• TFIDB EN
  • బ్లడీ మేరీ
    UATelugu1h 31m
    మేరి (నివేదా పేతురాజ్‌), భాషా (కిరీటి), రాజు (రాజ్‌ కుమార్) అనాథలు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు. అనుకోని పరిస్థితుల్లో మేరి ఓ హత్య చేయాల్సి వస్తుంది. మరోవైపు భాష ఓ హత్య జరగడం చూస్తాడు. ఈ రెండు హత్యలతో ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగిందన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నివేదా పేతురాజ్
    మేరీ
    బ్రహ్మాజీ
    శేఖర్ బాబు
    అజయ్
    సీఐ ప్రభాకర్
    కిరీటి దామరాజు
    బాషా
    రాజ్ కుమార్ కసిరెడ్డిరాజు
    పమ్మి సాయిఅప్పి
    హేమంత్
    కమల్
    బాషా
    ఆరాధ్య
    గిరి
    ఓమ్కార్
    నవీనా రెడ్డికల
    రమణి
    సిబ్బంది
    చందూ మొండేటి
    దర్శకుడు
    టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
    కాల భైరవ
    సంగీతకారుడు
    కార్తీక్ గట్టమ్నేని
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    Rakul Preeth Singh Hot: టీషర్ట్‌ పైకెత్తి రెచ్చగొడుతున్న రకూల్‌.. చూసి తట్టుకోగలరా?
    ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh).. మరోమారు హాట్‌ లుక్స్‌తో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.  టీషర్ట్‌, బ్లూ జీన్స్‌ ధరించి సొగసైన నడుము అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. టీ షర్ట్ పైకి లేపుతూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం రకుల్‌ షేర్ చేసిన నావెల్‌ షో పిక్స్‌.. నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  హీరోయిన్‌గా రకుల్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్‌ తొలినాళ్లలోనే టాప్‌ చిత్రాలతో ఆకట్టుకుంది.  టాలీవుడ్‌లో రకూల్‌ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌, గోపిచంద్‌, రామ్‌ పోతినేని, సాయిధరమ్‌ తేజ్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది.  ‘గిల్లీ’ (Gilli) అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.  ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్‌.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ‘లౌక్యం’, ‘కరెంట్‌ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  https://twitter.com/i/status/1672013355924738048 అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్‌ హిట్ సాధించడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టిన రకుల్‌.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్‌ G’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  ఈ ఏడాది ‘అయాలన్‌’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంతో రకూల్‌ ప్రేక్షకులమ ముందుకు వచ్చింది. అందులో తార పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం రకుల్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.  అలాగే ప్రస్తుతం రకుల్‌ చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. మేరీ పత్నీ కా రమేక్‌, దే దే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తూ రకూల్ బిజీ బిజీగా ఉంటోంది.  ఇక రకుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి చేసుకుంది. 2021 నుంచి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. బంధు మిత్రుల సమక్షంలో 21 ఫిబ్రవరి 2024న ఒక్కటయ్యింది.  రకూల్‌ ఓ వైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను వరుసగా షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 23.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
    జూన్ 08 , 2024
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ  జాతకం మార్చనుందా?
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్‌ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్‌ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు. గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్‌ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్‌' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్‌' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 30 , 2024
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    మనిషి జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారిపోయింది. రోజులో కనీసం ఒకసారైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తెరవని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్‌ లేరని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత రోజుల్లో సమాచారం చేరవేయడానికి సోషల్‌ మీడియా ప్రధాన వేదికగా మారింది. సోషల్‌ మీడియాకు ఆదరణ పెరగడంతో సినీ హీరోలు సైతం తమను తాము ప్రమోట్‌ చేసుకునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు సోషల్‌ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన టాప్‌-10 తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. అల్లుఅర్జున్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ క్రేజ్‌ ‘పుష్ప’ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో పుష్ప విజయం సాధించడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం బన్నీకి అభిమానులుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ బన్నీ ఇచ్చే అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో అత్యధికమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటుడిగా బన్నీ ఉన్నాడు. బన్నీ ఇన్‌స్టా ఖాతాను 20.3 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. అయితే బన్నీ మాత్రం తన భార్య స్నేహరెడ్డి ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం. 2. విజయ్‌ దేవరకొండ:  2017లో విడుదలైన అర్జున్‌ రెడ్డి మూవీతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను ఆకర్షించిన విజయ్‌.. తనకంటూ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలితంగా ఇన్‌స్టాలో రెండో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోగా విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 17.9 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్‌ ఏ ఒక్కరినీ కూడా ఫాలో అవ్వడం లేదు.  3. రామ్‌చరణ్‌ RRR చిత్రంతో రామ్‌చరణ్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చెర్రీ నటన చూసి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 13.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో టాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోల జాబితాలో చరణ్‌ 3వ స్థానంలో నిలిచాడు. 4. మహేశ్‌ బాబు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మహేశ్‌ ఒకరు. మహేశ్‌ కొత్త సినిమా రిలీజ్‌ అంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. సామాజిక మాధ్యమాలకు మహేశ్‌ కాస్త దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన ఫ్యాన్స్‌ మాత్రం మహేశ్‌ను విపరీతంగా ఫాలోఅవుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10.1 మిలియన్స్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.  5. ప్రభాస్‌: బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ ఆ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది. ప్రభాస్‌ ఆహార్యం, నటన చూసి కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అంతేగాక ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు.  ప్రస్తుతం 9.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించిన ప్రభాస్ టాప్‌-3 తెలుగు హీరోగా నిలిచాడు.  6. జూ.ఎన్టీఆర్‌ RRR చిత్రం రామ్‌చరణ్‌తో పాటు తారక్‌కు సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. NTR తన మిస్మరైజింగ్‌ నటనతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 5.9 మిలియన్ల మంది ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు.  7. నాని నేచురల్‌ స్టార్‌ నాని తన సహజ సిద్దమైన నటనతో టాలీవుడ్‌లో మంచి హీరోగా ఎదిగాడు. ఆయన లేటెస్ట్‌ మూవీ దసరా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో నాని ఇమేజ్‌ మరింత పెరగనుంది. ప్రస్తుతం నాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.  8. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఫాలో అవుతున్నారు. మెుత్తం 3.6 మిలియన్ల మంది రామ్‌ను అనుసరిస్తున్నారు.  9. వరుణ్‌ తేజ్ మెగా హీరోల్లో అల్లుఅర్జున్ తర్వాత వరణ్‌తేజ్‌కే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం వరుణ్‌ ఖాతాను కూడా 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  10. అఖిల్‌ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నుంచి మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒక్కటి కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయితే విజయాలతో సంబంధం లేకుండా అఖిల్ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించాడు. అఖిల్‌ను సైతం 3 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. 
    మార్చి 30 , 2023
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    Ahimsa Movie Review: తేజ రొటీన్ రొడ్డకొట్టుడు లవ్ స్టోరీ.. కానీ అభిరామ్ యాక్టింగ్ సూపర్బ్
    నటీనటులు: అభిరామ్‌ దగ్గుబాటి, గీతికా తివారి, సదా, కమల్‌ కామరాజ్‌, కల్పలత, రవి కాలే, రజత్ బేడి దర్శకత్వం: తేజ సంగీతం: R.P పట్నాయక్‌ సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో పేరు ఉంది. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసులుగా వచ్చిన సురేష్‌బాబు, వెంకటేష్‌ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. సురేష్‌ బాబు విజయవంతమైన సినిమాలు నిర్మిస్తే.. వెంకటేష్‌ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వారి వారసుడుగా వచ్చిన రానా కూడా తనకంటూ ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (జూన్‌ 2) రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?. అభిరామ్‌ తొలి హిట్‌ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం అతనిది. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి ఎంతో ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజే ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) ఇద్దరు కుమారులు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. పూర్తి అహింసావాదైన రఘు వారిపై న్యాయపోరాటానికి దిగుతాడు. అతడికి లాయర్‌ లక్ష్మీ (సదా) సాయం చేస్తుంది. ఈ క్రమంలో లక్ష్మీ కుటుంబాన్ని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో న్యాయంగా, అహింస మార్గంలో దుష్యంతరావును గెలవలేమని భావించిన హీరో ఏం చేశాడన్నది అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే హీరోగా అభిరామ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సన్నివేశాల్లో తన శక్తిమేరకు నటించాడు. ఇదే తొలి సినిమా కావడంతో నటన పరంగా ఓకే అని చెప్పొచ్చు. హీరోయిన్‌ గీతికా తివారి తన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. కొన్ని సీన్లలో అందాలు సైతం ఆరబోసింది. ఇక లాయర్‌ పాత్రలో సదా పర్వాలేదనిపించింది. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ తేజ మంచి కథనే ఎంచుకున్నాడు. కానీ, దాన్ని సరిగ్గా ప్రజెంట్‌ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నంత ప్రేక్షకుడికి ఏమాత్రం ఆసక్తి ‌అనిపించదు. కొన్ని సీన్లు చూస్తే జయం, నువ్వు నేను సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. లాజిక్స్‌లతో సంబంధం లేకుండా ఈ సినిమాను తేజ తెరకెక్కించాడు. సినిమా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడు ఐటెమ్ సాంగ్ రావడం ఆడియన్స్‌కు రుచించదు. కొడుకుల శవాలు ఇంట్లో ఉండగా విలన్‌ ఇంట్లో ఐటెమ్‌ సాంగ్ ఎందుకు పెట్టడం అసలు అర్థం కాదు. దీంతో మూవీ త్వరగా ముగిస్తే బాగుంటుందన్న ఫీలింగ్‌ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మెుత్తంగా సినిమాలో తేజ మార్క్‌ ఉన్నా రొటీన్‌ సన్నివేశాలతో బోర్ అనిపిస్తుంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ విషయాలకు వస్తే ఆర్పీ పట్నాయక్‌ సంగీతం పర్వాలేదనిపించిది. కొన్ని పాటలు బాగున్నాయి. ‘ఉందిలే’ పాట ఆకట్టుకుంది. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. లోతైన భావంతో అర్థవంతంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సమీర్‌రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీతరొటీన్‌ సీన్స్లాజిక్‌ లేని సన్నివేశాలు రేటింగ్‌: 2/5
    జూన్ 02 , 2023
    iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!
    iQOO Z7s 5G Review: ఐక్యూ నుంచి సరికొత్త 5G ఫోన్‌.. ఆసక్తిరేపుతున్న అధునాతన ఫీచర్లు!
    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQOO) కొత్తగా మరో 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.  ఐక్యూ జెడ్ 7ఎస్ 5జీ (iQOO Z7s 5G) పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఈ మెుబైల్ సేల్స్‌ భారత్‌లో మెుదలైపోయాయి. ఐక్యూ మెుబైల్స్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉండటంతో కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఏమున్నాయి? ధర ఎంత? వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం.  ఫోన్ డిస్‌ప్లే iQOO Z7s 5G ఫోన్‌ డిస్‌ప్లేను 6.38 అంగుళాలతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఫుల్‌ HD+ అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్‌ రేటుతో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో ఫోన్‌ తీసుకొచ్చారు.  ఫోన్‌ స్టోరేజ్‌ iQOO Z7s 5G ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB వేరియంట్లలో ఈ ఫోన్‌ లభించనుంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో అల్ట్రా గేమ్ మోడ్, మోషన్ కంట్రోల్స్ లాంటి గేమింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి కెమెరా  iQOO Z7s 5G ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. ఇందులోని ప్రైమరీ కెమెరా 64MP కలిగి ఉంది. ఇది ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) ఫీచర్‌తో వస్తోంది. బ్యాక్‌ కెమెరా సెటప్‌లో 2MP Bokeh కెమెరా కూడా ఉంది. ఫ్రంట్‌ కెమెరాను 16 MPతో తీసుకొచ్చారు. దీనితో నాణ్యమైన సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.  బ్యాటరీ iQOO Z7s 5G ఫోన్‍ను 4,500mAh బ్యాటరీతో రూపొందించారు. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్‌  సపోర్ట్ చేస్తుంది. 23 నిమిషాల్లోనే 50 శాతం మేర ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చని ఐక్యూ కంపెనీ ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.  కలర్స్‌ iQOO Z7s 5G ఫోన్‍ రెండు రంగుల్లో మార్కెట్‌లో లభ్యమవుతోంది. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. ధర ఎంతంటే? iQOO Z7s 5G ఫోన్‌.. అమెజాన్‌తో పాటు ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 6GB RAM + 128GB వేరియంట్‌ ధర రూ.18,999గా ఉంది.  8GB RAM + 128GB మోడల్‌ను రూ.19,999 కొనుగోలు చేయవచ్చు. Buy Now ఆఫర్లు iQOO Z7s 5G ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. 
    మే 22 , 2023
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా, నాగ మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.   సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    REVIEW: కోనసీమ థగ్స్‌
    REVIEW: కోనసీమ థగ్స్‌
    దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం. చిత్రబృందం: దర్శకత్వం: బృందా గోపాల్‌ సంగీతం: సామ్‌ CS నటీనటులు: హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌, బాబీ సింహా తదితరులు ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోనీ సినిమాటోగ్రఫీ: ప్రియేష్‌ గురుస్వామి కథ: శేషు( హ్రిదు హరూన్‌) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?.  దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ. ఎలా ఉందంటే: దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్‌ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్‌ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ చక్కగా సెట్‌ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.  స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్‌ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే. సాంకేతికంగా సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది.  ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్‌ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.  నటీ,నటుల పెర్ఫార్మెన్స్ హ్రిదు హరూన్‌ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్‌ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. బలాలు: కథ, సెకండాఫ్‌ నటీ నటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాటోగ్రఫీ బీజీఎం బలహీనతలు ఫస్టాఫ్‌ కథనం సమీక్ష: ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్‌’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది. రేటింగ్‌: 2.75
    ఫిబ్రవరి 24 , 2023
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్  వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్  1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు  38 సంవత్సరాలు  కాజల్ అగర్వాల్  మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్  మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  కాజల్ అగర్వాల్  ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.  కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    Varun Tej Marriage: నెట్టింట వరుణ్‌-లావణ్య పెళ్లి ఫొటోల సందడి.. మెగా హీరోలంతా ఒకే వేదికపై..!
    మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేద‌మంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. న‌వంబ‌ర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘ‌నంగా జ‌రిగిన సంగతి తెలిసిందే.  పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య చేసిన ఫొటోషూట్ తాజాగా వైరల్‌ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నవ వధువువరులు నవ్వుతూ సంతోషంగా గడిపారు. ఇద్దరు కూర్చుని రొమాంటిక్‌గా పోజు ఇచ్చారు.  వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి తర్వాత సరదాగా గడిపారు. చేతుల్లో చేయి వేసుకుని గార్డెన్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. భార్య లావణ్య సొట్టబుగ్గపై చేతి వేలితో సరదాగా టచ్ చేశాడు వరుణ్ తేజ్. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ - గోల్డ్ షేర్వానీని వివాహా వేడుకలో వరుణ్ తేజ్ ధరించాడు. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో హీరో తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి హుందాగా పోజు ఇచ్చారు. బ్లూ కలర్ డ్రెస్సులో నాగబాబు స్టైలిష్‌గా కనిపించారు. వరుణ్ లావణ్య పెళ్లిలో మెగా కుటుంబం అంతా సందడి చేసింది. వధువరులతో రామ్ చరణ్, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, సాయి తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, నాగబాబు కలిసి ఫొటోకు స్టిల్ ఇచ్చారు.  వరుణ్ తేజ్ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందడి. మెగా సోదరులు చిరంజీవి, నాగబాబుతో పవన్ కల్యాణ్ ఫొటో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలోనే బాబాయి - అబ్బాయి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రామ్‌చరణ్‌-పవన్‌ నవ్వుతూ కనిపించిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అన్న పెళ్లిలో తీన్‌ మార్‌ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.  https://twitter.com/vamsikaka/status/1719756960852263315 కాగా ఇటలీలో అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి.  కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
    నవంబర్ 03 , 2023
    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌  పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?
    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌  పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?
    చిత్ర పరిశ్రమలో మృణాల్‌ థాకూర్‌ ఓ సెన్సేషన్‌. అందచందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తన చిన్ననాటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ హాట్‌ బ్యూటీ అప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.  చిన్నతనంలో మృణాల్ బబ్లీ గర్ల్.  పిలక జుట్టు వేసుకొని ఫొటో కోసం ఇచ్చిన ఫోజు ఎంతో క్యూట్‌గా ఉంది.  ఐదేళ్ల వయసులో తను విన్న ప్రతి కథకి ఆకర్షితురాలు అయ్యేదట. మళ్లీ ఆ పాత్రలో మాదిరిగా కనిపించేందుకు ఇంట్లో ఉన్న దుస్తులు, వస్తువులతో సిద్దమయ్యేది. అలా మీరాభాయ్‌ గెటప్‌ వేసుకుంది మృణాల్. టీ షర్ట్‌, పాంట్ వేసుకునేది ఈ హీరోయిన్‌. మదర్స్‌ డే సందర్భంగా తల్లితో కలిసి ఆమె పెట్టిన ఫొటో చూస్తే తెలిసిపోతుంది. మృణాల్‌ టామ్‌ బాయ్‌ గెటప్‌లో ఉండేది.  ఎక్కువగా వాళ్ల పిన్ని దగ్గర పెరిగింది. తను స్వయం శక్తితో ఎదిగేందుకు ఆమె కారణమని చెబుతుంది. మృణాల్ థాకూర్ అథ్లెట్‌. టీనేజ్‌లో ఉన్నప్పుడు వివిధ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొంది. ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తుండేదట ఈ హీరోయిన్.  మృణాల్ థాకూర్‌ డీ గ్లామరస్‌ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.  పాత ఫొటోలు ఎప్పుడూ మరపురానివంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు ఇష్టమైన పిక్‌ను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) మృణాల్‌ చిన్నప్పటి నుంచే అల్లరి పిల్ల. మిక్కీ గెటప్‌లో మృణాల్‌ ఇచ్చిన ఫోటోలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.
    ఏప్రిల్ 26 , 2023
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘టైగర్‌3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ (Katrina Kaif) నటించింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.  జపాన్‌ కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలా నిన్ను చేరి దినేశ్‌ తేజ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.  ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.  ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer MovieHindiZee 5Nov 10 ………………………………………………………………………………………………………………. APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    నవంబర్ 06 , 2023
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.  రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.  సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.  రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.  అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.  జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.  రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.  నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.  సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు. 
    ఫిబ్రవరి 23 , 2024
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్‌ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్‌ కేర్‌ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం. తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్‌ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్‌ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  View this post on Instagram A post shared by @forestessentials 'లైవ్‌ యువర్‌ ఫెయిరీ టేల్‌' అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్‌ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.  2020లో హాలీవుడ్ యాక్టర్‌ ‘రాబర్ట్ హాఫ్‌మన్‌’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్‌ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్‌ చేశాడు.  మలీషా కోసం ‘గో ఫండ్‌ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్‌ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.  సోషల్‌ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్‌ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.  మలీషాకు పాపులారిటీని గమనించిన  ‘ది పికాక్‌’ అనే మ్యాగజైన్‌ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్‌ పేజ్‌ మీద ప్రింట్‌ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా  మలీషా స్టోరీని పబ్లిష్‌ చేశాయి.  మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ ఇచ్చింది. ‘ప్రిన్సెస్‌ ఆఫ్ స్లమ్‌’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.  మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.  చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.  గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్‌ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది. 
    మే 24 , 2023
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌! 
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.  శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.   రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.  బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.  లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌  రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.  సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి. 
    మే 04 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    Avika Gor: వెస్టిండీస్‌ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్‌!
    Avika Gor: వెస్టిండీస్‌ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్‌!
    సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఇక్కడి సినిమాలపై రీల్స్‌ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్‌ క్రికెటర్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌.. టాలీవుడ్‌ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్‌ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  చీరకట్టులో అందాల జాతర వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండ్రీ రస్సెల్‌.. ఓ వైపు క్రికెట్‌.. మరోవైపు పాటల ఆల్బమ్స్‌ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్‌.. యంగ్‌ హీరోయిన్‌ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్‌ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్‌చల్‌ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్‌ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్‌ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్‌ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.  https://twitter.com/i/status/1788784603085582657 చైల్డ్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ.. బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్‌ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్‌ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.  View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) నెట్టింట హాట్‌ ట్రీట్‌ యంగ్‌ బ్యూటీ అవికాగోర్‌ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ హల్‌ చల్‌ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    మే 11 , 2024
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.  హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.  ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.  2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.  లక్ష్యం మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్‌ విక్‌ నుంచి ఇది నేర్చుకోవచ్చు. నిబద్ధత జాన్‌ విక్‌ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు. కఠోర శ్రమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్‌ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.  అసలేంటిది? నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.  హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్‌ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం. నమ్మకం సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్‌ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు. మన పని చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు. తక్కువగా మాట్లాడు సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు. ప్లాన్ బి  చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా. కుదరదు ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు. 
    మార్చి 21 , 2023
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!
    ]మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
    మార్చి 21 , 2023
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    ]4. బట్టర్, ఆన్, లౌడర్ ధాన్ బాంబ్స్, బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్ వంటివి గుర్తింపు పొందాయి. Listen Now
    ఫిబ్రవరి 14 , 2023

    @2021 KTree