• TFIDB EN
  • బ్రోచేవారెవరురా
    UTelugu2h 18m
    పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    శ్రీ విష్ణు
    రాహుల్
    నివేతా థామస్
    మిత్ర
    నివేదా పేతురాజ్
    షాలిని
    సత్యదేవ్ కంచరణా
    విశాల్
    ప్రియదర్శి పులికొండ
    రాకేష్ రాకీ
    రాహుల్ రామకృష్ణ
    రాంబాబు రాంబో
    శ్రీకాంత్ అయ్యంగార్
    మిత్ర తండ్రి
    హర్ష వర్ధన్
    రాధాకృష్ణ స్నేహితుడు
    శివాజీ రాజా
    రాహుల్ తండ్రి
    షఫీ
    కానిస్టేబుల్ అశోక్ కుమార్
    దినేష్ కౌషికసూరి
    ఝాన్సీ లక్ష్మి
    ఫిజిక్స్ టీచర్
    రాజ్ మాదిరాజు
    సినిమా నిర్మాత
    అజయ్ ఘోష్
    కిడ్నాపర్
    బిత్తిరి సత్తి
    బిచ్చగాడు
    రాజేష్ ఖన్నా
    అప్పాజీ అంబరీష దర్భవిశాల్ తండ్రి
    సిబ్బంది
    వివేక్ ఆత్రేయ
    దర్శకుడు
    విజయ్ కుమార్ మన్యంనిర్మాత
    వివేక్ సాగర్
    సంగీతకారుడు
    కథనాలు
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    Om Bheem Bush Collections: శ్రీవిష్ణు కెరీర్‌లోనే రికార్డ్‌ ఓపెనింగ్స్.. హిట్‌ కొట్టిన ‘ఓం భీమ్‌ బుష్‌’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
    యంగ్‌ హీరో శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ (Tollywood)లో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే గత కాలంగా కామెడీ మూవీస్‌పై ఫోకస్‌ పెట్టిన ఈ హీరో.. వరుసగా ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో వచ్చి నవ్వులు పూయించాడు. తాజాగా ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Day 1 Collections)తో వచ్చి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  శ్రీవిష్ణు కెరీర్‌లో రికార్డు వసూళ్లు! శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు శ్రీహర్ష తెరకెక్కించిన 'ఓం భీమ్ బుష్' సినిమాకు మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక చిన్న సినిమా తొలి రోజున ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాయి. శని, ఆదితో పాటు సోమవారం ‘హోలీ’ (Holi) సందర్భంగా సెలవు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నాయి. ఇక శ్రీవిష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  సాక్నిక్‌ లెక్కల ప్రకారం ప్రముఖ ఫిల్మ్‌ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) సైతం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush Day 1 Net Collections) తొలి రోజు కలెక్షన్స్‌ను ప్రకటించింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.1.25 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ‘ఓం భీమ్‌ బుష్‌’ తొలి రోజున 24.91% ఆక్యుపెన్సీని థియేటర్లలో నమోదు చేసినట్లు పేర్కొంది. మార్నింగ్‌ షో 21.35%, మ్యాట్నీ 22.95%, ఫస్ట్‌ షో 23.37%, సెకండ్‌ షో 31.96% ఆక్యుపెన్సీ సాధించినట్లు తెలిపింది.  బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? యంగ్‌ హీరో శ్రీవిష్ణు గత చిత్రం ‘సామజవరగమన’ బ్లాక్‌ బాస్టర్‌ కావడంతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వంటి హాస్యనటులు ఉండటంతో ఓం భీమ్‌ బుష్‌ థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.6.56 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. కోటికి థియేట్రికల్‌ హక్కులు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 7 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ‘ఓం భీమ్‌ బుష్‌’ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమి కాదు.  ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? తాజాగా ‘ఓం భీం బుష్’ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజైన నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌తో అమెజాన్‌ ఒప్పందం చేసుకుందట. దీని ప్రకారం ‘ఓం భీం బుష్’ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందే ఓటీటీకి వస్తున్నాయి. అదే విధంగా ‘ఓం భీం బుష్’ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ వర్గాలు అంటున్నాయి. 
    మార్చి 23 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?</strong>
    Saripodhaa Sanivaaram Review: యాక్షన్ సీక్వెన్స్‌లో నాని ఊరమాస్‌ ఊచకోత.. ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : నాని, ప్రియాంక అరుళ్ మోహన్‌, ఎస్‌.జే. సూర్య, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అభిరామి, అదితి బాలన్‌, మురళి శర్మ, అజయ్‌ తదితరులు డైరెక్టర్‌ : వివేక్ ఆత్రేయ సంగీతం : జేక్స్‌ బేజోయ్‌ ఎడిటర్‌ : కార్తిక శ్రీనివాస్ నిర్మాతలు : డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి విడుదల తేదీ : 29-08-2024 నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram Movie Review). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ చేసింది. ప్రముఖ తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర చేశారు. ఇప్పటివరకూ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ వంటి క్లాస్‌ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈసారి ఊర మాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన శైలికి భిన్నంగా పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సరిపోదా శనివారాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఆగస్టు 29న ఈ చిత్రంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నాని నటన మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. (Saripodhaa Sanivaram Movie Review) ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో హీరో నాని ఇరగదీశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో నాని నటన ఉంటుంది. యాక్షన్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ నాని తనదైన మార్క్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక నానికి ప్రత్యర్థిగా ఎస్‌.జే. సూర్య అదరగొట్టాడని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాల్లో నాని సైతం తన నటనతో ఎస్‌.జే సూర్య డామినేట్‌ చేశారు. వీరిద్దరి నటనే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక లేడీ కానిస్టేబుల్‌ పాత్రలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ సెటిల్డ్‌గా నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ఆమె ఆకట్టుకుంది. నాని-ప్రియాంక మధ్య వచ్చే డిఫరెంట్‌ లవ్‌ ట్రాక్‌ ఆడియన్స్‌కు నచ్చుతుంది. సాయికుమార్‌, అజయ్‌, మురళీ శర్మలతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. రొటిన్‌ స్టోరీనే తీసుకున్నప్పటికీ తనదైన మేకింగ్‌తో వివేక్‌ మెస్మరైజ్‌ చేశాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకు పాత్రల పరిచయానికే దర్శకుడు తీసుకున్నాడు. హీరో నాని బాల్యం, శనివారం కాన్సెప్ట్‌, హీరోయిన్‌తో పరిచయం, అదిరిపోయే ఇంటర్వెల్‌ బ్లాక్‌తో ఫస్టాఫ్‌ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించాడు. ఇక సెకండాఫ్‌లో నాని, ఎస్‌.జే సూర్య మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ సన్నివేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌తో నింపేశాడు. అయితే నిడివి ఎక్కువగా ఉండటం సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. కొన్ని సన్నివేశాలు మరి సాగదీతగా అనిపిస్తాయి. నాని పాత్ర పరిచయానికి కూడా ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌లుగా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్‌ బేజోయ్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. యాక్షన్‌ సీక్వెన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ నాని, ఎస్‌.జే. సూర్య నటనయాక్షన్‌ సీక్వెన్స్‌ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ మైనస్ పాయింట్స్‌ సుదీర్ఘమైన నిడివిట్విస్టులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; ‘సరిపోదా శనివారం’పై పబ్లిక్‌ టాక్‌ సరిపోదా శనివారం చిత్రాన్ని చూసిన నెటిజన్లు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని పోస్టులు పెట్టడం విశేషం. ముఖ్యంగా నాని, ఎస్‌.జే. సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. సోషల్‌ మీడియాలోని కొన్ని పోస్టుల ఆధారంగా పబ్లిక్‌ ఓపీనియన్‌ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిపోదా శనివారం చిత్రం సంతృప్తికరమైన యాక్షన్‌ డ్రామా అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఇంట్రడక్షన్‌ బ్లాక్‌, ఇంటర్వెల్‌ బ్లాక్‌, క్లైమాక్స్‌ బ్లాక్‌, నాని - సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్‌ అయ్యాయని పోస్టు పెట్టాడు. https://twitter.com/venkyreviews/status/1828908558198644841 డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఏమీ లేదని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. అయితే ఎస్‌.జే. సూర్య, నానిల కోసం ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందేనని పేర్కొన్నాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయిందని, పోతారు మెుత్తం పోతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక సెకండాఫ్‌ కాస్త బోర్‌గా అనిపించినా మాస్‌ ఆడియన్స్‌ను పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని ప్రశంసించాడు. https://twitter.com/_NaveenReddy_14/status/1828931798719414466 ఈ సినిమాకు నేపథ్య సంగీతం బాగా ప్లస్‌ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ను BGM ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీజీఎం ర్యాంప్‌ అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Abhi_pkcult/status/1828908519141323179 సరిపోదా శనివారానికి తనదైన శైలిలో రివ్యూ చెబుతూ ఓ నెటిజన్‌ 3/5 రేటింగ్‌ ఇచ్చాడు. పాత్రల పరిచయం, డిజైన్‌ చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. తర్వాతి సీన్లను ముందుగానే ఊహించగలగడం, పెద్దగా మలుపులు లేకపోవడం కాస్త డ్రా బ్యాక్‌గా నిలిచిందని రాసుకొచ్చాడు. https://twitter.com/chitrambhalareI/status/1828918494358110555 సోషల్ మీడియా అంతా 'సరిపోదా శనివారం' పాజిటివ్ రివ్యూలతో హోరెత్తుతుంటే అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు సైతం కనబడుతున్నాయి. ఫస్టాఫ్ మీద పెట్టిన కాన్సంట్రేషన్ సెకండాఫ్ మీద పెట్టి ఉంటే వంద కోట్ల మూవీ అయ్యేదని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. https://twitter.com/Raktapatham/status/1828908737358438724 నిడివి ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందని మరికొందరు అంటున్నారు. 30 నిమిషాల నిడివిని ట్రిమ్‌ చేయటం అవసరమని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. బోరింగ్‌ మసాలా సీన్స్‌, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి 2/5 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు. https://twitter.com/Devara15629882/status/1828909154398023884
    ఆగస్టు 29 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.&nbsp; ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.&nbsp; https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?</strong>
    Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
    నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram Weekend Collections). గురువారం (ఆగస్టు 29) విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ నాని సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు థియేటర్‌ అక్యుపెన్సీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నాని చిత్రం ఎంత వసూలు చేసింది? తొలి నాలుగు రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్‌ కొల్లగొట్టింది? ఇప్పుడు చూద్దాం.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.68.52  కోట్లు (GROSS) సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇదిలా ఉంటే ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘సరిపోదా శనివారం’ దేశంలో రూ.33.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇప్పటివరకూ రూ.29.65 వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. అటు కర్ణాటకలో రూ. 4.65 కోట్లు, తమిళనాడులో రూ.3.23 కోట్లు, కేరళలో రూ.27 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.1.45 కోట్లు రాబట్టినట్లు వివరించాయి.  రూ.100 కోట్ల మార్క్‌ దిశగా.. బాక్సాఫీస్‌ వద్ద సరిపోదా శనివారం దూకుడు చూస్తుంటే ఈజీగానే రూ.100 కోట్ల మార్క్ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వాయు గుండం ప్రభావం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్ష ప్రభావం తగ్గితే ‘సరిపోదా శనివారం’ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. తద్వారా అలవోకగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి. నాని కెరీర్‌లో ‘దసరా’ మాత్రమే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో రెండో చిత్రం లోడింగ్‌ అంటూ నాని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.  నెలలోపే ఓటీటీలోకి..! నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram OTT) నెల రోజుల లోపే ఓటీటీలోకి రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం అవుతుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హిందీ వెర్షన్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలోనూ హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్‌, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.&nbsp; సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!</strong>
    Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!
    నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 29 గ్రాండ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సినిమాలో తమను నిరాశకు గురిచేసిన అంశాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఓవరాల్‌గా పాజిటివ్ రివ్యూస్‌ సాధించిన నాని చిత్రం తొలి రోజు మంచి వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; తొలి కలెక్షన్స్‌ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం తొలి రోజు ఆశించిన స్థాయిలోనే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.20.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.8.8 కోట్లు మేర రాబట్టినట్లు స్పష్టం చేశాయి. ఓవర్సీస్‌లో రూ.7.6 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిపాయి. అటు కర్ణాటకలో రూ.1.4 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.2.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఈ వీకెండ్‌ సాలిడ్‌ వసూళ్లను సాధించే అవకాశముందని అంచనా వేశాయి. సినిమా హిట్‌ టాక్‌ అనంతరం టికెట్‌ బుకింగ్స్‌ గణనీయ సంఖ్యలో పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.&nbsp; ‘దసరా’ కంటే తక్కువే! నాని గత చిత్రం 'హాయ్‌ నాన్న' (Hi nanna) తొలి రోజున రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ చిత్రంతో పోలిస్తే ‘సరిపోదా శనివారం’ రెట్టింపు వసూళ్లను సాధించడం విశేషం. అయితే నాని అంతకుముందు చిత్రం ‘దసరా’ కంటే ఇది చాల తక్కువనే చెప్పవచ్చు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా తొలి రోజున రూ.38 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి నాని కెరీర్‌లో హైయస్ట్‌ ఓపెనింగ్‌గా నిలిచింది. దానితో పోలిస్తే 'సరిపోదా శనివారం' రూ.18 కోట్ల మేర వెనకబడింది. అయినప్పటికీ నాని కెరీర్‌లో సెకండ్‌ హయ్యేస్ట్ ఓపెనింగ్‌ చిత్రంగా ‘సరిపోదా శనివారం’ రికార్డు సృష్టించింది. సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/saripodhaa-sanivaaram-review-nani-ooramas-massacre-in-the-action-sequence-how-about-saripodhaa-sanivaaram.html
    ఆగస్టు 30 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.&nbsp; అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.&nbsp; సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది.&nbsp;
    మే 30 , 2024
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు&nbsp; అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్‌ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; జాతిరత్నాలు ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్‌ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు. డీజే టిల్లు డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్‌ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.&nbsp; హుషారు మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్‌ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్‌ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.&nbsp; బ్రోచెవారెవరురా&nbsp; స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు. ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్‌ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది. మిషన్ ఇంపాజిబుల్‌ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.&nbsp; హృదయం కాలేజ్‌ లైఫ్, లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్‌ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్‌ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.&nbsp; చిచ్చోరే ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది. రొమాంచనమ్ హారర్‌ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్‌ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్‌ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్‌ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్‌ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు. మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 21 , 2023

    @2021 KTree