• TFIDB EN
  • కాలింగ్‌ సహస్ర
    ATelugu
    సహస్ర అనే అమ్మాయి వాడిన ఫోన్ నంబర్‌ను అజయ్ (సుధీర్) కొనుగోలు చేస్తాడు. అయితే సహస్ర కోసం ఆమె స్నేహితులు, బంధువులు అజయ్ ఫోన్‌కు కాల్ చేస్తుంటారు. ఇంతకీ సహస్ర ఏమైంది? అమ్మాయిలను వరుసగా చంపుతున్న కిల్లర్‌ ఎవరు? అతడ్ని హీరో ఎందుకు పట్టుకోవాలని అనుకుంటాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @srihari

    కాలింగ్‌ సహస్ర.. వన్‌టైమ్‌ వాచబుల్‌

    హీరో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌. ఓ సిమ్‌ కారణంగా హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది స్టోరీ. రొటిన్‌ స్టోరీ అయిన స్క్రీన్‌ ప...read more

    10 months ago

    తారాగణం
    సుడిగాలి సుధీర్
    లి సుధీర్
    డాలీషా
    స్పందన పల్లి
    శివ బాలాజీ
    సిబ్బంది
    అరుణ్ విక్కిరాలదర్శకుడు
    వెంకటేశ్వర్లు కాటూరినిర్మాత
    మోహిత్ రహ్మానియాక్సంగీతకారుడు
    గ్యారీ BH
    ఎడిటర్ర్
    కథనాలు
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం  సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.  సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)  షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.   అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా  ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.  సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’  (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా  ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.  ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
    మార్చి 14 , 2024
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌  రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.  అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.  విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
    డిసెంబర్ 11 , 2023
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు కాలింగ్ సహస్ర సుడిగాలి సుధీర్ న‌టించిన కాలింగ్ స‌హ‌స్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమాకు పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. సుడిగాలి సుధీర్‌ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా న‌టించింది.  హాయ్‌ నాన్న నానీ లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ థాకూర్‌ నటించింది.  కంజూరింగ్‌ కన్నప్పన్ గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్‌ కన్నప్పన్‌' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్‌, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు. #90s హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్‌ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
    జనవరి 05 , 2024
    <strong>Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?</strong>
    Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
    టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్‌ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్‌ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.&nbsp; నాగార్జునపై కేసు నమోదు సినీ హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారని, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్‌ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.&nbsp; రూ.100 కోట్ల స్థలం కబ్జా! నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.  https://twitter.com/jsuryareddy/status/1842478697938403807 కక్ష్య సాధింపు చర్యలేనా! తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్‌ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.&nbsp; తీవ్రంగా ఖండించిన టాలీవుడ్‌ అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్‌ టార్గెట్‌ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్‌ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్‌ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్‌ నటుడు వెంకటేష్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
    అక్టోబర్ 05 , 2024
    <strong>Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?&nbsp;</strong>
    Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు : ప్రిన్స్‌, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్‌, సి.వి.ఎల్‌. నరసింహా రావు, మణి చందన, కేదర్‌ శంకర్‌, మధుమణి, గుండు సుదర్శన్‌ తదితరులు దర్శకత్వం : శివ శేషు సంగీతం : జీవన్‌ బాబు సినిమాటోగ్రాఫర్‌ : రమణ జాగర్లమూడి ఎడిటర్‌ : విజయ్‌ వర్ధన్‌ కావురి నిర్మాత : టి. లీలా గౌతమ్‌ విడుదల తేదీ : 04-10-2024 ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'కలి' (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్‌, సి.వి.ఎల్‌. నరసింహా రావు, మణి చందన, కేదర్‌ శంకర్‌, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అ‍మ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరామ్‌ మంచి తనాన్ని క్యాష్‌ చేసుకొని ఆస్తి కొట్టేయాలని సొంత వారే కుట్రలు చేస్తుంటారు. సొంత తమ్ముడు, బాబాయ్‌ మోసం చేయడంతో శివరామ్‌ తీవ్రంగా నిరాశ చెందుతాడు. వచ్చే జన్మలోనైనా మనిషిలా పుట్టకూడదంటూ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ క్రమంలో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా సూసైడ్‌ చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్‌ బెల్‌ కొట్టి అతడ్ని రక్షిస్తాడు. కలి రాకతో శివరామ్‌ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? శివరామ్‌ జీవితానికి కలి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు. చాలా సీన్లలో డైలాగ్స్‌ లేనప్పటికీ ఎక్స్ ప్రెషన్స్‌తోనే మెప్పించాడు. సీన్లను రక్తికట్టిస్తూ నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్‌ అగస్త్య మెరిశాడు. స్టైలీష్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరే కథ మెుత్తాన్ని నడిపించారు. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్‌ ఉన్నంతలో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. మిగిలిన పాత్ర దారులు కూడా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే సమస్యలకు పరిష్కారం సూసైడ్‌ కాదని, ఆత్మహత్యే అసలైన ప్రాబ్లమ్‌ అని దర్శకుడు శివ శేష్‌ ఈ చిత్రం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సందేశాత్మక కథనే ఎంచుకున్నప్పటికీ కమర్షియల్‌ అంశాలకూ ప్రయారిటీ ఇచ్చారు. కథను ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలను మేళవిస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభంలో శివరామ్‌ పాత్ర, అతడి కుటుంబ నేపథ్యం, లవ్‌ ట్రాక్‌, కుటుంబ సభ్యుల మోసం చూపించారు. కలి అయిన అగస్త్య రాకతో కథలో వేగం పెంచారు డైరెక్టర్‌. శివరామ్‌ను అగస్త్య ప్రశ్నించిన తీరు, అతడు చేస్తున్న తప్పేంటో చెప్పే ప్రయత్నం మెప్పిస్తుంది. బతకాలనే ఆశని పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్యా మధ్య వచ్చే సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథను మరీ సాగదీసినట్లు అనిపించడం, సినిమా మెుత్తం రెండు పాత్రల చుట్టే తిరగడం, కామెడీ లేకపోవడం మైనస్‌లుగా చెప్పవచ్చు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే సంగీతం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవన్‌ బాబు అందించిన నేపథ్యం సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రిన్స్‌, అగస్త్య నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!</strong>
    Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!
    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్‌ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉంది? అందులో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ వాయిసే హైలేట్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక క‌థ చెప్పే స‌మ‌యం వ‌చ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల క‌థ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. పుట్టుక‌తోనే అన్న‌ద‌మ్ములు కాక‌పోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువ‌బ‌డిన టాకాల క‌థ ఇది అంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మ‌ధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడ‌ప్పుడు ఈ చ‌ల్ల‌ని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాప‌కాల్ని గుర్తుచేస్తున్న‌ట్లు అనిపిస్తుంది’ అంటూ మ‌హేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ‘మ‌నం ఒక్క‌టిగా పోరాడాలి, నేను ఉండ‌గా నీకు ఏం కాదు టాకా, భ‌య‌ప‌డ‌కు’ అంటూ మ‌హేష్ బాబు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివ‌ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు మహేష్‌. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.&nbsp; మ‌హేష్ వాయిస్ కోస‌మైనా సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129 ‘ఇది నాకెంతో ప్రత్యేకం’ ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్‌ చెప్పడంపై మహేష్‌ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తెలుగులో మహేష్‌.. హిందీలో షారుక్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్‌ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp; 'SSMB29'తో బిజీ బిజీ దర్శక ధీరుడు రాజ‌మౌళితో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఇందులో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకోసం లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 26 , 2024
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!&nbsp;
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.&nbsp; మార్టిన్ లూథర్&nbsp; కింగ్&nbsp; పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల&nbsp; ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న&nbsp; దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.&nbsp; బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    <strong>Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్‌! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్‌ రోల్‌?&nbsp;
    నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోక్షజ్ఞ కోసం స్పెషల్‌ పోస్ట్‌! ‘హనుమాన్‌’తో టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్‌ పెట్టిన ప్రశాంత్‌ వర్మ ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్‌ వర్మ పెట్టిన మరో పోస్ట్‌ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.&nbsp; ఒక ఫొటో షేర్‌ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368 https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471 ముహోర్తం ఫిక్స్‌..! మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్‌ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.&nbsp; శ్రీకృష్ణుడిగా బాలయ్య! మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్‌, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; హీరోయిన్‌ ఫిక్స్ అయ్యిందా? మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్‌. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్‌ జోడీ మరో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మోక్షజ్ఞ లుక్స్‌ వైరల్‌.. నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్‌ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్‌ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
    సెప్టెంబర్ 03 , 2024
    <strong>Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!</strong>
    Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్‌ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్‌ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సింహానికి మహేష్ డబ్బింగ్‌ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) డబ్బింగ్‌ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్‌ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1826142693149327810 డబ్బింగ్‌పై మహేష్‌ ఏమన్నారంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ యానిమేషన్‌ చిత్రంలో మెయిన్‌ లీడ్‌కు డబ్బింగ్‌ చెప్పడంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ను బిగ్‌ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హిందీలో డబ్బింగ్ ఎవరంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్‌ చేయడంపై షారుక్‌ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు.&nbsp; ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    Janhvi Kapoor Top 10 Saree Tips:  చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్‌ నుంచి ఇలా నేర్చుకోవచ్చు! 
    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. మోడ్రన్‌ డ్రెస్‌ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్‌ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రీసెంట్‌గా అనంత్‌ అంబాని - రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్‌ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్‌ నెక్లెస్‌ ధరించి అందరి దృషి ఆకర్షించింది.&nbsp; స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్‌ హెయిర్‌ స్టైల్‌.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది. చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్‌ కలర్‌ డిజైనర్‌ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.&nbsp;&nbsp; ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్‌ కలర్‌ శారీలో జాన్వీ కపూర్‌ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.&nbsp; గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు.&nbsp;పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.&nbsp; కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్‌ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.&nbsp; పెద్ద పెద్ద డిజైనర్‌ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్‌ స్పెషల్‌గా చెప్పవచ్చు.&nbsp; జాన్వీ కపూర్‌ మిస్మరైజింగ్‌ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.&nbsp; ఈ స్టైలిష్‌ రెడ్ శారీలో జాన్వీ కపూర్‌.. ఘాటైన రెడ్‌ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్‌ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్‌ నెవర్‌ బీఫోర్‌లా అనిపిస్తాయి.&nbsp; జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్‌ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌తో మ్యాచింగ్‌ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.&nbsp;
    మార్చి 06 , 2024
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్‌ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. గాండీవధారి అర్జున వరుణ్‌ తేజ్‌ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఏం చేశాడు? అన్నది సినిమా కథ. &nbsp; బెదురు లంక 2012 కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఏం చేస్తున్నావ్‌ విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ (Em chestunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్‌ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp; బాయ్స్‌ హాస్టల్‌ కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో&nbsp; ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్‌ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే! బ్రో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. బేబీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు. TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao&nbsp;MovieHindiJio CinemaAugust 25Invasion 2&nbsp;SeriesEnglishApple Tv PlusAugust 23 APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
    ఆగస్టు 21 , 2023
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్‌ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్‌ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్‌, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) మిల్లీ బాబీ బ్రౌన్‌… నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీసెస్‌లో నటించి చాలా ఫేమస్‌ అయింది. స్టేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌ల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె నటనకు గాను యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత గాడ్జిల్లా, ఎనోలా హోమ్స్‌, గాడ్జిల్లా Vs కాంగ్‌, ఎనోలా హోమ్స్‌-2 వంటి చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూనే పాటల ఆల్బమ్స్‌ చేస్తూ మిల్లీ వరల్డ్‌ ఫేమస్‌గా మారిపోయింది. ఈ తరం యువకుల కలల రాకుమారిగా కీర్తింప బడుతోంది. అటువంటి మిల్లీ వివాహ బందంలోకి అడుగు పెడుతుండంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లకే పెళ్లి ఏంటంటూ వ్యంగ్యంగా మీమ్స్‌ పెడుతున్నారు. మిల్లీ వయసులో తాము ఏం చేసేవారమో చెబుతూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; 19 వయసుకే మిల్లీ బాబీ బ్రౌన్‌ పెళ్లి చేసుకోబోతోంది. కానీ, 24 ఏళ్లు ఉన్న నేను ఏమీ సాధించకుండా ఉండిపోయానని అర్థం వచ్చేలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు అనన్య పాండేకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1645971994192785410 19 ఏళ్ల మిల్లీ పెళ్లికి సిద్ధమైతే.. 23 ఏళ్ల తాను "Ee Sala cup namde" #RCB అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/RakshanRak/status/1645857802722902017 19 ఏళ్ల వయసులో సమోసాలు తింటూ.. చట్నీ కోసం పోరాడేవాడినని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నవ్వులు పూయిస్తోంది.&nbsp; https://twitter.com/ayusharyan09/status/1645891008130084864 మిల్లీ బాబీ బ్రౌన్‌ కేవలం 19 ఏళ్లేనా అని ఆశ్యర్యపోతూ... సినిమా/వెబ్‌సిరీస్‌లో ఆమె చేసిన పాత్రలను ఓ నెటిజన్ పోస్టు చేశాడు.&nbsp; https://twitter.com/Mr_Stranger8/status/1645747169243332608 19 ఏళ్లకే మిల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతుంటే తాను మాత్రం సోల్‌మేట్‌ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని ఫీల్‌ అవుతూ నెటిజన్స్ పెట్టిన పోస్టులు తెగ ట్రెండింగ్ అవుతోంది. https://twitter.com/mukesh1yadav87/status/1646002836818501632 https://twitter.com/GunaPeram/status/1645842111236034560 https://twitter.com/i/status/1645915342185836544 మిల్లీ బాబీ బ్రౌన్‌కు 19 ఏళ్లు వచ్చేశాయా. చివరిసారిగా తనను ఓ చిన్నపిల్లగా చూసినట్లు గుర్తుందే అంటూ ఓ నెటిజన్‌ మిల్లీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.&nbsp; https://twitter.com/swaraj_gadge/status/1645848151117684738 19 ఏళ్ల మిల్లీ తెలివైనది, సక్సెస్‌ఫుల్‌, టాలెంటెడ్‌, ధనవంతురాలు, అందమైనది కూడా.. 20 ఏళ్ల నేను మాత్రం కాలేజీకి వెళ్లడానికి నిద్ర కూడా లేవలేకపోతున్నా అంటూ ఓ నెటిజన్ పెట్టిన వీడియో నవ్వులు పూయిస్తోంది.&nbsp; https://twitter.com/ggukksbae/status/1645829000483475457 19 ఏళ్లకే మిల్లీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే.. 24 ఏళ్ల తాను బెడ్‌పై కూర్చొని బనాన చిప్స్‌ తింటూ మిల్ #She is 19 ట్రెండ్‌ చూస్తున్నట్లు రియా చోప్రా అనే యువతి పోస్టు పెట్టింది.&nbsp; https://twitter.com/riachops/status/1645835897773125633
    ఏప్రిల్ 12 , 2023
    <strong>Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?</strong>
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    <strong>Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌ నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని విడుదల తేదీ : జులై 5, 2024 ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్‌' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు&nbsp; ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; గత సీజన్లలో ఏం జరిగిందంటే? మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే&nbsp; ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే&nbsp; ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు&nbsp;గత సీజన్లతో&nbsp; పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating :3/5&nbsp;
    జూలై 05 , 2024
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!
    Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత మెగా పవర్‌ స్టార్ ‘రామ్ చరణ్’ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ప్రముఖ నిర్మా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ రామ్‌చరణ్‌ పట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజైంది. ప్రస్తుతం ఈ విజువల్‌ ట్రీట్‌ను చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ఫస్ట్ సాంగ్ వచ్చేసింది? ‘గేమ్‌ ఛేంజర్‌’ మెుదటి సాంగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే సాంగ్‌ రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సాంగ్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ‘జరగండి’ (Jaragandi) లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘జ‌ర‌గండి జ‌ర‌గండి జ‌ర‌గండి.. జాబిల‌మ్మ జాకెటేసుకొచ్చేనండి’ అనే లిరిక్స్‌తో ఈ పాట మొద‌లైంది. మాస్‌ ట్యూన్స్‌, క్యాచీ లిరిక్స్‌తో జ‌ర‌గండి పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు ఆనంత‌ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. ద‌లేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆల‌పించారు. ప్రభుదేవ కొరియాగ్రఫీ చేశారు. https://www.youtube.com/watch?v=45vS1-xtnp8 పాట ఎలా ఉందంటే? ‘జరగండి’ సాంగ్‌ లిరికల్‌ వీడియోను గమనిస్తే ఇది పక్కా డైరెక్టర్‌ శంకర్‌ మార్క్‌తో రూపొందింది. ఆయన గత చిత్రాల్లోని పాటలు ఎలా అయితే ప్రత్యేకంగా అనిపించాయో ఈ సాంగ్‌ కూడా అలాగే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సాంగ్‌ అంతా కలర్‌ఫుల్‌గా.. పదుల సంఖ్యలో డ్యాన్సర్లతో నిండిపోయింది. ఇందులో రామ్‌చరణ్‌, కియారా అద్వానీ పెయిర్‌ చాలా క్యూట్‌గా ఉంది. ఇద్దరూ ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించారు. చరణ్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీసినట్లే కనిపిస్తోంది. ప్రభుదేవ మాస్టర్‌ ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫ్‌ చేస్తున్న దృశ్యాలను సైతం ఈ లిరికల్‌ వీడియోలో గమనించవచ్చు. ఓవరాల్‌గా ఈ సాంగ్‌ గేమ్‌ ఛేంజర్ మూవీలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉంది.&nbsp; ఆ విషయంలో ఫ్యాన్స్‌ నిరాశ! ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ కోసం మెగా ఫ్యాన్స్ గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ సాంగ్‌తో పాటు విడుదల తేదీని కూడా అనౌన్స్‌ చేస్తారని అంతా భావించారు. అయితే అలా ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ‘గేమ్‌ ఛేంజర్’ రిలీజ్‌ డేట్‌పై మేకర్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనీసం కమింగ్‌ సూన్‌ (Coming Soon) అని కూడా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    మార్చి 27 , 2024
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan).. టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్‌.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్‌ (Allu Arjun), శిరీష్‌ (Allu Sirish) డ్యాన్స్‌ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.&nbsp; ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్‌ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్‌ కోచింగ్‌ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం. రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.&nbsp; చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు. చరణ్‌ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌ తన బాల్యం నుంచి టీనేజ్‌ వరకూ తరచూ స్కూల్స్‌ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.&nbsp; నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.&nbsp; సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్‌ బైక్‌ రైడింగ్‌ చేస్తానంటే చిరు ఎంకరేజ్‌ చేసేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు. రామ్‌చరణ్‌ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.&nbsp; అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్‌ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.&nbsp;&nbsp; తన సినిమాలు చూశాక మెగాస్టార్‌ చిరంజీవి చేసే కామెంట్స్‌ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్‌ తెలిపాడు. డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.&nbsp; ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్‌ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్‌’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.&nbsp; ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.&nbsp; ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్‌ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.&nbsp; రామ్‌చరణ్‌.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్‌ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్‌ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    మార్చి 27 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.&nbsp; గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన&nbsp; తాజా చిత్రం&nbsp; ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter&nbsp;MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    Top 20 Ullu Actress: శృంగార వీడియోలకు ఈ భామలే కేరాఫ్‌.. ఈ ఉల్లు బ్యూటీల గురించి ఇవి తెలుసా?
    రసిక రాజులకు పసందైన వినోదాన్ని పంచే ఓటీటీ వేదిక ‘ఉల్లు’ (ULLU). ఇది ప్రత్యేకించి ఆడల్ట్‌ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేస్తూ ఉంటుంది. ఉల్లు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌.. ఉల్లు యాప్‌/వెబ్‌సైట్‌ ద్వారా వివిధ రకాల వినోద కంటెంట్‌ను అందిస్తుంది. ఇందులో శృంగారభరితమైన వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లను చూడవచ్చు. వీటిలో నటించే భామలకు బయట మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. స్టార్‌ హీరోయిన్ల స్టేటస్‌ను వారు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్‌-20 (Top 20 Ullu Actress) ఉల్లు నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; Payal Patil ఈ భామ ఉల్లు వెబ్‌ సిరీస్‌లలో 'రేణు' అనే పేరుతో చాలా ఫేమస్ అయ్యింది. 'సెక్రటరీ' అనే సిరీస్‌ ద్వారా కుర్రకారు హృదయాలను దోచుకుంది. కిట్టి పార్టీ, జిలేబీ బాయ్‌ వంటి సినిమాల్లోనూ ఆడల్ట్‌ పాత్రలు పోషించింది.&nbsp; Ritu Pandey ఈ బ్యూటీ కూడా శృంగార సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ చిత్రం 'సావ్‌ధాన్ ఏక్‌ అద్భుత్‌ కహానీ' (Savdhan Ek Adbhut Kahaani) చిత్రంతో చాలా ఫేమస్ అయ్యింది. Shyna Khatri షైనా ఖాత్రి... ఒకప్పుడు మోడల్‌గా చేసి ఈ ఉల్లు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కర్జాదార్‌, కామ్‌ పురుష్‌, పగ్లెట్‌ 2, పెహ్రెడార్ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించింది. తన ఎక్స్‌ప్రెషన్స్‌, సోయగాలతో వీక్షకులను మైమరిపించింది.&nbsp; Alpita Banika అల్పిత బనికా.. చుల్‌ (Chull) అనే ఉల్లు వెబ్‌సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సోషల్‌మీడియాలోనూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ చాలా ఫేమస్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెను ఫాల్లో అయ్యే వారి సంఖ్య చాలా పెద్దదే.&nbsp; Tanisha Kanojia ఆడల్ట్‌ సినిమా అనగానే గుర్తుకు వచ్చేవారిలో తనీష కచ్చితంగా ఉంటుంది. ఆమె ఉల్లుతో పాటు బూమ్‌ మూవీస్‌ (Boom Movies), కూకు (Kooku) వంటి వివిధ ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో సినిమాలు సిరీస్‌లు చేసింది. సుర్‌సురి-లీ (Sursuri-Li), చర్మ్‌సుఖ్‌ (Charamsukh) సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.&nbsp; Paromita Dey ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా చేసింది. 2015లో వచ్చిన హిందీ వెబ్‌సిరీస్‌ 'తుమ్‌సే నా హో పాయేగా' వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన అంద చందాలతో కుర్రకారును ఆకట్టుకుంది. Amika Shail అమికా షైల్‌.. హిందీలో ఫేమస్‌ ఆడల్ట్‌ నటి. చర్మ్‌సుఖ్‌ (ట్యూషన్‌ టీచర్‌), గండీ బాత్‌ 5, రుఖ్‌సాతి సిరీస్‌లతో పాటు దివ్య ద్రిష్టి, బాల్‌ వీర్‌ వంటి టెలివిజన్‌ షోలలో నటించింది. ఆడల్ట్‌ కంటెంట్‌ ప్రియులు ఈమెను స్టార్‌ హీరోయిన్‌ కంటే ఎక్కువగా ఆరాధిస్తారు.&nbsp; Bharti Jha భోజ్‌పూరి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన భర్తీ జా.. అడల్ట్‌ వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లి మంచి పేరు సంపాదించింది. పలు ఆడల్ట్ ఓటీటీ వేదికల్లో కనిపించి కుర్రకారును ఆకర్షిస్తోంది.&nbsp; Nehal Vadoliya ఈ బ్యూటీ ఉల్లు (ULLU) లోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. గుజరాతి, మరాఠి, హిందీ చిత్రాలతో పాటు టెలివిజన్‌ ఇండస్ట్రీలోనూ నేహాల్‌ నటించింది. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు వలపు వల వేస్తుంటుంది నేహాల్.&nbsp; Jinnie Jazz ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) ఉల్లు వెబ్‌సిరీస్‌లలో బోల్డ్‌ &amp; గ్లామరస్‌ పాత్రలకు పెట్టింది పేరు. 'చరమ్‌సుఖ్‌ ఆతే కి చక్కి', రిష్వాలా, లవ్‌ గురు వంటి సిరీస్‌లతో జెన్నీ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; Rekha Mona Sarkar ఈ భామ 'జస్సీ కింగ్‌ ద ఫకర్‌ గోల్డెన్‌ హోల్‌' అనే కూకు వెబ్‌ సిరీస్‌తో పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభానికి ముందు మోడల్‌గా చేసిన రేఖ.. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు పొందింది. Aliya Naaz ఉల్లు వేదికపై నటించే ఆడల్ట్ తారల్లో ‘అలియా నాజ్‌’ ఒకరు. బహుజన్, జఘన్య ఉపాయ్, చుడివాలా, టక్‌ వంటి శృంగార సిరీస్‌లలో అందాలు ఆరబోసి అందర్ని ఫిదా చేసింది. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది.&nbsp; Sneha Paul స్నేహా పాల్‌ కూడా తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. చరమ్‌సుఖ్‌ చావల్‌ హౌస్‌ 1, 2, 3.., లాల్‌ లిహఫ్‌ తదితర ఆడల్ట్‌ ఉల్లు సిరీస్‌లలో ఆమె నటించింది. మత్తెక్కించే అందాలతో వీక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.&nbsp; Rajsi Verma రాజ్సీ వర్మా (Top 20 Ullu Actress).. ఉల్లు వెబ్‌సిరీస్‌లలో నటించడం ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. చరమ్‌సుఖ్‌, శుభరాత్రి, పలంగ్‌టోడ్‌ సిరీస్‌లలో తన అందచందాలను ఆరబోసింది. Muskaan Agarwal ఈ భామ.. పలంగ్‌టోడ్‌ (బెకాబో దిల్‌), ఆతే కి చక్కి, రూపాాయ 500, చరమ్‌సుఖ్‌ (లైవ్‌ స్ట్రీమింగ్‌), జాల్‌, చమ్‌సుఖ్‌ (తౌబా తౌబా), సుల్తాన్‌ వంటి ఆడల్ట్‌ సిరీస్‌లలో నటించి ఉర్రూతలూగించింది. ఈ అందచందాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.&nbsp; Ayushi Jaiswal ఈ బ్యూటీ సిరీస్‌ను చూసిన వారు తిరిగి మళ్లీ మళ్లీ చూస్తుంటారని అంటారు. ఆయూషి జైస్వాల్‌.. ఉల్లుతో పాటు ర్యాబిట్‌ మూవీస్‌, మ్యాక్స్‌ ప్లేయర్‌ వంటి ఆడల్ట్‌ ఓటీటీ వేదికల్లో నటిస్తోంది. చరమ్‌సుఖ్‌ కమర్ కి నాప్‌, హాట్‌స్పాట్‌ (ఫాంటసీ కాల్‌), పలంగ్‌ టోడ్‌ దమడ్‌ జీ వంటి శృంగార సిరీస్‌ల ద్వారా ఆయుషీ ఫేమస్‌ అయ్యింది.&nbsp; Ruks Khandagale ఈ బ్యూటీ ప్రధానంగా ఉల్లు వేదికగా వచ్చే ఆడల్ట్‌ సిరీస్‌లలోనే కనిపిస్తుంది. ఉల్లుతో పాటు అడపాదడపా హాట్‌షాట్స్‌, బెలూన్స్‌, హాట్‌మస్తీ వేదికల్లోనూ నటిస్తుంది. పలంగ్‌టోడ్‌ డబుల్‌ ధమాకా, సామ్నే వాలి ఖిడ్కీ, టక్‌, డొరహా పార్ట్ 1,2 సిరీస్‌లో ఆమె అందాలను చూడవచ్చు.&nbsp; Noor Malabika ఈ బ్యూటీ (Top 20 Ullu Actress) కూడా ఉల్లు సిరీస్‌ల ద్వారానే అందరి దృష్టిలో పడింది. ఉల్లు పాపులర్‌ వెబ్‌సిరీస్‌లు.. పలాంగ్‌టోడ్‌ సిస్కియాన్‌, చరమ్‌సుఖ్‌ తపన్‌, వాక్‌మ్యాన్‌, టిఖీ ఛట్నీలలో ఆమె నటించింది.&nbsp; Hiral Radadiya ఈ బ్యూటీ అందాలను చూడాలంటే ఉల్లు (Top 20 Ullu Actress) వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. ఉల్లుతో పాటు కూకు, ఫ్లిజ్‌, హాట్‌మస్తీ వంటి ఆడల్ట్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ బ్యూటీ వీడియోలు ఉన్నాయి.&nbsp; Priya Gamre కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించిన ఈ సుందరి.. 2009లో '1 నవ్రా 3 బాయ్‌కా' ఆడల్ట్‌ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కౌన్సిలర్ పార్ట్‌ 1, 2.. గాచీ పార్ట్‌ 1, 2.. మట్కీ వంటి సిరీస్‌లతో తన సొగసులను చూపించింది.
    ఫిబ్రవరి 19 , 2024
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే!
    69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు. https://twitter.com/i/status/1714234869629558869 జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714263091029107087 పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు. https://twitter.com/bharatidubey/status/1714279017837474231 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714256005079704005 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్నారు. https://twitter.com/i/status/1714253448215228480 ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు. https://twitter.com/i/status/1714255504153993419 టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు. https://twitter.com/i/status/1714253832241422699 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్‌ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం. https://twitter.com/i/status/1714266870713647487 టాలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714230631885062219 జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714224832316080266 ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1714218637362659515 జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్‌, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం. https://twitter.com/alluarjun/status/1714300482934751553
    అక్టోబర్ 18 , 2023
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
    జనవరి 17 , 2024

    @2021 KTree