UATelugu
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ధనుష్
అనలీసన్ "ఈసా" / కెప్టెన్ మిల్లర్శివ రాజ్ కుమార్
సెంగన్నన్ అలీసందీప్ కిషన్
కెప్టెన్ రఫిక్ప్రియాంక మోహన్
వెల్మతిఅదితి బాలన్
శకుంతలఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్
ఆండ్రూ వాండీజాన్ కొక్కెన్
యువరాజునివేదిత సతీష్
తానేనువినోద్ కిషన్
అలెక్స్ ఓనెల్
రిలే, గవర్నర్ కుమారుడుఎలాంగో కుమారవేల్
కన్నయపింటు పాండుకాళీ
వీజీ చంద్రశేఖర్
ఈసా మరియు సెంగన్నన్ తల్లికాళి వెంకట్
కుమస్తా కనగసబాయి"మెర్కు తోడార్చి మలై" ఆంటోనీ
జయప్రకాష్
రాజాధిపతి, రాజుబోస్ వెంకట్
అబ్దుల్ లీసెంబట్టా / స్టీఫెన్
అశ్విన్ కె. కుమార్
అరుణోదయన్అయ్యావు
స్వయం సిద్ధ
సుమేష్ మూర్
సిబ్బంది
అరుణ్ మాథేశ్వరన్దర్శకుడు
సెంధిల్ త్యాగరాజన్నిర్మాత
అర్జున్ త్యాగరాజన్నిర్మాత
జివి ప్రకాష్ కుమార్
సంగీతకారుడునాగూరన్ రామచంద్రన్
ఎడిటర్ర్కథనాలు
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
D50: స్టార్లతో ధనుష్ ఫిల్మ్.. రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ‘రాయన్’
హీరో ధనుష్ 50వ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. బడా తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనుంది.
సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్, ధనుష్ సోదరీమణులు, అపర్ణ బాలమురళి, కాళిదాస్ జయరాం, దసరా విజయన్, తదితరులు ఇందులో నటిస్తున్నారు.
ఈ సినిమాకు ‘రాయన్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
ఫ్యామిలీ చుట్టూ తిరిగే రివేంజ్ గ్యాంగ్‌స్టర్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు.
ఇందులో ధనుష్, సందీప్ కిషన్ అన్నదమ్ములుగా నటించనున్నారు. సందీప్‌కు జోడీగా అపర్ణను తీసుకున్నారు.
ధనుష్‌కి హీరోయిన్‌ని ఇంకా ఎంపిక చేయలేదు. ఈ సినిమా కోసం ధనుష్ తన జుట్టును కత్తిరించుకున్నాడట.
చెన్నై వీధుల్లో జులై 1 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఓ గ్లింప్స్‌ని రిలీజ్ చేయనున్నారు.
తొలుత ఏకధాటిగా 90 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాను ధనుషే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే 1 నిమిషం ఉన్న వీడియో గ్లింప్స్‌ని రెడీ చేశారట.
కెప్టెన్ మిల్లర్ సినిమా కోసం ధనుష్ గడ్డం, జుట్టు పెంచాడు. ఇప్పుడు రాయన్ కోసం బొత్తిగా తగ్గించినట్లు తెలుస్తోంది.
జూన్ 13 , 2023
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
ఫైటర్
హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్’ (Fighter). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్ కనిపించనున్నాడు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.
మలైకోటై వాలిబన్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్.. ‘మలైకోటై వాలిబన్’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లిజో జోస్ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓటమెరుగని రెజ్లర్ వాలిబన్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెప్టెన్ మిల్లర్
ధనుష్ (Dhanush) కథానాయకుడిగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయిక. సందీప్‌కిషన్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
అయలాన్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అయలాన్’ (Ayalaan) చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమాను జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్ నటన, కామెడీ, గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి తెలుగులోనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
105 మినిట్స్
ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్’. ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika) ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఈ వారం ఓటీటీలో విడుదయ్యే చిత్రాలు
యానిమల్
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్ (Animal) చిత్రం.. ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివి (3 గం.ల 29 ని.)తో ప్రసారం కానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateQueer EyeSeriesEnglishNetflixJan 24Six NationsSeriesEnglishNetflixJan 24AnimalMovieTelugu/HindiNetflixJan 26Bad Land HuntersMovieKorean/EnglishNetflixJan 26HustlersMovieHindiAmazon PrimeJan 24PanchayatSeriesHindiAmazon PrimeJan 26Sam BahadurMovieHindiZee5Jan 26NeruMovieTelugu/MalayalamDisney+HotStarJan 23Karma callingMovieHindi Disney+HotStarJan 26Flex X CopSeriesEnglish/KoreanDisney+HotStarJan 26Fight ClubMovieTamilDisney+HotStarJan 27Shark Tank IndiaSeriesHindi SonyLIVJan 22WonkaMovieEnglishBook My ShowJan 22Aqaman 2MovieEnglishBook My ShowJan 23FearMovieEnglishBook My ShowJan 23
జనవరి 22 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
ఈగల్
రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్ యాక్షన్ మూవీగా ‘ఈగల్’ అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో అలరించనున్నారు.
యాత్ర-2
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటించారు.
ట్రూ లవర్
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
పవన్ మూవీ రీ-రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కెప్టెన్ మిల్లర్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయికగా చేసింది. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బబుల్‌గమ్
సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బబుల్‌గమ్’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
ఫిబ్రవరి 05 , 2024
Hero’s Gun Poster: కొత్త సినిమాల నయా ట్రెండ్.. హీరో గన్ పడితే పోస్టర్ పీక్స్ అన్నట్లే. మీరే చూడండి..!
సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు హీరోలు, దర్శక నిర్మాతలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరికొన్ని సార్లు వారే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టి ప్రేక్షకుల్లో తమ చిత్రాలపై ఆసక్తిని పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల దర్శక, నిర్మాతలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ హీరో పోస్టర్‌లో గన్ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాల పోస్టర్లను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? తుపాకీ పట్టుకున్న స్టార్ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
భోళా శంకర్
చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’ (Bhola Shankar). ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కానుండగా.. ఇంకా తొమ్మిది రోజులే ఉందంటూ ఇటీవల మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో చిరు రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. యాక్షన్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది.
జైలర్
సూపర్ రజనీకాంత్ రీసెంట్‌గా ‘జైలర్’ (Jailer) మూవీ నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. కాగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో రజనీ గన్‌తో మెరిసారు. చేతిలో పెద్ద తుపాకీతో అగ్రెసివ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా హీరోయిన్‌గా చేసింది.
కెప్టెన్ మిల్లర్
ధనుష్ లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజయ్యింది. మునుపెన్నడూ చూడని లుక్‌లో ధనుష్ ఈ పోస్టర్‌లో కనిపించాడు. తుపాకీని ఫైర్ చేస్తూ బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. ఈ ఒక్క పోస్టర్‌తో కెప్టెన్ మిల్లర్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి అరుణ్ మతేశ్వరం దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది.
జవాన్
ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ (Jawan) చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో షారుక్ రెండు చేతుల్లో పిస్టల్స్‌తో కనిపించాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా ఆమె కూడా తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో తుపాకీతోనే దర్శనమిచ్చింది. కాగా, ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.
సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’ (Salaar). ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లోనూ ప్రభాస్ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. గన్‌పై చేయి పెట్టుకొని, అగ్రెసివ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.
గాండీవధారి అర్జున
మెగా హీరో వరణ్ తేజ్ తాజాగా ‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌లోనూ వరణ్ చేతిలో గన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షివైద్య హీరోయిన్‌గా చేస్తోంది. మిక్కీ జే. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
సైంధవ్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ (Saindhav) మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజైంది. ఇందులో వెంకటేష్ చేతితో గన్ పట్టుకొని దాన్ని చూస్తూ కనిపించాడు. కాగా, ఈ చిత్రాన్ని సైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈగల్
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ (Tiger Nageswara Rao) చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘ఈగల్’ (Eagle) సినిమా చేయనున్నాడు. కాగా ఈగల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని కనిపించాడు. చేతిలో గన్ కూడా ఉంది. కాగా, ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
స్పై
ఇటీవలే విడుదలైన ‘స్పై’ (Spy) చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో హీరో నిఖిల్ కూడా పిస్టల్‌తో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆగస్టు 04 , 2023
HBD Priyanka Mohan: ‘నన్ను తీసుకొని తొందరపడ్డారేమో’.. నేరుగా డైరెక్టర్‌నే అడిగేసిన ప్రియాంక మోహన్!
దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన 'ఓజీ' సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది.
ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.
ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా 'ఒందు కథే హెళ్లా' అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.
రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది.
నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట.
ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది.
నాని 'గ్యాంగ్ లీడర్స్' సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట.
పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి 'బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో' అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.
చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి 'ఈటీ'లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది.
ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.
హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.
సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.
తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది.
పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.
View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial)
చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది.
ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది.
తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది.
తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో 'ఓజీ'లో నటిస్తోంది.
అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన 'డాక్టర్', 'డాన్'.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
నవంబర్ 20 , 2024
The Goat Director: తెలుగు ఆడియన్స్‌పై ‘ది గోట్’ డైరెక్టర్ అక్కసు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళనాడులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తూ రూ.300 కోట్ల మార్క్‌ను సైతం అందుకుంది. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రం 'ది గోట్'కు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. తెలుగు, హిందీ ప్రేక్షకులపై అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
‘అందుకే నచ్చలేదు’
తెలుగు, హిందీ భాషల్లో ‘ది గోట్’ (The Greatest Of All Time) సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రూ.22 కోట్లకు ఈ మూవీని కొనుగోలు చేయగా ఇప్పటివరకు రూ.10 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన సీన్స్ హైలైట్ చేయడం వల్ల తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఇది నచ్చలేదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్‌లో ది గోట్ పనితీరు తక్కువగా ఉండడానికి ఇదే కారణమన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లోని ముంబయి, బెంగళూరు జట్టు అభిమానులు తమ చిత్రాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానిని కావడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
https://twitter.com/TheAakashavaani/status/1833133203697131918
తెలుగు ఆడియన్స్ ఫైర్..!
డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజా కామెంట్స్‌ను తెలుగు ఆడియన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో 'ది గోట్' డిజాస్టర్ దిశగా వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలను తాము ఆదరిస్తామని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’ చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ఒకసారి గుర్తుచేసుకోవాలని డైరెక్టర్‌కు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనికి విపరీతంగా అభిమానులు ఉన్నారని, హైదరాబాద్‌లో సీఎస్కే మ్యాచ్ జరిగితే ఎల్లో జెర్సీలతో స్టేడియం నిండిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ‘ది గోట్’ ఫెయిల్యూర్‌కు గల కారణాలేంటో అన్వేషించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగులో ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు వెంకట్ ప్రభు రొటిన్ స్టోరీతో ది గోట్‌ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించాడు. అయితే టెర్రరిజం మూలాలతో తెరకెక్కినప్పటికీ ఏజెంట్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు ఇందులో ఉండవు. మలుపులు, మెరుపులు ఏ ఒక్కటీ కథనంలో కనిపంచలేదు. కనీసం హీరో చేసే ఆపరేషన్స్‌లోనూ థ్రిల్ లేదు. పైగా విరామం వరకూ కథంతా సాగతీత వ్యవహారమే. అనవసరంగా వచ్చి పడిపోయే పాటలు, యోగిబాబు కామెడీ ట్రాక్ తెలుగు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి. అయితే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఐపీఎల్ ట్రాక్ ప్రేక్షకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపాయి.
నో చెప్పిన ధోని!
‘ది గోట్’లో చాలా అతిథి పాత్రలు ఉన్నాయి. హీరో శివ కార్తికేయ (Sivakarthikeyan), హీరోయిన్ త్రిష (Trisha) అతిథులుగా అలరించారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీని కూడా క్లైమాక్స్‌లో చూపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజువల్స్ ద్వారా మహీని వెండితెరపై చూపారు. నిజానికి ధోనీతో ఒక్క సన్నివేశమైనా సినిమాలో చేయించాలని దర్శకుడు వెంకట్ ప్రభు అనుకున్నారట. అందుకు మహీ ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ విజువల్స్ ద్వారా స్క్రీన్‌పై చూపించారు. 20 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షించింది.
నెగిటివ్ రివ్యూలపైనా మండిపాటు
‘ది గోట్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ రివ్యూలపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘సినిమాని రూపొందించేందుకు మేం పడిన కష్టం గురించి మాట్లాడరు. కానీ, కొందరు సినిమాపై కావాలనే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఉన్నన్ని రిఫరెన్స్‌లు ఏ చిత్రంలోనూ లేవు. ఏ హీరో అభిమాని అయినా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రిఫరెన్స్‌లు తీసుకున్నాం. అతిథి పాత్రల కోసమే చిత్రాన్ని రూపొందించలేదు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దా. సినిమా ఆడియన్స్ కోసమేగానీ రివ్యూవర్స్‌కు కాదు’ అని అన్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Allu Arjun: బ్రాండ్ వాల్యూలో ‘పుష్ప’ తగ్గేదేలే.. అల్లు అర్జున్, రష్మిక, పీవీ సింధులకు టాప్ 25లో చోటు
‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు అల్లు అర్జున్. ఈ సినిమా అనంతరం ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో క్రమక్రమంగా బన్నీ బ్రాండ్ వాల్యూ ఎక్కువైపోయింది. తాజాగా దేశంలో బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ 25 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ చోటు సంపాదించాడు. పుష్పరాజ్‌తో పాటు శ్రీవల్లిగా నటించిన రష్మిక బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోయింది. ఈ కన్నడ కుట్టికి టాప్ 25లో చోటు లభించింది. తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. 2022 సంవత్సరానికి గాను కన్సల్టింగ్ సంస్థ ‘క్రోల్’(kroll) ‘సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూయేషన్ స్టడీ’ని విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలో టాప్ 20వ సెలబ్రిటీగా నిలిచాడు. 3.14 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్ 25లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప2’ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్నాడు.
పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్ బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు.
రష్మిక మందన్న
పుష్ప బ్యూటీ రష్మిక మందన్న కూడా టాప్ 25 జాబితాలో చోటు సంపాదించింది. 2.53 కోట్ల డాలర్లతో 24వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలతో రష్మిక బిజీబిజీగా ఉంది.
రణ్‌వీర్ సింగ్
18.17 కోట్ల డాలర్లతో రణ్‌వీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న విరాట్ కోహ్లీని అధిగమించాడు. 2021లో రణ్‌వీర్ బ్రాండ్ వాల్యూ 15.83 కోట్ల డాలర్లు ఉండగా 2022కి 18.17కోట్ల డాలర్లకు చేరుకుంది.
విరాట్ కోహ్లీ
కెప్టెన్సీ వదులుకున్నాక విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతోంది. 2020లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 23.77 కోట్ల డాలర్లు కాగా, 2022 సంవత్సరానికి 17.69 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో దేశంలో సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ జాబితాలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. ఇతడి బ్రాండ్ వాల్యూ 15.36 కోట్ల డాలర్లు.
అలియా భట్
లేడీ సెలబ్రిటీల జాబితాలో దేశంలో తొలి స్థానంలో నిలిచిన నటి అలియా భట్. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ బ్రాండ్ వాల్యూ 10.29 కోట్ల డాలర్లు.
దీపిక పదుకొణె
8.29 కోట్ల డాలర్లతో దీపిక పదుకొణె 5వ స్థానంలో నిలిచింది. 2021లో 5.16 కోట్ల డాలర్లుగా ఉండేది.
ఎం.ఎస్.ధోనీ
రిటైర్మెంట్ తర్వాత బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గింది. 8.03 కోట్ల డాలర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
అమితాబ్ బచ్చన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏడో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బ్రాండ్ వాల్యూ 7.9 కోట్ల డాలర్లుగా ఉంది.
సచిన్ తెందుల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ బ్రాండ్ వాల్యూ అదేరీతిలో కొనసాగుతోంది. 7.36 కోట్ల డాలర్లతో సచిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
హృతిక్ రోషన్
7.16 కోట్ల డాలర్లతో హృతిక్ రోషన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
షారూక్ ఖాన్
కింగ్ షారూక్ ఖాన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. 5.57 కోట్ల డాలర్లుతో పదో స్థానంలో నిలిచాడు.
సల్మాన్ ఖాన్
షారూక్ ఖాన్ వెంబడి సల్మాన్ ఖాన్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో 11వ స్థానం సంపాదించాడు.
రణ్‌బీర్ కపూర్
సల్మాన్ ఖాన్‌తో సమానంగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ ఉంది. 5.45 కోట్ల డాలర్లతో సల్లు భాయ్‌తో 11వ స్థానాన్ని పంచుకున్నాడు రణ్‌బీర్.
రోహిత్ శర్మ
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. కోహ్లీతో పోల్చితే చాలా తక్కువ. మొత్తంగా జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడీ హిట్ మ్యాన్.
ఆయుష్మాన్ ఖురానా
ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ వాల్యూ 4.95 కోట్ల డాలర్లు. బ్రాండ్ వాల్యూ లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నాడీ హీరో.
అనుష్క శర్మ
సినిమాలు తక్కువ చేసినప్పటికీ అనుష్క శర్మ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. 4.17 కోట్ల డాలర్లతో అనుష్క 15వ స్థానంలో నిలిచింది.
కియారా అడ్వాణీ
ఇటీవలే పెళ్లి పీటలెక్కింది షేర్షా బ్యూటీ కియారా అడ్వాణీ. 3.83 కోట్ల డాలర్ల బ్రాండ్ వాల్యూతో 16వ స్థానంలో ఉంది.
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్
కరీనా కపూర్, కార్తీక్ ఆర్యన్‌ల బ్రాండ్ వాల్యూ 3.65 కోట్ల డాలర్లు. వీరిద్దరూ కలిసి 17వ స్థానాన్ని పంచుకున్నారు.
హార్దిక్ పాండ్యా
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 18వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఆల్‌రౌండర్ బ్రాండ్ వాల్యూ 3.48 కోట్ల డాలర్లు.
సారా, వరుణ్..
సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్ 21వ స్థానంలో ఉన్నారు. వీరిద్దరి బ్రాండ్ వాల్యూ 2.8 కోట్ల డాలర్లుగా ఉండటం విశేషం.
నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ 2.65 కోట్ల డాలర్లు. పీవీ సింధుతో సమానమైన బ్రాండ్ వాల్యూతో ఈ ఒలింపిక్ ఛాంపియన్ 23వ స్థానంలో ఉన్నాడు.
మార్చి 22 , 2023
Sana Javed: షోయాబ్ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
పాక్ నటి ‘సనా జావేద్’ (Sana Javed)ను పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు.
‘సనా జావేద్’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.
ఈ క్రమంలోనే 2012లో పాక్ సీరియల్ 'మేరా పెహ్లా ప్యార్'తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్-ఈ-జాత్ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది.
2016లో ప్రముఖ సీరియల్ యాక్టర్ జాహిద్ అహ్మద్‌తో 'జరా యాద్ కర్' అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్ హీరో ధనిష్ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది.
అదే ఏడాది 'రంగ్‌రేజా' చిత్రంలో లీడ్ రోల్‌లో కనిపించి నటిగా పాక్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'జీతో పాకిస్తాన్ లీగ్' అనే రియాలిటీ షోలో డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది.
అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్ సింగర్ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు.
ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్.. ఆ తర్వాత పాక్ మాజీ కెప్టెన్ షోయాబ్ మాలిక్‌కు దగ్గరైంది.
గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్ బహిరంగంగా విషెస్ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.
అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు.
ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్ నటించింది. ‘సుకూన్’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.
ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'మెహమ్మద్ ఏక్ సాజా' అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది.
జనవరి 20 , 2024
SUMMER HAIR STYLES: స్టైల్ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్
వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్ హెయిర్ కట్స్ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి.
ధోని
విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్ షేప్‌ను అలాగే ఉంచి కాస్త తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు. సైడ్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించేలా మెయింటెన్ చేస్తున్నాడు MSD.
డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టైల్‌ను వేసవిలో ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా తగ్గించి మధ్యలో తక్కువ జుట్టును ఉంచుకుంటే బెటర్. మీసం, గడ్డం కూడా ట్రిమ్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. దీంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది.
హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాడు. ప్రస్తుతం హార్దిక్ కూడా వార్నర్ లాంటి హెయిర్ స్టైల్‌ను చేయించుకున్నాడు. సైడ్స్‌ను పూర్తిగా తగ్గించి మధ్యలో మీడియం జుట్టుతో ఉంటే సూపర్ కూల్‌గా ఉంటుంది.
నితీశ్ రాణా
నితీశ్ రాణా ఫ్యాషన్ ఫ్రీక్ అని చెప్పవచ్చు. గతేడాది పర్పుల్ షేడ్ హెయిర్ స్టైల్‌తో కనిపించిన అతడు ఈ సారి పెద్దగా మార్పులు చేయలేదు. నితీశ్‌ది సమ్మర్‌కి సరిగ్గా సరిపోయే అండర్ కట్. ఇలాంటిది మీకు సూట్ అయితే ట్రై చేయవచ్చు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ లాంటి హెయిర్ కట్ చూడటానికి సూపర్‌గా ఉంటుంది. సైడ్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని ఫ్రెంచ్ గడ్డం మెయింటెన్ చేస్తే వేసవిలో ఇక తిరుగుండదు. మీకు ఇలాంటి లుక్ సెట్ అయితే ఆలస్యం లేకుండా చేసుకోండి.
శిఖర్ ధావన్
వేసవి కాలానికి పర్‌ఫెక్ట్ కటింగ్ ధావన్ స్టైల్. అసలు జుట్టు ఉందా లేదా అనేంతలా ట్రిమ్ చేసి మధ్యలో స్టైల్ కోసం లైన్స్ పెట్టారంటే మాములు లుక్ ఉండదు. చిరాకు నుంచి కాస్తైనా తప్పించుకోవాలని అనుకుంటే ధావన్ హెయిర్ కట్ చేయించాల్సిందే.
విరాట్ కోహ్లీ
సమ్మర్‌లో విరాట్ కోహ్లీ హెయిర్ కట్‌ను కూడా ఫాలో కావచ్చు. సైడ్స్ పూర్తిగా ట్రిమ్ చేసుకొని మధ్యలో లైన్ తీసి జెల్ పెట్టారంటే ఇక అదిరిపోతుంది.
మార్క్రమ్
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉన్న మార్క్రమ్ సూపర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫంకీ స్లీక్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. సైడ్‌లో క్లాసీ లుక్ ఉంచి మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా జుట్టును మెయింటెన్ చేస్తే బాగుంటుంది.
ఏప్రిల్ 26 , 2023
Devara Promotions: దేవర ప్రమోషన్స్ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్ & కో ఫోకస్ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం (సెప్టెంబర్ 17) చెన్నైలో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్ మాత్రం ఫీలవుతున్నారు. తారక్ వంటి స్టార్ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్ చేస్తున్నారు.
కపిల్ శర్మ షోలో దేవర టీమ్!
దేవర టీమ్ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్ శర్మ సీజన్ 2’ షోలో తారక్ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్ సమయంలోనూ రాజమౌళి, తారక్, రామ్‌చరణ్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్, అలియా భట్, సైఫ్ అలీఖాన్ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ & కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.
https://twitter.com/NetflixIndia/status/1834826983017976063
హిందీ బిగ్‌బాస్ 18లో తారక్?
హిందీలో బిగ్ బాగ్ షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ హిందీ సీజన్ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్ & కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 4 నుంచి బిగ్‌బాస్ 18 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.
యానిమల్ డైరెక్టర్‌తో ఇంటర్యూ
దేవర టీమ్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్ కొరటాల శివ, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్ బదులిచ్చారు. తారక్ మాట్లాడుతూ దేవర యాక్షన్ డ్రామా అని, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్ గురించి చెప్పారు. 35 రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేసినట్లు ఎన్టీఆర్ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్ టైమ్ పై సందీప్ సరదాగా కామెంట్ చేశారు. దానికి తారక్ యానిమల్ రన్ టైమ్ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=EzNPma48bVM
మరి టాలీవుడ్ ప్రమోషన్స్ ఎక్కడా?
గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్ ఫోకస్ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్, కొరటాల ఇంటర్యూను ప్లాన్ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్, ప్రభాస్, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి.
సెప్టెంబర్ 18 , 2024
Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, కపిల్ దేవ్, నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి
నిర్మాత: సుభాస్కరణ్ అల్లిరాజా
విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్ చిత్రం ‘లాల్ సలామ్’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
తిరు (విష్ణు విశాల్), మెుయిద్దీన్ భాయ్ (రజనీకాంత్) కొడుకు షంశుద్దిన్ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్ స్థాపించిన త్రీ స్టార్ క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే అది ఇండియా - పాక్ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్, విక్రాంత్ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్, జీవిత, తంబి రమేష్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్. ముస్లింలను రిప్రెజెంట్ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్ పాత్రకు ఎలివేషన్స్ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనంరజనీకాంత్ నటనసంగీతం
మైసన్ పాయింట్స్
స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating: 3/5
ఫిబ్రవరి 09 , 2024
This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
టైగర్ 3
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ (Katrina Kaif) నటించింది. ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.
జపాన్
కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జిగర్ తండా డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
అలా నిన్ను చేరి
దినేశ్ తేజ్ హీరోగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.
ది మార్వెల్స్
అమెరికన్ సూపర్ హీరో సినిమా ‘ది మార్వెల్స్’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటి బ్రీ లార్సన్ కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇమాన్ వెల్లని, టోయోనా ప్యారిస్, సియో-జున్ పార్క్, శామ్యూల్ ఎల్. జాకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
దీపావళి
అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్, దీపన్ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer MovieHindiZee 5Nov 10
……………………………………………………………………………………………………………….
APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
నవంబర్ 06 , 2023
Virat Kohli Biopic: విరాట్ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్, డైరెక్టర్లపై నెట్టింట్లో రచ్చ..
రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.
అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఫస్టాఫ్‌లో కథ ఇలా..
విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్‌కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్‌కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్‌బ్యాక్ వంటి దశలను ఫస్టాప్‌లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్‌కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్‌లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు.
క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్
భారత్‌కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్‌ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్‌కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది.
బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్‌కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్‌కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్‌కప్ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా..
విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్‌గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్ ఇచ్చిన తీరును సెకండాఫ్‌లో హైలెట్ చేస్తే బాగుంటుంది.
వివాదాలపై క్లారిటీ..
విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు. అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.
రామ్ చరణ్- కోహ్లీ పోలికలు
రామ్‌చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్ బయోపిక్‌ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు.
https://twitter.com/Thyview/status/1636936587237003264?s=20
చరణ్‌లోనూ క్రికెటర్..
రామ్‌చరణ్‌లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్‌కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్‌లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు.
https://twitter.com/AlwysVenuCharan/status/1337393959786532867?s=20
ఫిట్‌నెస్..
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు. రామ్‌చరణ్‌కూ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్‌నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు.
https://twitter.com/BingedHelps/status/1636943158197252097?s=20
ఈ డైరెక్టర్లు కావాలంట..
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.
హీరోయిన్‌లు..
విరాట్ బయోపిక్‌లో హీరోయిన్‌గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్‌టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు.
మార్చి 18 , 2023