• TFIDB EN
  • బాయ్స్
    UATelugu2h 57m
    ఐదుగురు కాలేజీ కుర్రాళ్లు జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా అమ్మాయిల వెంటపడుతూ, పార్టీలకు వెళ్లి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చిన తర్వాత వారి జీవితం మలుపు తిరుగుతుంది. వారిలో ఒక జంట తమ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వివాహం చేసుకోవడంతో సమస్యల్లో పడుతారు. జీవనోపాధి లేక ఇబ్బందుల్లో పడుతారు. మరి చివరికి ఏమైంది? తల్లిదండ్రులను ఎదురించిన వాళ్లు జీవితంలో రాణించారా? లేదా? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌SunNext
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సిద్ధార్థ్
    జెనీలియా డిసౌజా
    భరత్
    వివేక్
    తమన్ ఎస్
    మణికందన్
    నఖుల్
    శ్వేత
    అమండా
    సింధూరి
    రేషు
    అనితా రత్నం
    AV రమణన్
    జానకి సబేష్
    ఇళవరసు
    కలైరాణి
    సుభాషిణి
    రవిరాజ్
    కె.బి.మోహన్
    కమల్ చోప్రా
    భువనేశ్వరి అకా పూనైక్కన్ భువనేశ్వరి
    చిట్టి బాబు
    మనోబాల
    రాంజీ
    ఢిల్లీ కుమార్
    ఏసీ మురళీ మోహన్
    సూర్యకాంత్
    సెంథిల్
    హరిహరన్
    బ్లేజ్
    విజయ్ యేసుదాస్
    రంజిత్
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    సోలమన్ పాపయ్య
    రవి ప్రకాష్
    రాజన్
    సిబ్బంది
    ఎస్. శంకర్
    దర్శకుడు
    AM రత్నం
    నిర్మాత
    సుజాత
    రచయిత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    విటి విజయన్
    ఎడిటర్
    కథనాలు
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    ]4. బట్టర్, ఆన్, లౌడర్ ధాన్ బాంబ్స్, బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్ వంటివి గుర్తింపు పొందాయి. Listen Now
    ఫిబ్రవరి 14 , 2023
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను  కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన  తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.  మార్చి 29న తెలుగులోకి..! శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.  కలెక్షన్స్‌లో టాప్‌- 5 ఇవే 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్‌), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్‌) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.  ఈ సినిమా కథేంటి? 2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’  చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 19 , 2024
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం.  127 హవర్స్ ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం. నిజ జీవితం ఆధారంగా.. 127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే... ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు.   ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం  జేమ్స్ ఫ్రాన్స్ కో  సాహసాలంటే మహా  ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి  మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన  బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో  ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు.  ఎలా బయటపడ్డాడంటే? లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.  డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ  మంజుమ్మేల్ బాయ్స్  చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో "127 హవర్స్" సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
    మే 15 , 2024
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు మరో మలయాళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సిద్ధమవుతోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లేటెస్ట్‌ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్‌’ (Manjummel Boys Telugu Release) తెలుగులోనూ విడుదల కాబోతోంది. గత నెల ఫిబ్రవరిలో కేరళలో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మలయాళ సినిమాలపై ఆసక్తి కనబరిచే టాలీవుడ్‌ ఆడియన్స్‌.. ఈ చిత్రం ఎప్పుడు తెలుగులో వస్తుందా ‌అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది. తెలుగులో వచ్చేది ఆ రోజే! ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ‘మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆ పోస్టర్‌కు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.  ‘ప్రేమలు’ రికార్డ్‌ను బద్దలుకొట్టేనా? మలయాళం సూపర్‌ హిట్‌ సినిమా ‘ప్రేమలు’ (Premalu).. మార్చి 8న తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించింది. తద్వారా తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును ‘మంజమ్మల్‌ బాయ్స్‌’ బీట్‌ చేస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో వస్తుడంటంతో తెలుగులోనూ మంచి పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి.  రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌  సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా దీనిని తెరకక్కించాడు. రిలీజ్‌ అనంతరం గొప్ప సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం.. మలయాళంలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అటు తమిళంలోనూ ఇటీవల ఈ చిత్రం రిలీజ్‌ కాగా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా,  ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు. అటు  ఈ సినిమా కథేంటి? ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 27 , 2024
    <strong>Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్‌ చాలు’ వీడియో వైరల్!</strong>
    Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్‌ చాలు’ వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అటువంటి టాప్‌ హీరోలు ఒక సినిమాను ప్రమోట్‌ చేస్తే ఇంకెంత అటెన్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఏపీ ఉపముఖ్యమంత్రి తన మూవీ షూటింగ్స్‌లోనే పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘డ్రింకర్‌ సాయి’ సినిమా యూనిట్‌ వారిచేత సరికొత్త ప్రమోషన్స్‌కు తెర లేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  కటౌట్‌తో ప్రమోషన్స్‌ ధర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'డ్రింకర్‌ సాయి'. బ్రాండ్ ఆఫ్‌ బ్యాడ్ బాయ్స్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్‌ 27న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కిరణ్‌ తిరుమలశెట్టి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. వారి సమక్షంలో తన సినిమా ఈవెంట్‌ జరగాలన్న ఉద్దేశ్యంతో పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. హీరో ధర్మ.. ప్రభాస్‌కు అభిమాని కావడంతో డార్లింగ్‌ పోస్టర్‌ను సైతం వేదికపై పెట్టారు. ఇది చూసి ఈవెంట్‌కు వచ్చిన వారంతా చప్పట్లో వారిని అభినందించారు.&nbsp; https://twitter.com/tollymasti/status/1866099251031450077 పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా? ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో తమ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు మేకర్స్‌ వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రింకర్‌ సాయి టీమ్‌ కూడా స్టేజీపై పవన్‌, ప్రభాస్‌ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రభాస్‌, పవన్‌పై అభిమానంతోనే డైరెక్టర్‌, హీరో తమ హీరోల పోస్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయా హీరోల అభిమానులను తమ సినిమా చూసేలా ప్రేరేపించడం కోసమే వారు ఈ విధంగా చేసి ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ‘డ్రింకర్‌ సాయి’ టీమ్‌ ఆలోచనకు సెల్యూట్‌ చేయాల్సిందేనని అంటున్నారు.  https://twitter.com/shreyasmedia/status/1866107400769433812 ఆ సినిమాలు కూడా అంతే.. ఇటీవల విడులైన 'మట్కా' (Matka) సినిమా కోసం హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) వినూత్నంగా ప్రమోషన్స్‌ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు. తన గత చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని చేసిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) బామ్మర్ది సుధీర్‌ బాబు (Sudheer Babu) కూడా తన రీసెంట్‌ చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Ma Nanna Super Hero) సినిమాకు సరికొత్తగా ప్రమోషన్స్‌ చేశాడు. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్‌ కనిపించేలా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ ప్రమోషన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి.  https://twitter.com/SkyPspk/status/1856617018276839798 https://twitter.com/isudheerbabu/status/1843218217977966798 https://twitter.com/isudheerbabu/status/1842084097621164229
    డిసెంబర్ 10 , 2024
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    <strong>Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!</strong>
    Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!
    యానిమల్ (Animal Movie) బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ప్రస్తుతం వెకేషన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బికినీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్న ఈ అమ్మడు.. అక్కడి అందమైన తీర ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తాజాగా బికినిలో ఫొటో షూట్‌ నిర్వహించి ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; ఎద, థైస్‌ అందాలతో త్రిప్తి దిమ్రి హోయలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆఫ్‌ స్క్రీన్‌లో ఈ స్థాయిలో అందాల జాతర చేయడం ఇదే తొలిసారని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; ఉత్తరాఖండ్‌ గర్వాల్‌లో 23 ఫిబ్రవరి, 1994లో జన్మించిన త్రిప్తి.. 2017లో వచ్చిన ‘పోస్టర్‌ బాయ్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.&nbsp; ఇందులో రియా పాత్రలో అదరగొట్టినప్పటికీ త్రిప్తికి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్‌బుల్‌' 'ఖాలా' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన ‘యానిమల్‌’ (2023) చిత్రం.. త్రిప్తి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.&nbsp; ఇందులో ‘జోయా’ పాత్రలో కనిపించిన త్రిప్తి.. తన అంద చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా రణ్‌బీర్‌తో ఆమె చేసిన బెడ్‌రూమ్‌ సన్నివేశాలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘యానిమల్‌’లో త్రిప్తి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆమె తన గ్లామర్‌తో రాత్రి రాత్రికే స్టార్‌ నటిగా మారిపోయింది.&nbsp; యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే సందడి చేసింది. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్తి దిమ్రికి.. యానిమల్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడిని వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ‘బ్యాడ్‌ న్యూస్‌’, ‘విక్కి విద్య కా వోహ్‌ వాలా వీడియో’, ‘భూల్‌ భులయ్యా 3’, ‘ధడక్‌ 2’ చిత్రాల్లో ప్రస్తుతం త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ఇక పుష్ప 2 చిత్రంలోనూ త్రిప్తి దిమ్రి ఓ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయమై చిత్ర యూనిట్‌ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    జూన్ 19 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌&nbsp; తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న&nbsp; థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..&nbsp; పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.&nbsp; (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.&nbsp; మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.&nbsp; యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి &amp; హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,&nbsp; మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన&nbsp; కృష్ణ (రాహుల్ విజయ్)ని&nbsp; ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    తృప్తి డిమ్రి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తృప్తి డిమ్రి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తృప్తి డిమ్రి..యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తన గ్లామరస్ షోతో ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ హాట్ డాల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తృప్తి డిమ్రి పుట్టిన తేదీ? ఫిబ్రవరి 23,&nbsp; 1994 తృప్తి డిమ్రి ఎక్కడ పుట్టింది? గార్వాల్, ఉత్తరాఖండ్ తృప్తి డిమ్రి నటించిన తొలి సినిమా? పోస్టర్ బాయ్స్(2017, హిందీ) తృప్తి డిమ్రికు గుర్తింపు తెచ్చిన సినిమా? యానిమల్(2023). ఈ చిత్రంలో ఆమె చేసిన జోయా క్యారెక్టర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. తృప్తి డిమ్రి ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; తృప్తి డిమ్రి తల్లిదండ్రుల పేర్లు? దినేష్ డిమ్రి, మినాక్షి డిమ్రి తృప్తి డిమ్రి అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్&nbsp; తృప్తి డిమ్రికి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ తృప్తి డిమ్రికి ఇష్టమైన కలర్?&nbsp; రెడ్ తృప్తి డిమ్రి ఫెవరెట్ హీరో? ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ తృప్తి డిమ్రి ఫెవరెట్ హీరోయిన్? దీపిక పదుకునే తృప్తి డిమ్రి పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. తృప్తి డిమ్రి&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/me.radhakrishnan/?hl=en https://www.youtube.com/watch?v=-SxWOtOS5qc
    ఏప్రిల్ 29 , 2024
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం: &nbsp;సుశిన్&nbsp; శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇక్క‌డ కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టనుందా? అసలు ఈ చిత్ర కథేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ నడుపుతుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్.. 150 అడుగులకు పైగా లోతున్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? పోలీసులు, ఫైర్ సిబ్బంది కాకుండా సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా? అన్న‌ది కథ. ఎవరెలా చేశారంటే కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అహ్లాదకరమైన సన్నివేశాల్లోనూ.. ఉత్కంఠభరిత సీన్లలోనూ చక్కగా నటించి ఒదిగిపోయారు. ఓ నిజమైన స్నేహితుల బృందాన్ని తెరపై చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కల్పించడంలో వారంతా సక్సెస్‌ అయ్యారు. ఇక లోయలో చిక్కుకున్నప్పుడు షాబిన్‌ షాహిర్‌, సుభాష్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ దశలో ఇదంతా నిజమేమోనన్న భావనను కలిగిస్తుంది. తెర కనిపించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? 2006లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌.. క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నమన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలిగేలా దర్శకుడు క‌థ‌ను న‌డిపించాడు. విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. మంజుమ్మ‌ల్ గ్యాంగ్ చేసే అల్లరితో డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. సుభాష్.. లోయలో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఉత్కంఠభరితంగా మారుతుంది. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్‌ తెరకెక్కించారు. సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్‌ యూత్‌కు మినహా మిగిలిన వయసుల వారికి అంతగా కనెక్ట్‌ కాకపోవచ్చు. చివరిగా చక్కటి ముగింపుతో డైరెక్టర్‌ చిదంబరం అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కించేలా చేశారు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. డైరెక్టర్‌, నటీనటుల తర్వాత ఎక్కువ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌ షైజు ఖలీద్‌కు ఇవ్వాల్సిందే. కేవ్‌ సెటప్‌ను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. నిజంగా ఒక కేవ్‌లో ఉన్నామన్న ఫీలింగ్‌ను తన కెమెరా పనితనంతో ఆడియన్స్‌లో&nbsp; కలిగించాడు. అలాగే నేపథ్యం సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథఉత్కంఠరేపే సెకండాఫ్‌సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3.5/5
    ఏప్రిల్ 06 , 2024
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ  జాతకం మార్చనుందా?
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్‌ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్‌ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు. గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్‌ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్‌' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్‌' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 30 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    యంగ్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్‌ లుక్స్‌, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.&nbsp; ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన&nbsp; 'డీజే టిల్లు 2' ట్రైలర్‌ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.&nbsp; కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.&nbsp; ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.&nbsp; రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.&nbsp; ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.&nbsp; అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.&nbsp; గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .&nbsp; కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్‌ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు. మాస్‌ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్‌ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.&nbsp; అలాగే తమిళంలో 'సైరెన్‌' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    <strong>Bigg Boss Telugu 8 Winner: విన్నర్‌ ఎంపికలో కుట్ర? గౌతమ్‌కు అన్యాయం జరిగిందా?</strong>
    Bigg Boss Telugu 8 Winner: విన్నర్‌ ఎంపికలో కుట్ర? గౌతమ్‌కు అన్యాయం జరిగిందా?
    తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 8 విజేత (Bigg Boss Telugu 8 Winner)గా కన్నడ నటుడు నిఖిల్‌ (Nikhil Maliyakkal) నిలిచాడు. తనకు గట్టి పోటీ ఇచ్చిన గౌతమ్‌ (Gautham P. Krishna)ను వెనక్కి నెట్టి ఆదివారం (డిసెంబర్‌ 15) రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతీ కారును గెలుచుకున్నాడు. 105 రోజుల పాటు కొనసాగిన ఈ రియాలిటీ షోలో నిఖిల్‌కు గౌతమ్‌ గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన అతడు ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఓ దశలో అతడే విజేత అన్న అభిప్రాయాన్ని అందరిలో కలిగించాడు. తెలుగు వ్యక్తినే విజేతగా నిలపాలని అతడికి అనుకూలంగా కంపైయిన్‌ కూడా నడిచింది. ఈ క్రమంలో నిఖిల్‌ విజేతగా నిలవడం నెట్టింట తీవ్ర చర్చను లేవనెత్తింది. నిఖిల్‌ కుట్రపూరితంగా గెలిచారని పలువురు ఆరోపిస్తున్నారు. బిగ్‌బాస్‌ టీమ్‌, స్టార్‌మా వర్గాలు కావాలనే గౌతమ్‌ను ఓడించాయని ఆరోపిస్తున్నారు.  ఆ పోలింగ్స్‌లో గౌతమ్‌ టాప్‌! వైల్డ్‌ కార్డ్స్‌ ఎంట్రీకి ముందు వరకూ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Bigg Boss Telugu 8 Winner)లో నిఖిల్‌ తిరుగులేని కంటెస్టెంట్‌గా కొనసాగుతూ వచ్చాడు. అప్పటివరకూ వార్‌ వన్‌ సైడ్ అన్నట్లు సాగిన నిఖిల్‌ దూకుడుకు వైల్డ్‌కార్డ్‌ ద్వారా వచ్చిన గౌతమ్‌ బ్రేకులు వేశాడు. నిఖిల్‌ తప్పొప్పులను నిర్భయంగా బయటపెడుతూ తన గ్రాఫ్‌ను అమాంతం పెంచుకున్నాడు. ఓ దశలో నిఖిల్‌ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంపెయిన్‌ సైతం సోషల్‌ మీడియాలో నడిచింది. మన తెలుగు వ్యక్తిని బిగ్‌బాస్‌ విజేతగా నిలుపుదామంటూ బిగ్‌బాస్ లవర్స్‌ పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. పలు యూట్యూబ్‌ ఛానళ్లు నిర్వహించిన అన్‌ అఫిషియల్‌ పోలింగ్‌లో గౌతమ్‌ టాప్‌లో నిలిచాడు. దీంతో అతడి విజయం లాంఛనమే అని గౌతమ్‌ ఫ్యాన్స్ భావించారు. అయితే అఫిషియల్‌ ఓటింగ్‌లో నిఖిల్‌ టాప్‌లో ఉన్నాడని హోస్ట్‌ నాగార్జున ప్రకటించి అతడికి ట్రోఫీ అందజేశాడు.  విన్నర్‌ ఎంపికలో కుట్ర జరిగిందా? విజేత నిఖిల్‌.. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. స్టార్‌మాలో వచ్చిన ‘గోరింటాకు’, ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ సీరియల్స్‌తోపాటు ‘కిర్రాక్‌ బాయ్స్‌’, ‘ఖిలాడీ గర్ల్స్‌’ వంటి రియాలిటీ షోలలో అలరించాడు. దీంతో స్టార్‌మాలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8లో అతడికి అవకాశం దక్కింది. అయితే రన్నరప్‌ గౌతమ్‌తో పోలిస్తే స్టార్‌మా వర్గాలతో నిఖిల్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. గ్రూప్‌ గేమర్‌, సేఫ్‌ గేమర్‌ అంటూ అతడిపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఓటింగ్‌ పరంగా అతడిపై ఎలాంటి నెగిటివ్‌ ప్రభావం పడలేదు. సోషల్‌ మీడియాలో సైతం నెగిటివ్‌ వార్తలు ప్రచారమైనా అతడి గ్రాఫ్‌ తగ్గకపోవడం గౌతమ్‌ ఫ్యాన్స్‌లో అనుమానాలకు కారణమైంది. బిగ్‌బాస్‌, స్టార్‌మా టీమ్‌ నిఖిల్‌కు అండగా నిలుస్తున్నారని, ఓట్లు తక్కువ వచ్చినా కూడా అతడ్ని కాపాడుకుంటూ వస్తున్నారన్న ఆరోపణలు సైతం చేశారు. ఈ క్రమంలోనే నిఖిల్‌ విజేతగా ప్రకటిండంతో గౌతమ్‌ ఫ్యాన్స్ కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.&nbsp; ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? రన్నరప్‌గా నిలిచి కొద్దిలో ట్రోఫీ చేజార్చుకున్న గౌతమ్‌ కృష్ణ (Bigg Boss Telugu 8 Winner)కు ఆయన ఫ్యాన్స్‌ నెట్టింట అండగా నిలుస్తున్నారు. నిఖిల్‌ కప్‌ గెలిస్తే.. గౌతమ్‌ హృదయాలను గెలుచుకున్నాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఒక వ్యక్తి వైపుకి ఏకపక్షంగా సాగుతున్న సీజన్‌ను అద్భుతమైన ఫైట్‌తో ఇంట్రస్టింగ్‌గా షోను మార్చాడని ప్రశంసిస్తున్నారు. సీజన్‌ 8కి ‘గేమ్‌ ఛేంజర్‌’లా మారావని ప్రశంసిస్తున్నారు. గౌతమ్‌ (Gautham P. Krishna) రియల్‌ విజేత అంటూ పోస్టులు పెడుతున్నారు. వన్‌ వర్సెస్‌ మెనీ అంటూ అనాలిసిస్‌ పోస్టులను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్‌ రన్నరప్‌ వార్త తెలిసిన వెంటనే అతడి ఫ్యాన్స్ ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఆందోళనకు దిగారు. తెలుగు వ్యక్తికి అన్యాయం చేస్తున్నారంటూ బిగ్‌బాస్‌ నిర్వాహకులపై మండిపడ్డారు.&nbsp; https://twitter.com/BBTeluguViews/status/1868302442619978113 https://twitter.com/urstruly_dhfm_x/status/1868305653942411348 https://twitter.com/_Lucky_Raj_/status/1868580834183459288 గౌతమ్‌ సంపాదన ఎంతంటే? బిగ్‌బాస్‌ విజేతగా నిలిచిన నిఖిల్‌ (Nikhil Maliyakkal)కు పెద్ద మెుత్తంలో ప్రైజ్‌ మనీ లభించిన సంగతి తెలిసిందే. మరి రన్నరప్‌గా నిలిచిన గౌతమ్‌ (Gautham P. Krishna)కు ఏం దక్కిందని అందరూ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి గత సీజన్‌లోనే గౌతమ్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫైనల్‌ చేరలేదు. ఈ సారి టాప్‌ 2లో నిలిచి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే వారానికి రూ.1.75 లక్షల చొప్పున రెమ్యూనరేషన్‌ అందుకునేలా బిగ్‌బాస్‌ టీమ్‌తో గౌతమ్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెుత్తం పది వారాల పాటు హౌస్‌లో కొనసాగినందున అతడికి పారితోషికం రూపేణా దాదాపు రూ.రూ.17,50,000 అందనున్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/igauthamkrishna/status/1868328855792206212
    డిసెంబర్ 16 , 2024
    <strong>HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!</strong>
    HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
    ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్‌ మోస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్‌ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; థమన్‌ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్‌. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.&nbsp; థమన్‌ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్‌ సింగర్‌. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది. ఓ సారి థమన్‌ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్‌ డ్రమ్‌ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్‌ వాయించడం ప్రాక్టిస్‌ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట. థమన్‌ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.&nbsp; థమన్‌ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.&nbsp; థమన్‌ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.&nbsp; అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్‌ షోలు చేసి థమన్‌ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.&nbsp; అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్‌ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్‌ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.&nbsp; ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్‌ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం. ఒకప్పటి స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ దగ్గర వర్క్‌ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్‌ ఇచ్చిందని థమన్‌ చెబుతుంటాడు.&nbsp; ముఖ్యంగా మణిశర్మ టీమ్‌ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్‌ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.&nbsp; 24 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన థమన్‌.. తమిళ చిత్రం 'సింధనాయ్‌ సె' (2009) తొలిసారి వర్క్‌ చేశారు.&nbsp; రవితేజ హీరోగా చేసిన ‘కిక్‌’ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌. ఈ సినిమాలో సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతో థమన్‌ పేరు మారుమోగింది.&nbsp; ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.&nbsp; తారక్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్‌ సంగీతం అందించారు.&nbsp; ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్‌’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.&nbsp; థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్‌ సంగీతం అందించిన బాడీ గార్డ్‌ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.&nbsp; థమన్‌ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు. థమన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్‌ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.&nbsp; ఏ.ఆర్‌. రెహమాన్‌ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్‌ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు. తాజాగా&nbsp; తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్‌ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.&nbsp; థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్‌, కాపీ గోట్‌ అంటూ మీమర్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.&nbsp; ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్‌ చెప్పాడు.
    నవంబర్ 16 , 2024
    <strong>Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;</strong>
    Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;
    ‘RRR’ తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్‌ రిలీజ్‌ తేదీని చిత్ర బృందం లాక్‌ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్‌ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; టీజర్‌ ఎప్పుడంటే? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ జరగనున్నట్లు వెల్లడించారు. లక్నోలోనే ఎందుకు? గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్‌ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ గేమ్‌ ఛేంజర్‌ గురించి చర్చ జరిగేలా ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్‌ చేస్తారో లేదో చూడాలి.&nbsp; ఇదే తొలి చిత్రం! తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ ఇప్పటివరకూ ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్‌’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్‌’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్‌ అయిన చిత్రాలు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్‌ తెలుగు ఫిల్మ్‌. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్‌ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి. ఆ ఫైట్‌ సినిమాకే హైలెట్‌! ఇటీవల టీజర్‌ సూన్ అంటూ గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో చరణ్‌ ఓ టేబుల్‌ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్‌ ఛేంజర్’ ఇంట్రడక్షన్‌ సీన్‌ అని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ మాబ్‌ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్‌ హెలికాఫ్టర్‌ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్‌ వస్తుందని చెబుతున్నారు. రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?</strong>
    Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?
    టాలీవుడ్‌ ప్రేమ జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒకరు. వీరిద్దరికి వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 6, 2011లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యింది. వీరికి అయాన్‌, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బన్నీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇద్దరు పిల్లల్ని అల్లు స్నేహానే చూసుకుంటోంది. వారికి ఆలనా పాలనా దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతేకాదు వారికి బోర్‌ ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తమ పిల్లల్లో ఫుల్‌ జోష్‌ నింపేందుకు ఇంట్లో కిడ్స్‌ పార్టీ నిర్వహించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పిల్లలకు గ్రాండ్‌ పార్టీ! అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి తమ పిల్లల కోసం ‘వీకెండ్‌ స్లీప్‌ఓవర్‌’ పార్టీ నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఈ పార్టీ నిర్వహించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అల్లు అయాన్‌, కూతురు అర్హా ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించిన స్నేహా వారిని ఈ పార్టీలో భాగస్వామ్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు స్నేహా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం విశేషం. ‘బాయ్స్ అండ్‌ గర్స్‌ #వీకెండ్‌’ పేరుతో ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన ఫ్రెండ్స్‌ను అయాన్‌ సర్‌ప్రైజ్‌ చేయడం వీడియోలో గమనిపించవచ్చు. మరోవైపు అర్హా ఇంట్లోని అవార్డ్స్‌ను ఫ్రెండ్స్‌కు చూపించి ఎంతగానో మురిసిపోయింది. అంతేకాదు అయాన్‌ తన స్నేహితులతో స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి ఎంతో సరదాగా గడిపాడు. స్విమ్మింగ్‌ చేస్తూ బాల్‌తో ఆడుకున్నాడు. అదే విధంగా ఇంటికి వచ్చిన చిన్నారులకు స్నేహా హెల్తీ ఫుడ్‌ను అరేంజ్‌ చేసి పెట్టింది. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) అట్లతద్ది సెలబ్రేషన్స్‌ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, ఫ్యామిలీ ఈవెంట్‌ జరిగినా వెంటనే ఆమె షేర్‌ తన అభిమానలతు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల అట్లతద్ది సందర్భంగా కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ఆ రోజున తెల్లవారుజామునే లేచి పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి అట్లతద్ది సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) స్నేహా బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ అల్లు స్నేహారెడ్డి గత నెల 29న 40 పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేశారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/FilmyBowl/status/1840610091973611849
    అక్టోబర్ 26 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?</strong>
    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review) ఎవరెలా చేశారంటే హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్‌ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్‌ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్‌ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్‌’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్‌ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్‌ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్‌, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు రితేశ్‌ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్‌, గన్స్‌, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్‌ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలను రిఫ‌రెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్‌ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్‌ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ శ్రీ సింహా, సత్య&nbsp;కామెడీ&nbsp;నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;</strong>
    Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌ తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్‌ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌! తారక్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ 'ఫియర్‌' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’&nbsp; నుంచి రెండో పాట రిలీజ్‌ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్‌, జాన్వీ కపూర్‌ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతూ మరింత దూసుకెళ్తోంది.&nbsp; పెద్ద ఎత్తున ట్రోల్స్‌! 'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాట సోప్‌ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్‌ యాడ్‌ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. అటు మీమ్స్‌ పేజెస్‌ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌ ట్యూన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్‌ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్‌ ఒకే సమయంలో పాజిటివ్‌, నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకొని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; స్ట్రాంగ్‌ కౌంటర్‌ దేవర సెకండ్‌ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్‌ మాత్రం సూపర్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్‌..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1820689638714998854 ‘దేవర’ వచ్చేస్తునాడు..! ‘దేవర’ మూవీ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
    ఆగస్టు 07 , 2024

    @2021 KTree