రివ్యూస్
How was the movie?
తారాగణం
నవీన్ చంద్రన్
మాధవ్అవికా గోర్
సుభద్రసాయి రోనక్
సవ్యసాచిసంజన సారథి
రాధదేవీ ప్రసాద్
శ్రీ లక్ష్మి
సిబ్బంది
కార్తీక్ తుపురాణిదర్శకుడు
జేజేఆర్ రవిచంద్నిర్మాత
శేఖర్ చంద్ర
సంగీతకారుడుఅజీమ్ మహ్మద్సినిమాటోగ్రాఫర్
విప్లవ నైషదంఎడిటర్ర్
కథనాలు
BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
అలా తెరమీదకి..
ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.
https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20
స్టోరీ ఇదే..
పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.
తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.
https://youtu.be/stcCZWCBegk
త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా?
మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది. వాస్తవాలకు, భ్రమలకు మధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.
https://www.youtube.com/watch?v=yNnJ9de339k
12 భాషల్లో చిత్రీకరణ
డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.
https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
జూలై 26 , 2023
Divyansha Kaushik: లిప్‌లాక్ లేకుండా సినిమా చేయదట.. మరీ ఇంత రొమాన్స్ ఏంటి బ్రో..!
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anupama ParameswaranDownload Our App
జూన్ 09 , 2023
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్ ఓపెనింగ్స్.. హిట్ కొట్టిన ‘ఓం భీమ్ బుష్’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
యంగ్ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్ ఎంటర్‌టైనర్ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు!
శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్ డే 1 కలెక్షన్స్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సాక్నిక్ లెక్కల ప్రకారం
ప్రముఖ ఫిల్మ్ వెబ్‌సైట్ సాక్నిక్ (Sacnilk) సైతం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్ బుష్’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్ షో 23.37%, సెకండ్ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
యంగ్ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్ బుష్ థ్రియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్ బుష్’ హిట్ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి.
మార్చి 23 , 2024
Pushpa 2 Review: అల్లు అర్జున్ మాస్ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్ కొట్టినట్లేనా?
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల: 05-12-2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించి మరింత హైప్ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో గ్లామర్ డోస్ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్ సుకుమార్ పుష్ప రాజ్ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్, మైండ్ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్ ఇంట్రో, పుష్ప - షెకావత్ టామ్ అండ్ జెర్రీ ఫైట్, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్ వేశారు సుకుమార్.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ నటనయాక్షన్ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం
మైనస్ పాయింట్స్
తేలిపోయిన విలనిజంసెకండాఫ్
Telugu.yousay.tv Rating : 3.5/5
డిసెంబర్ 05 , 2024
Pawan Kalyan: 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్?
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్‌లో నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ బ్యానర్‌పై రాబోయే చిత్రాల గురించి మాట్లాడారు.
నాగవంశీ చెప్పిన వివరాల ప్రకారం, 2018లో ఒక డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు తమకు మంచి విజయాలను అందించాయి. ఈ సక్సెస్ తరువాత త్రివిక్రమ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నాగవంశీ వెల్లడించారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని, ఈ చిత్రం 2029 ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో నేరుగా త్రివిక్రమ్ చేసిన లాస్ట్ చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన బీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు త్రివిక్రమ్ మార్గదర్శనంలో సాగాయి. దీంతో వీరి కలయికలో సాలిడ్ హిట్ కోసం ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు.
కథా నేపథ్యం
నాగవంశీ స్పీచ్ తర్వాత.. త్రివిక్రమ్ తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏవిధంగా చూపించబోతున్నాడు. ఆయన ఎలాంటి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు అనే ఆసక్తి పెరిగింది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్థానం, జనసేన పార్టీ ఆవిర్భవానికి గల కారణాలు వంటివి సినిమాలో ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఎపిసోడ్, జగన్ ప్రభుత్వ పాలన లోపాలు వంటివి చూపించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పెట్టుకున్న పొత్తు, చంద్రబాబు జైలు ఎపిసోడ్, వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సినిమాలో ప్రధాన భాగం కావొచ్చు.
ఇప్పటి వరకు ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ జనర్లకే పరిమితమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు.. పొలిటికల్ థ్రిల్లర్‌కు మారడం సర్వత్రా ఉత్కంట నెలకొంది. అయితే ఆయన తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నందున, ఈ కథకు ఆయన అనుకూలమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
షూటింగ్‌ల్లో పవన్ బిజీ బిజీ
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఓజీని వచ్చే ఏడాది అక్టోబర్ 25న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది.
నవంబర్ 02 , 2024
SDT 18: కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. గతేడాది వచ్చిన ‘విరూపాక్ష’తో సాలిడ్ హిట్ కొట్టిన తేజ్ ఆ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ చేరిపోయాడు. అదే ఏడాది పవన్ కల్యాణ్‌తో కలిసి ‘బ్రో’ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. బ్రో తర్వాత ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘SDT18’ ప్రాజెక్ట్ ప్రకటించి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు.
ధైర్యాన్నే కవచంగా..
సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. నేడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ‘SDT 18’ వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్ వీడియోతో పాటు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కండల తిరిగిన దేహంతో ఉన్న సాయి దుర్గా తేజ్ బ్యాక్ సైడ్ లుక్‌ను చూపించారు.
https://twitter.com/Primeshowtweets/status/1846065983091536150
రాయలసీమ నేపథ్యంలో..
‘SDT 18’ ప్రాజెక్ట్‌ను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో వస్తోన్న చిత్రం ఇదే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రోహిత్ కేపీ ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1947-67 బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించినట్లు తాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి తెలుస్తోంది. పురాతన కాలం నాటి పల్లెటూరు సెట్స్ మేకింగ్ వీడీయోలో హైలెట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లుక్‌ను ఒక షాట్‌లో చూపించారు. ఈ సినిమాలో తేజ్ ఎంతో శక్తివంతమైన, మాస్-డ్రైవెన్ పాత్రలో కనిపించనున్నాడు, అందుకోసం సరికొత్త మేకోవర్‌లోకి మారాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో విడుదల చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నారు.
https://twitter.com/IamSaiDharamTej/status/1846068731665174954
యాక్సిడెంట్‌తో కోమాలోకి..
మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తన ప్రతిభను నిరూపించుకొంటూ మెగా హీరోల్లో సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా మారారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలోనే సాయి దుర్గా తేజ్‌కు ఊహించని విధంగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటన మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులనూ ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టేసింది. ప్రమాదం అనంతరం కోమాలోకి వెళ్లిన తేజ్ జీవన్మరణ సమస్య నుంచి కోలుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకొన్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టుకొన్నారు. తన తల్లి పేరును తన పేరుకు జత చేసి సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మారాడు.
అక్టోబర్ 15 , 2024
Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?
నటీనటులు : నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే. సూర్య, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అభిరామి, అదితి బాలన్, మురళి శర్మ, అజయ్ తదితరులు
డైరెక్టర్ : వివేక్ ఆత్రేయ
సంగీతం : జేక్స్ బేజోయ్
ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు : డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
విడుదల తేదీ : 29-08-2024
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram Movie Review). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటివరకూ ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి ఊర మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన శైలికి భిన్నంగా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ఈ చిత్రంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నాని నటన మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్ దయా (ఎస్.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? హీరో-విలన్ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. (Saripodhaa Sanivaram Movie Review)
ఎవరెలా చేశారంటే
సూర్య పాత్రలో హీరో నాని ఇరగదీశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో నాని నటన ఉంటుంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ నాని తనదైన మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక నానికి ప్రత్యర్థిగా ఎస్.జే. సూర్య అదరగొట్టాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో నాని సైతం తన నటనతో ఎస్.జే సూర్య డామినేట్ చేశారు. వీరిద్దరి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక లేడీ కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ సెటిల్డ్‌గా నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ఆమె ఆకట్టుకుంది. నాని-ప్రియాంక మధ్య వచ్చే డిఫరెంట్ లవ్ ట్రాక్ ఆడియన్స్‌కు నచ్చుతుంది. సాయికుమార్, అజయ్, మురళీ శర్మలతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. రొటిన్ స్టోరీనే తీసుకున్నప్పటికీ తనదైన మేకింగ్‌తో వివేక్ మెస్మరైజ్ చేశాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకు పాత్రల పరిచయానికే దర్శకుడు తీసుకున్నాడు. హీరో నాని బాల్యం, శనివారం కాన్సెప్ట్, హీరోయిన్‌తో పరిచయం, అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో నాని, ఎస్.జే సూర్య మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశాడు. అయితే నిడివి ఎక్కువగా ఉండటం సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపించింది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీతగా అనిపిస్తాయి. నాని పాత్ర పరిచయానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌లుగా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్ బేజోయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. యాక్షన్ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నాని, ఎస్.జే. సూర్య నటనయాక్షన్ సీక్వెన్స్‌ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
సుదీర్ఘమైన నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
‘సరిపోదా శనివారం’పై పబ్లిక్ టాక్
సరిపోదా శనివారం చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్టులు పెట్టడం విశేషం. ముఖ్యంగా నాని, ఎస్.జే. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల ఆధారంగా పబ్లిక్ ఓపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరిపోదా శనివారం చిత్రం సంతృప్తికరమైన యాక్షన్ డ్రామా అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్, నాని - సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని పోస్టు పెట్టాడు.
https://twitter.com/venkyreviews/status/1828908558198644841
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీ లేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఎస్.జే. సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందేనని పేర్కొన్నాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని, పోతారు మెుత్తం పోతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్ కాస్త బోర్‌గా అనిపించినా మాస్ ఆడియన్స్‌ను పక్కాగా ఎంటర్‌టైన్ చేస్తుందని ప్రశంసించాడు.
https://twitter.com/_NaveenReddy_14/status/1828931798719414466
ఈ సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను BGM ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీజీఎం ర్యాంప్ అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
https://twitter.com/Abhi_pkcult/status/1828908519141323179
సరిపోదా శనివారానికి తనదైన శైలిలో రివ్యూ చెబుతూ ఓ నెటిజన్ 3/5 రేటింగ్ ఇచ్చాడు. పాత్రల పరిచయం, డిజైన్ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. తర్వాతి సీన్లను ముందుగానే ఊహించగలగడం, పెద్దగా మలుపులు లేకపోవడం కాస్త డ్రా బ్యాక్‌గా నిలిచిందని రాసుకొచ్చాడు.
https://twitter.com/chitrambhalareI/status/1828918494358110555
సోషల్ మీడియా అంతా 'సరిపోదా శనివారం' పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
https://twitter.com/Raktapatham/status/1828908737358438724
నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందని మరికొందరు అంటున్నారు. 30 నిమిషాల నిడివిని ట్రిమ్ చేయటం అవసరమని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. బోరింగ్ మసాలా సీన్స్, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి 2/5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.
https://twitter.com/Devara15629882/status/1828909154398023884
ఆగస్టు 29 , 2024
కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
కేతిక శర్మ తెలుగులో గ్లామర్ క్లీన్‌గా పేరొందింది. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్ లైఫ్ (2016)' వీడియోతో పాపులర్ అయ్యింది. మరి ఈ హాట్ డాల్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Ketika Sharma) ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
కేతిక శర్మ ఎప్పుడు పుట్టింది?
1995, డిసెంబర్ 24 న జన్మించింది
కేతిక శర్మ తొలి సినిమా?
రొమాంటిక్(2021)
కేతిక శర్మ ఎత్తు ఎంత?
5 అడుగుల 4అంగుళాలు
కేతిక శర్మ ఎక్కడ పుట్టింది?
ఢిల్లీ
కేతిక శర్మ ఏం చదివింది?
డిగ్రీ
కేతిక శర్మ అభిరుచులు?
జిమ్ చేయడం, ట్రావెలింగ్, మోడలింగ్
కేతిక శర్మకు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్
కేతిక శర్మకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, రెడ్, వైట్
కేతిక శర్మకు ఇష్టమైన ప్రదేశం
బ్యాంకాక్
కేతిక శర్మకి ఇష్టమైన హీరో?
సల్మాన్ ఖాన్
కేతిక శర్మకి ఇష్టమైన హీరోయిన్?
ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే
కేతిక శర్మ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది
కేతిక శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ketikasharma/?hl=en
కేతిక శర్మ సిగరెట్ తాగుతుందా?
స్మోకింగ్ అలవాటు ఉంది.
కేతిక శర్మ మద్యం తాగుతుందా?
అవును, తాగుతుంది.
https://www.youtube.com/watch?v=ILQ8wRqu5EI
ఏప్రిల్ 06 , 2024
అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం.
అవికా గోర్ పూర్తి పేరు?
అవికా సమీర్ గోర్
అవికా గోర్ ఎందుకు ఫేమస్
అవికా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది.
అవికా గోర్ వయస్సు ఎంత?
1997, జూన్ 30న జన్మించింది
అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా?
ఉయ్యాల జంపాల(2013)
అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా?
కేర్ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009)
అవికా గోర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు
అవికా గోర్ ఎక్కడ పుట్టింది?
ముంబై
అవికా గోర్ అభిరుచులు?
ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్
అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం?
పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్
అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా?
మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.
అవికా గోర్‌కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
అవికా గోర్‌కు ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, షాహిద్ కపూర్
అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అవికా గోర్ తల్లిదండ్రుల పేరు?
సమీర్ గోర్, చేతన గోర్
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది
అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/avikagor/?hl=en
అవికా గోర్ పెట్ పేరు?
షీరో
https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
ఏప్రిల్ 02 , 2024
Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్ సంచలన పోస్ట్!
కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.
ట్విటర్ వేదికగా ఆగ్రహం
తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్ యాక్షన్ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550
అసలేం జరిగింది?
గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్ పెట్టింది.
మార్చి 05 , 2024
Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది.
బికినీలో దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది.
రోజుకో అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది.
హిందీలో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిపోవాలని ఉబలాటపడిన అందాల తార ఊర్వశి రౌటేలా.. అక్కడ విఫలమవడంతో తెలుగులో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోతోంది.
బ్రో, వాల్తేరు వీరయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌ల్లో నర్తించి తెలుగు ఫ్యాన్స్‌కు దగ్గరైంది.
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ కుర్ర అందం.. 2015 మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ని గెలుచుకుంది. అదే ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో కూడ పాల్గొంది
సింగ్ సాబ్ ది గ్రేట్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే మూవీలో కూడ నటించింది
తమిళ్, కన్నడ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడ నటించింది
గ్లామరస్ ఫోజులతో కుర్రకారు మనసు దోచుకున్న ఊర్వశికి ఇన్‌స్టాగ్రామ్‌లో 69 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకి సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా దక్కింది.
ఇన్ని ఘనతలు ఉన్నా ఊర్వశికి రౌటేలాకు మాత్రం రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన సరైన హిట్ లేక నేల చూపులు చూస్తోంది.
సినిమాలు లేకపోతేనేం.. సోషల్ మీడియాలో తన అందాలను దోరగా వడ్డిస్తూ కుర్రకారును పెద్దసంఖ్యలో ఫాలోవర్లుగా మార్చుకుంటోంది.
డిసెంబర్ 01 , 2023
BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20
ఎలా ఉంది?
‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు.
https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20
ఎవరెలా చేశారు?
కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు.
టెక్నికల్‌గా
సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి.
https://youtu.be/jnzuXnj6HE0
ప్లస్ పాయింట్స్
పవన్, సాయితేజ్ మధ్య సీన్స్
పవన్ సాంగ్స్ మిక్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఓవర్ సీన్స్
పొలిటికల్ డైలాగ్స్
చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’
రేటింగ్: 3/ 5
https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
జూలై 28 , 2023
Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల సమయం కూడా లేదు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా రెండు పాటలు, ఓ సీన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో అనౌన్స్ చేసిన టైమ్‌కు పుష్ప 2 వస్తుందో లేదోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే పుష్ప మేకింగ్‌కు సంబంధించి ఊహించని ట్విస్టు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాథ్యతలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీని పెట్టుకొని థమన్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించడం చర్చలు తావిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సుకుమార్ అసంతృప్తి!
సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి ర్యాపో ఉంది. సుకుమార్ ఇప్పటివరకూ తెరకెక్కించిన అన్ని చిత్రాలకు దేవిశ్రీనే సంగీతం సమకూర్చారు. అంతేకాదు ఆయా చిత్రాల ఆల్బమ్స్ సూపర్ డూపర్‌గా నిలిచాయి. ఈ క్రమంలో ‘పుష్ప 2’ బాధ్యతలు సైతం దేవిశ్రీకి సుకుమార్ అందించారు. పుష్ప 2 పాటల విషయంలో సంతృప్తి చెందిన సుకుమార్ నేపథ్యం సంగీతం విషయంలో మాత్రం అసంతప్తిగా ఉన్నారట. సినిమా రిలీజ్‌కు 29 రోజుల సమయంలో మిగిలి ఉండటం, దేవిశ్రీకి ఇంకా చేతినిండా పని ఉండటంతో థమన్ చేత బీజీఎం ఇప్పించాలని సుకుమార్ నిర్ణయించారట. ఇందుకోసం థమన్‌తో చర్చలు సైతం జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్‌ను సుకుమార్‌కు వినిపించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
థమన్‌కే ఎందుకు!
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman)కు మంచి పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందిస్తాడని పేరుంది. ఇటీవల కాలంలో థమన్ పాటల కన్నా బీజీఎంతోనే ఎక్కువగా అల్లాడిస్తున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘వకీల్‌సాబ్’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘బ్రో’ ‘స్కంద’ వంటి చిత్రాలకు థమన్ ఏ స్థాయి బీజీఎం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఎంతో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా థమన్‌నే ఏరికోరి సుకుమార్ బీజీఎం అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు థమన్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో రెండు సినిమాలు చేశాడు. ‘సరైనోడు’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్ ఎలివేషన్స్ ఇస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో థమన్‌కు ఇప్పటికే ఓ ఐడియా ఉంది. కాబట్టి 'పుష్ప 2'కు థమన్ నేపథ్య సంగీతం అందించినా అది కచ్చితంగా అదిరిపోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
తెరపైకి మరో మ్యూజిక్ డైరెక్టర్!
థమన్‌తో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ‘కాంతార’, ‘మంగళవారం’ లాంటి సినిమాలకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath)ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) కోసం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సమయం లేనందున థమన్‌కు తొలిభాగం, అజనీష్‌కు సెకండ్ పార్ట్ బాధ్యతలు అప్పగిస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ‘పుష్ప 2’ చిత్రానికి ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు పనిచేయనున్నారు. అయితే థమన్ ఒక్కరే నేపథ్యం సంగీతం అందిస్తారని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్‌గా చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకూ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు.
‘పుష్ప 2’ అరుదైన ఘనత
పుష్ప (Pushpa 2) కి ముందు వరకూ కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిచయమైన అల్లుఅర్జున్ ఆ సినిమా సక్సెస్‌తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయితో పాటు ఓవర్సీస్‌లోనూ పుష్ప’ (2021) సక్సెస్ కావడంతో ‘పుష్ప 2’పై విదేశీ ఆడియన్స్‌లోనూ భారీగా హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. దీంతో ‘పుష్ప 2’ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులంతా ప్రీసేల్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫలితంగా క్షణాల వ్యవధిలో అత్యంత వేగంగా తొలి 15 వేల టికెట్స్ (Pushpa 2 Record) అమ్ముడుపోయాయి. అమెరికాలో భారతీయ చిత్రానికి ఇంతవేగంగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప టీమ్ స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది.
https://twitter.com/PushpaMovie/status/1854036371146695000
నవంబర్ 07 , 2024
Ketika Sharma Hot: పైట పక్కకు పడేసి.. అన్నింటికి తెగించిన కేతిక శర్మ!
యంగ్ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్ హాట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలయ్యింది. తన పరువాల దాడితో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తాజాగా లైట్ పింక్ కలర్ శారీలో ఫొటోలకు ఫొజులిచ్చిన ఈ అమ్మడు పైటను పక్కకు జరిపి కుర్రకారును రెచ్చగొట్టింది.
భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ మీటర్లు బద్దలయ్యేలా చేసింది. నాభి అందాలతో యువతను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
మత్తెక్కించే కళ్లతో మరింత కొంటెగా చూస్తూ అందరినీ ఫిదా చేసింది. హాట్ హాట్ ఫొజులతో కనుల విందు చేసింది.
ఈ అమ్మడి ఎద గుత్తులను చూసి యూత్ పరేషాన్ అవుతున్నారు. ఇంత హాట్ ఏంటి మామా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
హుషారెక్కించే అందాలతో కుర్రాళ్లను కైపులో ముంచెత్తుతోంది.
కేతిక శర్మ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె ఢిల్లీలో 1995 డిసెంబర్ 24న జన్మించింది. అక్కడే విద్యాభ్యాసం చేసింది.
చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా మారింది. ఆపై సోషల్ మీడియాలో డబ్‌స్మాష్ వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది.
అలా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్లలో పడింది. పూరి కుమారుడు ఆకాష్ నటించిన ‘రొమాంటిక్’ (2021) చిత్రంతో కేతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడు అందాలకు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
దీంతో నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య' సినిమాలో కేతికకి ఛాన్స్ దక్కింది. అయితే ఆ సినిమా కూడా ఈ నార్త్ బ్యూటీకి విజయాన్ని అందించలేకపోయింది.
ఆ తర్వాత మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో 'రంగ రంగ వైభవంగా' చిత్రం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఫిల్మ్ కూడా కేతికను తీవ్రంగా నిరాశ పరిచింది.
గతేడాది పవన్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమాలో ఈ అమ్మడు కనిపించింది. ఆ సినిమా విజయం సాధించడంతో ఇక తనకు తిరుగులేదని కేతిక భావించింది.
అయితే ‘బ్రో’ సినిమా తర్వాత కేతికకు ఒక్క సినిమాలోనూ ఛాన్స్ లభించలేదు. ఏడాది కాలంగా మూవీ ఆఫర్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడం, వరుస ఫ్లాప్స్‌పై ఇటీవల కేతిక స్పందించింది. మనసు పెట్టి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుందని ఫలితం ఇవ్వాల్సింది ప్రజలేనని పేర్కొంది.
అయితే సినిమా ఆఫర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ అమ్మడు గ్లామర్ డోస్‌ను మరింత పెంచుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలను క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు.
నవంబర్ 06 , 2024
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరంను ట్రోలింగ్ చేసింది ఈ సినిమాలోనే! ఇంత దారుణామా?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు(Kiran Abbavaram) ముఖ్య అతిథిగా అక్కినేని నాగచైతన్య కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం చేసిన భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ చర్చ “క” సినిమా గురించి కాదు. ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై కిరణ్ అబ్బవరం తన మనసులోని బాధను బయటపెట్టాడు.
ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం పలు ట్రోల్స్‌కి గురయ్యాడు. వీటిపై ఆయన ఎక్కువగా స్పందించకుండా తన పని తాను చూసుకుంటూ(Kiran Abbavaram Trolling Movie) వెళ్లిపోయేవాడు. ఈసారి మాత్రం ఆ ట్రోల్స్ మితిమీరుతున్నాయని భావించి గట్టిగా స్పందించాడు. ఈ ప్రసంగంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అతని వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ సందర్భంలో కిరణ్ అబ్బవరం, ఒక సినిమాలో తన అనుమతి లేకుండా తనపై ట్రోల్ సన్నివేశాన్ని ఉపయోగించారని చెప్పుకొచ్చారు.
" ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. ఏదో నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. సంవత్సరానికి రెండు సినిమాలు. మూడు సినిమాలు చేస్తూన్నాని పక్కనపెడితే.. నా మీద కొంత మంది సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీదా..! ఏమన్న సంబంధమా? నా మీద ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సినిమాలో.. కొంచెం రిక్వెస్టింగ్‌గానే అడుగుతున్నా.. ఎందుకన్న నామీదా.. నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఏరోజైనా మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఏంటి? ఓ సినిమాలో డైరెక్ట్‌గా నా మీదా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్పర్‌మేషన్ లేదు. బ్రో, కిరణ్ బ్రో మీ గురించి ఒకటి సినిమాలో వేస్తున్నాం. ఎక్కడో నా ఫ్యాన్స్ నాకు చూపించి ఏంటి బ్రో నీ గురించి ఈ సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే.. నేను రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నా? మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత ఏం చేశాను నేను అని అంటూ" భావోద్వేగానికి లోనయ్యాడు.
https://twitter.com/Movies4u_Officl/status/1851300009503064487
కిరణ్ అబ్బవరం ప్రసంగం తర్వాత ఇంతకు ఆ సినిమా ఏమై ఉంటుందని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
అయితే కిరణ్ ప్రస్తావించిన సన్నివేశం గత ఏడాది వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా ‘హాస్టల్ స్టూడెంట్స్’లోని సన్నివేశం. ఈ చిత్రాన్ని ‘చాయ్ బిస్కెట్’ నిర్మాణ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసింది. ఆ సినిమా స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు(Kiran Abbavaram Trolling Movie) స్టూడెంట్స్ కిరణ్ అబ్బవరం నటించిన ఓ సినిమా ట్రైలర్ గురించి చర్చిస్తూ ఒకరు కిరణ్ అబ్బవరం ట్రైలర్ వచ్చింది అంటాడు. ఇంకొకరు ఏంటీ "మళ్లీ వచ్చిందా?" అంటూ వెటకారంగా మాట్లాడతారు. అప్పట్లో కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఉండటంతో, ఆ సినిమాకు సంబంధించి అతని మీద సెటైర్ వేసినట్లు అనిపించింది. దీనిపై కిరణ్ ఈ ఈవెంట్ లో తన బాధను వ్యక్తం చేశాడు. కానీ, అతను ఎక్కడా కూడా ఆ సినిమా పేరు లేదా మేకర్స్ పేర్లు ప్రస్తావించలేదు. కానీ, తన మనసుకు బాధ కలిగిన విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాడు.
కిరణ్ స్పీచ్‌కి సోషల్ మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాటి పాటలేని బేవర్స్ కొంత మంది ట్రోల్ చేసినంత మాత్రనా మీకు ఏం కాదు బ్రో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. నువ్ పట్టించుకోకు కిరణ్ అన్నా అంటూ మరో నెటిజన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు.
https://twitter.com/YugandharTarak/status/1851309020264771830
ఇక 'క' సినిమా దీపావళి రోజు(అక్టోబర్ 31)న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మితమైంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల ద్వయం డైరెక్ట్ చేసింది.
అక్టోబర్ 30 , 2024
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు : సుధీర్ బాబు, షియాజీ షిండే, హర్షిత్ రెడ్డి, ఆమని, రాజ్ సుందరం, శశాంక్, సాయి చంద్, ఆర్నా, చంద్ర వేంపతి తదితరులు
దర్శకత్వం : అభిలాష్ కంకర
సంగీతం : జై కృష్ణ
సినిమాటోగ్రఫీ : సమీర్ కల్యాణి
ఎడిటింగ్ : అనిల్ కుమార్. పి
నిర్మాత : సునీల బలుసు
విడుదల తేదీ: 11-10-2024
సుధీర్ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Review). ఆర్ణా కథానాయికగా చేసింది. షాయాజీ షిండే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తండ్రి సెంటిమెంట్ ప్రేక్షకులను మెప్పించిందా? వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబుకు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రకాష్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోవడంతో రోజుల బిడ్డను అనాథశ్రమంలో ఉంచి పనికోసం బయటకు వెళ్తాడు. అనూహ్యంగా అరెస్టై 20 ఏళ్లు జైల్లో ఉండిపోతాడు. మరోవైపు ఆ పిల్లాడు జానీ (సుధీర్ బాబు)ని స్టాక్ బ్రోకర్ శ్రీనివాస్ (షియాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ ఇంటికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ జీవితం తలకిందులు అవుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలవుతాడు. ఈ కష్టాలన్నీ జానీ వల్లే అని భావించి అతడిపై ద్వేషం పెంచుకుంటాడు. ఊరంతా అప్పులు చేస్తుంటాడు. కానీ జానీకి మాత్రం శ్రీనివాస్ అంటే చాలా ప్రేమ. తండ్రి చేసిన అప్పులు కడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడికి శ్రీనివాస్ రూ.కోటి బాకీ పడతాడు. అదే సమయంలో తన అసలైన తండ్రి ప్రకాష్‌ను జానీ కలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్ అప్పు తీర్చడానికి జానీ ఎన్ని పాట్లు పడ్డాడు? జానీ ప్రేమను శ్రీనివాస్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్ సుధీర్ బాబుని చూడవచ్చు. గతంలో బాడీ చూపిస్తూ యాక్షన్ సినిమాలు చేసిన అతడు ఇందులో మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. చక్కగా భావోద్వేగాలు పలికించాడు. పరిపూర్ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. పెంపుడు తండ్రిగా షాయాజీ షిండే మంచి నటన కనబరిచాడు. అయితే అతడి క్యారెక్టర్‌లో డెప్త్ మిస్ అయ్యింది. మరోవైపు అసలు తండ్రిగా చేసిన సాయి చంద్ తనదైన యాక్టింగ్‌తో పాత్రలో జీవించేశాడు. సినిమాలో మేజర్ సన్నివేశాలన్నీ ఈ మూడు పాత్రల చుట్టే తిరుగుతాయి. హీరోయిన్‌గా ఆర్ణా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అక్కడక్కడ తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తమిళం, మలయాళ భాషల చిత్రాలు చూసి తెలుగులో ఎందుకు ఇలాంటి ఫీల్‌గుడ్ చిత్రాలు రావని భావించేవారికి ఈ చిత్రం గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్ కంకర ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు. చిన్నప్పుడే కొడుకును దూరం చేసుకున్న తండ్రి, పక్కనే ఉన్నా పట్టించుకొని పెంపుడు తండ్రి ఇలా భావోద్వేగాల నడుమ కథను నడిపించారు. అయితే నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఎమోషన్ క్యారీ అయిన తర్వాతే అసలైన కథలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. ఫస్టాఫ్ మెుత్తం సుధీర్ బాబు, షాయాజీ షిండేల మధ్య కథ నడిపిన దర్శకుడు సెకాండాఫ్‌లో సాయి చంద్ పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. సెకాండాఫ్‌ను మరింత ఎమోషనల్‌గా నడిపే ప్రయత్నం చేశారు. లాస్ట్ 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు. నెమ్మదిగా సాగే కథనం, కమర్షియల్ హంగులు లేకపోవడం మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే జై కృష్ణ నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది. ల్యాగ్ సీన్లను తొలగించి సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
కథసుధీర్ బాబు నటననేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
స్లో న్యారేషన్‌కమర్షియల్ హంగులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా చూడాలన్న కోరిక బలపడుతుంది. అందుకే మేకర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వూలు, సోషల్ మీడియా ప్రకటనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ చేస్తోన్న వినూత్న ప్రమోషన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్రేజీ ప్రమోషన్స్!
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యంగ్ హీరోల్లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. ఇటీవల ‘హరోం హరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ఇప్పుడు మరో సినిమాతో ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero) చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వినూత్న ప్రమోషన్స్‌కు తెర లేపింది. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్ కనిపించేలా ప్రమోషన్స్ చేస్తోంది. యంగ్ హీరోలు వరుణ్ తేజ్, మంచు మనోజ్‌తో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వినూత్న ప్రమోషన్స్‌లో తమకు తెలియకుండానే భాగమయ్యారు. దీంతో ఈ ప్రమోషన్స్‌కు నెట్టింట విశేష స్పందన వస్తోంది. స్టార్లను భలే బురిడి కొట్టించారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ అండ్ న్యాచురల్‌గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు తెలిసే జరిగిందా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్.
https://twitter.com/isudheerbabu/status/1843218217977966798
https://twitter.com/i/status/1842791222047367544
https://twitter.com/i/status/1842084097621164229
అవాక్కైనా మంచు మనోజ్!
తనకు తెలియకుండానే మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్‌లో భాగం కావడంపై మంచు మనోజ్ నెట్టింట స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సుధీర్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా దానికి అయోమయంగా చూస్తున్న బ్రహ్మీ జిఫ్‌ను జత చేశాడు. స్మైలీ ఎమోజీ ట్యాగ్ చేస్తూ తాను బాగా ఎంజాయ్ చేసినట్లు సంకేతం ఇచ్చారు. దీనిపై సుధీర్ బాబు కూడా ఆసక్తికర రిప్లే ఇచ్చారు. సారి బ్రో ఇంకో ఆప్షన్ దొరకలేదు అంటూ మనోజ్‌ను ట్యాగ్ చేశాడు. మొత్తానికి మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ మాత్రం చాలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
https://twitter.com/HeroManoj1/status/1842102892628509031
ట్రైలర్‌పై మహేష్ ఏమన్నారంటే!
‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Super Hero Promotions) ట్రైలర్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మెచ్చుకున్నట్లు నటుడు సుధీర్ బాబు తెలిపారు. ‘మహేష్ బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్ కట్ ట్రైలర్ పంపిస్తే బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్ ట్రైలర్ పంపా. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్ టచ్చింగ్‌గా ఉందన్నారు. ఆఖర్లో వచ్చే మహేష్ పేరున్న డైలాగ్ ఫన్నీగా ఉందన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా. అలా తను సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది’ అంటూ తాజా ఇంటర్వ్యూలో సుధీర్ చెప్పుకొచ్చారు.
అక్టోబర్ 08 , 2024
Tollywood Directors: హీరోయిన్‌ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో చుట్టూనే సాగేలా కొందరు దర్శకులు సినిమాలు తీస్తున్నారు. పాటల కోసం, అందచందాలను ఆరబోయటం కోసం మాత్రమే హీరోయిన్లు అన్నట్లు చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘లైగర్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలను గమనిస్తే హీరోయిన్ నటన కంటే వారి ఎక్స్‌పోజింగ్‌పైనే దర్శకులు ఎక్కువగా దృష్టిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లోని కొందరు యువ డైరెక్టర్లు మాత్రం హీరోయిన్లను ఒకప్పటిలా డిగ్నిటీగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో శేఖర్ కమ్ములాను ఫాలో అవుతూ సినీ లవర్స్ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేసిన చిత్రాలేంటి? అందులో హీరోయిన్స్‌ను ఎలా చూపించారు? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
టాలీవుడ్‌లో సెన్సిబుల్ దర్శకుడు అనగానే ముందుగా శేఖర్ కమ్ముల గుర్తుకు వస్తారు. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఆయా సినిమాల కోసం ఎంచుకునే హీరోయిన్స్, వారిని ఆయన చూపించే విధానం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో నటి కమలిని ముఖర్జీని ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. పక్కింటి అమ్మాయి అనిపించేతలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. అలాగే ‘లీడర్’లో రీచా గంగోపాధ్యాయ, ‘లైఫ్ ఈజ్‌బ్యూటీఫుల్’లో షగున్ కౌర్ పాత్రలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఇక ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రను మనసుకు హత్తుకునేలా ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిందే. పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయనప్పటికీ ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుందంటే అందులో శేఖర్ కమ్ములకు ఎంతో కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. హీరోయిన్లను డిగ్నిటీగా ఎలా చూపించాలో, వారి నుంచి నటన ఏవిధంగా రాబట్టాలో తెలిసిన దర్శకుడు కావడంతో శేఖర్ కమ్ములతో కనీసం ఒక సినిమా అయిన చేయాలని కథానాయికలు ఆశ పడుతుంటారు.
హను రాఘవపూడి (Hanu Raghavapudi)
శేఖర్ కమ్ముల తరహాలోనే దర్శకుడు హను రాఘవపూడి కథానాయికల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఆయన దర్శత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’, ‘క్రిష్ణ గాడి వీర ప్రేమ గాధ’, ‘పడి పడి లేచె మనసు’, ‘సీతారామం చిత్రాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దర్శకత్వంలో పని చేసిన లావణ్య త్రిపాఠి, మెహరిన్, సాయిపల్లవి, మృణాల్ ఠాకూర్ ఎంత మంచి పేరు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి అద్భుతమైన ప్రేమ కావ్యంలో మృణాల్‌ను చాలా బాగా చూపించారు. ఆ సినిమాతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని సీత పాత్ర తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని మృణాల్ పలు సందర్భాల్లో చెప్పడం విశేషం. హను రాఘవపడి ప్రభాస్‌తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పటికే ఆమె లుక్స్ విపరీతంగా ఆకర్షించగా డైరెక్టర్ హను ఇంకెంత బాగా చూపిస్తారోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ (Vivek Athreya)
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సైతం హీరోయిన్ల విషయంలో శేఖర్ కమ్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంలో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంత బాగా చూపించారో అందరికీ తెలిసిందే. ఎక్కడా గ్లామర్‌షోకు చోటు ఇవ్వకుండా ఆమె ద్వారా అద్భుత నటనను రాబట్టి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ముందు డైరెక్ట్ చేసిన ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo), ‘బ్రోచెవారెవరురా’ (Brochevarevarura), ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాల్లోనూ హీరోయిన్ల స్కిన్ షో కంటే డిగ్నిటీ లుక్‌కే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఆయా చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్, నివేదా థామస్, నజ్రియా నజిమ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
శౌర్యువ్ (Shouryuv)
దర్శకుడు శౌర్యువ్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మనసుకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని మలిచి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నాని హీరోగా నటించగా మృణాల్ ఠాకూర్ అతడికి జోడీగా చేసింది. బాలీవుడ్‌లో అప్పటికే హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ను ఇందులో మళ్లీ అచ్చ తెలుగు అమ్మాయిగా చూపించారు. సాంగ్స్‌లో స్కిన్ షోకు అవకాశం ఉన్నప్పటికీ శౌర్యువ్ ఆ పని చేయలేదు. ఆమె పోషిస్తున్న డిగ్నిటీ పాత్రపై ప్రభావం చూపకుండా ఆద్యంతం మృణాల్‌ను అందంగా చూపించారు. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? ఎలా చూపించాలి? అని శౌర్యువ్‌కు ఉన్న స్పష్టతను చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. తన తర్వాతి సినిమాల్లోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యూత్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయారు. యువత మెచ్చే కంటెంట్‌తో వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే కుర్రకారును ఆకట్టుకువాలన్న తాపత్రయంలో అతడు ఎక్కడా గ్లామర్ షోకు ఆస్కారం ఇవ్వడం లేదు. తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ నుంచి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా రీతు వర్మ నటించింది. అసభ్యతకు, అనవసర స్కిన్‌షోకు చోటు లేకుండా ఆమెతో మంచి నటన రాబట్టాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో రీతు వర్మ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నటుడిగా మారి పలు సినిమాల్లో నటించిన తరుణ్ బాస్కర్ ‘కీడా కోలా’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు.
సెప్టెంబర్ 14 , 2024
Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram Weekend Collections). గురువారం (ఆగస్టు 29) విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్.జే. సూర్య నటనపై ఆడియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ నాని సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు థియేటర్ అక్యుపెన్సీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నాని చిత్రం ఎంత వసూలు చేసింది? తొలి నాలుగు రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్ కొల్లగొట్టింది? ఇప్పుడు చూద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.68.52 కోట్లు (GROSS) సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘సరిపోదా శనివారం’ దేశంలో రూ.33.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇప్పటివరకూ రూ.29.65 వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అటు కర్ణాటకలో రూ. 4.65 కోట్లు, తమిళనాడులో రూ.3.23 కోట్లు, కేరళలో రూ.27 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.45 కోట్లు రాబట్టినట్లు వివరించాయి.
రూ.100 కోట్ల మార్క్ దిశగా..
బాక్సాఫీస్ వద్ద సరిపోదా శనివారం దూకుడు చూస్తుంటే ఈజీగానే రూ.100 కోట్ల మార్క్ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వాయు గుండం ప్రభావం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్ష ప్రభావం తగ్గితే ‘సరిపోదా శనివారం’ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. తద్వారా అలవోకగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి. నాని కెరీర్‌లో ‘దసరా’ మాత్రమే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రెండో చిత్రం లోడింగ్ అంటూ నాని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
నెలలోపే ఓటీటీలోకి..!
నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram OTT) నెల రోజుల లోపే ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం అవుతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హిందీ వెర్షన్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలోనూ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్, ఆడియన్స్ రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.
సినిమాలో అవే హైలెట్స్
‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్, జేక్స్ బేజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్ మధ్య వచ్చే టామ్ అండ్ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి.
‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే..
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్ దయా (ఎస్.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్ ట్రాక్ ఏంటి? హీరో-విలన్ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
సెప్టెంబర్ 02 , 2024