• TFIDB EN
  • బ్లింక్
    UATelugu2h 16m
    పీజీలో ఫెయిలైన అపూర్వ (దీక్షిత్‌ శెట్టి) పార్ట్ టైమ్‌ జాబ్‌ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో పడతాడు. తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్‌ అపూర్వ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కనురెప్పల్ని మూయడం ద్వారా అతడు టైమ్‌ ట్రావెల్‌లో ముందుకు, వెనక్కి వెళ్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Kannada )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    ఇన్ ( Telugu )
    Watch
    తారాగణం
    ధీక్షిత్ శెట్టి
    చైత్ర జె ఆచార్
    మందార బత్తలహళ్లి
    గోపాలకృష్ణ దేశ్‌పాండే
    వజ్రధీర్ జైన్
    సురేష్ అనగలి
    కిరణ్ నాయక్
    సౌమ్యశ్రీ మర్నాడు
    యశస్విని రావు
    మురళి శృంగేరి
    భరత్ కె తుమకూరు
    తేజేష్ SM
    నాగరాజ్ రావు
    సిబ్బంది
    శ్రీనిధి బెంగళూరుదర్శకుడు
    రవిచంద్ర AJనిర్మాత
    ప్రసన్న కుమార్ MSసంగీతకారుడు
    శ్రీనిధి బెంగళూరుకథ
    అవినాశ శాస్త్రిసినిమాటోగ్రాఫర్
    సంజీవ్ జాగీర్దార్ఎడిటర్ర్
    కథనాలు
    <strong>This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!</strong>
    This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!
    థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్‌ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు స్వాగ్‌ (Swag) వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ కీలక పాత్రలు పోషించారు.&nbsp; చిట్టి పొట్టి (Chitti Potti) రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ&nbsp; చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; దక్షిణ (Dakshina) తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తుల‌సిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియ‌ల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్‌గా సాయిధ‌న్సిక ఇందులో కనిపించనున్నారు.&nbsp; కలి (Kali) ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘కలి’ (Kali). ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; బహిర్భూమి (Bahirbhoomi) నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని&nbsp; మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) ప్రముఖ నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్‌ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; బ్లింక్‌ (Blink) ‘దసర’ ఫేమ్‌ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'బ్లింక్‌'. మేలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.&nbsp; ఆహా వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; కళింగ (Kalinga) ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్‌ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan&nbsp;MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers&nbsp;SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
    సెప్టెంబర్ 30 , 2024
    Nupur Sanon: బ్లాక్ శారీలో నుపూర్ నడుమందాలను చూసి తట్టుకోగలరా? 
    Nupur Sanon: బ్లాక్ శారీలో నుపూర్ నడుమందాలను చూసి తట్టుకోగలరా? 
    బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్‌ సనన్‌.. మరోమారు సోషల్‌ మీడియాలో తళతళ మెరిసిపోయింది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లను ఊర్రూతలూగించింది. https://twitter.com/MoviesUpdatez/status/1760945753596576055 నల్లటి శారీలో దగ దగ మెరుస్తూ నుపుర్‌ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.. తన ఒంపుసొంపులతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది.&nbsp;&nbsp; బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్‌ సనన్‌.. ‘టైగర్ నాగేశ్వర్‌’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది.&nbsp; రవితేజతో పోటీపడి మరి నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్‌కు నుపుర్‌ స్వయాన సోదరి. View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) నుపుర్‌.. 2019లో వచ్చిన ‘ఫిల్హాల్‌’ అనే ప్రైవేటు ఆల్బమ్‌ సాంగ్‌లో కనిపించింది.&nbsp; ఆ పాటలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సరసన డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది.&nbsp; తర్వాత 'పాప్‌ కౌన్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి నుపుర్‌ అందరి దృష్టిలో పడింది.&nbsp; ప్రస్తుతం హిందీలో 'నూరానీ చెహ్రా' అనే సినిమాలో నుపుర్‌ నటిస్తోంది.&nbsp; యంగ్‌ హీరో నవాజుద్దీన్‌ సిద్ధిఖీకు జోడీగా ఆమె తెరను పంచుకుంటోంది. నుపుర్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్‌ 15, 1993లో డిల్లీలో జన్మించింది.&nbsp; ఈ భామకు బాలీవుడ్‌లో షారుఖ్‌, హృతిక్‌, వరుణ్‌ ధావన్‌ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్స్‌లో అక్క కృతి సనన్‌తో పాటు దీపికా, జాక్వెలిన్‌, ప్రియాంక చోప్రా అంటే ఇష్టమట. సినిమాల్లో ‘తాల్‌’, ‘దిల్‌ చాహతా హై’, ‘3 ఇడియట్స్‌’ మూవీస్‌ అంటే నుపుర్‌కు ప్రాణమట. నుపుర్‌ స్వతహాగా సింగర్ కూడా. ఆమె అద్భుతంగా పాటలు పాడగలదు.&nbsp; గాయకుల్లో మహ్మద్‌ రఫీ, సునీధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌, సోను నిగమ్‌, రెహమాన్‌ అంటే ఇష్టమట. ఇక ‘టైగర్‌ నాగేశ్వరరావు’ హిట్‌ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. ప్రస్తుతం హిందీలో ‘నురానీ చెహ్రా’ అనే చిత్రంలో నుపుర్‌ నటిస్తోంది.&nbsp;
    ఫిబ్రవరి 24 , 2024
    Tamannaah Bhatia: బ్లాక్‌ శారీలో కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ!
    Tamannaah Bhatia: బ్లాక్‌ శారీలో కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ!
    మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అంద చందాలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.&nbsp; బ్లాక్‌ శారీలో తెల్లటి అందాలు ఆరబోసిన ఈ భామ.. యంగ్‌ హీరోయిన్లకు తానేమాత్రం తీసిపోనని చెప్పకనే చెబుతోంది.&nbsp; తమన్నా ఇండస్ట్రీకి పరిచయమై 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.&nbsp; https://twitter.com/i/status/1734496218007707743 మెుదట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది.&nbsp; ఈ ఏడాది చిరంజీవితో చేసిన ‘భోళాశంకర్‌’ చిత్రం నిరాశ పరిచినా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’తో ఈ భామ ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; అయితే జైలర్‌ విజయం తర్వాత తమన్నాకు ఆ స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు గురవుతున్నారు.&nbsp; ప్రస్తుతం తమిళంలో ‘అరణ్మణై-4’ చిత్రంతో పాటు ‘హిందీ’లో వేద సినిమాలో తమన్నా నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది. ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది. తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.&nbsp; ఇప్పటికే 11th అవర్,&nbsp; నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ సిరీస్‌లతో తమన్నా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాదిలో ‘జీ కర్డా’, ‘ఆఖ్రీ సచ్‌’ వంటి సిరీస్‌లలో కనిపించి మెప్పించింది. ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే వ్యాపార రంగంపైనా ఈ భామ దృష్టి సారిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ భారీ మెుత్తంలో సంపాదిస్తోంది.&nbsp; మరోవైపు భాయ్‌ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో షికార్లు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే సోషల్‌ మీడియాలో తన గ్రామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇస్తోంది.&nbsp;
    డిసెంబర్ 12 , 2023
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఏ డ్రెస్‌ వేసుకుని ఫొటో షూట్ చేసినా… ఆరోజు సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురవాల్సిందే. తాజాగా పూనమ్ బజ్వా మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ.. నాభిని ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. నడుము అందాలతో కుర్రకారుకు హుషారెక్కిస్తోంది. చేతులు పైకి లేపి నాభి అందాలను సంపూర్ణంగా చూపించి రెచ్చిపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కొద్ది నెలల నుంచి ఈ సుందరి హద్దులు దాటి సోయగాల ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు బీచ్‌లో బికినీ అందాలతో మత్తెక్కిస్తోంది పూనమ్. పూనమ్ 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'మొదటి సినిమా'తో తెరంగ్రేటం చేసింది. తర్వాత నాగ్ సరసన బాస్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసినప్పటికీ అవకాశాలు తలుపు తట్టలేదు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటంతో తమిళ్‌, మళయాళం చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్‌లో రెండు ఐటెమ్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ చిన్నది. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఈ హీరోయిన్‌కు పెద్దగా హిట్లు రాకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమాలతో ఆకట్టుకోలేకపోయినా అందచందాలు ప్రదర్శించి యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది పూనమ్. గత కొద్ది నెలలుగా వరుసగా హాట్‌ లుక్స్‌తో ఫొటోలు పెట్టి సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది ఈ అమ్మడు. మూడు పదులు దాటిన వయసులోనూ తనలో అందాల ఎసరు ఎమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది
    అక్టోబర్ 27 , 2023
    Pooja Hegde: బ్లాక్‌ శారీలో స్కిన్‌ షో చేసిన పూజా.. నడుము అందంతో నలిపేస్తున్న బ్యూటీ!
    Pooja Hegde: బ్లాక్‌ శారీలో స్కిన్‌ షో చేసిన పూజా.. నడుము అందంతో నలిపేస్తున్న బ్యూటీ!
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మే 18 , 2023
    రామ్‌ చరణ్‌ రిజెక్ట్‌ చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుసా?
    రామ్‌ చరణ్‌ రిజెక్ట్‌ చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుసా?
    ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్‌ అవుతాయి కానీ అన్నీ తెరమీదకు రావు. రకరకాల కారణాలతో ఆగిపోతాయి. సీనియర్‌ హీరోల నుంచి నేటి తరం హీరోల వరకూ అందరి కెరీర్‌లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు పూర్తిగా అటకెక్కితే కొన్ని మాత్రం వేరే హీరోలతో వస్తాయి. కొన్ని బ్లాక్‌ బస్టర్లు అవుతాయి. మరికొన్ని అట్టర్‌ ఫ్లాపులుగా మిగులుతాయి. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ఇలాంటి సినిమాలేంటో ఓ సారి చూద్దాం. మెరుపు అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్‌ అంతా ఇంతా కాదు. రామ్‌ చరణ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడన్న వార్తతో అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమా తీసిన దర్శకుడు ‘ధరణి’ ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. మెగా సూపర్‌ గుడ్‌ మూవీస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత అటకెక్కింది. దీంతో అదే బ్యానర్‌లో రామ్‌ చరణ్‌ ‘రచ్చ’ సినిమా చేశారు. రామ్‌ చరణ్- కొరటాల శివ రామ్‌ చరణ్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సింది కానీ స్క్రిప్ట్‌ సరిగా పూర్తి కాక ఈ సినిమా ఆగిపోయింది. అయితే కొరటాల శివతో రామ్‌ చరణ్‌ తప్పకుండా ఓ సినిమా చేస్తారని అంటుంటారు. శ్రీమంతుడు కొరటాల ‘శ్రీమంతుడు’ కథను కూడా రామ్‌ చరణ్‌కు వినిపించాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో ఈ సినిమా తెరకెక్కించగా సూపర్‌ హిట్‌గా నిలిచింది. రామ్‌ చరణ్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా శ్రీమంతుడుకు నో చెప్పారు. సూర్య s/o కృష్ణన్‌ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ సూపర్‌ హిట్‌ మూవీ సూర్య s/o కృష్ణన్‌ కోసం మొదట రామ్‌ చరణ్‌ను సంప్రదించారట. కానీ అప్పటికే రాజమౌళి మగధీరతో బిజీగా ఉన్న రామ్‌ చరణ్‌ ఈ సినిమా చేయలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. రామ్‌ చరణ్‌కు ‘మగధీర’ స్టార్‌ ఇమేజ్‌ను తీసుకురావడమే గాక అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. https://telugu.yousay.tv/a-record-breaking-game-changer-first-look-poster.html లీడర్‌ శేఖర్‌ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘లీడర్‌’. రానా తెరంగేట్రం చేసిన ఈ సినిమా కూడా తొలుత రామ్‌ చరణ్‌ దగ్గరికే వెళ్లిందట. కానీ రామ్‌ చరణ్‌ ఈ కథను తిరస్కరించాడు. డార్లింగ్‌ అప్పటిదాకా మాస్‌ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్‌ను అమ్మాయిలకు ‘డార్లింగ్‌’ను చేసిన సినిమా ఇది. కరుణాకర్‌ మార్క్‌ లవ్‌ స్టోరీ, GV ప్రకాశ్ కుమార్‌ సెన్సేషనల్‌ మ్యూజిక్‌తో ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌ అయింది. ఇది కూడా రామ్‌ చరణ్‌ రిజెక్ట్‌ చేసిన సినిమాల్లో ఒకటి. కృష్ణం వందే జగద్గురుమ్‌ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ప్రయోగాత్మక, కళా విలువలు ఉన్న సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టిన పేరు రానానే ఈ సినిమాలోనూ నటించాడు. తొలుత ఈ సినిమా రామ్‌ చరణ్‌ దగ్గరకు వెళ్లినా రిజెక్ట్ చేశాడట. https://telugu.yousay.tv/virat-kohli-biopic-will-ram-charan-be-set-as-virat-kohli-the-story-climax-directors-of-the-movie-are-all-uproar-on-the-net.html ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శంకర్‌ RC15లో నటిస్తున్నాడు. సినిమా టైటిల్‌ కూడా ‘గేమ్‌ చేంజర్‌’గా ఫిక్స్‌ చేశారు. ఇది పక్కా శంకర్‌ స్టైల్ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ ఇందులో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు.
    ఏప్రిల్ 01 , 2023
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం: &nbsp;సుశిన్&nbsp; శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇక్క‌డ కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టనుందా? అసలు ఈ చిత్ర కథేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ నడుపుతుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్.. 150 అడుగులకు పైగా లోతున్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? పోలీసులు, ఫైర్ సిబ్బంది కాకుండా సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా? అన్న‌ది కథ. ఎవరెలా చేశారంటే కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అహ్లాదకరమైన సన్నివేశాల్లోనూ.. ఉత్కంఠభరిత సీన్లలోనూ చక్కగా నటించి ఒదిగిపోయారు. ఓ నిజమైన స్నేహితుల బృందాన్ని తెరపై చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కల్పించడంలో వారంతా సక్సెస్‌ అయ్యారు. ఇక లోయలో చిక్కుకున్నప్పుడు షాబిన్‌ షాహిర్‌, సుభాష్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ దశలో ఇదంతా నిజమేమోనన్న భావనను కలిగిస్తుంది. తెర కనిపించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? 2006లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌.. క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నమన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలిగేలా దర్శకుడు క‌థ‌ను న‌డిపించాడు. విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. మంజుమ్మ‌ల్ గ్యాంగ్ చేసే అల్లరితో డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. సుభాష్.. లోయలో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఉత్కంఠభరితంగా మారుతుంది. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్‌ తెరకెక్కించారు. సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్‌ యూత్‌కు మినహా మిగిలిన వయసుల వారికి అంతగా కనెక్ట్‌ కాకపోవచ్చు. చివరిగా చక్కటి ముగింపుతో డైరెక్టర్‌ చిదంబరం అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కించేలా చేశారు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. డైరెక్టర్‌, నటీనటుల తర్వాత ఎక్కువ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌ షైజు ఖలీద్‌కు ఇవ్వాల్సిందే. కేవ్‌ సెటప్‌ను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. నిజంగా ఒక కేవ్‌లో ఉన్నామన్న ఫీలింగ్‌ను తన కెమెరా పనితనంతో ఆడియన్స్‌లో&nbsp; కలిగించాడు. అలాగే నేపథ్యం సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథఉత్కంఠరేపే సెకండాఫ్‌సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3.5/5
    ఏప్రిల్ 06 , 2024
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్‌ బాగుంటే మరో భాషలోకి రిమేక్‌ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్‌ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) టాలీవుడ్‌లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్‌ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్‌, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.&nbsp; ఒక్కడు (Okkadu) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్‌ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్‌ చేయగా.. కన్నడలో 'అజయ్‌' పేరుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punit Raj Kumar) నటించాడు.&nbsp; మర్యాద రామన్న (Maryada Ramanna) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్‌ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వర్షం (Varsham) ప్రభాస్‌ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'వర్షం'. శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్‌’ (2004), తమిళంలో ‘మజాయ్‌’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.&nbsp; ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్‌ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్‌ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. పోకిరి (Pokiri) మ‌హేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాష‌ల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్‌ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్‌ ఖాన్ హీరోగా 'వాంటెడ్‌' (2009), కన్నడలో దర్శన్‌ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.&nbsp; డార్లింగ్‌ (Darling) ప్రభాస్‌ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్‌&nbsp; హీరోగా 'బుల్‌బుల్', హిందీలో 'సబ్సే బధాకర్‌ హమ్‌' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.&nbsp; విక్రమార్కుడు (Vikramarkudu) రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్‌’ (2012), బంగ్లాదేశ్‌ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్‌ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.&nbsp; మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది.&nbsp;కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్‌', ఒడియాలో 'బిశ్వంత్‌'&nbsp; పేర్లతో రిలీజ్‌ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే వెంక‌టేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది. త‌మిళం, బెంగాలీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది. అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.
    మార్చి 23 , 2024
    APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!
    APRIL 28: తెలుగు చిత్ర పరిశ్రమకు బ్లాక్‌బస్టర్‌ డే…. కానీ, అక్కినేని అఖిల్‌కు మాత్రం కాదు!
    ఏప్రిల్ 28…. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసొచ్చిన రోజు. టాప్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టాయి. ఈ సెంటిమెంట్‌తోనే అఖిల్‌ ఏజెంట్‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ, దారుణమైన టాక్‌తో ఫ్లాప్‌ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ తేదీన అప్పట్లో విడుదలైన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.&nbsp; అడవి రాముడు నందమూరి తారకరామరావు నటించిన అడవి రాముడు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటకు జయప్రద, ఎన్టీఆర్ చేసిన డాన్స్‌ ఇప్పటికీ ఫేమస్. 366 రోజులు థియేటర్లలో ఈ సినిమా ఆడింది. యమలీల కమెడియన్ ఆలీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్‌తో పాటు చిత్రగుప్తుడు, యమధర్మరాజు క్యారెక్టర్లతో కామెడీ పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా 100 రోజులు థియేటర్లలో ఆడింది. అంతేకాదు, ఇందులో నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అంటూ వచ్చే సాంగ్‌ ప్రేక్షకుల నోళ్లలో ఇప్పటికీ నానుతుంది. 1994లో ఏప్రిల్ 28న వచ్చింది.&nbsp; పోకిరి&nbsp; పూరీ జగన్నాథ్, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ కమ్ పోలీస్‌ రోల్‌లో మహేశ్ యాక్షన్ ఇరగదీశాడు. పూరీ మార్క్ డైలాగ్స్‌ యాక్షన్‌తో సినిమా నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లిపోయింది. రూ. 10 కోట్లు పెట్టి తీస్తే రూ. 66 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో 100 డేస్‌ ఆడింది ఈ సినిమా. ఏప్రిల్ 28, 2006లో విడుదలయ్యింది.&nbsp; బాహుబలి 2 దేశవ్యాప్తంగా బాహుబలి 2 మేనియా కొనసాగింది. ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్‌లను షేక్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్‌తో రూ. 1800 కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది. హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఈ సినిమాతోనే.&nbsp; ఏజెంట్‌ పెద్ద సినిమాలు రిలీజై హిట్‌ కొట్టిన రోజున సెంటిమెంట్‌గా అక్కినేని అఖిల్‌ కూడా ఏజెంట్ సినిమాతో వచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నిర్మాతలు ఇలా అనుకుంటున్న కారణంగా డేట్ ఫిక్స్ చేశామని వెల్లడించాడు. కానీ, సరైన కథ లేకపోతే ఏ సెంటిమెంట్ వర్కౌట‌్ కాదు. ఏజెంట్ అట్టర్‌ ప్లాప్ కావటమే ఇందుకు నిదర్శనం.
    ఏప్రిల్ 28 , 2023
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    ‘One Powerful Scene’ that Carried the Entire Movie: ఈ సినిమాలను బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలబెట్టిన సన్నివేశాలు ఇవే!
    కథను మలుపు తిప్పే సీన్లు ప్రతీ సినిమాలోనూ కచ్చితంగా ఉంటాయి. అయితే కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. సాధారణంగా సాగిపోతున్న కథకు అవి బూస్టర్స్‌లాగా పనిచేస్తాయి. కథ గమనాన్ని మార్చి.. ప్రేక్షకుల అటెన్షన్‌ను తిరిగి సినిమాపై మళ్లేలా చేస్తాయి. అయితే ఇలాంటి సీన్లు ఒకే విధంగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. కథ అవసరాన్ని బట్టి డైరెక్టర్లు ఆ సీన్లను కామెడీ, యాక్షన్‌, సెంటీమెంట్‌ జానర్లలో ఎంచుకుంటూ ఉంటారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ సీన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సలార్‌ (Salaar) ప్రభాస్ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ మాత్రం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాకేజీలా అనిపిస్తుంది. ప్రభాస్‌ గురించి నటి శ్రియా రెడ్డి ఇచ్చే ఎలివేషన్స్‌ మెప్పిస్తాయి.&nbsp; https://twitter.com/i/status/1760698195787870606 ఆర్‌ఆర్‌ఆర్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గ్లోబల్‌ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. బ్రిటీష్‌ బంగ్లాలోకి తారక్‌ జంతువులతో ప్రవేశించే సీన్‌ హైలేట్‌ అని చెప్పవచ్చు. అటు తారక్‌ - రామ్‌చరణ్‌ ఫైటింగ్‌ కూడా మెప్పిస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1758341886304284738 బాహుబలి 2 (Bahubali 2) బాహుబలి 2లో ప్రతీ సీనూ.. ఓ అద్భుతమే అని చెప్పవచ్చు. అయితే ఇంటర్వెల్‌కు ముందు వచ్చే రానా పట్టాభిషేకం సన్నివేశం మాత్రం ప్రేక్షకలకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. రానా చక్రవర్తిగా పట్టభిషేకం చేసుకున్న తర్వాత ప్రభాస్ సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ అదరహో అనిపిస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=TloNJQKZiFg జెర్సీ (Jersey) నేచురల్‌ స్టార్‌ నాని తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రాల్లో జెర్సీ ముందు వరుసలో ఉంటుంది. కొడుకు కోరిక మేరకు తిరిగి బ్యాట్‌ పట్టిన నాని.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. తన కల నెరవేరిన సమయంలో ట్రైన్‌ వెళ్తుండగా నాని అరిచే సీన్‌.. వీక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=UXPR1I8sYnw రేసుగుర్రం (Race Gurram) అల్లుఅర్జున్ (Allu Arjun) హీరోగా సురేందర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం (రేసుగుర్రం). అయితే ఈ చిత్ర విజయంలో బ్రహ్మీ (Brahmanandam) పాత్ర కూాడా కాస్త ఎక్కువగానే ఉంది. క్లైమాక్స్‌లో కిల్‌బిల్‌ పాండే పాత్రతో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బ్రహ్మీ.. ఫ్రస్టేషన్‌తో ఉన్న పోలీసాఫీసర్‌గా నవ్వులు పూయించాడు. ఈ సినిమాలో కిల్ బిల్ సీక్వెన్స్‌ చిత్రానికే హైలెట్ https://www.youtube.com/watch?v=jxBLgrppzpc వేదం (Vedam) క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ (Allu Arjun), మంచు మనోజ్ (Manju Manoj), అనుష్క (Anushka) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’ (Vedam). ఇందులో బన్నీ.. కేబుల్‌ రాజు పాత్రలో అదరగొట్టాడు. అయితే ద్వితియార్థంలో ఓ వృద్దుడి నుంచి అల్లు అర్జున్‌ డబ్బులు కొట్టేసే సీన్‌ సినిమాలో హైలెట్‌ అని చెప్పవచ్చు. పెద్దాయన కూతురు కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బును.. ఆస్పత్రిలో బన్నీ ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాళ్లు పట్టుకొని బతిమాలగా.. వదిలించుకొని మరి వెళ్తాడు. అయితే తన తప్పును తెలుసుకొని బన్నీ డబ్బు తిరిగి ఇచ్చే సీన్‌ హృదయాలకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=XVGHRAdH2dk పోకిరి (Pokiri) మహేశ్‌ బాబు (Mahesh Babu), డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఎన్ని రికార్డులు తిరగరాసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన మహేశ్‌.. పోలీసు ఆఫీసర్ అని తెలియడంతో అంతా షాక్‌కు గురవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=PvkITH66FEc ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) అద్భుత సృష్టి ‘ఈగ’ (Eega) సినిమా. ఇందులో నాని (Nani), సమంత (Samantha), కన్నడ స్టార్‌ సుదీప్‌ (Sudeep) ప్రధాన పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్‌ విలన్ అయిన సుదీప్‌ను క్లైమాక్స్‌లో ఒక చిన్న ఈగ చంపే సీన్‌ ఆకట్టుకుంటుంది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=1SCFGWtXtDE ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas), రాజమౌళి కాంబినేషన్‌లో ఛత్రపతి సినిమా.. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ ఫ్యాన్స్ చేత విజిల్స్‌ వెేయిస్తుంది. ప్రభాస్‌ తొలిసారి విలన్లపై పిడికిలి బిగించే సీన్ అదరహో అనిపిస్తుంది. https://www.youtube.com/watch?v=eF5OVQcHfsc జనతా గ్యారేజ్‌ (Janatha Garage) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’లో తారక్‌ పవర్‌ ప్యాక్డ్‌ హీరోగా నటించాడు. మోహన్‌లాల్ నుంచి జనతా గ్యారేజ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చే తొలి ఫైట్‌ సీన్‌ మెప్పిస్తుంది. రాజీవ్‌ కనకాల సమస్యను తీర్చేందుకు తారక్‌ తన గ్యాంగ్‌తో వెళ్లి విలన్లకు బుద్ది చెప్తాడు. https://www.youtube.com/watch?v=FmAak259Its టెంపర్‌ (Temper) తారక్‌-పూరి కాంబోలో వచ్చిన టెంపర్‌ చిత్రంలో.. కోర్టు సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఓ రేప్‌లో విలన్ సోదరులు తప్పించుకోకుడదన్న ఉద్దేశ్యంతో తారక్‌ తాను ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంటాడు. ఈ ఊహించని పరిణామం ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుంది.&nbsp; https://twitter.com/i/status/1668264361469591558 https://twitter.com/i/status/1668264361469591558 విక్రమార్కుడు (Vikramarkudu) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో రవితేజ (Ravi Teja) ద్విపాత్రాభినయం చేశాడు. విక్రమ్‌ రాథోడ్‌ అనే పోలీసు ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రవితేజ (Ravi Teja) మధ్య వచ్చే సీన్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. https://www.youtube.com/watch?v=aorA5S083W4 మగధీర (Magadheera) రామ్‌చరణ్‌ (Ramcharan), రాజమౌళి (S S Rajamouli కాంబోలో వచ్చిన చిత్రం ‘మగధీర’. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ షేర్‌ఖాన్‌ పంపిన వందమంది సైనికులను చంపే సీన్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సీన్‌ సినిమాను మలుపు తిప్పుతుంది.&nbsp; https://www.youtube.com/watch?v=9NJya1B8mvI మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో వచ్చిన ‘మిర్చి’.. టాలీవుడ్‌లో పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో తండ్రిని బెదిరించిన విలన్‌ తరపు మనుషులకు ప్రభాస్‌ వార్నింగ్ ఇచ్చే ఆకట్టుకుంటుంది. https://www.youtube.com/watch?v=5aSph4tD8yQ ఆడవారి మాటలకు అర్థాలే&nbsp; ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో వెంకటేష్‌, కోటా శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ప్రేమ విషయం చెప్పేందుకు వెళ్లిన కోటా శ్రీనివాసరావును హీరోయిన్‌ త్రిష అనుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన అతడు నిద్రలోనే ప్రాణం విడిస్తాడు. తండ్రి శవం ముందు వెంకటేష్‌ పడిన బాధ.. ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=L26KInZYQcI ఇంద్ర (Indra) మెగాస్టార్‌ చిరంజీవి మరుపురాని చిత్రాల్లో ఇంద్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ప్రతీ సీను అద్బుతమే. ముఖ్యంగా చిరంజీవి పవర్‌ఫుల్‌ గతాన్ని రివీల్‌ చేసే ఇంటర్వెల్‌ సీన్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=I4JvUuSQh2I సింహాద్రి (Simhadri) రాజమౌళి దర్శకత్వంలో తారక్ హీరోగా చేసిన రెండో చిత్రం ‘సింహాద్రి’. ఇందులో తన అక్కను చంపిన విలన్లపై తారక్‌ ప్రతీకారం తీర్చుకునే సీన్‌ సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. తమను పట్టిపీడిస్తున్న రౌడీలను తారక్‌ చంపుతున్న క్రమంలో కేరళ ప్రజలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌గా అనిపిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=u0PlQ1J6EHo తులసి (Thulasi) బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన తులసి చిత్రంలో హీరో వెంకటేష్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. కోర్టు పరిసరాల్లో తండ్రికి వార్నింగ్‌ ఇచ్చిన విలన్లపై అతడు ప్రతీకారం తీర్చుకునే సీన్‌ నెవర్‌బీఫోర్ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/1Spz6cJ1ebk?si=_aVPwuSM3khOaPBS
    ఫిబ్రవరి 24 , 2024
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 
    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ&nbsp; వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియల సంస్కృతి, పరిస్థితులు కళ్లకు కట్టినట్లు అత్యంత భావోద్వేగంగా చూపించారు. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. లాస్‌ ఏంజెల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. గుండు గుత్తగా బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘దసరా’ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. నాని కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా… తొలిరోజే రూ.38 కోట్లు వసూలు చేసి&nbsp; ఈ సినిమా సంచలనం సృష్టించింది. సింగరేణి బొగ్గు గనుల్లో ఒక్కప్పుడు ఉన్న పరిస్థితులను శ్రీకాంత్‌ ఓదెల వెండితెరపై కళ్లకు గట్టాడు. తెలంగాణ భాష పరిమళంతో&nbsp; బ్లాక్‌బస్టర్‌ను కొట్టాడు. చిన్న సినిమాలతో మొదలై.. అప్పట్లో వెకిలి పాత్రలకే పరిమితమై తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో సినిమాలో చూపించడం చిన్న సినిమాలతోనే మొదలైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్‌ తెరకెక్కించిన ‘పెళ్లి చూపులు’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో తెలంగాణ యాసలోనే మాట్లాడిన విజయ్‌… బయట కూడా అదే తీరుతో అందరి మనసులూ ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి కూడా ఆ సినిమాలో మెప్పించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇండియన్‌ సినిమాలోనే ఓ నయా ట్రెండ్‌కు ‘అర్జున్‌ రెడ్డి’ తెరలేపింది. ఇలా తెలంగాణ యాస, సంస్కృతితో హిట్ కొట్టిన టాప్‌ మూవీస్‌ చాలానే ఉన్నాయి. ఫిదా లేడీ సూపర్‌ స్టార్‌ సాయి పల్లవి హీరోయిన్‌గా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన సినిమా ‘ఫిదా’. సినిమా షూటింగ్‌ మొదలుకుని టైటిల్‌ దాకా అంతా తెలంగాణమే. తెలంగాణ యాసలోనే రాసిన ‘వచ్చిండే’ పాట మొత్తం యూట్యూబ్‌నే షేక్‌ చేసింది. తెలంగాణ ప్రకృతి సౌందర్యాన్ని, పల్లెల అందాన్ని తెరమీద ఆవిష్కరించిన సినిమా ఇది. తొలుత ఈ సినిమాకు ‘ ముసురు’ అనే టైటిల్‌ అనుకున్నారట. ఈ నగరానికి ఏమైంది? పెళ్లి చూపులు తర్వాత తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. పక్కా హైదరాబాదీ కుర్రాళ్లు నలుగురిని తీసుకుని సింపుల్‌గా ఉండే ఈ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. విశ్వక్‌ సేన్‌, అభినవ్‌ పాత్రలు చాలా అద్భుతంగా పండాయి. డీజే టిల్లు 2022లో వచ్చిన డీజే టిల్లు గురించి అయితే అందరికీ తెలిసిందే. సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది. ఇందులో ప్రతి డైలాగ్‌ అదిరిపోయాయి. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండో పార్ట్‌ కూడా త్వరలోనే రాబోతోంది. మల్లేశం ఆసుయంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి తెలంగాణ మాండలికాన్ని మనసుకు హత్తుకునేలా పలికించాడు. చేనేతల జీవన స్థితిగతులను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. లవ్‌ స్టోరీ శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన మరో సినిమా ‘లవ్‌ స్టోరీ’. తెలంగాణ పల్లెటూరి పేదోళ్ల పరిస్థితితో పాటు కొన్ని సున్నితమైన విషయాలను స్పృశిస్తూనే శేఖర్ కమ్ముల మరోసారి&nbsp; తెలంగాణ పరిమళాన్నివెండితెరపై వెలుగులీనేలా చేశాడు. ఇస్మార్ట్ శంకర్‌ పూరి జగన్నాథ్‌, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ పూరీకి కమ్‌బ్యాక్‌ మూవీ అయ్యింది. రామ్‌ తెలంగాణ మాండలికంలో అదరగొట్టాడు. వరంగల్‌ పిల్లగా హీరోయిన్‌ నభా నటేశ్‌ అమితంగా ఆకట్టుకుంది. విరాట పర్వం నక్సలిజం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టిన సినిమా ‘విరాటపర్వం’. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కూడా విమర్శకుల ప్రసంసలు&nbsp;అందుకుంది. NBK108లోనూ.. నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావుపూడి కాంబినేషన్‌లో వస్తున్న NBK108లోనూ.. తెలంగాణ సంస్కృతినే కథ నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈసారి తెలంగాణ యాసలో బాలయ్య అలరించనున్నారు. ఆస్కార్‌ స్థాయికి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు కూడా తెలంగాణ యాసలో పలుకుతున్నారంటే తెలుగు సినిమా ట్రెండ్‌ ఎలా మారుతుందో తెలుస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన RRRలో ఎన్టీఆర్‌ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. ఆస్కార్ సాధించిన ‘నాటు నాటు’ సాహిత్యం కూడా తెలంగాణమే. ‘ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు’ అంటూ చంద్రబోస్‌ తెలంగాణ జీవన విధానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ‘తొక్కు’ అంటేనే వెక్కిరించి చూసే స్థాయి నుంచి అదే మాటతో ఉన్న పాటకు ఆస్కార్‌ వచ్చే స్థాయికి తెలంగాణం తెలుగు సినిమాలో చేరింది. నాటు నాటు మాత్రమే కాదు ఇటీవల తెలుగు సినిమాలో తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పాలి. ‘బలగం’లో కన్నీరు పెట్టించిన పాటలన్నీ కాసర్ల శ్యామ్ రాసినవే. కాసర్ల శ్యామ్‌ ఇప్పుడు టాప్‌ లిరిసిస్ట్‌గా ఎదుగుతున్నాడంటే మన యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతే.
    ఏప్రిల్ 01 , 2023
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    Hidimba Movie Review: ఊహకందని ట్విస్ట్‌లతో  ‘హిడింబ’.. మరి అశ్విన్‌బాబు బ్లాక్‌బాస్టర్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు. ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి సంగీతం:&nbsp; వికాస్ బాడిస‌ ఛాయాగ్ర‌హ‌ణం: &nbsp;బి.రాజ‌శేఖ‌ర్‌ నిర్మాత‌: &nbsp;గంగప‌ట్నం శ్రీధ‌ర్‌ విడుద‌ల తేదీ: &nbsp;20-07-2023 టాలీవుడ్ యువదర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆసక్తిరేపే కథాంశాన్ని సినిమాగా ఎంచుకొని బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్ష, బలగం, బేబి సినిమాలే ఇందుకు ఉదాహరణ. కాగా, తాజాగా విడుదలైన ‘హిడింబ’ సైతం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే ఉద్దేశంతో తెరకెక్కింది. అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ఇది. టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టం, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని స‌మ‌ర్పిస్తుండ‌టంతో ప్రేక్ష‌కుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ఈ ‘హిడింబ’ క‌థేంటి? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; క‌థేంటి&nbsp; అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. వీళ్లిద్ద‌రూ ఓ కేసు విష‌య‌మై మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాల్సి వస్తుంది. న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేస‌ది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. అయినప్పటికీ కిడ్నాప్‌లు ఆగవు. ఈ నేపథ్యంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేర‌స్థుడెవ‌రు? అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగ‌కు ఈ క‌థ‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.. ఎవ‌రెలా చేశారంటే న‌టుడిగా అశ్విన్‌ను మ‌రో మెట్టు పైకి ఎక్కించే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం ఆయ‌న మేకోవ‌ర్ అయిన తీరు ఆక‌ట్టుకుంటుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లోనూ, ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్ర‌లో నందితా న‌టించింది. ప్ర‌థ‌మార్థంలో ఓ పాట‌లో రొమాంటిక్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు.&nbsp; ర‌ఘు కుంచె, సంజ‌య్ స్వ‌రూప్‌, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ఎలా సాగిందంటే టైటిల్స్ కార్డ్స్‌తోనే ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి&nbsp; నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. న‌గ‌రంలో అమ్మాయిలు వ‌రుస‌గా కిడ్నాప్ అవ్వ‌డం, ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్య‌ను రంగంలోకి దింప‌డం.. ఇలా చ‌క‌చ‌కా క‌థ ప‌రుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి సినిమా ఒక్క‌సారిగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా మారిపోతుంది. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌దు. మ‌ధ్య‌లో ఓ పాట‌తో నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. దాంట్లో పెద్ద‌గా ఫీల్ క‌నిపించ‌దు. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్‌. హీరోలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే ఎపిసోడ్ అది. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో ఉన్నా ముగింపు సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. డైరెక్షన్‌ &amp; టెక్నికల్ అంశాలు ద‌ర్శ‌కుడు అనిల్ క‌న్నెగంటి ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నమున్నా, దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నా, మొత్తంగా చూసిన‌ప్పుడు దీంట్లో ఏదో వెలితి క‌నిపిస్తుంది. చాలా స‌న్నివేశాలు లాజిక్కుకు దూరంగా ఉన్నాయి. ప్ర‌థమార్ధంలో మాన‌వ అవ‌య‌వాల అక్ర‌మ ర‌వాణా ఎపిసోడ్‌ను ట‌చ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వ‌లేదు. ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ క‌థా నేప‌థ్యంట్విస్ట్‌లుపోరాట ఘ‌ట్టాలు,నేప‌థ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేపాటలులవ్‌ట్రాక్‌ రేటింగ్‌ 2.5/5 https://www.youtube.com/watch?v=MK-pFLfPmyk
    ఆగస్టు 08 , 2023
    AA23: అల్లు అర్జున్‌, సందీప్‌ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌ లైనప్స్‌
    AA23: అల్లు అర్జున్‌, సందీప్‌ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌ లైనప్స్‌
    ]మరిన్ని ఇంట్రెస్టింగ్ &nbsp;వెబ్‌స్టోరీల&nbsp; కోసం లింక్‌ని క్లిక్ చేయండి.Watch Now
    మార్చి 03 , 2023
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    వారిసు మూవీ రివ్యూ… సంక్రాంతికి తొలి బ్లాక్ బాస్టర్ హిట్?
    ]రేటింగ్: 3.0/5విజయ్ నటన యోగిబాబుతో వచ్చే కామెడీ ట్రాక్ కుటుంబ సన్నివేశాలు పాటలుబలాలురొటీన్ కథ కథను ముందే ఊహించే సీన్లు ఫ్యాన్స్‌కు నచ్చే సీన్లకే ప్రాధాన్యంబలహీనతలు
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!</strong>
    This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు దేవర (Devara) ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; సత్యం సుందరం (Sathyam Sundaram) తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. హిట్లర్‌ (Hitler) తమిళ హీరో విజయ్‌ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్‌'. దర్శకుడు ధన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు.. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్‌ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)&nbsp; ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్‌ చేసిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్‌ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది.&nbsp; ముంజ్యా (Munjya) బాలీవుడ్ న‌టి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా య‌ష్ రాజ్‌ ఫిల్మ్స్‌ యూనివర్స్‌ రూపొందించిన‌ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వ‌హించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26
    సెప్టెంబర్ 23 , 2024
    <strong>Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!</strong>
    Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!
    టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్‌ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, శ్రీను వైట్ల, రామ్‌ గోపాల్‌ వర్మ, వి.వి. వినాయక్‌, తేజ, గుణశేఖర్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు హిట్స్‌ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్‌ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్‌ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అంజి కె. మణికుమార్‌ ఎన్టీఆర్‌ బామ మరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్‌ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; యదువంశీ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు.&nbsp; ముఖేశ్‌ ప్రజాపతి అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ 'బహిష్కరణ'. ఈ సిరీస్‌ ద్వారా దర్శకుడిగా ముఖేశ్‌ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని మంచి వ్యూస్‌ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్‌ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. శౌర్యువ్‌ నాని రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'తో శౌర్యువ్‌ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్‌ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్‌ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.&nbsp; కల్యాణ్‌ శంకర్‌ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్‌ యూత్ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో 'మ్యాడ్‌' ఒకటి. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని కల్యాణ్‌ శంకర్‌ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్‌, డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; కార్తిక్‌ దండు ‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్‌ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్‌ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు. వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్‌ చరణ్‌తో అనౌన్స్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!</strong>
    Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!
    టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్‌ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్‌-రాజమౌళి, త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌, తారక్‌ - కొరటాల శివ, అల్లు అర్జున్‌-సుకుమార్‌, హరీష్‌ శంకర్‌-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్‌ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్‌ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్‌ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయకొచ్చాయి.&nbsp; ముహోర్తం ఫిక్స్‌! అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్‌ చేసి ఆ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.&nbsp; ఆ ఇద్దరిలో ఎవరు! బన్నీ-త్రివిక్రమ్‌ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ భామలు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), అలియా భట్‌ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్‌ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; హ్యాట్రిక్ హిట్స్‌ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’తో బిజీ బిజీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో 'పుష్ప 2' (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప' (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
    ఆగస్టు 07 , 2024
    <strong>This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!</strong>
    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు డార్లింగ్‌ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామం రాఘవం కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; పేక మేడలు హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు.&nbsp; క్రైమ్‌ రీల్‌ సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon&nbsp;July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon&nbsp;July 19
    జూలై 15 , 2024
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.&nbsp; ఇస్మార్ట్ శంకర్ తర్వాత&nbsp; వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.&nbsp; మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.&nbsp; టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.&nbsp; సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.&nbsp; బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం&nbsp; థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా: &nbsp;మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..&nbsp; నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?
    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..&nbsp; నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?
    నేచురల్ స్టార్‌ నాని దసరా ప్రమోషన్లతో చాలా బిజీగా గడుపుతున్నాడు. మార్చి 30న సినిమా విడుదలవుతుండటం.. కొద్దిరోజుల సమయమే ఉండటంతో చిత్రబృందం వేగం పెంచింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నందునా.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.&nbsp; https://twitter.com/NameisNani/status/1638035548236566528 రంగులతో షురూ దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు యూనిట్. హోలీ సందర్భంగా ముంబయిలో ప్రచారం షురూ చేశాడు నాని. అక్కడ యూత్‌ నుంచి నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఫుల్ హుషారుగా ప్రమోట్ చేశాడు నేచురల్ స్టార్‌.&nbsp; https://twitter.com/NameisNani/status/1633324647830650880 కొచ్చిలో విషెస్ కొచ్చిలో ప్రమోషన్ చేస్తుండగా ఆర్‌ఆర్‌ఆర్‌కి అవార్డు వచ్చింది. ఆ కార్యక్రమంలోనే అందరి సమక్షంలో ప్రత్యేకమైన వీడియోతో నాని విషెస్ చెప్పాడు. ట్విటర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేశాడు నాని.&nbsp; https://twitter.com/NameisNani/status/1635265590066827264 VD గురించి తమిళ్ ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండతో ఉన్న స్నేహం గురించి చెప్పాడు ఈ యంగ్ హీరో. “ అతడిని చూస్తే గర్వంగా ఉంది. మేము తరచూ మాట్లాడుకుంటాం. సినిమాల గురించి చర్చిస్తాం. తన సినిమా ఫెయిల్ అయినా నేను మెసేజ్ పెడతాను. అంతా మన మంచికే జరిగిందని చెబుతుంటాను. విజయ్ ఇంకా చాలా సాధిస్తాడు” అన్నాడు నాని. https://twitter.com/i/status/1634446694854311936 జెర్సీతో దసరా ప్రమోషన్ విశాఖపట్టణం వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, భారత్ మధ్య రెండో వన్డేలోనూ ప్రమోషన్ చేశాడు నాని. తన క్యారెక్టర్‌ను సూచించేలా ధరణి అనే జెర్సీ వేసుకొని వెళ్లాడు. అంతేకాదు, తనకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరో చెప్పడంతో పాటు తన సినిమాల్లో ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్‌ అవుతుందని కూడా వెల్లడించాడు.&nbsp; https://twitter.com/i/status/1637709729240875014 ఆటో ధరణి రగడ్‌ లుక్‌తో మాస్‌ రోల్‌లో నటించిన స్టార్ హీరో ప్రమోషన్లను కూడా తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. ముంబయిలో ఆటోలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ హీరో తన సహజత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1637808713955196929 https://twitter.com/apekshasandesh_/status/1638040424815247360?s=20 సీక్రెట్ సాంగ్ దసరా సినిమాలోని ఓ పాటను విడుదల చేయట్లేదని నాని చెప్పాడు. ఆ పాట చిత్రానికి ప్రాణం పోస్తుందని.. తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. సంతోష్ నారాయణ్‌ సంగీతం అందించారు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.&nbsp; https://twitter.com/i/status/1635985478070464515 నలుపు రంగులో ఇప్పటి వరకు జరిగిన చాలా దసరా ప్రమోషన్లలో ఎక్కువగా నలుపు రంగు దుస్తులు ధరించి నాని ప్రమోట్ చేస్తున్నాడు. సినిమా కథను సింగరేణిలో జరుగుతుంది. అది ప్రతిబింబించేందుకు ఇలా చేస్తున్నాడని టాక్.  https://twitter.com/shreyasgroup/status/1638022757215789056?s=20 https://twitter.com/i/status/1638033798905602049 హీరోయిన్‌ కీర్తి సురేశ్ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతుంది. బ్లాక్ డ్రెస్‌లో రీల్స్‌ చేయటంతో పాటు ప్రచార కార్యక్రమాలకు హాజరవుతుంది. Keerthy Suresh (@keerthysureshofficial) • Instagram photos and videos
    మార్చి 21 , 2023

    @2021 KTree