రివ్యూస్
How was the movie?
@srihari
కాలింగ్ సహస్ర.. వన్‌టైమ్ వాచబుల్
హీరో సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. ఓ సిమ్ కారణంగా హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది స్టోరీ. రొటిన్ స్టోరీ అయిన స్క్రీన్ ప...read more
11 months ago
తారాగణం
సుడిగాలి సుధీర్
లి సుధీర్ డాలీషా
స్పందన పల్లి
శివ బాలాజీ
సిబ్బంది
అరుణ్ విక్కిరాలదర్శకుడు
వెంకటేశ్వర్లు కాటూరినిర్మాత
మోహిత్ రహ్మానియాక్సంగీతకారుడు
గ్యారీ BH
ఎడిటర్ర్కథనాలు
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్ 27 - డిసెంబర్ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
యానిమల్
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్ రెడ్డి’ తీసిన సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉండటంతో ‘యానిమల్’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.
అథర్వ
కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాలింగ్ సహస్ర
జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో ఈ మూవీ రూపొందింది.
ఉపేంద్ర గాడి అడ్డా
ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విక్రమ్ రాథోడ్
విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
దూత
యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
డిసెంబర్ 11 , 2023
This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే!
కొత్త సంవత్సరం మెుదలైంది. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలో చెప్పుకోతగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఓటీటీపైన పడింది. ఇందుకు తగ్గట్లే ఈ వారం బోలెడన్ని కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
కాలింగ్ సహస్ర
సుడిగాలి సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా (జనవరి 1 నుంచి) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అరుణ్ విక్కిరాల డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. సుడిగాలి సుధీర్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీలో డాలీషా ఫిమేల్ లీడ్‌గా నటించింది.
హాయ్ నాన్న
నానీ లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 4నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ మరీ ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో ముందే స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్ థాకూర్ నటించింది.
కంజూరింగ్ కన్నప్పన్
గతేడాది కోలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కంజూరింగ్ కన్నప్పన్' ఈ వారమే ఓటీటీలోకి విడుదల రాబోతోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 5న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఈ చిత్రంలో రెజీనా, నాసర్, శరణ్య ముఖ్య పాత్రల్లో నటించారు.
#90s
హీరో శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతి కుటుంబం చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, భావోద్వేగాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్‌లోని సరదాలు, ఆనందాలు, సంఘర్షణలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని పేర్కొన్నారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateBitconMovieEnglishNetflixJan 01Fool me onceSeriesEnglishNetflixJan 01You Are What You Eat: A Twin ExperimentSeriesEnglishNetflixJan 01Delicious in DungeonSeriesEnglish/JapaneseNetflixJan 04The brothers son SeriesEnglishNetflixJan 04Good griefMovieEnglishNetflixJan 05IshuraSeriesEnglish/JapaneseDisney HotStarJan 03Perilloor Premier LeagueSeriesMalayalamDisney HotStarJan 05Marry my husbandSeriesEnglish/KoreanAmazon PrimeJan 01LOL: Last One Laughing Quebec 2SeriesEnglishAmazon PrimeJan 05TejasMovieHindiZee5Jan 05Meg 2: The trenchMovieTelugu/EnglishJio CinemaJan 03Cubicles Season 3MovieHindiSonyLIVJan 05
జనవరి 05 , 2024
Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.
‘హనుమాన్’గా తొలుత యష్
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా?
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
అక్టోబర్ 30 , 2024
Jai Hanuman: హనుమాన్‌గా కాంతారా హీరో రిషబ్ శెట్టి?
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్' యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
‘హనుమాన్’గా కాంతార నటుడు!
‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్' ఎలా ఉండనుందో హింట్ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. ఇటీవల కేజీఎఫ్ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం కాంతారా ఫేమ్ రిషబ్‌శెట్టితో ప్రశాంత్ వర్మ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హనుమంతుడి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించినట్లు సమాచారం. రిషబ్ శెట్టి సైతం ఈ ప్రాజెక్ట్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ఇండస్ట్రీ లీక్.. అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.
స్టార్ల పేర్ల వెనక స్ట్రాటజీ ఉందా?
‘జై హనుమాన్’ను ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఇందులోని హనుమాన్ పాత్రకు పలానా స్టార్ హీరోను ఫైనల్ చేసినట్లు కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, కేజీఎఫ్ ఫేమ్ యష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి ఫైనల్ అయ్యాడంటూ కథనాలు మెుదలయ్యాయి. మరి అతడైనా ఖరారు అవుతాడో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనివెనక పెద్ద ప్రమోషన్ స్టంట్ ఉన్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ తగ్గిపోకుండా చిత్ర బృందంమే ఇలా లీక్స్ ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ‘జై హనుమాన్’ అంశం ట్రెండింగ్‌లోకి వచ్చి ప్రజల్లో హైప్ తగ్గకుండా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
‘కాంతార’తో పాన్ ఇండియా క్రేజ్
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్ వర్మ పోస్టు పెట్టారు.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
అక్టోబర్ 18 , 2024
Mahavatar Narsimha Hombale Films: నరసింహ స్వామి అవతారంతో బిగ్ ప్రాజెక్ట్.. ఇక రికార్డులన్నీ గల్లంతేనా!
‘కేజీయఫ్’ (KGF), ‘కాంతార’ (Kantara), ‘సలార్’ (Salaar) తదితర చిత్రాలను ప్రేక్షకులను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (hombale films) మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ను (Mahavatar Narsimha) ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో..
‘మహావతార్: నరసింహ’ (Mahavatar Narsimha) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయనుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది.
https://twitter.com/hombalefilms/status/1857730656639303928
మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్స్
హోంబలే ఫిల్మ్స్ విషయానికొస్తే ఇప్పటికే విజయవంతమైన ‘కాంతార’, ‘సలార్’ ప్రపంచాలను కొనసాగిస్తూ కొత్త చిత్రాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో ‘కాంతార: చాప్టర్1’ (kantara chapter 1) ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తొలి భాగానికి ప్రీక్వెల్‌గా భారీ హంగులతో ఇది రూపుదిద్దుకుంటోంది. మరోవైపు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ‘సలార్: శౌర్యంగ పర్వం’ (salaar 2: shouryanga parvam) షూటింగ్ ఇటీవలే మొదలైంది. దీంతో పాటు, ప్రభాస్‌తో మరో రెండు సినిమాలను చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది.
https://twitter.com/hombalefilms/status/1854795004155478062
మూడేళ్లు.. మూడు చిత్రాలు
ప్రభాస్‌తో మరో రెండు సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ ఆ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ సినిమాలకు వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ఎప్పటికీ సినిమాటిక్ అనుభూతిని సృష్టించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభాస్‌తో సినిమాలు అనౌన్స్ చేసినట్లు చెప్పింది. ‘ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్’ అని పేర్కొంది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు చెప్పింది. ‘సలార్ 2’ మినహాయించి మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
నవంబర్ 16 , 2024
Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?
నటీనటులు : ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి, గుండు సుదర్శన్ తదితరులు
దర్శకత్వం : శివ శేషు
సంగీతం : జీవన్ బాబు
సినిమాటోగ్రాఫర్ : రమణ జాగర్లమూడి
ఎడిటర్ : విజయ్ వర్ధన్ కావురి
నిర్మాత : టి. లీలా గౌతమ్
విడుదల తేదీ : 04-10-2024
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'కలి' (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్, సి.వి.ఎల్. నరసింహా రావు, మణి చందన, కేదర్ శంకర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.
కథేంటి
శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరామ్ మంచి తనాన్ని క్యాష్ చేసుకొని ఆస్తి కొట్టేయాలని సొంత వారే కుట్రలు చేస్తుంటారు. సొంత తమ్ముడు, బాబాయ్ మోసం చేయడంతో శివరామ్ తీవ్రంగా నిరాశ చెందుతాడు. వచ్చే జన్మలోనైనా మనిషిలా పుట్టకూడదంటూ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ క్రమంలో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా సూసైడ్ చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్ బెల్ కొట్టి అతడ్ని రక్షిస్తాడు. కలి రాకతో శివరామ్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? శివరామ్ జీవితానికి కలి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు. చాలా సీన్లలో డైలాగ్స్ లేనప్పటికీ ఎక్స్ ప్రెషన్స్‌తోనే మెప్పించాడు. సీన్లను రక్తికట్టిస్తూ నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్ అగస్త్య మెరిశాడు. స్టైలీష్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరే కథ మెుత్తాన్ని నడిపించారు. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్ ఉన్నంతలో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. మిగిలిన పాత్ర దారులు కూడా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
సమస్యలకు పరిష్కారం సూసైడ్ కాదని, ఆత్మహత్యే అసలైన ప్రాబ్లమ్ అని దర్శకుడు శివ శేష్ ఈ చిత్రం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సందేశాత్మక కథనే ఎంచుకున్నప్పటికీ కమర్షియల్ అంశాలకూ ప్రయారిటీ ఇచ్చారు. కథను ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభంలో శివరామ్ పాత్ర, అతడి కుటుంబ నేపథ్యం, లవ్ ట్రాక్, కుటుంబ సభ్యుల మోసం చూపించారు. కలి అయిన అగస్త్య రాకతో కథలో వేగం పెంచారు డైరెక్టర్. శివరామ్‌ను అగస్త్య ప్రశ్నించిన తీరు, అతడు చేస్తున్న తప్పేంటో చెప్పే ప్రయత్నం మెప్పిస్తుంది. బతకాలనే ఆశని పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్, నరేష్ అగస్త్యా మధ్య వచ్చే సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథను మరీ సాగదీసినట్లు అనిపించడం, సినిమా మెుత్తం రెండు పాత్రల చుట్టే తిరగడం, కామెడీ లేకపోవడం మైనస్లుగా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంగీతం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవన్ బాబు అందించిన నేపథ్యం సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథప్రిన్స్, అగస్త్య నటనసంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలుఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 04 , 2024
Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్ పంచ్ డైలాగ్స్.. డబ్బింగ్ ఇరగదీశాడు భయ్యా!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉంది? అందులో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
మహేష్ వాయిసే హైలేట్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ అంటూ ట్రైలర్ ప్రారంభమైంది. పుట్టుకతోనే అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడిన టాకాల కథ ఇది అంటూ కథలోకి వెళ్లారు. ఆ తర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తుంది’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘మనం ఒక్కటిగా పోరాడాలి, నేను ఉండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు’ అంటూ మహేష్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివరలో తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు మహేష్. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మహేష్ వాయిస్ కోసమైనా సినిమాను థియేటర్లలో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129
‘ఇది నాకెంతో ప్రత్యేకం’
ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్ తన ఎక్స్ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తెలుగులో మహేష్.. హిందీలో షారుక్
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్ కింగ్ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
'SSMB29'తో బిజీ బిజీ
దర్శక ధీరుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ మూవీని మహేష్ చేయబోతున్నాడు. ఇందులో మహేష్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందుకోసం లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ మేకోవర్ అవుతున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు, రాజమౌళి మూవీ ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నట్లు సమాచారం.
ఆగస్టు 26 , 2024
Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?
ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ హీరోయన్లతో సమానంగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పటిలా హెయిర్‌ను వెనక్కి కాకుండా ముందుకు వదిలేసి బేబీ కటింగ్ స్టైల్లో మేకోవర్ అయ్యింది.
ఆ లుక్‌తోనే బ్యూటీఫుల్ శారీలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రంగమ్మత్త మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు.
అయితే రొటీన్‌గా ఒకే లుక్‌లో కనిపించి అనసూయ కాస్త బోర్ ఫీలై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఛేంజ్ ఔట్ కోసం ఈ విధంగా రెడీ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.
జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా బుల్లితెరకు తొలిసారి అనసూయ పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది.
2012 - 2022 మధ్య బుల్లితెర యాంకర్‌గా కొనసాగిన అనసూయ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది.
యాంకర్ కాకముందు ప్రముఖ వార్త ఛానల్లో అనసూయ (Anasuya Bharadwaj) న్యూస్ రీడర్‌గా చేసింది. నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తన యాక్టింగ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meeku Maathrame Cheptha), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది.
గతేడాది సెప్టెంబర్‌లో పెదకాపు1 (Pedda Kapu-1) అనే సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత విమానం (Vimanam) అనే మరో మూవీలోనూ అనసూయ నటించింది. ఇందులో తెలంగాణ మాండలికం ఓన్ చేసుకొని మరి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్‌గా ‘రజాకార్’ (Razakar) అనే తెలంగాణ నేపథ్యమున్న చిత్రంలోనూ అనసూయ మెరిసింది. ఇందులో పోచమ్మ పాత్రలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించి ఆకట్టుకుంది.
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ నటిస్తోంది.
గతంలో ‘పుష్ప’లో ఈ పాత్రనే ఆమె పోషించగా మంచి పేరు వచ్చింది. దీంతో పుష్ప 2లో తన రోల్‌పై అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పుష్ప 2తో పాటు తమిళంలో ' ఫ్లాష్‌బాక్' (Flashback), ఉల్ఫ్ (Wolf) అనే రెండు చిత్రాల్లో అనసూయ నటిస్తోంది. ఈ మూవీ కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అక్టోబర్ 09 , 2024
Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?
టాలీవుడ్ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునపై కేసు నమోదు
సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పోలీసులకు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. అనంతరం తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల స్థలం కబ్జా!
నాగార్జునపై చేసిన ఫిర్యాదులో మరిన్ని అంశాలను కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేవనెత్తారు. శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు. రూ.వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి రూ.కోట్లు గడించిన అక్కినేని నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
https://twitter.com/jsuryareddy/status/1842478697938403807
కక్ష్య సాధింపు చర్యలేనా!
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - సమంత విడాకుల అంశాన్ని కేటీఆర్‌తో ముడిపెడుతూ దారుణంగా మాట్లాడారు. దీనిని అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అటు నాగార్జున ఓ అడుగు ముందుకువేసి రూ.100 కోట్ల మేర పరువునష్టం దావా మంత్రిపై వేశారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగార్జునపై క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కేసులో నాగార్జున ఎలా వ్యూహాత్మంగా ముందుకు వెళ్తారో చూడాలి.
తీవ్రంగా ఖండించిన టాలీవుడ్
అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహేష్ బాబు ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అటు తారక్ సైతం వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ స్పందిస్తూ మంత్రి ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సీనియర్ నటుడు వెంకటేష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అక్టోబర్ 05 , 2024
Martin Luther King Movie Review: లాజిక్ కాస్త మిస్ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు!
హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్ రోల్‌లో మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం.
కథ
ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి. మార్టిన్ లూథర్ కింగ్ పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు.
ఇక సెకండాఫ్ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది.
ఎవరెలా చేశారంటే?
మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనిపించింది.
టెక్నికల్‌గా..
నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
బలాలు
సంపూర్ణేష్ బాబు నటన
ఫస్టాఫ్ కామెడీ
బలహీనతలు
సెకండాఫ్ సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్ కన్‌క్లూజన్
చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు.
రేటింగ్: 3/5
అక్టోబర్ 27 , 2023
Mokshagna Teja: మోక్షజ్ఞ తేజ సినిమాకు ముహోర్తం ఫిక్స్! శ్రీకృష్ణుడి గెటప్‌లో బాలయ్య గెస్ట్ రోల్?
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి మూడో తరం వారసుడ్ని వెండితెరపై చూసుకునేందుకు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ తెరంగేట్రానికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్‌డేట్స్ బయటకొచ్చాయి. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్ల తమ ఎదురుచూపులకు సరైన ఫలితం దక్కబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోక్షజ్ఞ కోసం స్పెషల్ పోస్ట్!
‘హనుమాన్’తో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆకర్షించారు. మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రాన్ని అతడే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రశాంత్ నీల్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ ‘నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్ ఈ పోస్ట్ పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ పెట్టిన మరో పోస్ట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఫొటో షేర్ చేస్తూ ‘ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా’ అని రాశారు. ఇది కూడా మోక్షజ్ఞ సినిమా కోసం పెట్టిన పోస్టు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1830839179716239368
https://twitter.com/PrasanthVarma/status/1830473835046461471
ముహోర్తం ఫిక్స్..!
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారైనట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు నందమూరి బాలకృష్ణ నిర్ణయించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మెుదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం మరో మూడు రోజుల్లో వస్తుండటంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
శ్రీకృష్ణుడిగా బాలయ్య!
మోక్షజ్ఞ సినిమాను మైథలాజికల్, సోషియో ఫాంటసీ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఇందులో శ్రీకృష్ణుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని, చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని సమాచారం. మరోవైపు అర్జునుడి పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా?
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్‌గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే మోక్షజ్ఞ-ఖుషీ కపూర్ జోడీ మరో ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ లుక్స్ వైరల్..
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైన వేళ ఇటీవల ఆయన ఫొటోలు కూడా వైరలయ్యాయి. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మోక్షజ్ఞ అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఓ ఫొటోషూట్‌లో పాల్గొనగా, అందులోని కొన్ని లుక్స్ బయటికొచ్చాయి. అప్పటినుంచి సామాజిక మాధ్యమాల్లో అవి తెగ వైరల్ అవుతోన్నాయి. దీంతో త్వరలోనే ఈ నందమూరి వారసుడు తెరపై సందడి చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
సెప్టెంబర్ 03 , 2024
Mahesh Babu Voice To Mufasa: మహేష్ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్ సింహాం ‘ముఫాసా’..!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సింహానికి మహేష్ డబ్బింగ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
https://twitter.com/taran_adarsh/status/1826142693149327810
డబ్బింగ్‌పై మహేష్ ఏమన్నారంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ యానిమేషన్ చిత్రంలో మెయిన్ లీడ్‌కు డబ్బింగ్ చెప్పడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను బిగ్ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
హిందీలో డబ్బింగ్ ఎవరంటే?
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్ ఖాన్, సింబా పాత్రకు షారుక్ పెద్ద తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) వాయిస్ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారుక్ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=oelsxH0orHI
మహేష్‌కు డబ్బింగ్ కొత్త కాదు.. కానీ!
ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా', తారక్ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో మహేష్ వాయిస్ ఇచ్చారు. అయితే మహేష్ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటారో చూడాలి.
ఆగస్టు 21 , 2024
Janhvi Kapoor Top 10 Saree Tips: చీర ఎలా కట్టుకోవాలో జాన్వీ కపూర్ నుంచి ఇలా నేర్చుకోవచ్చు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. మోడ్రన్ డ్రెస్ వేసినా, చీర కట్టినా ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీ కట్టాలంటే తన తర్వాతే ఎవరైనా అన్న రీతిలో ఆమె దగ దగ మెరిసిపోతుంది. ఇవాళ జాన్వీ 27వ పుట్టిన రోజు సందర్భంగా.. శారీలో ఆమె దిగిన టాప్ 10 ఫొటోలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రీసెంట్‌గా అనంత్ అంబాని - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సందర్భంగా జాన్వీ.. ఎలాంటి హంగులకు పోకుండా ట్రెడిషనల్‌గా చీర కట్టింది. కమర్‌బంద్ మోడల్ డిజైనర్ శారీకి మ్యాచింగ్ నెక్లెస్ ధరించి అందరి దృషి ఆకర్షించింది.
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు జగా అందమైన రాణి పింక్ షిఫాన్ చీరను ధరించి ఇటీవల జాన్వీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఫ్రెష్‌లుక్‌తో అక్కడి వారిని మైమరిచింది. ఈ శారీలో జాన్వీ కర్లింగ్ హెయిర్ స్టైల్.. మెడలో ధరించిన ఆకుపచ్చని హారం ఆకట్టుకుంది.
చీరలోనూ సొగసులను ఆరబోయచ్చని ఈ ఫొటో ద్వారా జాన్వీ నిరూపించింది. వైలెట్ కలర్ డిజైనర్ బ్రౌజ్‌తో హాఫ్‌శారీలో కనిపించి ఒంపుసొంపులను ప్రదర్శించింది. మెడలో ఎటువంటి హారం ధరించకుండా తన సొగసులనే ఆభరణంగా చేసుకొని కుర్రకారుకి మతి పోగొట్టింది.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపుదిద్దిన ఈ పింక్ కలర్ శారీలో జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్ కలర్ బ్లౌజ్‌తో బంగారు అంచు కలిగిన ఈ చీర.. ఆమె అందాలను రెట్టింపు చేసింది. ఈ చీరపై ఆమె ధరించిన నెక్లెస్, ఇయర్ రింగ్స్ చూడటానికి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా స్టైలిష్‌గా అనిపిస్తాయి.
గతేడాది వినాయక చవితి సందర్భంగా జాన్వీ కట్టిన శారీని ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. పసుపు - బంగారపు రంగులు కలిగిన శారీలో జాన్వీ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ముఖాన బొట్టుతో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. కొప్పున పూలు సైతం పెట్టుకొని జాన్వీ ఈ శారీలో కనిపించడం విశేషం.
కార్సెట్ తరహా బ్లౌజ్, డైమండ్ నెక్‌లీస్‌తో కూడిన తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన బ్రౌన్ చీరలో ఓసారి జాన్వీ మెరిసిపోయింది. ఈ లేటెస్ట్ శారీ డిజైన్‌లో జాన్వీ తన ఎద అందాలతో ఫ్యాన్స్‌ను కవ్వించింది.
పెద్ద పెద్ద డిజైనర్ బ్లౌజ్‌లు, శారీలే తన అందాన్ని పెంచవని.. సాధారణ చీరలోనూ ఎంతో గ్లామర్‌గా కనిపిస్తానని ఈ ఫోటో ద్వారా జాన్వీ మరోమారు రుజువు చేసింది. తెల్లని పూల ప్రింట్‌తో రూపొందిన ఆర్జాన్జా శారీలో జాన్వీ పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. ఈ శారీని సమ్మర్ స్పెషల్‌గా చెప్పవచ్చు.
జాన్వీ కపూర్ మిస్మరైజింగ్ శారీ అందాల్లో ఇదీ ఒకటి. ఇందులో జాన్వీ.. ఆకుపచ్చని శారీలో రామచిలుకలా అందంగా మెరిసిపోయింది. తన అందంతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ముఖ్యంగా చెవులకు ధరించిన ఎర్రటి చమ్కీలు ఈ శారీలో ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
ఈ స్టైలిష్ రెడ్ శారీలో జాన్వీ కపూర్.. ఘాటైన రెడ్ మిర్చిలా మెరిసిపోయింది. బోసిపోయిన మెడ దిగువన ఎద అందాలను ప్రదర్శించింది. డిజైనర్ అంచుతో వచ్చిన ఈ చీరలో జాన్వీ లుక్స్ నెవర్ బీఫోర్‌లా అనిపిస్తాయి.
జాన్వీ ధరించిన ఈ చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆకుపచ్చని బంధాని మోడల్ శారీని చేతితో తయారు చేయడం విశేషం. బ్లాక్ కలర్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ హారం ధరించి జాన్వీ కుందనపు బొమ్మలా కనిపించింది.
మార్చి 06 , 2024
Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
కింగ్ ఆఫ్ కొత్త
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’ (King of Kotha). ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
గాండీవధారి అర్జున
వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). సాక్షి వైద్య కథానాయిక. BVSN ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న (శుక్రవారం) ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడు? అన్నది సినిమా కథ.
బెదురు లంక 2012
కార్తికేయ, నేహా శెట్టి జంటగా చేసిన చిత్రం ‘బెదురు లంక 2012’ (Beduru Lanka 2012). ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించాడు. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది’ అని చిత్ర బృందం తెలిపింది.
ఏం చేస్తున్నావ్
విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని జంటగా భరత్ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్’ (Em chestunnav). నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ కూడ ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్ సీన్లను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రతీ 10 నిమిషాలకు కథ మలుపు తిరుగుతుంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బాయ్స్ హాస్టల్
కన్నడలో సూపర్ హిట్ అయిన ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంస్థలు తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాయి. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు కాగా.. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 26న విడుదలవుతోంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లివే!
బ్రో
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)- సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.
బేబీ
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు.
TitleCategoryLanguagePlatformRelease DateRagnarokWeb SeriesEnglishNetflixAugust 24Killer book clubMovieEnglishNetflixAugust 25LiftMovieEnglishNetflixAugust 25Aakhri sachWeb SeriesHindiDisney+HotstarAugust 25Somewhere queensMovieEnglishBook My ShowAugust 21Lakhan leela bhargavWeb SeriesHindiJio CinemaAugust 21Bajao MovieHindiJio CinemaAugust 25Invasion 2 SeriesEnglishApple Tv PlusAugust 23
APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
ఆగస్టు 21 , 2023
Millie Bobby Brown: 19 ఏళ్లకే నటికి నిశ్చితార్థం.. బోరున విలపిస్తున్న నెటిజన్లు!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యువనటి మిల్లీ బాబీ బ్రౌన్ 19 ఏళ్ల వయసులో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. జాక్ బొంగియోవితో తనకు మంగళవారం నిశ్చితార్థం కూడా జరిగినట్లు మిల్లీనే స్వయంగా ప్రకటించింది. మూడేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ పిక్చర్‌ను షేర్ చేసింది. అయితే జాక్, మిల్లీ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు అదే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ పెళ్లి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown)
మిల్లీ బాబీ బ్రౌన్… నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీసెస్‌లో నటించి చాలా ఫేమస్ అయింది. స్టేంజర్ థింగ్స్ సిరీస్‌ల ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె నటనకు గాను యాక్టర్స్ గిల్డ్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత గాడ్జిల్లా, ఎనోలా హోమ్స్, గాడ్జిల్లా Vs కాంగ్, ఎనోలా హోమ్స్-2 వంటి చిత్రాల ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలు వెబ్‌సిరీస్‌లో నటిస్తూనే పాటల ఆల్బమ్స్ చేస్తూ మిల్లీ వరల్డ్ ఫేమస్‌గా మారిపోయింది. ఈ తరం యువకుల కలల రాకుమారిగా కీర్తింప బడుతోంది. అటువంటి మిల్లీ వివాహ బందంలోకి అడుగు పెడుతుండంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లకే పెళ్లి ఏంటంటూ వ్యంగ్యంగా మీమ్స్ పెడుతున్నారు. మిల్లీ వయసులో తాము ఏం చేసేవారమో చెబుతూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
19 వయసుకే మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోబోతోంది. కానీ, 24 ఏళ్లు ఉన్న నేను ఏమీ సాధించకుండా ఉండిపోయానని అర్థం వచ్చేలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు అనన్య పాండేకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1645971994192785410
19 ఏళ్ల మిల్లీ పెళ్లికి సిద్ధమైతే.. 23 ఏళ్ల తాను "Ee Sala cup namde" #RCB అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నానని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/RakshanRak/status/1645857802722902017
19 ఏళ్ల వయసులో సమోసాలు తింటూ.. చట్నీ కోసం పోరాడేవాడినని ఓ నెటిజన్ పెట్టిన పోస్టు నవ్వులు పూయిస్తోంది.
https://twitter.com/ayusharyan09/status/1645891008130084864
మిల్లీ బాబీ బ్రౌన్ కేవలం 19 ఏళ్లేనా అని ఆశ్యర్యపోతూ... సినిమా/వెబ్‌సిరీస్‌లో ఆమె చేసిన పాత్రలను ఓ నెటిజన్ పోస్టు చేశాడు.
https://twitter.com/Mr_Stranger8/status/1645747169243332608
19 ఏళ్లకే మిల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతుంటే తాను మాత్రం సోల్‌మేట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నానని ఫీల్ అవుతూ నెటిజన్స్ పెట్టిన పోస్టులు తెగ ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/mukesh1yadav87/status/1646002836818501632
https://twitter.com/GunaPeram/status/1645842111236034560
https://twitter.com/i/status/1645915342185836544
మిల్లీ బాబీ బ్రౌన్‌కు 19 ఏళ్లు వచ్చేశాయా. చివరిసారిగా తనను ఓ చిన్నపిల్లగా చూసినట్లు గుర్తుందే అంటూ ఓ నెటిజన్ మిల్లీ చిన్నప్పటి ఫోటోను షేర్ చేశాడు.
https://twitter.com/swaraj_gadge/status/1645848151117684738
19 ఏళ్ల మిల్లీ తెలివైనది, సక్సెస్‌ఫుల్, టాలెంటెడ్, ధనవంతురాలు, అందమైనది కూడా.. 20 ఏళ్ల నేను మాత్రం కాలేజీకి వెళ్లడానికి నిద్ర కూడా లేవలేకపోతున్నా అంటూ ఓ నెటిజన్ పెట్టిన వీడియో నవ్వులు పూయిస్తోంది.
https://twitter.com/ggukksbae/status/1645829000483475457
19 ఏళ్లకే మిల్లీ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే.. 24 ఏళ్ల తాను బెడ్‌పై కూర్చొని బనాన చిప్స్ తింటూ మిల్ #She is 19 ట్రెండ్ చూస్తున్నట్లు రియా చోప్రా అనే యువతి పోస్టు పెట్టింది.
https://twitter.com/riachops/status/1645835897773125633
ఏప్రిల్ 12 , 2023
Kantara Chapter 1 Teaser: టీజర్లోనే స్టోరీ చెప్పేసిన రిషబ్ శెట్టి.. ఈ డీటైల్స్ గమనించారా?
కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1). 2022 విడుదలైన కాంతారా సినిమాకు ఇది ప్రీక్వేల్. కాంతారా చిత్రం పాపాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్‌హిట్ చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార: చాప్టర్ 1’ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. 2022లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక కాంతారా చాప్టర్ 1 టీజర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. టీజర్లో ప్రతి డీటేయిల్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. "వెలుగులోకి వస్తే అంతా కంటికి కనపడుతుంది.. కానీ అది నిప్పు కాదు దర్శనం.. గతంలో జరిగింది, భవిష్యత్‌లో జరగబోయేది అంతా చూపిస్తుంది.. కనబడుతుందా.. ఆ వెలుగు అంటూ" టీజర్ ముందుకు సాగింది. టీజర్లో రిషబ్ శెట్టి చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని భయంకరంగా కనిపించాడు. ఒంటిపై నెత్తురు కారుతుంటే.. చాలా ఆవేశంగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. కంటిలో అగ్ని గోలాలు కనిపించే లుక్ భయానంగా ఉంది. ఇక BGM టీజర్‌ను బాగా ఎలివేట్ చేసింది.(Kantara Chapter 1 Dialogue) వీణ మ్యూజిక్‌ను అంజనీష్ కుమార్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. టీజర్ ఏ ఇలా ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీజర్ అంచనాలకు మించి ఉందని ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న (Kantara Chapter 1 Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ప్రశాంత్ వర్మ డైరక్షన్లో వస్తున్న జై హనుమాన్ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా చాప్టర్ 1 పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్లో ఆయన పాల్గొననున్నారు.
https://www.youtube.com/watch?v=MrzUp7_-YSE&t=82s
నవంబర్ 18 , 2024
Mahesh Babu Trolls: మీమర్స్ స్టఫ్‌గా మారిపోయిన మహేష్ బాబు.. ఒక్క వీడియోపై ఇన్ని ట్రోల్సా!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు మహేష్‌తో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, అఖిల్, వెంకటేష్ హాజరయ్యారు. సెలబ్రిటీలంతా కలిసిన దిగిన ఓ ఫొటో ఇటీవల బయటకు రాగా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్నిఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ ట్రోలింగ్ (Mahesh Babu Trolls)కు గురవుతోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రోవర్ట్ (Mahesh Babu Trolls) అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. తన మూవీ ఈవెంట్ అయినా కూడా కొద్ది మాటలతోనే ముగిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహేష్ ఎంత ఇంట్రోవర్టో మరోమారు బయటపడింది. ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరూ బర్త్‌డే బాయ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కనే కొంచెం గ్యాప్‌తో సైలెంట్‌గా నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కన ఫొటోకి ఫోజు ఇచ్చినట్లు నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహేష్‌ను చూసి నవ్వుకుంటున్నారు. మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1856609040123441371
మీమర్స్ స్టఫ్‌గా మహేష్..!
అయితే మహేష్ బాబు తాజా వీడియోను ఇంట్రోవర్ట్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఇంట్రోవర్ట్స్ కమ్యూనిటీలోకి స్వాగతం అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పలు రకాలుగా ఎడిటింగ్ చేసి మీమ్స్ స్టఫ్ (Mahesh Babu Trolls)గా వాడుకుంటున్నారు. ‘మహేష్ బాబు.. సేమ్ టూ సేమ్ నాలాగే’ అంటూ ఇంట్రోవర్ట్స్ పోస్టులు పెడుతున్నారు. తాము కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటామని తెలియజేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. 'నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు' అంటూ సమర్థించుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం తమ హీరోకు అలవాటని వెనకేసుకొస్తున్నారు.
https://twitter.com/Sampath01266745/status/1856890678778773683
https://twitter.com/ursbhargav_1/status/1856738857888473213
https://twitter.com/Memuchalabusy_2/status/1856590047505723771
ధనుష్ కోసం మహేష్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కుబేర'. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘కుబేర’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ గ్లింప్ల్ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
https://twitter.com/SVCLLP/status/1856645705110298753
మహేష్ లేటెస్ట్ లుక్ అదుర్స్!
బిజినెస్ మ్యాన్ బర్త్‌డే ఫంక్షన్లో మహేష్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో వచ్చిన పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ ఇలాగే కనిపిస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174
హైదరాబాద్‌లో వారణాసి సెట్!
రాజమౌళి - మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 14 , 2024
Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. విజేత ఎవరంటే?
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్ హీరో’, ‘జిగ్రా’ మూవీస్ దసరా కానుకగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ హీరోగా టి. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్ రూ.200 కోట్ల క్లబ్లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.
https://twitter.com/Filmy_Track/status/1845727131768082555
విశ్వం (Viswam)
మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం.
https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627
https://twitter.com/Colliderreview/status/1845720361499083121
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.
జిగ్రా (Jigra)
బాలీవుడ్ బ్యూటీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్ 11న తెలుగు, హిందీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్ విద్యా కా వోహ్ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ 14 , 2024
Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్ సల్మాన్.. ‘టైర్-2’ హీరోలకు గట్టి పోటీ?
ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్ తన ఫోకస్ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ రామ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, నితిన్ వంటి టైర్ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
తెలుగు రైజింగ్ హీరోగా దుల్కర్!
యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
డబ్బింగ్ చిత్రాలతోనూ గుర్తింపు
డైరెక్ట్ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్’, ‘సెల్యూట్’, ‘కింగ్ ఆఫ్ కొత్త’ వంటి యాక్షన్ చిత్రాలు సైతం మాస్ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్ మారిపోయాడు.
కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు
తెలుగులోనూ స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో దుల్కర్ నటిస్తున్నాడు. అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.
https://twitter.com/vamsikaka/status/1817427815249133673
https://twitter.com/imwpolitikos/status/1833028992456089818
https://twitter.com/Chrissuccess/status/1832279694118400071
‘టైర్ 2’ హీరోలకు గట్టిపోటీ!
టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ దూకుడు చూస్తుంటే టైర్ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, నితిన్, అడవి శేష్ తదితర హీరోలకు దుల్కర్ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్ అయినా అతడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్ లుక్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024