UATelugu
శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. అప్పటికే ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. ఈక్రమంలో ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(రాంప్రసాద్) పెద్ద ప్లాన్ వేస్తారు. గ్రామస్థుల వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తారు. దీనిని ఎదురించిన శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు అనేది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
YouSay Review
BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్ కొట్టినట్లేనా?
కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథ...read more
How was the movie?
తారాగణం
కార్తికేయ గుమ్మకొండ
శివశంకర వర ప్రసాద్నేహా శెట్టి
చిత్రఅజయ్ ఘోష్
భూషణంశ్రీకాంత్ అయ్యంగార్
ర్ జబర్దస్త్ రామ్ ప్రసాద్
వెన్నెల కిషోర్
ఎల్బీ శ్రీరామ్
సత్య అక్కల
గోపరాజు రమణగ్రామ అధ్యక్షుడు
రాజ్ కుమార్ కసిరెడ్డికాశిరాజు, భూషణం కొడుకు
దివ్య నార్నిచిత్ర స్నేహితురాలు
సురభి ప్రభావతిచిత్ర తల్లి
గెటప్ శ్రీను
వార్తా వ్యాఖ్యాతB. V. S. రవి
సినిమా నిర్మాతవనితా రెడ్డిసావిత్రి
సిబ్బంది
క్లాక్స్దర్శకుడు
రవీంద్ర బెనర్జీ ముప్పనేనినిర్మాత
క్లాక్స్రచయిత
మణి శర్మ
సంగీతకారుడుసన్నీ కూరపాటిసినిమాటోగ్రాఫర్
విప్లవ నైషదంఎడిటర్ర్
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
BeduruLanka 2012 Movie Review: యుగాంతం చుట్టూ తిరిగిన బెదురులంక.. కార్తికేయ హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య
దర్శకుడు: క్లాక్స్
సంగీతం: మణిశర్మ
నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
విడుదల తేది: ఆగస్ట్ 25, 2023
కార్తికేయ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యుగాంతం ఇతివృత్తంగా ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాపై కార్తికేయ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలు వేరని, ఈ చిత్రం వేరని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. సరికొత్త జానర్‌లో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ (ఆగస్టు 25) రిలీజైన ఈ చిత్రం కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిందా? అతడికి మంచి హిట్ తెచ్చిపెట్టిందా? లేదా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో బెదురులంక గ్రామంలో జరుగుతుంది. శివ శంకర వరప్రసాద్ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. తన ముక్కుసూటి తనంతో జాబ్ పోగొట్టుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి (నేహాశెట్టి)కోసం బెదురులంక గ్రామానికి వస్తాడు. నేహా ఊరి ప్రెసిడెంట్ కూతురు. అప్పటికే ఈ ఊర్లో యుగాంతానికి సంబంధించి వార్త భయానికి గురి చేస్తుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఊరి ప్రెసిడెంట్(గోపరాజు రమణ)తో కలిసి బ్రహ్మణుడైన బ్రహ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(రాంప్రసాద్) పెద్ద ప్లాన్ వేస్తారు. ఊర్లో అందరి వద్ద ఉన్న బంగారాన్ని కరిగించి శివలింగం, శిలువ చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని వారు గ్రామస్తులను నమ్మిస్తారు. అందుకు ఊరి ప్రజలు అంగీకరించినప్పటికీ హీరో ఒప్పుకోడు. దీంతో అతడ్ని ఊరి నుంచి వెలివేస్తారు. మరి శివ ఊరి పెద్దల ఆటలు ఎలా కట్టించాడు? తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? ఊరి జనం మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
యంగ్ హీరో కార్తికేయ నటన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా అతడు జీవించేస్తాడు. ఈ చిత్రంలో కూడా కార్తికేయ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు . తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ అదరగొట్డాడు. కొన్ని చోట్ల తన నటనతో కోటా శ్రీనివాసరావును గుర్తు చేశాడు. అటు బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్ మెప్పించారు. రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా సాగిందంటే
సినిమా యుగాంతం అనే వార్తతో ప్రారంభమవుతుంది. దీంతో బెదురులంక జనాల్లో భయాలు ప్రారంభవుతాయి. తొలి భాగం చాలా స్లోగా నడుస్తుంది. పాత్రల పరిచయం, కథని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోవడంతో కథలో వేగం మిస్ అయ్యింది. అది కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. ఊరి జనాలను మోసం చేసేందుకు ప్రెసిడెంట్, బ్రహ్మం, డేనియల్ కలిసి చేసే కుట్రలు నవ్వులు పూయిస్తాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలని హీరో చేసే ప్రయత్నం ఆద్యంతం గిలిగింతలు పెట్టిస్తాయి. దీంతో మొదటి భాగంలోని నీరసాన్ని ఈ కామెడీ తగ్గిస్తుంది. అయితే నేహాశెట్టి, కార్తికేయల మధ్య లవ్ ట్రాక్‌ని బలంగా చూపించలేదు. దీంతో వారి లవ్ ట్రాక్‌లో ఇంట్రెస్ట్ మిస్ అవుతుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే
2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరుగుతుందో అర్థంకాక అప్పట్లో చాలా మంది ఆందోళనకు గురయ్యారు. కానీ దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్ర దర్శకుడు క్లాక్స్. కొద్ది రోజుల్లో చనిపోతున్నామంటే జనంలో ఉండే భయం కారణంగా పుట్టే ఫన్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రజల వీక్‌నెస్‌ని పెద్దలు ఎలా వాడుకుంటారో, మతాల పేరుతో వారిని ఎలా ఆడుకుంటారో కూడా ఈ చిత్రంలో చూపించారు. అదే సమయంలో మూఢవిశ్వాలపై సెటైర్లు పేల్చాడు. దేవుడి పేరుతో చేసే మోసాలను ఇందులో అంతర్లీనంగా చూపించారు. ఎవరికోసమే కాదు, మనకోసం మనం బతకాలనే సందేశాన్నిచ్చాడు. యుగాంతాన్ని యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో కాకుండా వినోదాత్మకంగా చెప్పాలనే ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యారు. తొలి దర్శకుడైనా సినిమాని బాగా డీల్ చేశాడు.
టెక్నికల్‌గా
చిత్రంలోని సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిశర్మ సంగీతం యావరేజ్‌గా ఉంది. ఈ సినిమాకు పాటలు మైనస్ అని చెప్పవచ్చు. సాంగ్స్ అంతగా ఆకట్టుకోకపోయినా మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకామెడీసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
పాటలుహీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌సాగదీత సీన్లు
రేటింగ్: 2.75/5
https://www.youtube.com/watch?v=98y83GscKEI
ఆగస్టు 25 , 2023
OG Movie: టిల్లు బ్యూటీతో పవన్ కల్యాణ్ రొమాన్స్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో 'ఓజీ' (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా 'ఓజీ'ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నేహాశెట్టి స్పెషల్ సాంగ్
యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ‘డీజే టిల్లు’తో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించింది. రాధిక అనే పాత్రతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘ఓజీ’ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా మెుదలైనట్లు మూవీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ సాంగ్‌లో నేహా పర్‌ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఫ్యాన్స్‌కు పక్కాగా విజువల్ ట్రీట్ ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. దీంతో ‘ఓజీ’పై అంచనాలు అభిమానుల్లో రెట్టింపయ్యాయని చెప్పవచ్చు.
https://twitter.com/Fukkard/status/1869238838721437802
‘ఓజీ’తో బౌన్స్ బ్యాక్..!
‘డీజే టిల్లు’ బ్లాక్ బాస్టర్ కావడంతో నేహా శెట్టికి తిరుగుండదని అంతా భావించారు. కానీ ఆ మూవీ సక్సెస్ హీరో సిద్ధు జొన్నగడ్డకు ఉపయోగపడినట్లుగా నేహాకు యూజ్ కాలేదు. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడికి బడా చిత్రాల్లో అవకాశాలు రాలేదు. ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వంటి చిన్న ప్రాజెక్ట్స్ చేసినా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’లో గెస్ట్ రోల్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మెప్పించినా తర్వాత మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో 'ఓజీ'లో స్పెషల్ సాంగ్‌తోనైనా నేహా బౌన్స్‌బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల 'పుష్ప 2'లో ‘కిస్సిక్’ సాంగ్ చేసి శ్రీలీల వరుస అవకాశాలు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ మూవీగా ‘ఓజీ’
పవన్ కల్యాణ్ చేతిలోని ‘హరి హర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలానే జపనీస్ నటుడు కజుకి కిటముర కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరితో పాటు అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్తమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) వంటి వారు ఈ సినిమాలో నటిస్తుండటంతో ‘ఓజీ’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఓజీలో ప్రభాస్, అకీరానందన్?
‘ఓజీ’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఓ క్యామియో ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మూవీ క్లైమాక్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. అంతేకాదు సుజీత్ - ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘సాహో’ చిత్రంతో ఓజీకి లింక్ కూడా ఉండనున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’లో నటించినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపించింది. పవన్ చిన్నప్పటి పాత్రలో అకీరా నటించాడని, స్క్రీన్‌పై అతడి రోల్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారంటూ కూడా నెట్టింట పోస్టులు కనిపించాయి.
https://twitter.com/TBO_Updates/status/1862813629441011860
https://twitter.com/FilmyTwood/status/1859094576272953795#
డిసెంబర్ 18 , 2024
Comedian Satya: స్టార్ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్ కమెడియన్‌గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ కమెడియన్స్‌లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ అవ్వాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.
సత్య వన్ మ్యాన్ షో!
శుక్రవారం రిలీజైన 'మత్తు వదలరా 2' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అందరూ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు. మత్తువదలరాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా సత్య కామెడీ మాత్రం భలే వర్కవుట్ అయింది. తొలి సీన్ నుంచి చివరి వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్‌లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్‌ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్ కామెడియన్‌గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.
15 ఏళ్ల కృషి..
కమెడియన్‌గా దాదాపు దశాబ్దంన్నర కిందట్నుంచి సత్య ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్‌తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు. ఐతే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు. ‘మత్తు వదలరా’, ‘రంగబలి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజనంబు’లో నవ్వించడంతో పాటు కన్నీళ్లు సైతం పెట్టించాడు. గతంతో పోలిస్తే చాలా బిజీ అయినప్పటికీ తన టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మత్తువదలరా-2’ సత్యకు ఆ లోటును తీర్చిందనే చెప్పాలి.
సత్యపై డైరెక్టర్ల ఫోకస్!
ప్రతీ సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనూ సత్యకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఆ కమెడియన్లకు గట్టి పోటీ!
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, గెటప్ శ్రీను, సప్తగిరి, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ సైతం హీరోగా మానేసి కమెడియన్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్‌లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 14 , 2024
నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శెట్టి దేనికి ఫేమస్?
నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
నేహా శెట్టి వయస్సు ఎంత?
1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు
నేహా శెట్టి ముద్దు పేరు?
నేహా
నేహా శెట్టి ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
నేహా శెట్టి ఎక్కడ పుట్టింది?
మంగళూరు, కర్నాటక
నేహా శెట్టి అభిరుచులు?
డ్యాన్సింగ్, షాపింగ్
నేహా శెట్టికి ఇష్టమైన ఆహారం?
దోశ, బిర్యాని
నేహా శెట్టి తల్లిదండ్రుల పేర్లు?
హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి
నేహా శెట్టి ఫెవరెట్ హీరో?
అల్లు అర్జున్
నేహా శెట్టి ఇష్టమైన కలర్ ?
పింక్, వైట్
నేహా శెట్టి ఇష్టమైన హీరోయిన్స్
దీపిక పదుకునే
నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా?
డీజే టిల్లు
నేహా శెట్టి ఏం చదివింది?
డిగ్రీ
నేహా శెట్టి పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది.
More Information About Neha Shetty
నేహా శెట్టి హాట్ ఫొటోలు (Neha Shetty Hot Images)
నేహా శెట్టి పోషించిన బెస్ట్ రోల్ ఏంటి?
డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పవచ్చు.
నేహా శెట్టి మూవీస్ లిస్ట్
ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్ రంజన్ (Rules Ranjann), టిల్లు స్క్వేర్ (Tillu Square)
నేహా శెట్టి అప్‌కమింగ్ మూవీ?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)
నేహా శెట్టి చీరలో దిగిన టాప్ ఫొటోలు( Neha shetty in Saree)
నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections)
నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ట్రెండ్ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కోల్డ్ షోల్డర్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్ తప్పక నచ్చుతుంది.
వి-నెక్ కట్ స్లీవ్ బ్లౌజ్
ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్ కట్ స్లీవ్ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.
డీప్ ప్లంగింగ్ హల్టర్ నెక్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ బ్లౌజ్ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.
ఆఫ్ షోల్డర్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ బ్లౌజ్ చాలా మోడరన్ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్ చేస్తుంది.
రౌండ్ నెక్ హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్
నేహా ధరించిన ఈ రౌండ్ నెక్ హాఫ్ స్లీవ్ బ్లౌజ్.. మంచి ట్రెడిషనల్ లుక్ తీసుకొస్తుంది. గోల్డెన్ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు.
క్లాసిక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్
నేహా.. ట్రెడిషన్, మోడరన్, ట్రెండ్ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.
నేహా శెట్టిని వైరల్ చేసిన పోస్టు/ రీల్?
‘రూల్స్ రంజన్’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్ చేసి వైరల్ అయ్యారు.
View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu)
సోషల్ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్ వీడియోస్?
https://twitter.com/i/status/1730782118777950693
నేహా శెట్టి చేసిన బెస్ట్ స్టేజీ పర్‌ఫార్మెన్స్ ఏది?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.
View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens)
నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు?
ఇంగ్లీష్, హిందీ, తెలుగు
నేహా శెట్టిది ఏ రాశి?
మిథున రాశి
నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా?
నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి
నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి?
ఈ బ్యూటీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, ఆకాష్ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.
నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు?
ఏ.ఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
నేహా శెట్టి ఫేవరేట్ స్పోర్ట్స్ ఏది?
క్రికెట్
నేహాశెట్టి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు?
ధోని, విరాట్ కోహ్లీ
నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు?
మైసూర్, గోవా, కర్ణాటక
నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్ సీన్?
https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_
నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు?
నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు?
నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్ ఏవి?
డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్ లెంగ్త్ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్ రాధిక నాతోని..!
రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్ నీకు?
టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక?
రాధిక : అవును టిల్లు.. చెప్పు?
టిల్లు: నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్న చూడు ఇది సెకండ్ హైలెట్ ఆఫ్ ది నైట్ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.
https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB
టిల్లు : ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్.. ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా?
రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్
టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం.
రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్..
టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నెంబర్ వన్ క్రిమినల్ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్ మైండ్ నాది.
రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు.
టిల్లు: అట్ల అనకు ప్లీజ్.. నాకు నిజంగా భయమైతాంది.
రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస.
టిల్లు: వన్ మినిట్.. వన్ మినిట్.. ఒక వన్ స్టెప్ బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.
రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్ ఇంక ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.
https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_
నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/iamnehashetty/?hl=en
https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
ఏప్రిల్ 25 , 2024
Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 17న రిలీజ్ కానుంది.
ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.
నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్ 6, 1999లో జన్మించింది.
సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. మిస్ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేశాడు.
ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.
2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో చెరగని ముద్ర వేసింది.
ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్ టాక్ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్ రంజన్' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.
ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.
యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఏప్రిల్ 13 , 2024
Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
ప్రతీ సంవత్సరం స్టార్ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
శౌర్యువ్
నాని హీరోగా తెరక్కిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.
కళ్యాణ్ శంకర్
కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సుమంత్ ప్రభాస్
షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.
క్లాక్స్
చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
వేణు యెల్దండి
ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.
షణ్ముఖ ప్రశాంత్
ఈ ఏడాది విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మురళి కిషోర్
కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్.
డిసెంబర్ 16 , 2023
Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
కింగ్ ఆఫ్ కొత్త
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
గాండీవధారి అర్జున
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడు? అన్నది సినిమా కథ.
బెదురు లంక 2012
కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది.
ఏం చేస్తున్నావ్
విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్’ (Em chestunnav). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బాయ్స్ హాస్టల్
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే!
బ్రో
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)- సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.
బేబీ
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు.
TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao MovieHindiJio CinemaAugust 25Invasion 2 SeriesEnglishApple Tv PlusAugust 23
APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
ఆగస్టు 21 , 2023
Actress Neha Shetty: ‘బెదురులంక’ బ్యూటీకి టాలీవుడ్ ఫిదా..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
ఆగస్టు 28 , 2023