• TFIDB EN
  • చి ల సౌ
    UATelugu2h 10m
    అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుశాంత్
    అర్జున్
    రుహాని శర్మ
    అంజలి (గాత్రాన్ని చిన్మయి డబ్బింగ్)
    వెన్నెల కిషోర్
    సుజిత్
    అను హాసన్
    అర్జున్ తల్లి
    రోహిణి
    అంజలి తల్లి
    విద్యుల్లేఖ రామన్
    అంజలి సోదరి
    జయప్రకాష్
    అంజలి మామయ్య
    సంజయ్ స్వరూప్ అర్జున్ తండ్రి
    రాహుల్ రామకృష్ణ
    పోలీసు అధికారి
    హరీష్ కోయలగుండ్ల పోలీస్ కానిస్టేబుల్
    సిబ్బంది
    రాహుల్ రవీంద్రన్
    దర్శకుడు
    నాగార్జున
    నిర్మాత
    జస్వంత్ నడిపల్లినిర్మాత
    ప్రశాంత్ ఆర్ విహారి
    సంగీతకారుడు
    రాహుల్ రవీంద్రన్
    స్క్రీన్ ప్లే
    ఎం. సుకుమార్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
    Ruhani Sharma: జాకెట్ లేకుండా రుహాని శర్మ అందాల షో.. తట్టుకోవడం కష్టమే
    గ్లామర్ డాల్ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్‌ హాట్ ఫొటో షూట్‌తో సోషల్‌ మీడియాను అట్టుడికించింది. తన ఎద అందాలను బయటపెడుతూ చెమటలు పట్టించింది. జాకెట్ లేకుండా చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. సమ్మర్‌లో తన అందంతో మరింత హీట్ పెంచేసింది. తాజా ఫొటోల్లో క్రేజీ ఔట్‌ ఫిట్‌తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో మైండ్‌ బ్లాక్ చేసింది. రుహానీ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  2018లో వచ్చి 'చి ల సౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది. చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది. 2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.  2020లో విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్‌’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతేడాది 'హర్‌ ; చాప్టర్‌ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్‌ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.  రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే చిత్రంలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రుహాని శర్మ సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నప్పటికీ.. టాలీవుడ్‌లో ఈ హాట్ డాల్‌కు అవకాశాలు మాత్రం దండిగానే వస్తున్నాయి.
    మే 16 , 2024
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    Ruhani Sharma: ‘శ్రీరంగ నీతులు’ ఫేమ్‌ రుహానీ శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?
    యంగ్‌ హీరోయిన్‌ రుహాని శర్మ (Ruhani Sharma).. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. రీసెంట్‌గా వెంకటేష్‌ ‘సైంధవ్‌’, వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు ‘శ్రీరంగ నీతులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భామ దూకుడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు యూత్‌.. రుహాని అందం, అభినయం చూసి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రుహానీ శర్మ ఎవరు? రుహానీ.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ మలయాళ చిత్రాల్లో ఆమె నటించింది. రుహానీ శర్మ ఎక్కడ పుట్టింది? సోలన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రుహానీ శర్మ ఎప్పుడు పుట్టింది? 18 సెప్టెంబర్‌, 1994 రుహానీ శర్మ తల్లిదండ్రులు ఎవరు? సుభాష్‌ శర్మ, ప్రాణేశ్వరి శర్మకు రుహానీ జన్మించింది.  రుహానీ శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ) రుహానీ శర్మ వయసు ఎంత?  30 సంవత్సరాలు (2024) రుహానీ శర్మకు తోబుట్టువులు ఉన్నారా? ఈ బ్యూటీకి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు సుబ్బి శర్మ. సోదరులు లేరు రుహానీ శర్మ ఏం చదువుకుంది? బీఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) చేసింది. రుహానీ శర్మ.. కెరీర్‌ ఎలా మెుదలైంది? సినిమాల్లోకి రాకముందు రుహానీ.. మోడల్‌గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'కుడి టూ పటాకా' పంజాబి సాంగ్‌ యూట్యూబ్‌లో సూపర్‌ హిట్ అయ్యింది. రుహానీ శర్మ.. మెుదటి చిత్రం? 2017లో తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) చిత్రం ద్వారా రుహానీ తొలిసారి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  రుహానీ శర్మ.. తొలి తెలుగు చిత్రం ఏది? 2018లో వచ్చిన 'చి ల సౌ' (Chi La Sow) సినిమా ద్వారా రుహానీ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యింది.  రుహానీ శర్మ.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి? ‘చిలసౌ’, ‘హిట్: ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్‌: ఛాప్టర్‌ 1’, ‘సైంధవ్‌’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ రుహానీ శర్మ లేటెస్ట్ చిత్రం? శ్రీరంగ నీతులు రుహానీ శర్మ నటించిన ఇతర భాషా చిత్రాలు? కడైసి బెంచ్‌ కార్తీ (తమిళం), ఆగ్రా (హిందీ), కమల (మలయాళం) రుహానీ శర్మ ఫేవరేట్‌ హీరో ఎవరు? టాలీవుడ్‌లో వెంకటేష్‌, బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని రుహానీ తెలిపింది.  రుహానీ శర్మకు ఇష్టమైన కలర్స్‌ ఏవి? బ్లాక్‌ (Black), గ్రే (Grey) రుహానీ శర్మకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం? ఫ్లోరిడా రుహానీ శర్మకు ఇష్టమైన క్రీడ ఏది? క్రికెట్‌ రుహానీ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌? https://www.instagram.com/ruhanisharma94/?hl=en https://www.youtube.com/watch?v=pTdgQNy8BxI
    ఏప్రిల్ 12 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.  టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి  ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.  'కర్మ' అనే సినిమాతో  డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.  విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.  మరో నాలుగేళ్ల తర్వాత  దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.  సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే  అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే  డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
    Ruhani Sharma Hot: మరోసారి రుహానీ శర్మ పరువాల దాడి.. కుర్రకారు హార్ట్ బీట్ ఢమాల్!
    హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్‌ షోతో మరోమారు సోషల్‌ మీడియాను హీటెక్కించింది. రెడ్‌ కలర్‌ జాకెట్‌లో ఎద అందాలను ఆరబోసింది.  ఎర్రటి జాకెట్‌తో తెల్లటి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలకు స్మైలింగ్‌ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టి కుర్రకారుకు కొంటె వల విసిరింది.  రుహానీ శర్మ అందాలతో పాటు ఫిట్‌నెస్‌ కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె ఫిజిక్‌ అద్భుతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.  ‘చిలసౌ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది. 2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.  2020లో విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్‌’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతేడాది 'హర్‌ ; చాప్టర్‌ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్‌ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.  ఈ ఏడాది సంక్రాంతికి రీలైజన 'సైంధవ్‌' చిత్రంలో డా.రేణు పాత్రలో కనిపించి రుహానీ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ రీసెంట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే సినిమాలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ మూవీ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ రూహానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ప్రస్తుతం రుహానీ.. హిందీలో ‘బ్లాకౌట్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.  బ్లాక్‌ బాస్టర్‌ హిట్స్‌ రానప్పటికీ రుహానీ శర్మకు సోషల్‌ మీడియాలో ఏ మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.
    జూన్ 01 , 2024
    Ruhani Sharma: స్ట్రాప్‌లెస్ బ్రాలో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ..!
    Ruhani Sharma: స్ట్రాప్‌లెస్ బ్రాలో అందాలు ఆరబోసిన రుహానీ శర్మ..!
    యంగ్‌ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma).. తన లేటెస్ట్‌ హాట్ ఫొటో షూట్‌తో సోషల్‌ మీడియాను షేక్ చేసింది. తన ఎద పొంగులతో కుర్రకారు హృదయాలను మెలికలు తెప్పేసింది. తాజా సెల్ఫీ ఫొటోల్లో క్రేజీ ఔట్‌ ఫిట్‌తో కనిపించిన ఈ అమ్మడు.. తన ఎద, నడుము అందాలతో యూత్‌ను మైండ్‌ బ్లాక్ చేసింది.  రుహానీ శర్మ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.  మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం 'కడైసి బెంచ్‌ కార్తీ' (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.  2018లో వచ్చి 'చిలసౌ' చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.  చిలసౌ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది. 2018లో 'కమల' అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.  2020లో విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్‌’ కథానాయకుడిగా చేసిన 'నూటక్క జిల్లాల అందగాడు' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతేడాది 'హర్‌ ; చాప్టర్‌ 1' (Her - Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్‌ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.  రీసెంట్‌గా 'సైంధవ్‌' చిత్రంలో డా. రేణు పాత్ర పోషించి ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లేటెస్ట్‌ చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.  అలాగే టాలీవుడ్‌లో ‘శ్రీరంగ నీతులు’ అనే మరో చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ రుహానీ బిజీ బిజీగా గడుపుతోంది. 
    ఫిబ్రవరి 27 , 2024
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    Tollywood Cult  Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే! 
    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే  వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్  బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్  ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.    మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.   అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.  విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే  భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.  పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ  అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
    ఏప్రిల్ 12 , 2023
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీ నటులు : అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్‌ : మల్లీ అంకం సినిమాటోగ్రాఫర్‌ : సూర్య సంగీతం : గోపి సుందర్‌ నిర్మాత : రాజీవ్‌ చిలక నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: 3 మే, 2024 అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి  అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే గణపతి పాత్రలో అల్లరి నరేష్‌ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్‌ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్‌ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్‌, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్‌ తీసుకొని డైరెక్టర్‌ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.  టెక్నికల్‌గా  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రాజ్‌ సుందర్‌ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్‌ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అల్లరి నరేష్‌ నటనకామెడీ మైనస్‌ పాయింట్స్ కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మే 03 , 2024
    విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    విశ్వక్ సేన్ తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న  నటుడిగా గుర్తింపు పొందాడు. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. అయితే విశ్వక్ సేన్ గురించి చాల మందికి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. విశ్వక్ సేన్ అసలు పేరు? దినేష్ నాయుడు. జాతకం దృష్ట్యా తన పేరును విశ్వక్ సేన్‌గా మార్చుకున్నాడు. విశ్వక్ సేన్ ఎత్తు ఎంత? 5 అడుగుల 8 అంగుళాలు విశ్వక్ సేన్ తొలి సినిమా?  హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'వెళ్లిపోమాకే'. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందాడు. విశ్వక్ సేన్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ విశ్వక్ సేన్ పుట్టిన తేదీ ఎప్పుడు? మార్చి 29, 1995 విశ్వక్‌కు వివాహం అయిందా? లేదు ఇంకా కాలేదు విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు? విద్య, విశ్వక్ 8వ తరగతి చదువుతున్నప్పుడు పదోతరగతి యువతి విద్య సోషల్ టీచర్‌గా రెడీ అయినప్పుడు తనను ఎంతో ఇష్టపడినట్లు పేర్కొన్నాడు. విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన సినిమా? జూ.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి విశ్వక్‌ సేన్ ఇష్టమైన హీరో? జూ.ఎన్టీఆర్. కాలేజీ చదువుతున్నప్పుడు అంతా అతని స్నేహితులు జూ. ఎన్టీఆర్ డూప్‌లా ఉన్నావని అనేవారంట. విశ్వక్ సేన్ తొలి హిట్ సినిమా? ఈ నగరానికి ఏమైంది చిత్రం విశ్వక్‌ సేన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే దాస్‌ కా ధమ్కి, అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి హిట్లుగా నిలిచాయి. విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు, బ్లాక్ విశ్వక్ సేన్ తల్లిదండ్రుల పేర్లు? పార్వతి, శేఖర్ నాయుడు విశ్వక్‌ సేన్‌కు ఇష్టమైన ప్రదేశం? విశ్వక్‌కు తీర్థ యాత్రలు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతాడు.  విశ్వక్‌ సేన్ ఏం చదివాడు? జర్నలిజంలో డిగ్రీ చేశాడు. విశ్వక్‌ సేన్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఈ నగరానికి ఏమైంది చిత్రానికి గాను సంతోషం సినిమా అవార్డ్స్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. విశ్వక్ సేన్ పెంపుడు కుక్కల పేర్లు?  Max, Baachi, and Ustaad. విశ్వక్ సేన్ ఎన్ని సినిమాల్లో నటించాడు? విశ్వక్ 2024 వరకు 10 సినిమాల్లో నటించాడు.  విశ్వక్‌ సేన్‌ ఇష్టమైన ఆహారం? బిర్యాని విశ్వక్ సేన్ వ్యాపారాలు? విశ్వక్ సేన్‌ తండ్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి.  https://www.youtube.com/watch?v=oZzP3Xs7eHA విశ్వక్ సేన్ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు విశ్వక్ సేన్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? విశ్వక్ సేన్ ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు .
    మార్చి 21 , 2024
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.  పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.  https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.  https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.  https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.  https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.  https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా, నాగ మహేష్‌, రమేష్‌ రెడ్డి దర్శకత్వం: విజయ్‌ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌ సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌ సంగీతం: సాయిచరణ్‌ పాకాల ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి: నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.   సాంకేతికంగా: దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు. ప్లస్‌ పాయింట్స్‌ నరేష్‌ నటననేపథ్య సంగీతంయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సీన్స్‌సాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5 https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
    మే 05 , 2023
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్‌ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్‌ ఇచ్చేలా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మరో గ్లింప్స్‌ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’ భగత్‌ బ్లేజ్‌(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్‌ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్‌ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌.. 'గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, 'గ్లాస్ అంటే సైజ్‌ కాదు సైన్యం.. కనిపించని సైన్యం' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 అధికార వైసీపీకి గట్టి కౌంటర్! ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్‌’ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  https://twitter.com/i/status/1770055005283688593 పొలిటికల్‌ హీట్‌ పెంచిన డైలాగ్స్‌! మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ - భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్‌ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
    మార్చి 19 , 2024
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.   మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల  మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్‌ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.  https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్  న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC  అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.  https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.  అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన  ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.  View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్‌ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్‌ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.  షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
    మే 14 , 2024
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా ఉప్పెనతోనే స్టార్ డం సంపాదించాడు. కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాల హిట్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ పొందిన వైష్ణవ్ తేజ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. వైష్ణవ్ తేజ్ అసలు పేరు? పంజా వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు? హీరో బాబు వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగులు వైష్ణవ్ తేజ్  తొలి సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్  ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ వైష్ణవ్ తేజ్  పుట్టిన తేదీ ఎప్పుడు? 1995, జనవరి 13 వైష్ణవ్ తేజ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. వైష్ణవ్ తేజ్‌ ఫస్ట్ క్రష్? సొనాక్షి సిన్హా వైష్ణవ్ తేజ్  ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైష్ణవ్ తేజ్  తొలి హిట్ సినిమా? ఉప్పెన వైష్ణవ్ తేజ్‌కు గుర్తింపునిచ్చిన చిత్రం? కొండపొలం వైష్ణవ్ తేజ్  ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్ వైష్ణవ్ తేజ్  తల్లిదండ్రుల పేరు? విజయ దుర్గ, శివప్రసాద్ వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన ప్రదేశం? తిరుమల వైష్ణవ్ తేజ్‌కు ఇష్టమైన సినిమాలు? రజనీకాంత్ నటించిన శివాజి సినిమా వైష్ణవ్ తేజ్  ఏం చదివాడు? డిగ్రీ వైష్ణవ్ తేజ్  అభిరుచులు? సినిమాలు చూడటం, ట్రావలింగ్ వైష్ణవ్ తేజ్  ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  వైష్ణవ్ తేజ్  సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=wYDcnafZkS0
    మార్చి 21 , 2024
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ (Allu Sirish) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ స్ఫూర్తితో నటుడిగా మారాలని నిర్ణంచుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. గౌరవం చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఊర్వశివో రాక్షసివో చిత్రం మంచి బ్రెక్‌ ఇచ్చింది. తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  టాలీవుడ్‌లో చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన అల్లు శిరీష్‌ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అల్లు శిరీష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు అల్లు శిరీష్ తొలి సినిమా? గౌరవం(2013) అల్లు శిరీష్ ఎక్కడ పుట్టాడు? చెన్నై అల్లు శిరీష్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1987, మే 30 అల్లు శిరీష్ వివాహం అయిందా? ఇంకా జరగలేదు. అల్లు శిరీష్‌కు లవర్ ఉందా? అను ఇమాన్యూవెల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అల్లు కిషన్ ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ అల్లు శిరీష్ తొలి హిట్ సినిమా? ఊర్వశివో రాక్షసివో చిత్రం శిరీష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.  అల్లు శిరీష్ ఇష్టమైన కలర్? వైట్ అల్లు శిరీష్ తల్లిదండ్రుల పేరు? నిర్మల, అల్లు అరవింద్ అల్లు శిరీష్ ఇష్టమైన ప్రదేశం? కులు మనాలి అల్లు శిరీష్ ఏం చదివాడు? MCJ అల్లు శిరీష్ అభిరుచులు? డ్రైవింగ్, జిమ్మింగ్ అల్లు శిరీష్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  అల్లు శిరీష్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని అల్లు శిరీష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకి దాదాపు రూ. 2.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=Wg-K4QjOf_Q
    మార్చి 21 , 2024
    కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కిరణ్ అబ్బవరం.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొద్దికాలంలోనే నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  'ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం' చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'వినరో భాగ్యము విష్ణుకథ', మీటర్, రూల్స్ రంజన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. కిరణ్ అబ్బవరం ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు కిరణ్ అబ్బవరంతొలి సినిమా? రాజా గారు రాణి వారు కిరణ్ అబ్బవరం ఎక్కడ పుట్టాడు? రాయచోటి, ఆంధ్రప్రదేశ్ కిరణ్ అబ్బవరం పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, జులై 15 కిరణ్ అబ్బవరం వివాహం అయిందా? ఇంకా జరగలేదు. కిరణ్ అబ్బవరంకు లవర్ ఉందా? తెలియదు కిరణ్ అబ్బవరం ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి కిరణ్ అబ్బవరం తొలి హిట్ సినిమా? SR కళ్యాణమండంపం చిత్రం నటుడిగా మంచి గుర్తింపు ఇచ్చింది. కిరణ్ అబ్బవరంకు ఇష్టమైన కలర్? బ్లాక్ కిరణ్ అబ్బవరం తల్లిదండ్రుల పేరు? తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారని కిరణ్ చెప్పాడు.  కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ప్రదేశం? రాయచోటి కిరణ్ అబ్బవరం ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. కిరణ్ అబ్బవరం అభిరుచులు? సినిమాలు చూడటం, కథలు రాయడం కిరణ్ అబ్బవరం ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 8 సినిమాల్లో నటించాడు.  కిరణ్ అబ్బవరానికి ఇష్టమైన ఆహారం? బిర్యాని కిరణ్ అబ్బవరం సినిమాకి ఎంత తీసుకుంటాడు? వరుస ఫ్లాప్స్ వల్ల తాను రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని.. సినిమా హిట్ అయితే మాత్రం లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకు సినిమాకు రూ.1.5కోట్లు తీసుకునే వాడు. https://www.youtube.com/watch?v=FbS3ZzfE44k
    మార్చి 21 , 2024
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రాజ్ తరుణ్ (Raj Tarun) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్.. తక్కువ టైంలోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ పొందిన రాజ్ తరుణ్ గురించి చాల మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రాజ్ తరుణ్ ముద్దు పేరు? రాజ్ రాజ్ తరుణ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు రాజ్ తరుణ్ తొలి సినిమా? ఉయ్యాల జంపాల రాజ్ తరుణ్ ఎక్కడ పుట్టాడు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజ్ తరుణ్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992, మే11 రాజ్ తరుణ్‌కు వివాహం అయిందా? ఇంకా జరగలేదు. రాజ్‌ తరుణ్‌కు లవర్ ఉందా? కుమారి21F సినిమా సమయంలో హెబ్బా పటెల్‌తో ప్రేమాయణం సాగించినట్లు రూమర్లు వచ్చాయి. రాజ్‌ తరుణ్ ఫెవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి రాజ్ తరుణ్ తొలి హిట్ సినిమా? కుమారి 21F రాజ్ తరుణ్ ఇష్టమైన కలర్? వైట్, బ్లాక్, గ్రీన్ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పేరు? తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి? రాజ్ తరుణ్ ఫెవరెట్ హీరోయిన్? సమంత, అనుష్క శెట్టి రాజ్ తరుణ్‌కు ఇష్టమైన ప్రదేశం? లండన్ రాజ్‌ తరుణ్‌కు ఇష్టమైన సినిమాలు? టైటానిక్, జగడం రాజ్ తరుణ్ ఏం చదివాడు? ఇంజనీరింగ్, సినిమాల్లోకి రాకముందు 50 వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. రాజ్ తరుణ్ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కథలు రాయడం రాజ్ తరుణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.  రాజ్ తరుణ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?  ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=1nbxCrXjMeY
    మార్చి 21 , 2024
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    Martin Luther King Movie Review: లాజిక్‌ కాస్త మిస్‌ అయినా.. కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు! 
    హృదయకాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలతో కడుపుబ్బ నవ్వించిన సంపుర్ణేష్ బాబు.. లీడ్‌ రోల్‌లో మార్టిన్‌ లూథర్ కింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్‌లో కమెడియన్ యోగి బాబు నటించిన సూపర్ హిట్ మూవీ 'మండేలా' సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా పూజ కొల్లూరు డైరెక్టర్‌గా పరిచయం అయింది. సంపూర్ణేష్ బాబు చాల రోజుల గ్యాప్‌ తర్వాత సినిమా చేయడంతో మార్టిన్ లూథర్‌ కింగ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అవుట్‌ అండ్ అవుడ్ కామెడీ సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా మండేలా చిత్రాన్ని మించి ఉందా? ఆ టైప్‌ కామెడీని ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయిందా? వంటి అంశాలను ఇప్పుడు YouSay సమీక్షలో చూద్దాం. కథ ఉత్తరం, దక్షిణ వర్గాలుగా చీలిన పడమరపాడు గ్రామంలో ఆనాథగా స్మైల్( సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. చెప్పులు కుట్టగా వచ్చిన చిల్లరను కూడబెట్టి చిన్న చెప్పుల షాపు పెట్టుకోవాలన్నది అతని కల. అయితే అతను కూడబెట్టిన డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన కష్టార్జితాన్ని పోస్టాఫీసులో దాచుకోవలనుకుంటాడు. ఆధార్ కార్డు, రేషన్‌ కార్డు లేని స్మైల్.. పోస్టాఫీస్‌లో పనిచేసే వసంత( శరణ్య ప్రదీప్‌) దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరుతాడు. దీంతో స్మైల్‌కు మార్టిన్ లూథర్ కింగ్ అని ఓ కొత్త పేరు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వచ్చేలా చేస్తుంది. ఈక్రమంలో పడమరపాడులో ఎన్నికలు వస్తాయి. ఉత్తరం దిక్కు నాయకుడిగా జగ్గు( నరేష్), దక్షిణం దిక్కు నేతగా 'లోకి'(వెంకటేష్ మహా) పోటీలో దిగుతారు. వీరిద్దరికీ సమాన ఓట్లు రానున్నట్లు సర్వేలో ముందే తెలుస్తుంది. ఈ క్రమంలో మార్టిన్ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చిందని తెలిసి.. అతన్ని ప్రసన్నం చేసుకునే పనిని ఇద్దరు మొదలు పెడుతారు. ఓటు హక్కు రావడంతో మార్టిన్ జీవితం ఎలా మారింది. జగ్గు, లోకిల వల్ల ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కొన్నాడు. ఊరికోసం తన ఓటు హక్కును ఎలా ఉపయోగించుకున్నాడు వంటి ఆసక్తికరమైన అంశాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే? సినిమా ఫస్టాఫ్ విషయానికొస్తే.. మరుగుదొడ్డి ఓపెనింగ్ సీన్, అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు ప్రజలు తలపడే సీన్లు కడుపుబ్బ నవ్విస్తాయి. పడమరపాడు గ్రామంలోని విభిన్నమైన ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేసిన సన్నివేశాలు బాగున్నాయి. అక్కడి నుంచి స్మైల్‌ ప్రపంచంలోకి మెల్లగా కథ వెళ్తుంది. గ్రామ ప్రజలు అతనితో మెలిగే తీరు, ఎంతో కష్టపడి అతను సంపాదించిన డబ్బును ఎవరో దొంగిలించడం, పోస్టాఫీస్‌లో వసంత పరిచయం వంటి సీన్లు ఫన్నీగా ఉంటాయి.  మార్టిన్ లూథర్  కింగ్  పాత్ర ద్వారా సమాజంలో ఉన్న అనేక అంశాలపై పంచ్‌లు వేసిన తీరు బాగుంది. ఊర్లో రాజకీయ నాయకుల మధ్య విభేదాల వల్ల  ప్రజలు ఎలా బలి అవుతున్నారో సినిమాలో చూపించారు. ఇక సెకండాఫ్‌ సీరియస్‌గా సాగుతుంది. కొంతవరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తమిళ్‌లో మండేలా చిత్రం పూర్తి కామిక్‌ మార్గంలో వెళ్లి చివర్లో ఎమోషనల్ టచ్ ఇస్తుంది. అక్కడ బాగా కుదిరింది. అయితే మార్టిన్ లూథర్ కింగ్‌లో మాత్రం ఆ కన్‌క్లూజన్ కాస్త మిస్‌ అయింది. కింగ్‌కు ఓటు హక్కు రావడంతో అతని ఓటు కోసం సెకండాఫ్‌లో లోకి, జగ్గు పడే తంటాలు కొంతవరకు కామెడీ అనిపిస్తాయి. అయితే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఎంతసేపు సినిమా ఇద్దరి నాయకుల మధ్యే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు దర్శకుడు సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాడు ఓటు ప్రాధాన్యతనా? లేక రాజకీయ నాయకులను సైటైర్ చేయలనుకున్నారా? అనేది అర్థం కాదు. క్లైమాక్స్‌పై డైరెక్టర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది అనిపించింది. ఎవరెలా చేశారంటే? మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్ బాబు ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన అమాయకపు నటనతో మెప్పించాడు. క్లీన్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి ఫ్రూవ్ చేశాడు. ఇక సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డ వెంకటేష్ మహా, నరేష్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పించారు. నిజంగా ఊర్లోని పరిస్థితులను ప్రతిబింబింపజేశారు. ఇక సంపూర్ణేష్ బాబుకు మద్దతుగా నిలిచిన పోస్టాఫీస్ ఉద్యోగినిగా శరణ్య బాగా చేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది. పెద్దాయన పాత్ర చేసిన రాఘవన్ కూడా మెప్పించాడు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? పూజ కొల్లూరు డైరెక్టర్‌గా తనకు తొలి చిత్రమైనా... అనుభవం ఉన్న  దర్శకురాలిగా సినిమాను బాగా తీసింది. గ్రౌండ్ లెవల్లో రాజకీయాలు, అక్కడ ఉండే పరిస్థితులను గమనించి తెరకెక్కించిన తీరు బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్లు, క్లైమాక్స్ కన్‌క్లూజన్‌పై ఇంకాస్త వర్క్‌ చేస్తే బాగుండు అనిపించింది. టెక్నికల్‌గా.. నిర్మాణ విలువల పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్మరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌.. సినిమా ఎలివేషన్‌కు సాయపడింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్‌గాను వర్క్‌ చేసిన పూజ కోల్లూరు ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సి ఉంది. సాగదీత సీన్లపై కసరత్తు చేస్తే బాగుండేది. దీపక్ యరగెర సినిమాటోగ్రఫి.. సినిమా చూస్తున్నంత సేపూ ఊర్లో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.  బలాలు సంపూర్ణేష్ బాబు నటన ఫస్టాఫ్ కామెడీ బలహీనతలు సెకండాఫ్‌ సాగదీత సన్నివేశాలు క్లైమాక్స్ కన్‌క్లూజన్ చివరగా: లాజిక్‌లు మనసులో పెట్టుకోకుండా వెళ్తే... మార్టిన్ లూథర్ కింగ్ నవ్విస్తాడు, ఆలోచింపజేస్తాడు. రేటింగ్: 3/5
    అక్టోబర్ 27 , 2023
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద వాలిపోతున్నారు. వాటర్‌ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్‌ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  బాలీవుడ్‌ బ్యూటీ వాని కపూర్‌.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్‌ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్‌ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడ సన్‌ సెట్‌ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.  బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్‌సెట్‌ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది.  మరో బ్యూటీ బార్ఖా సేన్‌ గుప్తా.. ఈ లేజీ సమ్మర్‌ డేస్‌ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ నటి మౌని రాయ్‌.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది.  యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్‌లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్‌లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
    ఏప్రిల్ 16 , 2024
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    Kannappa: ప్రభాస్ అంటే అది… ఆ ఒక్క కారణంతో రెమ్యునరేషన్ తిరస్కరించిన డార్లింగ్
    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మాక పాన్ ఇండియన్ చిత్రం కన్పప్ప. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో హైప్‌ను క్రియేట్ చేస్తోంది. గతవారం ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని మేకర్స్ కన్ఫామ్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఇప్పటి వరకు ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో నటించనున్నాడన్నది సస్పెన్స్‌గా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉండేందుకు డబ్బు ఎంతైన ఖర్చు పెట్టేందుకు మేకర్స్ వెనకాడటం లేదు. ఈ సినిమాకు అంతర్జాతీయ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్‌గా ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ వంటి టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. మెస్మరైజింగ్ విజువల్స్, దానికి తగిన కథ, స్క్రీన్‌ప్లేతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు  మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మోహన్ బాబు  ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ఈ కన్నప్పను మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్  ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే? పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భాగమైనప్పటి నుంచి ఓ క్రేజీ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎంత  రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు అని. అయితే దీనిపై తాజాగా  ఓ స్పష్టత వచ్చింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్  తీసుకోవడం లేదని తెలిసింది. చాలా తక్కువ రోజులు ఈ చిత్రం కోసం  ప్రభాస్ పనిచేస్తుండటంతో ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. మంచు విష్ణుతో ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమైంది. అయితే మంచు విష్ణు ప్రభాస్‌కు బిగ్‌ ఎమౌంట్ ఆఫర్ చేసినప్పటికీ... ప్రభాస్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. శరవేగంగా షూటింగ్ ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు అన్ని తానై షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ప్రతీ విషయంలోనూ ప్లాన్‌గా మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75శాతం వరకు పూర్తైనట్లు తెలిసింది. ప్రభాస్ రోల్‌ మీద ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని సమాచారం.గతేడాది నవంబర్‌లో మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. శివలింగం వైపు  కన్నప్ప గెటప్‌లో  విల్లు ఎక్కుపెట్టినట్లు మంచు విష్ణును ఈ పోస్టర్‌లో చూపించారు. నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథగా చూపించనున్నారు. టీజర్ డేట్ ఫిక్స్ కన్నప్ప నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం టీజర్‌ను మే 20న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. అయితే టీజర్ విడుదల చేసే వేదికను ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు మార్చారు. ఈ చిత్రం టీజర్‌ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. దీంతో టీజర్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
    మే 15 , 2024

    @2021 KTree