రివ్యూస్
How was the movie?
తారాగణం
బేబీ గీతిక
సంగీత క్రిష్
రమ్య కృష్ణన్
రియాజ్ ఖాన్
అలీ
ఎల్బీ శ్రీరామ్
కోటేష్ మానవ
సిబ్బంది
రామ నారాయణన్
దర్శకుడురామ నారాయణన్నిర్మాత
దేవా
సంగీతకారుడుకథనాలు
HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్ లుక్‌లోనే ఫ్లాట్ అయ్యిందట!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
నిర్మాతల ఫ్యామిలీ
చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్. బాలన్ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది. మలయాళం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘సర్కస్ సత్తిపండు’.
ఆ చిత్రాలతో గుర్తింపు
1997లోనే సర్కస్ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 'ఆశల సందడి' (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.
సింగర్‌తో లవ్ మ్యారేజ్
కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్ సింగర్ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్ ప్లాన్ చేయగా క్రిష్ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.
https://www.youtube.com/watch?v=OLf1U7c867M
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు!
తెలుగులో పలు హిట్ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన 'కారా మజాకా' తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్ సాంగ్), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.
బుల్లితెర హోస్ట్‌గానూ..
నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్ డ్యాన్స్ షోస్ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.
అక్టోబర్ 21 , 2024
Om Bheem Bush: రిలీజ్‌కు ముందే నాలుగు రెట్లు లాభాలు.. ‘ఓం భీమ్ బుష్’ మూవీనా మజాకా!
ఈ వారం రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓం భీమ్ బుష్' (Om Bheem Bush). శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul RamaKrishna) హీరోలుగా.. హుషారు (Hushaaru) మూవీ ఫేమ్ శ్రీ హర్ష కనుగొంటి (Sri Harsha Kanugonti) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై ఈ సినిమా వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్ కూడా భిన్నంగా చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో శ్రీ విష్ణు ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
‘ఆ దెబ్బతో ప్రాఫిట్స్ వచ్చేశాయ్’
‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ చూసినవారంతా ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. ఇదిలా ఉంటే హీరో శ్రీవిష్ణు.. ఈ సినిమా విడుదలకు ముందే నాలుగు రెట్లు ప్రాఫిట్స్ యూవీ క్రియేషన్స్ వారికి వచ్చాయని వ్యాఖ్యానించారు. తన గత హిట్ చిత్రం ‘సామజవరగమన’ తాలూకా పాజిటివ్ ఫ్యాక్టర్.. అలాగే ఇప్పుడు ‘ఓం భీం బుష్’ తాలూకా క్రియేటివ్ టీజర్, ట్రైలర్ కంటెంట్‌ల దెబ్బతో నిర్మాతలకి ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేశాయని లేటెస్ట్ ఇంటర్వ్యూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. విడుదలకు ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్స్ తీసుకొస్తే రిలీజయ్యాక ఎన్ని రికార్డ్స్ బద్దలు అవుతాయో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సెన్సార్ పూర్తి
'ఓం భీమ్ బుష్' చిత్రం.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్టు ఈ చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గం.ల 15 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాను అన్ని వయస్సుల వారు నిరభ్యంతరంగా చూడవచ్చని పేర్కొంది. అయితే మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులు కూడా నవ్వుతూనే ఉన్నారని టాక్. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శ్రీ హర్ష ఈ కథకి కామెడీ, హారర్ టచ్ ఇవ్వడంతో పాటు కొన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ జత చేసినట్లు సమాచారం. ఇది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
శ్రీవిష్ణు ఖాతా మరో హిట్?
‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓమ్ బీమ్ బుష్'. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా కనిపిస్తోంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓం భీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా? లేదా? అనేది మరో రెండ్రోజుల్లో తేలిపోనుంది.
https://twitter.com/i/status/1770390528661839896
మార్చి 20 , 2024
PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్ హీరో.. ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761
పోస్టర్‌లో ఇవి గమనించారా?
‘మహా కాళీ’ పోస్టర్ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాళికాదేవి శక్తితో..
మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ!
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అక్టోబర్ 10 , 2024
Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?
ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
కంగువా కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంగువా' (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 14) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి కంగువాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.
‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే!
దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్రణవకోన, కపాల కోన, సాగర కోన, అరణ్యకోన, హిమ కోన అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఏ కోనతోనూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.
మట్కా ఓపెనింగ్స్ మరీ దారుణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూసి ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు కరుణ కుమార్ చాలా రొటీన్ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్ తేజ్ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఒక్క పాయింట్ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Daku Maharaj Story: ‘డాకు మహారాజ్’ స్టోరీ ఇదేనా? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్!
టాలీవుడ్ మాస్ చిత్రాలకు కేరాఫ్ అనగానే ముందు గుర్తుకువచ్చే హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). గత కొంతకాలంగా వరుస మాస్ ఎంటర్‌టైనర్స్ తీస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 109 అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిట్‌ను ‘డాకూ మహారాజ్’గా చిత్ర బృందం అనౌన్స్ చేసింది. అంతేకాదు అదిరిపోయే టీజర్‌తో నందమూరి అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయితే టైటిల్, టీజర్‌తోనే దర్శకుడు బాబీ సినిమా కథను చెప్పకనే చెప్పాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
టీజర్‌లో ఏముంది?
నటుడు బాలకృష్ణ - దర్శకుడు బాబీ (Bobby) కాంబోలో రాబోతున్న 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ను సైతం రిలీజ్ చేశారు. 'ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్‌తో మెుదలైంది. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్, విజువల్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ టీజర్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్ సీక్వెన్స్‌తో దర్శకుడు నింపేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోమారు బాలయ్య మాస్ తాండవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=teN0JZ67KZU
డాకు మాన్సింగ్ ప్రేరణతో..
బాలయ్య పోషిస్తున్న డాకు మహారాజ్ రోల్‌ను ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎవరీ డాకు మహారాజ్? అని సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అసలు పేరు డాకు మాన్సింగ్. పంజాబ్, ఛంబల్ ప్రాంతాల్లో బందిపోటు దొంగగా ఒకప్పుడు చలామణీ అయ్యాడు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన చిన్నతనంలో డాకు మాన్సింగ్ పేరు బాగా వినేవారట. ఆయన చేసే దోపిడీలు, తప్పించుకునే తీరు విని చిన్నప్పుడు ఎంతో భయపడినట్లు అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అయితే డాకు మాన్సింగ్ దోచుకున్న సొమ్మును సొంతానికి వాడుకునేవారు కాదట. పేదోళ్లకు ఆ ధనం మెుత్తాన్ని పంచేవారని చంబల్ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.
https://twitter.com/SitharaEnts/status/1857285926067823074
స్టోరీ ఇదేనా!
ఒకప్పటి ఫేమస్ బందిపోటు డాకు మాన్సింగ్ (Daku Maharaj Story) పాత్రను ప్రేరణగా తీసుకొని దర్శకుడు బాబీ బాలయ్య చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో బందిపోటైన బాలయ్య ప్రజలకు అండగా నిలుస్తాడని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను పీడించి, వారి కష్టాన్ని దోచుకున్న వారిని ఇందులో బాలయ్య టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. వారి నుంచి ఎంతో చాకచక్యంగా దోచుకున్న ధనాన్ని తిరిగి ప్రజలకే పంచుతాడని అంచనా వేయవచ్చు. అయితే మూడు భిన్న కాలాల్ని ప్రతిబింబించేలా కథ ఉంటుందని కూడా అంటున్నారు. దీన్నిబట్టి కథలో డాకు మహారాజ్ ఒక భాగం అవుతాడా? లేదా అతడి చుట్టూనే సినిమా తిరగనుందా? అన్నది తెలియాల్సి ఉంది.
https://twitter.com/SitharaEnts/status/1857296349605273899
మూడు కోణాల్లో బాలయ్య..
'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న 'డాకు మహారాజ్'. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన బాబీదేవోల్ ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్ర నటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కథ సాగే కాలానికి తగ్గట్లుగా బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్ కూడా మరో లెవల్లో ఉంటాయని అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
నవంబర్ 15 , 2024
Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.
తొలి కలెక్షన్స్ ఎంతంటే?
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్ దూకుడు ప్రదర్శించింది. యూఎస్ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు.
రవితేజ టాప్-10 కలెక్షన్స్! (Ravi Teja Top 10 Highest Grossing Movies)
‘ఈగల్’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
ధమాకా (Dhamaka)
రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20 కోట్ల వరకూ జరిగింది.
బడ్జెట్: 35 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు
క్రాక్ (Krack)
ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు
తీర్పు: బ్లాక్ బస్టర్
రాజా ది గ్రేట్ (Raja the Great)
రవితేజ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్ కాగా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr
వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు
తీర్పు: హిట్
బలుపు (BALUPU)
రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)
రవితేజ గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.
బడ్జెట్: 55 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr
ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు
పవర్ (Power)
రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్ గణాంకాలను నమోదు చేసింది.
బడ్జెట్: 30 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు
తీర్పు: సగటు కంటే ఎక్కువ
బెంగాల్ టైగర్ (Bengal Tiger)
ఈ సినిమా బడ్జెట్ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.
బడ్జెట్: 25 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr
వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు
విక్రమార్కుడు (Vikramarkudu)
దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.
బడ్జెట్: 11 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు
కిక్ (Kick)
రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అంతకే జరగడం గమనార్హం.
బడ్జెట్: 14 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr
ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు
కిక్ (KICK 2)
అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్ బిజినెస్ రూ.36 కోట్లు. కిక్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
బడ్జెట్: 30Cr
ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 43cr
ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr
ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
ఫిబ్రవరి 10 , 2024
Eagle Movie: ‘ఈగల్’ గురించి పూనకాలు తెప్పించే మాట చెప్పిన నిర్మాత.. అదే నిజమైతే!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle Movie). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్లుగా నటించారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. రవితేజతో 'ధమాకా' సినిమాని నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగల్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
‘ఈగల్’ క్లైమాక్స్.. నెవర్ బిఫోర్!
తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన 'ఈగల్' నిర్మాత విశ్వ ప్రసాద్.. మూవీ క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈగల్.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇంత వరకు తెలుగులో అలాంటి అవుట్ పుట్ వచ్చి ఉండదు. ఎక్కువ చేసి చెప్పడం లేదు, బాహుబలితో కంపేర్ చేయడం లేదు గానీ.. లోకేష్ కనకరాజు స్టైల్లో క్లైమాక్స్ ఉంటుంది. సాధారణ తెలుగు సినిమాల క్లైమాక్స్‌కి పూర్తి భిన్నంగా ఉంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరు’ అంటూ సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈగల్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో పెరిగిపోయింది.
టికెట్ రేట్లు సాధారణమే..
గత కొంతకాలంగా స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెంచడం అనివార్యమవుతోంది. అయితే రవితేజ ‘ఈగల్’ (Eagle) చిత్రం మాత్రం టికెట్ పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఈగల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ రేట్లు ఉంచడం విశేషం. దీని ప్రకారం హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ.200గా ఉండనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల రూ.175కే టికెట్ పొందవచ్చు. ఇక సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ.150 మాత్రమే. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ.110, కొన్ని థియేటర్లలో రూ.145లకు టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
‘ఈగల్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ఇక ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని అంకెలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్‌గా రూ.21 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్లకు జరిగినట్లు చెబుతున్నారు. ఓవర్‌సీస్‌లో రూ.2 కోట్లు.. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు కలిపి మరో రూ.2 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈగల్ రిలీజ్ అవుతోంది.
తగ్గిన రవితేజ మార్కెట్!
రవితేజ రీసెంట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో పోలిస్తే ‘ఈగల్’ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ కోత పడింది. టైగర్ నాగేశ్వరరావు థియేట్రికల్ హక్కులు గతంలో రూ.37 కోట్లకు అమ్ముడుపోయాయి. రవితేజ కెరీర్‌లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా అది నిలిచింది. దానితో పోలిస్తే ‘ఈగల్’ మాత్రం రూ.16 కోట్లు తక్కువకే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే మాత్రం రవితేజ టాప్-5 చిత్రాల్లో ఒకటిగా ఈగల్ నిలిచింది. రావణాసుర, ఖిలాడి సినిమాల థియేట్రికల్ హక్కులు రూ.22 కోట్ల వరకు అమ్ముడుపోగా.. వాటి తర్వాత నాలుగో స్థానంలో ఈగల్ నిలిచింది.
ఈగల్‌లో రవితేజ పాత్ర అదే!
ఈగల్ సినిమాలో రవితేజ రైతు సమస్యలపై పోరాడే షూటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రైలర్, టీజర్ చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈగల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ రిలీజ్ కావడంతో ఈగల్ వాయిదాపడింది. అటు రవితేజ తన తర్వాతి చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్‌తో చేస్తున్నాడు. దీనికి ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది.
ఫిబ్రవరి 08 , 2024
18 Years Of Bhadra: మొదట హీరో రవితేజ కాదు.. సినిమా విడుదలకు ముందు ఇన్ని జరిగాయా?
మాస్ మహారాజ రవితేజను స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో భద్ర ముందు వరుసలో ఉంటుంది. 2005లో వచ్చిన భద్ర సినిమా ద్వారానే బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (మే 12, 2005) రిలీజైన ఈ చిత్రం ప్రభంజనమే సృష్టించింది. అప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజను భద్ర సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేసింది. అలాగే దిల్‌రాజును ఇండస్ట్రీలో బలమైన నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ ఆల్బమ్స్‌లో భద్ర సాంగ్స్ ఉన్నాయి. భద్ర సినిమా రిలీజై 18ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
తారాగణం
భద్ర సినిమాలో రవితేజ- మీరా జాస్మిన్ జంటగా చేశారు. సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. మీరా జాస్మిన్ బ్రదర్‌గా, రవితేజ ఫ్రెండ్‌గా నటుడు అర్జన్ బజ్వా నటించాడు. అలాగే ప్రకాష్ రాజ్, మురళి మోహన్, ప్రదీప్ రావత్, బ్రహ్మాజీ, సునీల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఆర్తూర్ A. విల్సన్ సినిమాటోగ్రఫీ అందించగా మాటలు కొరటాల శివ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు రాశారు.
https://www.youtube.com/watch?v=WrW9j6DjvZs
గ్రాండ్ ఎంట్రీ
దర్శకుడిగా బోయపాటి శ్రీను సత్తా ఏంటో భద్ర సినిమా చూపించింది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బోయపాటిని దగ్గర చేసింది. భద్ర తర్వాత బోయపాటి శ్రీను స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అతని డైరెక్షన్ స్కిల్స్ చూసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లు బోయపాటితో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
https://www.youtube.com/watch?v=rFfZZyobCdQ
కాసుల వర్షం
దిల్, ఆర్య సినిమా హిట్లతో ఊపు మీదున్న నిర్మాత దిల్ రాజుకు భద్ర సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్ రాజు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. బడ్జెట్ కంటే రెట్టింపు వసూళ్లను భద్ర రాబట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
నో రెమ్యూనరేషన్!
భద్ర సినిమా కోసం బోయపాటి శ్రీనుకు దిల్‌రాజు రూ. 6 లక్షలతో పాటు ఓ కారు కూడా ఆఫర్ చేశారట. అయితే తన ఫస్ట్ సినిమాకు బడ్జెట్ సమస్య రాకుండా తన రెమ్యూనరేషన్ కూడా చిత్ర నిర్మాణానికి వినియోగించాలని బోయపాటి సూచించారట.
https://www.youtube.com/watch?v=1U9yWjrXQpA
ఛాన్స్ మిస్ చేసుకున్న బన్నీ
భద్ర సినిమాకు రవితేజకు బదులు మెుదట అల్లు అర్జున్‌ను అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల బన్నీ చేయలేకపోయారట. రవితేజను సంప్రదించగానే ఆయన ఓకే చెప్పేశారట.
https://www.youtube.com/watch?v=5CExeYfyEG0
స్టోరీనే బలం
భద్ర సక్సెస్‌లో ఆ సినిమా స్టోరీదే కీ రోల్. అప్పటివరకూ చూసిన సినిమా కథలతో పోలిస్తే భద్ర స్టోరీలైన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా కోణాలను స్పృశిస్తూ సినిమా సాగింది.
మే 12 , 2023
New Movie Posters: సంక్రాంతి వేళ కొత్త సినిమా పోస్టర్లు హల్‌చల్.. ఓ లుక్కేయండి!
కొత్త ఏడాదిలో ప్రేక్షకులను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి (Sankranthi)కి విడుదలైన ‘హనుమాన్’ (Hanuman), ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘సైంధవ్’ (Saindhav), ‘నా సామిరంగ’ (Na Sami Ranga) చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు అలరించేందుకు రాబోతున్నాయి. కాగా, ఆయా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు సంక్రాంతి సందర్భంగా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఈగల్ (Eagle). వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాలి. కొన్ని కారణాల నేపథ్యంలో ‘ఫిబ్రవరి 9’కి వాయిదా పడింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రవితేజ, హీరోయిన్ కావ్యా థాపర్ ఎంతో అందంగా కనిపించారు.
రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్’ (Raja Saab)గా పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది ట్రెండింగ్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుంగీతో కనిపించడం విశేషం.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) చిత్రంలో నటిస్తున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తోంది. ఈ చిత్ర యూనిట్ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో వందేమాతరం పాటను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
భీమా
ప్రముఖ హీరో గోపిచంద్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భీమా (Bheema). పండగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ సైతం హల్‌చల్ చేసింది. ఇందులో గోపిచంద్ ఎద్దుపై కూర్చొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ. హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
విశ్వక్ సేన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వెట్టైయాన్
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'వెట్టియాన్'. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ సంక్రాంతి రోజున విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ వింటేజ్ రజనీకాంత్‌ను గుర్తుకు తెచ్చింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ (The Greatest of All Time). ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో విజయ్‌తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, వెంకట్ ప్రభు కనిపించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అందిస్తున్నాడు.
కెప్టెన్ మిల్లర్
తమిళ హీరో ధనుష్ నటించిన లెటేస్ట్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరణ్ డైరెక్ట్ చేశారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
యంగ్ హీరో సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పండగ సందర్భంగా రిలీజై ఆకట్టుకుంది.
జనవరి 17 , 2024
Pushpa 2 : మళ్లీ పవన్ ఫ్యాన్స్‌ను గెలికిన బన్నీ.. ఏకిపారేసిన గరికపాటి!
అల్లు అర్జున్ (Allu Arjun), మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత వివాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘మట్కా’ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇందుకు మరింత ఊతం ఇచ్చాయి. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి మద్దతు తెలపడం ఈ మెగా - అల్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, అల్లు అర్మీ రెండుగా చీలిపోయి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ కాదని పలువురు సినీ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అదే వైసీపీ నేతకు తాజాగా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేశాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) మరో రెండు వారాల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. సుకుమార్ - బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం దేశంలోని యావత్ సినీలోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ (Pushpa 2 Trailer)) రిలీజ్ కాగా దానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' గురించి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy) స్పందించారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ సైతం చెప్పారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ 'థాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు' అంటు రిప్లే ఇచ్చాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
https://twitter.com/alluarjun/status/1859428674535030932
మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టాడా?
‘డీజే: దువ్వాడ జగన్నాథం’ సినిమాకు ముందు వరకు తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గురించి బన్నీ (Allu Arjun) మాట్లాడుతూ వారిని ఆకాశానికెత్తారు. తొలిసారి డీజే ప్రమోషనల్ ఈవెంట్‌లో పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అనడంతో మెగా ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఆ తర్వాత ‘డీజే’ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి వదిలేశారు. అయితే ఏపీ ఎలక్షన్స్ టైమ్‌లో పవన్ ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి బన్నీ మద్దతు తెలిపడం, స్వయంగా నంద్యాల వెళ్లి ఓటు వేయాలని అక్కడి ప్రజలను అభ్యర్థించడం మెగా ఫ్యాన్స్, జనసైనికులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బన్నీని హేట్ చేయడం ప్రారంభించారు. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూాడా. అటు అల్లు అర్మీ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు మరోమారు శిల్పా రవి రెడ్డికి థ్యాంక్స్ చెప్పి మరోమారు మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మెుదట శిల్పా రవి రెడ్డి పోస్టు చేశారని, దానికి బన్నీ రిప్లే మాత్రమే ఇచ్చారని అల్లు ఫ్యాన్స్ సమర్థించుకుంటున్నారు.
వైసీపీ నేతతో స్నేహం ఎలా కుదిరింది?
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్. అలా శిల్పా రవితో బన్నీకి పరిచయం ఏర్పడి స్నేహాంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో శిల్పా రవికి బన్నీ ట్విటర్ ద్వారా ‘ఆల్ ది బెస్ట్’ తెలిపి ఊరుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు. ఈసారి కూడా వైకాపా తరపున శిల్పా రవి బరిలో ఉండటంతో బన్నీ నేరుగా రంగంలోకి దిగాడు. మామయ్య పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ అప్పట్లో ఒక ట్వీట్ పెట్టి మాత్రమే ఊరుకున్న బన్నీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి కోసం స్వయంగా వెళ్లడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నంద్యాలలో కూటమి అభర్థిగా టీడీపీ నేత ఫరూఖ్ బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఐటెం సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్!
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ‘పుష్ప 2’ చిత్రంలో 'కిస్సిక్' అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. నవంబర్ 23న 'కిస్సిక్' లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన సైతం రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పాటలో అల్లు అర్జున్ (Allu Arjun), శ్రీలీల తమ స్టెప్పులతో దుమ్మురేపారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ (Sreeleela Remuneration) తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. 'పుష్ప'లోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ సాంగ్ కంటే 'కిస్సిక్' ఇంకా పెద్ద హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
బన్నీపై గరికపాటి ఫైర్
'పుష్ప 2' సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న వేళా సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. గతంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) 'పుష్ప' సినిమాపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. 'పుష్ప' లాంటి సినిమాలు సమాజానికి హానికరమని 2021లో గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియోను తెరపైకి తీసుకొచ్చి కొందరు ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ‘ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి చివరలో మంచిగా చూపిస్తాం తదుపరి భాగం వరకూ వేచి చూడండి అంటారు. ఇది ఎంతవరకూ న్యాయం. ఈలోపు సమాజం చెడిపొవాలా? స్మగ్లింగ్ చేసే వ్యక్తి తగ్గేదే లే అంటాడా?. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. తగ్గేదే లే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ మండిపడ్డారు.
https://twitter.com/i/status/1859501799511843292
నవంబర్ 21 , 2024
Allu Arjun Vs Mega Family: అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టిన వరుణ్ తేజ్.. ఎలాగంటే?
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా నేతకు బన్నీ మద్దతు తెలిపినప్పటి నుంచి ఈ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ హాజరవుతారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్‌కు కాస్త బ్రేక్ పడినట్లు కనిపించింది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా చేసిన కామెంట్స్‌తో మరోమారు అల్లు వర్సెస్ మెగా వివాదం తెరపైకి వచ్చింది. సమసిపోతుందనుకుంటున్న ఈ సోషల్ మీడియా వార్‌కు అతడి వ్యాఖ్యలు అగ్గిరాజేసేలా చేసింది.
వరుణ్ ఏమన్నారంటే..
మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అక్కడ వేదికపై మాట్లాడిన వరుణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మట్కా గురించి రిజల్ట్‌పై టెన్షన్ పడుతున్న క్రమంలో తన అన్న రామ్‌చరణ్ నుంచి ఫోన్ వచ్చినట్లు వరుణ్ తెలిపాడు. చరణ్ 10 మాటలు చెప్పాల్సిన పనిలేదని, పక్కన కూర్చొని భుజంపై చేయి వేస్తే అదే రూ.100 కోట్లకు సమానమని అన్నాడు. 'ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/TheAakashavaani/status/1855645538848317783
బన్నీకి ఇండైరెక్ట్ పంచ్..!
వరుణ్ తేజ్ తన తాజా కామెంట్స్ ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండైరెక్ట్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ గురించి బన్నీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో తన ప్రతీ సినిమా ఈవెంట్‌లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే తనకంటూ స్టార్‌డమ్ వచ్చాక బన్నీ వారి గురించి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదన్న విమర్స మెగా ఫ్యాన్స్‌లో ఉంది. ఏపీ ఎన్నికల సమయంలో ఇది తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం మారుతీనగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బన్నీ ‘తనకు నచ్చితేనే వస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యాన్స్‌ను సెపరేట్ చేస్తూ అల్లు ఆర్మీ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐ లవ్ యూ అంటూ తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
సోషల్ మీడియాలో బిగ్ వార్!
వరుణ్ తేజ్ వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్మీ, మెగా ఫ్యాన్స్ మరోమారు సోషల్ మీడియా వేదికగా దాడి చేసుకుంటున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదని వరుణ్ తేజ్ చెప్పకనే చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ‘కుక్కకాటుకు చెప్ప దెబ్బ’ అన్న సామెతను కూడా ప్రయోగిస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ సైతం వరుణ్ తేజ్, మెగా ఫ్యాన్స్‌కు దీటుగా బదులిస్తున్నారు. బన్నీలా సక్సెస్ అయ్యి వరుణ్ ఈ మాట చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. తన సినిమా రిలీజ్ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ను కాకా పట్టడం కోసమే వరుణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వరుణ్ లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట మరోమారు అల్లు vs మెగా ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోసిందనే చెప్పాలి.
https://twitter.com/Mr_Thanniru/status/1855677559385506053
https://twitter.com/Mahendr00185818/status/1855658081923002548
https://twitter.com/KurnoolGabbar/status/1855648961681600850
https://twitter.com/Nishvk18/status/1855647703893786929
https://twitter.com/Pawala444/status/1855647070990082127
https://twitter.com/allumanu45/status/1855654467125096827
https://twitter.com/goudsaab410/status/1855646150281338887
‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్!
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్మీతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఎదురుచేస్తున్నారు. కానీ, మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటానికి ఓ బలమైన కారణం ఉంది. ‘పుష్ప 2’పై ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చిన సోషల్ మీడియాలో బన్నీని ఓ ఆట ఆడుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ సినిమాను బాయ్‌కాట్ చేయడం ద్వారా కలెక్షన్స్ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారట. #Pushpa2boycott అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం వారు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎవరు అడ్డుకోలేరని అల్లు అర్మీ అంటోంది. ఈ నేపథ్యంలో అల్లు, మెగా ఫ్యాన్ వార్ మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
నవంబర్ 11 , 2024
Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీనికి ‘హనుమాన్’(Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ మూవీకి ‘సింబ’(Simba) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కానీ ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇందులో హీరోయిన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
హీరోయిన్‌గా స్టార్ నటి కూతురు!
మోక్షజ్ఞ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ కూతుర్ని హీరోయిన్‌గా సెట్ చేసినట్లు నెట్టింట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా థడానిని (Rasha thadani) కథానాయికగా ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే డిసెంబర్ నుంచి ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారు కావడంతో వారిని ప్రశాంత్ ఏ విధంగా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
విలన్‌గా రానా!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌లో విలన్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు దగ్గుబాటి రానా పేరును ప్రశాంత్ వర్మ పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్రూరమైన విలన్ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని చిత్ర బృందం కూడా నమ్ముతోందట. దీనిపై రానాతో సంప్రదింపులు కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. దీంతో డిసెంబర్ 2న మూవీ షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున సినిమాకు క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఈ చిత్రానికి బాలయ్య చిన్నకూతురు ఎం. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
బాలయ్య స్పెషల్ రోల్!
మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబోలో రానున్న చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. హనుమాన్ తరహాలోనే ఈ సినిమాలో సూపర్ హీరో, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని అంటున్నారు చివర్లో బాలయ్య శ్రీకృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేదంటే అర్జునుడి పాత్రలోనైనా బాలయ్య కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై ప్రశాంత్ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కుమారుడి ఎంట్రీ ఫిల్మ్‌లో బాలయ్య నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.
మహాకాళి ప్రాజెక్ట్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మోక్షజ్ఞ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే తన యూనివర్స్ నుంచి మరో చిత్రాన్ని కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ‘మహా కాళీ’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించరు. మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ మూవీని తెరకెక్కిస్తారు.
అక్టోబర్ 26 , 2024
Mr. Bachchan Movie Review: రవితేజ - హరీష్ శంకర్ కాంబో మళ్లీ మ్యాజిక్ చేసిందా?
నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, శుభలేక సుధాకర్, కిషోర్ రాజు వశిష్ట, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు
దర్శకత్వం : హరీష్ శంకర్
సంగీతం : మిక్కీ. జె. మేయర్
సినిమాటోగ్రఫీ : అయనంక బోస్
ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, అభిషేక్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan Movie Review). బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘మిరపకాయ్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో ‘మిస్టర్ బచ్చన్’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్, ప్రమోషన్ చిత్రాలు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ మూవీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
మిస్టర్ బచ్చన్‌గా రవితేజ చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. తనదైన కామెడీ శైలితో అదరగొట్టాడు. మునుపటి రవితేజను గుర్తుచేశాడు. అటు యాక్షన్ సీక్వెన్స్, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం మెప్పిస్తుంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్‌గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ సత్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్‌లో సత్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి నిజాయతీగా పనిచేస్తే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. మిస్టర్ బచ్చన్ పాత్రను, దాని తాలుకా సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఈ మూవీకి ప్రధాన బలంగా చెప్పవచ్చు. ప్రథమార్ధాన్ని నిలబెట్టడంలో, ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్‌కు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ బచ్చన్ చేసే యాక్షన్ హంగామా కథను రసవత్తరంగా మార్చారు డైరెక్టర్. అయితే ప్రథమార్ధంలో కనిపించిన హరీష్ మార్కు మ్యాజిక్ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది. ఒక్క ఐటీ రైడ్ నేపథ్యంగానే ద్వితీయార్ధమంతా నడపడంతో ఆసక్తి సన్నగిల్లింది. హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్‌ని ఇంకా ఇంట్రెస్ట్‌గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా ఈ చిత్రానికి తొలి హీరో మిక్కీ జే మేయర్. ఈ కథకు తగ్గట్లుగా మంచి క్యాచీ టూన్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, జిక్కీ, సితార్, నల్లంచు తెల్ల చీర పాటలు ఓవైపు వీనులవిందును, మరోవైపు కనుల విందును అందించాయి. అయానంక బోస్ కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ నటనలవ్ ట్రాక్కామెడీ, డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ద్వితియార్థంకొన్ని బోరింగ్ సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 16 , 2024
Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
భారీ అంచనాలతో విడుదలైన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా క్రేజీ డైరెక్టర్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలకు ఫ్యూచరిక్ అంశాలను ముడిపెడుతూ తీర్చిదిద్దిన ‘కల్కి’పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు మాత్రం.. నెట్టింట ‘కల్కి’ సినిమాను తప్పుబడుతున్నారు. పురణాలను నాగ్ అశ్విన్ వక్రీకరించారని పోస్టులు పెడుతున్నారు. కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడ్ని.. అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడాన్ని తీసుకోలేకపోతున్నారు. కాగా, దీనిపై నాగ్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించారు.
కల్కిపై నెటిజన్ల ప్రశ్నలు!
'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్‌లో కర్ణుడు పాత్రను హైలెట్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. కర్ణుడు మరలా తిరిగొచ్చినట్లు చూపించడం పురాణాలను వక్రీకరించినట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన తిరిగొచ్చినట్లు చూపించడంలో లాజిక్ ఉందని అంటున్నారు. కల్కి అవతార సమయంలో అశ్వత్థామ భగవంతుండికి అండగా ఉంటాడని పురణాలు సైతం చెప్పాయని పేర్కొంటున్నారు. మరి కర్ణుడు కూడా ఫ్యూచర్‌లో మళ్లీ తిరిగొస్తాడని పురణాల్లో ఎక్కడ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. అంతా ఓకే గానీ కర్ణుడు విషయంలో మాత్రం దర్శకుడు తన లెక్కతప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు పాత్రను తగ్గిస్తూ.. కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడుని హైలెట్ చేయడం బాగోలేదని అంటున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
‘కర్ణుడుని అందుకే హైలెట్ చేశా’
కల్కి సినిమాలో కర్ణుడు పాత్రపై వస్తున్న ప్రశ్నలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు. కర్ణుడుని ఎందుకు అంత గొప్పగా చూపించారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అతని క్యారెక్టర్‌ని హైలైట్ చేశా' అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ మాటలతో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. పురణాలు సైతం కర్ణుడుని ధీశాలిగా కీర్తించాయని గుర్తు చేస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, నాగ్ అశ్విన్ చూపించిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.
కర్ణుడు vs అర్జునుడు ఎవరు గొప్పా?
మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? అన్న ప్రశ్నను రిపోర్టర్లు నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. దీనిపై నాగ్ అశ్విన్ మరో వివరణ ఇచ్చారు. ‘ వారిద్దరిలో (అర్జునుడు, కర్ణుడు) ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే.. ధర్మం వైపు నిలిచిన అర్జునుడే గొప్ప అని చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టడమేనని మండిపడుతున్నారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 06 , 2024
Kannappa: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంచు విష్ణు, రవితేజ.. ఎలాగంటే?
టాలీవుడ్‌లో కొత్త సినిమాలకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సాధించి అదరగొడుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ‘కన్నప్ప’ (Kannappa), ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) టీజర్లు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. తద్వారా సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కన్నప్ప దూకుడు..!
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అతడి స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప' (Kannappa Movie). విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా పేరొందిన ఈ చిత్రాన్ని.. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. గ్రాండ్ విజువల్స్‌తో టీజర్ ఎంతో రిచ్‌గా సాగింది. దీంతో కన్నప్ప టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ టీజర్.. ఇప్పటివరకూ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ముంచు విష్ణు యాక్షన్ లుక్‌లో కనిపించాడు.
రిలీజ్ ఎప్పుడంటే
ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్‌లాల్ (Mohan Lal), శివరాజ్ కుమార్ (Siva Raj Kumar), మోహన్ బాబు (Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar) వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma), స్టీఫెన్ దేవసి సంగీతం అందిస్తున్నారు. కాగా, కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
https://www.youtube.com/watch?v=KCx1bBTM9XE
మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. అదరహో!
రవితేజ (Ravi Teja) హీరోగా మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం.. ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో కథానాయికగా చేస్తోంది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్.. 'షో రీల్స్'ను సోమవారం (జూన్ 17) విడుదల చేసింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ గ్లింప్స్ వీడియో ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన 22 గంటల్లో 7.4 లక్షల వ్యూస్ సాధించి అదరగొడుతోంది.
https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak
దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసలు
మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన మాస్ గ్లింప్స్.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మిస్టర్ బచ్చన్ గ్లింప్స్‌పై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వావ్ హరీష్ శంకర్ సార్.. పంచ్ డైలాగ్ లేకుండానే పంచ్ క్రియేట్ చేశారు. మాస్ మహారాజా అద్భుతంగా ఉన్నారు. బ్లాక్ బాస్టర్ లోడ్ అవుతోంది. థియేటర్‌లో చూడటానికి ఆగలేకపోతున్నా. మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అంటూ స్పెషల్ పోస్టు పెట్టారు. కాగా, మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/ThisIsDSP/status/1802716299455570180
జూన్ 18 , 2024
Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
అశ్వత్థామ ఎవరంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్ లుక్స్ అచ్చం అలాగే ఉండటం గమనార్హం.
గ్లింప్స్‌లో ఏముంది?
కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది.
https://twitter.com/i/status/1782338404421927223
రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్!
అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్ అశ్విన్ కూడా అమితాబ్ బచ్చన్ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్ ‘భైరవ’ టీజర్ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.
నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!
‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్’లోనే విడుదల తేదీని రివీల్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఏప్రిల్ 22 , 2024
Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
దేవర
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు.
ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్ ప్రధాన పాత్రుల పోషించనున్నారు.
మట్కా
వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
KGF 3
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు.
RC16
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
వాల్తేరు వీరయ్య
గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.
ఉప్పెన
సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఘాజీ
1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ లీడ్ రోల్స్‌లో నటించారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
మహా సముద్రం
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.
జనవరి 10 , 2024
Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
యావత్ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం.
మీనాక్షి చౌదరి
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
శ్రీలీల
గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.
ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ గతేడాది ‘అమిగోస్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.
రుక్సార్ థిల్లాన్
యంగ్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
మిర్నా మీనన్
తమిళ నటి మిర్నా మీనన్.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది.
అమృత అయ్యర్
కన్నడ నటి అమృత అయ్యర్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతుంది.
శ్రద్ధ శ్రీనాథ్
స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది.
రుహానీ శర్మ
2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది.
అనుపమ పరమేశ్వరన్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది.
కావ్యా థాపర్
'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
జనవరి 02 , 2024
This Week OTT Releases: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే!
టాలీవుడ్‌లో వచ్చే వారం పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో చిన్న చితకా సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 20కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం
థియేటర్లలలో విడుదలకు సిద్ధమైన సినిమాలు
గాఢ్
తమిళ్‌లో హిట్ సాధించిన ఇరైవన్ మూవీ తెలుగులో గాఢ్ పేరుతో అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం ట్విస్ట్‌లతో కూడిన ఈ చిత్రం తమిళ్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. కాగా ఈ సినిమాను సుధన్ సుందరం, జి. జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఐ.అహ్మద్ డైరెక్ట్ చేశారు.
మధనపూడి గ్రామం అనే నేను
ఓ ఊరి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. శివ కంఠమనేని హీరోగా క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.
రతినిర్వేదం
మలయాళంలో సూపర్ హిట్ అయి తెలుగులోనూ ఒకప్పుడు హిట్ కొట్టిన చిత్రం రతి నిర్వేదం. ఈ చిత్రం అక్టోబర్ 13న రీరిలీజ్ కానుంది. శ్వేతమీనన్, శ్రీజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
సగిలేటి కథ
రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం సగిలేటి కథ. ఈ చిత్రాన్ని రాజశేఖర్ సుద్మూన్ డైరెక్ట్ చేశారు. రవితేజ మహాదాస్యం, విషిక కోట ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. రాయలసీమ సంస్కృతులు పండుగలు సినిమాలో ప్రధానాంశంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
రాక్షస కావ్యం
మైథాలజీని ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అన్వయిస్తూ రూపొందించిన చిత్రం రాక్షస కర్తవ్యం. ఈ చిత్రంలో అభయ్ నవీన్, కుశాలిని లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు రోహిణి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 9- 13)
TitleCategoryLanguagePlatformRelease DateMargauxMovieEnglishNetflixOctober 09Big WopWebseriesGermanNetflixOctober 11KasargoldMovieMalayalamNetflixOctober 13Awareness MovieSpanish Amazon PrimeOctober 11 In My Mother's SkinMovieTagalog Amazon PrimeOctober 12Everybody Loves Diamonds SeriesItalian Amazon PrimeOctober 13The BurialmovieEnglish Amazon PrimeOctober 13Mathagam Part 2SeriesTelugu DubbedHot StarOctober 12GoosebumpsSeriesEnglishHot StarOctober 13Sultan of DelhiSeriesHindiHot StarOctober 13MattikathaMovieTelugu ahaOctober 13 Prema VimanaMovie Telugu Zee 5October 13Star vs Food Survival SeriesHindiDiscovery PlusOctober 09Mr. NagabhushanamSeriesTeluguEtv-WinOctober 13Mission Impossible - Dead Reckoning Part 1MovieEnglishBook My ShowOctober 11Talk To MeMovieEnglishBook My ShowOctober 15The Queen MaryMovieEnglishBook My ShowOctober 15
అక్టోబర్ 09 , 2023
Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం.
జూ.ఎన్టీఆర్
వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’ పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు.
https://youtu.be/b02ieSLiyRI?feature=shared
పవన్ కళ్యాణ్
ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు.
https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU
నాగార్జున
మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు.
సునీల్
విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు..
https://youtu.be/VhyejE23l4M?feature=shared
రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
బాలకృష్ణ
పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు.
https://youtu.be/wcJhLH_T6N0?feature=shared
శోభన్ బాబు:
వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు. బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు.
https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared
కాంతరావు
ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్
తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.
https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
సెప్టెంబర్ 06 , 2023