• TFIDB EN
  • బ్రహ్మోత్సవం
    UTelugu2h 34m
    విజయవాడలో చంటబ్బాయి ప్రముఖ వ్యాపారవేత్త. కుటుంబంలో అందరు కలిసి ఉండాలనేది ఆయన మనస్తత్వం. అతనిలాంటి ఆలోచనలే అతడి కొడుకు మహేష్ బాబుకు ఉంటాయి. అయితే కుటుంబంలో రావు రమేష్ వల్ల ఓ గొడవ జరుగుతుంది. గొడవ తర్వాత చంటబ్బాయి చనిపోతాడు. దీంతో ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు మహేష్ బాబు కుటుంబం తిరిగి కలిసేందుకు ఏం చేశాడు అన్నది మిగాత కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    (ప్రస్తావిస్తారు) బాబు
    కాజల్ అగర్వాల్
    కాశీ అన్నపూర్ణ
    సమంత రూత్ ప్రభు
    లండన్‌కు చెందిన పేరు తెలియని ఎన్‌ఆర్‌ఐ
    ప్రణీత సుభాష్
    బాబు పేరు తెలియని కోడలు
    సత్యరాజ్
    చంటిబాబు
    రేవతి
    మహాలక్ష్మి
    రావు రమేష్
    పెద్దబ్బాయి
    జయసుధ కపూర్
    రాజ్యలక్ష్మి
    Pavani Gangireddy
    శుభలేఖ సుధాకర్
    కాశీ తండ్రి
    శ్రీరంజని
    కాశీ తల్లి
    శరణ్య పొన్వన్నన్
    బాబు దూరపు బంధువు
    ఈశ్వరి రావు
    as Bhoolakshmi
    నాసర్
    బాబు దూరపు బంధువు
    నరేష్
    మహాలక్ష్మి సోదరుడు
    రఘు బాబు
    రఘు మహాలక్ష్మి సోదరుడు
    సాయాజీ షిండే
    మహాలక్ష్మి సోదరుడు
    కృష్ణ భగవాన్
    మహాలక్ష్మి సోదరుడు
    రోహిణి హట్టంగడి
    మహాలక్ష్మి సవతి తల్లి
    ముఖేష్ రిషి
    బాబు దూరపు బంధువు
    తులసి
    వరలక్ష్మి
    అవంతిక వందనపు
    బాబు కోడలు
    తనికెళ్ల భరణి
    చంటిబాబు స్నేహితుడు
    పోసాని కృష్ణ మురళి
    గ్రామాధికారి
    జయ ప్రకాష్ రెడ్డి
    వ్యాపారవేత్త
    పరుచూరి బ్రదర్స్
    వ్యాపారవేత్త స్నేహితుడు
    వెన్నెల కిషోర్
    లక్కవరపు లిల్లీ లింగరాజు
    రజిత
    కృష్ణ భగవాన్ భార్య
    చాందిని చౌదరి
    ఆనంద వల్లి
    శ్రీకాంత్ అడ్డాల
    సిబ్బంది
    శ్రీకాంత్ అడ్డాల
    దర్శకుడు
    పొట్లూరి వర ప్రసాద్
    నిర్మాత
    పరం వి. పొట్లూరినిర్మాత
    కవిన్ అన్నేనిర్మాత
    మిక్కీ J. మేయర్
    సంగీతకారుడు
    గోపీ సుందర్
    సంగీతకారుడు
    ఆర్. రత్నవేలు
    సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    కథనాలు
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.  https://twitter.com/i/status/1747997141644251346 టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారింది. https://twitter.com/i/status/1746394374546559063 తాజాగా అవంతిక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మ‌డు చాలా బోల్డ్‌గా క‌నిపించడంతో పాటు ఓ పాట‌లో శృతిమించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. https://twitter.com/i/status/1746552711666094366 మ‌నం చూస్తున్న‌ది అప్పుడు తెలుగు సినిమాల‌లో చూసిన అవంతికనేనా.. ఇంత‌లో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.  అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్‌ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.  బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది. https://twitter.com/i/status/1746391190511952308 అవంతిక.. ఇండో-అమెరికన్‌ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్‌, నటనలో శిక్షణ తీసుకుంది. 2014లో ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.  ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.  మనమంతా, ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది. ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.  ప్రస్తుతం అవంతిక తన ఫోకస్‌ మెుత్తం హాలీవుడ్‌ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది. హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్‌, క్రౌన్‌ విషెష్‌ అనే రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్‌ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్‌ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి. ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) త‌ల్లిదండ్రులు ఉన్న‌వాళ్లైన‌ప్ప‌టికీ త‌ను ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తూ మ‌రో వైపు సినిమాల‌లో న‌టిస్తూ చాలామంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.
    జనవరి 19 , 2024
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా? 
    సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.  మహేశ్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.  https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.  https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్‌ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s నాగార్జున భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.  https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s రామ్‌చరణ్ తేజ్ రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.  అఖిల్, వరుణ్ తేజ్ రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.  https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
    ఆగస్టు 08 , 2023
    <strong>EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;</strong>
    EXCLUSIVE: ఇంటర్వెల్‌కు ముందే కుర్చీలో నుంచి లేచి వచ్చేసే చిత్రాలు.. నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్‌!&nbsp;
    టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రతీ చిత్రం సూపర్‌ హిట్‌ కావాలన్న రూల్‌ ఏమి లేదు. కొన్నింటికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మరికొన్నింటికి అసలే దక్కదు. దీనిని బట్టే ఆయా సినిమాలను హిట్స్‌, ఫ్లాప్స్‌గా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్లాప్‌ అయిన చిత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో ఓటీటీలో మంచి ఆదరణ పొందడం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చిత్రాలకు పరమ డిజాస్టర్లుగా పేరుంది. అప్పట్లో ఆ సినిమాల ప్రదర్శన సందర్భంగా ఆడియన్స్‌ మూవీ మధ్యలో నుంచే బయటకు వచ్చేశారని టాక్ ఉంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటిపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; [toc] ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man) నితీన్‌ (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా చేసిన రీసెంట్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌’. ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. సినిమా ఇంటర్వెల్‌ వరకూ కూడా చూడలేకపోయామని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అసలు విలన్‌ చెప్పినట్లు హీరో ఆడటం ఏంటని కొందరు ప్రేక్షకులు మండిపడ్డారు. నితీన్‌ కేరీర్‌లో ఎక్కువగా ట్రోల్స్‌ గురైన చిత్రంగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నిలిచింది.&nbsp; శాకుంతలం (Shakunthalam) సమంత (Samantha) లీడ్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ చిత్రంపై రిలీజ్‌కు ముందు భారీగానే అంచనాలు ఉండేవి. సమంత చేసిన తొలి పౌరాణిక సినిమా కావడం, ప్రచార చిత్రాలు కూడా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేలా ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రకు సమంత పెద్దగా నప్పలేదని, డబ్బింగ్‌ కూడా సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్‌ వరకూ సినిమాను చూడటమే కష్టంగా అనిపించిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్స్ చేశారు.&nbsp;&nbsp; రాధే శ్యామ్‌ (Radhe Shyam) ప్రభాస్‌ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన ‘రాధే శ్యామ్‌’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌తో స్మార్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో పెద్ద ఎత్తున అంచనాలు మెుదలయ్యాయి. కానీ రిలీజయ్యాక ప్రభాస్‌ను హస్తముద్రికా నిపుణుడిగా చూసి షాకయ్యారు. జ్యోతిష్యాన్ని ప్రేమను ముడి పెట్టిన విధానం చాలా మంది ఫ్యాన్స్‌కు ఎక్కలేదు. సినిమా మెుదలైన గంటకే విసుగు వచ్చిందని, ఇంటర్వెల్‌కు బయటకు వచ్చేశామని అప్పట్లో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వచ్చాయి. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ (World Famous Lover) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా... రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లే హీరోయిన్లుగా చేసిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. హీరో విజయ్‌పై ఈ సినిమా నుంచే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఈ సినిమాలో రొమాన్స్‌ తప్ప కథ లేదని ట్రోల్స్‌ వచ్చాయి. విజయ్‌ పో** చిత్రాలు చేసుకుంటే బెటర్‌ అని కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు బయటకు వెళ్లిపోదామా? అని ఎదురు చూసినట్లు పోస్టులు పెట్టారు.&nbsp; బ్రహ్మోత్సవం (Brahmotsavam) సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కెరీర్‌లోనే పీడకల లాంటి చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం మహేష్‌కు మాయని మచ్చలా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అంటుంటారు. కాజల్‌ (Kajal Aggarwal), సమంత (Samantha), ప్రణీత (Pranitha) వంటి కథానాయికలతో పాటు సత్యరాజ్‌, జయసుధ, రేవతి, తులసి, రావు రమేష్‌, షియాజీ షిండే, తనికెళ్ల భరణి వంటి హేమాహేమీలు ఉన్నా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా తొలి రోజు తొలి ఆట నుంచే సినిమాపై ట్రోల్స్‌ మెుదలయ్యాయి. సినిమా చూడకుండా మధ్యలోనే వచ్చేశామంటూ స్వయంగా మహేష్‌ ఫ్యాన్సే కామెంట్స్ చేశారు. సన్‌ ఆఫ్‌ ఇండియా (Son Of India) దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu) హీరోగా చేసిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాపై విడుదలకు ముందు నుంచే నెగిటివ్‌ మెుదలైంది. ఈ సినిమా తొలి రోజు మెుదటి ఆట కోసం ఓ థియేటర్‌లో రెండే టికెట్లు బుక్‌ కావడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ టికెట్లు బుక్‌ చేసుకుంది మంచు ఫ్యామిలీనే అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. చూసిన వారు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్‌ రివ్యూ ఇవ్వడంతో కొద్ది రోజులకే ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసివేశారు. మోహన్‌ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ నిలిచింది. వినయ విధేయ రామా (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినయ విధేయ రామాపై తొలి ఆట నుంచి నెగిటివ్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ఈ చిత్రం పరమ రాడ్‌ అంటూ చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని అనిపించిందని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి బిహార్‌కు వెళ్లడం.. హీరో విలన్‌ అనుచరుల తలకాయలు నరికితే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.&nbsp; లైగర్‌ (Liger) విజయ్ దేవరకొండ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. తొలి గంటకే సినిమాపై ఆసక్తి సన్నగిల్లిందని అప్పట్లో నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. అంత బాడీ పెట్టుకొని విజయ్‌ పాత్రకు నత్తి పెట్టడం ఏంటన్న విమర్శలు వచ్చాయి. శక్తి (Shakthi) తెలుగులో డిజాస్టర్‌ అని అనగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘శక్తి’. ఈ మూవీ దర్శకుడు మేహర్‌ రమేష్‌ను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికీ ఓ ఆట ఆడుకుంటున్నారు. శక్తి మెుదటి ఆట చూసి తారక్‌ కథను ఎలా ఓకే చేశారని ప్రశ్నించారు. ఒక గంట కూడా సినిమాను వీక్షించలేకపోయామని చెప్పారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో తారక్ లుక్‌ అసలు సూట్‌ కాలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఇదే డైరెక్టర్‌ వెంకటేష్‌తో ‘షాడో’ తీయగా ఆ మూవీ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. మేహర్‌ రమేష్‌&nbsp; రీసెంట్‌ చిత్రం ‘భోళా శంకర్‌’ సమయంలోనూ శక్తి సినిమా ప్రస్తావనకు రావడం గమనార్హం.&nbsp; సలీం (Saleem) మంచు విష్ణు (Manchu Vishnu), ఇలియానా (Ileana D'Cruz) జంటగా చేసిన ‘సలీం’.. తెలుగులో వచ్చిన బారీ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగా వెయిట్‌ తగ్గాడు. నాలుగైదు సినిమా కథలను మిక్సీలో వేసి సలీం చిత్రాన్ని రూపొందించారని అప్పట్లో విమర్శలు సైతం వచ్చాయి. తొలి అర్ధభాగానికే సినిమా బోర్‌ కొట్టేసిందని కామెంట్స్ వినిపించాయి.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;</strong>
    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!&nbsp;&nbsp;
    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] సమంత (Samantha) ‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్‌ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్‌ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) మహేష్‌ బాబుతో కాజల్‌ ఓ లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘బిజినెస్‌ మ్యాన్‌’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్‌ కిస్‌ చేస్తాడు. ఈ సీన్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్‌ సీన్‌ కాజల్‌ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.&nbsp; https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q నయనతార (Nayanthara) ‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్‌ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.&nbsp; https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW రష్మిక మందన్న (Rashmika Mandanna) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో రెచ్చిపోయింది.&nbsp; https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj నేహా శెట్టి (Neha Shetty) యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్‌ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్‌ సేన్‌ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది. https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz రుహానీ శర్మ (Ruhani Sharma) 'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్‌’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్‌ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది. https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k కేతిక శర్మ (Ketika Sharma) యంగ్‌ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్‌ ఫిల్మ్ ‘రొమాంటిక్‌’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్‌ తేజ్‌తోనూ లిప్‌లాక్‌ సీన్‌లో నటించింది.&nbsp; https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7 https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri డింపుల్‌ హయాతి (Dimple Hayathi) విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్‌ డింపుల్‌ హయాతి లిప్‌లాక్‌ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్‌ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.&nbsp; https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF మాళవిక మోహన్‌ (Malavika Mohanan) మలయాళ నటి మాళవిక మోహన్‌ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్‌ ఛతుర్వేదితో కలిసి బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.&nbsp; https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1 తృప్తి దిమ్రి (Tripti Dimri) బాలీవుడ్‌ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్‌’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్‌ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్‌ న్యూస్‌’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్‌ సీన్‌ చేసింది.&nbsp; https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్‌’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.&nbsp; https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3 వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. అలాగే ఇంటిమేట్‌ సీన్‌లోనూ కనిపించి హార్ట్‌ బీట్‌ను అమాంతం పెంచేసింది. https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu కావ్యా థాపర్‌ (Kavya Thapar) గ్లామర్‌ బ్యూటీ కావ్యా థాపర్‌ కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్‌ చేసింది. ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ఒకప్పుడు ట్రెడిషనల్‌ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాలంలో రొమాంటిక్‌ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్‌’, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.&nbsp; https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q- షాలిని పాండే (Shalini Pandey) అర్జున్‌ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేసింది.&nbsp; https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm- శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) ప్రముఖ హీరోయిన్‌ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్‌ సీన్లలో నటించింది. 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌' వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్‌’ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.&nbsp; https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4 https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu మానసా చౌదరి (Maanasa Chowdary) రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్‌ గమ్‌' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌ లాక్‌ సీన్స్‌ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్‌ లాక్స్‌ ఉన్నాయి.&nbsp; https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
    అక్టోబర్ 05 , 2024
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    EXCLUSIVE: ఈ సీన్లు గుర్తున్నాయా? మన స్టార్‌ హీరోలు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ మిస్టరీనే!
    సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని సీన్లు ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని మెమోరబుల్‌గా మిగిలిపోతే ఇంకొన్ని ఎప్పటికీ అర్థం కానీ పజిల్‌గా మిగిలిపోతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. స్టార్లుగా గుర్తింపు పొందిన నటులు.. ఇబ్బందికర సన్నివేశాలు/పేలవమైన కథలతో వచ్చిన చిత్రాల్లో చేసేందుకు ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. అందులో నటించేందుకు వారిని డైరెక్టర్లు ఎలా కన్విన్స్‌ చేశారా? అని ఆడియన్స్‌ ఇప్పటికీ ఆలోచిస్తుంటారు. ఇంతకీ ఆ సీన్లు/సినిమాలు ఏవి? అందులో నటించిన యాక్టర్లు ఎవరు? ఈ ఎక్స్‌క్లూజివ్‌ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.&nbsp; ప్రకాష్‌ రాజ్‌&nbsp; ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj)కు గొప్ప విలక్షణ నటుడిగా పేరుంది. తండ్రిగా, విలన్‌గా, పోలీసు ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా, బిజినెస్‌ మ్యాన్‌గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తారు. అటువంటి ప్రకాష్‌.. ‘ఒంగోలు గిత్త’ (Ongole Gittha) చిత్రంలో న్యూడ్‌గా నటించి అందరికీ షాకిచ్చారు. డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌.. ఈ సీన్‌లో నటించమని ప్రకాష్‌ రాజ్‌ను ఎలా ఒప్పించారో ఇప్పటికీ అర్థం కాని అంశం. అంతటి స్టార్‌ హీరో ఇందుకు ఎలా అంగీకరించారని ఆ సీన్‌ను చూసినప్పుడల్లా ఆడియన్స్‌ తెగ ఆలోచిస్తుంటారు.&nbsp; https://youtu.be/b9sEa8Wci0I?si=6vU0P_iid5_zddZp మహేష్‌ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించిన స్పైడర్‌ (Spyder) సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా చేశారు. అయితే ఈ సినిమా కథ విని మహేష్‌ ఏ విధంగా ఓకే చెప్పారని అప్పట్లో ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఈ సినిమా పలు చిత్రాలకు అతుకుల బొంతలా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో వచ్చాయి. అటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘బ్రహ్మోత్సవం’ సమయంలోనూ సినీ ప్రేక్షకులు ఇదే ప్రశ్నను లేవనెత్తారు. కాగా, మహేష్‌ కెరీర్‌లోనే బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.&nbsp; మోహన్‌ బాబు 2018లో వచ్చిన గాయత్రి సినిమాలో మోహన్‌బాబు (Mohan Babu).. ఇద్దరు అందాల తారలను పెట్టుకొని ఓ ఐటెం సాంగ్‌లో నటించారు. ‘సరసమహా’ అంటూ సాగే ఈ పాటలో మోహన్‌బాబు.. రెచ్చిపోయారు. ఆ ఇద్దరిపై ముద్దుల వర్షం కురిపిస్తూ నటించారు. ముఖ్యంగా పాట మధ్యలో యువతి నాభిపై ముద్దు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఈ సాంగ్‌ చూసి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తన వయసులో సగం ఉన్న వారితో రొమాన్స్‌ చేసేందుకు మోహన్‌బాబు ఎలా ఒప్పుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపించాయి. దర్శకుడు పట్టాభిరామన్‌ ఏం చెప్పి ఈ సాంగ్‌కు ఒప్పించారా అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది.&nbsp; https://youtu.be/DnA_YU0_O0A?si=BWJKHWSCu2UYEW_X వెంకటేష్‌&nbsp; టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో ఒకరైన వెంకటేష్‌ (Venkatesh)కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇంటిల్లపాది చూడొచ్చని అందరూ భావిస్తుంటారు. అటువంచి వెంకటేష్‌.. ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్‌తో అందరికీ షాకిచ్చారు. మాటకు ముందు.. మాటకు వెనక బూతులు మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌ చూసిన వారంతా ఇది మన వెంకటేష్‌యేనా అని తమని తాను ప్రశ్నించుకున్నారు.&nbsp; రామ్‌ చరణ్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులోని యాక్షన్‌ సీక్వెన్స్.. శ్రుతి మించినట్లు ఆడియన్స్‌ ఫీలయ్యారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌ రౌడీల తలలు నరికేస్తే వాటిని గద్దలు ఎత్తుకెళ్లడం.. విలన్ వివేక్‌ ఓబరాయ్‌ను పాము కరిచిన చావకపోవడం అన్నది ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. మరి ముఖ్యంగా ట్రైన్‌పై నిలబడి అతడు బిహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. అసలు చరణ్‌.. ఇందులో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నలు వచ్చాయి.&nbsp; https://youtu.be/eVkD-_zYpx8?si=ow5GWETle2TCH9Db ప్రభాస్‌ ప్రభాస్‌ హీరోగా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రెబల్‌’.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్‌ను అమాయకుడిగా చూపే ప్రయత్నం ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. ప్రభాస్‌ను మరీ సాఫ్ట్‌గా చూపించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. 6 ఫీట్‌ కటౌట్‌కు తెల్లటి వస్త్రాలు, ముఖాన బొట్టు పెట్టి సన్నివేశాలు తీయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు ఇలా నటించడానికి డార్లింగ్‌ ప్రభాస్‌ను డైరెక్టర్‌ ఏం చెప్పి ఒప్పించాడని సందేహాలు వ్యక్తం చేశారు.&nbsp; https://youtu.be/ApysPLa7NN8?si=mKnh-xQbgmPMPA5q
    ఏప్రిల్ 30 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో&nbsp; పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987&nbsp; పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.&nbsp; పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.&nbsp; పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.&nbsp; పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ (Save The Tigers S1 &amp; S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.&nbsp; పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
    గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం స్కంద (Skanda movie) ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. చంద్రముఖి 2 (chandramukhi 2) రాఘవ లారెన్స్‌, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2.&nbsp; ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్‌ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు.&nbsp; ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War) కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. పెదకాపు-1 (Peddha Kapu 1) ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1) TitleCategoryLanguagePlatformRelease DateLittle Baby Bum: Music Time&nbsp;SeriesEnglishNetflixSept 25The Devil's Plan&nbsp;SeriesKoreanNetflixSept 26Forgotten LoveMoviePolishNetflixSept 27OverhaulMoviePortugueseNetflixSept 27Sweet Flow 2&nbsp;MovieFrenchNetflixSept 27The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27Ice Cold: Murder, Coffee and Jessica Wangso&nbsp;MovieEnglishNetflixSept 28Love is in the AirMovieEnglishNetflixSept 28Fair Play&nbsp;MovieEnglishNetflixSept 29Choona&nbsp;SeriesHindiNetflixSept 29Nowhere&nbsp;MovieSpanishNetflixSept 29Reptile&nbsp;MovieEnglishNetflixSept 29Khushi&nbsp;MovieTeluguNetflixOct 01Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28Kumari SrimatiSeriesTelugu&nbsp;Amazon PrimeSept 28Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29El-PopSeriesSpanishHotstarSept 27The Worst of EvilSeriesEnglishHotstarSept 27King of KotaMovieTelugu Dubbed&nbsp;HotstarSept 28Launchpad Season 2SeriesEnglishHotstarSept 29Tum Se Na Ho Payega&nbsp;MovieHindiHotstarSept 29Papam Pasivadu&nbsp;SeriesTeluguAhaSept 29Dirty HariMovieTamilAhaSept 29Charlie ChopraSeriesHindiSony LivSept 27Bye!&nbsp;MovieTamilSony LivSept 29Agent&nbsp;MovieTeluguSony LivSept 29Angshuman MBA&nbsp;MovieBengaliZee5Sept 29Blue BeetleMovieEnglishBook My ShowSept 29
    సెప్టెంబర్ 25 , 2023

    @2021 KTree