• TFIDB EN
  • బ్రహ్మాస్త్రం: మొదటి భాగం - శివ
    UATelugu2h 47m
    మూడు ముక్కలైన బ్రహ్మాస్తాన్ని కలిపి ప్రపంచాన్ని శాసించాలని జునూన్‌ (మౌనీ రాయ్‌) యత్నిస్తుంటుంది. వాటిని వెతికి పట్టుకునేందుకు తన మనుషులను పంపిస్తుంది. ఆమె ప్రయత్నాలకు డీజే నడుపుతూ జీవనం సాగించే శివ (రణ్‌బీర్‌ కపూర్‌) ఎలా అడ్డుతగిలాడు? శివ నేపథ్యం ఏంటి? అగ్నికి అతడికి సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    కథనాలు
    PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
    PAN INDIA MOVIE TITLES: టైటిల్‌తోనే ఈ సినిమాల రేంజ్ చెప్పేశారు..!
    ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం. సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్‌ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం. RRR  ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.  KGF రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.  పఠాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.  పుష్ప సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మాస్త్ర అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.  బీస్ట్ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్‌ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.  సలార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.  OG పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.  LEO లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
    మే 02 , 2023
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    VARUNLAV:  ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.  https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20 https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20 కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నయనతార- విఘ్నేష్ శివన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.  Screengrab Instagram:nayanatara నమ్రత- మహేశ్ బాబు నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.  అలియా భట్- రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.  విజయనిర్మల- కృష్ణ సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.  జ్యోతిక- సూర్య  సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).  అమల- నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.  నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు. జీవిత- రాజశేఖర్ జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.  షాలిని- అజిత్ బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంటలు కూడా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
    జూన్ 09 , 2023
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    Best Love Songs 2023: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌ 10 తెలుగు రొమాంటింక్ సాంగ్స్‌?
    కోపం, చిరాకు, బాధ ఇలా ఏ మూడ్‌నైనా మ్యూజిక్‌ చిటికెలో మాయం చేస్తుంది. ఇష్టమైన మెలోడి సాంగ్స్‌ వింటే ఊహాల్లో విహరించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది యువత తమ స్ట్రెస్‌ బస్టర్‌గా మ్యూజిక్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇటీవల ఎన్నో సూపర్‌ హిట్‌ మెలోడీ సాంగ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆ పాటలకు యూట్యాబ్‌లో యమా క్రేజ్‌ నడుస్తోంది. 2023లో అత్యధిక వ్యూస్‌తో  యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న టాప్‌-10 తెలుగు మెలోడీ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం… 1. ఇంతందం, ఓ సీతా ( సీతారామం) అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన సీతారామం (Sita Ramam) సినిమా.. తెలుగులో సూపర్‌హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ పాట దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా ‘ఇంతందం’, ‘ఓ సీతా’ పాటలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటల్లో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తున్నాయి. https://youtu.be/hYFzyK9ExuM https://youtu.be/dOKQeqGNJwY 2. కళావతి (సర్కారు వారి పాట) మహేష్‌బాబు (Mahesh Babu), కీర్తి సురేష్‌ (keerthi Suresh) జంటగా చేసిన సర్కారు వారి పాట (Sarkari Vaari Paata) హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఇందులోని కళావతి సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో ఈ పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌లో పాట తెగ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే 24 కోట్ల మంది యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించారు.  https://youtu.be/Vbu44JdN12s 3. గుండెల్లోనా (ఓరి దేవుడా) విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓరి దేవుడా’ (Ori Devuda) సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని గుండెల్లోనా పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫుల్‌ జోష్‌తో నిండిన ఈ పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. 8.4 కోట్ల వ్యూస్‌లో ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.  https://www.youtube.com/watch?v=t_aO4EMP-i0 4. కుంకుమల (బ్రహ్మస్త్ర) బ్రహ్మస్త్ర (Brahmastra) లోని కుంకుమల నువ్వే పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది. ఎంతోమంది ఈ పాటను కాలర్‌ట్యూన్‌గా, మెుబైల్‌ రింగ్‌టోన్‌గా పెట్టుకున్నారు. సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) తన స్వరంతో మరోమారు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పాట కూడా 4.5 కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.   https://youtu.be/5kzM6m33DTo 5. మెహబూబా (కేజీఎఫ్‌ 2) కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2)లోని మెహబూబా(Mehabooba) పాట కూడా మెలోడి ప్రియుల ఫేవరెట్‌ సాంగ్. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు ఎంత బాగా నచ్చిందో క్లాస్‌ మ్యూజిక్‌ లవర్స్‌ మెహబూబాా పాట అంతకంటే బాగా నచ్చింది. అనన్య భట్‌ పాడిన ఈ పాట ప్రతీ ఫోన్‌లోని మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట 3.9 కోట్ల వ్యూస్‌ను సంపాదించింది https://youtu.be/5xwM12SOXEE 6. మాస్టారు మాస్టారు (సార్‌) సార్‌(SIR) సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్‌ లవర్స్‌కు ఈ పాట ఫేవరేట్‌ సాంగ్‌గా ఉంది. సింగర్‌ శ్వేతా మోహన్‌ (Swetha Mohan) అందించిన గాత్రం సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటను 3.3 కోట్ల మంది చూశారు.  https://youtu.be/AXSm49NGkg8 7. నగుమోము తారలే (రాధేశ్యామ్‌) పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hedgde) జంటగా చేసిన రాధేశ్యామ్‌ (Radhe Shyam) సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నగుమోము తారలే పాట మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మ్యూజిక్‌ లవర్స్‌ ఈ పాటను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని మరి వింటున్నారు. అటు యూట్యూబ్‌లోనూ ఈ పాటను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ పాటను 11 మిలియన్స మంది చూశారు.  https://youtu.be/O5LW6HABcRA 8. ఏడు రంగుల వాన (18 పేజెస్‌) నిఖిల్‌(Nikhil), అనుపమ (Anupama Parameswaran) జంటగా నటించిన 18 పేజెస్‌ (18 Pages) సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలోని ఏడు రంగుల వాన పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో 1.8 మిలియన్ వ్యూస్ సంపాదించింది.  https://youtu.be/hOLw-mkSnHs 9. ఓ రెండు ప్రేమ మేఘాలిలా (బేబి) ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా త్వరలో బేబి సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటివరకు 7.5 మిలియన్ల మంది పాటను చూశారు.  https://youtu.be/D_SRMiIWyL4 10. ప్రియతమ (కొత్త కొత్తగా) కొత్త కొత్తగా (Kotha Kothaga) సినిమాలోని ప్రియతమ (Priyathama) పాట కూడా మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అనంత శ్రీరామ్‌ (Ananth Sriram) ఈ పాటకు లిరిక్స్‌ అందించగా… శిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. ఈ పాటను 14 మిలియన్ల మంది యూట్యూబ్‌లో వీక్షించారు.  https://youtu.be/CDbuW4689fI
    ఏప్రిల్ 12 , 2023
    NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హృతిక్‌ రోషన్‌తో తలపడనున్న తారక్‌..!
    NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హృతిక్‌ రోషన్‌తో తలపడనున్న తారక్‌..!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా పాన్‌ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.   అధికారిక ప్రకటన తరణ్‌ ఆదర్స్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ‘వార్‌-2’ చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యాశ్‌రాజ్‌ ఫిల్మ్(YSRF) స్పై యూనివర్స్‌’ నిర్మించనుంది. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర డైరెక్టర్‌ ‘అయాన్‌ ముఖర్జీ’ దర్శకత్వం వహిస్తారు. అయితే వార్‌-2 (WAR2) సినిమా డైరెక్టర్‌ను మంగళవారమే మేకర్స్‌ ఎనౌన్స్‌ చేశారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా భాగం అవుతాడని ఇవాళే తెలిసింది.   ముందే తెలుసా? బ్రహ్మస్త్ర డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ(Ayan mukherjee) ఎన్టీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్‌లో ఎన్టీఆర్‌ చురుగ్గా పాల్గొన్నాడు. హీరో, హీరోయిన్లు రన్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌లతో కలిసి ప్రచార వేదికల్లో ఎన్టీఆర్‌ సందడి చేశాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్‌తోనే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడతారని అప్పట్లో ఎవరూ ఊపించలేదు. అయితే తాజా ప్రకటనను చూసిన ఎన్టీఆర్ అభిమానులు వార్‌-2 సినిమా గురించి వారికి ముందే తెలిసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ముఖర్జీ కోసం బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నాడని ఊహిస్తున్నారు.  బిజీబిజీగా జూ.NTR ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. NTR30 పేరుతో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తోంది. పాన్‌ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో NTR 31 రూపొందనుంది. ఈ నేపథ్యంలో వార్‌-2 సినిమా షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. NTR30 షూటింగ్‌ పూర్తైన వెంటనే వార్‌-2 సినిమాపై ఎన్టీఆర్‌ ఫోకస్‌ పెడతాడా? లేదా NTR 31 చేస్తూనే హృతిక్‌ సినిమాలో పాలుపంచుకుంటాడా? అన్నది ఆసక్తి కరం. ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే. అతి పెద్ద సంస్థ వార్‌-2 ను నిర్మించబోయే యాశ్‌రాజ్‌ ఫిల్మ్ స్పై యూనివర్స్‌ సంస్థకు భారీ బడ్జెట్‌ సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఈ నిర్మాణ సంస్థ నుంచి నాలుగు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఆ సినిమాలు బాలీవుడ్‌ను షేక్‌ చేశాయనే చెప్పాలి. ఇటీవల విడుదలై రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన పఠాన్‌ చిత్రాన్ని ఈ సంస్థనే నిర్మించింది. గతంలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కాంబోలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ సినిమాలను కూడా యాశ్‌రాజ్ సంస్థనే నిర్మించింది. అలాగే 2019లో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి చేసిన ‘వార్‌’ మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ‘టైగర్‌ వర్సస్‌ పఠాన్‌’ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఇందులో షారుఖ్‌, సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. 
    ఏప్రిల్ 05 , 2023
    <strong>Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!&nbsp;&nbsp;</strong>
    Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్‌ అని తెలుసా? గెస్ట్‌ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్‌ వీరే!&nbsp;&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్‌ మెుదలైంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలివుడ్‌ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్‌ఫుల్‌ క్యామియో లేదా రోల్‌ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. తద్వారా సూపర్‌ హిట్‌ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్‌ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్‌ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; చిరు క్యామియో చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్‌ రీమేక్‌ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్‌ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.&nbsp; https://twitter.com/i/status/1212794102867083265 అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు మిస్టర్ బచ్చన్‌ రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్‌ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్‌ వేసేలా చేసింది. &nbsp; కల్కి 2898 ఏడీ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్‌ అదిరిపోయే క్యామియోస్‌ ఇచ్చారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలు పోషించారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన ‘సలార్‌’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించాడు.&nbsp; జైలర్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.&nbsp; విక్రమ్‌ కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్‌’ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్‌బంప్స్‌ తెప్పించారు.&nbsp; బ్రహ్మాస్త్ర రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్‌ క్యామియో ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపించి అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్‌ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఆచార్య మెగాస్టార్‌ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్‌ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్‌ చేసిన ’మగధీర’, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం.&nbsp; లాల్‌ సింగ్‌ చద్దా బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన లాల్ సింగ్‌ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; లైగర్‌&nbsp; విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్‌’ చిత్రంలో వరల్డ్‌ ఫేమస్‌ బాక్సర్‌ ‘మైక్‌ టైసన్‌’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!</strong>
    Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!
    నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్‌ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సాయిపల్లవిని కాదని..! 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే 'కచ్‌ ఎక్స్‌ప్రెస్‌' అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్‌ సంయుక్తంగా వరించింది. నిత్యా మీనన్‌ ఏం గొప్ప..! నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్‌ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్‌ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్‌ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్‌ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు.&nbsp; https://twitter.com/david_bro18/status/1824390579129815154 https://twitter.com/jammypants4/status/1824662625713521129 https://twitter.com/tum_saath_ho/status/1824438399735869460 బెస్ట్‌ యాక్టర్‌గా సౌత్‌ స్టార్‌ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా 'ఆట్టమ్‌'&nbsp; (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్‌ 2', బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్‌ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్‌ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు. జాతీయ అవార్డు విజేతలు వీరే ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)&nbsp;ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార)&nbsp;ఉత్తమ నటి: నిత్యా మేనన్‌ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతి)&nbsp;ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్&nbsp;ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర&nbsp;ఉత్తమ ఫిమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్‌ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్‌ రెహమాన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 తమిళం)&nbsp;ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి (పొన్నియిన్‌ సెల్వన్‌ - 1)&nbsp;ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మాలికాపురం&nbsp; - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే:&nbsp; ఆనంద్‌ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్‌: మహేష్‌ భువనేండ్‌ (ఆట్టం)&nbsp;ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీఎఫ్-‌ 2)ఉత్తమ మేకప్‌: సోమనాథ్‌ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నిక్కి జోషి (కచ్‌ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ)&nbsp;ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల (గుల్‌మోహర్‌) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2&nbsp; (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్‌ 2&nbsp; (కన్నడ)ఉత్తమ&nbsp; ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1&nbsp; (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం&nbsp; : గుల్‌మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్‌ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ&nbsp; (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్‌ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ) జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ సినిమాలు ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌&nbsp; (మరాఠీ)ఉత్తమ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్‌ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : బస్తి దినేశ్‌ షెనోయ్‌&nbsp; (ఇంటర్‌మిషన్‌ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌: విశాల్‌ భరద్వాజ్‌ (ఫుర్సత్‌ - లీజర్‌/ హిందీ)ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ)&nbsp;ఉత్తమ బుక్‌ ఆన్‌ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌ కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ - ఇంగ్లిష్‌)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్‌ దివాన్‌ -మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌)
    ఆగస్టు 17 , 2024
    August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
    August 15 Celebrity Birthdays: స్వాతంత్ర్య దినోత్సవం రోజున జన్మించిన సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
    ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ రోజును యావత్ భారతావని గౌరంవగా భావిస్తారు. ఆగస్టు 15న ఏ కార్యక్రమం జరిగినా గొప్పగా పేర్కొంటూ కలకాలం గుర్తించుకుంటారు. ఈనేపథ్యంలో ఆగస్టు 15న జన్మించిన సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం.. సుహాసిని మణిరత్నం సుహాసిని తమిళనాడులోని పరమకుమిడిలో 1961 ఆగస్టు 15న జన్మించింది. తమిళం , తెలుగు , మలయాళం, కన్నడ చిత్రాలలో నటించింది . కే బాలచందర్ డైరెక్షన్‌లో వచ్చిన సింధు భైరవి (1985) లో తన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది . తెలుగులో ఎగిరేపావురమా,&nbsp; సంసారం చదరంగం, చంటబ్బాయి, నువ్వునాకునచ్చావ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; అర్జున్ సర్జా&nbsp; అర్జున్ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి తానే స్వయంగా డైరెక్ట్ చేశాడు. 1962 ఆగస్టు 15న కర్ణాటకలోని తుమకూర్‌లో జన్మించారు. అర్జున్‌కు ఇద్దరు ఆడ పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను హనుమంతుని వీర భక్తుడు.&nbsp; అందువల్లే శ్రీఆంజనేయం చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు.&nbsp; అద్నాన్ సమి&nbsp; అద్నాన్ సమి ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. 1971 ఆగస్టు 15న లండన్‌లో సమి జన్మించారు. హిందీ, తెలుగు చిత్రాల్లో వందలాది సాంగ్స్ పాడారు.&nbsp; పలు సినిమాల్లోనూ నటుడిగా యాక్ట్ చేశారు. భజరంగ్ భాయ్ జాన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. 2016లో భారత పౌరసత్వం పొందారు. సంగీతంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. &nbsp; ఉత్తేజ్ ఉత్తేజ్ 1975, ఆగస్ట్ 15న నల్గొండ జిల్లాలోని సీతారాంపురంలో జన్మించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, సంభాషణల రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు 197 సినిమాల్లో నటించారు.&nbsp; మనీ, మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, డేంజర్ వంటి హిట్ చిత్రాలకు మాటలు రాశాడు. చందమామ సినిమాకు ఉత్తమ హాస్య నటునిగా నంది బహుమతి పొందాడు. అయాన్ ముఖర్జి అయాన్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.&nbsp; 1983 ఆగస్టు 15న&nbsp; పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు. బ్రహ్మాస్త్ర, వేకప్‌సిడ్, 'హే జవానిహై దివాని' వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు.&nbsp; ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పార్ట్ 2 తెరకెక్కించి పనిలో ఉన్నారు. ఈ చిత్రం మూడు పార్ట్‌లలో రానుంది.&nbsp; రాళ్లపల్లి రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు క్యారెక్టర్ అర్టిస్ట్. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో 1945, ఆగస్టు 15 న జన్మించారు.&nbsp; రాళ్లపల్లి అసలు పేరు రాళ్లపల్లి నరసింగరావు. తెలుగులో ఆయన దాదాపు 800కు పై చిత్రాల్లో నటించారు. తనికెళ్ల భరణి వంటి రచయితలకు ఆయన మార్గదర్శి. నాటకరంగంలో 8వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
    ఆగస్టు 14 , 2023
    Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..! 
    Yash as Ravana: రణ్‌బీర్‌కు పోటీగా యశ్.. రావణుడిగా కనిపించననున్న కేజీఎఫ్ స్టార్..! 
    రామాయణం కథ ఆధారంగా ఎన్ని చిత్రాలు చేసినా తక్కువే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి కూడా రామాయణ కావ్యాన్ని తెరకెక్కించాలని సంకల్పించాడు. డ్రీమ్ ప్రాజెక్టుగా దీనిని మలుచుకున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టులో ముందడుగు పడింది. రామాయణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడానికి నితేశ్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ మూవీని స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్నాడు. చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా వచ్చిన చిత్రాలెన్నో. లేటెస్ట్‌గా ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కథాంశం కూడా ఇదే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించాడు. సీతాపహరణం నుంచి రావణ సంహారం వరకు కథాంశంగా తీసుకుని ఆదిపురుష్‌ని తెరకెక్కించారు. అయితే, నితేశ్ తివారి తీయబోయే రామాయణం&nbsp; విజువల్ వండర్‌గా ఉండనుందట. స్టోరీ లైన్‌పై స్పష్టత లేనప్పటికీ రామాయణంలోని కీలక ఘట్టాలను చూపించాలన్న సంకల్పంతో డైరెక్టర్ ఉన్నాడు. ఇందుకు అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు.&nbsp; తారాగణం.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. కానీ, దానిని చూపించడంలో ఒక్కొకరిది ఒక్కో శైలి. ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే. అందుకే ప్రతి చిన్న విషయంలో చిత్రబృందం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మూవీ టీం ప్రధానంగా తారాగణంపై ఫోకస్ పెట్టింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. సీతగా అలియాను ఎంచుకున్నారు. దీపావళికి దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ ఉండనుంది.&nbsp; రావణుడిగా యశ్.. కీలకమైన రావణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురితో డైరెక్టర్ చర్చించాడు. లేటెస్ట్‌గా కేజీఎఫ్ స్టార్ యశ్‌ని ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్. అయితే, జనవరిలోనే మేకర్లు యశ్‌ని కలిశారట. అప్పటినుంచి స్క్రిప్ట్ చర్చల్లోనే వీరున్నారట. విలన్ రోల్ చేయడానికి యశ్ దాదాపుగా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో యశ్ రోల్‌ని కన్ఫర్మ్ చేయనుంది. వాస్తవానికి తొలుత హృతిక్ రోషన్‌ని ఈ క్యారెక్టర్‌కి పరిశీలించి చూశారు. అయితే, విక్రమ్‌వేదలో నెగెటివ్ రోల్ దెబ్బకొట్టడంతో హృతిక్ రామాయణం ప్రాజెక్టుకు నో చెప్పాడు. లుక్ టెస్ట్.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లుక్ టెస్ట్ నడుస్తోంది. రాముడి పాత్రకు తగ్గట్టు రణ్‌బీర్ తనను తాను మలుచుకోనున్నాడు. పైగా, వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇటీవల వీరిద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర హిట్ టాక్ తెచ్చుకుంది.&nbsp; డిసెంబర్‌లో షూట్.. డిసెంబరు నుంచి ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్‌గా ప్రారంభం కానుంది. అన్నీ కుదిరితే 2025 దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాను మధు మంతెన వర్మ, అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీనిని తీసుకు రానున్నారు.&nbsp;
    జూన్ 08 , 2023

    @2021 KTree