• TFIDB EN
  • బ్రాండ్ బాబు
    UTelugu2h 24m
    డైమండ్‌ బాబు (సుమంత్‌ శైలేంద్ర) కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి బ్రాండెండ్‌ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తుంటాడు. చేసుకోబోయే అమ్మాయికి కూడా బ్రాండ్‌ ఉండాలని భావిస్తాడు. ఈ క్రమంలో హోంమంత్రి కూతుర్ని ప్రేమిస్తాడు. పెళ్లికి సిద్ధమైన అతడికి ఓ షాకింగ్‌ న్యూస్‌ తగులుతుంది. ఇంతకీ ఏమిటి ఆ వార్త? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుమంత్ శైలేంద్ర
    డైమండ్ బాబు
    ఈషా రెబ్బా
    రాధ
    మురళీ శర్మ
    డైమండ్ బాబు తండ్రి
    రాజా రవీందర్
    రాధ మామ
    పూజిత పొన్నాడ
    పావని
    సత్యం రాజేష్
    నళిని
    మీసం సురేష్
    సిబ్బంది
    ప్రభాకర్ పొడకండ్లదర్శకుడు
    శైలేంద్ర బాబునిర్మాత
    మారుతి
    రచయిత
    జీవన్ బాబుసంగీతకారుడు
    కార్తీక్ పళని
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
    Heroes in Ads: మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ పోటీ.. ఇక..Jr NTR, అల్లు అర్జున్ పరిస్థితి?
    ఒకప్పుడు యాడ్స్ అంటే బాలీవుడ్ నటులే గుర్తొచ్చేవారు. కానీ, ఇప్పుడలా లేదు. ఏ యాడ్ చూసినా టాలీవుడ్ హీరోలే. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి లోకల్ ప్రొడక్టు వరకు ప్రతీ ప్రచారానికి తెలుగు హీరోలే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా చేస్తున్న ప్రకటనల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కో హీరో ఏకంగా నాలుగైదు యాడ్స్ చేస్తుండటం డామినేషన్‌ని తెలియజేస్తోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లలో బిజీబిజీగా గడుపుతున్న ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా.  అల్లు అర్జున్ పుష్ప సినిమా బన్నీని ఐకాన్ స్టార్‌గా మార్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్‌లలో చేస్తున్నాడు. ఇటీవలే రెడ్ బస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. కేఎఫ్‌సి చికెన్ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రాల్ స్ట్రాంగ్ పీవీసీ పైప్‌లకూ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. కోకాకోలా కూల్‌డ్రింక్ యాడ్‌లోనూ నటించాడు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కీ అల్లు అర్జునే బ్రాండ్ అంబాసిడర్. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తరఫున కూడా బన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఇలా సినిమాలతో పాటు ప్రకటనలతోనూ బన్నీ బాగానే కమాయిస్తున్నాడు. ఒక్కో ప్రకటనకి అల్లు అర్జున్ రూ.7 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటాడని టాక్. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) విజయ్ దేవరకొండ శ్యామ్ స్టీల్ ఇండియాతో విజయ్ చేతులు కలిపాడు. ఈ స్టీల్ గుణగణాలను తెలియజేస్తూ డిజైన్ చేసిన యాడ్‌లో విజయ్ నటించాడు. దీంతో పాటు జైవర్స్ ఫుట్‌వేర్ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. లక్స్ కాజి మెన్స్ ఇన్నర్‌వేర్ తరఫున ప్రచార కర్తగా ఉన్నాడు. థమ్స్ అప్(Thumbs Up) యాడ్‌లోనూ విజయ్ దేవరకొండ నటించాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకు తంబ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు విజయ్ ఏకంగా రూ.10 కోట్లు తీసుకున్నట్లు టాక్. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) మహేశ్ బాబు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన మహేశ్ బాబు.. యాడ్స్‌ ఎక్కువ చేస్తుంటాడు. ఇటీవల మౌంటెన్ డ్యూ అనే సాఫ్ట్‌డ్రింక్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. దీంతో పాటు మహేశ్ బాబు ఎవరెస్ట్ గ్రాండ్ మసాలా యాడ్‌లో నటించాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌తోనూ మహేశ్ బాబు అసోసియేట్ అయ్యాడు. మౌంటెన్ డ్యూ యాడ్‌కి మహేశ్ బాబు ఏకంగా రూ.12 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పలు కంపెనీలు ఎన్టీఆర్ కోసం క్యూ కట్టాయి. రీసెంట్‌గా జూనియర్ మెక్ డొనాల్డ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించాడు.  24 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ లిషియస్ అనే ఫుడ్ డెలివరీ యాప్‌కి, ఆప్పీ ఫిజ్ కూల్‌డ్రింక్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.  View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) రామ్‌చరణ్ రామ్‌చరణ్ పలు ప్రకటనల్లో నటించాడు. గతంలో సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ తరఫున ప్రచారం చేశాడు. ఇటీవల ఫ్రూటీ యాడ్‌లోనూ అలియా భట్‌తో కలిసి చెర్రీ నటించాడు. గతేడాది మీషో బ్రాండ్ తరఫున యాడ్‌లో తళుక్కున మెరిశాడు.  https://www.youtube.com/watch?v=PtNSXvlZVIM
    జూన్ 13 , 2023
    <strong>Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు</strong>
    Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు
    యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే యాడ్స్‌కు సైతం సమయాన్ని కేటాయిస్తుంటాడు. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్స్‌ అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌-తమన్నా కలిసి ఓ కొత్త యాడ్‌ చేశారు. ఇందులో వీరి పెయిర్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ లుక్కేయండి.  క్యూట్‌ కపుల్స్‌గా మహేష్‌-తమన్నా! మహేష్‌ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కాంబోలో గతంలో ‘ఆగడు’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైనప్పటికీ వీరి కాంబో బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ ఎలక్ట్రానికి కంపెనీ ‘లాయిడ్‌’ (LLOYD) తమ ప్రొడక్ట్స్‌కు వారిని బ్రాండ్ అంబాసీడర్లుగా నియమించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘లాయిడ్‌ నొవాంటే’ (Lloyd Novante) అనే అత్యాధునిక వాషింగ్‌ మిషన్‌ (LLOYD Washing Machine) యాడ్‌లో మహేష్, తమన్నా కలిసి నటించారు. 25 సెకన్ల పాటు సాగిన ఈ ప్రకటనలో వీరిద్దరి పెయిర్‌ చాలా క్యూట్‌గా అనిపించిదని ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ యాడ్‌ను మీరూ చూసేయండి.  https://www.youtube.com/watch?app=desktop&amp;v=thhQfEk9ZPs గతంలోనూ ఇలాగే.. మహేష్‌ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కలిసి ఓ ప్రకటనలో నటించడం&nbsp; ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరిద్దరు లాయిడ్‌ కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో నటించారు. లాయిడ్ గ్రాండ్‌ హెవీ డ్యూటీ ఎసీ, లాయిడ్‌ ఏసీ తదితర ప్రకటనల్లో వారు క్యూట్‌ జంటగా కనిపించారు. అందమైన కపుల్స్‌లాగా కనిపిస్తూ ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ యాడ్స్‌ వినియోగదారుల్లోకి బాగా దూసుకెళ్లాయి. ఈ స్టార్‌ నటుల క్రేజ్‌ దెబ్బకి లాయిడ్‌ ప్రొడక్ట్స్‌ సేల్స్ బాగా పెరిగిందన్న ప్రచారం ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=lWf3C90zBuM&amp;t=6s https://www.youtube.com/watch?v=scd5zQmuQ_c &nbsp;ప్రియుడితో దీపావళి సంబరాలు మరోవైపు మిల్క్‌ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత రమేష్‌ తౌరాణి తాజాగా నిర్వహించిన దీపావళి ఈవెంట్‌కు వీరిద్దరు జంటగా హాజరయ్యారు. ముఖ్యంగా తమన్న పింక్‌ కలర్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించి అక్కడి వారిని కట్టిపడేసింది. ఎద, నడుము అందాలు చూపిస్తూ ట్రెడిషనల్‌ పార్టీని సైతం ఎంతో హాట్‌గా మార్చేసింది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తమన్నా-విజయ్‌ వర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; https://twitter.com/Anamika_upi/status/1850805298019316066 కృష్ణుడిగా మహేష్‌బాబు! మహేష్‌ - రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మహేష్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తన మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తోన్న 'దేవకీ నందన వాసుదేవ' చిత్రంలో మహేష్‌ శ్రీకృష్ణుడి గెటప్‌లో ఓ చిన్న క్యామియో ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖం చూపించకుండా కల్కిలో కృష్ణుడు ఎలా కనిపించాడో అలానే కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ మూవీకి ప్రశాంత్‌ వర్మ కథను అందించగా శ్రీకృష్ణుడి రోల్‌ను అతడు ఎంతో పవర్‌ఫుల్‌గా రాశాడని టాక్ ఉంది. క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడి ఉగ్రరూపం షాట్‌ కూడా ఉంటుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.&nbsp; https://twitter.com/RajivAluri/status/1850877605630599469
    అక్టోబర్ 28 , 2024
    ఈషా రెబ్బ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఈషా రెబ్బ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఈషా రెబ్బ.. తెలుగు సినిమా నటి. "అంతకుముందు.. ఆ తరువాత" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. బ్రాండ్‌ బాబు, బందిపోటు, అరవింద సమేత వీరరాఘవ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఈషా రెబ్బ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Eesha rebba) ఓసారి చూద్దాం ఈషా రెబ్బ&nbsp; వయస్సు ఎంత? 1988, ఏప్రిల్ 19న జన్మించింది ఈషా రెబ్బ&nbsp; తెలుగులో నటించిన తొలి సినిమా? అంతకుముందు.. ఆ తరువాత ఈషా రెబ్బ ఎత్తు ఎంత? 5 అడుగుల 6అంగుళాలు&nbsp; ఈషా రెబ్బ&nbsp; ఎక్కడ పుట్టింది? వరంగల్, తెలంగాణ ఈషా రెబ్బ&nbsp; ఉండేది ఎక్కడ? హైదరాబాద్ ఈషా రెబ్బ ఏం చదివింది? MBA ఈషా రెబ్బ అభిరుచులు? మోడలింగ్ ఈషా రెబ్బకు ఇష్టమైన ఆహారం? దోశ ఈషా రెబ్బకి&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ ఈషా రెబ్బ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఈషా రెబ్బ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? సినిమాల్లోకి రాకముందు ఈషా రెబ్బ మోడలింగ్ చేసేది ఈషా రెబ్బ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/yourseesha/?hl=en ఈషా రెబ్బ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి ఈషా రెబ్బ ఫెవరెట్ హీరోయిన్? గీతాంజలి ఈషా రెబ్బకు టాటూ ఎక్కడ ఉంది? కుడి చేతి మీద నెమలి కన్ను టాటూగా ఉంది. https://www.youtube.com/watch?v=JcIgRKoxIeM
    ఏప్రిల్ 13 , 2024
    <strong>Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఫొటోలు వైరల్</strong>
    Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్‌, కూల్‌ డ్రింక్స్‌.. ఫొటోలు వైరల్
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప ప్రమోషన్స్‌ వినూత్నంగా నిర్వహించేందుకు థియేటర్స్‌ యజమానులు రెడీ అయ్యారు.&nbsp; నెల రోజుల్లో పుష్పగాడి రాక 'పుష్ప 2' రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసి పుష్ప టీమ్ అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్‌ 5) సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌), భన్వర్‌సింగ్ షెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే ట్రైలర్‌ను (pushpa 2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1853694508623683871 గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంచ్‌! ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్‌ అప్పట్లో ఎంత ట్రెండ్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్‌ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్‌ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్‌ చేయోచ్చని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. పాప్‌కార్న్‌ డబ్బాలతో ప్రమోషన్స్‌ ‘పుష్ప2’ విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉండటంతో అటు విదేశాల్లోనూ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు.&nbsp; పుష్ప బ్రాండ్‌ పాప్‌కార్న్‌ టబ్స్‌, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను&nbsp; యూఎస్‌లోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13న విడుదలయ్యే ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా&nbsp; ఇలాంటి ప్రత్యేక ప్రమోషన్‌ చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్&nbsp; మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 టీమ్‌ వీటికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకోవడం విశేషం.&nbsp; https://twitter.com/RegalMovies/status/1853467449280082009 ఈనెల 6 నుంచి ఐటెం సాంగ్‌ షూట్‌! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా ఫైనల్‌గా యంగ్‌ బ్యూటీ శ్రీలీలను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 6 నుంచి సాంగ్ షూట్‌ కూడా మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో ఏ స్థాయిలో స్టెప్పులు ఇరగదీస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; ‘పుష్ప 3’ పక్కా ‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్‌ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్ సైతం మూడో పార్ట్‌ గురించి పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్‌ 3 కి సంబంధించి సాలిడ్‌ లీడ్‌ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్‌ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్‌ చేయలేదు.&nbsp; పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అటు సుకుమార్‌ సైతం రామ్‌చరణ్‌తో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత ‘పుష్ప 3’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1849383805657690194
    నవంబర్ 05 , 2024
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్‌, కేశవ్‌ దీపక్‌, ఝాన్సీ, హర్షవర్ధన్‌, అభిజ్ఞ, రోషన్‌, సతీష్‌ సరిపల్లి, మహేష్‌ విట్టా తదితరులు డైరెక్టర్‌: విశ్వక్ ఖండేరా సినిమాటోగ్రాఫర్‌ : అదిత్య జవ్వాది సంగీతం : ప్రశాంత్‌ ఆర్. విహారి స్ట్రీమింగ్‌ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ:&nbsp; 02 ఫిబ్రవరి, 2024 లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. కథ లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్‌ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్‌ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్‌ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే మిస్‌ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్‌ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్‌ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్‌, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్‌ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్‌ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్‌ తడబడ్డారు. రైటింగ్‌ ఫెయిల్యూర్‌ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    ఫిబ్రవరి 02 , 2024
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్‌ బాబు హీరోగా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. SSMB29 ట్రెండింగ్ RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్‌ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.&nbsp; https://twitter.com/i/status/1635126271427624961 పూనకాలు లోడింగ్ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా లాంఛ్‌ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్‌మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. జక్కన్న, సూపర్‌ స్టార్‌ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్‌లో హైప్ పెంచుతున్నారు. https://twitter.com/TribhuvanRishi/status/1635290226062147584 హాలీవుడ్ హీరోయిన్‌ మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్‌లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/UrsPrakash_07/status/1635172159688671233 మనదే ఆస్కార్ మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు. https://twitter.com/sri_cultdhfm/status/1635131220832165888 శరవేగంగా పనులు రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్‌ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం బిజీ రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది.&nbsp; ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
    మార్చి 14 , 2023
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శివాని నగరం గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    &nbsp;టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త తెలుగు హీరోయిన్లలో శివాని నగరం(Shivani Nagaram) ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈక్రమంలో శివాని నగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. (Some Lesser Known Facts about Shivani Nagaram )&nbsp; శివాని నగరం ఎప్పుడు పుట్టింది? 2001, ఆగస్టు 21న జన్మించింది శివాని నగరం హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? అంబాజి పేట మ్యారేజ్ బ్యాండు శివాని నగరం ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; శివాని నగరం రాశి ఏది? కుంభం శివాని నగరం ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ శివాని నగరం అభిరుచులు? పుస్తకాలు చదవడం, సింగింగ్ శివాని నగరంకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజ్, చికెన్ శివాని నగరంకు ఇష్టమైన కలర్? బ్లాక్, పింర్ శివాని నగరంకు ఇష్టమైన హీరో? మహేష్ బాబు శివాని నగరం ఏం చదివింది? డిగ్రీ శివాని నగరం పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. శివాని నగరం సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? ఇన్‌స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయింది శివాని నగరం ఎఫైర్స్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు శివాని నగరం ఎక్కడ ఉంటుంది? జూబ్లీ హిల్స్, హైదరాబాద్ శివాని నగరం ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/shivani_nagaram/?hl=en&amp;img_index=1 https://www.youtube.com/watch?v=EAsvlMaZF3M
    ఏప్రిల్ 05 , 2024
    తెలుగు హీరోల్లో అత్యధిక  రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!
    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం. ప్రభాస్‌: హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్... సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.&nbsp; మహేశ్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.&nbsp; పవన్‌ కళ్యాణ్‌: టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు. పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.&nbsp; రామ్‌ చరణ్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు.&nbsp; జూ. ఎన్టీఆర్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.&nbsp; RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో&nbsp; రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్.&nbsp; https://telugu.yousay.tv/these-are-the-top-10-telugu-heroes-with-the-most-followers-on-instagram.html అల్లు అర్జున్‌: పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp; చిరంజీవి అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్. బాలకృష్ణ: నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది.&nbsp; విజయ్‌ దేవరకొండ: అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.&nbsp;
    ఏప్రిల్ 01 , 2023
    <strong>Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?</strong>
    Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ట్రైలర్‌ (Pushpa 2 Trailer) రిలీజ్‌ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ తీసుకొచ్చారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్‌పై ఓ స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు.&nbsp; పాట్నాలో గ్రాండ్ రిలీజ్ దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్‌ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్‌ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్‌ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేసింది. ఇందులో గన్‌ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855922382181134676 బిహార్‌లోనే ఎందుకంటే? తెలుగు స్టేట్స్‌తో పాటు నార్త్‌లో ఇన్ని రాష్టాలు ఉండాలుగా ‘పుష్ప 2’ టీమ్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు బిహార్‌నే ఎంచుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్‌ స్టేట్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్పగాడి మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్‌ చేసుకున్నారు. అప్పట్లో బన్నీని ఇమిటేట్‌ చేస్తూ పెద్ద ఎత్తున రీల్స్ సైతం చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్‌ రీల్స్‌ చేసింది. బిహార్‌ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి ఆదరణ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్‌ సందర్భంగా 'పుష్ప'లోని శ్రీవల్లి సాంగ్‌ ప్రముఖంగా వినిపించింది. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి 'తూ హై గజాబ్‌ యూపీ.. తేరి కసం యూపీ' అంటూ లిరిక్స్‌ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్‌, యూపీలో పుష్పగాడి క్రేజ్‌కు నిదర్శనమైన ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్‌ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్‌ చేయడం ద్వారా మంచి మైలేజ్‌ సాధించవచ్చని అంచనా వేస్తోంది. ‘కిస్సిక్‌’ శ్రీలీల అదుర్స్‌ స్టార్ హీరోయిన్ శ్రీలీల 'పుష్ప 2'లో ఐటెం సాంగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌లో బన్నీతో ఆమె ఉన్న పిక్‌ నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే శ్రీలీల తమ ప్రాజెక్టులో భాగమైనట్లు 'పుష్ప 2' టీమ్ ఆదివారం (నవంబర్‌ 11) అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ‘ది డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీల’అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1855559794985426988 డ్యాన్స్‌ అదిరిపోవాల్సిందే! ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ (Pushpa 2 Trailer) అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్‌ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్‌ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.&nbsp; ప్రమోషన్స్‌కు టీమిండియా! ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్‌ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ (Pushpa 2 Trailer)ను ప్లాన్‌ చేస్తున్నారట. అక్కడ జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌, అర్షదీప్‌ సింగ్‌ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.&nbsp;
    నవంబర్ 11 , 2024
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    <strong>Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?</strong>
    Kannappa: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
    టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్లు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్‌&nbsp; సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కన్నప్ప దూకుడు..! మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్‌ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్‌.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు.&nbsp; రిలీజ్ ఎప్పుడంటే ప్రస్తుతం కన్నప్ప షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), మోహన్‌లాల్‌ (Mohan Lal), శివరాజ్‌ కుమార్‌ (Siva Raj Kumar), మోహన్‌ బాబు (Mohan Babu), శరత్‌ కుమార్‌ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్‌ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE మిస్టర్ బచ్చన్‌ ‘షో రీల్‌’.. అదరహో! రవితేజ (Ravi Teja) హీరోగా మాస్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్‌ చిత్రం.. ‘మిస్టర్‌ బచ్చన్‌’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్‌.. 'షో రీల్స్‌'ను సోమవారం (జూన్‌ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్‌ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak దేవిశ్రీ ప్రసాద్‌ ప్రశంసలు మిస్టర్‌ బచ్చన్‌ నుంచి విడుదలైన మాస్‌ గ్లింప్స్‌.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌.. మిస్టర్‌ బచ్చన్‌ గ్లింప్స్‌పై ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్‌ హరీష్‌ శంకర్‌ సార్‌.. పంచ్‌ డైలాగ్‌ లేకుండానే పంచ్‌ క్రియేట్‌ చేశారు. మాస్‌ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్‌ బాస్టర్‌ లోడ్‌ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్‌ బచ్చన్‌ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్‌ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్‌ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
    జూన్ 18 , 2024
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి&nbsp; ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి&nbsp; తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్? &nbsp;బ్లాక్ నవీన్ పొలిశెట్టి&nbsp; తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు? &nbsp;ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.&nbsp; నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
    మార్చి 21 , 2024
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    Kannappa: 15 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జత కట్టబోతున్న బాలీవుడ్‌ బ్యూటీ..!
    నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్రలో చేయనుండగా.. శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇదిలాంటే తాజాగా ‘కన్నప్ప’ సినిమాపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు సంబంధించిన విషయం కావడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి!&nbsp; ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ శివుడుగా నటించడం ఇప్పటికే ఖరారైంది. పార్వతి దేవి పాత్రలో తమిళ లేడి సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara) చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఆ పాత్రను బాలీవుడ్‌ నటి పోషించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) ప్రభాస్‌ పక్కన నటిస్తుందని అంటున్నారు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అలాగే మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకి రానున్నట్లు తెలుస్తోంది. https://twitter.com/GetsCinema/status/1759893440500846829 15 ఏళ్ల తర్వాత.. ప్రభాస్‌-కంగనా కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో వచ్చిన ‘ఏక్‌నిరంజన్‌’ (2009) చిత్రంలోనూ వీరిద్దరూ జోడీగా కనిపించారు. తెలుగులో కంగనాకు అదే తొలి చిత్రం. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలమైంది. ఈ సినిమాలో ప్రభాస్‌-కంగనా జోడీకి మంచి మార్కులే పడ్డాయి. వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని భావించినప్పటికీ వీలు పడలేదు. ప్రస్తుత ప్రచారం నిజమైతే 15 ఏళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ వెండితెరపై మెరవనుంది.&nbsp; కన్నప్పపై విష్ణు ఫోకస్‌ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరిగింది. టీమ్‌లో అందరికీ గాయాలు అవుతున్నా కూడా షూటింగ్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. విష్ణుకి కూడా షూటింగ్‌ టైమ్‌లో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కన్నప్ప టీమ్ న్యూజిలాండ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని కొద్ది రోజుల క్రితం ఇండియాకు తిరిగొచ్చింది.&nbsp; https://twitter.com/i/status/1730567740325535838 ఆకట్టుకున్న ఫస్ట్‌లుక్‌ గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు.. 'కన్నప్ప' ప్రపంచంలోకి&nbsp; అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆ సందర్భంలో విష్ణు తెలిపారు.&nbsp; ‘కన్నప్ప’ వచ్చేది అప్పుడేనా! కన్నప్ప సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇటీవల ఓ వార్త బయటకొచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ఫినిష్‌ చేసిన మూవీ బృందం.. తదుపరి షూట్‌ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తోందట. ఈ దసరాకు ‘కన్నప్ప’ను రిలీజ్ చేయాలని మంచు విష్ణు టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. దసరాకు రిలీజ్‌ చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని టీమ్‌ భావిస్తోందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ‘కన్నప్ప’ కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్‌ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్‌.&nbsp;
    ఫిబ్రవరి 21 , 2024
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక &amp; హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌ రేటింగ్‌ : 3/5
    జనవరి 12 , 2024
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?&nbsp;
    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; 1. చిరు గ్యారేజీలోని లగ్జరీ కార్లు విదేశీ లేదా లగ్జరీ కార్లు అంటే మెగాస్టార్‌ చిరంజీవికి అమితమైన ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ కార్లు ఉన్నాయి. బ్రిటన్‌, జర్మన్‌ బ్రాండ్‌ కార్లను ఆయన కలిగి ఉన్నారు. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. రోల్స్ రాయిస్ ఫాంటమ్&nbsp; ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి చెందిన 'రోల్స్ రాయిస్ ఫాంటమ్' (Rolls Royce Phantom) కారు చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్&nbsp; చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్&nbsp; ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. 2. విలాసవంతమైన ఇల్లు హైదరాబాద్ నగరంలో చిరంజీవికి అత్యంత విశాలమైన &amp; విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది రూ.30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్‌డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్‌పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. 3. ప్రైవేటు జెట్‌ చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. దీని ద్వారానే చిరు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. ఈ జెట్‌ విలువ సుమారు రూ.30 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 4. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ చిరంజీవి రియల్‌ ఎస్టేట్‌ రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయనకు హైదరాబాద్‌లో విలాసవంతమైన లగ్జరీ విల్లా కూడా ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో మెగాస్టార్‌కు 20 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో GHMC నిర్వహించిన వేలంలో ఎకరం రూ.100 పలకడం గమనార్హం. వీటితో పాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో చిరంజీవికి ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. ఫిల్మ్‌నగర్‌లో 1990వ దశకంలో కొన్న ఓ ల్యాండ్‌ను ఇటీవల చిరు రూ.70 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.&nbsp; 5. అంజనా ప్రొడక్షన్స్‌ 1988లో సోదరుడు నాగబాబుతో కలిసి ‘అంజనా ప్రొడక్షన్స్‌’ను మెగాస్టార్‌ చిరంజీవి ప్రారంభించారు. చిరు తల్లి అంజనా దేవి పేరు మీదుగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించారు. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఇది కొనసాగుతోంది. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెునగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్‌, రాధా గోపాలం, స్టాలిన్, ఆరంజ్‌ వంటి చిత్రాలు ఈ ప్రొడక్షన్‌ నుంచే వచ్చాయి.&nbsp; 6. కేరళ బ్లాస్టర్స్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లోని కేరళ బ్లాస్టర్స్‌ (Kerala Blasters) జట్టుకు చిరు సహా నిర్మాత. ఈ జట్టు యాజమాన్యంలో చిరుతో పాటు నాగార్జున, సచిన్‌ టెండూల్కర్‌ భాగస్వాములుగా ఉన్నారు. అలాగే అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం ఈ ఫుట్‌బాల్‌ టీమ్‌పై పెట్టుబడి పెట్టినట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.&nbsp; 7. చిరంజీవి బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్‌ 1998లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ను మెగాస్టార్‌ స్థాపించారు. దాని ద్వారా బ్లడ్‌ &amp; ఐ బ్యాంక్స్‌ను (blood and eye banks) నెలకొల్పారు. వాటి సాయంతో చిరు ఎంతో మంది పేదల ప్రాణాలను కాపాడటంతో పాటు.. పలువురికి కంటి చూపును ప్రసాదించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా ఇప్పివరకూ సుమారు 9.30 లక్షల యూనిట్ల బ్లడ్‌ను సేకరించారు. దానిలో 70 శాతం ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా పేదలకు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.&nbsp; 8. చిరంజీవి నెట్‌వర్త్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో చిరు ఒకరిగా ఉన్నారు. ఇటీవల వచ్చిన భోళాశంకర్‌ చిత్రానికి చిరు రూ.60 కోట్లు డిమాండ్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి. అటు మెగాస్టార్‌కు ఉన్న స్థలాలు, ఇళ్లు, ఆర్థిక లావాదేవీలు అన్ని కలుపుకుంటే ఆయన ఆస్తుల విలువ రూ.1650 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. &nbsp;
    ఆగస్టు 22 , 2023
    Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న&nbsp; మీనాక్షి చౌదరి
    Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న&nbsp; మీనాక్షి చౌదరి
    కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది మీనాక్షి చౌదరి. తన నటన, అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; హర్యానా అందాల తెగింపు మీనాక్షి చౌదరి మరోసారి అందాల విందు చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెట్టి కవ్విస్తోంది. 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రంలో ఈ భామ నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి నాజుకైన నడుమందాలతో సోగసుల పసందు చేస్తోంది. నాభి అందాలను ఏకరువు పెడుతూ గిలిగింతలు పెడుతోంది.&nbsp; అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్-2’లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రవితేజ పక్కన ‘ఖిలాడి’ మూవీలో నటించి అందాల జాతర చేసింది. ఈ సినిమా పెద్దగా హిట్‌ కాకపోవడంతో ఈ సుందరాంగి కెరీర్ సైడ్‌ ట్రాక్‌లోకి వెళ్లింది. గుంటూరు కారంతో పాటు, ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న డీజే టిల్లు సిక్వేల్‌లో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక మీనాక్షి చౌదరి వ్యక్తిగత&nbsp; విషయానికి వస్తే.. సినిమాల్లోకి రాకముందు ఈ చక్కనమ్మ.. తొలుత కొన్ని సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల్లో నటించింది.&nbsp; 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ సుందరాంగి.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో పెద్ద ఎత్తున ఫాలోవర్లను సంపాదించుకుంది. తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది. నాజుకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తోంది.
    జూలై 05 , 2023
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? వినాయక చవితికి బిగ్‌ సర్‌ప్రైజ్‌!&nbsp;&nbsp;</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? వినాయక చవితికి బిగ్‌ సర్‌ప్రైజ్‌!&nbsp;&nbsp;
    'ఆర్ఆర్‌ఆర్‌' (RRR) తర్వాత రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. వినాయక చవితి రోజున చరణ్‌ సినిమాకు సంబంధించి బిగ్‌ సర్‌ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రిలీజ్‌ డేట్‌ లాక్‌? ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒక స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసే అవకాశముందని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందంటూ స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; టీజర్‌కు రంగం సిద్ధం గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో కంటెంట్‌ రిలీజ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ టీజర్‌ రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్‌ చేసి మెగా ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఒకే నెలలో రెండు అప్‌డేట్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ చివరి వారంలో ఈ టీజర్‌ విడుదల కావొచ్చని ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.&nbsp; క్రిస్మస్‌కే ఎందుకు! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నాసామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ &amp; కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.&nbsp; డైరెక్టర్‌ శంకర్‌ భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.&nbsp;
    సెప్టెంబర్ 04 , 2024
    <strong>Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!</strong>
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer). తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్‌ ఛేంజర్’ విడుదల తేదీపై హింట్‌ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రిలీజ్‌ డేట్ లాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; రిలీజ్‌ ఆ రోజేనా? పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Producer Dil Raju) నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాయన్‌’ (Raayan) ప్రీ రిలీజ్ ఈవెండ్‌ పాల్గొన్న ఆయన ‘గేమ్ ఛేంజర్‌’ రిలీజ్‌పై స్పందించారు. క్రిస్మస్‌ కు కలుద్దామంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి 'గేమ్‌ ఛేంజర్‌'ను డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 50వ చిత్రం. దీంతో దిల్‌రాజు ఎంతో ప్రతిష్టాత్మకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ జరుగుతున్నట్లు సమాచారం.&nbsp; https://twitter.com/i/status/1815052022200013098 ప్రభాస్‌ బాటలో రామ్‌చరణ్‌! పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను మెగా హీరో రామ్‌చరణ్ అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన ‘సలార్‌’ (Salaar: Part 1 – Ceasefire) చిత్రం గతేడాది క్రిస్మస్‌ కానుకగానే విడుదలై బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుంది. 2023 డిసెంబర్‌ 22న వచ్చిన సలార్‌ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.700 కోట్లు కొల్లగొట్టింది. అయితే సలార్‌ క్రిస్మస్‌కే రిలీజ్‌ కావడానికి ఓ కారణం ఉంది. 2024 సంక్రాతి బరిలో మహేష్‌ బాబు (గుంటూరు కారం), నాగార్జున (నా సామి రంగ), వెంకటేష్‌ (సైంధవ్‌), తేజ సజ్జా (హనుమాన్‌) వంటి స్టార్‌ హీరోలు నిలిచారు. వారితో పోటి పడి కలెక్షన్స్ పంచుకోవడం కన్నా సోలోగా వచ్చి మంచి వసూళ్లు సాధించాలని ప్రభాస్‌తో పాటు సలార్‌ యూనిట్‌ నిర్ణయించారు. ప్రస్తుతం అదే విధంగా రామ్‌చరణ్‌ &amp; కో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ లాకై ఉంది. అలాగే వెంకటేష్‌- అనిల్‌ రావిపూడి చిత్రంతో పాటు అజిత్‌ నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేస్తే ప్రభాస్‌ తరహాలోనే బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపించవచ్చని రామ్‌చరణ్‌ భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.&nbsp; గేమ్‌ ఛేంజర్‌పై భారీ ఆశలు! డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్‌ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ఐ, స్నేహితుడు వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్‌ తిరిగి సక్సెస్‌ బాటలో పడేందుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ పూడుస్తుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్‌ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.&nbsp; కథ ఇదేనా? ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ’గేమ్‌ ఛేంజర్‌’ స్టోరీలైన్‌ను గతంలోనే రివీల్‌ చేసింది. తమ ఓటీటీలో రాబోయే సినిమాలని ప్రకటిస్తూ ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాట్‌ను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ‘పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయతీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడాడు’ అన్నది ఈ మూవీ కథగా అమెజాన్‌ పేర్కొంది. కాగా ఇందులో చరణ్‌ తండ్రి కొడులుగా డ్యూయల్‌ రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర, జయరామ్, సముద్రఖని, అంజలి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)
    జూలై 22 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.&nbsp; ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో&nbsp; ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు&nbsp; ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్&nbsp; ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి&nbsp; శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్&nbsp; నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక&nbsp; కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి&nbsp; మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ&nbsp; ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్&nbsp; పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ&nbsp; సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:&nbsp; హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.&nbsp; సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి&nbsp; జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా&nbsp; బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం&nbsp; దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-&nbsp; యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.&nbsp; ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-&nbsp; జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు&nbsp; రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.&nbsp; ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.&nbsp; మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో&nbsp; ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి&nbsp; దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,&nbsp; కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి&nbsp; రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.&nbsp; ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ &nbsp;ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని&nbsp; ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్&nbsp; ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా&nbsp; దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.&nbsp; మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.&nbsp; ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    New Hair Styles : దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిన టాలీవుడ్ హీరోల ఈ హేయిర్ స్టైల్స్ గురించి తెలుసా?
    అబ్బాయిలు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఎక్కువగా హేయిర్ స్టైల్స్‌ మీద దృష్టి పెడుతుంటారు. అభిమాన హీరో ఎలాంటి హెయిర్ స్టైల్‌లో ఉంటే అలాంటి హెయిర్ కట్‌ను ఫాలో(New Hair Styles) అవుతుంటారు. ఇక సినిమాల్లోనూ అంతే.. ఎప్పుడు కొత్త లుక్‌లతో అభిమానులను హీరోలు మెస్మరైజ్ చేస్తుంటారు. హీరోలను హెయిర్ స్టైల్స్ సరికొత్తగా ఆవిష్కరిస్తుంటాయి.ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోల ఏ ఏ హేయిర్ స్టైల్స్‌ ట్రెండ్ అయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం. [toc] జూనియర్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్స్‌ జూనియర్ ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో లుక్స్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో ట్రాన్స్‌పామ్ అయ్యాడు. కెరీర్‌ తొలినాళ్లలో కర్లీ హెయిర్‌తో కనిపించిన తారక్ తర్వాత సినిమా, సినిమాకు హెయిర్‌ స్టైల్స్, లుక్స్ మారుస్తూ ట్రెండ్ సెట్ చేశాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాద్‌షా బాద్‌షా సినిమాలోనూ తారక్ లుక్ ట్రెండ్‌ సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో జూ. ఎన్టీఆర్ 'డౌన్‌వార్డ్ ఫ్లిక్స్‌' హేయిర్‌ స్టైల్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ యూత్‌ మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. జనతా గ్యారేజ్ ఈ సినిమాలో తారక్... 'సెమీ క్రూ'(semi Crew cut) హేయిర్‌ కట్‌తో స్టైలీష్‌గా కనిపించాడు.&nbsp; టెంపర్ ఫస్ట్‌టైం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్... సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ట్సాన్స్‌పార్మ్ అయ్యాడు. ఈ సినిమాలో తారక్ స్టైలీష్‌గా కనిపించాడు. స్పైక్‌డ్ హేయిర్‌(Spiked hairStyle)&nbsp; స్టైల్‌తో కనిపించాడు. యమదొంగ యమదొంగ చిత్రంలో తారక్ లాంగ్ స్ట్రెయిట్ హెయిర్‌తో(Long Strait Hair) స్టైల్‌గా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత ఆ హేయిర్‌ స్టైల్‌ను అనుకరించేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. నాన్నకు ప్రేమతో ఇక ఈ సినిమాలో స్టైలీష్ లుక్‌లో తారక్ అలరించాడు. ఈ హెయిర్ స్టైల్‌ను ఎంతో మంది అభిమానులు ఫాలో అయ్యారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ పేరు పోంపాడర్ విత్ సైడ్ ఫేడ్(pompadour with side Fade). ఈ హేయిర్ స్టైల్ తారక్‌ను మరింత అందంగా కనిపించేలా చేసింది. జై లవకుశ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ హేయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు. జై పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. క్లాసిక్ సైడ్ పార్టింగ్ (classic Side Parting), లవ్‌కుమార్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్ట్రేయిట్ లాంగ్ హేయిర్ స్టైల్‌లో అందంగా కనిపించాడు. దేవర పాతాళ భైరవిలో రామారావు లుక్‌కు.. ‘దేవర’ (Devara)లోని తారక్‌ గెటప్‌ను నందమూరి ఫ్యాన్స్ మ్యాచ్‌ చేసుకుంటున్నారు. పరిశీలనగా చూస్తే అందరికీ ఇదే భావన కలుగుతుందని చెబుతున్నారు. తారక్‌ ‘దేవర’ సినిమాలో డ్యూయల్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఒక పాత్ర రింగుల జుట్టుతో కూడిన లాంగ్‌ హెయిర్‌తో ఉంటుంది. ఈ గెటప్‌లో తారక్‌ అచ్చం నందమూరి తారకరామారావు లాగా కనిపిస్తున్నాడని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. మహేష్ బాబు హేయిర్ స్టైల్స్‌ బాబి తన కెరీర్ ప్రారంభంలో మహేష్‌ మిల్కీ బాయ్‌గా కనిపించేవాడు. దాదాపు పోకిరి సినిమా వరకు ఒకే ఒకే హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో చైల్డీష్ లుక్ హేయిర్ స్టైల్ లుక్‌తో కనిపించాడు. పోకిరి పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న తన లుక్స్, స్టైల్‌, స్వాగ్‌ను మహేష్ పూర్తిగా మార్చేశాడు. ముఖ్యంగా అతని హేయిర్ స్టైల్‌ ఎంతో ఫేమస్ అయింది. ఈ హేయిర్ స్టైల్‌ను... అంటారు. ఈ చిత్రం తర్వాత మహేష్ అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. సైనికుడు ఈ చిత్రంలో మహేష్ బాబు స్టూడెంట్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫంక్ హేయిర్ స్టైల్‌తో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. అతిథి అతిథి సినిమాలో మహేష్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్రౌన్ కలర్ జుట్టుతో పొడవాటి లాంగ్ హెయిర్‌తో రగ్గ్‌డ్ లుక్‌లో అలరించాడు వన్ నేనొక్కడినే ఈ సినిమాలో మహేష్ బాబు ట్రెండీ లుక్‌లో అలరించాడు. అతని స్పైక్‌డ్ హెయిర్‌ స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ.. మహేష్ బాబు నటనకు(Mahesh Babu Hair Styles) విమర్శకుల ప్రశంసలు దక్కాయి. SSMB29 ‘SSMB 29 నేపథ్యంలో మహేష్‌ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు.&nbsp; సిద్దు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ డీజే టిల్లు&amp; టిల్లు స్కేర్ డీజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ అయింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది కూడా.&nbsp; ఈ హెయిర్‌ స్టైల్‌ను తెలుగులో సరదాగా ‘పిచుక గూడు’ స్టైల్‌ అని పిలుస్తారు.&nbsp; టిల్లు స్క్వేర్‌లోనూ ఇదే హెయిర్‌ స్టైల్‌లో సిద్ధూ కనిపించాడు.&nbsp; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హేయిర్ స్టైల్స్ భద్రినాథ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ యుద్ధ వీరుడిగా కనిపించాడు. బన్నీ హెయిర్‌ స్టైల్ చాలా క్రేజీగా ఉంటుంది.&nbsp; మ్యాన్ బన్స్(Man Buns) మరియు పోనిటేయిల్స్(ponytails) హేయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. అల వైకుంఠపురములో ఈ చిత్రంలో అల్లు అర్జున్ లాంగ్ వేవ్స్(Long waves)హేయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. టాప్‌లో పప్‌ బాటమ్‌లో వేవీ హెయిర్‌ లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ను అనేక మంది అతని (Allu Arjun Hair styles)అభిమానులు ట్రై చేశారు. హ్యాపీ హ్యాపీ చిత్రంలో బన్నీ స్పైక్స్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. ఈ హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. దువ్వాడ జగన్నాథం ఈ సినిమాలో "ఫోర్ హెడ్ సెమీ ఫ్రింజ్" హేయిర్ స్టైల్‌తో ఇంప్రెస్ చేశాడు ఇది కూడా ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. ఇదే చిత్రంలో బన్నీ మరో స్టైలీష్ హేయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు ఫ్రింజ్ బ్యాంగ్ (fringe Bangs) సరైనోడు ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్లాసిక్ హేయిర్ స్టైల్‌లో కనిపిస్తాడు. ఈ హెయిర్ స్టైల్‌ పేరు పొంపాడర్ హేయిర్ లుక్&nbsp; (Pompadour) బన్నీ ఇతర హేయిర్ స్టైల్స్ అల్లు అర్జున్ ఎక్కువగా బయట థిక్ బియర్డ్‌తో లాంగ్ వేవీ వెట్ హేయిర్(long wavy wet-hair)లుక్ కనిపిస్తుంటాడు. ఈ హెయిర్‌ స్టైల్ బన్నీ ఫెవరెట్‌ అని తెలిసింది. రామ్ చరణ్ హేయిర్ స్టైల్స్ గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ పోని టేయిల్(Pony Tail) హేయిర్ కట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తాడు. ఈ హెయిర్‌ స్టైల్‌ను బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్, రణ్‌వీర్ సింగ్ కూడా ఫాలో అయ్యారు. ఈ హేయిర్‌ కట్‌ను చెర్రీ అభిమానులు క్రేజీగా ఫాలోయ్యారు. గేమ్ ఛేంజర్ లెటేస్ట్ గేమ్‌ ఛేంజర్ సినిమాలో రామ్‌ చరణ్ గెల్డ్‌ హేయిర్ స్టైల్‌తో ఫర్‌ఫెక్ట్ లుక్‌లో కనిపించాడు. ఈ చిత్రంలో రామ్‌ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. రామ్‌ చరణ్ ఇతర హేయిర్ స్టైల్స్ రామ్ చరణ్ పలు సందర్భాల్లో గుడ్ బాయ్&nbsp;లుక్‌లో కనిపంచేవాడు. ఈ హేయిర్ కట్‌ పైరు "సైడ్ పార్టింగ్". షూటింగ్ లేని సమయాల్లో రామ్‌ చరణ్ ఎక్కువగా ఈ హేయిర్ స్టైల్‌లో ఉంటాడు. మరికొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఇవెంట్లు, మీడియా సమావేశాల్లో చరణ్ ఈ హేయిర్‌ కట్‌లో కనిపిస్తుంటాడు. ఈ హేయిర్ స్టైల్ పేరు 'మెస్సీ హెయిర్ లుక్'(messy Hair lock).ఈ టైప్ హేయిర్ స్టైల్ కూడా బాగా ట్రెండ్ అయింది. చెర్రీ అభిమానులు చాలావరకు ఈ టైప్ హేయిర్‌ స్టైల్‌ను ఫాలో అయ్యారు. కొన్నిసార్లు లైట్ బియర్డ్, షార్ట్ సైడ్స్ హెవీ "పొంపాడర్ హెయిర్‌"(pompadour) లుక్‌లో కనిపించాడు. ఈ హేయిర్ స్టైల్‌ కూడా చెర్రీకి బాగా కుదిరింది. అయితే ఇలాంటి(Ram charan Hair styles) హేయిర్‌ స్టైల్‌తో రామ్‌చరణ్ ఏ సినిమాలోనూ నటించలేదు. విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్స్ లైగర్ &nbsp;ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హేయిర్ స్టైల్‌పై క్రేజీ టాక్ నడిచింది. "లాంగ్ వేవీ"(Long Wavy) హేయిర్ కట్‌లో మేరిసాడు. ఈ హేయిర్ స్టైల్‌ను చాలా మంది అతని అభిమానులు ఫాలో అయ్యారు. ఇదే చిత్రంలో దేవరకొండ 'మ్యాన్ బన్' హేయిర్ కట్‌లోనూ కనిపిస్తాడు. గతంలో అనేమంది సెలబ్రెటీలు ఈ స్టైల్‌ను ఫాలో అయినప్పటికీ... విజయ్‌కు సెట్ అయినట్లుగా మరెవరికీ సెట్ అవ్వలేదు. డియర్ కామ్రెడ్ డియర్ కామ్రెడ్ చిత్రంలో విజయ్ కర్లీ &amp; మెస్సీ హేయిర్ స్టైల్‌ లుక్‌లో కనిపించి అదరగొట్టాడు. ఈ హేయిర్ స్టైల్ సైతం విజయ్‌కి బాగా కుదిరింది. (Vijay Deverakonda Hair styles)ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఖుషి ఈ చిత్రంలోనూ విజయ్ దేవరకొండ మ్యాన్లీ లుక్‌లో కనిపిస్తాడు. సమంత, విజయ్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాలో లైట్‌గా గడ్డం, ఒత్తైన మీసాలతో డీసెంట్ లుక్ హేయిర్ స్టైల్‌ను విజయ్ దేవరకొండ కలిగి ఉన్నాడు. ఈ లుక్ చాలా మంది ఫ్యాన్స్‌ అట్రాక్ట్ చేసింది. ఈ హేయిర్ కట్‌ను చాలా మంది ఫాలో అయ్యారు. రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్స్ స్కంద &nbsp;ఈ సినిమా చేయడానికి ముందు.. రామ్‌ పొత్తినేని(RAPO) 'స్పైకీ' హేయిర్‌ స్టైల్‌లో రామ్ పొత్తినేని అలరించాడు. ఈ చిత్రంలో రామ్ హేయిర్‌ స్టైల్‌ క్రేజీ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ హేయిర్ స్టైల్‌ను అనేకమంది అభిమానులు ఫాలో అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని లుక్స్, హేయిర్ స్టైల్, స్వాగ్‌ ట్రెండ్ సెట్‌ చేశాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా హేయిర్ స్టైల్ యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా మంది అభిమానులు ఆ హేయిర్ స్టైల్‌ను ఫాలో అయిపోయారు. ఈ చిత్రంలో రామ్ పొత్తినేని హేయిర్ స్టైల్ పేరు "హై వాల్యూమ్ క్విఫ్ విత్ ఫేడ్" ( high-volume quiff with a fade) ఈ హేయిర్ కట్‌కు గడ్డం గంభీరంగా ఉంటేనే సెట్ అవుతుంది.&nbsp;
    మే 22 , 2024

    @2021 KTree