రివ్యూస్
How was the movie?
తారాగణం
సిద్ధార్థ్
ప్రకాష్ రాజ్
సిద్ధూ తండ్రిజయసుధ కపూర్
సిద్ధు తల్లికోట శ్రీనివాసరావు
హాసిని తండ్రిసునీల్
సిద్ధు సేవకుడుసత్య కృష్ణ
సిద్ధు కోడలుసుదీప పింకీ
సిద్ధు సోదరిధర్మవరపు సుబ్రహ్మణ్యం
కిస్మత్ కుమార్సురేఖ వాణిసిద్ధు అక్క
చిత్రం శీను
సిద్ధూ స్నేహితుడువిజయ్ సాయి
సిద్ధూ స్నేహితుడురవి వర్మ
సిద్ధూ స్నేహితుడునేహా బాంబ్
సిద్ధు కాబోయే భార్యబిల్ బిట్రాచింటూ
బ్రహ్మానందం
లోన్ ఆఫీసర్తనికెళ్ల భరణి
సుబ్బలక్ష్మి తండ్రిచలపతి రావు
వంశీ తండ్రిసప్తగిరి
హాసిని ప్రేమికుడుస్టంట్ సిల్వా
కాలేజీ విద్యార్థిరఘునాథ రెడ్డి
నర్సింగ్ యాదవ్
మోటార్ సైకిల్ డ్రైవర్శోబి (కని ఇప్పుడు లో ప్రత్యేక పాత్ర)
సిబ్బంది
భాస్కర్
దర్శకుడుదిల్ రాజు
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆరెంజ్ (Orange)
రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్బాస్టర్ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.
అ! (Awe)
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.
C/o కంచరపాలెం (C/o Kancharapalem)
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
అంటే సుందరానికి (Ante Sundaraniki)
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.
కర్మ (Karma)
యంగ్ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.
1: నేనొక్కడినే (1: Nenokkadine)
సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)
ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.
ఖలేజా (Khaleja)
ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.
విరాట పర్వం
సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ.
మార్చి 22 , 2024
Fathers Day: మీ నాన్న ఈ క్యారెక్టర్లలో ఏ టైపు… ఓసారి చూసుకోండి!
లోకంలో నాన్నలందరూ ఒకేలా ఉండరు. ఒక్కొకరిది ఒక్కో తీరు. ఒకరితో మరొకరికి పోలిక ఉండదు. కొందరు కుటుంబ బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటారు. మరికొందరు భార్యతో పంచుకుంటారు. కొన్ని సినిమాల్లోని ఫాదర్ల క్యారెక్టర్ని చూస్తే.. అరెరే అచ్చం మా నాన్న లాగే ఉన్నాడే అంటూ పోల్చుకుంటారు. అయితే, కొన్ని సినిమాల్లోని తండ్రి పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాన్న అంటే ఇలాగే ఉండాలన్న స్ఫూర్తిని కలిగిస్తాయి. ఫాదర్స్ డే(జూన్ 18) సందర్భంగా ఆ సినిమాలేంటో ఓ సారి చూసేద్దాం.
బొమ్మరిల్లు
నాన్న పాత్ర అంటే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమానే. ‘మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్‌రా..!’ అనేంతలా ప్రాచుర్యం పొందిందీ పాత్ర. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సిద్ధార్థ్‌కి తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ జీవించాడు. కొడుకుకి ప్రతీ విషయంలో ‘ది బెస్ట్’ ఇవ్వాలని ఆరాటపడే తండ్రిగా అదరగొట్టాడు. పెంపకంలో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల పిల్లలు స్వేచ్ఛ కోల్పోతారన్న వాస్తవాన్ని చివరికి అంగీకరిస్తాడు. అందుకే ఈ పాత్ర ప్రత్యేకం.
https://www.youtube.com/watch?v=GEBykGzUxk8
సుస్వాగతం
సుస్వాగతం సినిమాలో తండ్రి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు తండ్రిగా రఘువరన్ నటించాడు. వైద్యుడిగా, బాధ్యతాయుత తండ్రి పాత్రలో రఘువరన్ ఇరగదీశాడు. అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ కొడుకును ఇలా ప్రోత్సహించే తండ్రి ఉండాలని ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. 1997లో ఈ సినిమా విడుదలైంది.
https://www.youtube.com/watch?v=iwdC7TGACSk
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ సినిమాలో తండ్రి పాత్ర నిడివి తక్కువే ఉన్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వెంకటేష్‌కి తండ్రిగా కోట శ్రీనివాసరావు నటించాడు. తల్లి లేని పిల్లాడికి బాధ్యతగల తండ్రిగా, ప్రభుత్వ ఉద్యోగిగా కోట జీవించేశాడు. కొడుకు కోసం అవసరమైతే ఒక మెట్టు కిందకి దిగడానికైనా తండ్రి సిద్ధంగా ఉంటాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా మంది తండ్రులకి కొడుకంటే ప్రేమ ఉంటుంది. కానీ, చూపించుకోలేరు. ఈ సినిమాలో మాదిరిగా దాన్ని సందర్భానుసారంగా బయటపెడతారు. మీ నాన్న క్యారెక్టర్ కూడా ఇదే అయ్యుంటుంది కదా.
https://www.youtube.com/watch?v=bCTJZbwI5_0
ఆకాశమంత
కూతురిది, నాన్నది విడదీయలేని అనుబంధం. పంచ ప్రాణాలు పణంగా పెట్టి కూతురిని కాపాడుకుంటాడు తండ్రి. ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతాడు. ఆకాశమంత సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఇలాంటిదే. త్రిషకు తండ్రిగా ప్రకాశ్‌రాజ్ నటించాడు. ఓ కూతురుపై తండ్రికి ఉండే ప్రేమ, బాధ్యత ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. స్కూల్లో అడ్మిషన్ నుంచి కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించడం వరకు తండ్రి చూపించే ప్రేమకు ఇది నిదర్శనం. నిజ జీవితంలోనూ ప్రకాశ్ రాజ్ లాంటి నాన్నలు ఎంతో మంది ఉంటారు.
https://www.youtube.com/watch?v=nqGXCWmWDuU
నాన్నకు ప్రేమతో
ఏ తండ్రైనా కొడుకులను గొప్పగా, కష్టం రాకుండా పెంచాలని అనుకుంటాడు. బిడ్డలు అడిగిందల్లా ఇచ్చేస్తుంటాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. కుమారుల ఆకలిని తీర్చడానికి తండ్రి ఎంతకైనా తగ్గుతాడనే విషయం సినిమాలోని కొన్ని సీన్లు నిరూపిస్తాయి. కష్టపడి పెంచాల్సిన అవసరం తండ్రికి ఉంటుందేమో కానీ కష్టపడి పెరగాల్సిన అవసరం బిడ్డలకు ఉండదని నిరూపిస్తాడు. బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేసే తండ్రులెందరో.
చందమామ
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకు తండ్రిగా నాగబాబు, హీరోలకు తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటించారు. ముఖ్యంగా నాగబాబు నటన ఆకట్టుకుంటుంది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆడపిల్లలను మెట్టింటికి పంపాలంటే ఆ బాధ వర్ణణాతీతం. కూతుర్ల ప్రేమను అర్థం చేసుకునే ఔదార్యం కలిగిన తండ్రిగా నాగబాబు మెప్పించాడు. ఇలా బిడ్డల మనసులను అర్థం చేసుకునే హృదయం ప్రతి తండ్రికీ ఉంటుంది.
https://www.youtube.com/watch?v=DSCPzIUd8GE
నువ్వే నువ్వే
కూతురు అడిగితే చందమామనైనా తెచ్చిచ్చే తండ్రి పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. నటి శ్రియకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కూతురుకి నచ్చిన ప్రతి ఒక్కటి ఇచ్చే తండ్రి.. కోరుకున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడంలో మాత్రం ఎందుకు వెనకాడతాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రేమగా పెంచుకున్న పిల్లల భవిష్యత్తుపై తండ్రికి ఉండే ఆందోళన ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం.
జూన్ 16 , 2023
Ashika Ranganath: పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా లెలేత పరువాలు
కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్’ దీపావళి వేళ ఓ యాడ్ ఫొటో షూట్లో పాల్గొంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ చాలా హాట్ లుక్‌లో కనిపించి చెమటలు పట్టించింది. తన లేలేత అందాలను ఆరబోసింది.
మెరూన్ కలర్ డ్రెస్, గొల్డ్ కలర్ ఎంబ్రాయిడీలో తళక్కున మెరిసింది. తన ఎద, నడుము ఒంపులను చూపించి కుర్రకారు మతి పొగొట్టింది.
View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
ట్రెడిషనల్ వేర్లో మెరిసిపోతున్న ఆషికాను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె క్లీవేజ్ షోకు విజిల్స్ వేస్తున్నారు.
మెరూన్ కలర్, గొల్డ్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఈ అమ్మడి అందం మరింత పెరిగింది. Godess Of Beauty అంటూ కామెంట్ బాక్స్‌లో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవల తన సిస్టర్ వెడ్డింగ్ ఫంక్షన్లో పాల్గొన్న ఈ బ్యూటీ బ్లాక్ శారీలో అదరగొట్టింది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ చెక్కీల బ్లాక్ బ్లౌజ్వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
నల్లటి శారీలో వెన్నెల లాంటి అందాలను కురిపిస్తున్న ఆషికాను చూసి కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆషికా తన గ్లామర్‌తో చెమటలు పట్టిస్తోందని పోస్టులు పెట్టారు.
సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామిరంగ (Naa Saami Ranga) చిత్రంలో నాగార్జునకు జోడీగా ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ ఈ కుర్ర హీరోయిన్‌కు అవకాశాలు మాత్రం రాలేదు.
‘నా సామిరంగ’ కంటే ముందే టాలీవుడ్లో ఆషిక (Ashika Ranganath) ఓ సినిమా చేసింది. 'అమిగోస్' (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌తో చేసిన ఎన్నో రాత్రులు వస్తాయి గాని సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో తన అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపివేసింది.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన దృష్టి తమిళ్‌పై పెట్టింది. తమిళ్లో ఈ ముద్దుగుమ్మ హీరో సిద్ధార్థ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆయనతో కలిసి MISS YOU అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తోంది.
ఇక ఆషిక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక ఓ ఇంటర్యూలో తెలిపింది.
ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక (Ashika Ranganath) చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి 'క్రేజీబాయ్' (Crazy Boy) అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక (Ashika Ranganath) ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు తనకు బాగా అర్థం అవుతుందని తెలిపింది.
చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసినట్లు ఆషిక చెప్పింది. ‘బొమ్మరిల్లు’ (Bommarillu), ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana) చిత్రాలను చాలా సార్లు చూసినట్లు చెప్పింది.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ (#AshikaRanganath) ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.
నవంబర్ 02 , 2024
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్బాస్టర్ చిత్రాలు రీరిలీజ్ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గొర్రె పురాణం
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
యుద్ర
సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు.
కహా షురూ.. కహా ఖతం
ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి కథను అందించడం విశేషం.
బొమ్మరిల్లు
సిద్ధార్థ్, జెనీలియ జంటగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.
జర్నీ
తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్ యాక్సీడెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుసన్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిరగబడరా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ చాలా ఔట్డేటెడ్గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హంట్
మలయాళం హారర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
సెప్టెంబర్ 16 , 2024
EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్ చేశారా? అని ఆడియన్స్ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్.. ఈ సీన్లో నటించమని ప్రకాష్ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్ తెగ ఆలోచిస్తుంటారు.
https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp
మహేష్ బాబు
తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ (Spyder) సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్ కెరీర్లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
మోహన్ బాబు
2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.
https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X
వెంకటేష్
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.
రామ్ చరణ్
రామ్ చరణ్ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అసలు చరణ్.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.
https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db
ప్రభాస్
ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్’.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్ ప్రభాస్‌ను డైరెక్టర్ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.
https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
ఏప్రిల్ 30 , 2024
Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్ 3’లో ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అయితే తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆ స్టార్ హీరోయిన్లు ఎవరంటే?
‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బాస్టర్ కావడంతో ‘టిల్లు క్యూబ్’ను అంతకుమించి రూపొందించేలా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. కీలకమైన హీరోయిన్ పాత్రకు స్టార్ హీరోయిన్ను తీసుకుంటే ఎలా ఉంటుందా? అన్న యోచనలో చిత్ర యూనిట్ ఉంది. అంతేకాదు వారి పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నట్లు లేటెస్ట్ బజ్ ప్రకారం తెలుస్తోంది. సమంత (Samantha), తమన్నా (Tamannah Bhatia)ను ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. షూటింగ్ ప్రారంభం లోపు దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్ పరంగానూ ఈ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్లాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా అంతా ఫారెన్‌లోనే!
‘డీజే టిల్లు’లో అందాలు ఆరబోసిన హీరోయిన్ నేహా శెట్టి.. ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. దీంతో ఇదే ఫార్మూలాను టిల్లు క్యూబ్లోనూ రిపీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టితో పాటు సీక్వెల్లో చేసిన అనుపమా పరమేశ్వరన్ కూడా మెరవనున్నట్లు సమాచారం. అయితే మెయిన్ హీరోయిన్గా మాత్రం స్టార్ నటి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పార్ట్-3’ కథ అంతా ఫారెన్‌లోనే జరుగుతుందట.కాగా,ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్‌తో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘టిల్లు క్యూబ్’ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ.. సిద్దూకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు తెలుస్తోంది.
టిల్లు క్యూబ్ కథ అదే!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్ మాత్రం మరో లెవల్లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెడతానని స్పష్టం చేశాడు.
https://twitter.com/i/status/1774843442021196268
ఏప్రిల్ 12 , 2024
రాశి ఖన్నా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. జైలవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, హైపర్, థ్యాంక్యూ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాశి ఖన్నా తొలుత మోడలింగ్ చేసి నటనవైపు మొగ్గింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఈ ఆపిల్ బ్యూటీకి పెట్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇదే క్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు(Some Lesser Known Facts about Raashii Khanna) రాశిఖన్నా గురించి తెలుసుకుందాం.
రాశి ఖన్నా ముద్దు పేరు?
రాశి
రాశి ఖన్నా ఎప్పుడు పుట్టింది?
1990, నవంబర్ 30న జన్మించింది
రాశి ఖన్నా తొలి సినిమా?
మద్రాస్ కేఫ్(2013)
రాశి ఖన్నా తెలుగులో నటించిన తొలి సినిమా?
ఊహలు గుసగుసలాడే(2014)
రాశి ఖన్నా ఎత్తు ఎంత?
5 అడుగుల 5 అంగుళాలు
రాశి ఖన్నా ఎక్కడ పుట్టింది?
ఢిల్లీ
రాశి ఖన్నా ఏం చదివింది?
బీఎస్సీ హానర్స్ ఇన్ ఇంగ్లీష్
రాశి ఖన్నా అభిరుచులు?
పాటలు పాడటం, కవితలు రాయడం
రాశి ఖన్నాకి ఇష్టమైన ఆహారం?
లెబనీస్, చైనీస్ వంటలు
రాశి ఖన్నా కు అఫైర్స్ ఉన్నాయా?
క్రికెటర్ జాస్ప్రిత్ బుమ్రా అఫైర్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
రాశి ఖన్నాకు ఇష్టమైన కలర్ ?
వైట్, ఎల్లో
రాశి ఖన్నాకు ఇష్టమైన హీరో?
మహేష్ బాబు, రణబీర్ కపూర్
రాశి ఖన్నా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
రాశి ఖన్నా తల్లిదండ్రుల పేరు?
సరిత, రాజ్ కే ఖన్నా
రాశి ఖన్నా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/raashiikhanna/?hl=en
రాశి ఖన్నా ఫెవరెట్ సినిమాలు?
బొమ్మరిల్లు
రాశి ఖన్నాకు ఇష్టమైన ఐస్ క్రీం
చాకోలెట్ ఐస్‌క్రీం అంటే రాశి ఖన్నాకు చాలా ఇష్టం
రాశి ఖన్నా ఫెవరెట్ హీరోయిన్?
మాధురి దీక్షిత్, ప్రియాంక చోప్రా
https://www.youtube.com/watch?v=O0ClAuu8Ito
రాశి ఖన్నాకు ఫెవరెట్ రెస్టారెంట్?
ఎన్ గ్రీల్, హైదరాబాద్
ఏప్రిల్ 06 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
Ashika Ranganath: ‘నా సామిరంగ’ భామ గురించి ఈ విషయాలు తెలుసా?
నాగార్జున హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'నా సామిరంగ' (Naa Sami Ranga). ఇందులో కథానాయికగా 'ఆషికా రంగనాథ్' (Ashika Ranganath) చేస్తున్నారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, గ్లింప్స్‌ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేయగా వాటికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆషికా రంగనాథ్‌కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్లో ఇప్పటికే ఆషిక ఓ సినిమా చేసింది. 'అమిగోస్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది. ఇందులో కళ్యాణ్‌రామ్ సరసన ఆమె నటించింది.
ఓ ఈవెంట్ కోసం ఆషిక హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఆమె అమిగోస్ డైరెక్టర్ కంట పడ్డారట. దీంతో ఫోన్లోనే ఆయన ఆషికకు కథ వినిపించి హీరోయిన్గా ఫైనల్ చేశారట.
ఆషిక కర్ణాటకలో జన్మించింది. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే తనకు ఉండేదని కాదని ఆషిక తెలిపింది.
అయితే ఓ సారీ కాలేజీలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్నట్లు ఆషిక ఓ ఇంటర్యూలో చెప్పింది. తనకు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్‌గా గుర్తింపు వచ్చిందని పేర్కొంది. ఆ పోటీల్లో చూసి 'క్రేజీబాయ్' అనే కన్నడ సినిమాలో డైరెక్టర్ అవకాశమిచ్చినట్లు తెలిపింది.
ఈ భామ నటనతో పాటు డ్యాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలు ప్రదర్శనలు సైతం ఇచ్చింది. ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్టర్న్ డ్యాన్స్ విభాగాల్లో ఆషికకు ప్రావీణ్యం ఉంది.
ఈ బ్యూటీ ఫేవరేట్ హీరో పునీత్ రాజ్‌కుమార్. పరిశ్రమలోనికి రాగానే పునీత్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసినట్లు ఆషిక చెప్పింది. ఆయన మరణంతో చాలా బాధపడినట్లు పేర్కొంది.
తెలుగుపై కాస్త పట్టు ఉన్నట్లు ఆషిక ఓ సందర్భంలో చెప్పింది. తెలుగు బాగా అర్థం అవుతుందని తెలిపింది. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి తెలుగు సినిమాలు బాగా చూడటం, పాటలు వినడం వంటివి చేసేదట. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలను చాలా సార్లు చూసిందట.
ఈ బ్యూటీకి పుస్తకాలు చదవటమంటే చాలా ఇష్టమట. స్పూర్తినిచ్చే జీవిత గాథలు, మోటివేషన్ స్పీచ్‌లు వింటూ ఉంటుందట. ఎప్పటికప్పుడు మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటానని ఆషిక చెప్పింది.
ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతోంది. వారానికి నాలుగు సార్లు జిమ్‌లో రెండేసి గంటలు కఠిన వర్కౌట్లు చేస్తుందట.
రాజమౌళి దర్శకత్వం అంటే ఆషికకు ఎంతో ఇష్టమట. ఆయన సినిమాల్లో ఒక్కసారైన నటించాలని ఉందట. రణ్‌బీర్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్ అని ఆషిక చెబుతోంది.
డిసెంబర్ 09 , 2023
Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ చిత్రాలు
'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.
తొలి ప్రేమ (Tholi Prema)
వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.
ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade)
నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.
అష్టా చమ్మా (Ashta Chamma)
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.
అలా మెుదలైంది (Ala Modalaindi)
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్ ఫెయిల్ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.
సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan)
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి (Majili)
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
ఓకే బంగారం (Ok Bangaram)
ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.
ఏ మాయ చేశావే (Ye Maya Chesave)
తెలుగులో వచ్చిన ఎవర్గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్ బిజినెస్‌లో భాగమై సక్సెస్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.
సీతారామం (Sita ramam)
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్గా వచ్చిన చిత్రాల్లో సూపర్ క్లాసిక్ మూవీగా దీన్ని చెప్పవచ్చు.
హాయ్ నాన్న (Hi nanna)
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్ నాన్న తప్పకుండా ఉంటుంది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్ (Oye)
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి (Raja Rani)
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను (Jaanu)
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
గోదావరి (Godavari)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. హీరో సుమంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఆనంద్ (Anand)
ఈ ఫీల్‌గుడ్ మూవీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
మార్చి 22 , 2024
Celebrities Popular with Their Debut : సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటులు వీరే!
కళామ్మతల్లిని నమ్ముకొని తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు స్టార్లుగా ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ కొందరు నటీనటులు.. తొలి సినిమాతో తమను తాము నిరూపించుకున్నారు. అందులోని పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తమ తొలి చిత్రం ద్వారా వచ్చిన ఫేమ్‌ను తర్వాత కూడా కొనసాగించేందుకు మెుదటి సినిమా టైటిల్‌ను కొందరు తమ పేరుకు జత చేసుకున్నారు. ఇంకొందరు తమ పాత్రల పేరును తమ ఇండస్ట్రీ నేమ్‌గా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బట్టల సత్తి (Battala Satti)
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో మల్లికార్జునరావు అలియాస్ బట్టల సత్తి ఒకరు. 1972లో 'తులసి' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన.. అందులో ఓ చిన్న వేషం వేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి', 'అన్వేషణ'లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన 'లేడీస్ ట్రైలర్' సినిమా.. మల్లిఖార్జున రావు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'బట్టల సత్తి' పాత్రలో ఆయన అదరగొట్టాడు. అప్పటి నుంచి ఆయనకు ‘బట్టల సత్తి’ అనే పేరు ఇండస్ట్రీలో మారుపేరుగా మారిపోయింది.
శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar)
విలక్షణ నటుడు శుభలేఖ సుధారక్ అసలు పేరు.. సూరావఝుల సుధాకర్. ఆయన తొలి చిత్రం శుభలేఖ (1982) కావడంతో ఇండస్ట్రీలో ఆయనకు శుభలేక సుధాకర్ అన్న పేరు పడిపోయింది. సూరావఝుల అనే ఇంటి పేరు మరుగున పడి దాని స్థానంలో శుభలేక వచ్చి చేరింది. సుధాకర్.. దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజను పెళ్ళి చేసుకున్నారు.
రామిరెడ్డి (Spot Nana Rami Reddy)
కొందరు నటులు.. తమ తొలి చిత్రాలతో ఫేమస్ అయితే నటుడు రామిరెడ్డి మాత్రం ఓ డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ హీరోగా చేసిన ’అంకుశం’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన.. అందులో ‘స్పాట్ పెడతా’ అనే డైలాగ్ పదే పదే చెప్పి ఫేమస్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత నుంచి తోటి నటులు ‘స్పాట్ పెట్టావా’ అంటూ రామిరెడ్డిని ఆటపట్టించే వారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
సుత్తి వీరభద్రరావు (Sutti Veerabhadra Rao)
సుత్తి వీరభద్రరావు అసలు పేరు.. మామిడిపల్లి వీరభద్ర రావు. జంధ్యాల దర్శకత్వములో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘సుత్తి’ అనే పాత్రధారితో అధిక సన్నివేశాల్లో నటించడం.. వీరి కాంబోలో పుట్టిన హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడంతో ఆయన పేరుకు ముందు ‘సుత్తి’ యాడ్ అయ్యింది.
https://twitter.com/i/status/1674734022793244672
సుత్తివేలు (Suthivelu)
అలనాటి హాస్య నటుల్లో సుత్తివేలు ఒకరు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. చిన్నతనంలో చాలా సన్నగా ఉండటంతో బంధువులు వేలు అని పిలిచేవారు. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ‘సుత్తి’ అనే పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.
షావుకారు జానకి (Shavukaru janaki)
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు ఉన్నాయి. మొట్ట మొదటి చిత్రం ‘షావుకారు’ ఈమె ఇంటి పేరుగా మారిపోయింది. ‘షావుకారు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు తెలుగులో ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
సాక్షి రంగారావు (Sakshi Ranga rao)
ఈ దిగ్గజ నటుడు అసలు పేరు రంగవఝుల రంగారావు. 1967లో బాపూ-రమణల దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మెుదటి చిత్రం పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు.. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపు, కె.విశ్వనాథ్, వంశీ దర్శకత్వంలో వచ్చి సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అల్లరి నరేష్ (Allari Naresh)
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నరేష్.. తొలి చిత్రం ‘అల్లరి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన ఫేమ్‌తో నరేష్ కాస్త అల్లరి నరేష్‌గా మారాడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ఈ తరం ‘రాజేంద్ర ప్రసాద్’గా నరేష్ గుర్తింపు పొందాడు.
వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas)
టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ‘వందేమాతరం శ్రీనివాస్’ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును మార్చుకున్నారు. ఇతని అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఆయన పేరుకు ముందు వందేమాతరం వచ్చి చేరింది.
సిరి వెన్నెల సీతారామ శాస్త్రి (Sri Vennela Sirivennela Sitaramasastri)
టాలీవుడ్ సుప్రసిద్ధ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి పేరుంది. ఆయన ‘సిరివెన్నెల’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలోని అన్ని పాటలను సీతారామశాస్త్రినే రాయడం విశేషం. అప్పట్లో ‘సిరివెన్నెల’ సినిమా పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి లిరిక్స్‌కు చాలా మంది మైమరిపోయారు. అప్పటి నుంచి ఆయన్ను సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ 2021 నవంబరు 30న ఆయన మరణించారు.
మహర్షి రాఘవ (Maharshi Raghava)
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' అనే సినిమాలో నటుడు రాఘవ కథానాయకుడిగా చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నారు. రాఘవ ఇప్పటివరకూ 170కి పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దిల్ రాజు (Dil Raju)
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. ఈయన అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. కెరీర్ తొలినాళ్లలో డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించిన ఆయన 2003లో వచ్చిన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజుగా కొనసాగుతూ వస్తున్నారు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
నటుడు వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా చెలామణి అవుతున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కిషోర్.. ‘వెన్నెల’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో మూవీ టైటిల్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల 1 1/2' చిత్రం డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
నటుడు సత్యం రాజేష్ అసలు పేరు.. రాజేష్ బాబు. సుమంత్ (Sumanth) నటించిన ‘సత్యం’ సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్.. ‘క్షణం’ సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన ‘నాయకి’ సినిమాలో హీరోగా చేసి ఆశ్చర్యపరిచాడు. రీసెంట్గా పొలిమేర, పొలిమేర 2 చిత్రాల్లో లీడ్ పాత్రల్లో కనిపించి సాలిడ్ విజయాలను అందుకున్నాడు.
చిత్రం శ్రీను (Chithram Srinu)
చిత్రం శ్రీను అసలు పేరు మరోటి ఉంది. ఇండస్ట్రీలోకి రాకముందు వరకూ అతడ్ని బంధువులు శ్రీనివాసులు అని పిలిచేవారు. 'చిత్రం' సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూవీ టైటిల్‌ను తన పేరు ముందు జత చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోని వారంతా అతడ్ని చిత్రం శ్రీను అని పిలవడం మెుదలుపెట్టారు. ఇతను దాదాపు 260 సినిమాల్లో నటించాడు. ‘చిత్రం’, ‘ఆనందం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘బొమ్మరిల్లు’, ‘మంత్ర’, ‘100% లవ్’ సినిమాలు అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar)
డైరెక్టర్ భాస్కర్.. తన తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’తో సూపర్ డూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సక్సెస్‌తో ‘బొమ్మరిల్లు’ తన పేరుకు ముందు జత చేసుకున్నాడు. ఆయన తర్వాతి చిత్రం ‘పరుగు’ తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘ఆరెంజ్’తో హ్యాట్రిక్ కొట్టాలని భావించగా అతడికి తీవ్ర నిరాశే ఎదురైంది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘ఆరెంజ్’ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.
ఆహుతి ప్రసాద్ (Ahuti Prasad)
నటుడు ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఆయన తొలి చిత్రం ఆహుతి (1987) ఘన విజయం సాధించింది. ఇందులో ఆయన పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఆహుతి ప్రసాద్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటివరకూ 136 చిత్రాల్లో నటించారు. క్యాన్సర్ బారిన పడి జనవరి 4, 2015న ఆయన మృతి చెందారు.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy)
హైదరాబాద్‌లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జేడీ చక్రవర్తికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమాతో చక్రవర్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందులో జేడీ అనే ప్రతినాయక విద్యార్థి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఆ పాత్ర పేరుతో జేడీ చక్రవర్తిగా మారిపోయాడు.
బొమ్మాళి రవి శంకర్ (Bommali Ravi Shankar)
తెలుగులోని సుప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో బొమ్మాళి రవిశంకర్ ఒకరు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌కు స్వయాన సోదరుడైన ఆయన.. ప్రేమకథ (1999) సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2008లో వచ్చిన 'అరుంధతి' చిత్రం రవిశంకర్‌కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో సోన్‌సూద్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్.. అమ్మ బొమ్మాళి అంటూ చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి పి. రవిశంకర్ కాస్త.. బొమ్మాళి రవిశంకర్‌గా మారిపోయారు.
https://twitter.com/ramanuja2797/status/1393914318530351116
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. తనదైన మ్యూజిక్‌తో యావరేజ్ సినిమాలను సైతం సూపర్‌హిట్స్‌గా మారుస్తుంటాడు. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో అతడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందులోని అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలవడంతో ఈ రాక్‌స్టార్‌కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లైంది. దీంతో తొలి సినిమా టైటిల్‌ను దేవి శ్రీ ప్రసాద్ తన పేరులో కలుపుకున్నాడు.
బాహుబలి ప్రభాకర్ (Bahubali Prabhakar)
‘రైట్ రైట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు ప్రభాకర్.. ‘మర్యాద రామన్న’ సినిమాతో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా ‘బాహుబలి’లో కాలకేయుడి పాత్రలో కనిపించి ప్రభాకర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అద్భత నటనతో వీక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా తర్వాత నుంచి అతడు బాహుబలి ప్రభాకర్‌గా అందరి దృష్టిలో పడ్డాడు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu)
పైనున్న నటులకు సినిమాలు, పాత్రలను బట్టి పేరులో మార్పు వస్తే.. ఈ నటుడికి మాత్రం స్నేహం వల్ల పేరులో మార్పు వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్‌కు శ్రీనుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో తన మిత్రుడి పేరును తన పేరుకు మందు తగిలించుకొని ప్రభాస్ శ్రీనుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. 2012లో ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి గాను ప్రభాస్ శ్రీను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
మార్చి 07 , 2024
These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రోబో 2.0 - పక్షి రాజు
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.
https://www.youtube.com/watch?v=5OkypaWGYAo
నేను లోకల్ - నవీన్ చంద్ర
హీరో నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను లోకల్’ (Nenu Local) చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్ హీరో కంటే ముందే హీరోయిన్ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్ తండ్రి నవీన్ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.
https://www.youtube.com/watch?v=rYcZLAgPLps
‘వి’ - నాని
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.
https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf
నిన్నుకోరి - నాని
ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.
https://www.youtube.com/watch?v=ie8feBbd4VA
సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్
వెంకటేష్-మహేశ్ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది.
https://www.youtube.com/watch?v=G50OUBEZm-4
మగధీర - శ్రీహరి
మగధీరలో రామ్‌చరణ్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.
https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec
పుష్ప - శత్రు
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.
https://www.youtube.com/watch?v=krENzIi3Tto
పరుగు - ప్రకాష్ రాజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, షీలా కౌర్ జంటగా చేశారు. ప్రకాష్ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్ రాజ్.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.
https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU
విక్రమ్ - కమల్ హాసన్
ఇందులో హీరో కమల్ హాసన్ మాస్క్ మ్యాన్ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్ మాఫియా లీడర్ సంతానం (విజయ్ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్లా కనిపించే కమల్.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు.
https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2
రిపబ్లిక్ - రమ్యకృష్ణ
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.
https://www.youtube.com/watch?v=FWg79VONoTY
ఫిబ్రవరి 27 , 2024
3rd Day BOX OFFICE: స్టార్ హీరో లేకున్నా కలెక్షన్లు కుమ్మేసిన టాప్-10 మీడియం రేంజ్ సినిమాలు ఇవే!
కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ ఊహించనంతగా వస్తాయి. కానీ, సినిమా బాలేకపోతే తర్వాత రోజు నుంచి తగ్గిపోతాయి. చిత్రం బాగున్నప్పటికీ అసలు వసూళ్లు రాని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలకు వరుసగా మూడ్రోజులు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. హీరో స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను థియేటర్‌కు లాగుతుంది. కానీ మీడియం రేంజ్ చిత్రాలకు ఆ పరిస్థితి ఉండదు. సినిమా బాగుందని టాక్ వస్తే తప్ప థియేటర్‌కు ఎవరూ వెళ్లరు. అలా తొలి రోజు కలెక్షన్లు తక్కువగా ఉన్నా…. ప్రేక్షకుల టాక్‌తో మూడో రోజు కల్లా దూసుకు పోయిన సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
ఉప్పెన
మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ మెుదటి సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా.. హిట్ టాక్ రావటంతో మూడో రోజు ఏకంగా రూ. 8.26 కోట్లు కొళ్లగొట్టింది. చిత్రాన్ని రూ.15 కోట్లు పెట్టి తీస్తే రూ.83 కోట్లు వచ్చాయి. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను విజయ్ సేతుపతి మెుదట ఒప్పుకోలేదు. దర్శకుడు పట్టుబట్టడంతో సైన్ చేశారు. చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మార్చి కృతి శెట్టిని తీసుకున్నారు. ఆమె కారణంగా మరింత బజ్ వచ్చింది.
దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన పవర్ ప్యాక్డ్ మాస్ చిత్రం దసరా. లుక్, యాసతో నటీనటులందరూ అదరగొట్టారు. దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. రూ. 65 కోట్లతో తెరకెక్కిస్తే రూ. 110 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజు రూ. 6.73 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. శ్రీకాంత్ ఓదెల మెుదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా అలా కనిపించదు. మరో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు నాని.
విరూపాక్ష
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడోరోజు రూ. 5.77 కోట్లు రాబట్టింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు టాక్ తెలుసుకుందామని సినిమాకు వెళితే అతడి ఫోన్ కొట్టేశారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది.
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల మరో మ్యాజికల్ చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మూడో రోజు రూ. 5.19 కోట్లు వసూలు చేసింది. కులం అనే సున్నితమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు శేఖర్. ఇందులో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించాడు.
బింబిసార
కల్యాణ్‌రామ్‌కు మంచి హిట్ ఇచ్చిన సినిమా బింబిసార. చరిత్రలోని ఓ కథను తీసుకొని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు రూ. 5.02 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. రూ. 40 కోట్లు పెట్టి తీస్తే రూ. 65 కోట్లు సాధించింది. బింబిసార ఫ్రాంఛైజీలో భాగంగా మరో పార్ట్ కూడా వస్తుంది. చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ స్వయంగా నిర్మించాడు.
ఇస్మార్ట్ శంకర్
హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరి జగన్నాథ్‌లకు మంచి కిక్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. మెుదట్నుంచే కలెక్షన్లలో దూసుకెళ్లిన ఈ చిత్రం మూడో రోజు రూ. 4.32 కోట్లు రాబట్టింది. సినిమాకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టగా ఏకంగా రూ. 75 కోట్లు వచ్చాయి. సినిమాలో నటించిన నభా నటేశ్, నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వరుస కట్టాయి. మణిశర్మ బాణీలు ఇప్పటికీ మార్మోగుతున్నాయి.
భీష్మ
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబోలో వచ్చిన కామెడీ లవ్ ఎంటర్టైనర్ భీష్మ. బాక్సీఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం మూడో రోజు వసూళ్లు రూ. 4.31 కోట్లు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో తీసినప్పటికీ రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతుంది. భీష్మ, ఛలోని మించి ఉంటుందని దర్శకుడు చెప్పాడు.
జాతి రత్నాలు
కరోనా తర్వాత థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేసిన సినిమా జాతి రత్నాలు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మస్త్ వసూళ్లు వచ్చాయి. బ్లాక్‌బస్టర్ టాక్ రావటంతో మూడో రోజు రూ. 4.28 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 4 కోట్లు ఖర్చు చేయగా.. రూ. 65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
కార్తీకేయ 2
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాలీవుడ్‌ను షేక్ చేసింది కార్తీకేయ 2. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లోనూ కోట్లు రాబట్టిన కార్తీకేయ 2 మూడో రోజు కలెక్షన్లు రూ. 4.23 కోట్లు. సినిమాకు అయ్యింది రూ. 15 కోట్లు.. కానీ రూ. 117 కోట్లు కొళ్లగొట్టింది. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని నిఖిల్ చెప్పడంతో ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
అఖిల్, పూజా హెగ్డే కాంబోలో లవ్ స్టోరీ స్పెషలిస్ట్ బొమ్మరిల్లు భాస్కర్ తీశాడు. యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో దూసుకెళ్లింది. ఈ సినిమాకు మూడో రోజు రూ. 4.03 కోట్లు సాధించింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్. కలెక్షన్ల పరంగా రూ. 51 కోట్లు రాబట్టింది అఖిల్ సినిమా.
ఏప్రిల్ 24 , 2023