• TFIDB EN
  • బీరువా
    UATelugu2h 21m
    బిరువా సినిమాలో సందీప్ కిషన్, తన సమస్యలను దాచడానికి ఒక బీరువాను వాడుతాడు. ఈక్రమంలో జరిగే ఘటనలు కామెడీ పుట్టిస్తాయి.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌EtvAppఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సందీప్ కిషన్
    సంజు
    సురభి
    స్వాతి
    నరేష్
    సంజు తండ్రి
    ముఖేష్ రిషి
    స్వాతి తండ్రి
    సప్తగిరి
    అజయ్
    శివన్నారాయణ నారిపెద్ది
    షకలక శంకర్
    వేణు టిల్లు
    సిబ్బంది
    కన్మణి
    దర్శకుడు
    రామోజీ రావు
    నిర్మాత
    తమన్ ఎస్
    సంగీతకారుడు
    ఛోటా కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    అక్టోబర్ 22 , 2024
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సందీప్ కిషన్ (Sundeep Kishan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
     తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుల్లో సందీప్ కిషన్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బిరువా వంటి సినిమాల సక్సెస్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా కొనసాగుతున్న సందీప్ కిషన్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. సందీప్ కిషన్ మద్దు పేరు? సండీ సందీప్ కిషన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సందీప్ కిషన్ తొలి సినిమా? ప్రస్థానం సినిమాలో నెగిటివ్‌ రోల్‌తో పరిచయం అయ్యాడు. హీరోగా చేసిన తొలి చిత్రం స్నేహ గీతం సందీప్ కిషన్ ఎక్కడ పుట్టాడు? చెన్నై సందీప్ కిషన్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 7 సందీప్ కిషన్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. సందీప్ కిషన్‌కు లవర్ ఉందా? సొనియా అనే ఇండో-అమెరికన్ నటితో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. సందీప్ కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ సందీప్ కిషన్ తొలి హిట్ సినిమా? వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. బిరువా, వివాహ భోజనంబు వంటి చిత్రాలు హిట్‌గా నిలిచాయి. సందీప్ కిషన్‌కు ఇష్టమైన కలర్? బ్లూ, వైట్ సందీప్ కిషన్ తల్లిదండ్రుల పేర్లు? RK దుర్గా, P.R.P నాయుడు సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ప్రదేశం? అమెరికా సందీప్ కిషన్ ఏం చదివాడు? డిగ్రీ సందీప్ కిషన్ అభిరుచులు? ట్రావలింగ్, పార్టింగ్ సందీప్ కిషన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 31 సినిమాల్లో నటించాడు.&nbsp; సందీప్‌ కిషన్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని సందీప్ కిషన్ వ్యాపారాలు? సందీప్‌ కిషన్‌కు హైదరాబాద్‌లో వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ఉంది. అలాగే వైజాగ్‌లో యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారం కూడా ఉంది. సందీప్ కిషన్‌ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=jtpwRcyTwlI
    మార్చి 21 , 2024
    Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
    Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
    జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్‌ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593 ఆశిష్‌ - రూపాలి వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి ఆహ్వానించింది. https://twitter.com/MilagroMovies/status/1661726388339216389 రూపాలి ఎవరు? అసోంలోని గువాహటిలో ఏప్రిల్ 21, 1973న రూపాలి జన్మించారు. ప్రస్తుతం ఆమె కోలకత్తాలో స్థిరపడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమెకు పేరుంది. సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రూపాలీ గుర్తింపు పొందారు.&nbsp; రూపాలీకి కోల్‌కత్తాలో ఫ్యాషన్‌ డిజైన్‌ స్టోర్స్‌ ఉన్నాయి. నటుడు ఆశీష్‌ తన వ్లాగ్స్‌లో భాగంగా ఓసారి కోల్‌కత్తాలో రూపాలీని కలిశారు. ఆ సందర్భంగా ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. తొలి పరిచయంలోనే తాము మళ్లీ మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు రూపాలి తెలిపారు. మానవత్వం కలిగిన వ్యక్తి ఆశిష్‌ అని ప్రశంసించారు. గతంలో ఆశీష్‌ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ బెంగాలి నటి శకుంతల బారువా కుమార్తె. రాజోషి.. థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా చాలా ఫేమస్‌. వీరికి అర్త్‌ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా ఆశీష్‌ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. దీంతో అప్పటినుంచి ఆశీష్‌ ఒంటరిగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రూపాలి పరిచయం తర్వాత వారు ఇరువురు డేటింగ్‌లో ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రూపాలి - ఆశీష్‌ పెళ్లి చేసుకున్నారు.&nbsp; ఆశిష్‌ రెండో పెళ్లిపై బాలీవుడ్‌ సినీ విమర్శకుడు కమల్‌ R. ఖాన్‌ ఘాటు విమర్శలు చేశారు. విషెస్‌ చెబుతూనే&nbsp; ’60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి బాయ్‌సాబ్‌!’ అంటూ ఆశిష్‌ పెళ్లి ఫొటోను షేర్ చేశాడు.&nbsp; https://twitter.com/kamaalrkhan/status/1661716692970655744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1661716692970655744%7Ctwgr%5E01885b8d59f8e3fcd913f78a1914f6f43b653343%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkrk-viral-comments-on-ashish-vidyarthis-2nd-marriage-with-rupali-barua-at-60-964922.html ‘కాల్ సంధ్య’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆశీష్‌.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్‌ చిత్రాలతో ఆశీష్‌ మరింత పాపులారిటి సంపాదించుకున్నారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్‌ అవార్డు గెలుచుకున్నాడు.&nbsp; ఇప్పటివరకు 11 భాషల్లో సినిమాలు చేసిన ఆశీష్‌..&nbsp; సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. రీసెంట్‌గా రైటర్‌ పద్మాభూషన్‌ సినిమాలోనూ హీరో తండ్రిగా నటించి మెప్పించాడు.&nbsp;&nbsp; https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593
    మే 26 , 2023
    <strong>Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!</strong>
    Indian Oscar Entry 2025: ఆస్కార్‌ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
    ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్‌ తరపున ఆస్కార్‌ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘కల్కి’కి అన్యాయం జరిగిందా? కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్‌ తరపున నామినేట్‌ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్‌ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్‌ స్థాయిలో సక్కెస్‌ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్‌ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్‌ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాటలో కల్కి! గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్‌ తరపున ‘ఆర్ఆర్‌ఆర్‌’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్‌ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్‌ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్‌ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో షార్ట్‌ లిస్ట్‌ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్‌ కూడా భారత్‌ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్‌ చిత్రాల కేటగిరిలో ఆస్కార్‌ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్‌ పంపాలని చిత్ర యూనిట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్‌ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్‌’ టీమ్‌ కూడా జనరల్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్‌ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ‘లాపతా లేడీస్‌’ ఎంపికకు కారణం ఇదే లాపతా లేడీస్‌ చిత్రాన్ని భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్‌ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్‌ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్‌, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు. సౌత్‌ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే! ఆస్కార్‌ అవార్డుల రేసులో భారత్‌ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్‌ కోసం ఈసారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్‌ నుంచి మూడు కాగా, కోలివుడ్‌ నుంచి 6 చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్‌ - ఎస్‌.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్‌ ఎక్స్‌’, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్‌ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్‌ లైఫ్‌), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్‌ నుంచి 13 సినిమాలు ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయ్యాయి. అయితే భారత్‌ నుంచి ‘లాపతా లేడిస్‌’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.&nbsp; లాపతా లేడీస్‌ ప్రత్యేకత ఏంటి? సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్‌’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్‌’కు దర్శకత్వం వహించిన కిరణ్‌, 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    Ketika Sharma: బరువెక్కిన కేతిక పాప అందాలు!
    Ketika Sharma: బరువెక్కిన కేతిక పాప అందాలు!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మార్చి 01 , 2024
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    Malavika Satheesan: ‘పారిజాత పర్వం’ బ్యూటీ మాళవిక సతీశన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Malavika Satheesan: ‘పారిజాత పర్వం’ బ్యూటీ మాళవిక సతీశన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యువ నటి మాళవిక సతీశన్‌ (Malavika satheesan).. 'పారిజాత పర్వం' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో చైతన్యరావుకు జోడీగా నటించి మెప్పించింది. ముఖ్యంగా కమెడియన్‌ వైవా హర్షతో ఈ అమ్మడు చేసిన కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది. దీంతో మాళవిక గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ తెగ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; మాళవిక సతీశన్‌ ఎవరు? టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్‌ మాళవిక సతీశన్‌ ఎక్కడ పుట్టింది? కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది.&nbsp; మాళవిక సతీశన్‌ పుట్టిన తేదీ ఏదీ? 28 మార్చి, 2001 మాళవిక సతీశన్‌ తల్లిదండ్రులు ఎవరు? సతీష్‌ రవీంద్రన్‌ - రేఖ సతీశన్‌ దంపతులకు మాళవిక జన్మించింది. రవీంద్రన్‌ ఆర్మీ ఆఫీసర్‌ కాగా, రేఖ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది.&nbsp; మాళవిక సతీశన్‌ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు మాళవిక సతీశన్‌ బరువు ఎంత? 52 కేజీలు మాళవిక సతీశన్‌ వయసు ఎంత? 23 సంవత్సరాలు&nbsp; మాళవిక సతీశన్‌ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తోంది? సికింద్రాబాద్‌ మాళవిక సతీశన్‌ స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? అలహాబాద్‌లోని ఆర్మీ స్కూల్‌లో మాళవిక చదువుకుంది.&nbsp; మాళవిక సతీశన్‌ ఏం చదువుకుంది? బీఏ గ్రాడ్యుయేషన్‌ చేసింది మాళవిక తొలి చిత్రం ఏది? 2020లో వచ్చిన 'చూసి చూడంగానే' చిత్రం ద్వారా మాళవిక తెరంగేట్రం చేసింది.&nbsp; మాళవిక సతీశన్‌ ఇప్పటివరకూ చేసిన చిత్రాలు? ‘చూసి చూడంగానే’, ‘బొమ్మల కొలువు’, ‘బీఎఫ్‌హెచ్‌’ (బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌), ‘దోచేవారెవరురా’ మాళవిక సతీశన్‌ తాజా చిత్రం ఏది? పారిజాత పర్వం (2024) మాళవిక సతీశన్‌కు ఇష్టమైన హాబీలు ఏవి? రీడింగ్ బుక్స్‌, డ్యాన్సింగ్‌, మోడలింగ్‌ మాళవిక సతీశన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌ ఏది? https://www.instagram.com/malavikasatheesanofficial/?hl=en
    ఏప్రిల్ 20 , 2024
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2024
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్‌ హీరో నవీన్‌కు జతగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.&nbsp; అనుష్క.. గ్రేట్‌ కమ్‌బ్యాక్‌! ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్‌ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్‌ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి ‌అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్‌ సైతం ట్రైలర్‌ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్‌ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; రెమ్యూనరేషన్‌ ఎంతంటే? ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్‌ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు ‌అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
    ఆగస్టు 22 , 2023
    <strong>HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;</strong>
    HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు&nbsp;
    సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్‌ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్‌ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు. అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.&nbsp; View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది. యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.&nbsp; దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్‌ చేయాల్సి వచ్చిందట. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు. అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది. అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.&nbsp; రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్‌ చేసింది.&nbsp; ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట. ‘సైజ్‌ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్‌ మిస్టేక్‌ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.&nbsp; సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్‌ క్రష్‌ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్‌ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అని ఓ ఇంటర్వూలో రివీల్‌ చేసింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్‌ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్‌ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది. 'అరుంధతి' సినిమా అనుష్క ఫిల్మ్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.&nbsp; ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.&nbsp; వాస్తవానికి అరుంధతి ఆఫర్‌ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్‌ రిజెక్ట్‌ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్‌ ఎవరన్న విషయం మాత్రం రివీల్‌ చేయలేదు.&nbsp; అనుష్క ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌తో ఓ బుక్‌ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్‌ కుతిన్హో రచనలో వచ్చిన 'ది మ్యాజిక్‌ వెయిల్‌ లాస్‌ పిల్‌' అనే బుక్‌లో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్‌ చేసింది. 62 రకాల హెల్త్‌ టిప్స్‌, వెయిట్‌ లాస్‌ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.&nbsp; అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్‌ తాగుతూ కనిపించింది. సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్‌ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.&nbsp; https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls
    నవంబర్ 07 , 2024
    <strong>Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;
    అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ రెడ్డి' (Love Reddy). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్‌ మీట్‌ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; దాడి ఎందుకు జరిగిందంటే? లవ్‌ రెడ్డి చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌ బాస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్‌ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌కు 'లవ్‌ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ రన్‌ అవుతోంది. హీరోయిన్‌ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్‌.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్‌ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్‌ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.&nbsp; https://twitter.com/telugu_insider/status/1849700707248767217 ‘లవ్‌ రెడ్డి’ ఎలా ఉందంటే పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. కథ ఏంటంటే నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
    అక్టోబర్ 25 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!</strong>
    Keerthy Suresh: దసరా నుంచి కీర్తిని హీరోయిన్‌గా తీసేద్దామనుకున్న డైరెక్టర్.. కానీ!
    అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ఒకరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర అద్భుతంగా పోషించి ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఆమె ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆసక్తికర సంఘనటలు చోటుచేసుకున్నాయి. నేడు (అక్టోబర్‌ 17) కీర్తి సురేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; చైల్డ్‌ ఆర్టిస్టుగా నటీనటులు సురేష్‌కుమార్‌, మేనకల కుమార్తె అయిన కీర్తి సురేష్‌ పెలట్స్‌ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా మెరిసింది. మరో అచనేయనేనికిష్టం, కుబేరన్‌ అనే చిత్రాల్లోనూ ఆమె చైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించింది.&nbsp; చిరుకి జోడీగా తల్లి.. చెల్లిగా కూతురు చిరంజీవి (Chiranjeevi) ‘పున్నమినాగు’ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ తల్లి మేనక నటించారు. రీసెంట్‌గా వచ్చిన 'భోళా శంకర్‌' మూవీలో మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ నటించడం గమనార్హం. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ అన్నా చెల్లెళ్లుగా వీరి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన అన్ని రోజులు తన ఇంటి నుంచే కీర్తికి భోజనం పంపినట్లు చిరు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తెలిపారు. ప్రారంభంలోనే అటకెక్కిన చిత్రాలు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన గీతాంజలి సినిమాతో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా మారింది. అయితే అంతకుముందే హీరోయిన్‌గా మూడు ప్రాజెక్ట్స్‌ను కీర్తి ఓకే చేసింది. షూటింగ్‌ కూడా సగానికి పైనే జరిగింది. అయితే అనూహ్యంగా ఆ మూడు ప్రాజెక్ట్స్‌ మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.&nbsp; ఐరెన్‌ లెగ్‌గా ముద్ర కెరీర్‌ ప్రారంభంలోనే మూడు ప్రాజెక్ట్స్‌ ఆగిపోవడం.. మలయాళంలో చేసిన ‘గీతాంజలి’, రింగ్‌ మాస్టర్‌ చిత్రాలు ఫ్లాప్‌ కావడం, తమిళంలో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఇదు ఎన్న యామమ్‌’ కూడా డిజాస్టర్‌గా నిలవడంతో కీర్తికి ఐరెన్‌ లెగ్‌ అన్న ముద్ర వచ్చింది. విపరీతంగా ట్రోల్స్‌కు సైతం గురైంది. వాటిని పట్టించుకోకుండా విజయవంతమైన చిత్రాల్లో నటించి కీర్తి సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా మారింది.&nbsp; మహానటితో కెరీర్‌ టర్నింగ్‌ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘నేను శైలజా’ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు అవకాశాలు పెరిగాయి. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నప్పటికీ నటిగా ఏమీ సాధించలేదన్న అసంతృప్తి కీర్తిలో ఉండిపోయింది. ఆ సమయంలోనే ‘మహానటి’ ప్రాజెక్ట్ ఆమె చెంతకు వచ్చింది. ఇందులో సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసి మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని తోటి హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలిచింది. మహానటి తర్వాత కీర్తి సురేష్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది.&nbsp; వరుస ఫెయిల్యూర్స్ ‘మహానటి’ తర్వాత కెరీర్‌ పరంగా కీర్తి సురేష్‌కు తిరుగుండదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే వరుసగా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌ టాక్స్‌ తెచ్చుకోవడంతో కీర్తి సురేష్‌ ఇబ్బందుల్లో పడింది. మహానటి తర్వాత ఆమె చేసిన ‘సామి స్క్వేర్‌’, ‘పందెం కోడి 2’,&nbsp; రంగ్‌ దే, ‘అన్నాతే’ వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ చిత్రాలూ సందడి చేయలేకపోయాయి.&nbsp; కీర్తిని తీసేద్దామన్న డైరెక్టర్‌ గతేడాది విడుదలైన ‘దసరా’ సినిమాతో కీర్తి భారీ విజయం సాధించి తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా కీర్తి సురేష్‌ నటనపై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. వెన్నెల అనే గ్రామీణ యువతిగా ఆమె అదరగొట్టింది. ఉత్తమనటిగా సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం అందుకుంది. అయితే వాస్తవానికి ఈ పాత్ర అయితే దసరా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తీసేద్దామని డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల భావించినట్లు ఆ మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా నాని చెప్పారు. మూవీ కథను కీర్తికి చెప్పిన డైరెక్టర్‌ ఆమెను 10-12 కిలోలు బరువు పెరగాలని సూచించారట. కానీ అందుకు తగ్గట్లు పెరగలేదట. దీంతో తన వద్దకు వచ్చి కీర్తి సురేష్‌ను తీసేద్దామని శ్రీకాంత్ ఓదెల అన్నట్లు నాని చెప్పారు. నువ్వు డెబ్యూ డైరెక్టర్‌వి, ఆమె నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ నటి. ఇది జరగదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లడం వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ కావడం చకాచకా జరిగిపోయినట్లు నాని వివరించారు. https://www.youtube.com/watch?v=J-PhzFEt9Wk కీర్తి స్పెషల్‌ టాలెంట్‌ కీర్తి సురేష్‌ ముఖమే కాదు, గొంతు కూడా చాలా అందంగా ఉంటుంది. దీనిని గుర్తించిన దర్శకులు ఆమె వాయిస్‌తో మ్యాజిక్‌ చేయించారు. ‘సామి స్క్వేర్’ సినిమాలో కీర్తి 'పుదు మెట్రో రైల్‌' అనే పాటను చాలా అందంగా పాడింది. అంతేకాకుండా ఇటీవల వచ్చి కల్కి 2898 ఏడీ చిత్రంలో బుజ్జి వాహనానికి వాయిస్‌ అందించి ఆకట్టుకుంది. ‘గాంధారి’ ఆల్బమ్‌తో తనలో మంచి డ్యాన్సర్‌ ఉందని కూడా చాటి చెప్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి.. ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్‌’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్‌’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో సావిత్రి (మహానటి), వెన్నెల (దసరా), కళావతి (సర్కారువారి పాట) పాత్రలు సవాలు విసిరాయని ఓ సందర్భంలో అన్నారు.
    అక్టోబర్ 17 , 2024
    <strong>Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్‌ జర్నీ.. సుధీర్‌ బాబు హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : సుధీర్‌ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్‌ సుందరం, శశాంక్‌, సాయి చంద్‌, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు దర్శకత్వం : అభిలాష్ కంకర సంగీతం : జై కృష్ణ సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి ఎడిటింగ్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత : సునీల బలుసు విడుదల తేదీ: 11-10-2024 సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్‌ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్‌ బాబుకు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి ప్రకాష్‌ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్‌ బాబు)ని స్టాక్‌ బ్రోకర్‌ శ్రీనివాస్‌ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్‌ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్‌ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్‌ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్‌ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌ సుధీర్‌ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్‌ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్‌ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్‌ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్‌ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్‌ కంకర ఎమోషనల్‌ టచ్‌ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్‌ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ మెుత్తం సుధీర్‌ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్‌ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్‌ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్‌ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్‌ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్లో న్యారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5 
    అక్టోబర్ 10 , 2024
    <strong>Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?</strong>
    Satyam Sundaram 2024 Review: దేవరకు పోటీగా వచ్చిన ‘సత్యం సుందరం’ ఎలా ఉందంటే?
    నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్‌ తదితరులు రచన, దర్శకత్వం: సి.ప్రేమ్‌ కుమార్‌ సంగీతం: గోవింద్‌ వసంత సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజు ఎడిటింగ్‌: ఆర్‌.గోవింద రాజు నిర్మాత: జ్యోతిక, సూర్య విడుదల తేదీ: 28-09-2024 తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్‌ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్‌ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్‌, సపోర్టింగ్‌ రోల్స్‌ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్‌ కిరణ్‌, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్‌ కుమార్‌ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్‌ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, భావోద్వేగాలుకార్తి, అరవింద స్వామి నటనసంగీతం మైనస్‌ పాయింట్స్ నెమ్మదిగా సాగే కథకమర్షియల్ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;
    సెప్టెంబర్ 28 , 2024
    <strong>Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!</strong>
    Jai Hanuman: ‘జై హనుమాన్‌’లో మెగాస్టార్‌ చిరంజీవి? ప్రశాంత్‌ వర్మ ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!
    యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌పై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. తాజాగా 'హనుమాన్‌ 2'కి సంబంధించి క్రేజీ బజ్‌ బయటకొచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావొచ్చన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; మెగాస్టార్‌తో సంప్రదింపులు! హనుమాన్‌ చిత్రానికి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' (Jai Hanuman) ఉండనున్నట్లు తొలి భాగం క్లైమాక్స్‌లోనే డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ స్పష్టం చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో హనుమాన్‌ పాత్రకు మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకోవాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. సీక్వెల్‌ మెుత్తం హనుమంతుడి పాత్ర మీదే ఉండటంతో దానికి మెగాస్టార్‌ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారట. లేదంటే రామ్‌చరణ్‌ను అయిన హనుమాన్ పాత్రకు తీసుకోవాలని మేకర్స్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈమేరకు తాజాగా సంప్రదింపులు కూడా మెుదలైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హనుమాన్‌గా చిరంజీవి లేదా రామ్‌చరణ్‌ను తాము ఊహించుకుంటున్నట్లు రీసెంట్‌గా చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకురుస్తున్నాయి. చిరు, చరణ్‌లలో ఏ ఒక్కరు ఓకే చెప్పిన 'హనుమాన్‌ 2'పై అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; ‘హనుమాన్‌ 2’కి సమయం పట్టనుందా? 'జై హనుమాన్‌' (Jai Hanuman) చిత్రం పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోకజ్ఞ తేజ (Mokshagna Teja)తో డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెున్నటి వరకూ బొద్దుగా కనిపించిన మోకజ్ఞ కూడా రీసెంట్‌గా బరువు తగ్గి హ్యాండ్సమ్‌గా మేకోవర్‌ అయ్యాడు. దీంతో త్వరలోనే వీరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఊహాగానాలు మెుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మోకజ్ఞతో సినిమా తర్వాతనే ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’పై ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు చురుగ్గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అటు రామ్‌ చరణ్‌ సైతం ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నాడు. ఆపై ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ‘జై హనుమాన్‌’ షూటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశముంది.&nbsp; మోక్షజ్ఞ&nbsp; వీడియో వైరల్‌ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు సినిమా ఈవెంట్స్ లో తన కొడుకు సినిమాల్లోకి వస్తాడని అన్నారు. అయితే గతంలో మోక్షజ్ఞ లుక్స్ మీద హీరో మెటీరియల్ కాదని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ స్టైలిష్ ఫోటోలు రెండు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలకు సంబంధించిన ఫోటోషూట్ వీడియో బయటకు వచ్చింది. ఎల్లో షర్ట్ లో మోక్షజ్ఞ అదిరిపోయే లుక్స్ తో ఉన్నాడు. ఈ వీడియోను నందమూరు అభిమానులు విపరీతంగా షేర్‌ చేయడంతో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.&nbsp; https://twitter.com/UrsVamsiShekar/status/1815971676414435711
    జూలై 25 , 2024
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.&nbsp; అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా&nbsp; బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.&nbsp; బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 29 , 2024
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇటీవల కల్కీ మూవీ యూనిట్‌.. ‘బుజ్జి’ అనే కొత్త క్యారెక్టర్‌ను ఓ స్పెషల్‌ ఈవెంట్ ద్వారా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు ఫ్రెండ్‌గా చేసిన ఓ రోబోటిక్‌ వెహికల్‌ను హీరో ప్రభాస్‌ స్వయంగా నడిపి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కార్లను అమితంగా ఇష్టపడే స్టార్‌ హీరో నాగ చైతన్య కన్ను.. బుజ్జిపై పడింది. అప్పుడు అతడు ఏం చేశాడో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; బుజ్జిని డ్రైవ్‌ చేసిన చైతూ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు కార్లు అంటే యమా క్రేజ్‌. మార్కెట్‌లోకి ఏ కొత్త స్పోర్ట్స్‌ కారు వచ్చిన కొనేందుకు అతడు ఆసక్తి కనబరుస్తాడు. అయితే తాజాగా బుజ్జి అనే స్పెషల్‌ మేకింగ్‌ వెహికల్‌పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో చైతూ దృష్టి దీనిపై పడింది. ఇంకేముందు తాను ఓసారి బుజ్జిని నడపాలని నిర్ణయించుకొని చైతూ చిత్ర యూనిట్‌ సంప్రదించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో చైతూ ఆ కారును నడిపి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును చైతు డ్రైవ్ చేసాడు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా నాగచైతన్య దానిని రీట్వీట్ చేశాడు.&nbsp; This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024 ‘ఇంజనీరింగ్ అద్భుతం..’ కల్కి మేకర్స్‌ షేర్‌ చేసిన వీడియోను రీట్విట్‌ చేస్తూ.. బుజ్జిని నడిపిన అనుభవాన్ని నాగ చైతన్య తెలియచేశాడు. తమ విజన్‌ను విజయవంతంగా రియాలిటీలోకి అనువదించినందుకు మెుత్తం టీమ్‌కి నాగ చైతన్య హ్యాట్సఫ్‌ చెప్పాడు. నిజంగా ఇదోక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జి కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇంజనీరింగ్‌ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మెుత్తంగా బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; Witness the epic entry of Bhairava (#Prabhas) with Bujji at the #Bujji event! Feel the energy and excitement! ❤️‍🔥 @deepikapadukone @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms#BhairavaEntry #Tollywood #EventHighlights #Kalki2898AD #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin… pic.twitter.com/XaQJvWvoqa— SIIMA (@siima) May 22, 2024 బుజ్జి ప్రత్యేకతలు ఇవే బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; #Bujji has arrived! 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #ActorPrabhas @deepikapadukone @DishaPatani @VyjayanthiFilms @DjokerNole pic.twitter.com/IDYUiFMHNz— INOX Movies (@INOXMovies) May 23, 2024 రూ. 600 కోట్ల బడ్జెట్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 25 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం. &nbsp;127 హవర్స్ ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం. నిజ జీవితం ఆధారంగా.. 127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే... ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు.&nbsp; &nbsp;ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం&nbsp; జేమ్స్ ఫ్రాన్స్ కో&nbsp; సాహసాలంటే మహా&nbsp; ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి&nbsp; మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన&nbsp; బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో&nbsp; ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు.&nbsp; ఎలా బయటపడ్డాడంటే? లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.&nbsp; డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ&nbsp; మంజుమ్మేల్ బాయ్స్&nbsp; చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో "127 హవర్స్" సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
    మే 15 , 2024

    @2021 KTree