• TFIDB EN
  • బోణి
    UATelugu
    డీడీ (సుమంత్‌) తన స్నేహితుడు చిన్నాతో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని వారు అనుకుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా పొలిటిషియన్‌ కూతురిని కిడ్నాప్‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కిడ్నాప్‌ వల్ల డీడీకి వచ్చిన సమస్యలు ఏంటి? వాటి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుమంత్
    DD
    కృతి ఖర్బందా
    ప్రగతి
    త్రినేత్రుడుచిన్నా
    చంద్ర మోహన్
    వేణు మాధవ్
    జయ ప్రకాష్ రెడ్డి
    ఆహుతి ప్రసాద్
    సత్య ప్రకాష్
    సుధ
    సరస్వతమ్మ
    సురేఖ వాణి
    తనికెళ్ల భరణి
    గిరి
    కోట శంకర్
    హర్ష వర్ధన్
    సుతి వేలు
    బబ్లూ
    సత్యం రాజేష్
    అంటారా బిస్వాస్
    ఐటెమ్ నంబర్
    నరేష్
    సిబ్బంది
    రాజ్ పిప్పల్లాదర్శకుడు
    రమణ గోగుల
    నిర్మాత
    రమణ గోగుల
    సంగీతకారుడు
    కథనాలు
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    Celebrities In Politics: పవన్‌ కల్యాణ్‌ To కంగనా రనౌత్‌.. ఎన్నికల్లో సత్తా చాటిన సెలబ్రిటీలు వీరే!
    దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చి ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదిగిన వారు దేశంలో చాలామందే ఉన్నారు. అందులో కొందరు పార్టీలు పెట్టగా, మరికొందరు వివిధ పార్టీల్లో చేరి విజయాలను అందుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలు సహా.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మంగళవారం (జూన్‌ 4) ఓట్ల లెక్కింపు జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు గణనీయమైన విక్టరీని సొంతం చేసుకున్నారు. మరికొందరు ఓటమీని చవిచూశారు. వారెవరో ఈ కథనంలో తెలుసుకుందాం.  పవన్‌ కల్యాణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 2024 ఏపీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారారు. అధికార వైకాపా ప్రభుత్వాన్ని కూలతోసే లక్ష్యంతో పని చేసి సక్సెస్‌ అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఏర్పడిన ఎన్‌డీఏ (టీడీపీ + జనసేన + భాజపా) కూటమి 175 సీట్లకు గాను ఏకంగా 164 కైవసం (టీడీపీ 135, జనసేన 21, భాజపా 8) చేసుకుంది. అటు 25కు గాను 21 ఎంపీ స్థానాలను (టీడీపీ 16, భాజపా 3, జనసేన 2) సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా పవన్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేయగా 100స్ట్రైక్‌రేట్‌తో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజక వర్గం నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కొలువుదీరనున్న ఏపీ ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషించనున్నారు.  https://twitter.com/i/status/1797987460137549943 నందమూరి బాలకృష్ణ (ఆంధ్రప్రదేశ్‌) హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. https://twitter.com/i/status/1797996139146617307 కంగనా రనౌత్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌) హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (భాజపా తరఫున) అరంగేట్రంలోనే విజయం సాధించారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై 74వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. హేమామాలిని (ఉత్తర్‌ ప్రదేశ్‌) ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని.. ఈ దఫా కూడా ఎన్నికల్లో నిలబడి సత్తా చాటారు. యూపీలోని మథుర నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ ధంగర్‌పై 2.93 లక్షల మెజార్టీతో ఆమె గెలుపొందారు.  రవి కిషన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ‘రేసు గుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు రవికిషన్‌ కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. గోరఖ్‌పుర్‌ (యూపీ)లో తన సమీప ప్రత్యర్థి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్‌ (ఎస్పీ)పై లక్ష ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.  శతృఘ్న సిన్హా (బెంగాల్‌) సీనియర్‌ సినీ నటుడు, అసన్‌సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ శతృఘ్న సిన్హా (టీఎంసీ) వరుసగా రెండోసారి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి ఎస్‌.ఎస్‌ అహ్లూవాలియాపై దాదాపు 60వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సురేశ్‌ గోపి (కేరళ) సినీయర్‌ మలయాళ నటుడు సురేశ్‌ గోపి కేరళలో భాజపాకు తొలి విజయాన్ని అందజేశాడు. త్రిసూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేశ్‌ గోపి 74వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో భాజపా తొలిసారి కేరళలో బోణి చేసినట్లైంది.  https://twitter.com/i/status/1797900510726676534 మనోజ్‌ తివారి (ఢిల్లీ) నార్త్‌ ఈస్ట్‌ దిల్లీ నుంచి భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారీ భాజపా అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేశారు. తాజా ఫలితాల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,38,778 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  https://twitter.com/i/status/1798059260410318868 అరుణ్‌ గోవిల్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) బుల్లితెరపై రాముడిగా అలరించిన ప్రముఖ నటుడు అరుణ్‌ గోవిల్‌ (భాజపా).. ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో తన సమీప ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు.  విజయ్‌ వసంత్‌ (తమిళనాడు) తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, తమిళ నటుడు విజయ్‌ వసంత్‌ తన సమీప భాజపా అభ్యర్థి పొన్‌ రాధాకృష్ణన్‌పై 1,79,097 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  దీపక్‌ అధికారి (బెంగాల్‌) బెంగాల్‌లోని ఘటల్‌ నుంచి తృణమూల్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన సినీ నటుడు దీపక్‌ అధికారి అలియాస్‌ దేవ్‌ తన సమీప భాజపా అభ్యర్థి, సినీ నటుడు హిరణ్మయ్‌ ఛటోపాధ్యాయపై 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఓడిపోయిన సెలబ్రిటీలు నవనీత్‌ రాణా (మహారాష్ట్ర) తెలుగులో పలు సినిమాల్లో అలరించిన నటి నవనీత్‌ రాణా వరుసగా రెండోసారి అమరావతి (మహారాష్ట్ర) నుంచి తలపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్వంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో 19 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. లాకెట్‌ ఛటర్జీ (బెంగాల్‌) పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి సినీ నటి, సిట్టింగ్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ (భాజపా) మరోసారి ఇదే స్థానం నుంచి బరిలో దిగారు. ఆమెకు పోటీగా టీఎంసీ మరో ప్రముఖ నటి రచనా బెనర్జీని నిలబెట్టింది. ఈ క్రమంలోనే రచన 76 వేల ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
    జూన్ 05 , 2024
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా  సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక  (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు
    Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు
    మలయాళి అందాల తెగింపు అనుపమ పరమేశ్వరన్‌ పలుచటి చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది నల్లటి స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆర బోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. సినిమాల్లో అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే అనుపమ.. సోషల్‌ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ ‘బటర్‌ఫ్లై’, ‘18 పేజెస్‌’ చిత్రాల్లో నటించింది. ఇందులో  ‘18 పేజెస్‌’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో  చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 29 , 2023
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    Kriti Kharbanda Hot : జాకెట్‌ తీసేసి.. కృతి కర్బందా హాట్‌ ఫోటో షూట్‌!
    ప్రముఖ నటి కృతి కర్బంద.. స్టన్నింగ్‌ హాట్‌ ఫొటో షూట్‌తో అభిమానులకు షాకిచ్చింది. జాకెట్‌ లేకుండా కెమెరాకు ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది.  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా కృతి కర్బంద ఈ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. బటన్స్‌ లేని నైట్‌ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శించింది.  ఈ భామ కొంటెగా చూస్తూ వయ్యారాలు ఒలకబోసిన ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. కృతి కర్భంద గ్లామర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా (Kriti Kharbanda).. 2009లో 'బోణీ' (Boni Movie) అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది.  ఆ తర్వాత టాలీవుడ్‌లోనే ‘తీన్‌మార్’ (Teen Maar), ‘అలా మొదలైంది’ (Ala Modalaindi), మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది.  చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' (Bruce lee Movie) మూవీలో రామ్ చరణ్‌ (Ram Charan)కి అక్కగా నటించింది. ఇందులో ఆమెన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రామ్‌చరణ్‌ - కృతి కర్బందా మధ్య (Ram Charan Sister) వచ్చే సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. అక్కా-తమ్ముడిగా వీరిద్దరు జీవించారని చెప్పవచ్చు. వీళ్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా చాలా సహజసిద్ధంగా అనిపించాయి. ఇక గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు (Kriti Kharbanda Engagement) తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై ఆమె పూర్తి ఫోకస్ పెట్టింది. అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీ (Bollywood)లోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నటుడు పులకిత్‌ సామ్రాట్‌తో ప్రేమలో పడటం గమనార్హం. హిందీలో 2016-17 మధ్య వరుసగా 'రాజ్‌: రీబూట్‌' (Raaz: Reboot), గెస్ట్‌ ఇన్‌ లండన్‌ (Guest iin London), షాది మీన్‌ జరూర్‌ ఆనా (Shaadi Mein Zaroor Aana)చిత్రాలు చేసింది.  2018-19లో ‘వీరేకి వెడ్డింగ్‌’, ‘యమ్లా పగ్లా దీవానా: పిర్‌ సే’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘పాగల్‌పంతి’ చిత్రాల్లో మెరిసి.. నార్త్‌లో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.   ఆ తర్వాత ‘తైష్‌’, ‘14 ఫిరే’ సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి నటిగా తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తద్వారా హిందీలో ప్రముఖ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది.  ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రిస్కీ రోమియో’ అనే చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అబిర్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా సన్నీ సింగ్‌ (Sunny Singh) నటిస్తున్నాడు. అలాగే మరో అన్‌ టైటిల్డ్‌ ప్రాజెక్ట్‌కు సైతం కృతి ఓకే చెప్పింది.  ఇక కృతి కర్భందా వ్యక్తిగత విషయాలకు వస్తే..  బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌ను ఈ భామ ఈ ఏడాది మార్చిలో వివాహం జరిగింది. వీరి పెళ్లికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బంధుమిత్రులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.  కృతి - పులకిత్‌ గత నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరి డేటింగ్‌పై అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. వాటికి పెళ్లి బంధంతో ఈ జంట ఫుల్‌స్టాప్‌ పెట్టింది.  కృతి.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 
    జూన్ 12 , 2024
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్‌ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సైంధవ్‌ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్‌, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు. ఎలా సాగిందంటే  గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్‌ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు ‌అలాంటిదే.  ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్‌ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్‌ కథను తీసుకున్నారు. 'సైంధవ్‌' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో  చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్‌ 'విక్రమ్‌', రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్‌ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్‌ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్‌ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్‌. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం శైలేష్‌ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్‌ పక్కన పెడితే సైంధవ్‌ మెప్పిస్తాడు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ వెంకటేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్‌ రేటింగ్‌: 3/5
    జనవరి 13 , 2024
    My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్‌.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
    My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్‌.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు: హన్సిక, ముర‌ళీశ‌ర్మ, న‌రేన్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, ప్రవీణ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్,   సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడ‌పు సంగీతం: మార్క్ కె రాబిన్‌  నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్,  సంస్థ‌: వైష్ణ‌వి ఆర్ట్స్‌ విడుద‌ల‌: 17 న‌వంబ‌ర్ 2023 టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్‌, నితీన్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్‌ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ `మై నేమ్ ఈజ్ శృతి`. హన్సిక చాలా రోజుల త‌ర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హన్సికకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? ఈ కథనంలో తెలుసుకుందాం.  కథ శృతి (హ‌న్సిక‌) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్న‌ప్పుడే తండ్రి చ‌నిపోవ‌డంతో తాత, అమ్మ పెంప‌కంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి  (న‌రేన్‌) ముఠా వ‌ల‌లో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాల‌న్నీ శృతికి తెలుస్తాయి. ఆ త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెన‌క ఎవ‌రున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్‌ పెట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే శృతిగా హ‌న్సిక మోత్వాని మంచి న‌ట‌న‌ కనబరిచింది. ప్ర‌థ‌మార్ధంలో కుటుంబం, ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మ‌లుపుల‌తో కూడిన సీన్లలో మంచి అభిన‌యం ప్రదర్శించిది. పూజా రామ‌చంద్ర‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రేమ ఇందులో వ్య‌తిరేక ఛాయ‌లున్న పాత్ర‌లో కనిపించి మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో న‌రేన్ పర్వాలేదనిపించాడు. ముర‌ళీశ‌ర్మ‌, జయ‌ప్ర‌కాశ్, ప్రవీణ్ అల‌వాటైన పాత్ర‌ల్లో తమదైన నటన కనబరిచారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? చ‌ర్మంతో కూడా వ్యాపారం చేస్తార‌నే కొత్త అంశాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్ ఓం కార్ ఈ సినిమాలో చూపించారు. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్ర‌స్తావ‌న‌తో సినిమా మొద‌లుపెట్టినా పాత్ర‌ల ప‌రిచ‌యానికి, క‌థా నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఏడాది త‌ర్వాత‌, ఆరు నెల‌ల ముందు అంటూ ముక్క‌లు ముక్క‌లుగా క‌థ‌ని చెప్ప‌డం ప్రేక్ష‌కులను గందరగోళానికి గురిచేస్తుంది. కీలక స‌న్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌య్యాడు. అయితే ద్వితియార్థంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  సాంకేతికంగా  సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కిశోర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటనట్విస్ట్‌లుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ప్రథమార్థంపండని భావోద్వేగాలు  రేటింగ్‌ : 2.5/5
    నవంబర్ 17 , 2023
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.  ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.  ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.    ‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’  ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.  https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.  ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.  https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.  ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.   తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ  సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.  https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    <strong>Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?</strong>
    Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్‌ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : టొవినో థామస్‌, చెంబన్‌ వినోద్‌, రోషన్‌ మ్యాథ్యూ, రీమా క‌ల్లింగ‌ల్‌, షైన్‌ టామ్‌ చాకో, అభిరామ్‌ రాధా కృష్ణ డైరెక్టర్‌: ఆషిక్‌ అబు సినిమాటోగ్రఫీ : గిరిష్‌ గంగాధరన్‌ ఎడిటింగ్‌ : వి. సాజన్‌ సంగీతం : బిజిబాల్‌, రెక్స్‌ విజయన్‌ నిర్మాతలు : అషిక్‌ అబు, రీమా కల్లింగల్‌ ఓటీటీ : ఆహా డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఈ వారం ఓ మ‌ల‌యాళ హ‌ర్ర‌ర్ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. 1964లో మ‌ల‌యాళంలో వ‌చ్చిన ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీల‌వెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామ‌స్‌, రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అశిక్ అబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గ‌వి నిల‌యం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి స‌ముద్ర‌తీరానికి స‌మీపంలో ఉన్న ప‌ల్లెటూళ్లో భార్గ‌వి నిల‌యం చాలా రోజులుగా మూత‌ప‌డి ఉంటుంది. ఆ బంగ‌ళా పేరు వింట‌నే ఊరివాళ్లు వ‌ణికిపోతుంటారు. భార్గ‌వి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ‌గా మారి ఆ ఇంట్లో తిరుగుతుంద‌ని అందులో అడుగుపెట్టిన వారిని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌నే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బ‌షీర్ (టోవినో థామ‌స్‌) అనే రైట‌ర్ ఆ ఊరికి కొత్త‌గా వ‌స్తాడు. భార్గ‌వి నిల‌యం చ‌రిత్ర గురించి తెలియ‌క అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్‌ (రోష‌న్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్ట‌రీని బ‌షీర్ ఎలా బ‌య‌ట‌పెట్టాడు? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే ర‌చ‌యిత పాత్ర‌లో టోవినో థామ‌స్ న‌ట‌న బాగుంది. అత‌డి లుక్‌, డైలాగ్ డెలివ‌రీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్‌ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంట‌గా రీమా క‌ల్లింగ‌ల్‌, రోష‌న్ మ‌థ్యూ ప‌ర్వాలేద‌నిపించారు. విల‌న్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్‌ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ఆషిక్‌ అబు ఒక రొటిన్‌ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ ర‌చ‌యిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్‌ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్‌ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్‌ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్‌ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్‌ స్టోరీ, బోరింగ్‌ లవ్ ట్రాక్‌, రెగ్యులర్ హార్రర్‌ సీన్స్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ టోవినో థామస్‌ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ హార్రర్‌ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్‌ అంశాలు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 06 , 2024
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    నటీనటులు : దేవ్‌ గిల్‌, చిత్రా శుక్ల, తేజస్విని పండిట్‌, ప్రవీణ్‌ టార్దే, పోసాని కృష్ణ మురళి, షియాజీ షిండే, కాలకేయ ప్రభాకర్‌, తదితరులు డైరెక్టర్‌ : పేట త్రికోఠి రచన, మాటలు : ప్రసాద్‌ వర్మ సంగీతం : రవి బస్రూర్‌ ఎడిటర్‌ : తమ్మిరాజు,&nbsp; నిర్మాతలు : దేవ్‌ గిల్‌, మిహిర్‌ సుధీర్‌, అశ్వనీ కుమార్‌ మిశ్రా విడుదల తేదీ : 30-08-2024 మగధీరలో విలన్‌గా చేసి నటుడు దేవ్‌ గిల్‌ (Dev Gill) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka Movie Review). త్రికోటి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగ దేవ్‌ గిల్‌ సక్సెస్‌ అయ్యాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీలు పని కోసం వెళ్లి 25 ఏళ్లుగా కనిపించకుండా పోతారు. వారి ఆచూకి తెలియక, అసలు బతికున్నారో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు రోధిస్తుంటారు. ఈ క్రమంలోనే పూణే పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా విక్రమార్క (దేవ్‌ గిల్‌) ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వస్తాడు. ఆపై డ్రాగ్‌ మాఫియా వ్యక్తి బిలాల్‌ (పోసాని కృష్ణమురళి)తో చేతులు కలిపి అక్రమాలకు తెరలేపుతాడు. ప్రేయసి అర్చన (చిత్రా శుక్లా) ప్రభావంతో నిజాయతీ గల పోలీసు ఆఫీసర్‌గా మారతాడు. విక్రమార్కలో మార్పుకు కారణమైన ఘటన ఏంటి? కూలి కోసం వెళ్లి మిస్సైన వారు ఏమయ్యారు? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? లేదా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే దేవ్‌ గిల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో యాక్షన్‌ కోసం అతడు పెద్దగా కష్టపడినట్లు కనిపించలేదు. అయితే లవ్ సీన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో దేవ్‌ గిల్‌ పూర్తిగా తేలిపోయాడు. ముఖంలో హావభావాలు పలికించలేక బాగా తడబడ్డాడు. హీరోయిన్‌గా చిత్రా శుక్ల నటన బాగుంది. పాత్రకు తగ్గట్లు ఆమె ఒదిగిపోయారు. విలన్‌గా చేసిన ప్రవీణ్‌, ఏసీపీ భవానీగా నటించిన తేజస్విని పండిట్ ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే సెటిల్డ్‌ నటనతో మెప్పించారు. మిగతా పాత్రదారులు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు పేట త్రికోఠి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘టెంపర్‌’, ‘పటాస్‌’ చిత్రాలను గుర్తు చేస్తుంది. కథలో మాత్రం కొత్తదనం కనిపించదు. అటు కథనం కూడా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. కథకు తగ్గట్లు హీరో నుంచి నటన రాబట్టడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హీరో-హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దేవ్‌ గిల్‌ హీరోయిన్‌ వైపు ప్రేమగా చూసిన అది విలన్‌ రోల్‌ను గుర్తు చేస్తుంటుంది. అయితే ఫైట్స్‌లో మాత్రం దర్శకుడు త్రికోఠి తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. విలన్లతో తలపడే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి పనితీరు కనబరిచింది. రవి బస్రూర్‌ అందించిన సంగీతం పూర్తిగా తేలిపోయింది. నేపథ్య సంగీతం మాత్రమే అక్కడక్కడ కాస్త పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌నిర్మాణ విలువలు మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంహీరో నటనలాజిక్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 1.5/5&nbsp;&nbsp; .
    ఆగస్టు 30 , 2024
    <strong>Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?</strong>
    Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?
    నటీనటులు : రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్‌ విజయ్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌ సంగీతం : జేబీ సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన లేటెస్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra), మన్నారా చోప్రా (Mannara Chopra) హీరోయిన్లుగా చేశారు. మకరంద్‌ దేశ్‌పాండే, రాజా రవీంద్ర, ప్రగతి ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో హీరోయిన్లుగా చేసిన రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రపై సంచలన ఆరోపణలు వచ్చాయి. రాజ్‌తరుణ్‌ తనను మోసం చేసి మాల్వీతో రిలేషన్‌లో ఉన్నట్లు అతడి మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే ఆగస్టు 2న ‘తిరగబడరా సామి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి గిరి (రాజ్ తరుణ్) చాలా పిరికివాడు. ప్రతి దానికి భయపడుతూ చుట్టూ ఏం జరుగుతున్నా అసలు పట్టించుకోడు. కానీ శైలజా (మాల్వీ మల్హోత్ర) అలా కాదు. చాలా దూకుడుతో వైలెంట్‌గా ఉంటుంది. టీజ్‌ చేసిన వారిని ఇరగ దీస్తుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. అయితే శైలజాను కంట్రోల్‌ చేయలేక గిరి ఎలాంటి తిప్పలు పడ్డాడు? వారి ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి? ఎప్పుడు సౌమ్యంగా ఉండే గిరి ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో రాజ్‌ తరుణ్‌ గిరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తొలుత అమాయకుడిగా, ఆపై ప్రేయసి కోసం శత్రువులపై తిరగబడే ప్రియుడిగా రెండు డైమన్షన్లలో మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో రాజ్‌ దుమ్మురేపాడు. ఈ స్థాయి యాక్షన్‌ సీన్స్‌ అతడు ఇప్పటివరకూ చేయలేదు. ఇక శైలజా పాత్రలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమానే అయిన్పప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. స్క్రీన్‌పై రాజ్‌ తరుణ్‌ - మాల్వీ మల్హోత్ర కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సెకండ్‌ హీరోయిన్ మన్నారా చోప్రా కూడా అద్భుతంగా నటించింది. ఇక జాన్‌ విజయ్‌, రఘుబాబు, అంకిత ఠాకూర్‌, ప్రగతి, రాజా రవీంద్ర తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఏ.ఎస్‌ రవికుమార్ ఈ చిత్రాన్ని లవ్‌ &amp; యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తొలి భాగం మెుత్తం హీరో-హీరోయిన్‌ పరిచయం, వారి లవ్‌ ట్రాక్‌తో సాగిపోయింది. గిరిని శైలజా డామినేట్‌ చేసే క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదరడంతో ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ లేకుండా వెళ్లిపోతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు డైరెక్టర్‌. రెండో భాగాన్ని హీరో ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో పూర్తిగా నింపేశారు. రాజ్‌ తరుణ్‌ను ఎన్నో మాస్‌ యాంగిల్స్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నారు. అయితే అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్స్‌ రాజ్‌తరుణ్‌ కటౌట్‌కు మించి ఉండటంతో లాజికల్‌గా కనెక్ట్‌ కాలేము. భావోద్వేగ సన్నివేశాలు సైతం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఒక మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకునేవారికి 'తిరబడరా సామి' నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే జేబీ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బీజీఎం మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే పాటలు గుర్తుంచుకునేలా లేవు. అటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రాజ్‌తరుణ్‌ నటనలవ్‌ ట్రాక్‌యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ వర్కౌట్‌ కాని ఎమోషన్స్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    <strong>Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?</strong>
    Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా సింగ్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రీరామ్‌ రెడ్డి, మహమ్మద్‌ అలీ, ముకేష్‌ కుమార్‌ తదితరులు డైరెక్టర్‌ : సామ్ ఆంటోన్‌ సంగీతం : హిప్‌హాప్‌ తమీజా సినిమాటోగ్రఫీ : క్రిష్ణన్‌ వసంత్‌ ఎడిటర్‌ : రూబెన్‌ నిర్మాత : కే.ఈ. జ్ఞానవేల్‌ రాజా&nbsp; విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 మెగా హీరో అల్లు శిరీష్‌ (Allu Sirish) చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం 'బడ్డీ' (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj), ప్రిషా సింగ్‌ (Prisha Singh) హీరోయిన్లుగా చేశారు. శామ్‌ ఆంటోన్‌ (Sam Antone) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. అడ్వెంచర్‌, యాక్షన్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లు శిరీష్‌కు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఆదిత్య రామ్‌ (అల్లు శిరిష్‌) పైలెట్‌గా చేస్తుంటాడు. వైజాగ్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్‌) అతడ్ని ప్రేమిస్తుంది. ఆదిత్య కూడా చూడకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. పల్లవి మెడికల్‌ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్‌ అవుతుంది. కోమాలోకి వెళ్తుంది.&nbsp;ఆ స్థితిలో ఆమె ఆత్మ ఒకప్పుడు ఆదిత్య గిఫ్ట్‌గా ఇచ్చిన టెడ్డీలోకి వెళ్తుంది. అలా ఆమె ఆత్మ టెడ్డీ ద్వారా ఆదిత్యను ఎలా కలిసింది? విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది? ఇందుకు ఆదిత్య, టెడ్డీ చేసిన పోరాటం ఏంటి? అసలు పల్లవి బాడీని విలన్‌ గ్యాంగ్‌ ఏం చేయాలని అనుకుంది? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్‌ అద్భుత నటన కనబరిచాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. నటుడిగా ఈ సినిమాలో గొప్ప పరిణితిని సాధించాడు. అటు గాయత్రి భరద్వాజ్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. స్క్రీన్‌పై కనిపించినంత సేపు ఆడియన్స్‌ను కనువింద్‌ చేసింది. విలన్‌గా అజ్మల్‌ అమీర్‌ ఆకట్టుకున్నాడు. అల్లు శిరీష్‌ను ఢీకొట్టే పాత్రలో అతడి నటన మెప్పిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌ ప్రిషా సింగ్‌ ఎయిర్‌ హోస్టెస్‌గా అలరించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు శామ్‌ ఆంటోన్‌ విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్ మధ్య లవ్‌ ట్రాక్‌ను చాలా అందంగా తెరకెక్కించారు. దూరంగా ఉంటూనే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. మూవీ మధ్యలో వచ్చే ‘కల్కి’, ‘జై బాలయ్య స్లోగన్స్‌’ ఆడియన్స్‌లో జోష్‌ను తీసుకొచ్చాయి. బడ్డీతో కలిసి అల్లు శిరీష్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్ మెప్పిస్తాయి. అయితే తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని రగిలించడంతో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. ముందే ప్రిడిక్ట్‌ చేసేలా సన్నివేశాలు ఉన్నాయి. అక్కడక్కడ వచ్చే అసందర్బమైన కామెడీ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. కీలకమైన క్లైమాక్స్‌లో అనవసరంగా హాస్యాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాలను పరిశీలిస్తే హిప్‌హాప్‌ తమీజా అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సాంగ్స్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. క్రిష్ణన్‌ వసంత్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటర్‌ రూబెన్‌ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా బెటర్‌ ఔట్‌పుట్‌ ఇచ్చుంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్‌ అల్లు శిరీష్‌ నటనలవ్‌ ట్రాక్‌బడ్డీతో చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్ స్క్రీన్‌ప్లేకొరవడిన క్యూరియాసిటీ&nbsp;కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    <strong>Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!</strong>
    Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ ఆకట్టుకుందా!
    నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు రచన, దర్శకత్వం: రామ్‌ భీమన సంగీతం: గోపీ సుందర్‌ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ నిర్మాత: డాక్టర్‌ రమేశ్‌ తేజవత్‌, ప్రకాశ్‌ తేజవత్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్‌ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హాసిని (Actress Hasini) హీరోయిన్‌గా చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రాజ్‌ తరుణ్‌కు హిట్‌ను అందించి ఊరట కల్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథేంటి రచిత్‌ రామ్‌ (రాజ్‌తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) ఏకైక తనయుడు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగొచ్చిన కుమారుడికి సీఈవో బాధ్యతలు అప్పగించాలని ఆదిత్య నిర్ణయించుకుంటాడు. అయితే రచిత్‌ పెద్దమ్మ వసుంధర దానికి (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్‌ ప్రకారం సీఈవోగా ఎంపికవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది. దీనికి రచిత్‌ అంగీకరించి బయటకువచ్చేస్తాడు. ఏపీలోని మారుమూల గ్రామమైన రాయపులంకకు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక రచిత్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు అతడు ఎలాంటి సాహసాలు చేశాడు? అమ్ముతో అతడి లవ్‌ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే రచిత్‌ రామ్‌ పాత్రలో రాజ్‌తరుణ్‌ చక్కటి నటన కనబరిచాడు. కోటీశ్వరుడిగా, ఎటువంటి ఐడెంటిలేని సాధారణ వ్యక్తిలా రెండు డైమన్షన్స్‌లో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఇక పల్లెటూరి అమ్మాయి అమ్ము పాత్రలో హాసిని సుధీర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా మెరిసింది. రాజ్‌తరణ్‌ - అమ్ము మధ్య వచ్చే లవ్‌ సీన్స్ మెప్పిస్తాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో ప్రవీణ్‌ నవ్వులు పూయిస్తాడు. సత్య, బ్రహ్మానందం వంటి కమెడియన్లు సినిమాలో తళుక్కుమని మెరిశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని కారణాల వల్ల ఓ సామాన్యుడిలా గడపటం గతంలో చాలా చిత్రాల్లోనే చూశాం. 'పురుషోత్తముడు' చిత్రాన్ని కూడా దర్శకుడు రామ్‌ భీమన ఈ కోవలోనే రూపొందించారు. ధనవంతుడైన హీరో రాయపులంక గ్రామం చేరాక అసలు కథ మెుదలవుతుంది. హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్టాఫ్‌ మెుత్తం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కామెడీతో ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఊర్లో జరిగే అన్యాయాలపై హీరో తిరగబడటం, ఇంటర్వెల్‌ బ్యాంగ్ మెప్పిస్తాయి. అయితే ద్వితీయార్థం నుంచి కథ గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఎలాంటి మలుపు లేకుండా ఊహకు తగ్గట్లు సాఫీగా, బోరింగ్‌గా సాగిపోతుంది. క్లైమాక్స్‌ సైతం అంచనాలకు తగ్గట్లు ఉన్నా ప్రకాశ్‌ రాజ్‌ ఎంట్రీ, అతడు చెప్పే డైలాగ్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కథ, కథనంలో వైవిధ్యం చూపడంలో దర్శకుడు రామ్‌ భీమన పూర్తిగా విఫలమయ్యాడు. సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గోపి సుందర్‌ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పీజీ విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ రాజ్‌తరుణ్‌ నటనఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్‌హీరో-హీరోయిన్‌ కెమెస్ట్రీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనంట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూలై 27 , 2024
    <strong>Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?</strong>
    Deadpool &amp; Wolverine Review: గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్‌ సీక్వెన్స్‌.. 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' ఎలా ఉందంటే?
    నటీనటులు : ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌, ఎమ్మా కొరిన్‌, మోరెనా బాక్రియన్‌, రామ్‌ డెలనే, లస్లీ ఉగ్గమ్స్‌, ఆరోన్‌ స్టాన్‌ఫోర్డ్‌ తదితరులు దర్శకత్వం : షాన్‌ లెవీ సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచ్‌మండ్ సంగీతం : రాబ్‌ సిమన్‌సెన్‌ ఎడిట‌ర్ : డీన్ జిమ్మెర్‌మాన్, షేన్ రీడ్ నిర్మాణ సంస్థ : మార్వెల్‌ స్టూడియోస్‌, మ్యాక్జిమమ్‌ ఎఫర్ట్‌, 21 ల్యాప్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల తేదీ : 26 జులై, 2024 మార్వెల్‌ (Marvel) చిత్రాల సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. భారత్‌లోనూ మార్వెల్‌ చిత్రాలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో సూపర్‌ హీరో కామిక్‌ సంస్థ మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి రూపొందిన మరో చిత్రమే 'డెడ్‌పూల్‌ &amp; వాల్వెరైన్‌' (Deadpool &amp; Wolverine). ఇద్దరు సూపర్‌ హీరోల కలయికతో రూపొందిన ఈ చిత్రం కోసం ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జులై 26న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి డెడ్‌పూల్‌ అలియాస్‌ వేడ్‌ విల్సన్‌ (ర్యాన్‌ రేనాల్డ్స్‌) సెకండ్‌ హ్యాండ్‌ కార్ల సేల్స్‌ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ తన డ్రస్‌ తీసేసి తీసేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజున టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు డెడ్‌పూల్‌ను ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616లో జాయిన్ అవ్వమంటారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్‌ (హ్యూ జాక్‌మన్‌) సాయం అవసరం అవుతుంది. ఈ క్రమంలో వాల్వెరైన్‌తో కలిసి డెడ్‌పూల్‌ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు? పారాడాక్స్‌ను ఎలా ఎదిరించారు? అతడి ఎత్తులను ఎలా చిత్తు చేశారు? టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే? డెడ్‌పూల్‌ పాత్రలో ర్యాన్‌ రెనాల్డ్స్‌ తనదైన నటనతో అదరగొట్టాడు. పూర్తిగా వినోదాన్ని పండిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపాడు. వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్‌ చేసిన సన్నివేశాలను అద్భుతంగా పండించాడు. లెజండరీ నటుడు హ్యూ జాక్‌మాన్‌ వాల్వెరైన్ పాత్రలో అద్భుతం చేశాడు. తన సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కసండ్రా పాత్రలో ఎమ్మా కోరిన్ ఆకట్టుకుంది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ రోల్స్‌లో మెప్పించారు. తమ ఎంపిక సరైందని నిరూపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు షాన్‌ లెవీ అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఫన్‌ వేలో కథను నడిపించడం సినిమాకు బాగా కలిసొచ్చింది. డెడ్‌పూల్‌ మాటలు, సెటైర్స్‌, వన్‌లైనర్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికే సరిపోగా సెకండాఫ్‌ నుంచి అసలైన కథలోకి ఆడియన్స్‌ను తీసుకెళ్లారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి ఎండ్‌ టైటిల్స్‌ వరకూ అదరహో అనిపిస్తుంది. అయితే సాలిడ్ ఎమోషన్స్‌ కూడా జోడించి ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది.&nbsp; ఓవరాల్‌గా ఒక మంచి సూపర్‌ హీరోల చిత్రాన్ని చూడాలనుకునేవారికి డెడ్‌పూల్‌ అండ్‌ వాల్వెరైన్‌ మంచి అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా తెలుగులోని డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; నేపథ్య సంగీతం చాలా బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM బాగా ఎలివేట్‌ చేసింది. అలాగే&nbsp; తెలుగు డబ్బింగ్‌ అదిరిపోయింది. పరిస్థితులకు డైలాగ్స్‌ బాగా సింక్‌ అయ్యాయి. అటు గ్రాఫిక్స్‌ టీమ్‌ మంచి పనితీరును కనబరించింది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది.&nbsp; నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూ జాక్‌మన్‌యాక్షన్‌ సీక్వెన్స్‌డైలాగ్స్‌ మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ బోరింగ్‌ సీన్స్‌ఎమోషనల్ టచ్‌ లేకపోవడం Telugu.yousay.tv Rating : 3.5/5&nbsp;&nbsp;
    జూలై 26 , 2024
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    Sasimadhanam Review: పేరెంట్స్‌ లేరని లవర్‌ ఇంటికెళ్లి ఇరుక్కుపోతే.. ఆ తర్వాత ఏం జరిగింది?
    నటీనటులు: ప‌వ‌న్ సిద్ధు, సోనియా సింగ్, రూప‌ల‌క్ష్మి, ప్ర‌దీప్ రాప‌ర్తి, కృతిక‌, అశోక్ చంద్ర‌ దర్శకులు: వినోద్ గాలి సంగీత దర్శకుడు: సింజిత్ యెర్ర‌మిల్లి సినిమాటోగ్రఫీ: రెహాన్ షేక్ ఎడిట‌ర్ : అనిల్ కుమార్ పి నిర్మాతలు : హ‌రీష్ కోహిర్క‌ర్ విడుదల తేదీ : జులై 4, 2024 ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా రూపొందిన తెలుగు లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’ (Sasimadhanam Web Series). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో పవన్‌ సిద్ధు, సోనియా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో జంటగా చేసి పాపులర్‌ అయ్యారు. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన 'శశిమథనం' సిరీస్‌ ఎలా ఉంది? వీరి కెమెస్ట్రీ ఏ మేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి వరంగల్‌కు చెందిన మదన్‌ (సిద్ధూ పవన్‌).. అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ.. ఈజీ మనీ కోసం బెట్టింగ్స్‌ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన శశి (సోనియా సింగ్‌)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్‌లో పెద్ద మెుత్తంలో డబ్బు పోగొట్టుకోవడంతో మదన్‌ చిక్కుల్లో పడతాడు. మరోవైపు శశి ఇంట్లో వారంతా పది రోజులు పెళ్లి కోసం వెళ్తున్నారని తెలిసి.. ఆమె ఇంటికి వెళ్తాడు. శశి ఇంటికి మదన్ వెళ్లిన రాత్రే పెళ్లి క్యాన్సిల్‌ అయిందని ఆమె ఇంట్లో వాళ్లు తిరిగివస్తారు. అప్పటినుంచి శశి ఫ్యామిలీకి కనబడకుండా మదన్‌ ఎలా మ్యానేజ్‌ చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? శశికి పెళ్లి చూపులు జరిగితే ఎలా చెడగొట్టాడు? శశి-మదన్‌ పెళ్లికి ఆమె ఇంట్లో వారు ఒప్పుకున్నారా? లేదా? అన్నది ఈ సిరీస్‌ కథ.&nbsp; ఎవరెలా చేశారంటే సోనియా సింగ్, సిద్ధూ పవన్ నటన.. ఈ సిరీస్‌కు అతిపెద్ద ప్లస్‌గా మారింది. నిజ జీవితంలోనూ ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్‌లో వీరి కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. ఇద్దరూ క్యూట్‌గా నటించి మెప్పించారు. శశి తండ్రిగా నటించిన ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.. తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్విస్తూనే ఎమోషనల్‌ టచ్‌ కూడా ఇచ్చారు. సిద్ధూ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూప లక్ష్మి అదరగొట్టారు. అవంతి దీపక్, శ్రీలలిత, వెంకటేష్, కృతిక రాయ్, కిరీటి.. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే.. బోల్డ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లకు భిన్నంగా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ సిరీస్‌ తెరకెక్కించడంలో దర్శకుడు వినోద్ గాలి సక్సెస్‌ అయ్యారు. రొటీన్‌ స్టోరీనే కథాంశంగా ఎంచుకున్నప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. హీరోయిన్‌ ఇంట్లో హీరో ఇరుక్కుపోవడంతో నెక్స్ట్‌ ఏం జరుగుతుందా? అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో రగిలించాడు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మదన్‌ పడే కష్టాలు, అతడికి సాయం చేసే క్రమంలో శశి పడే టెన్షన్‌ నవ్వులు పూయిస్తాయి. అయితే కొన్ని సీన్స్‌ ఎక్కడో చూసిన భావన కలగడం మైనస్‌గా చెప్పవచ్చు. పైగా సిరీస్‌ మెుత్తం ఒకే ఇంట్లో తిరగడం వల్ల విజువల్‌ పరంగా రిఫ్రెష్‌మెంట్‌ ఫీల్‌ కలగదు. స్క్రీన్‌ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది.&nbsp;క‌థ‌లో రెండో ల‌వ్ ట్రాక్‌కు సంబంధించిన అంశం బాగున్న‌ప్ప‌టికీ.. అది మెయిన్‌ క‌థ‌కు చాలా వ‌ర‌కు డ్యామేజ్ చేసింది. డైలాగ్స్‌ విషయంలోనూ దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సింజిత్ యెర్ర‌మిల్లి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా సిరీస్‌లోని రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లవ్ స్టోరీకి తగ్గట్టు విజువల్స్‌ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ సిద్ధూ, సోనియా నటనకన్ఫ్యూజన్‌ కామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసెకండ్‌ లవ్‌ ట్రాక్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    జూలై 04 , 2024
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    నటీనటులు: నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్‌, భావన సాగి, మిర్చి కిరణ్‌, అక్షయ్‌ డోగ్రా తదితరులు దర్శకుడు: అవ‌నీంద్ర సంగీత దర్శకుడు: గోవింద్‌ వసంత్‌ సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్ ఎడిటింగ్: అవనీంద్ర నిర్మాణ సంస్థ : సి స్పేస్‌ విడుదల తేదీ: జూన్‌ 7, 2024 నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli Review). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. న‌వ‌దీప్ 2.0 అంటూ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. జూన్‌ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ‘లవ్‌ మౌళి’.. నవ్‌దీప్‌కు హిట్‌ తెచ్చిపెట్టిందా? యూత్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్‌) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమ‌పై కూడా న‌మ్మ‌కం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్‌ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్ర‌ష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్‌ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్‌ పట్టి అమ్మాయి పెయింటింగ్‌ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్‌ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మౌళి పాత్రలో నటుడు నవదీప్‌ కొత్త కోణంలో కనిపిస్తాడు. అతడి లుక్‌తో పాటు నటనలోనూ వైవిద్యం కనిపించింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో అతడు చక్కటి నటన కనబరిచాడు. కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఆకట్టుకుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌ పండిస్తూనే నటనలోనూ వేరియేషన్స్‌ చూపించింది. ఇక అఘోరాగా గెస్ట్‌ పాత్రలో కనిపించి రానా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అవనీంద్ర.. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ బోల్డ్‌ లవ్‌స్టోరీగా 'లవ్‌ మౌళి'ని తెరకెక్కించారు. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. లిప్‌లాక్‌లు, బోల్డ్‌ సీన్స్‌తో.. కథను రొమాంటిక్‌గా నడిపించారు డైరెక్టర్‌. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. మౌళి లైఫ్‌లోకి చిత్ర వచ్చినప్పటికీ నుంచి అసలు కథ మెుదలవుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌, ఘర్షణలు రొటిన్‌గా అనిపిస్తాయి. అవసరం లేకున్నా వచ్చే కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్‌ను కూడా చాలా సాధారణంగా ముగించాడు. ఓవరాల్‌గా నవదీప్‌ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్‌, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు డైరెక్టర్‌.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ అందించిన మ్యూజిక్‌ పర్వాలేదు. ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన దర్శకుడు అవనీంద్ర అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరామెన్‌ అజయ్ శివశంకర్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్‌ను చాలా సహజంగా, చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నవదీప్‌, పంకూరి గిద్వానీ నటనఎమోషనల్‌ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిగా సాగని కథనంబోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూన్ 07 , 2024
    Furiosa A Mad Max Saga Movie Review: ఎడారిలో అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ‘ఫ్యూరియోసా’ ఎలా ఉందంటే?
    Furiosa A Mad Max Saga Movie Review: ఎడారిలో అద్భుతమైన యాక్షన్ డ్రామా.. ‘ఫ్యూరియోసా’ ఎలా ఉందంటే?
    నటీనటులు : అన్య టేలర్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, టామ్‌ బుర్కె, అలైలా బ్రౌనీ, జాన్‌ హౌవర్డ్‌, ల్యాచీ హుల్మే,&nbsp; అంగుస్‌ శాంప్సన్‌ తదితరులు డైరెక్టర్‌ : జార్జ్‌ మిల్లర్‌ సంగీతం : జుంకీ ఎక్స్‌ఎల్‌ సినిమాటోగ్రాఫర్‌ : సైమన్‌ డుగ్గాన్‌ ఎడిటర్‌ : మార్గరేట్‌ సిక్సెల్‌ నిర్మాత: డౌగ్‌ మిచెల్‌ గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga Review In Telugu). 2015లో వచ్చిన ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’.. యాక్షన్ సినిమాల్లో బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన మూవీ కావడంతో భారత్‌ సహా వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. తొలి భాగంలో ఆమె సిటాడెల్‌ రాజు దగ్గర నుంచి తప్పించుకోవడం చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ఆమె బాల్యం? సిడాడెల్‌ రాజు వద్దకు ఎలా వచ్చింది? అందుకు కారణం ఎవరు? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది చూపించారు. ‘థోర్’, ‘ఎక్స్‌ట్రాక్షన్’ లాంటి చిత్రాలతో భారత ఆడియన్స్‌కు దగ్గరైన క్రిస్ హెమ్స్‌వర్త్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి భూమి సారం కోల్పోయి ఎడారిగా మారే కాలంలో కథ జరుగుతుంటుంది. తల్లి మేరి (చార్లీ ఫ్రేజర్‌)తో ఉన్న ఫ్యూరియోసా (అన్య టేలర్‌)ను ఓ బైకర్‌ యంగ్‌ ఎత్తుకుపోతుంది. వెతుక్కుంటూ వచ్చిన మేరీని ఆ ముఠా లీడర్‌ డెమంటస్‌ (క్రిస్‌ హెమ్స్‌వర్త్‌).. ఫ్యూరియోసా కళ్ల ముందే దారుణంగా హత్య చేస్తాడు. ఆపై ఆమెను సంధిలో భాగంగా సిటాడెల్‌ రాజుకు ఇచ్చేస్తాడు. రాజు నుంచి తప్పించుకున్న ఫ్యూరియోసా మగ వేషం ధరించి ఓ కారణం చేత సిటాడెల్‌ సైన్యాధికారికి కుడి భుజంగా మారుతుంది. ఫ్యూరియోసా కథ చివరికి ఏమైంది? తన తల్లిని చంపిన డెమెంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎడారిలోనూ పండగల విత్తనం ఆమె చేతికి ఎలా వచ్చింది? దాంతో ఆమె ఏం చేసింది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే చిన్నప్పటి ఫ్యూరియోసాగా (Furiosa: A Mad Max Saga Review In Telugu) అలైలా బ్రౌనీ, పెద్దయ్యాక ఫ్యూరియోసాగా అన్యా టేలర్‌ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో అన్యా టేలర్‌ ఇరగదీసింది. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. ఇక ప్రతినాయకుడు డెమెంటస్‌ పాత్రలో క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ జీవించాడు. ఇప్పటివరకూ హీరోగానే పరియం ఉన్న అతడు విలన్‌గానూ తన మార్క్‌ ఏంటో చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే డైరెక్టర్‌ జార్జ్‌ మిల్లర్‌ మంచి థ్రియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించాడు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను నెక్స్ట్‌ లెవెల్‌లో తెరకెక్కించాడు డైరెక్టర్‌. పెద్దగా ల్యాగ్‌ లేకుండా సినిమా మెుదలైన 10 నిమిషాలకే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. ఫ్యూరియోసాను డెమెంటస్ గ్యాంగ్ ఎత్తుకుపోవడం, ఆమె తల్లిని చంపడం, ఫ్యూరియోసా ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరడం ఇలా&nbsp; కథ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. హీరోగా అందరికీ పరిచయమైన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ను ఈవిల్‌ వెర్షన్‌లో చూపించి డైరెక్టర్‌ ఆకట్టుకున్నాడు. అయితే యాక్షన్‌ సీన్లు మరీ లెంతీగా ఉండటం, ఎడారిలో వచ్చే క్లైమాక్స్‌ ఛేజ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. వాటిని కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్‌ వస్తుంది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Furiosa: A Mad Max Saga Review In Telugu).. ప్రతీ విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్‌ సైమన్‌ డుగ్గాన్‌ పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఫ్యూచరిక్‌ విజువల్‌ వండర్‌గా ఆయన మూవీని తీర్చిదిద్దాడు. నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. గ్రాఫిక్స్‌ టీమ్‌ పనితీరు కూడా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ అన్య టేలర్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ నటనయాక్షన్ సీక్వెన్స్‌సాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 24 , 2024
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024
    Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;
    Shruti Marathe: ‘దేవర’లో తారక్‌ భార్యగా గుజరాతి బ్యూటీ.. శ్రుతి మరాఠే ఎంత ఫేమస్సో తెలుసా?&nbsp;
    'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'దేవర' (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే రెండో పాత్రకు జోడీగా గుజరాతీ నటి శ్రుతి మరాఠే (Shruti Marathe) నటిస్తోంది.&nbsp; దేవరలో నటించే విషయాన్ని శ్రుతినే స్వయంగా ప్రకటించడంతో ఆమె పేరు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ భామ గురించి తెలుసుకునేందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు.&nbsp; గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో 9 అక్టోబర్‌, 1986 శ్రుతీ జన్మించింది. అక్కడి సెయింట్‌ మీరాస్‌ కాలేజీ (St. Mira's College)లో ఆమె చదువుకుంది.&nbsp; కెరీర్‌ ప్రారంభంలో శ్రుతి మరాఠే మోడల్‌గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి గుర్తింపు పొందింది.&nbsp; అలా మరాఠీ సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన శ్రుతి.. రాధ హయ్ బవారి (Radha Hi Bawari), జాగో మోహన్‌ ప్యారే (Jaago Mohan Pyare), మఝ్యా నవర్యాచి బేకూ (Majhya Navaryachi Bayko) వంటి సీరియళ్లతో చాలా పాపులర్ అయ్యింది.&nbsp; 2008లో వచ్చిన 'సనాయ్‌ చౌగదే' (Sanai Choughade) అనే మరాఠీ సినిమాతో ఆమె వెండితెరపై అడుగుపెట్టింది. అందులో అశ్విని పాత్రలో కనిపించి అలరించింది.&nbsp; ఆ తర్వాత 'ఇందిరా విఝా' (Indira Vizha) సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా గుర్తింపు సంపాదించింది. మరాఠి, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.&nbsp; 2016లో వచ్చిన&nbsp; బుధియా సింగ్‌ - బొర్న్‌ టూ రన్‌' (Budhia Singh – Born to Run) సినిమాతో శ్రుతి.. బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడాది 'వెడ్డింగ్‌ యానివర్సరీ'తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. 'బార్డ్ ఆఫ్‌ బ్లడ్‌' (Bard Of Blood) వెబ్‌సిరీస్‌లోనూ శ్రుతి నటించింది. బాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్‌లో 'దేవర'నే మెుదటి సినిమా. శ్రుతి మరాఠే వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమెకు 2016లోనే వివాహమైంది. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్‌ ఘట్నేకర్‌ (Gaurav Ghatnekar) ఆమె వివాహం చేసుకుంది.&nbsp; విహార యాత్రలను ఎక్కువగా ఇష్టపడే ఈ భామకు బోటింగ్ అంటే ఇంకా ఇష్టమట. షూటింగ్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా కుటుంబంతో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుందట.&nbsp; ఈ సోషల్‌ మీడియాలోనూ శ్రుతి మరాఠీ చాలా చురుగ్గా ఉంటోంది. ఇంట్లో వాళ్లతో కలిసి చేసిన రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.&nbsp; శ్రుతి.. అప్పుడప్పుడు గ్లామర్‌ ఫొటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది.
    మార్చి 27 , 2024
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    Game Changer Story: షాకింగ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కథ లీక్‌.. ఆందోళనలో రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) వంటి గ్లోబల్‌ స్థాయి సక్సెస్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). దిల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో చరణ్‌ జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన లీకుల మినహా ఈ సినిమాపై యూనిట్‌ నుంచి చెప్పుకోతగ్గ అప్‌డేట్‌ రాలేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ కథను లీక్‌ చేయడం గమనార్హం.&nbsp; కథ ఏంటంటే? మంగళవారం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఆధ్వర్యంలో భారీ ఈవెంట్‌ జరిగింది. త్వరలో తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ హక్కులు సైతం తామే దక్కించుకున్నట్లు ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. అంతటితో ఆగకుండా త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోయే సినిమాలు/ సిరీస్‌లకు సంబంధించిన స్టోరీ లైన్స్‌తో పాటు గేమ్‌ ఛేంజర్‌ ప్లాట్‌ను అమెజాన్‌ బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ’. ప్రస్తుతం ఈ ప్లాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.&nbsp; View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) వామ్మో ఏకంగా అన్ని కోట్లా! ‘గేమ్ ఛేంజర్’ సినిమా అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలోకి రాకముందే ఇంత భారీ ధర పెట్టి కొన్నారా? అని సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా రూ.110 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. బడ్జెట్‌లో సగం రిలీజ్ అవ్వకుండా నిర్మాతలకు వచ్చేస్తుంది. ఈ వార్త నిజమైతే ఈ స్థాయిలో ఓటీటీ హక్కులకు అమ్ముడుపోయిన తొలి తెలుగు చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది.&nbsp; గ్రాండ్‌గా ఆరంభమైన 'RC16’ గేమ్‌ ఛేంజర్‌ తర్వాత రామ్‌చరణ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుతో తీయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, బుచ్చిబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్‌ శంకర్‌, హీరోయిన్ జాన్వీ కపూర్‌, ఆమె తండ్రి బోని కపూర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/1012_raj/status/1770365882738573469 ఆ రోజున డబుల్‌ ధమాకా! మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గ్రాండ్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ‘గేమ్ ఛేంజర్‌’, ‘RC16’ మేకర్స్ సిద్ధమవుతున్నారు. చరణ్‌ బర్త్‌డే రోజున ఓ అప్‌డేట్‌ ఉందని ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ యూనిట్‌ ప్రకటించింది. అదే రోజున ‘RC16’ డైరెక్టర్‌ బుచ్చిబాబు కూడా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ రోజున ఫ్యాన్స్‌ డబుల్ ట్రీట్ లభించనుంది.&nbsp;&nbsp;
    మార్చి 20 , 2024
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. మోడ్రన్‌ డ్రెస్‌ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్‌ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రీసెంట్‌గా అనంత్‌ అంబాని - రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్‌ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్‌ నెక్లెస్‌ ధరించి అందరి దృషి ఆకర్షించింది.&nbsp; స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్‌ హెయిర్‌ స్టైల్‌.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది. చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్‌ కలర్‌ డిజైనర్‌ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.&nbsp;&nbsp; ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్‌ కలర్‌ శారీలో జాన్వీ కపూర్‌ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.&nbsp; గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు.&nbsp;పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.&nbsp; కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్‌ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.&nbsp; పెద్ద పెద్ద డిజైనర్‌ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్‌ స్పెషల్‌గా చెప్పవచ్చు.&nbsp; జాన్వీ కపూర్‌ మిస్మరైజింగ్‌ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.&nbsp; ఈ స్టైలిష్‌ రెడ్ శారీలో జాన్వీ కపూర్‌.. ఘాటైన రెడ్‌ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్‌ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్‌ నెవర్‌ బీఫోర్‌లా అనిపిస్తాయి.&nbsp; జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్‌ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌తో మ్యాచింగ్‌ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.&nbsp;
    మార్చి 06 , 2024

    @2021 KTree