UATelugu
రాధ (రాజ్‌తరుణ్) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్ బాక్స్ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్ తరుణ్ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్ కొట్టాడా?
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి...read more
How was the movie?
తారాగణం
రాజ్ తరుణ్
మనీషా కంద్కూర్
సింగీతం శ్రీనివాసరావు
అభిరామి
వీటీవీ గణేష్
హైపర్ ఆది
లీలా శాంసన్
అమ్ము అభిరామి
ఇంధు ప్రీతి
రాచ రవి
సిబ్బంది
శివ సాయి వర్ధన్దర్శకుడు
N.V. కిరణ్ కుమార్నిర్మాత
కథనాలు
Bhale Unnade Movie Review: నెల రోజుల్లో రాజ్ తరుణ్ మూడో చిత్రం.. ‘భలే ఉన్నాడే!’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, అభిరామి, అమ్ము అభిరామి, హైపర్ ఆది, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణ భగవాన్, వీటీవీ గణేష్, సింగీతం శ్రీనివాస్, లీలా శాంసన్, రచ్చ రవి తదితరులు
దర్శకత్వం: జె శివసాయి వర్ధన్
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్లా
నిర్మాత: N.V కిరణ్ కుమార్
సమర్పణ: మారుతి
విడుదల తేదీ: 13-09-2024
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’ (Bhale Unnade Movie Review in telugu). ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నెల రోజుల వ్యవధిలో రాజ్‌తరుణ్ నుంచి వచ్చిన మూడో చిత్రం ఇది. గత రెండు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ‘భలే ఉన్నాడే!’ సినిమాపై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌తరుణ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
రాధ (రాజ్‌తరుణ్) వైజాగ్‌లో శారీ డ్రాపర్ (అమ్మాయిలకు చీర కట్టే వృత్తి)గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి గౌరి (అభిరామి) పెంపకంలో పెరుగుతూ ఆమెకు చేదోడుగా ఉంటాడు. గౌరి పని చేసే బ్యాంకులోనే కొత్తగా కృష్ణ (మనీషా) ఉద్యోగంలో చేరుతుంది. ఆమె గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంటలకు ఫిదా అవుతుంది. రాధ మొహం కూడా చూడకుండానే అతనిపై మనసు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ తనతో ప్రేమలో పడిపోతాడు. వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవ్వగా నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి? రాధ అమ్మాయిలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? వారి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రాధ పాత్రలో రాజ్‌తరుణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నటనకు బాగా స్కోప్ దొరికింది. అతడి లుక్స్, భావోద్వేగాలు మెప్పిస్తాయి. కృష్ణ పాత్రలో మనీషా అందంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. తల్లిగా అభిరామి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సింగీతం శ్రీనివాస్ కనిపించేది నాలుగైదు సన్నివేశాలైనా బలమైన ప్రభావాన్ని చూపించారు. అమ్ము అభిరామి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరుల పాత్రలు పరిధి మేర ఉంటాయి. హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ పాత్రలు అక్కడక్కడా నవ్వులు పంచుతాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
రాముడిలా ఉండాలనుకునే అబ్బాయిని నేటి సమాజం, అమ్మాయిలు ఎలా చూస్తారన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శివసాయి వర్ధన్ ఈ సినిమా తెరకెక్కించారు. ప్రథమార్ధం మెుత్తం హీరో, హీరోయిన్ లవ్‌ట్రాక్, తల్లీకొడుకుల అనుబంధంతో సరదా సరదాగా సాగిపోతుంది. లంచ్ బాక్స్ వారధిగా నడిచే ప్రేమ రాయబరాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిశ్చితార్థ సమయంలో వచ్చే మలుపుతో తొలి భాగాన్ని ముగించారు దర్శకుడు. అమ్మాయిలకు రాధ ఎందుకు దూరంగా ఉన్నాడనే నేపథ్యంతో సెకండ్‌పార్ట్‌ను తీసుకెళ్లారు. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చప్పగా సాగినట్లు అనిపిస్తుంది. హీరోను పరీక్షించేందుకు కేరళ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్ అయ్యంగార్ చేసే హంగామా పెద్దగా వర్కౌట్ కాలేదు. రాధ-కృష్ణ విడిపోయిన తీరులోనూ కొత్తదనం కనిపించదు. క్లైమాక్స్ కూడా బలహీనంగా ఉండటం మరో మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ చక్కటి పనితీరు కనబరిచారు. తన అద్భుత పనితీరుతో స్క్రీన్‌ను ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చేశారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్ నటనకథా నేపథ్యంప్రథమార్థం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 13 , 2024
OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.
ధూం ధాం (Dhoom Dhaam)
చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్.రామ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చారు.
ఉత్సవం (Utsavam)
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
ఆయ్ (Aay)
నార్నే నితిన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.
తలవన్ (Thalavan)
జిస్ జాయ్ దర్శకత్వంలో బిజు మేనన్, ఆసిఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
సెప్టెంబర్ 09 , 2024
Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024
Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మత్తు వదలరా 2 (Mathu vadalara 2)
బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’ ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ గానుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?' అన్నది స్టోరీ.
గొర్రె పురాణం (Gorre Puranam)
సుహాస్ నటించిన రీసెంట్ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో కలిసి చూసేయచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్) ఉన్న సెల్లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
పైలం పిలగా (Pailam Pilaga)
సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'శివ దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ.
శబరి (Sabari)
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్లో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్లాట్ ఏంటంటే 'సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ.
లెవల్ క్రాస్ (Level Cross)
అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
వెయ్ దరువేయ్ (Vey Dharuvey)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన రీసెంట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ యాక్షన్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజై ఆకట్టుకోలేకపోయింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ వచ్చిన ఈ చిత్రం ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘శంకర్.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం ఫ్లై కన్సల్టెన్సీని సంప్రదిస్తాడు. అందులో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఇష్టపడతాడు. అయితే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ మాఫియాకు శంకర్‌కు సంబంధం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే హీరో నగరానికి వచ్చాడా? ఏదైనా ప్లాన్ ఉందా?’ అన్నది కథ.
కృష్ణం ప్రణయ సఖీ (Krishnam Pranaya Sakhi)
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీలో కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో మాళవికానాయర్‌తో పాటు శరణ్య శెట్టి హీరోయిన్లుగా చేశారు. కన్నడలో సూపర్ సక్సెస్ అయిన ఈ చిత్రం అక్టోబర్ 11 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ.
ది గోట్ (The Greatest Of All Time)
గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. విజయ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘ది గోట్’ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ.
35 చిన్న కథ కాదు (35 Chinna katha kadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ.
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్‌తరుణ్ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్కు వచ్చింది. ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘రాధ (రాజ్‌తరుణ్) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్ బాక్స్ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
అక్టోబర్ 10 , 2024
Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్.. ఇటీవలే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్‌లో విశ్వక్ ఈ పోస్టర్‌లో కనిపించాడు.
‘లైలా’గా విశ్వక్ సేన్..
ప్రస్తుతం విష్వక్ సేన్.. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ మూవీకి 'లైలా' (Laila Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్‌గా ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్‌ను రిలీజ్ చేసారు. కెరీర్‌లో తొలిసారి ఓ లేడీ గెటప్‌లో విశ్వక్ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్ డెసిషన్‌కు సెల్యూట్ అంటూ పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
https://twitter.com/pudiharicharan/status/1808373415163973920
రిలీజ్ ఎప్పుడంటే..!
తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న 'లైలా' చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్ చేసి.. షూటింగ్ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్ కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
https://twitter.com/AndhraBoxOffice/status/1808389179472060518
‘రెమో’ తరహాలో మేకోవర్!
విశ్వక్ సేన్ లేటెస్ట్ ‘లైలా’ పోస్టర్.. తమిళ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో' (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్.. అందమైన అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాడు. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్ సేన్ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్‌లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్‌లోని అతడి మేకోవర్ చూస్తే.. ఏదో ఒక సీన్ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్‌ను డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
‘మెకానిక్ రాకీ’గా విశ్వక్..
ప్రస్తుతం విశ్వక్ సేన్.. 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్ పాత్ర.. చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో రానున్న చిత్రంలో.. విశ్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్‌లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
జూలై 03 , 2024
SSMB29: మహేష్ లుక్ వేరే ఉందట! జక్కన్న భలే బురిడి కొట్టించాడుగా!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా తీయనుండటంతో యావత్ దేశం దృష్టి దానిపై నెలకొంది. దీంతో ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లే రోజు కోసం అంతా ఎదుచూస్తున్నారు. ఇక సినిమా కోసం మహేష్ అదిరిపోయేలా మేకోవర్ అవుతున్నాడు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ దంపతులు కలవగా అతడి లుక్స్ వైరల్ అయ్యాయి. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌తో మహేష్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో SSMB29లో మహేష్ లుక్ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ లుక్ అసలైంది కాదా?
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'SSMB29' కోసం బాబు లుక్ సిద్ధమైనట్లేనని కామెంట్స్ కూడా చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మహేష్ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. మరింత గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపించనున్నారట. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్ అని జక్కన్నకు అనిపిస్తుందో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్ అని భ్రమపడిన మహేష్ ఫ్యాన్స్ అంతా నాలుక కరుచుకుంటున్నారు. జక్కన్న తమని భలే బురిడికొట్టించాడని అభిప్రాయపడుతున్నారు.
అందుకే మహేష్‌కు స్వేచ్ఛ!
తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్ బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్ జరుగుతున్న కాలం లుక్ రివీల్ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల సమయంలో ప్రభాస్, రామ్‌చరణ్, తారక్ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్ బయటకి ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.
రాజమౌళి మాస్టర్ ప్లాన్!
మహేష్ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్ వర్క్ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్ షూట్ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్ పనులు, షూటింగ్ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్ చేయవచ్చని మాస్టర్ ప్లాన్ వేశారట. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ఆ విమర్శలకు చెక్
దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్ చేసే వీలు పడుతుందని అంటున్నారు. 'SSMB 29' చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ 26 , 2024
Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.
లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్ ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.
విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది.
కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి.
రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.
ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు. ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.
ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు.
విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే... శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.
అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు.
రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
సెప్టెంబర్ 06 , 2023
Tollywood: సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్ సేన్‌లకు అండగా బాలయ్య, ఎన్టీఆర్.. దాని వెనక మాస్టర్ ప్లాన్ ఉందా?
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ, విష్వక్ సేన్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కుర్ర హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్స్‌కి నందమూరి ఫ్యామిలీ నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే కుర్ర హీరోలను సీనియర్లు ప్రోత్సహించడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు ఉండగా సిద్ధు, విష్వక్‌లను తారక్, బాలయ్య ప్రోత్సహించడం వెనక చాలా బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కుర్ర హీరోలతో క్లోజ్‌గా..
కుర్ర హీరోలను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చేరారు. యువ విష్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇద్దరి హీరోలతో తారక్ ప్రత్యేక ఇంటర్యూ నిర్వహించారు. దర్శకుడు కొరటాల శివ, తారక్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఇంటర్యూకు భలే హైప్ వచ్చింది. అంతకుముందు సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్రేర్ సక్సెస్ మీట్‌కు తారక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు విష్వక్ కూడా హాజరవ్వగా వారిద్దరితో తారక్ ఫొటోలు దిగి హల్‌చల్ చేశాడు. మరోవైపు రీసెంట్‌గా బాలకృష్ణను సైతం ఈ ఇద్దరు హీరోలు కలిశారు. విజయవాడ వరదల నేపథ్యంలో ప్రకటించిన సొమ్మును బాలయ్యతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బాలకృష్ణ.. విశ్వక్ తాను కవలలమంటూ ఆకాశానికి ఎత్తారు. ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా సిద్ధు, విష్వక్‌లకు తారక్, బాలయ్య అండగా నిలుస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్, కిరణ్ అబ్బవరం వంటి కుర్ర హీరోలు ఉండగా విష్వక్, సిద్ధులనే బాలకృష్ణ, తారక్ ఎంకరేజ్ చేయడం వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మెగా, నాన్-మెగా అనే రెండు వర్గాలుగా విడిపోయిందని సినీ వర్గాల టాక్. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. పైగా ఈ జనరేషన్ హీరోల్లో చాలామంది తాము మెగాస్టార్‌కు పెద్ద అభిమానులమని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న విష్వక్, సిద్ధులను ఎంకరేజ్ చేయడం ద్వారా తమకంటూ ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని నందమూరి ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానులమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తారక్ అంటే తమకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఎంకరేజ్ చేసేందుకు తారక్, బాలకృష్ణ ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌కు పోటీగా..!
విజయ్ దేవరకొండ సోదరులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెుదటి నుంచి తన మద్దతు తెలియజేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి విజయ్‌తో బన్నీ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ సోదరుడు తీసిన బేబీ ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బన్నీ హాజరయ్యారు. బేబీ వివాదంలో విష్వక్ చిక్కుకున్నప్పుడు అతడి గురించి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో విష్వక్ చాలా ఒత్తిడి ఫేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తారక్ మద్దతుతో విష్వక్ దాని నుంచి బయటపడినట్లు సమాచారం. అయితే తారక్, బన్నీ ఎంతో స్నేహంగా ఉంటారు. కాకపోతే తమకంటూ ఓ గ్రూప్ ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికివారు వ్యక్తిగతంగా యంగ్ హీరోలను ప్రోత్సహించుకుంటూ, గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
విష్వక్, సిద్ధు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విష్వక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్ సాంగ్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అలాగే ‘లైలా’ చిత్రంలోనూ విష్వక్ నటిస్తున్నాడు. రామ్‌నారాయణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విష్వక్ అమ్మాయిగా కనిపించనున్నాడు. ఇవి కాకుండా ‘VS13’, ‘VS14’ ప్రాజెక్ట్స్‌ను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ చేతిలోనూ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత 'టిల్లు క్యూబ్' కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 25 , 2024
Nani HBD: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్ జర్నీ!
టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.
‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్ స్టార్ సిద్ధమవుతున్నాడు.
ఈ తరం యంగ్ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్ హిట్ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
అష్టా చమ్మా (2008)
అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.
రైడ్ (2009)
రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు.
అలా మెుదలైంది (2011)
అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.
పిల్ల జమీందార్ (2011)
పిల్ల జమీందార్(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.
ఈగ (2012)
దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్ ఎంతో దోహదం చేసింది.
భలే భలే మగాడివోయ్ (2015)
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
నేను లోకల్ (2017)
నేను లోకల్ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.
MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.
నిన్ను కోరి (2017)
నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.
జెర్సీ (2019)
జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.
గ్యాంగ్ లీడర్ (2019)
గ్యాంగ్ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్ పూర్తి భిన్నం.పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.
వి (2020)
వి(V) సినిమాలో నాని నెగెటివ్ రోల్ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.
టక్ జగదీష్ (2021)
టక్ జగదీష్ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.
శ్యామ్ సింగరాయ్ (2021)
పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.
అంటే.. సుందరానికీ (2022)
గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు.
దసరా (2023)
దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
హాయ్ నాన్న (2023)
నాని-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్ శౌర్యువ్ రూపొందించిన చిత్రం ‘హాయ్ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.
మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.
నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
ఫిబ్రవరి 24 , 2024
Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన యంగ్ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.
అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్ హిట్ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.
అష్టా చమ్మా (2008)
అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.
రైడ్ (2009)
రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు.
అలా మెుదలైంది (2011)
అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.
పిల్ల జమీందార్ (2011)
పిల్ల జమీందార్(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.
ఈగ (2012)
దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్ ఎంతో దోహదం చేసింది.
భలే భలే మగాడివోయ్ (2015)
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
నేను లోకల్ (2017)
నేను లోకల్ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.
MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.
నిన్ను కోరి (2017)
నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.
జెర్సీ (2019)
జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.
గ్యాంగ్ లీడర్ (2019)
గ్యాంగ్ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్ పూర్తి భిన్నం.పెన్సిల్ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.
వి (2020)
వి(V) సినిమాలో నాని నెగెటివ్ రోల్ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.
టక్ జగదీష్ (2021)
టక్ జగదీష్ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.
శ్యామ్ సింగరాయ్ (2021)
పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.
అంటే.. సుందరానికీ (2022)
గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు.
దసరా (2023)
దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.
నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
మార్చి 31 , 2023
EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్ కంటే ఇంకా బెటర్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
డైలాగ్
ఓ సీన్‌లో హీరోయిన్ లిల్లీ జోసేఫ్ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది
లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్
టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా?
లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్
టిల్లు : చర్చి ఫాదరా?
https://twitter.com/i/status/1774726359111307728
డైలాగ్
లిల్లీ ఫాదర్: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?
టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు
డైలాగ్
టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే..
టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్ ఏస్టేట్ ఐకూన్
టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది
టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది
https://twitter.com/i/status/1774992506087944622
డైలాగ్
ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.
టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..
https://twitter.com/i/status/1773542640488784015
డైలాగ్
లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి
https://twitter.com/i/status/1773655054655856994
డైలాగ్
సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.
లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ
అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
టిల్లు: పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం
https://twitter.com/i/status/1772913769770803358
డైలాగ్
లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
టిల్లు: నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని
https://twitter.com/i/status/1774319933129916896
డైలాగ్
లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్ సూపర్‌గా అనిపిస్తుంది.
టిల్లు: ఫ్రెండ్స్ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్ ఏ నల్లమల్ల ఫారెస్ట్.. విత్ నల్ల చీర.. ఫిల్మ్ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్ మాల్కాజ్ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్, హార్ట్ బ్రేక్, హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్, చీటింగ్, క్రైమ్ జానర్‌లో వచ్చింది.
డైలాగ్
లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్ చెప్పు రాధిక.
లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ
టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు.
మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.
అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.
నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి
https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8
డైలాగ్: బర్త్ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో..
టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్ జోకర్ అంటారు'
https://www.youtube.com/watch?v=sARNpvr4IoE
పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ...
టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు..
అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..!
టిల్లు: అచ్చా షాప్ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ..
పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు..
పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో..
టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని.
మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం
పిన్ని: నీకోసమేరా పిచ్చోడా..
టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను.
పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..
టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..
టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో..
టిల్లు: డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు.
వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు...
టిల్లు: ఉన్నడా భాయ్ ఫ్రెండ్..
లిల్లీ: నీకెందుకు..?
టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా...
లిల్లీ: లేదంటే..
టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..
లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..
టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..
మందు గురించి మాట్లాడే టైంలో..
టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా..
కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో
టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు..
లిల్లీ: స్మైలింగ్..
టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా..
లిల్లీ: లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా?
టిల్లు: నాదా...? నా హార్ట్ చాలా వీకూ..
** రొమాంటిక్ మ్యూజిక్…**
టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా..
లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్ ఏంటో తెలిసిననాడు మాట్లాడు.
టిల్లు: నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా..
లిల్లీ: Do You Know the best part Of Kiss
టిల్లు: Kiss
లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..
పబ్‌లో టిల్లుతో లిల్లీ
లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food
'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది.
లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్
షానన్: ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..!
క్లైమాక్స్‌లో లాస్ట్ డైలాగ్
లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్?
టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది.
https://twitter.com/i/status/1773940395300544591
ఏప్రిల్ 02 , 2024
Memes on Mega Princess: మెగా లిటిల్ ప్రిన్సెస్‌పై మీమ్స్.. ఇంత టాలెంట్‌గా ఉన్నారెంట్రా బాబు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. జూన్ 20న జన్మించిన మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ రామ్‌చరణ్ దంపతులను విష్ చేశారు. దీంతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ హడావుడి చేసేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ట్విటర్‌లో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
మెగా లిటిల్ ప్రిన్సెస్ ఆగమనాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ ఓ నెటిజన్ వినూత్నంగా పార్టీ అడిగారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ సాంగ్‌ని ట్యాగ్ చేసి ‘బాసూ పార్టీ ఎక్కడా’ అంటూ అడుగుతున్నారు.
https://twitter.com/Nithish13771106/status/1671007811839623170
దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ ఫలించిందంటూ మెగాస్టార్ ఎమోషనలయ్యారు. మెగా ఇంట అన్నీ శుభకార్యాలే జరుగుతున్నాయని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
https://twitter.com/Hemanth_RcCult/status/1671006003612225536
లిటిల్ ప్రిన్సెస్ పుట్టిందని తెలియగానే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఆనందపడ్డారో తెలుపుతూ మరో మీమ్ చేశారు.
https://twitter.com/WeLoveMegastar/status/1671021787042447365
లయన్ కింగ్ సినిమాలో కూన సింహాన్ని రాజుగా ప్రకటించే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా రామ్‌చరణ్, ఉపాసన తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారంటూ ఓ మీమ్ చేశారు.
https://twitter.com/s_siechojithu/status/1670955824305569795
రామ్‌చరణ్, ఉపాసనల గారాల పట్టికి తన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఎలా ఆశ్చర్యపోతుందోనని చెబుతూ ఓ మీమ్ చేశారు.
https://twitter.com/HereFoRamCharan/status/1671203912190406656
తన నాన్న అల్లూరి సీతారామరాజు, తాతా ఇంద్రసేనరెడ్డి, చిన్నతాత గబ్బర్ సింగ్, మామయ్య పుష్పరాజ్ అని తెలుసుకుని మురిసిపోతుంది.
https://twitter.com/sunny5boy/status/1671039650897510400
మెగా ప్రిన్సెస్‌ని అరుంధతితో పోలుస్తూ చేసిన మీమ్ తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/always_dasari9/status/1670959463367598082
మనవరాలి రాకతో తాతయ్య చిరంజీవి ఎంతో సంబరపడుతున్నారు. ఇక చిట్టితల్లి పెంపకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత చిరుపై ఉంటుందని వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/BharathRCKajal/status/1671029533041111040
డ్యాన్స్ నేర్పించడం, ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేస్తుండటం, ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం చేపిస్తుండటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
https://twitter.com/Hemanth_RcCult/status/1670954488969187328
ఇక లిటిల్ ప్రిన్సెస్‌ని స్కూళ్లో చేర్పించే సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి ఓ మీమ్ చేశారు. జై చిరంజీవ సినిమాలో సీన్‌ని స్పూఫ్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
https://twitter.com/PriyaRC_4/status/1671024958275997705
ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఎంతో ఫేమస్. కానీ, ఇందులో ఓ విలన్ ‘జయ ఆంటీ తెలుసా నీకు, లల్లూ అంకుల్ తెలుసా నీకు.. వారంతా నా వెనకే ఉన్నారు’ అని అర్థం వచ్చేలా హిందీలో చెబుతాడు. దీనిని మెగా లిటిల్ ప్రిన్సెస్‌కి అన్వయించారు. మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఇలా వీళ్లంతా నా వెనక ఉన్నారంటూ చెబుతున్న మీమ్ ఇది.
https://twitter.com/vj_vijayawada/status/1671070004484386818
అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పుడు పుట్టిన లిటిల్ ప్రిన్సెస్‌కు వరుసకు బావ అవుతాడు. రామ్‌చరణ్, ఉపాసనకు కుమార్తె పుట్టడంతో అత్యంత ఆనందం పొందిన వ్యక్తి అయానే అంటూ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
https://twitter.com/gnani0414/status/1670985319297212416
పుష్ప సినిమాలో ‘భలే య్యాపీగా ఉండాది కదరా నీకు’ అంటూ చెప్పే డైలాగ్ వైరల్ అవుతోంది.
https://twitter.com/gnani0414/status/1671012059625168897
రామ్‌చరణ్‌కి ప్రత్యేక అభిమాని అయాన్. రంగస్థలం చిట్టిబాబు గెటప్ వేసి మామ మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా మరదలు పుట్టాక మామయ్యతో అయాన్ చిట్ చాట్ ఇలా ఉంటుందని మీమ్ చేశారు.
https://twitter.com/lokeshBangaram/status/1671441932294422529
మెగా ఫ్యామిలీ చిన్నదేం కాదు. ఎంతో మంది ఉంటారు. వారి మధ్యలో లిటిల్ ప్రిన్సెస్ చేరింది. దీంతో తనపై ప్రేమను ఎలా కురిపిస్తారో ఈ మీమ్ చూస్తే తెలిసిపోతుంది.
https://twitter.com/s_siechojithu/status/1671026894760992770
నాయక్ సినిమాలో పోసాని కృష్ణమురళి కామెడీ హైలైట్. అందులో అధికారులు ఓ ల్యాప్‌టాప్‌లో ప్రాపర్టీస్ చూపించి మీవేనా? అని అడిగితే అన్నీ నావేనని ఒప్పుకుంటాడు. ఈ వీడియోను స్పూఫ్ చేశారు.
https://twitter.com/KingLeo_007/status/1671348946755805191
చెర్రీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు చరణ్ పిల్లాడిలా మారిపోతాడు. వారితో ఎంతో ముచ్చటగా ఆడుకుంటాడు. ఇప్పుడు తనకే బిడ్డ పుట్టింది. మరి, ఏ రేంజ్‌లో ఫన్ ఉంటుందో ఊహించుకుంటేనే తెలిసిపోతుంది.
https://twitter.com/Noori_NN/status/1671045618079506433
జూన్ 21 , 2023
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
Comedian Ali Roles: ‘డబుల్ ఇస్మార్ట్’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
పూరి జగన్నాథ్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగ్స్, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బైక్‌ల దొంగ (ఇడియట్)
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇడియట్ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.
స్కెచ్ ఆర్టిస్టు (సూపర్)
నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్ సీన్ ఎప్పటికీ మర్చిపోలేరు.
బిక్షగాడు (పోకిరి)
మహేష్, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.
హిమాలయ బాబా (దేశ ముదురు)
అల్లు అర్జున్ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తాడు. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.
గోలి (దేవుడు చేసిన మనుషులు)
రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.
నచ్చిమి (చిరుత)
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫస్ట్ ఫిల్మ్ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.
బోకా (ఇస్మార్ట్ శంకర్)
రామ్ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్ ఫారెస్ట్ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్ చేసినట్లు అలీ తెలిపారు.
ఆగస్టు 13 , 2024
#AskNani: ఫ్యాన్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
దసరా చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.
దసరా రన్‌టైమ్
#Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్ టైమ్ రివీల్ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636016970473828353
ఫుల్ బిందాస్
సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.
https://twitter.com/NameisNani/status/1636015575284748288
స్ట్రాంగ్ రిప్లై
రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636005865101877255
ఫన్నీ సమాధానం
నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.
https://twitter.com/NameisNani/status/1636006778805837824
ఎవరైనా ఒక్కటే
నేచురల్ స్టార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1636004611210502150
ఒరిజినల్ పీస్
సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.
మార్చి 16 , 2023
Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ చిత్రాలు
'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.
తొలి ప్రేమ (Tholi Prema)
వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.
ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade)
నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.
అష్టా చమ్మా (Ashta Chamma)
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.
అలా మెుదలైంది (Ala Modalaindi)
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్ ఫెయిల్ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.
సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan)
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి (Majili)
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
ఓకే బంగారం (Ok Bangaram)
ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.
ఏ మాయ చేశావే (Ye Maya Chesave)
తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్ బిజినెస్‌లో భాగమై సక్సెస్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.
సీతారామం (Sita ramam)
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్ క్లాసిక్ మూవీగా దీన్ని చెప్పవచ్చు.
హాయ్ నాన్న (Hi nanna)
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్ నాన్న తప్పకుండా ఉంటుంది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్ (Oye)
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి (Raja Rani)
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను (Jaanu)
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
గోదావరి (Godavari)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. హీరో సుమంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఆనంద్ (Anand)
ఈ ఫీల్‌గుడ్ మూవీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
మార్చి 22 , 2024
Ayesha Khan: ‘ఓం భీమ్ బుష్’ భామ అయేషా ఖాన్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ అయేషా ఖాన్.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్ బుష్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయేషా ఖాన్ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అయేషా ఖాన్ ఎవరు?
టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది.
అయేషా ఖాన్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది.
అయేషా ఖాన్ పుట్టిన తేదీ?
13 సెప్టెంబర్, 1992
అయేషా ఖాన్ తల్లిదండ్రులు ఎవరు?
అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్ ఖాన్ & Mrs ఖాన్
అయేషా ఖాన్‌కు సోదరులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్ ఖాన్ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్ ఖాన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయేషా ఖాన్ ఎత్తు ఎంత?
162 సెం.మీ
అయేషా ఖాన్ ఏం చదివారు?
ఈ భామ ఇంటర్ వరకూ చదువుకుంది.
అయేషా ఖాన్ ఎక్కడ చదివారు?
ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది.
అయేషా ఖాన్ కెరీర్ ఎలా మెుదలైంది?
కెరీర్ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది.
అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన?
హిందీలో 'బిగ్ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.
అయేషా ఖాన్ నటనా ప్రవేశం ఎలా జరిగింది?
హిందీలో స్టార్‌ప్లస్ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్ రిటర్న్స్' అనే సీరియల్‌లోనూ కనిపించింది.
అయేషా ఖాన్ తొలి చిత్రం?
తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.
అయేషా ఖాన్ లేటెస్ట్ చిత్రం?
అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్ షో చేసింది.
అయేషా ఖాన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
అయేషా ఖాన్ ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.
అయేషా ఖాన్ ఫేవరేట్ నటుడు?
ఈ భామకు అక్షయ్ కుమార్ నటన అంటే చాలా ఇష్టమట.
అయేషా ఖాన్ ఫేవరేట్ హీరోయిన్?
ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.
అయేషా ఖాన్ ఇష్టమైన కలర్?
నలుపు, తెలుపు
అయేషా ఖాన్ ఫేవరేట్ రియాలిటీ షో?
బిగ్‌బాస్
అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
మునావర్ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
మార్చి 23 , 2024
Jr NTR తీరులో మార్పు.. హిందీ స్టార్లతో కలిసి నైట్ డేట్!
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో బిజీ బిజీగా ఉన్నాడు. ముంబయిలో ‘వార్ 2’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న తారక్.. నిన్న రాత్రి బాలీవుడ్ స్టార్ హీరోలతో హల్‌చల్ చేశాడు. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కల్చర్‌లోకి తారక్!
నైటౌట్లు, డిన్నర్ పార్టీలకు దూరంగా ఉండే తారక్.. ముంబయిలో ఈ నియమానికి చెక్ పెట్టినట్లు ఉన్నాడు. ఆదివారం రాత్రి.. తారక్ పూర్తిగా బాలీవుడ్ కల్చర్‌లోకి మారిపోయాడు. హిందీ స్టార్లు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), వార్-2 హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), సబా ఆజాద్ (Sabha Ajad), కరణ్ జోహార్ (Karan Johar)లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్లాడు. తారక్‌తో పాటు అతడి భార్య ప్రణతి కూడా ఈ పార్టీలో పాల్గొంది. స్టార్ హీరోలందర్నీ ఒక్కసారిగా బయట చూసి ముంబయి ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఎగబడ్డారు. వారిని తమ కెమెరాల్లో బందించేందుకు ప్రయత్నించారు. అటు స్థానికులు సైతం తారక్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1784800640054784018
https://twitter.com/i/status/1784782516681073070
https://twitter.com/i/status/1784737249713619077
https://twitter.com/i/status/1784857172771279114
60 రోజుల కాల్ షీట్స్!
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసం తారక్ 60 రోజులు కేటాయించినట్లు సమాచారం. కాగా, అంతకుముందు వచ్చిన వార్ చిత్రంలో హృతిక్‌తో పాటు మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు మించి ‘వార్ 2’ ఉండబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని బయట రూమర్లు ఉన్నాయి.
తారక్ సీరియస్
ఇటీవల ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేసేందుకు తారక్ వెళ్తుండగా బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా కెమెరాల్లో తారక్‌ను బందించబోయారు. దీంతో తారక్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘ఓయ్..’ అంటూ ఒక్కసారిగా ఫొటోగ్రాఫర్లపై కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు. అయితే ‘వార్ 2’లో తన లుక్‌ను రివీల్ చేయకుండా తారక్ జాగ్రత్తపడుతున్నాడు. అయినప్పటికీ ఆయనకు సంబంధించిన ఫొటోలు తరచూ బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడంతో తారక్‌కు కోపం వచ్చింది.
https://twitter.com/i/status/1783491705049886808
ఏప్రిల్ 29 , 2024
Rashi Singh: రాశి సింగ్ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
యంగ్ హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.
రాశి సింగ్ పుట్టిన రోజు ఎప్పుడు?
రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్ సింగ్, సరితా సింగ్. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్ సింగ్.
రాశి సింగ్ విద్యాభ్యాసం ఎక్కడ?
ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.
View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real)
రాశి సింగ్ కెరీర్ ఎలా మెుదలైంది?
ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్ హోస్టేస్ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.
రాశి సింగ్ వయసు ఎంత?
రాశి సింగ్ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.
రాశి సింగ్ ఎత్తు, బరువు ఎంత?
రాశి సింగ్ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ భామ బాడీ కొలతలు 32-26-34.
రాశి సింగ్ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది?
చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది. ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
రాశి సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
ఎయిర్ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.
రాశి సింగ్ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది?
రాశి సింగ్ ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.
రాశి సింగ్ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
రాశి సింగ్ తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరు?
రాశిసింగ్ ఫేవరేట్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.
రాశి సింగ్ మెుదటి సినిమా ఏది?
తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు.
రాశి సింగ్ గుర్తింపు తెచ్చిన చిత్రం?
ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.
రాశి సింగ్ మద్యం సేవిస్తుందా?
లేదు.
రాశి సింగ్ సిగరేట్ దాగుతుందా?
లేదు.
రాశి సింగ్ మాంసాహారం తింటుందా?
అవును. రాశి సింగ్ చికెన్, మటన్‌తో చేసిన నాన్ వెజ్ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్?
https://www.instagram.com/rashi.real/?hl=en
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు?
ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
మార్చి 05 , 2024
Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్ సంచలన పోస్ట్!
కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.
ట్విటర్ వేదికగా ఆగ్రహం
తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్ యాక్షన్ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550
అసలేం జరిగింది?
గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్ పెట్టింది.
మార్చి 05 , 2024