• TFIDB EN
  • బూట్‌కట్ బాలరాజు
    UATelugu
    ఊరిలో పనిపాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు (బూట్‌కట్‌ బాలరాజు) ఊరి పెద్ద (ఇంద్రజ) కూతుర్ని ప్రేమిస్తాడు. అదే సమయంలో మరో యువతి కూడా అతడ్ని ప్రేమిస్తుంది. కొన్ని పరిణామాల నేపథ్యంలో హీరో సర్పంచ్‌ అభ్యర్థిగా ఊరిపెద్దపై పోటీకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో ప్రేమకథ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    YouSay Review

    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?

    బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్‌ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్‌ ప్ర...read more

    How was the movie?

    తారాగణం
    సయ్యద్ సోహెల్
    బాలరాజు
    మేఘలేఖ కాచర్ల
    మహా లక్ష్మి
    సునీల్
    PK
    ఇంద్రజ
    ఇంద్రావతి పటేల్
    వెన్నెల కిషోర్
    బ్రహ్మాజీ
    ముక్కు అవినాష్ముఖేష్
    జబర్దస్త్ రోహిణి
    సిరి హనుమంత్
    సుమన్
    నారాయణ పటేల్
    సిబ్బంది
    శ్రీ కోనేటిదర్శకుడు
    Md. పాషానిర్మాత
    శ్రీ కోనేటిరచయిత
    భీమ్స్ సిసిరోలియో
    సంగీతకారుడు
    శ్యామ్ కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    విజయ్ వర్ధన్ఎడిటర్ర్
    కథనాలు
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం  ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.  హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.  సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. & Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘నా సినిమాకు వెళ్లండన్నా’ ‘బూట్‌కట్‌ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్‌ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.  https://twitter.com/i/status/1753489890397098009 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే! బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్‌ సాబ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్‌ (Sohel) డిమాండ్‌ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ సినిమాలకే కంటెంట్‌ ఉన్న ఆడియన్స్‌ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్‌ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్‌ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  నటుడు సోహెల్‌ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్‌ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.  ఇండస్ట్రీలో సక్సెస్‌ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్‌ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్‌ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.  సోహెల్‌ ఫ్రస్టేషన్‌కు కారణమిదే! బిగ్‌బాస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్‌ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్‌’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్‌ అల్లుడు’, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం 'బూట్‌కట్‌ బాలరాజు' సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్‌ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్‌ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు. 
    ఫిబ్రవరి 03 , 2024
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Bootcut Balaraju Review: హైపర్‌ యాక్టివ్‌ కుర్రాడిలా మెప్పించిన సోహెల్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు దర్శకుడు : కోనేటి శ్రీను నిర్మాత: ఎండీ పాషా సంగీత దర్శకులు: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి ఎడిటింగ్: వినయ్ రామస్వామి విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024 బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్‌ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’తో మెప్పించిన ఇతడు తాజాగా (ఫిబ్రవరి 2న) ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించగా సునీల్‌, ఇంద్రజ, అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ కోనేటి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సోహెల్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్ర‌జ‌) కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలరాజు - మహాలక్ష్మి ప్రేమించుకుంటారు. మరోవైపు బాలరాజును సిరి (సిరి హనుమంతు) కూడా ప్రేమిస్తుంటుంది. అయితే బాలరాజు - మహాలక్ష్మి ప్రేమ కథకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే ఇందులో సోహైల్‌.. హైపర్‌ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిలా (Bootcut Balaraju Review) మెప్పించాడు. చక్కటి భావోద్వేగాలను పలికించాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్‌ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. బాలరాజు ఫ్రెండ్స్‌గా అవినాష్‌, సద్దాం కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి అలరించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కోనేటి శ్రీను తీసుకున్న కథ, సోహెల్ - ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించాడు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్‌ అవడానికి ఏం చేశాడనేది చూపించాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా సీన్స్ సినిమాకి బలహీనతగా మారాయి. దర్శకుడు కంటెంట్‌ను స్క్రీన్‌పై బాగా ఎలివేట్ చేసినా.. రొటిన్‌, బోరింగ్ సీన్స్ వల్ల అది ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.  టెక్నికల్‌గా  సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bootcut Balaraju Review).. భీమ్స్‌ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్యం సంగీతం కూడా కీలక సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది. ఎడిటర్‌ వినయ్ రామస్వామి తన కత్తెరకు మరింత పని కల్పించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ సోహేల్‌, ఇంద్రజ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథనంబోరింగ్‌ సీన్లు రేటింగ్‌: 3/5
    ఫిబ్రవరి 03 , 2024

    @2021 KTree