UATelugu
‘భార్గవి నిలయం’లో భార్గవి అనే అమ్మాయి ఆత్మగా తిరుగుతుందని ఊరి వాళ్లు నమ్ముతుంటారు. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వచ్చి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మతో స్నేహం చేస్తాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమె ప్రేమకథ ఏంటి? ఆ ప్రేమ జంట మిస్టరీని బషీర్ ఎలా బయట పెట్టాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Ahaఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
రివ్యూస్
YouSay Review
Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi N...read more
How was the movie?
తారాగణం
టోవినో థామస్
రిమా కల్లింగల్
షైన్ టామ్ చాకో
రోషన్ మాథ్యూ
చెంబన్ వినోద్ జోస్
ప్రమోద్ వెలియనద్
పూజా మోహనరాజ్
ఉమా కె పి
దేవ్కీ భాగీ
జేమ్స్ ఎలియా
సిబ్బంది
ఆషిక్ అబు
దర్శకుడుఆషిక్ అబు
నిర్మాతరిమా కల్లింగల్
నిర్మాతబిజిబాల్
సంగీతకారుడుగిరీష్ గంగాధరన్
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
నటీనటులు : టొవినో థామస్, చెంబన్ వినోద్, రోషన్ మ్యాథ్యూ, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, అభిరామ్ రాధా కృష్ణ
డైరెక్టర్: ఆషిక్ అబు
సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్
ఎడిటింగ్ : వి. సాజన్
సంగీతం : బిజిబాల్, రెక్స్ విజయన్
నిర్మాతలు : అషిక్ అబు, రీమా కల్లింగల్
ఓటీటీ : ఆహా
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీలవెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. అశిక్ అబు దర్శకత్వం వహించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సముద్రతీరానికి సమీపంలో ఉన్న పల్లెటూళ్లో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచయిత పాత్రలో టోవినో థామస్ నటన బాగుంది. అతడి లుక్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంటగా రీమా కల్లింగల్, రోషన్ మథ్యూ పర్వాలేదనిపించారు. విలన్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఆషిక్ అబు ఒక రొటిన్ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్ స్టోరీ, బోరింగ్ లవ్ ట్రాక్, రెగ్యులర్ హార్రర్ సీన్స్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టోవినో థామస్ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
రొటిన్ హార్రర్ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 06 , 2024
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు
నందమూరి బాలకృష్ణ ఎవరు?
బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం.
నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు?
చెన్నై
నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 జూన్ 10
నందమూరి బాలకృష్ణ భార్య పేరు?
వసుంధర దేవి
బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని)
నందమూరి బాలకృష్ణ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు?
తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ
బాలకృష్ణ అభిమాన నటుడు?
నందమూరి తారక రామారావు
బాలకృష్ణ అభిమాన హీరోయిన్?
సావిత్రి
బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు?
మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ.
బాలకృష్ణకు ఇష్టమైన కలర్?
వైట్
బాలకృష్ణ ఏం చదివాడు?
నిజాం కాలేజీలో డిగ్రీ
బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 108 సినిమాల్లో నటించాడు
బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం?
చికెన్ పలావు
బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.
బాలకృష్ణ 100వ సినిమా పేరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM
బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
హిందూపురం
బాలయ్య గెలుచుకున్న అవార్డులు?
బాలయ్య 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
మార్చి 19 , 2024
Jr NTR Sons: టాలీవుడ్ ఫ్యూచర్‌పై కర్చీఫ్ వేసిన తారక్ బిడ్డలు.. యాక్టింగ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయినట్లేనా!
దేవర సక్సెస్‌తో జూ. ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నారు. రూ.500 కోట్ల దిశగా దూసుకుపోతుండటంతో అటు ఫ్యాన్స్ సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగే నటుల్లో తారక్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఏమాత్రం సమయం దొరికిన తన ఇద్దరు కుమారులతో తీరిక లేకుండా గడిపేస్తుంటారు. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీల తారక్ ఏంజలిస్ వెళ్లారు. అక్కడ తన కుమారులు అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బిడ్డల సినీ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే!
టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. నందమూరి తారకరామారావు నటవారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. హరికృష్ణ తనయుడు తారక్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అమెరికా వెళ్లిన తారక్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భవిష్యత్‌లో మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా? అని ప్రశ్నించగా తారక్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తన అభిప్రాయాలను పిల్లలపై రుద్దనని సొంత ఆలోచనలను వారు కలిగి ఉండాలని తారక్ అన్నారు. కాబట్టి సినిమాల్లోకి రావాలని వాళ్లను బలవంతం చేయని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఎప్పుడు బలవంతం చేయలేదన్నారు. అయితే తండ్రిని నటుడిగా చూసినప్పుడు ఆ బాటలోనే అడుగులు వేయాలని పిల్లలు కోరుకుంటారని ఫ్యాన్స్‌కు తారక్ హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అభయ్, భార్గవ్ సినిమా ఎంట్రీని ఎక్స్‌పెక్ట్ చేయోచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
తారక్.. నందమూరి వారసుడు కాదా?
ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ వారసులు ఎవరు? అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించగా దీనికి బాలయ్య ఊహించని సమాధానం ఇచ్చారు. తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు వారసులుగా ఉంటారని సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎవరున్నారు? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. వారసులపై బాల్యయ్య ఇచ్చిన ఆన్సర్ సరైందే అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎన్ని విభేదాలు ఉన్నా వారు కూడా నందమూరి ఫ్యామిలీనే కదా అంటూ కామెంట్స్ చేశారు. అటు తారక్ ఫ్యాన్స్ సైతం బాలయ్య కామెంట్స్‌పై నెట్టింట మండిపడ్డారు. మీ దృష్టిలో తారక్ నందమూరి వారసుడు కాదా? అని నిలదీశారు.
హరికృష్ణ మరణంతో పెరిగిన దూరం!
నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలయ్య, హరికృష్ణ తెలుగు తెరపై అడుగుపెట్టారు. వాస్తవానికి బాలయ్య కంటే ముందే హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే తండ్రి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. నాన్న వెన్నంటే పొలిటిక్స్‌లో ప్రచార యాత్రల్లో పాల్గొన్నారు. అయితే బాలకృష్ణ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించారు. హరికృష్ణ బతికి ఉన్నంతవరకూ ఆయన కుమారులైన తారక్, కల్యాణ్ రామ్‌కు నందమూరి ఫ్యామిలీలో మంచి రిలేషనే ఉంది. బాలయ్య సైతం వారిద్దరితో ఎంతో అప్యాయంగా ఉండేవారు. హరికృష్ణ మరణాంతరం చోటుచేసుకున్న కొన్ని ఘటనల వల్ల బాలయ్యకు తారక్‌కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక్కటిగా ఉంటున్నారు. తారక్ నందమూరి కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బాలయ్య అందుకు అంగీకరించడం లేదన్న విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
'దేవర 2'.. తారక్ ఏం చెప్పారంటే?
కలెక్షన్స్ పరంగా దేవర సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర 2'పై తారక్ స్పందించాడు. ‘మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మాలో మరింత ఉత్సాహం పెరిగింది. బాధ్యత పెరిగింది. దేవర కంటే రాబోయే సీక్వెల్ ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ రెడీగా ఉంది. దానిని ఇంకా బెటర్‌గా షేపప్ చేయాలి. దేవర కోసం కొరటాల శివ ఎంతో కష్టపడ్డారు. అందుకే ఓ నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పా. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. ఆ హాలీడేస్ నుంచి వచ్చాక మిగతా పనులు మొదలుపెడతాం’ అని తారక్ అన్నారు.
అక్టోబర్ 07 , 2024
Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు. అయితే సెలబ్రిటీల పిల్లలు అనగానే సహజంగానే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ అభిమాన హీరోల వారసులుగా ఆ చిన్నారులను కూడా ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టే కొత్త తరహా పేర్ల విషయంలో ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటి అర్థం తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లలు (Tollywood Celebrity Baby Names), వారి పేర్లకు అర్థాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
[toc]
రామ్ చరణ్ (Ram Charan)
మెగా ఫ్యామిలీలోకి గతేడాది జూన్‌లో బుల్లి ప్రిన్సెస్ అడుగుపెట్టింది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన గారాల పట్టికి ‘క్లింకారా’ అనే పేరు పెట్టారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అలాగే అమ్మవారి శక్తి రూపానికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు. ఈ గుణాలను పోగుచేసుకొని క్లీంకారా ఎదగాలని మెగా ఫ్యామిలీ ఈ పేరు పెట్టింది.
జూ. ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తారక్ - ప్రణీత దంపతులు తమ మెుదటి సంతానానికి అభయ్ రామ్ అనే పెట్టారు. రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని చివర్లో రామ్ వచ్చేలా పెట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తారక్ కూడా కొనసాగించడం విశేషం. అభయ్ అంటే భయం ఎరుగని వాడు అని అర్థం. ఇక భార్గవ్ రామ్ అంటే శ్రీరాముడు అనేక నామాల్లో ఇదీ ఒకటి.
అల్లు అర్జున్ (Allu Arjun)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. మగబిడ్డకు అల్లు అయాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లకు అల్లు అర్హా అని నామకరణం చేశారు. అయాన్ అంటే దివ్యమైనది (సంస్కృతి), దేవుని బహుమతి (అరబిక్), గుర్తుపెట్టుకోవాల్సింది (పర్షియన్) అని అర్థం. అలాగే అర్హా అంటే 'శివం' అని మీనింగ్ వస్తుంది. ఇస్లామిక్ అర్థాన్ని తీసుకుంటే ప్రశాంతమైన, నిర్మలమైన అని సూచిస్తుందట.
నాని (Nani)
నేచురల్ స్టార్ నాని దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పేరు అర్జున్. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటారు. అర్జున్ అంటే సంస్కృతం నుంచి వచ్చిన హిందూ పేరు. పాండవుల్లో ఒకరైన అర్జునుడు గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితీన్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడి పేరును నితిన్ ఎక్కడా రివీల్ చేయలేదు.
మంచు మనోజ్ (Manchu Manoj)
నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. దేవసేన అంటే హిందూ దేవత. దేవతల సైన్యాధిపతిగా పురణాల్లో ఆ పేరును ప్రస్తావించారు. కాగా, ఇరుకుటుంబాల అంగీకారంతో గతేడాది మనోజ్ - మౌనిక వివాహం జరిగింది. మౌనికకు అప్పటికే మెుదటి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు.
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ధీరా సిద్ధార్థ్ అని పేరు పెట్టారు. ధీర అంటే గొప్ప వీరుడు అని అర్థం.
సుహాస్ (Suhas)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన బిడ్డకు తాను పేరు పెట్టనని సుహాస్ గతంలో తెలిపారు. తన హీరోగా చేసిన ‘కలర్ ఫొటో’ డైరెక్టర్‌కు పేరు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. మరి ఏ పేరు పెట్టారో సుహాస్ అనౌన్స్ చేయలేదు.
రణ్‌వీర్ - దీపికా (Ranveer Singh - Deepika Padukone)
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సెప్టెంబర్‌లో దీపికా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు దువా పదుకొణే సింగ్ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానమే ఈమె అంటూ దీపికా నవంబర్ 2న స్పెషల్ పోస్టు పెట్టింది.
రణ్‌బీర్ - అలియా (Ranbir Kapoor - Alia Bhatt)
బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ 2022లో పేరెంట్స్ అయ్యారు. ఓ కూతురుకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు రాహా అనే పేరు పెట్టారు. రాహా అంటే పీస్‌ఫుల్, హ్యాపీనెస్ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
విరాట్ - అనుష్క (Virat Kohli - Anushka Sharma)
భారత స్టార్ కపుల్ విరాట్-అనుష్కలు ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తమ మగ బిడ్డకు ‘అకాయ్’ అనే పేరు పెట్టారు. అకాయ్ అంటే సంస్కృతంలో నిరాకారమని, రూపం లేనిదని అర్థం. టర్కీ భాషలో మెరుస్తున్న చంద్రుడు అని కూడా అంటారు. ఇక తమ మెుదటి కుమార్తెకు దుర్గాదేవి పేరు వచ్చేలా ‘వామిక’ అని విరుష్క దంపతులు పేరు పెట్టారు.
యామి గౌతమ్ (Yami Gautam)
బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏ
డాది మేలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్ దంపతులు తమ బిడ్డకు వేదవిద్ అని పేరు పెట్టారు. వేదవిద్ అంటే వేదాలు బాగా తెలిసినవాడు అని అర్థం.
అమలా పాల్ (Amala Paul)
తమిళ స్టార్ నటి అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమలాపాల్ - జగత్ దేశాయ్ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ఇలాయ్ అని పేరు పెట్టారు. తమిళంలో ఇలాయ్ అంటే ఆకు (Leaf) అని అర్థం. హీబ్రూలో లాంగ్వేజ్‌లో ఆరోహణ అని కూడా అర్థం వస్తుంది.
నవంబర్ 12 , 2024
Rahasyam Idham Jagath Review: తెలుగు ఫస్ట్ మల్టీ యూనివర్స్ ఫిల్మ్.. ‘రహస్యం ఇదం జగత్’ మెప్పించిందా?
నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ ఖండాల, ఆది నాయుడు, శివ జుటూరి తదితరులు
డైరెక్టర్ : కోమల్ ఆర్. భరద్వాజ్
సంగీతం: గ్యానీ
సినిమాటోగ్రాఫర్ : టేలర్ బ్లూమెల్
ఎడిటిర్: ఛోటా కె. ప్రసాద్
నిర్మాత: హిరణ్య, పద్మ, కోమల్ ఆర్. భరద్వాజ్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idham Jagath Review). సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాణంలో కోమల్ ఆర్ భరద్వాజ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నేడు (నవంబర్ 8)న థియేటర్స్‌లోకి వచ్చింది. టైం ట్రావెల్, మల్టీ యూనివర్స్ కథాంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్‌లో ప్రచారం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
కథ అమెరికా (Rahasyam Idham Jagath Review)లో జరుగుతుంటుంది. అకీరా (స్రవంతి), ఆమె లవర్ అభి (రాకేష్) ఇండియా వెళ్లాలని ఫిక్స్ అవుతారు. వెళ్లేముందు పాత ఫ్రెండ్స్ (విశ్వ, కల్యాణ్, అరు)తో ఓ ట్రిప్‌కు వెళ్తారు. అలా ఓ అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడికి అకీరా మాజీ లవర్ విశ్వ కూడా వస్తాడు. మంచు కారణంగా బుక్ చేసుకున్న హోటల్‌లోనే వారంత రాత్రి స్టే చేయాల్సి వస్తుంది. అకీరా స్నేహితుల్లో ఒకరైన సైంటిస్ట్ అరు మల్టీ యూనివర్స్‌పై రీసెర్చ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే ఓ విషయమై గొడవ జరిగి అకీరా, కల్యాణ్‌ను అభి చంపేస్తాడు. అదే సమయంలో మల్టీ యూనివర్స్‌కి వెళ్లే దారి తాము ఉన్న ఊళ్లోనే ఉందని అరు చెబుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ను మళ్లీ బ్రతికించడం కోసం అభి మల్టీ యూనివర్స్‌లోకి తీసుకెళ్లే వామ్ హోల్ కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వామ్ హోల్‌ను అభి కనిపెట్టాడా? ఫ్రెండ్స్‌ను బతికించుకున్నాడా? అభి, అకీరా ఇండియాకు వెళ్లారా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
గతంలో అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్‌తో (Rahasyam Idham Jagath Review) మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాడు. వామ్ హోల్‌లోకి ట్రావెల్ చేసే వ్యక్తిగా అదరగొట్టాడు. అకీరా పాత్రలో స్రవంతి మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు బాగా సూట్ అయ్యింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో మెప్పించాడు. నెగిటివ్ పాత్రలో కార్తీక్ కూడా బాగా చేసాడు. షూటింగ్ మెుత్తం అమెరికాలో జరగడం, అక్కడే నటనలో ట్రైనింగ్ తీసుకోవడంతో హాలీవుడ్ చిత్రాల ప్రభావం నటీనటుల్లో స్పష్టంగా కనిపించింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ హాలీవుడ్ చిత్రాలైన ’ఇన్సెప్షన్’ (Inception), ‘ఇంటర్‌స్టెల్లార్’ (Interstellar)ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడి జనాలకు కనెక్ట్ కావడానికి మన పురణాల్లోని కొన్ని సంఘటనలను ఉదాహరణ చూపించడం ఆకట్టుకుంది. శ్రీ చక్రానికి, మల్టీ యూనివర్స్‌కు దారితీసే వామ్ హోల్‌తో లింకప్ చేసిన విధానం ఆసక్తి రేపుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్, అక్కడ వారి మధ్య గొడవలు చూపించిన దర్శకుడు ఇంటర్వెల్‌కు ముందు మల్టీయూనివర్స్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్‌లో వామ్ హోల్ కోసం అభి అన్వేషణ, దాని ద్వారా టైం ట్రావెల్ చేసి ఫ్రెండ్స్‌ను కాపాడటం చూపించారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమెరికన్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం, డైలాగ్స్ మన నేటివిటీకి దూరంగా ఉండటం మైనస్‌లుగా నిలిచాయి.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Rahasyam Idham Jagath Review) సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్స్‌ను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్స్‌ని డామినేట్ చేసే విధంగా ఉంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. డబ్బింగ్ కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా చెప్పిస్తే బెటర్‌గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
మల్టీ యూనివర్స్ కథపురాణాలతో లింకప్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
హాలీవుడ్ చిత్రాల ప్రభావంఫస్టాఫ్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
నవంబర్ 08 , 2024
Janaka Aithe Ganaka Review: కండోమ్ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?
నటీనటులు : సుహాస్, సంకీర్తన విపిన్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు
రచన, దర్శకత్వం : సందీప్ రెడ్డి బండ్ల
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా చేసింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ రిలీజ్ కానుండగా రెండ్రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి వ్యక్తి. తండ్రి తనకు బెస్ట్ ఇవ్వలేకపోవడంతో తాను మాత్రం తన పిల్లలకి అన్నీ విషయాల్లో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. రూ.30 వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్థోమత లేకపోవడంతో పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ప్రసాద్ భార్య (సంగీత విపిన్) కూాడా ఇందుకు అంగీకరిస్తుంది. ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోతాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని భావించిన ప్రసాద్ సదరు కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రసాద్ లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? ఈ కేసు ప్రసాద్ గెలిచాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
మధ్యతరగతి హీరో పాత్రలో మరోమారు సుహాస్ అదరగొట్టాడు. తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించేశాడు. పిల్లలు వద్దు అని మంకు పట్టు పట్టిన వాడు తండ్రైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రసాద్ భార్య పాత్రలో సంకీర్తన అద్భుత నటన కనబరిచింది. భర్త చెప్పిన మాటను జవదాటని ఇల్లాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు సైతం మెప్పిస్తాయి. నటీనటులు అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
https://twitter.com/TheAakashavaani/status/1843884507679863162
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల వంద మార్కులు కొట్టేశాడు. రొటిన్ సినిమాలకు భిన్నంగా కొత్తగా మూవీని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. సాధారణ మధ్యతరగతి వాడి బతుకు ఎలా ఉంటుంది? పెళ్లైన తరువాత వాడు పడే తిప్పల్ని, ఖర్చుల్ని లెక్కలతో సహా కళ్లకి కట్టారు. అయితే బిడ్డ కడుపులో పడ్డాక వచ్చే కొన్ని సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. పిల్లలు వద్దనుకునే జంటకు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. అటు కోర్టు సన్నివేశాలను సైతం ఎంతో సరదాగా తెరకెక్కించి ఆడియన్స్‌కు గిలిగింతలు పెట్టారు దర్శకుడు. కొన్ని కోర్టు సీన్లు, పిల్లల ఖర్చుల విషయంలో లాజిక్‌లు మిస్ అయినా కామెడీతో వాటిని నెట్టుకొచ్చేశారు. ఊహాకందేలా కథనం సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
కథలో కొత్తదనంసుహాస్ నటనకామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
మెరుపులు లేకపోవడంఊహాజనితంగా స్టోరీ సాగడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024