• TFIDB EN
  • బాయ్స్
    UATelugu2h 57m
    ఐదుగురు కాలేజీ కుర్రాళ్లు జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా అమ్మాయిల వెంటపడుతూ, పార్టీలకు వెళ్లి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చిన తర్వాత వారి జీవితం మలుపు తిరుగుతుంది. వారిలో ఒక జంట తమ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వివాహం చేసుకోవడంతో సమస్యల్లో పడుతారు. జీవనోపాధి లేక ఇబ్బందుల్లో పడుతారు. మరి చివరికి ఏమైంది? తల్లిదండ్రులను ఎదురించిన వాళ్లు జీవితంలో రాణించారా? లేదా? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌SunNext
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సిద్ధార్థ్
    జెనీలియా డిసౌజా
    భరత్
    వివేక్
    తమన్ ఎస్
    మణికందన్
    నఖుల్
    శ్వేత
    అమండా
    సింధూరి
    రేషు
    అనితా రత్నం
    AV రమణన్
    జానకి సబేష్
    ఇళవరసు
    కలైరాణి
    సుభాషిణి
    రవిరాజ్
    కె.బి.మోహన్
    కమల్ చోప్రా
    భువనేశ్వరి అకా పూనైక్కన్ భువనేశ్వరి
    చిట్టి బాబు
    మనోబాల
    రాంజీ
    ఢిల్లీ కుమార్
    ఏసీ మురళీ మోహన్
    సూర్యకాంత్
    సెంథిల్
    హరిహరన్
    బ్లేజ్
    విజయ్ యేసుదాస్
    రంజిత్
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    సోలమన్ పాపయ్య
    రవి ప్రకాష్
    రాజన్
    సిబ్బంది
    ఎస్. శంకర్
    దర్శకుడు
    AM రత్నం
    నిర్మాత
    సుజాత
    రచయిత
    AR రెహమాన్
    సంగీతకారుడు
    విటి విజయన్
    ఎడిటర్
    కథనాలు
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    బ్యాంగ్‌టన్ బాయ్స్ ( BTS )కు ఎందుకింత క్రేజ్ !
    ]4. బట్టర్, ఆన్, లౌడర్ ధాన్ బాంబ్స్, బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్ వంటివి గుర్తింపు పొందాయి. Listen Now
    ఫిబ్రవరి 14 , 2023
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్‌’ అరుదైన ఘనత.. తొలి మలయాళ చిత్రంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్!
    మలయాళ చిత్రం 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే పలు రికార్డులను  కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ సినిమాగా (The Highest Grossing Malayalam Film Ever) నిలిచింది. విడుదలైన  తొలి 25 రోజుల్లోనే ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం విశేషం. గతంలో ఏ మలయాళ మూవీ దీనిలా రూ.200 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కాగా, గతేడాది వచ్చిన ‘2018’ చిత్రం ఇప్పటివరకూ మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' రాకతో ఈ సినిమా రెండో స్థానానికి పడిపోయింది.  మార్చి 29న తెలుగులోకి..! శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ మూవీని తెలుగులోనూ మైత్రీ మూవీ మేకర్స్ మార్చి 29న రిలీజ్ చేయబోతోంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదలైన మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu) సైతం ఘన విజయం సాధించింది. ఇటీవల తెలుగులోనూ దాన్ని విడుదల చేయగా ఇక్కడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది.  కలెక్షన్స్‌లో టాప్‌- 5 ఇవే 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత '2018' సినిమా రెండో స్థానంలో ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా రూ.180 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఈ సినిమా పేరుతోనే ఉంది. తాజాగా దానిని మంజుమ్మెల్ బాయ్స్ బీట్‌ చేసింది. తర్వాతి స్థానాల్లో మోహన్‌లాల్‌ నటించిన 'మన్యం పులి' (రూ.150 కోట్ల గ్రాస్‌), 'లూసిఫర్' (రూ.130 కోట్ల గ్రాస్‌) ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన 'ప్రేమలు' కూడా ఇప్పటి వరకు రూ.117 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఐదో స్థానంలో నిలించింది.  ఈ సినిమా కథేంటి? 2006లో రియల్‌గా జరిగిన ఓ  ఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’  చిత్రాన్ని రూపొందించారు. కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 19 , 2024
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    Movie like Manjummel Boys: ఓటీటీలో మంజుమ్మేల్ బాయ్స్ మాదిరి సూపర్బ్ సినిమా.. ఎందులో అంటే?
    ఇటీవల వచ్చిన మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు పలువురు మంజుమ్మేల్ బాయ్స్ తరహా చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఎలాంటి సినిమాలు ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ సినిమాలో  స్నేహితులందరూ సరదాగా గుణ గుహలను చూసేందుకు వెళ్తారు. ప్రమాదవశాత్తు ఆ గుహలో ఫ్రెండ్ పడిపోతే ఇంకో స్నేహితుడు ఎలా కాపాడాడు అనేది కథాంశం. ఆద్యంతం ఈ సినిమా సస్పెన్స్‌ను హోల్డ్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. అయితే ఇంచుమించు అదే కథాంశంతో(Movie like Manjummel Boys) ఓ హాలీవుడ్ సినిమా ఉంది. ఆ సినిమా గురించి ఇప్పడు తెలుసుకుందాం.  127 హవర్స్ ఇప్పుడు మేము చెప్పబోయే సినిమా పేరు 127 హవర్స్(127 Hours). ఈ సినిమాలో హీరో అనుకోకుండా ఓ లోయలో పడుతాడు. 5 రోజుల పాటు ఆ లోయలోనే చిత్ర హింసలు అనుభవిస్తాడు. చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథాంశం. నిజ జీవితం ఆధారంగా.. 127 హవర్స్ చిత్రాన్ని నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను అరన్ రాల్ట్సన్ అనే పర్వాతారోహకుడి నిజ జీవితం ఆధారంగా డైరెక్టర్ డానీ బోయ్లే చిత్రీకరించారు. తమాషా ఏమిటంటే... ఈ సినిమాలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం అరన్ రాల్ట్సన్ సమక్షంలో షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ప్రతీ సీన్ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? అని చూసుకోవడానికి తెరకెక్కించారు. ఇక అరన్ రాల్ట్సన్‌ పాత్రలో జేమ్స్ ఫ్రాన్స్‌కో నటించాడు.   ఇప్పుడు సినిమా కథలోకి వెళ్దాం  జేమ్స్ ఫ్రాన్స్ కో  సాహసాలంటే మహా  ఇష్టం. ఓ రోజు ఓ అడ్వెంచర్ ట్రిప్‌ కోసం బయల్దేరుతాడు. అలా వెళ్తుండగా అక్కడ ఓ ప్రదేశం బాగుందని ఆగుతాడు. ఆ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఓ బండరాయి ఉంటుంది. ఆ బండరాయి  మీదకు ఎక్కితే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. తన  బరువును ఆ బండరాయి మోస్తుందా లేదా అనే ఆలోచనతో దానిపైకి ఎక్కుతాడు. దీంతో ఆ బండరాయి అతని బరువుకు కుంగిపోవడంతో  ఒక్కసారిగా లోయలో పడిపోతాడు. ఆ బండరాయి కూడా అతనితో పాటు లోయలో పడిపోతుంది. బండరాయి మధ్యలో అతని చేయి చిక్కుకుంటుంది. ఇక చూడండి అతని కష్టం.. తినడానికి ఏమీ ఉండవు. లోయ చూస్తేనేమో చాలా లోతుగా ఉంటుంది. సాయం కోసం పిలుద్దామన్న ఎవరుండరు.  ఎలా బయటపడ్డాడంటే? లోయ నుంచి బయటపడేందుకు జేమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. బండరాయి మధ్యలో ఇరుక్కున్న తన చేయిని నరుక్కుని బయటపడుతాడు.ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్ క్యారీ చేస్తుంది. సింగిల్ క్యారెక్టర్ చూట్టూ(Movie like Manjummel Boys) కథను నడిపించిన విధానం బాగుంటుంది. అప్పుడప్పుడు సినిమాలో ఇద్దరు అమ్మాయిలు వచ్చిపోతారు. ఆ తర్వాత కొన్ని సీన్లలో ఫ్యామిలీ క్యారెక్టర్స్‌ను చూపిస్తారు. అంతే తప్ప పెద్దగా క్యారెక్టర్స్‌ ఏమి ఉండవు. సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్‌ ఫోకస్ మీదనే సాగుతుంది. లోతైన లోయలో బండరాయికి కొండకు మధ్య అతని చేయి ఇరుక్కున్నప్పుడు దాని నుంచి అతను బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది బాగా చూపించారు. చేయి నరుక్కునే పరిస్థితి అనివార్యంగా చూపిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పర్పస్‌లో స్ట్రీమింగ్‌కు ఉంది.  డిస్నీ+ హాట్ స్టార్, యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ  మంజుమ్మేల్ బాయ్స్  చిత్రం చూసిన అనుభూతి మాత్రం పక్కా కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో "127 హవర్స్" సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి మరి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం YouSay Website ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
    మే 15 , 2024
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    Manjummel Boys: తెలుగులోకి వచ్చేస్తోన్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’.. ప్రేమలు రికార్డు బద్దలయ్యేనా?
    తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు మరో మలయాళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సిద్ధమవుతోంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లేటెస్ట్‌ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్‌’ (Manjummel Boys Telugu Release) తెలుగులోనూ విడుదల కాబోతోంది. గత నెల ఫిబ్రవరిలో కేరళలో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మలయాళ సినిమాలపై ఆసక్తి కనబరిచే టాలీవుడ్‌ ఆడియన్స్‌.. ఈ చిత్రం ఎప్పుడు తెలుగులో వస్తుందా ‌అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్ విడుదల తేదీ ఖరారైంది. తెలుగులో వచ్చేది ఆ రోజే! ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు డబ్బింగ్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ‘మలయాళంలో అత్యధిక గ్రాసింగ్ చిత్రంగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఆ పోస్టర్‌కు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది.  ‘ప్రేమలు’ రికార్డ్‌ను బద్దలుకొట్టేనా? మలయాళం సూపర్‌ హిట్‌ సినిమా ‘ప్రేమలు’ (Premalu).. మార్చి 8న తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించింది. తద్వారా తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును ‘మంజమ్మల్‌ బాయ్స్‌’ బీట్‌ చేస్తుందా? అన్న ప్రశ్న టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. మంజుమ్మల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ కావటం, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో వస్తుడంటంతో తెలుగులోనూ మంచి పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రేమలు రేంజ్‍లో వసూళ్లను రాబట్టగలదో లేదో చూడాలి.  రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌  సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో రియల్‌గా జరిగిన ఓ ఘటన ఆధారంగా దీనిని తెరకక్కించాడు. రిలీజ్‌ అనంతరం గొప్ప సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం.. మలయాళంలో ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అటు తమిళంలోనూ ఇటీవల ఈ చిత్రం రిలీజ్‌ కాగా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. కాగా,  ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుషీన్ శ్యాం సంగీతం అందించారు. అటు  ఈ సినిమా కథేంటి? ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ కథలోకి వెళ్తే.. ‘కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అయ్యి అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినకుండా ఫ్రెండ్స్‌ అందరూ లోపలికి ప్రవేశిస్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా వారు పట్టించుకోరు. ఈ క్రమంలో వారిలోని సుభాష్‌ అనే యువకుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ గుహలో పడిపోయిన సుభాష్‌ బతికే ఉన్నాడా? తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చేసిన సాహసం ఏంటి? అన్నది మిగతా కథ.
    మార్చి 27 , 2024
    <strong>IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!</strong>
    IMDB 2024 Report: ఐఎండీబీ రిపోర్టులో టాలీవుడ్‌ హవా.. ఆ మూవీస్‌ కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోందట!
    ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ జాబితాలను ప్రపంచవ్యాప్తంగా IMDBకి ఉన్న 250 మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా రూపొందించారు. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా 'కల్కి 2898 AD' నిలవగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా 'పుష్ప 2: ది రూల్' నిలిచాయి. ఐఎండీబీ రిపోర్టుకు సంబంధించిన పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 2024లో మోస్ట్ పాపులర్ చిత్రాలు ఇవే! ఐఎండీబీ మోస్ట్‌ పాపులర్‌ మూవీస్‌ - 2024 జాబితాలో ప్రభాస్‌ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అగ్రస్థానంలో నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) మూవీ ఈ జాబితాలో రెండో స్థానం కైవసం చేసుకుంది. హృతిక్ రోషన్, దీపికా పదుకునే కలిసి నటించిన 'ఫైటర్' (Fighter) మూవీ 3వ స్థానంలో నిలవగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' (Hanuman) సినిమా నాలుగో స్థానం సంపాదించింది. అజయ్ దేవగన్, ఆర్.మాధవన్, జ్యోతిక కలిసి నటించిన 'సైతాన్' (Shaitaan) ఆ తర్వాతి ప్లేస్ లో ఉంది. కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్' (Laapataa Ladies) 6వ స్థానం, యామీ గౌత‌మ్, ప్రియమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ 'ఆర్టికల్ 370' (Article 370) 7వ స్థానం, నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు జంటగా నటించిన మలయాళ మూవీ 'ప్రేమలు' (Premalu) 8వ స్థానంలో నిలిచాయి. మలయాళ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేసిన 'ఆవేశం' (Aavesham), హీందీలో మంచి విజయం సాధించిన 'ముంజ్య' (Munjya)చిత్రాలు 9, 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815619130948771914 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు IMDB రిలీజ్‌ చేసిన ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ అప్ కమింగ్ ఇండియన్ మూవీస్’ (Most Anticipated Upcoming Indian Movies Of 2024) జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం టాప్‌లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'దేవర' (Devara) చిత్రం సెకండ్ ప్లేస్‌ దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న 'వెల్ కమ్ టూ ది జంగిల్' (Welcome To The Jungle), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (The Greatest Of All Time) సినిమాలు వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి.&nbsp; తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కంగువ' (Kanguva) ఐదో స్థానంలో నిలవగా, అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న ‘సింగం అగైన్‌’ (Singam Again) ఆరో స్థానంలో ఉంది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'భూల్ భూలయ్యా 3', చియాన్ విక్రమ్ 'తంగలాన్', 'ఔరోన్ మే కహన్ దమ్ థా',&nbsp; 'స్త్రీ 2' ఆ తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.&nbsp; https://twitter.com/IMDb_in/status/1815645100988379418
    జూలై 24 , 2024
    <strong>Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!</strong>
    Tripti Dimri Bikini: బికినీలో అందాల సెగలు కక్కిస్తున్న త్రిప్తి దిమ్రి!
    యానిమల్ (Animal Movie) బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ప్రస్తుతం వెకేషన్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బికినీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్న ఈ అమ్మడు.. అక్కడి అందమైన తీర ప్రాంతాల్లో పర్యటిస్తోంది. తాజాగా బికినిలో ఫొటో షూట్‌ నిర్వహించి ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.&nbsp; ఎద, థైస్‌ అందాలతో త్రిప్తి దిమ్రి హోయలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆఫ్‌ స్క్రీన్‌లో ఈ స్థాయిలో అందాల జాతర చేయడం ఇదే తొలిసారని కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; ఉత్తరాఖండ్‌ గర్వాల్‌లో 23 ఫిబ్రవరి, 1994లో జన్మించిన త్రిప్తి.. 2017లో వచ్చిన ‘పోస్టర్‌ బాయ్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది.&nbsp; ఇందులో రియా పాత్రలో అదరగొట్టినప్పటికీ త్రిప్తికి పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్‌బుల్‌' 'ఖాలా' వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది. సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన ‘యానిమల్‌’ (2023) చిత్రం.. త్రిప్తి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.&nbsp; ఇందులో ‘జోయా’ పాత్రలో కనిపించిన త్రిప్తి.. తన అంద చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. ముఖ్యంగా రణ్‌బీర్‌తో ఆమె చేసిన బెడ్‌రూమ్‌ సన్నివేశాలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘యానిమల్‌’లో త్రిప్తి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆమె తన గ్లామర్‌తో రాత్రి రాత్రికే స్టార్‌ నటిగా మారిపోయింది.&nbsp; యానిమల్ రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియా మొత్తం ఈ బ్యూటీనే సందడి చేసింది. యానిమల్ సినిమా ముందు వరకు ఇన్‌స్టాలో 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న త్రిప్తి దిమ్రికి.. యానిమల్ తర్వాత ఆ సంఖ్య ఏకంగా ఐదు మిలియన్లు దాటిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడిని వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ‘బ్యాడ్‌ న్యూస్‌’, ‘విక్కి విద్య కా వోహ్‌ వాలా వీడియో’, ‘భూల్‌ భులయ్యా 3’, ‘ధడక్‌ 2’ చిత్రాల్లో ప్రస్తుతం త్రిప్తి దిమ్రి నటిస్తోంది.&nbsp; ఇక పుష్ప 2 చిత్రంలోనూ త్రిప్తి దిమ్రి ఓ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయమై చిత్ర యూనిట్‌ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    జూన్ 19 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌&nbsp; తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న&nbsp; థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..&nbsp; పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.&nbsp; (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.&nbsp; మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.&nbsp; యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి &amp; హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,&nbsp; మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన&nbsp; కృష్ణ (రాహుల్ విజయ్)ని&nbsp; ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    తృప్తి డిమ్రి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తృప్తి డిమ్రి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తృప్తి డిమ్రి..యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తన గ్లామరస్ షోతో ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ హాట్ డాల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. తృప్తి డిమ్రి పుట్టిన తేదీ? ఫిబ్రవరి 23,&nbsp; 1994 తృప్తి డిమ్రి ఎక్కడ పుట్టింది? గార్వాల్, ఉత్తరాఖండ్ తృప్తి డిమ్రి నటించిన తొలి సినిమా? పోస్టర్ బాయ్స్(2017, హిందీ) తృప్తి డిమ్రికు గుర్తింపు తెచ్చిన సినిమా? యానిమల్(2023). ఈ చిత్రంలో ఆమె చేసిన జోయా క్యారెక్టర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. తృప్తి డిమ్రి ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; తృప్తి డిమ్రి తల్లిదండ్రుల పేర్లు? దినేష్ డిమ్రి, మినాక్షి డిమ్రి తృప్తి డిమ్రి అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్&nbsp; తృప్తి డిమ్రికి ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ తృప్తి డిమ్రికి ఇష్టమైన కలర్?&nbsp; రెడ్ తృప్తి డిమ్రి ఫెవరెట్ హీరో? ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ తృప్తి డిమ్రి ఫెవరెట్ హీరోయిన్? దీపిక పదుకునే తృప్తి డిమ్రి పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. తృప్తి డిమ్రి&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/me.radhakrishnan/?hl=en https://www.youtube.com/watch?v=-SxWOtOS5qc
    ఏప్రిల్ 29 , 2024
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?
    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం: &nbsp;సుశిన్&nbsp; శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇక్క‌డ కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టనుందా? అసలు ఈ చిత్ర కథేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ నడుపుతుంటారు. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్.. 150 అడుగులకు పైగా లోతున్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? పోలీసులు, ఫైర్ సిబ్బంది కాకుండా సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి ఎందుకు దిగాడు? వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా? అన్న‌ది కథ. ఎవరెలా చేశారంటే కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అహ్లాదకరమైన సన్నివేశాల్లోనూ.. ఉత్కంఠభరిత సీన్లలోనూ చక్కగా నటించి ఒదిగిపోయారు. ఓ నిజమైన స్నేహితుల బృందాన్ని తెరపై చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కల్పించడంలో వారంతా సక్సెస్‌ అయ్యారు. ఇక లోయలో చిక్కుకున్నప్పుడు షాబిన్‌ షాహిర్‌, సుభాష్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ దశలో ఇదంతా నిజమేమోనన్న భావనను కలిగిస్తుంది. తెర కనిపించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? 2006లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌.. క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నమన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలిగేలా దర్శకుడు క‌థ‌ను న‌డిపించాడు. విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. మంజుమ్మ‌ల్ గ్యాంగ్ చేసే అల్లరితో డైరెక్టర్‌ ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. సుభాష్.. లోయలో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఉత్కంఠభరితంగా మారుతుంది. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా డైరెక్టర్‌ తెరకెక్కించారు. సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్‌ యూత్‌కు మినహా మిగిలిన వయసుల వారికి అంతగా కనెక్ట్‌ కాకపోవచ్చు. చివరిగా చక్కటి ముగింపుతో డైరెక్టర్‌ చిదంబరం అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కించేలా చేశారు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. డైరెక్టర్‌, నటీనటుల తర్వాత ఎక్కువ క్రెడిట్‌ సినిమాటోగ్రాఫర్‌ షైజు ఖలీద్‌కు ఇవ్వాల్సిందే. కేవ్‌ సెటప్‌ను తన కెమెరాతో అద్భుతంగా చూపించాడు. నిజంగా ఒక కేవ్‌లో ఉన్నామన్న ఫీలింగ్‌ను తన కెమెరా పనితనంతో ఆడియన్స్‌లో&nbsp; కలిగించాడు. అలాగే నేపథ్యం సంగీతం కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. భావోద్వేగ సన్నివేశాలను బీజీఎం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథఉత్కంఠరేపే సెకండాఫ్‌సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌&nbsp; నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3.5/5
    ఏప్రిల్ 06 , 2024
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ  జాతకం మార్చనుందా?
    Anupama Parameswaran: బొల్డ్ రోల్… అనుపమ జాతకం మార్చనుందా?
    గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా బ్లూ కలర్ చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది. బ్లూకలర్ స్లీవ్ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆరబోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది టిల్లు స్కేర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో తన కెరీర్‌కు ఈ సినిమా విజయం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశపడుతోంది. ఒకప్పుడు అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న అనుపమ.. టిల్లు స్కేర్ చిత్రంలో బొల్డ్‌ లుక్‌లో అన్నింటికీ సై అంటూ హింట్ ఇచ్చింది ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు సిద్ధు జొన్నలగడ్డతో లిప్‌ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంలో అనుపమ లుక్స్, బొల్డ్ అటైర్ ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది. మునుపెన్నడులేని విధంగా అనుపమ కనిపించే సరికి ప్రేక్షకులు కనుల విందు చేసుకున్నారు. గతంలోనూ 'రౌడీ బాయ్స్' చిత్రంలో రొమాంటిక్ సీన్లలో నటించినా… ఆ డోస్‌ టిల్లు స్కేర్‌లో అనుపమ పెంచేసింది. ఈ చిత్రంలో బోల్డ్ రోల్‌తో అనుపమతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు లైన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది గత కొంతకాలంగా సరైన విజయం లేక ఆందోళనలో ఉన్న అనుపమ ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పవచ్చు. అనుపమ ఈ చిత్రంలో బోల్డ్ లుక్‌లో నటించేసరికి ఆమెపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌పై మనస్తాపం చెందిన అనుపమ… క్యారెక్టర్ ఏమి కోరుకుంటుందో తాను అదే చేశానని సమాధానం చెప్పింది. గతంలో స్టార్ హీరోయిన్లు క్యారెక్టర్‌కు అనుగుణంగా బోల్డ్ పాత్రలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన కార్తికేయ 2 చిత్రం తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో హీరో నిఖిల్‌తో పోటీ పడి మరీ నటించింది. కార్తికేయ 2 తర్వాత అనుపమ 'బటర్‌ఫ్లై', '18 పేజెస్‌' చిత్రాల్లో నటించింది. ఇందులో '18 పేజెస్‌' మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో మరో చిత్రం కోసం తన డేట్స్ ఇచ్చింది.
    మార్చి 30 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.&nbsp; పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.&nbsp; ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.&nbsp;&nbsp; లూసిఫర్‌&nbsp; 2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.&nbsp; నెరు&nbsp; గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.&nbsp; కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది.&nbsp;
    మార్చి 29 , 2024
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    యంగ్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్‌ లుక్స్‌, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.&nbsp; ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన&nbsp; 'డీజే టిల్లు 2' ట్రైలర్‌ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.&nbsp; కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.&nbsp; ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.&nbsp; రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.&nbsp; దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.&nbsp; ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.&nbsp; అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.&nbsp; గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .&nbsp; కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్‌ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.&nbsp; దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు. మాస్‌ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్‌ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.&nbsp; అలాగే తమిళంలో 'సైరెన్‌' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    <strong>HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!</strong>
    HBD Thaman: థమన్‌ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!
    ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్‌ (HBD Thaman) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోని టాప్‌ హీరోల చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందిస్తూ టాప్‌ మోస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇవాళ థమన్‌ పుట్టిన రోజు. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో థమన్‌కు సంబంధించిన సీక్రెట్స్ ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; థమన్‌ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. 1983 నవంబరు 16 ఏపీలోని నెల్లూరులో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. థమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్‌. ఆయన ప్రముఖ డ్రమ్మర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు. ఒక్కప్పటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె. చక్రవర్తి దగ్గర ఏడు వందల సినిమాలకు వర్క్ చేశారు.&nbsp; థమన్‌ (HBD Thaman) తల్లి పేరు ఘంటసాల సావిత్రి. ఆమె కూడా ప్లే బ్యాక్‌ సింగర్‌. సంగీత కుటుంబం నుంచి రావడం వల్ల సహజంగానే మ్యూజిక్‌పై థమన్‌కు ఆసక్తి ఏర్పడింది. ఓ సారి థమన్‌ (HBD Thaman)కు తండ్రి శివ కుమార్‌ డ్రమ్‌ కొనిచ్చాడట. తొలిసారి దానిపైనే డ్రమ్‌ వాయించడం ప్రాక్టిస్‌ చేశాడట. అలా చిన్నప్పుడే తండ్రి ప్రోత్సాహంతో డ్రమ్స్‌పై పట్టు సాధించాడట. థమన్‌ తన 13 ఏళ్ల వయసులో బాలయ్య నటించిన 'భైరవ ద్వీపం' సినిమాకు డ్రమ్మర్‌గా పనిచేశారు. ఇందుకుగాను రూ.30 పారితోషికం కూడా అందుకున్నాడు.&nbsp; థమన్‌ (HBD Thaman) చదువుకుంటున్న క్రమంలోనే ఆయన తండ్రి అకస్మికంగా మరణించారు. దీంతో కుటుంబ బాధ్యత థమన్‌పై పడింది. చదువుకు స్వస్థి చెప్పి తను నేర్చుకున్న డ్రమ్స్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.&nbsp; థమన్‌ తండ్రికి ఉన్న పేరు దృష్ట్యా పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ థమన్‌కు సాయం చేశారు. షోలు చేసే అవకాశం కల్పించారు.&nbsp; అలా తన తండ్రి చనిపోయిన నాలుగేళ్ల వ్యవధిలోనే 4 వేల స్టేజ్‌ షోలు చేసి థమన్‌ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.&nbsp; అలా షోలు చేస్తున్న క్రమంలోనే డైరెక్టర్ శంకర్‌ దృష్టిలో థమన్ పడ్డాడు. అలా బాయ్స్‌ సినిమాలో ఓ కీలకమైన కుర్రాడి రోల్‌ను సంపాదించాడు.&nbsp; ఓవైపు షోలు చేస్తూనే పలువురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ టీమ్‌లో డ్రమ్మర్‌గా థమన్‌ పనిచేశాడు. అలా 24 ఏళ్లు వచ్చేసరికి 64 మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో 900 సినిమాలకు పనిచేయడం విశేషం. ఒకప్పటి స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ దగ్గర వర్క్‌ చేయడం తన కెరీర్‌కు ఎంతో బూస్టప్‌ ఇచ్చిందని థమన్‌ చెబుతుంటాడు.&nbsp; ముఖ్యంగా మణిశర్మ టీమ్‌ భాగమై చేసిన 'ఒక్కడు' సినిమా తన జీవితాన్ని మార్చేసిందని థమన్‌ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు.&nbsp; 24 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిన థమన్‌.. తమిళ చిత్రం 'సింధనాయ్‌ సె' (2009) తొలిసారి వర్క్‌ చేశారు.&nbsp; రవితేజ హీరోగా చేసిన ‘కిక్‌’ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌కు ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌. ఈ సినిమాలో సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతో థమన్‌ పేరు మారుమోగింది.&nbsp; ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్’, ‘రేసుగుర్రం’.. ఇలా అతి తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడు 100కు పైగా సినిమాలకు పని చేశాడు.&nbsp; తారక్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ థమన్‌కు 100వ చిత్రం. ఇప్పటివరకూ 145 చిత్రాలకు థమన్‌ సంగీతం అందించారు.&nbsp; ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’, ‘ఓజీ’, ‘అఖండా 2’, ‘ది రాజా సాబ్‌’ సహా 18 చిత్రాలు ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి.&nbsp; థమన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య శ్రీవర్దిని కూడా మంచి సింగరే. థమన్‌ సంగీతం అందించిన బాడీ గార్డ్‌ చిత్రంలో 'హోసన్న' పాట పాడారు.&nbsp; థమన్‌ సోదరి యామిని ఘంటసాల కూడా ప్రముఖ నేపథ్య గాయని. అలాగే థమన్ అత్త పి. వసంత కూడా మంచి సింగర్‌గా రాణించారు. థమన్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధనా ధన్‌ సిక్స్‌లతో తెలుగు టీమ్‌కు విజయాలు అందించారు.&nbsp; ఏ.ఆర్‌. రెహమాన్‌ అంటే తనకు ఎంతో స్పూర్తి అని థమన్‌ పేర్కొన్నాడు. ఎప్పటికైనా ఆయన స్థాయికి ఎదగాలని తన కోరిక అని చెప్పాడు. తాజాగా&nbsp; తన 41వ పుట్టిన రోజు సందర్భంగా థమన్‌ తన జీవిత ఆశయం ఏంటో చెప్పారు. ఓ మ్యూజిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేసిన వెనుకబడిన వారికి ఫ్రీగా సంగీతం నేర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.&nbsp; థమన్‌పై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. క్యాపీ క్యాట్‌, కాపీ గోట్‌ అంటూ మీమర్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు.&nbsp; ట్రోల్స్‌పై స్పందిస్తూ తనకు కాపీ కొట్టడం రాదని, అందుకే వెంటనే దొరికిపోతానని (నవ్వుతూ) థమన్‌ చెప్పాడు.
    నవంబర్ 16 , 2024
    <strong>Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;</strong>
    Game Changer Teaser: లక్నోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ ప్రమోషన్‌ ఈవెంట్‌.. ఎందుకంటే?&nbsp;
    ‘RRR’ తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నుంచి వస్తోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీజర్‌ రిలీజ్‌ తేదీని చిత్ర బృందం లాక్‌ చేసింది. యూపీలో టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉండగా నార్త్‌లోనే టీజర్‌ లాంచ్ ఈవెంట్ ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; టీజర్‌ ఎప్పుడంటే? రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఈ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ జరగనున్నట్లు వెల్లడించారు. లక్నోలోనే ఎందుకు? గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను తొలుత హైదరాబాద్‌లోనే నిర్వహించాలని మూవీ టీమ్ భావించింది. కానీ ఇక్కడ పరిస్థితులు, అనుమతులు అనుకూలించకపోవడంతో వేదికను లక్నోకి మార్చినట్లు సమాచారం. గేమ్‌ ఛేంజర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఎంతో అవసరం. ఇందులో భాగంగా తొలి అధికారిక ఈవెంట్‌నే నార్త్‌లో నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని మూవీ టీమ్ భావిస్తోంది. అంతేకాదు టీజర్‌ రిలీజైనప్పటి నుంచి రెండు వారాలకు ఒకసారి ఏదోక అప్‌డేట్‌ ఇస్తూ గేమ్‌ ఛేంజర్‌ గురించి చర్చ జరిగేలా ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి టీజర్‌లో అతడి రెండు పాత్రల లుక్స్‌ను రివీల్‌ చేస్తారో లేదో చూడాలి.&nbsp; ఇదే తొలి చిత్రం! తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ ఇప్పటివరకూ ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలు తీశారు. ‘జెంటిల్‌మెన్‌’, ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్‌’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతో పాపులర్ అయ్యారు. అయితే అవన్నీ తెలుగులో డబ్‌ అయిన చిత్రాలు. ‘గేమ్‌ ఛేంజర్‌’ మాత్రమే శంకర్‌కు తొలి డైరెక్ట్‌ తెలుగు ఫిల్మ్‌. అంతేకాదు రామ్‌చరణ్‌తో కూడా తొలిసారి ఆయన వర్క్‌ చేశారు. కెరీర్‌లో ఇప్పటివరకూ సందేశాత్మక చిత్రాలనే రూపొందించిన శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను కూడా అదే ప్యాట్రన్‌లో రూపొందించారు. ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిసేలా ఓ థీమ్‌తో టీజర్‌ను కట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి టీజర్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి. ఆ ఫైట్‌ సినిమాకే హైలెట్‌! ఇటీవల టీజర్‌ సూన్ అంటూ గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో చరణ్‌ ఓ టేబుల్‌ ముందు కుర్చీ వేసుకొని కూర్చోవడం, అతన్ని చంపడానికి పెద్ద సంఖ్యలో రౌడీలు అతడి వైపు దూసుకురావడం ఆసక్తిరేపింది. అయితే ఇది ‘గేమ్‌ ఛేంజర్’ ఇంట్రడక్షన్‌ సీన్‌ అని ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘RRR’ తరహాలో గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ మాబ్‌ ఫైట్ ఉంటుందని సమాచారం. ఇది సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మూవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైట్ అయిపోయాక చరణ్‌ హెలికాఫ్టర్‌ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే 'రా మచ్చ మచ్చ' సాంగ్‌ వస్తుందని చెబుతున్నారు. రికార్డు బిజినెస్? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp;
    నవంబర్ 05 , 2024
    <strong>Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?</strong>
    Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?
    టాలీవుడ్‌ ప్రేమ జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒకరు. వీరిద్దరికి వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 6, 2011లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యింది. వీరికి అయాన్‌, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బన్నీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇద్దరు పిల్లల్ని అల్లు స్నేహానే చూసుకుంటోంది. వారికి ఆలనా పాలనా దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతేకాదు వారికి బోర్‌ ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తమ పిల్లల్లో ఫుల్‌ జోష్‌ నింపేందుకు ఇంట్లో కిడ్స్‌ పార్టీ నిర్వహించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పిల్లలకు గ్రాండ్‌ పార్టీ! అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి తమ పిల్లల కోసం ‘వీకెండ్‌ స్లీప్‌ఓవర్‌’ పార్టీ నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఈ పార్టీ నిర్వహించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అల్లు అయాన్‌, కూతురు అర్హా ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించిన స్నేహా వారిని ఈ పార్టీలో భాగస్వామ్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు స్నేహా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం విశేషం. ‘బాయ్స్ అండ్‌ గర్స్‌ #వీకెండ్‌’ పేరుతో ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన ఫ్రెండ్స్‌ను అయాన్‌ సర్‌ప్రైజ్‌ చేయడం వీడియోలో గమనిపించవచ్చు. మరోవైపు అర్హా ఇంట్లోని అవార్డ్స్‌ను ఫ్రెండ్స్‌కు చూపించి ఎంతగానో మురిసిపోయింది. అంతేకాదు అయాన్‌ తన స్నేహితులతో స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగి ఎంతో సరదాగా గడిపాడు. స్విమ్మింగ్‌ చేస్తూ బాల్‌తో ఆడుకున్నాడు. అదే విధంగా ఇంటికి వచ్చిన చిన్నారులకు స్నేహా హెల్తీ ఫుడ్‌ను అరేంజ్‌ చేసి పెట్టింది. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) అట్లతద్ది సెలబ్రేషన్స్‌ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, ఫ్యామిలీ ఈవెంట్‌ జరిగినా వెంటనే ఆమె షేర్‌ తన అభిమానలతు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల అట్లతద్ది సందర్భంగా కొన్ని ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. ఆ రోజున తెల్లవారుజామునే లేచి పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి అట్లతద్ది సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) స్నేహా బర్త్‌డేకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ అల్లు స్నేహారెడ్డి గత నెల 29న 40 పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేశారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెట్టారు.&nbsp; https://twitter.com/FilmyBowl/status/1840610091973611849
    అక్టోబర్ 26 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?</strong>
    Mathu Vadalara 2 Movie Review: కమెడియన్‌ సత్య వన్‌ మ్యాన్‌ షో.. ‘మత్తు వదలరా 2’ ఎలా ఉందంటే?
    నటీనటులు : శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్‌, వెన్నెల కిషోర్‌, రోహిణి తదితరులు రచన, దర్శకత్వం : రితేష్‌ రానా సంగీతం : కాల భైరవ సినిమాటోగ్రాఫర్‌ : సురేష్‌ సారంగం ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ నిర్మాత : చిరంజీవి (చెర్రీ) విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2024 శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య, వెన్నెల కిషోర్‌, రోహిణి, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. చాలిచాలని జీతంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో డబ్బులు సరిపోకా వారు స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్‌ కవర్‌ ఏజెంట్‌ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mathu Vadalara 2 Movie Review) ఎవరెలా చేశారంటే హీరోగా శ్రీ సింహా మంచి నటన కనబరిచాడు. కామెడీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు. అయితే ప్రతీ సీన్‌లో సత్య పక్కన ఉండటంతో అతడే హైలెట్‌ అయ్యాడు. ఈ సినిమాకు సత్యనే మెయిన్‌ హీరో అని చెప్పవచ్చు. తన పంచ్‌ డైలాగ్స్‌తో, కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టాడు. ముఖ్యంగా అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ‘సెక్సీ సైరన్‌’ అంటూ సినిమాలో అతడు చేసే హంగామా బాగా వర్కౌట్ అయ్యింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాకు ఇందులో మంచి రోల్‌ దక్కింది. చిట్టి పాత్ర తర్వాత ఆ స్థాయిలో ఈ రోల్‌ గుర్తుండిపోతుంది. అటు వెన్నెల కిషోర్‌ సైతం తనదైన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సునీల్‌, రోహిణి తదితర ముఖ్య తారాగారణం తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు రితేశ్‌ రాణా కథలన్నీ కూడా సింపుల్‌గా డ్రగ్స్‌, గన్స్‌, డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈసారి కూడా దర్శకుడు అలాంటి స్టోరీనే ఎంచుకున్నారు. ఒక కిడ్నాపింగ్‌ డ్రామాకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్ హీరోలను రిఫ‌రెన్స్‌లుగా తీసుకోవడం బాగా కలిసొచ్చింది. శ్రీ సింహా, సత్య పాత్రలను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అలాగే తెరపై కనిపించే ప్రతీ క్యారెక్టర్‌ కొత్తగా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్రథమార్థం మెుత్తాన్ని ఫన్‌ రైడ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంకు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా ప్రిడిక్టబుల్‌గా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. చాలా సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ శ్రీ సింహా, సత్య&nbsp;కామెడీ&nbsp;నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడ సాగదీత సీన్స్‌ప్రిడిక్టబుల్‌ క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    <strong>Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;</strong>
    Devara: ఓ వైపు సెన్సేషన్‌.. మరోవైపు ట్రోల్స్‌! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!&nbsp;
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్‌ తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్‌ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌! తారక్‌ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ 'ఫియర్‌' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’&nbsp; నుంచి రెండో పాట రిలీజ్‌ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్‌, జాన్వీ కపూర్‌ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్‌ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్‌ అవుతూ మరింత దూసుకెళ్తోంది.&nbsp; పెద్ద ఎత్తున ట్రోల్స్‌! 'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ పాట సోప్‌ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్‌ యాడ్‌ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. అటు మీమ్స్‌ పేజెస్‌ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌ ట్యూన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్‌ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్‌ ఒకే సమయంలో పాజిటివ్‌, నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకొని సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; స్ట్రాంగ్‌ కౌంటర్‌ దేవర సెకండ్‌ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్‌ మాత్రం సూపర్‌ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్‌..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/vamsi84/status/1820689638714998854 ‘దేవర’ వచ్చేస్తునాడు..! ‘దేవర’ మూవీ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
    ఆగస్టు 07 , 2024
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    Love Me Movie Review: దెయ్యంతో హీరో ప్రేమాయణం.. ‘లవ్‌ మీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రాజీవ్‌ కనకాల, రవి కృష్ణ దర్శకత్వం : అరుణ్&nbsp; భీమవరపు సంగీతం : ఎం. ఎం. కీరవాణి సినిమాటోగ్రాఫీ : పీ.సీ. శ్రీరామ్‌ ఆర్ట్ డైరెక్టర్‌ : కొల్లా అవినాష్‌ నిర్మాతలు : హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లాది విడుదల తేదీ : 25 మే, 2024 ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్‌ దర్శకత్వం వహించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా, మే 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. ఎవరెలా చేశారంటే తొలి చిత్రం రౌడీ బాయ్స్‌లో కాలేజీ కుర్రాడిగా అలరించిన ఆశిష్‌.. ఈ సినిమాలో డెవిల్స్‌ హంటర్ పాత్రలో మెప్పించాడు. తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫన్‌ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించి నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మరోమారు తన నటనతో మెప్పించింది. ఆమెకు కీలకమైన పాత్రే దక్కింది. ఆడియన్స్‌ వైష్ణవి చైతన్యకు మరోమారు కనెక్ట్‌ అవుతారు. బుల్లితెర నటుడు రవికృష్ణ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మెుత్తం ఈ ముగ్గురి పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అరుణ్‌.. ఒక నవల రచయిత కావడంతో సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదువుతున్న ఫీల్‌ కలుగుతుంది. దెయ్యమే చెప్తున్నట్లుగా కథను నడిపించడం ఆసక్తికరం. తొలి భాగం అంతా అర్జున్‌ గురించి, అతడు దివ్యవతిని వెతుక్కుంటూ వెళ్లడం గురించే చూపించారు. ఇంటర్వెల్‌కు ముందు దెయ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఆపై రివీల్‌ చేసే ట్విస్టు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. దివ్యవతి గురించి అర్జున్‌ చేసే రీసెర్చ్‌.. ప్రీక్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్టును డైరెక్టర్‌ రివీల్‌ చేసుకుంటూ వెళ్లడం మెప్పిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో చాలా చోట్ల డైరెక్టర్‌ తడబడినట్లు కనిపిస్తుంది. ఐదారుగురు హీరోయిన్స్‌ను తెరపైకి తీసుకొచ్చి కథపై ఆసక్తిరేపినా.. వారి పాత్రలను సరిగా వివరించకపోవడంతో కన్ఫ్యూజన్‌ క్రియేట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా పేలవంగానే అనిపిస్తుంది. అయితే ఓ లవ్‌స్టోరీకి దెయ్యం కథను జోడించి డైరెక్టర్ అరుణ్‌ చేసిన తొలి ప్రయోగం కొంతమేర ఫలించిందని చెప్పొచ్చు. టెక్నికల్‌గా &nbsp; సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం మెస్మరైజ్‌ చేస్తుంది. తన నైపుణ్యంతో అద్భుతమైన విజువల్స్‌ అందించారు. ఆస్కార్ విన్నర్‌ కీరవాణి అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆయన తన BGMతోనే ఆడియన్స్‌ను భయపెట్టారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా సినిమా కోసం బాగా శ్రమించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ఆశిష్‌, వైష్ణవి చైతన్యఆసక్తికరంగా సాగే కథనంసాంకేతిక విభాగం మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ సీన్స్‌ఏమోషన్స్‌ లేకపోవడం Telugu.youSay.tv Rating : 2.5/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-didnt-know-about-vaishnavi-chaitanya.html
    మే 25 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌&nbsp; ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; 2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది.&nbsp;ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best&nbsp; Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) &amp; గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:&nbsp; నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ&nbsp; నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ&nbsp; అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా&nbsp; మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన&nbsp; సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని&nbsp; ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.&nbsp; ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024

    @2021 KTree