• TFIDB EN
  • బడ్డీ
    UATelugu
    ఆదిత్య రామ్‌ (అల్లు శిరిష్‌) పైలెట్‌గా చేస్తుంటాడు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ పల్లవిని చూడకుండానే ప్రేమిస్తాడు. ఓ రోజు పల్లవి మెడికల్‌ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్‌ అవుతుంది. కోమాలోకి వెళ్లిన ఆమె ఆత్మ టెడ్డీలోకి ప్రవేశిస్తుంది. విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది? అన్న స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Aug 272 months ago
    'బడ్డీ' చిత్రం ఆగస్టు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
    రివ్యూస్
    YouSay Review

    Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?

    మెగా హీరో అల్లు శిరీష్‌ (Allu Sirish) చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం ‘బడ్డీ‘ (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj), ప్రిషా ...read more

    How was the movie?

    తారాగణం
    అల్లు శిరీష్
    అజ్మల్ అమీర్
    గాయత్రీ భరద్వాజ్
    ప్రిషా సింగ్
    పొలసానే శ్రీరామ్ రెడ్డి
    సిబ్బంది
    సామ్ అంటోన్దర్శకుడు
    కె. ఇ. జ్ఞానవేల్ రాజా
    నిర్మాత
    హిప్హాప్ తమిజా
    సంగీతకారుడు
    కృష్ణన్ వసంత్సినిమాటోగ్రాఫర్
    రూబెన్
    ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?</strong>
    Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు : అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా సింగ్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రీరామ్‌ రెడ్డి, మహమ్మద్‌ అలీ, ముకేష్‌ కుమార్‌ తదితరులు డైరెక్టర్‌ : సామ్ ఆంటోన్‌ సంగీతం : హిప్‌హాప్‌ తమీజా సినిమాటోగ్రఫీ : క్రిష్ణన్‌ వసంత్‌ ఎడిటర్‌ : రూబెన్‌ నిర్మాత : కే.ఈ. జ్ఞానవేల్‌ రాజా&nbsp; విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 మెగా హీరో అల్లు శిరీష్‌ (Allu Sirish) చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం 'బడ్డీ' (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj), ప్రిషా సింగ్‌ (Prisha Singh) హీరోయిన్లుగా చేశారు. శామ్‌ ఆంటోన్‌ (Sam Antone) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. అడ్వెంచర్‌, యాక్షన్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లు శిరీష్‌కు సక్సెస్‌ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ఆదిత్య రామ్‌ (అల్లు శిరిష్‌) పైలెట్‌గా చేస్తుంటాడు. వైజాగ్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్‌) అతడ్ని ప్రేమిస్తుంది. ఆదిత్య కూడా చూడకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరు కలుసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. పల్లవి మెడికల్‌ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్‌ అవుతుంది. కోమాలోకి వెళ్తుంది.&nbsp;ఆ స్థితిలో ఆమె ఆత్మ ఒకప్పుడు ఆదిత్య గిఫ్ట్‌గా ఇచ్చిన టెడ్డీలోకి వెళ్తుంది. అలా ఆమె ఆత్మ టెడ్డీ ద్వారా ఆదిత్యను ఎలా కలిసింది? విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది? ఇందుకు ఆదిత్య, టెడ్డీ చేసిన పోరాటం ఏంటి? అసలు పల్లవి బాడీని విలన్‌ గ్యాంగ్‌ ఏం చేయాలని అనుకుంది? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్‌ అద్భుత నటన కనబరిచాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. నటుడిగా ఈ సినిమాలో గొప్ప పరిణితిని సాధించాడు. అటు గాయత్రి భరద్వాజ్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. స్క్రీన్‌పై కనిపించినంత సేపు ఆడియన్స్‌ను కనువింద్‌ చేసింది. విలన్‌గా అజ్మల్‌ అమీర్‌ ఆకట్టుకున్నాడు. అల్లు శిరీష్‌ను ఢీకొట్టే పాత్రలో అతడి నటన మెప్పిస్తుంది. సెకండ్‌ హీరోయిన్‌ ప్రిషా సింగ్‌ ఎయిర్‌ హోస్టెస్‌గా అలరించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు శామ్‌ ఆంటోన్‌ విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్ మధ్య లవ్‌ ట్రాక్‌ను చాలా అందంగా తెరకెక్కించారు. దూరంగా ఉంటూనే వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. మూవీ మధ్యలో వచ్చే ‘కల్కి’, ‘జై బాలయ్య స్లోగన్స్‌’ ఆడియన్స్‌లో జోష్‌ను తీసుకొచ్చాయి. బడ్డీతో కలిసి అల్లు శిరీష్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్ మెప్పిస్తాయి. అయితే తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని రగిలించడంతో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. ముందే ప్రిడిక్ట్‌ చేసేలా సన్నివేశాలు ఉన్నాయి. అక్కడక్కడ వచ్చే అసందర్బమైన కామెడీ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. కీలకమైన క్లైమాక్స్‌లో అనవసరంగా హాస్యాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాలను పరిశీలిస్తే హిప్‌హాప్‌ తమీజా అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సాంగ్స్‌ మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. క్రిష్ణన్‌ వసంత్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటర్‌ రూబెన్‌ తన కత్తెరకు ఇంకాస్త పని కల్పించి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా బెటర్‌ ఔట్‌పుట్‌ ఇచ్చుంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్‌ అల్లు శిరీష్‌ నటనలవ్‌ ట్రాక్‌బడ్డీతో చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్ స్క్రీన్‌ప్లేకొరవడిన క్యూరియాసిటీ&nbsp;కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    <strong>LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!</strong>
    LATEST OTT RELEASES TELUGU: ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
    జులై నెల మొత్తం ప్రభాస్ కల్కి హవా సాగింది. ఇప్పుడు ఆగస్టు నెలలో అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మొదటి వారంలో పలు చిన్న చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ వీటిపై పెద్దగా బజ్‌ అయితే లేదు.&nbsp; శివం భజే, బడ్డీ, అంటోనీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అటు ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో 20కి పైగా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు విడుదల కానున్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు బడ్డీ చాలా రోజుల తర్వాత బడ్డీ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రంలో ఆయన సరసన యంగ్ హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. ఈ సినిమాను ఫూల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శామ్ ఆంటోస్ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రెకిత్తించాయి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా&nbsp; థియేటర్లలో విడుదలకానుంది. శివం భజే యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్‌ బాబు హీరోగా దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం శివంభజే. అఫ్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైవిధ్యమైన కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మంచి ఎగ్జైటింగ్ ఫీలింగ్ పొందుతారని మూవీ టీమ్ తెలిపింది. ఉషా పరిణయం తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్‌ భాస్కర్‌&nbsp; కుమారుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయం అవుతూ 'ఉషా పరిణయం'సినిమా వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. శ్రీకమల్ సరసన తాన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథ, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా రానుంది. ఆగస్టు 2న థియేటర్లలో విడుదల కానుంది. తిరగబడర సామి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో యువ హీరో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఆయన సరసన మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులను అలరించనుంది. యువతరాన్ని ఆకర్షింటే రొమాంటిక్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సెంటిమెంట్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అయితే రాజ్‌ తరుణ్- లావణ్య వివాదం సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత వారం విడుదలైన పురుషోత్తముడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరి ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి రివ్యూలను అందుకుంటుందో చూడాలి. లెటెస్ట్ సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అలనాటి రామచంద్రుడు&nbsp; కృష్ణవంశీ, మోక్ష జంటగా నటింంచిన చిత్రం అలనాటి రామచంద్రుడు. తన ప్రేమకోసం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్న యువకుడిని ఆ యువతి ప్రేమించిందా? లేదా? వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనే స్టోరీ లైనప్‌తో కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక ఈ సినిమాను చిలుకూరి ఆకాష్‌రెడ్డి&nbsp; డైరెక్ట్ చేస్తుండగా, హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా విడుదల కానుంది. ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు ఇక ఓటీటీ విషయానికొస్తే.. దర్శక ధీరుడు రాజమౌళిపై వచ్చిన&nbsp; డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష నటించిన 'బృందా' సిరీస్‌, డ్యూన్ పార్ట్ 2,&nbsp; కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి&nbsp; తెలుగు డబ్బింగ్&nbsp; సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ఓటీటీ రిలీజ్ డేట్లను ఇక్కడ చూడండి. PlatformTitleTypeRelease DateNetflixA Good Girl's Guide to MurderEnglish seriesAugust 01NetflixBorderless FogIndonesian movieAugust 01NetflixLove Is Blind MexicoSpanish seriesAugust 01NetflixMon Laferte TemoSpanish movieAugust 01NetflixUnstable Season 2English seriesAugust 01NetflixModern Masters: SS RajamouliTelugu documentaryAugust 02NetflixSaving Bikini BottomEnglish movieAugust 02NetflixJoe RoganEnglish comedy eventAugust 03Amazon PrimeThe Lord of the Rings: The Rings of Power S2English seriesJuly 29Amazon PrimeBatman: Caped CrusaderEnglish seriesAugust 01HotstarFuturama Season 12English seriesJuly 29HotstarNo Way OutKorean seriesJuly 31HotstarKingdom of the Planet of the ApesTelugu dubbed movieAugust 02Book My ShowThe Bike RidersEnglish movieAugust 02Jio CinemaDune Part 2Telugu dubbed movieAugust 01Jio CinemaGud ChadiHindi movieAugust 01Jio CinemaTarotEnglish filmAugust 03Jio CinemaDas June Ki RaatHindi seriesAugust 04Sony LivBrindaTelugu dubbed seriesAugust 02Apple TV+Women in BlueEnglish seriesJuly 31
    జూలై 29 , 2024
    <strong>One Hero Two Heroines: </strong><strong>ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌!</strong>
    One Hero Two Heroines: ఒక హీరో ఇద్దరు భామలు.. టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌!
    కొత్త ట్రెండ్‌లను సృష్టించడంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో కొత్త ట్రెండ్‌ మెుదలైనట్లు తెలుస్తోంది. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు కాన్సెప్ట్‌ను దర్శక నిర్మాతలు అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్‌ పాతదే. గతంలో ఈ తరహా చిత్రాలు తెలుగులో బోలెడు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఈ తరహా చిత్రాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ మళ్లీ మెుదలైంది. కొత్తగా రూపొందుతున్న చాలా వరకూ చిత్రాలు ఇద్దరు భామలు కాన్సెప్ట్‌తో రూపొందుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన హీరోయిన్లు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; గాయత్రి భరద్వాజ్‌ - ప్రిషా రాజేశ్‌ సింగ్‌ అల్లు శిరీష్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం 'బడ్డీ' (Buddy). శామ్ ఆంటోన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. అందులో ఒకరు గాయత్రి భరద్వాజ్‌ (Gayathri Bharadwaj) కాగా, మరొకరు ప్రిషా రాజేశ్‌ సింగ్‌ (Prisha Rajesh Singh). ఇప్పటికే విడుదలైన బడ్డీ ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు.&nbsp; మాల్వీ మల్హోత్ర - మన్నారా చోప్రా రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'తిరగబడరా సామి' (Thiragabadara saami). ఏ.ఎస్‌. రవి కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్‌ హీరోయిన్‌ మాల్వీ మల్హోత్ర (Malvi Malhotra) కాగా, మరో నటి మన్నారా చోప్రా (Mannara Chopra) ప్రత్యేక గీతంలో చేసింది. ఇదిలా ఉంటే రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో రాజ్‌ తరణ్‌ తనను మోసం చేసి మాల్వీ మల్హోత్రతో ప్రేమాయణం సాగించినట్లు అతడి ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదాల మధ్య వస్తోన్న ‘తిరగబడరా సామి’ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.&nbsp; తన్వీ ఆకాంక్ష - సీరత్‌ కపూర్‌ ఒకప్పటి స్టార్‌ డైరెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'ఉషా పరిణయం'. విజయ్‌ భాస్కర్‌ కుమారుడు శ్రీకమల్‌ ఇందులో హీరోగా నటించాడు. ఆగస్టు 2న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఇద్దరు భామలు మెరవనున్నారు. శ్రీకమల్‌కు జోడీగా తాన్వి ఆకాంక్ష (Thanvi Akansha) నటించగా ప్రముఖ నటి సీరత్‌ కపూర్‌ (Seerat Kapoor) ఇందులో ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. తాన్వి ఆకాంక్షకు ఇదే తొలి చిత్రం. సీరత్‌ కపూర్‌ గతంలో రన్‌ రాజా రన్‌, టైగర్‌, కొలంబస్‌, ఒక్క క్షణం, టచ్‌ చేసి చూడు తదితర చిత్రాల్లో నటించింది. మీనాక్షి చౌదరి - శ్రద్ధా శ్రీనాథ్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెకానిక్‌ రాకీ' (Mechanic Rocky). రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary), శ్రద్దా శ్రీనాథ్‌ (Shraddha Srinath) విశ్వక్‌కు జంటగా నటించనున్నారు. ట్రయాంగిల్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘కిలాడీ’, ‘హిట్ 2: సెకండ్‌ కేస్‌’, ‘గుంటూరు కారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అటు శ్రద్ధా శ్రీనాథ్‌ సైతం జెర్సీ, సైంధవ్‌ చిత్రాలకు తెలుగు ఆడియన్స్‌ను అలరించింది.&nbsp; తమన్నా -&nbsp; రాశి ఖన్నా అరణ్మణై సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'బాక్‌' (Baak) ఇటీవల తెలుగులో విడుదలైంది. సుందర్‌. సి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashii Khanna) ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరు కలిసి చేసిన ఓ సాంగ్‌ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హార్రర్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.&nbsp; తమన్నా - కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) గత చిత్రం ‘భోళా శంకర్‌’లోనూ ఇద్దరు హీరోయిన్లు నటించారు. మేహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా (Tamannaah Bhatia), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తి సురేష్‌ నటించారు. గతేడాది ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షుకలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
    జూలై 31 , 2024
    Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
    Kalki 2898 AD: ప్రభాస్‌ వీడియో రిలీజ్.. ఫ్యాన్స్ భయాలను దూరం చేసిన కల్కీ టీమ్‌!
    బాహుబలి ముందు వరకూ టాలీవుడ్‌ (Tollywood)కే పరిమితమైన ప్రభాస్‌.. ఆ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వరుసపెట్టి జాతీయ స్థాయి చిత్రాలు చేస్తున్న ప్రభాస్‌.. రీసెంట్‌గా సలార్‌ (Salaar)తో సాలిడ్‌ హిట్‌ను అందుకున్నాడు. ప్రభాస్‌ (Prabhas) కటౌట్‌కు తగ్గ సినిమా వచ్చిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి దృష్టి ప్రభాస్‌ అప్‌కమింగ్‌ చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’ (Kalki 2898 AD)పై పడింది. ఎవడే ‘సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.  ఆ భయం లేనట్లే! ప్రభాస్‌ ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు వార్తలు రావడంతో చిత్ర విడుదలపై అనుమానాలు రేకెత్తాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లింప్స్‌ వీడియో విడుదల చేసి అందరి కన్ఫ్యూజన్ దూరం చేసింది వైజయంతీ మూవీ మేకర్స్. కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వదిలింది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీట్‌కు ప్రభాస్ కాలు మూమెంట్ వేస్తూ ఉంటుంది. దీనికి టా టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు దాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు. https://twitter.com/i/status/1761054691193225602 బడ్జెట్‌ ఎంతంటే? సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్డెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ప్రభాస్‌ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే హాట్ బాంబ్ దిశా పటానీ కూడా కల్కిలో కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేస్తుంటే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.&nbsp; కల్కీలో నాని, తారక్‌! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) పరశురాముడిగా, నాని (Nani) కృపాచార్య పాత్రలో కాసేపు కనిపిస్తారని ఈ మధ్య వార్తలు జోరు అందుకున్నాయి. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా నటిస్తారని ఓ టాక్ ఉంది. ఇదే నిజమైతే ప్రభాస్‌ కల్కీ చిత్రంతో అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టార్‌ హీరోల పాత్రలపై చిత్ర యూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; 9 పార్ట్‌లుగా కల్కీ! ‘కల్కీ 2898 ఏడీ’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హీరో ప్రభాస్‌ తన ఫోకస్‌ మెుత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. అయితే ఈ సినిమాపై వచ్చిన లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కీ 2898 ఏడీ’ 9 భాగాలుగా రానున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథను ఒక పార్ట్‌తో చెప్పటం సాధ్యం కాదని, బలమైన కథ ఉండటంతో దానిని ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు కనీసం 9 పార్ట్స్‌గా తీయాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇదే నిజమైతే హాలీవుడ్‌ను మించిన క్రేజ్‌ టాలీవుడ్‌కు దక్కుతుందని విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.&nbsp; కల్కీ రిలీజయ్యే భాషలు ఇవే! ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9వ తేదీన గ్లోబల్ రేంజ్‌లో విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ గ్లింప్స్ గతేడాది సాని డిగో కామిక్ కాన్ ఈవెంట్‍ (San Diego Comic-Con 2023)లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. అప్పటినుంచి మూవీపై హాలీవుడ్‍‍లో కూడా క్రేజ్ ఉంది.&nbsp;
    ఫిబ్రవరి 28 , 2024
    <strong>Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?</strong>
    Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్‌, మీరా జాస్మిన్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం : హసిత్‌ గోలి సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ శంకరన్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌&nbsp; నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్‌ విడుదల తేదీ: 04-10-2024 వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్‌ (Meera Jasmine), దక్ష నగర్కర్‌ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్‌ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్‌ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్‌ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. రవి బాబు, సునీల్‌, గెటప్‌ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్‌ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్‌. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్‌ తక్కువే అయినా మంచి రిచ్‌ ఔట్‌పుట్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథశ్రీవిష్ణు నటనకామెడీ మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    REVIEW: బహ్మీ ‘పంచతంత్రం’ ఆంథాలజీ ఎలా ఉంది?
    REVIEW: బహ్మీ ‘పంచతంత్రం’ ఆంథాలజీ ఎలా ఉంది?
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 13 , 2023
    Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’ ఇప్పట్లో లేనట్లే!
    Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’ ఇప్పట్లో లేనట్లే!
    యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'పుష్ప 2' (Pushpa 2: The Rule) ఒకటి. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 'పుష్ప' (Pushpa : The Rise) సెన్సేషనల్‌ హిట్‌ కావడంతో 'పుష్ప 2' పై భారీగా బజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుండటంతో చిత్ర యూనిట్‌ మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. రెండో పాటను నెలాఖరులో రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’కు కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉండనున్నట్లు హీరో బన్నీ గతంలోనే హింట్‌ ఇచ్చాడు. తాజాగా థర్డ్‌ పార్ట్‌కు సంబంధించి ఓ బజ్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు.&nbsp; కొంత కాలం ఆగాల్సిందేె! ‘పుష్ప 3’ చిత్రానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. మూడో పార్ట్‌కి కొంత కాలం పాటు బ్రేక్ ఇవ్వాలని డైరెక్టర్‌ సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో సుకుమార్‌ రెండు చిత్రాలు.. బన్నీ రెండు చిత్రాలు (విడివిడిగా) చేయాలని భావిస్తున్నారట. అటు నిర్మాణ సంస్థ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ‘పుష్ప 2’ విడుదలైన రెండు, మూడేళ్ల వరకూ ‘పుష్ప 3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు ఉండవని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేశంలో పుష్ప మేనియా ఉన్నప్పుడే మూడో పార్ట్ కూడా పట్టాలెక్కిస్తే బాగుటుందని సూచిస్తున్నారు.&nbsp; రెండ్రోజుల్లో సెకండ్‌ సాంగ్‌ పుష్ప 2లోని రెండో పాటను మే 29న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తాజా ప్రోమోలో స్పష్టం చేశారు.&nbsp; ఆ రోజు ఉ.11.07 గం.లకు పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ హీరోయిన్‌ రష్మిక ఈ పాటపై అంచనాలు పెంచేసింది. ఇది బన్నీ, రష్మిక మధ్య సాగే మెలోడీ సాంగ్. గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ‘సామి.. సామి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో సెకండ్‌ సింగిల్‌ కూడా ఆ స్థాయిలోనే అలరిస్తుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. ఆ పాట కోసం బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి పుష్ప 2 సినిమా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఫహాద్‌ ఫాజిల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాట చిత్రీకరించడం బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అది కూడా ఐటెం సాంగ్ అని అంటున్నారు. ఈ సాంగ్‌ కోసం యానిమల్‌ బ్యూటీ తృప్తి దిమ్రి పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా తృప్తి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తుందని అంటున్నారు. పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సమంత చేసిన మ్యాజిక్‌ను తృప్తి రిపీట్‌ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బన్నీ, తృప్తి కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; ఆ రోజు ఫ్యాన్స్‌కు పూనకాలే! భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘పుష్ప 2’ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రత్యర్థిగా మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) నటిస్తున్నారు. అనసూయ, ధనుంజయ్, సునీల్, రావు రమేశ్‌, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ అన్నీ కూడా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు.&nbsp;
    మే 27 , 2024
    <strong>Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?</strong>
    Kala Bhairava: భారీ బడ్జెట్‌తో లారెన్స్ ఫిల్మ్.. చేతులు కాలక తప్పదా?
    కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగాను తన ప్రతిభ చూపించాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్‌’, ‘కాంచన’, ‘గంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చంద్రముఖి 2 వచ్చిన అతడు బాక్సాఫీస్‌ వద్ద దారణంగా విఫలయ్యాడు. దీంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ‘కాల భైరవ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; గంభీరమైన లుక్‌లో లారెన్స్‌! రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా ర‌మేష్ వ‌ర్మ (Ramesh Varma) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం ‘కాల భైరవ’ (Kala Bhairava). తెలుగులో ‘రాక్ష‌సుడు’ (Rakshasudu), రవితేజతో ‘ఖిలాడి’ (Khiladi) వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన రమేష్‌ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేయనుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేసిన లారెన్స్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రానుంది. ఇవాళ (సెప్టెంబర్ 29) లారెన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా సూపర్‌ హీరో ఫిల్మ్‌గా రానున్న ‘కాల భైరవ’ పోస్టర్‌ ఇంటెన్స్‌గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. https://twitter.com/DirRameshVarma/status/1851126864137363612 కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌! లారెన్స్‌ హీరోగా నటించనున్న ‘కాల భైరవ’ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి (A STUDIOS LLP), గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడ‌క్ష‌న్స్‌, హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఎంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్‌లో ఇదే హయేస్ట్‌ బడ్జెట్‌గా రాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నవంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలు కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ తెలియజేయనున్నారు.&nbsp; రిస్క్‌ చేస్తున్నారా? ‘కాల భైరవ’ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తారని వార్తలు రావడంపై ఫిల్మ్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లారెన్స్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మార్కెట్‌ పరంగా అతడు వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. అతడు నటించిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ను నమ్మి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే అవుతుందని సూచిస్తున్నారు. రిజల్ట్ ఏమాత్రం అనుకూలంగా లేకపోయిన తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో ఎంతైన ఖర్చు చేసేందుకు మేకర్స్‌ వెనుకాడటం లేదు.&nbsp; లారెన్స్‌ మంచి మనసు రాఘవ లారెన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్ధను స్థాపించిన ఆయన దాని ద్వారా పేదలు, రైతులకు పలుమార్లు సాయం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోమారు మంచి మనసు చాటుకున్నారు. పేద వితంతు మహిళలకు అండగా నిలుస్తూ కుట్టు మిషన్స్‌ను పంపిణీ చేశారు. వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా లారెన్స్ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. తారెన్స్‌ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. https://twitter.com/offl_Lawrence/status/1850890389521092953
    అక్టోబర్ 29 , 2024
    <strong>Allu Arjun: చిరంజీవికి ఎదురుపడలేకే బన్నీ రాలేదా?</strong>
    Allu Arjun: చిరంజీవికి ఎదురుపడలేకే బన్నీ రాలేదా?
    'పుష్ప' (Pushpa: The Rise) సినిమా సక్సెస్‌ తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. పుష్పరాజ్‌గా తన నటనతో మెస్మరైజ్‌ చేసిన బన్నీ, పాన్‌ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మరోమారు తెలుగు ఆడియన్స్‌తో పాటు దేశంలోని సినీ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక 'పుష్ప 2' షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావడంతో బన్నీ తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తమిళ స్టార్‌ డైరెక్టర్ అట్లీతో బన్నీ నెక్ట్స్‌ సినిమా ఉండొచ్చని ప్రస్తుతం అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-అట్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించి షాకింగ్‌ న్యూస్‌ బయటకొచ్చింది.&nbsp; అట్లీ ప్రాజెక్ట్‌ పక్కన పెట్టిన బన్నీ! కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్‌ సినిమా చేయబోతున్నట్లు కొద్ది నెలల క్రితం నుంచి ప్రచారం జరుగుతోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. 'పుష్ప 2' షూటింగ్‌ పూర్తయిన వెంటనే బన్నీ-అట్లీ ప్రాజెక్ట్‌ మెుదలవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ లాంటి బ్లాక్‌ బాస్టర్ తీసిన అట్లీతో బన్నీ సినిమా చేయనుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ మనసు మార్చుకోవడం వల్లే ఈ సినిమా అటకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు త్వరలోనే తేలనుంది.&nbsp; సల్మాన్‌తో అట్లీ సినిమా! బన్నీతో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారడంతో డైరెక్టర్‌ అట్లీ బాలీవుడ్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఓ మూవీ కూడా ఓకే అయిందని బీ టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో అట్లీ సినిమా ఫిక్స్‌ అయ్యిందంటూ బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అట్లీ చెప్పిన స్టోరీ సల్లూ భాయ్‌కి విపరీతంగా నచ్చిందని, అతడు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారని అంటున్నారు. షారుక్‌ ఖాన్‌తో వర్క్‌ చేసిన అనుభవం అట్లీకి ఉండటంతో ప్రాజెక్ట్‌ ఓకే చేసేందుకు పెద్దగా సమయం కూడా తీసుకోలేదని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సల్మాన్‌తో పాటు యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూడా నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మరో నాలుగు నెలల్లో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో అట్లీ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1830519679502459146 త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బన్నీ! అట్లీ ప్రాజెక్ట్‌ సైడ్ అయిపోవడంతో బన్నీ నెక్స్ట్‌ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే చేయనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కాన్సెప్ట్‌ను లాక్‌ చేసేందుకు బన్నీ-త్రివిక్రమ్ ఏడాదిన్నర సమయం తీసుకున్నట్లు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇటీవల వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నడూ చూడని సరికొత్త జానర్‌లో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు ఆయన హింట్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు సాంఘీక అంశాలపై సినిమాలు తీసిన త్రివిక్రమ్‌ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్‌ జానర్‌ని టచ్‌ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ అండ్‌ టీం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.&nbsp; బాలయ్య ఫంక్షన్‌కు డుమ్మా! మెగా-పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ ఒకే వేదికపై కనిపిస్తారని అంతా భావించారు. వారిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్‌ వార్స్‌ కూడా కాస్త తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం (సెప్టెంబర్‌ 1) జరిగిన ఈ వేడుకకు అనూహ్యంగా బన్నీ హాజరు కాలేదు. నిజానికి బాలకృష్ణకు అల్లు అరవింద్, బన్నీ చాలా క్లోజ్. ‘ఆహా’లో వస్తున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమాన్ని బాలయ్య రక్తికట్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే కార్యక్రమంలో బన్నీ-బాలయ్య సాన్నిహిత్యాన్ని కూడా అంతా చూశారు. అయినప్పటికీ బన్నీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్‌ వస్తున్నారన్న సమాచారం నేపథ్యంలోనే బన్నీ కావాలనే హాజరు కాలేదన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
    సెప్టెంబర్ 03 , 2024
    <strong>Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!</strong>
    Pushpa 3: కష్టకాలంలో బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. ‘పుష్ప 3’పై స్టన్నింగ్‌ అప్‌డేట్‌!
    అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa: The Rise) చిత్రం 2021లో విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత బన్నీ 'పుష్ప 2' (Pushpa 2: The Rule)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. అయితే ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మెగా ఫ్యామిలీ లక్ష్యంగా బన్నీ ఈ కామెంట్స్‌ చేశారంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అటు అల్లు అర్మీ సైతం వారికి దీటుగా సమాధానం ఇస్తూ కష్టపడుతోంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌కు హై ఓల్టేజ్‌ పవర్‌ ఇచ్చే అప్‌డేట్‌ బయటకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 3పై క్రేజీ అప్‌డేట్‌ 'పుష్ప' చిత్రంలో నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంపీ భూమిరెడ్డి పాత్రలో అయన కనిపించింది కొద్దిసేపే అయిన కథపై ఎంతో ఇంపాక్ట్‌ చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రావు రమేష్‌ 'పుష్ప 2'లో తన పాత్ర గురించి చెబుతూనే 'పుష్ప 3' క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. 'పుష్ప కథ అంతా చెప్పి ఒక్క సీన్‌ మాత్రమే షూట్‌ చేశారు. మిగిలిన డేట్స్‌ పుష్ప 2కి వాడుకుంటాం సర్‌ అన్నారు. నేనూ ఓకే అన్నాను. పార్ట్‌ 2లో మంచి పాత్రే పడింది. ఇప్పుడు పార్ట్‌ 3 కూడా అంటున్నారు. అందులోనూ నా పాత్ర ఉండొచ్చేమో' అంటూ రావు రమేష్‌ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. 'పుష్ప 3' పక్కాగా ఉంటుందని రావు రమేష్‌ చెప్పకనే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్‌ కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nasavnensasthaa/status/1828421405731697031? క్లైమాక్స్‌లో హింట్‌! ‘పుష్ప 3’ సంబంధించి ప్రస్తుతం మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే మూడో పార్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఉంటుందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. అంతేకాదు పార్ట్‌ 3కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను సైతం చూపిస్తారని సమాచారం. అయితే పుష్ప 3 వెంటనే పట్టాలెక్కకపోవచ్చని సమాచారం. బన్నీ-సుకుమార్‌ రెండు మూడేళ్ల గ్యాప్‌ తీసుకునే అవకాశముందని అంటున్నారు. అటు బన్నీ, సుకుమార్‌లకు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. సుకుమార్‌ ఇప్పటికే రామ్‌చరణ్‌తో ఓ సినిమాను అనౌన్స్‌ చేయగా, బన్నీ చేతిలో త్రివిక్రమ్‌, తమిళ స్టార్ డైరెక్టర్‌ అట్లీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 3' ఇప్పట్లో రాకపోవచ్చని సమాచారం.&nbsp; తొలి పార్ట్‌కి మించి..&nbsp; ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, ఫస్ట్‌, సెకండ్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా పుష్ప 2 గురించి మాట్లాడిన దర్శకుడు సుకుమార్‌ సినిమాపై హైప్‌ను పెంచే కామెంట్స్‌ చేశారు. మెుదటి భాగాన్ని మించి సెకండ్‌ పార్ట్‌ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పుష్ప 2లో సమాధానం దొరుకుతుందని సుకుమార్‌ తెలిపారు. మరీ ముఖ్యంగా సిండికేట్‌తో పుష్పరాజ్‌ ఆడే గేమ్‌, ఎమోషనల్‌ సీన్స్‌, పుష్ప రాజ్‌ vs భన్వర్‌సింగ్‌ షెకావత్‌ మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.&nbsp; ‘కేజీఎఫ్‌’ ఫార్మూలా! డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) ‘పుష్ప 3’ విషయంలో ‘కేజీఎఫ్‌’ (KGF Movie) ఫార్మూలాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఆపై వెంటనే సెకండ్‌ పార్ట్‌ను పట్టాలెక్కించి ‘కేజీఎఫ్‌ 2’ను కూడా రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌ 3’ గ్యాప్‌ ఇచ్చి ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. అటు యష్‌ సైతం ‘టాక్సిక్‌’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ‘పుష్ప 3’పై వస్తోన్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే సుకుమార్‌ - బన్నీ కూడా ప్రశాంత్‌ నీల్‌- యష్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ ఫినిష్‌ చేసి ఆ తర్వాత ‘పుష్ప 3’ని పట్టాలెక్కించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!</strong>
    Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్‌ కాంబోపై క్రేజీ అప్‌డేట్‌.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్‌ లోడింగ్‌!
    టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్‌ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్‌-రాజమౌళి, త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌, తారక్‌ - కొరటాల శివ, అల్లు అర్జున్‌-సుకుమార్‌, హరీష్‌ శంకర్‌-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్‌ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్‌ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్‌ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయకొచ్చాయి.&nbsp; ముహోర్తం ఫిక్స్‌! అల్లు అర్జున్‌, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్‌ చేసి ఆ తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.&nbsp; ఆ ఇద్దరిలో ఎవరు! బన్నీ-త్రివిక్రమ్‌ చిత్రానికి సంబంధించి హీరోయిన్‌ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ భామలు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), అలియా భట్‌ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్‌ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; హ్యాట్రిక్ హిట్స్‌ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’తో బిజీ బిజీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)తో 'పుష్ప 2' (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్‌ 6న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'పుష్ప' (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్‌ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
    ఆగస్టు 07 , 2024
    Allu Arjun - Atlee: తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో బన్నీ సినిమా షురూ.! ముహూర్తం ఎప్పుడంటే?
    Allu Arjun - Atlee: తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో బన్నీ సినిమా షురూ.! ముహూర్తం ఎప్పుడంటే?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన కెరీర్‌లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' (Pushpa: The Rise)తో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న బన్నీ.. ఆ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రానికి గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని సత్తా చాటాడు. టాలీవుడ్‌ నుంచి ఈ అవార్డు అందుకున్న మెుట్టమెుదటి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బన్నీ - అట్లీ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది.&nbsp; బన్నీ నెక్స్ట్‌ మూవీ అట్లీతోనే! ‘పుష్ప 2’ మూవీ తర్వాత అల్లు అర్జున్‌ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్ (Trivikram), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బోయపాటి శ్రీను (Boyapati Srinu), అట్లీ, సురేంద్ రెడ్డి (Surender Reddy) వంటి దర్శకులతో బన్నీ సినిమాలు చేయనున్నట్లు సమాచారం.&nbsp; అయితే ‘పుష్ప 2’ మూవీ తర్వాత ముందుగా డైరెక్టర్‌ అట్లీతో బన్నీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను కూడా అట్లీ.. పాన్‌ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారట. ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో ‘జవాన్‌’ (Jawan) తీసిన అట్లీ.. పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత బన్నీతో సినిమా తీయనుండటంతో ఇప్పటి నుంచే మూవీపై అంచనాలు మెుదలయ్యాయి. &nbsp; టీమ్‌తో అట్లీ చర్చలు.. వీడియో వైరల్‌! బన్నీ - అట్లీ కాంబోలో రానున్న చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మెుదలైనట్లు తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ అట్లీ (Director Atlee) తన టీమ్‌తో కలిసి డిస్కషన్‌ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆ డిస్కషన్‌ బన్నీ మూవీకి సంబంధించే జరిగిందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ బన్నీ-అట్లీ కాంబోలో మూవీ కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రానికి మించి ఈ సినిమా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1767966970966847605 ఆ హీరోయిన్‌గా హ్యాట్రిక్‌! అట్లీ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) పేరును పరిశీలిస్తున్నారట. బన్నీకి జోడీగా పూజా సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. పాత్రకు కూడా ఆమె బాగా సెట్‌ అవుతుందని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే బన్నీ - పూజా హెగ్డే కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), 'అలా వైకుంఠపురంలో' (Ala Vaikuntapurramuloo) వీరిద్దరు జంటగా చేశారు. వీరు పెయిర్‌ బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇక సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.&nbsp; అట్లీకి భారీ రెమ్యూనరేషన్‌! బన్నీతో మూవీ కోసం డైరెక్టర్‌ అట్లీ.. గట్టిగానే రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన రీసెంట్‌ మూవీ ‘జవాన్‌’ (Jawan) సూపర్‌ సక్సెస్‌ కావడంతో అల్లు అర్జున్‌ చిత్రం కోసం అట్లీ ఏకంగా రూ.60 కోట్లు కావాలన్నాడట. మేకర్స్‌ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దర్శకుడికే రూ.60 కోట్లు ఇస్తే బన్నీకి ఇక ఏ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ ముట్టనుందోనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp;
    మార్చి 14 , 2024
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2024
    Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
    Allu Arjun: ‘పుష్ప 3’పై బన్నీ సెన్సేషనల్‌ కామెంట్స్‌.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌!
    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌ను ఫుల్‌ జోష్‌లో నింపాయి.&nbsp; ‘పుష్ప 3’ కూడా ఉంటుందట! జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బెర్లిన్‌ యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. అక్కడ పుష్ప సినిమా గురించి కొత్త అప్‌డేట్‌ను అందించారు. పార్ట్‌-3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయని బన్నీ తెలిపారు. కథను కొనసాగించాలని అనుకుంటున్నామని, తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ ‘పుష్ప 2’లో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ల క్యారెక్టరైజేషన్‌, తెరపై వాటి ఎగ్జిక్యూషన్‌, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్‌అనిపిస్తాయని చెప్పారు. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని బన్నీ తన ప్రసంగాన్ని ముగించారు.&nbsp; ‘పుష్ప ముగింపు లేని కథ’ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న పుష్ప చిత్రంలో హీరోయిన్‌గా నటించి అద్భుత నటన కనబరిచింది. తనదైన యాస, భాషతో శ్రీవల్లి పాత్రలో జీవించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ‘పుష్ప 2’ చిత్రంపై స్పందించింది. పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’ అని అన్నారు. రష్మిక వ్యాఖ్యలను బట్టి చూసిన కూడా పార్ట్‌ 3పై సానుకూల సంకేతాలే వచ్చాయి. బన్నీ ప్లాన్స్‌ తలకిందులు! నిజానికి పుష్ప సినిమాను ఒక్క పార్ట్‌లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) భావించారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్స్ అన్ని తలకిందులు అయ్యాయి. పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు. కానీ పుష్ప 2 సడెన్‌గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్తే బన్నీ మరో ఏడాది కూడా సుకుమార్‌కే అంకితం కావాల్సి ఉంటుంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది.&nbsp;
    ఫిబ్రవరి 17 , 2024
    <strong>Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;</strong>
    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;
    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌! ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా? తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.  రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
    అక్టోబర్ 18 , 2024
    Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై  చిరు, బన్నీ, తారక్‌, మహేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్!
    Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరు, బన్నీ, తారక్‌, మహేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్!
    వెనక్కి తగ్గిన కొండా సురేఖ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR)ను విమర్శించే క్రమంలో సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya), నాగార్జున (Nagarjuna) పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్స్‌ కూడా కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరమంటూ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు.&nbsp;సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన స్వశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఎంతో ఆదర్శమని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. కోర్టుకు వెళ్లిన నాగార్జున తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను సినీ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) న్యాయస్థానం తలుపుతట్టాడు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి. అసలేం జరిగిందంటే? తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి.&nbsp; బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్‌ సమంతను వివాదంలోకి లాగారు. కేటీఆర్‌ మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్‌ పార్టీలు చేయడంతో పాటు సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్‌ అని అన్నారు. అంతటితో ఆగకుండా నాగ చైతన్య - సమంత విడాకులకు కారణం కేటీఆర్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేసినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు సమంతను నాగార్జున ఫోర్స్‌ చేయగా ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. దీంతో మాట వింటే విను.. లేదంటే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారని మంత్రి సురేఖ అన్నారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపడంతో నాగార్జున, అమలతో పాటు ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్‌ హీరోలు ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.&nbsp; https://twitter.com/i/status/1841433938297807337 https://twitter.com/FierceZen82/status/1841698670783189472 మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొండి: నాగార్జున మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. ‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా నాగార్జున పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/iamnagarjuna/status/1841446247242035233 యాక్టర్ల జీవితాలను హైడ్‌లైన్స్‌ కోసం వాడొద్దు: నాగ చైతన్య మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు ఆమోదనీయం కాదని నటుడు నాగచైతన్య వ్యాఖ్యానించారు. ‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య (Naga Chaitanya) పేర్కొన్నారు. https://twitter.com/chay_akkineni/status/1841529895031050723 నా విడాకుల్లో రాజకీయ ప్రమేయం లేదు: సమంత తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల (Konda Surekha Comments)పై సమంత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను (Samantha) వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అని సామ్‌ పేర్కొంది.&nbsp; ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు : చిరంజీవి టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు. https://twitter.com/KChiruTweets/status/1841684462767313169 చౌకబారు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేష్‌ బాబు నటుడు మహేష్‌ బాబు సైతం ఎక్స్‌ వేదికగా ఈ వివాదంపై స్పందించారు. 'మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకూ వాక్‌ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే సినీరంగాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నా. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి’ అని మహేష్‌బాబు పేర్కొన్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1841752300517290457 దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ: తారక్‌ వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని జూ. ఎన్టీఆర్‌ (NTR) మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు. ‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని రాసుకొచ్చారు. https://twitter.com/tarak9999/status/1841571689982730392 అసహ్యం వేస్తోంది: నాని యంగ్ హీరో నాని కూడా మంత్రి కొండ సురేఖకు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. ‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’ అని ఎక్స్‌లో నాని పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/NameisNani/status/1841541476083499197 రాజకీయ లబ్ది కోసమే ఈ వ్యాఖ్యలు: వెంకటేష్‌ సీనియర్‌ నటుడు వెంకటేష్‌ కూడా ఈ వివాదంపై స్పందించారు. ‘ఇతరుల వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడటం నన్నెంతో బాధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితం, కళల పట్ల పరస్పర గౌరవం, హార్డ్‌వర్క్‌, అంకితభావంతో మా సినీ పరిశ్రమ ఏర్పడింది. బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. రాజకీయాల్లోకి ఇతరుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇందులోభాగమైన వారి కుటుంబానికి బాధ మాత్రమే ఉంటుంది. అటువంటి ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం, సానుభూతి పాటించాలని కోరుతున్నా. మీ చర్యలు, మాటలు స్ఫూర్తి నింపేలా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు. https://twitter.com/VenkyMama/status/1841696634889240644 ఈ ప్రవర్తన చాలా అగౌరవం: అల్లు అర్జున్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/alluarjun/status/1841692652388970952
    అక్టోబర్ 03 , 2024
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్‌ లాక్‌.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే రన్‌ టైమ్‌ను లాక్‌ చేసినట్లు ఓ బజ్‌ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కల్కి రన్‌టైమ్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్‌ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్‌ (భైరవ), అమితాబ్‌ బచ్చన్‌ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్‌ వెహికల్‌) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్‌ కల్కి సినిమా ప్రమోషన్స్‌ భాగంగా హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్‌ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్‌ రేంజ్‌ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్‌ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. చెన్నై వీధుల్లో బుజ్జి సందడి కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్‌ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య డ్రైవ్‌ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్‌ కోరారు.&nbsp; https://twitter.com/i/status/1795776188931305863 31న స్పెషల్‌ వీడియో! కల్కి సినిమాలో బుజ్జి - భైరవ (ప్రభాస్‌) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేయబోతున్నారు. 'బుజ్జి అండ్‌ భైరవ' (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్‌ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్‌ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్‌ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే.&nbsp; https://twitter.com/i/status/1795100292314186235 తెలుగులో అత్యధిక రన్‌టైమ్‌ చిత్రాలు కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్‌ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4
    మే 30 , 2024
    Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్‌ మహేశ్‌ను సెలక్ట్‌ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!
    Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్‌ మహేశ్‌ను సెలక్ట్‌ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!
    2021లో వచ్చిన పుష్ప చిత్రం (Pushpa) ఏ మేర ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అన్న డైలాగ్‌ దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో వీడియోలు సైతం పోస్టు చేశారు. దీంతో ఈ సినిమా మరింతగా సినీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ క్రేజే అల్లుఅర్జున్‌ (Allu arjun)కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన&nbsp; ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో బన్నీ తన విశ్వరూపాన్ని చూపించాడు.&nbsp;నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌ ఇలా ప్రతీదానిలో తన మార్క్‌ చూపించి భారత సినీ ప్రేక్షకులను హోరెత్తించాడు. జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించిన పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.&nbsp; పదేళ్ల తర్వాత.. 2004లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయి వంటింది. సుకుమార్‌, అల్లుఅర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కూడా అదే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ యావరేజ్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ చేతులు కలిపారు. తాజాగా దీనికి జాతీయ అవార్డు రావడంతో ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న మహేశ్‌..! ‘పుష్ప’ కథను సుకుమార్‌ తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట. ఆయనకు కథ నచ్చి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చారట. కానీ, అప్పటికే ఒప్పుకొన్న ప్రాజెక్టుల వల్ల మహేష్‌ డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనప్పటికీ స్టోరీ లైన్‌ వేరని సుకుమార్‌ ఆ తర్వాత తెలిపారు. ఇదిలా ఉంటే పుష్పరాజ్‌ పాత్రకు బన్నీ ప్రాణం పోశాడు. ఈ పాత్ర కోసం రెండు, మూడు గంటలు కదలకుండా మేకప్‌ వేసుకున్నాడు. ఆ కృషే పుష్పకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మ్యాజిక్‌ రిపీట్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఈ ముగ్గురూ కలిస్తే ఆడియన్స్‌కు పూనకాలే అని ఇంతకు ముందు సినిమాల ద్వారా నిరూపతమైంది. ‘పుష్ప’ విషయంలోనూ అదే మ్యాజిక్‌ రిపీట్‌ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్‌-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు 6.2 బిలియన్‌కు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌ ఆల్బమ్‌గానూ రికార్డు సృష్టించాయి. ఈ పాటలకు గాను దేవిశ్రీ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోనున్నారు. కలెక్షన్ల సునామీ 2021 డిసెంబరు 17న ‘పుష్ప’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్‌) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్‌ రికార్డు సృష్టించాడు. ఓటీటీలోనూ ప్రభంజనమే ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్‌ప్రైమ్‌లో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్‌ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది.&nbsp; రికార్డుస్థాయిలో రీల్స్‌ సోషల్‌ మీడియాను సైతం ‘పుష్ప’ ఒక ఊపు ఊపింది. 10 మిలియన్లకు పైగా ఇన్‌స్టా రీల్స్‌ క్రియేట్‌ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, సన్నివేశాలు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. అవార్డ్స్‌లోనూ ‘తగ్గేదేలే’ గతంలో ఈ సినిమాకు ఏడు ఫిల్మ్‌ఫేర్‌లు, మరో ఏడు సైమా అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పుష్పరాజ్‌కు రావడం విశేషం. ఫేమస్‌ డైలాగ్స్‌ పుష్ప సినిమాను ప్రజలకు మరింత చేరువ చేసిన ‌అంశాల్లో డైలాగ్స్‌ ముందు వరుసలో ఉంటాయి.‘పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’ లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్‌ అయ్యాయి. పుష్పరాజ్‌ వచ్చేస్తున్నాడు! ‘పుష్ప’ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) రానుంది. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ‘పుష్ప ఎక్కడా..?’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సంబంధించి అల్లు అర్జున్‌, రష్మిక (Rashmika), ఫహాద్ ఫాజిల్‌ల ఫస్ట్‌లుక్‌లను రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
    ఆగస్టు 25 , 2023
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    SSMB29: మూడు పార్ట్స్‌గా రాజమౌళి-మహేష్ సినిమా… బడ్జెట్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
    RRR చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. RRR చిత్రంతో పాన్‌ వరల్డ్‌ డైరెక్టర్‌గా రాజమౌళి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తీయబోయే SSMB29 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ను జక్కన్న ఎలా చూపిస్తారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. మూడు భాగలుగా.. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే చిత్రం మూడు పార్ట్‌లుగా రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ సినిమా బడ్జెట్‌ రూ.1000 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఒకసారి సినిమా ప్రారంభమైతే అది రూ.1500 కోట్లకు కూడా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికన్‌ యాక్టర్‌ జెన్నా ఒర్టెగా (Jenna Ortega) రాజమౌళి సినిమాలో నటిస్తారని రూమర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే జెన్నాతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. https://twitter.com/arjuntn369/status/1645598037446918144 View this post on Instagram A post shared by Greg Williams (@gregwilliamsphotography) https://twitter.com/Theme43259475/status/1645457459971076097 హలీవుడ్ యాక్టర్లు మూడు పార్టులుగా తెరకెక్కబోయే రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌, బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం పనిచేస్తారని సమాచారం. SSMB 29, 30, 31 కూడా రాజమౌళి చేతిలోనే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రానున్న8 ఏళ్లలో ఈ పార్టులు రిలీజ్‌ అవుతాయని చర్చించుకుంటున్నారు. మూడు పార్టులకు 8 ఏళ్లు అంటే మహేష్‌ ఏం చేస్తారోనని ఇప్పటినుంచే ఆయన అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. అప్పటివరకు మరో సినిమాలో మహేష్‌ను చూడలేమా అంటూ దిగులు చెందుతున్నారు. అయితే రాజమౌళితో వరుసగా మూడు సినిమాలంటే మామూలు విషయం కాదని తమకు తామే ఫ్యాన్స్‌ సర్దిచెప్పుకుంటున్నారు.&nbsp; https://twitter.com/Harmindarboxoff/status/1645422058501980165?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1645422058501980165%7Ctwgr%5E409944ca03b55589956ba02ba037da35535fd255%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FHarmindarboxoff%2Fstatus%2F1645422058501980165 హీరోయిన్లు వీళ్లేనా? SSMB29లో మహేశ్‌ సరసన నటించబోయే హీరోయిన్ల గురించి కూడా నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ సినిమాలో మెుత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్‌. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, హాలీవుడ్‌ నటి సిడ్నీ స్వీనీ హీరోయిన్లుగా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా థర్డ్‌ హీరోయిన్‌గా సారా అలీఖాన్‌( Sara Alikhan) పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళికి సారా పేరును బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ సూచించారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌, కేరళ నటుడు పృథ్వీరాజ్‌ కూడా నటిస్తారని ఇటీవలే విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది.&nbsp; https://twitter.com/TLegoude/status/1645522645528776704?s=20 ప్రస్తుతం మహేష్‌ SSMB 28 షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూాజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్‌ శ్రీలీల కూడా సినిమాలో సందడి చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌ లోపు ఫినిష్‌ చేసేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. SSMB28 షూట్‌ పూర్తికాగానే రాజమౌళి సినిమాపై మహేష్‌ ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. అక్టోబర్‌ నుంచి రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.&nbsp; https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 13 , 2023
    <strong>Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;</strong>
    Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా?&nbsp;
    నటీనటులు : చంద్రహాస్‌, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీనివాస్‌ మెహత్‌ సంగీతం : అశ్విన్‌ హేమంత్‌ సినిమాటోగ్రఫీ : అస్కర్‌ అలీ ఎడిటిర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు: ప్రభాకర్‌, మలయజ ప్రభాకర్‌ విడుదల తేదీ: 04-10-2024 బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ (Prabhakar) కుమారుడు చంద్రహాస్‌ (Chandrahas) యాటిట్యూడ్‌ స్టార్‌ (Attitude Star)గా సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం 'రామ్‌ నగర్‌ బన్నీ' గురించి కూడా కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్‌ అంటూ చంద్రహాస్‌ చేసిన కామెంట్స్‌ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాటిట్యూడ్‌ స్టార్‌ హిట్‌ కొట్టాడా? హీరోగా ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీ (చంద్రహాస్‌)కి అమ్మాయిలు అంటే వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఏకంగా ముగ్గురితో (విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి)తో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తాడు. అనుకోని పరిస్థితులు ఎదురై పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి సైతం మాటిస్తాడు. ఆమె కంపెనీలోనే ఉద్యోగానికి కూడా చేరతాడు. అయితే ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని బన్నీ గ్రహిస్తాడు. తను నిజంగా ప్రేమిస్తోందని శైలు (విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే శైలుకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు బన్నీ ఏం చేశాడు? శైలు ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే నటుడు చంద్రహాస్‌ పలు వేదికలపై చూపించిన యాటిట్యూడే ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. నటుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ నటన పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా భయం, బెరుకు లేకుండా నటించాడు. డ్యాన్స్‌, పైట్స్‌లో అదరగొట్టాడు. రొమాంటిక్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శైలుగా చేసిన విస్మయ శ్రీ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్ర దారులు పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శ్రీనివాస్ మహత్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ‘రామ్‌ నగర్‌ బన్నీ’ని తెరకెక్కించారు. చంద్రహాస్ కోసమే ఈ కథను రాసినట్టుగా అనిపిస్తుంది. సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జోడించి ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా జులాయిగా తిరిగే సాధారణ కుర్రాడిగా చూపించి సక్సెస్‌ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్‌ను కలగలిపి పక్కా కమర్షియల్‌ మూవీగా తీర్చిదిద్దారు. సాగదీత సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌లో చంద్రహాస్‌ తడబాటు కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికొస్తే మూడు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ చంద్రహాస్‌ నటనకమర్షియల్‌ హంగులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుపేలవమైన ఎమోషనల్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024

    @2021 KTree