UTelugu2h 41m
బుల్లబ్బాయి నలువైపుల నీరున్న గ్రామానికి ప్రెసిడెంట్. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తానని చెప్పి 20 ఏళ్ల క్రితం నగరానికి వెళ్లిన స్నేహితుడి వద్దకు కుమారుడు చందుని పంపిస్తాడు. నగరానికి వచ్చిన చందు.. వెంకటరత్నం కావాలనే ఊరికి బ్రిడ్జి తీసుకురాలేదని తెలుసుకుంటాడు. బ్రిడ్జి తేవడం కోసం చందు ఏం చేశాడు? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్Zee5
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
రవితేజ
చంద్రశేఖర్ చందుశ్రియా శరన్
శ్వేత / మహాలక్ష్మి / మేడమ్విజయకుమార్
బుల్లబ్బాయిప్రకాష్ రాజ్
వెంకట రత్నం IASబ్రహ్మానందం
హోటల్ మేనేజర్సునీల్
నందనాసర్
దుర్గా ప్రసాద్ధర్మవరపు సుబ్రహ్మణ్యం
జీవా
యధన్నరఘునాథ రెడ్డి
బుల్లబ్బాయి తండ్రిహేమ
సుధ
శ్రీనివాస రెడ్డి
వేణు మాధవ్
ఫిష్ వెంకటయ్య
ఫిష్ వెంకట్‌విజయ్ సాయి
సిబ్బంది
రసూల్ ఎల్లోర్
దర్శకుడుమల్లిడి సత్యనారాయణ రెడ్డినిర్మాత
చక్రి
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్ ఒకరు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి శ్రియా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఇవాళ శ్రియా (సెప్టెంబర్ 11) 42వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం. అలాగే శ్రియాకు సంబంధించిన సమాచారమూ తెలుసుకుందాం.
శ్రియా శరణ్ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించింది. ఆమె తండ్రి పుష్పేంద్ర శరణ్ BHEL సంస్థలో పనిచేశారు. తల్లి నీరాజ శరణ్ కెమెస్ట్రీ టీచర్‌గా వర్క్ చేశారు.
2001లో వచ్చిన 'ఇష్టం' సినిమాతో శ్రియా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది.
తద్వారా తన రెండో చిత్రమే నాగార్జునతో చేసే అవకాశాన్ని శ్రియా దక్కించింది. ‘సంతోషం’ సినిమాలో నాగార్జునకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తర్వాత బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’ (2002), తరుణ్‌తో ‘నువ్వే నువ్వే’ (2002), ఉదయ్ కిరణ్‌తో ‘నేను మీకు తెలుసా’ (2003) చిత్రాల్లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసనే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఠాగూర్’ సినిమా సక్సెస్‌తో శ్రియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఆ తర్వాత 'నేనున్నాను', ‘ఛత్రపతి’, ‘భగీరథ’, ‘శివాజీ’, ‘డాన్ శీను’, ‘మనం’, ‘గోపాల గోపాల’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో శ్రియా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ శ్రియా పలు చిత్రాలు చేసింది. అక్కడ కూడా మంచి మంచి చిత్రాలు తీసి బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.
రామ్‌చరణ్, తారక్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR)లోనూ శ్రియా ఓ స్పెషల్ రోల్‌లో నటించింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భార్యగా, రామ్‌చరణ్‌కు తల్లిగా ఆమె కనిపించింది.
గతేడాది కబ్జ (కన్నడ), మ్యూజిక్ స్కూల్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను శ్రియా పలకరించింది. అందులో తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్‌గా ‘షోటైమ్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ శ్రియా నటించింది. ఈ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఇందులో మందిరా సింగ్ పాత్రలో ఆకట్టుకుంది.
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో శ్రియా నటిస్తోంది. 'Suriya 44' వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
సినిమాలతో పాటు పలు హిందీ మ్యూజిక్ వీడియోలలోనూ శ్రియా శరణ్ మెరిసింది. 'తిరకటి క్యూన్ హవా', 'కహిన్ దూర్', 'రంగ్ దే చునారియా', 'బరి బరి సాంగ్' ఆల్బమ్స్‌లో శ్రియా స్టెప్పులు వేసింది.
ప్రస్తుతం శ్రియా శరణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సెప్టెంబర్ 11 , 2024
Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు
‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.
డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది.
గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.
కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.
బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.
ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.
హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.
డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ.
మే 01 , 2023
Bagheera Trailer Review: ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?
ప్రశాంత్ నీల్ ‘భగీరా’ట్రైలర్‌లో ఇవి గమనించారా.. మరో కేజీఎఫ్ కానుందా?కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్’ (KGF), ‘కేజీఎఫ్ 2’ (KGF 2) దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కేజీఎఫ్ ముందు వరకూ పెద్దగా ఎవరికి తెలియని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఆ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇటీవల ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మరోమారు వసూళ్ల సునామి సృష్టించాడు. ముఖ్యంగా కథల విషయంలో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రద్ధ వహిస్తారని పేరుంది. ఈ క్రమంలోనే ఆయన ఓ పాన్ ఇండియా చిత్రానికి స్టోరీ అందించారు. ‘బఘీర’ పేరుతో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్‌లో ‘కేజీఎఫ్’ మార్క్ కనిపించేలా చాలా అంశాలే ఉన్నాయి.
బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లో..
‘కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. వీళ్ల కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్ రూపొందిన దానిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ కథతో హోంబలే ఫిల్మ్స్ ‘బగీరా’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిల్మ్ 'ఉగ్రమ్' హీరో శ్రీ మురళి ఇందులో లీడ్ రోల్ చేశాడు. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది విపరీతంగా ఆకట్టుకుంటోంది. భగీర ట్రైలర్ చూస్తే రెండు డిఫరెంట్ గెటప్స్‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే యాక్షన్‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=O38mUkgL-w8
కేజీఎఫ్ తరహా డైలాగ్స్!
ప్రశాంత్ నీల్ సినిమా అంటే యాక్షన్‌తో పాటు డైలాగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘బగీరా’ ట్రైలర్‌లోనూ ఆ తరహా డైలాగ్స్‌ను మనం చూడవచ్చు. 'దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో వస్తాడు. ఎందుకు ఎప్పుడూ రాడు’ అని ఓ పిల్లాడు తన తల్లిని అడుగుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మెుదలవుతుంది. ‘మనిషి మృగంగా మారినప్పుడు వస్తాడు’ అంటూ అందుకు తగ్గ పరిస్థితులను ఆ తల్లి వివరిస్తుంది. ఆ డైలాగ్ చెప్తున్న క్రమంలోనే క్రూరమైన విలన్స్‌తో కూడిన సన్నివేశాలను చూపించారు. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తన యూనిఫామ్‌ను పక్కనపెట్టి ఓ ముసుగు మనిషిలా క్రిమినల్స్‌ను పాశవికంగా చంపడం చూపించారు. ఓ వైపు పోలీస్‌గా మరోవైపు రాక్షసులను చంపే వెపన్ గా మారె శ్రీ మురళి యాక్టింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. పోలీసు ఉన్నతాధికారిగా నటుడు ప్రకాష్ రాజ్ ట్రైలర్‌లో కనిపించాడు.
తల్లి సెంటిమెంట్!
కేజీఎఫ్ సినిమాను గమనిస్తే చిన్నప్పుడే హీరో తల్లి చనిపోతుంది. చివరి క్షణాల్లో తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో క్రిమినల్‌గా మారతాడు. బగీరా ట్రైలర్‌ను గమనిస్తే కేజీఎఫ్‌కు సిమిలార్ స్టోరీతో ఇది వస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందులోనూ తల్లి సెంటిమెంట్ ఉండనున్నట్లు ట్రైలర్‌ను బట్టే తెలిసిపోతోంది. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు అన్యాయాలను ఎదిరించేందుకు పెద్దయ్యాక పోలీసు అవుతాడు. చట్టబద్దంగా న్యాయం జరగట్లేదని భావించి ముసుగు వ్యక్తిలా మారతాడు. అలా బగీరా గెటప్‌లో క్రిమినల్స్‌ను చాలా దారుణంగా చంపుతాడు. అయితే హీరో తల్లికి క్రిమినల్స్ నుంచి ఇబ్బందులు ఎదురై ఉండవచ్చు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో హీరో ఖాకీ ధరించి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే అచ్చం కేజీఎఫ్‌ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘NTR 31’తో బిజీ బిజీ
సలార్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను జూ.ఎన్టీఆర్ (Jr NTR)తో చేయబోతున్నాడు. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ బంగ్లాదేశ్ రైతుగా కనిపిస్తారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సీక్వెల్‌కు కేరాఫ్‌గా మారిన ప్రశాంత్ వర్మ 'NTR 31' ప్రాజెక్ట్‌ను సింగిల్ పార్ట్‌గా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'సలార్ 2' ప్రశాంత్ నీల్ తెరకెక్కించే అవకాశముంది. అలాగే రామ్ చరణ్‌తోనే ఓ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అక్టోబర్ 21 , 2024
Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్ పరువపు పొంగులు.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంతే!
కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది.
తాజాగా హాట్ ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు తన వెనుకవైపు అందాలు చూపిస్తూ నెటిజన్లను రెచ్చగొట్టింది.
సోఫాలో నెమలిని తలపించేలా కూర్చొని తన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది.
యషికా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పాలరాతి శిల్పాన్ని తలపిస్తున్న ఆమె అందాలను చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు.
యషిక వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె 1999 ఆగస్టు 9న ఢిల్లీ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి అక్కడే మకాం వేసిన యాషికా ఆనంద్ పలు తమిళ సినిమాల్లో నటించింది.
తమిళ చిత్రం ‘కావలై వెండం’ (2016) చిత్రంలో స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్ అనే చిన్న పాత్ర ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.
2018లో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమా యాషికాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో కావ్య అనే బోల్డ్ పాత్రలో నటించి యూత్‌ను ఆకట్టుకుంది.
తర్వాత తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం ద్వారా యాషికా ఆనంద్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
98 రోజుల పాటు హౌస్‌లో ఉన్న యషిక తన అందచందాలతో బుల్లితెర ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది.
దీంతో తమిళంలో ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘కఝుగు 2’, ‘జోంబీ’, ‘మూకుతి అమ్మన్’ ‘ఆర్23 క్రిమినల్స్ డైరీ‘ వంటి చిత్రాల్లో యాషిక నటించింది.
అలాగే ‘బెస్టీ’, ‘శిరుతై శివ’, ‘భగీర’, ‘సల్ఫర్’, ‘పంబట్టం’, ‘కదమైయై సెయ్' తదితర చిత్రాలతో తమిళంలో మరింత పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళంలో ‘ఇవన్ థన్ ఉత్తమన్’, ‘రాజా భీమా’ తదితర చిత్రాల్లో నటిస్తూ యషికా ఆనంద్ బిజీ బిజీగా గడుపుతోంది.
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యషికా చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తోంది. సినిమాలకు అతీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటోంది.
ప్రస్తుతం యషికా అనంద్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4.1 మిలియన్ల అనుసరిస్తుండటం గమనార్హం.
సెప్టెంబర్ 10 , 2024