750
https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193
https://twitter.com/SastaJasoos/status/1788498532162236427
Anasuya Bharadwaj
బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి.
Anasuya Bharadwaj Bikini images
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి.
Nidhhi Agerwal Bikini Images
Mehreen Kaur Pirzada
మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది.
Mehreen Kaur Pirzada Bikini Videos
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)
Manushi Chillar
మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి.
Manushi Chillar Bikini Images
Manushi Chillar Bikini videos
View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)
https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182
Sobhita Dhulipala
శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి.
Sobhita Dhulipala bikini images
Hot videos
View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)
Tripti Dimri
తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి.
Tripti Dimri Bikini images
View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri)
Shirley Setia
షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Shirley Setia Bikini Images
మే 11 , 2024
తెలుగులో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) మూవీస్
]నాని (2004) - YouTubeబింబిసార (2021) - Zee5ఇవి కూడా చూడొచ్చు
ఫిబ్రవరి 14 , 2023
2022 బెస్ట్ ఓటీటీ చిత్రాలు
]అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఓ నిర్లక్షరాస్యుడు అతడి చర్యల కారణంగా జైలుకు వెళ్తాడు. చదువు ఎంత అవసరమో గుర్తించి జైలులో ఉన్నప్పుడే 10వ తరగతి పూర్తి చేస్తాడు. సినిమా అందరినీ మెప్పిస్తుంది.దస్వీ - హాట్ స్టార్
ఫిబ్రవరి 13 , 2023