UATelugu
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సిద్ధార్థ్
నిమిషా సజయన్
అంజలి నాయర్
సహస్ర శ్రీ
సిబ్బంది
ఎస్ యు అరుణ్ కుమార్దర్శకుడు
సిద్ధార్థ్
నిర్మాతఎస్ యు అరుణ్ కుమార్రచయిత
ధిబు నినాన్ థామస్
సంగీతకారుడుబాలాజీ సుబ్రహ్మణ్యంసినిమాటోగ్రాఫర్
కథనాలు
Allu Sneha Reddy: చిన్నారులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు స్నేహా.. ఎందుకంటే?
టాలీవుడ్ ప్రేమ జంటల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒకరు. వీరిద్దరికి వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట మార్చి 6, 2011లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యింది. వీరికి అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బన్నీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇద్దరు పిల్లల్ని అల్లు స్నేహానే చూసుకుంటోంది. వారికి ఆలనా పాలనా దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతేకాదు వారికి బోర్ ఫీల్ అవ్వకుండా కొత్త కొత్త కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తమ పిల్లల్లో ఫుల్ జోష్ నింపేందుకు ఇంట్లో కిడ్స్ పార్టీ నిర్వహించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లలకు గ్రాండ్ పార్టీ!
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తమ పిల్లల కోసం ‘వీకెండ్ స్లీప్‌ఓవర్’ పార్టీ నిర్వహించింది. మూడు రోజుల క్రితం ఈ పార్టీ నిర్వహించగా ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. పెద్ద కుమారుడు అల్లు అయాన్, కూతురు అర్హా ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించిన స్నేహా వారిని ఈ పార్టీలో భాగస్వామ్యం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు స్నేహా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం విశేషం. ‘బాయ్స్ అండ్ గర్స్ #వీకెండ్’ పేరుతో ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన ఫ్రెండ్స్‌ను అయాన్ సర్‌ప్రైజ్ చేయడం వీడియోలో గమనిపించవచ్చు. మరోవైపు అర్హా ఇంట్లోని అవార్డ్స్‌ను ఫ్రెండ్స్‌కు చూపించి ఎంతగానో మురిసిపోయింది. అంతేకాదు అయాన్ తన స్నేహితులతో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి ఎంతో సరదాగా గడిపాడు. స్విమ్మింగ్ చేస్తూ బాల్‌తో ఆడుకున్నాడు. అదే విధంగా ఇంటికి వచ్చిన చిన్నారులకు స్నేహా హెల్తీ ఫుడ్‌ను అరేంజ్ చేసి పెట్టింది. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
అట్లతద్ది సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, ఫ్యామిలీ ఈవెంట్ జరిగినా వెంటనే ఆమె షేర్ తన అభిమానలతు పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల అట్లతద్ది సందర్భంగా కొన్ని ఫొటోలను ఆమె షేర్ చేసింది. ఆ రోజున తెల్లవారుజామునే లేచి పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి అట్లతద్ది సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
స్నేహా బర్త్‌డేకి సర్‌ప్రైజ్ గిఫ్ట్
అల్లు స్నేహారెడ్డి గత నెల 29న 40 పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే భార్య బర్త్‌డేకి బన్నీ అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్నేహాకు తెలియకుండా ఆమె సొంత అక్కని, బెస్ట్ ఫ్రెండ్స్‌ను గోవాకు పిలిపించి సర్‌ప్రైజ్ చేశారు. వారిని సడెన్‌గా చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి ఆనందంలో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ అదిరిపోయిందంటూ బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. బన్నీ-స్నేహా జంట ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని పోస్టులు పెట్టారు.
https://twitter.com/FilmyBowl/status/1840610091973611849
అక్టోబర్ 26 , 2024
2022లో తెలుగులో బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇవే
]మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో నటించిన చిన్నారులు గుర్తున్నారా? రఘుపతి , రాఘవ, రాజారం క్యారెక్టర్లలో నటించిన హర్ష రోషన్, బన్ను ప్రకాశన్, జయతీర్థ అందరినీ కట్టిపడేశారు.మిషన్ ఇంపాజిబుల్
ఫిబ్రవరి 13 , 2023
అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం.
అవికా గోర్ పూర్తి పేరు?
అవికా సమీర్ గోర్
అవికా గోర్ ఎందుకు ఫేమస్
అవికా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది.
అవికా గోర్ వయస్సు ఎంత?
1997, జూన్ 30న జన్మించింది
అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా?
ఉయ్యాల జంపాల(2013)
అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా?
కేర్ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009)
అవికా గోర్ ఎత్తు ఎంత?
5 అడుగుల 4 అంగుళాలు
అవికా గోర్ ఎక్కడ పుట్టింది?
ముంబై
అవికా గోర్ అభిరుచులు?
ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్
అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం?
పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్
అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా?
మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.
అవికా గోర్‌కు ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
అవికా గోర్‌కు ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, షాహిద్ కపూర్
అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అవికా గోర్ తల్లిదండ్రుల పేరు?
సమీర్ గోర్, చేతన గోర్
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది
అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/avikagor/?hl=en
అవికా గోర్ పెట్ పేరు?
షీరో
https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
ఏప్రిల్ 02 , 2024
Allu Arjun: సీఎం రేవంత్‌పై బన్నీ ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్.. మీకో రూల్? బన్నీకో రూలా?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా బన్నీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతడు సైతం ప్రెస్‌మీట్ పెట్టి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అర్జున్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే టార్గెట్ చేస్తోందంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. బన్నీపై చీప్ పాలిటిక్స్ ఆపాలంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ ఇంటిపై సీఎం రేవంత్ అనుచరులే దాడి చేశారంటూ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు.
హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. #StopCheapPoliticsOnALLUARJUN, #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/trollkutami/status/1870898470552502399
తెలంగాణలో 50 మందికి పైగా చిన్నారులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతే దానికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తరహాలో వాటిపైన ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. చిన్నారుల మరణాలపై ఎందుకు మౌనమని నిలదీస్తున్నారు.
https://twitter.com/mahi_gaduu/status/1870835814453899703
https://twitter.com/NaseerMsd_07/status/1870895017210052794
https://twitter.com/Shivasandy99/status/1870829459051601982
హైడ్రా కూల్చివేతల కారణంగా వందల కుటుంబాలు హైదరాబాద్‌లో నష్టపోయాయని బన్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బాధితులు కన్నీరు పెట్టుకున్న వీడియోలను కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/StateJulayi/status/1871011555334385939
https://twitter.com/saitejAAh/status/1871006525483110738
అదే సమయంలో అల్లు అర్జున్ మంచితనానికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక పెద్దావిడన విజయవాడ వెళ్లి మరి బన్నీని కలిసిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
https://twitter.com/rocky_ntr9/status/1871016002361946343
ఆదివారం (డిసెంబర్ 22) బన్నీ ఇంటిపై దాడి చేసిన వారిలో ప్రధాన వ్యక్తులైన ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకుంటున్న రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్దా ప్రేమ్ కుమార్ గౌడ్‌లు.. సీఎం రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితులని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డితో వారు దిగిన ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/pakkatelugunewz/status/1870831972890624082
https://twitter.com/AlluArjunTFC/status/1870813274352263312
https://twitter.com/JuLaYi____/status/1870866218867212397
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టేషన్‌లో వారు దర్జాగా కూర్చొని మెుబైల్స్ యూజ్ చేస్తున్న ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/BinodnotVinod/status/1870828944179741082
https://twitter.com/Ashok4Brs/status/1870842824700105094
అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి వెనుక ఓ ప్రముఖ మీడియా ఛానల్ ఉందని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. నిరసనకారులతో కలిసి మెుదట ఆ ఛానెల్ ప్రతినిధే వెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/allubabloo/status/1871051199560225275
https://twitter.com/SumanthOffl/status/1870801421282767019
అల్లు అర్జున్‌పై పోలీసులు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును విపక్ష BRS ఎండగడుతున్న వీడియోలను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అంత అత్యవసరంగా సంధ్యా థియేటర్ వీడియోను రిలీజ్ చేయాల్సిన అవసరం సీపీకి ఏం వచ్చిందని నిలదీస్తున్నారు.
https://twitter.com/RakeeBRS/status/1870900466181423482
సంధ్యా థియేటర్ ఘటనపై పబ్లిక్ ఓపినియన్ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ పక్షాన కొందరు పౌరులు మాట్లాడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.
https://twitter.com/madmaxtweetz/status/1871081568833531993
అల్లు అర్జున్ వల్ల ఓ ప్రాణం పోయిందని మాట్లాడుతున్న రాయకీయ నాయకులు.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు, స్టూడెంట్స్‌పై ఎందుకు స్పందిచరని ఓ నెటిజన్ ప్రశ్నించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
https://twitter.com/BunnyNikhil214/status/1871048115954073761
గతంలో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై విడుదలైన అనంతరం చాలా మంది నేతలు అతడ్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లారు. ఆ వీడియోను తాజాగా పోస్టు చేసిన ఓ ఫ్యాన్ 'అతని కాలు పోయిందా, కన్నుపోయిందా, చెయ్యి పోయిందా' అంటూ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేశాడు.
https://twitter.com/bunnyvirat831/status/1870885794275299339
సంధ్యా థియేటర్ లోపల నుంచి బన్నీని బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందన్న పోలీసుల వ్యాఖ్యలను ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బన్నీ బయటకు వస్తున్న క్రమంలో చుట్టూ అభిమానులు తప్ప పోలీసులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/AAFanIkkadaa/status/1870850040425783591
డిసెంబర్ 23 , 2024
Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతమేమి కాదు. అయితే సెలబ్రిటీల పిల్లలు అనగానే సహజంగానే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం ఉంటుంది. తమ అభిమాన హీరోల వారసులుగా ఆ చిన్నారులను కూడా ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. అయితే సెలబ్రిటీలు తమ పిల్లలకు పెట్టే కొత్త తరహా పేర్ల విషయంలో ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటి అర్థం తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లలు (Tollywood Celebrity Baby Names), వారి పేర్లకు అర్థాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
[toc]
రామ్ చరణ్ (Ram Charan)
మెగా ఫ్యామిలీలోకి గతేడాది జూన్‌లో బుల్లి ప్రిన్సెస్ అడుగుపెట్టింది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన గారాల పట్టికి ‘క్లింకారా’ అనే పేరు పెట్టారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అలాగే అమ్మవారి శక్తి రూపానికి ప్రతీకగా కూడా భావిస్తుంటారు. ఈ గుణాలను పోగుచేసుకొని క్లీంకారా ఎదగాలని మెగా ఫ్యామిలీ ఈ పేరు పెట్టింది.
జూ. ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్‌కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తారక్ - ప్రణీత దంపతులు తమ మెుదటి సంతానానికి అభయ్ రామ్ అనే పెట్టారు. రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు. హరికృష్ణ తన కొడుకులకి జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్(ఎన్టీఆర్) అని చివర్లో రామ్ వచ్చేలా పెట్టుకున్నారు. అదే సంప్రదాయాన్ని తారక్ కూడా కొనసాగించడం విశేషం. అభయ్ అంటే భయం ఎరుగని వాడు అని అర్థం. ఇక భార్గవ్ రామ్ అంటే శ్రీరాముడు అనేక నామాల్లో ఇదీ ఒకటి.
అల్లు అర్జున్ (Allu Arjun)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. మగబిడ్డకు అల్లు అయాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లకు అల్లు అర్హా అని నామకరణం చేశారు. అయాన్ అంటే దివ్యమైనది (సంస్కృతి), దేవుని బహుమతి (అరబిక్), గుర్తుపెట్టుకోవాల్సింది (పర్షియన్) అని అర్థం. అలాగే అర్హా అంటే 'శివం' అని మీనింగ్ వస్తుంది. ఇస్లామిక్ అర్థాన్ని తీసుకుంటే ప్రశాంతమైన, నిర్మలమైన అని సూచిస్తుందట.
నాని (Nani)
నేచురల్ స్టార్ నాని దంపతులకు ఓ బాబు ఉన్నాడు. పేరు అర్జున్. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటారు. అర్జున్ అంటే సంస్కృతం నుంచి వచ్చిన హిందూ పేరు. పాండవుల్లో ఒకరైన అర్జునుడు గొప్ప వీరుడిగా గుర్తింపు పొందాడు.
నితిన్ (Nithiin)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితీన్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే కొత్తగా తండ్రయ్యాడు. వినాయక చవితికి ఒక రోజు ముందు ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడి పేరును నితిన్ ఎక్కడా రివీల్ చేయలేదు.
మంచు మనోజ్ (Manchu Manoj)
నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు దేవసేన శోభాగా నామకరణం చేశారు. దేవసేన అంటే హిందూ దేవత. దేవతల సైన్యాధిపతిగా పురణాల్లో ఆ పేరును ప్రస్తావించారు. కాగా, ఇరుకుటుంబాల అంగీకారంతో గతేడాది మనోజ్ - మౌనిక వివాహం జరిగింది. మౌనికకు అప్పటికే మెుదటి ద్వారా జన్మించిన కుమారుడు ఉన్నాడు.
నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏడాదే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడికి ధీరా సిద్ధార్థ్ అని పేరు పెట్టారు. ధీర అంటే గొప్ప వీరుడు అని అర్థం.
సుహాస్ (Suhas)
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా ఈ ఏడాదే తండ్రయ్యాడు. అతడి భార్య లలిత జనవరిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తనకు పుట్టిన బిడ్డకు తాను పేరు పెట్టనని సుహాస్ గతంలో తెలిపారు. తన హీరోగా చేసిన ‘కలర్ ఫొటో’ డైరెక్టర్‌కు పేరు పెట్టే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. మరి ఏ పేరు పెట్టారో సుహాస్ అనౌన్స్ చేయలేదు.
రణ్‌వీర్ - దీపికా (Ranveer Singh - Deepika Padukone)
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. సెప్టెంబర్‌లో దీపికా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు దువా పదుకొణే సింగ్ అని పేరు పెట్టారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. తమ ప్రార్థనలకు సమాధానమే ఈమె అంటూ దీపికా నవంబర్ 2న స్పెషల్ పోస్టు పెట్టింది.
రణ్‌బీర్ - అలియా (Ranbir Kapoor - Alia Bhatt)
బాలీవుడ్ బెస్ట్ కపుల్ రణ్‌బీర్ ఆలియా భట్ 2022లో పేరెంట్స్ అయ్యారు. ఓ కూతురుకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు రాహా అనే పేరు పెట్టారు. రాహా అంటే పీస్‌ఫుల్, హ్యాపీనెస్ ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
విరాట్ - అనుష్క (Virat Kohli - Anushka Sharma)
భారత స్టార్ కపుల్ విరాట్-అనుష్కలు ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తమ మగ బిడ్డకు ‘అకాయ్’ అనే పేరు పెట్టారు. అకాయ్ అంటే సంస్కృతంలో నిరాకారమని, రూపం లేనిదని అర్థం. టర్కీ భాషలో మెరుస్తున్న చంద్రుడు అని కూడా అంటారు. ఇక తమ మెుదటి కుమార్తెకు దుర్గాదేవి పేరు వచ్చేలా ‘వామిక’ అని విరుష్క దంపతులు పేరు పెట్టారు.
యామి గౌతమ్ (Yami Gautam)
బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Tollywood Celebrity Baby Names) ఈ ఏ
డాది మేలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. యామి - ఆదిత్య ధర్ దంపతులు తమ బిడ్డకు వేదవిద్ అని పేరు పెట్టారు. వేదవిద్ అంటే వేదాలు బాగా తెలిసినవాడు అని అర్థం.
అమలా పాల్ (Amala Paul)
తమిళ స్టార్ నటి అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. అమలాపాల్ - జగత్ దేశాయ్ దంపతులు జూన్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతడికి ఇలాయ్ అని పేరు పెట్టారు. తమిళంలో ఇలాయ్ అంటే ఆకు (Leaf) అని అర్థం. హీబ్రూలో లాంగ్వేజ్‌లో ఆరోహణ అని కూడా అర్థం వస్తుంది.
నవంబర్ 12 , 2024
Father's Day Special: నాన్నలతో ఈ స్టార్ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చారు.
https://twitter.com/KChiruTweets/status/1802187791251509401
మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది.
View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni)
అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది. ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది.
View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్ షేర్ చేసింది.
https://twitter.com/shrutihaasan/status/1802221449899610217
మెగా బ్రదర్, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్ హీరో ‘వరుణ్ తేజ్’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
జూన్ 17 , 2024
Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్’, ‘టిల్లు స్క్వేర్’కి బెస్ట్ ఛాన్స్.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్ మెుత్తానికి ఇద్దరు యంగ్ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా!
ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్’' (Family Star Release Date) ఏప్రిల్ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.
హిట్ అయితే కలెక్షన్స్ సునామే!
‘టిల్లు స్క్వేర్’, ‘ఫ్యామిలీ స్టార్’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.
హిట్ కాంబో రిపీట్ అవుతుందా?
‘టిల్లు స్క్వేర్’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్ మల్లిక్ రామ్ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్ పరుశురామ్ పెట్ల, నటుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్ హిట్ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ మ్యాన్ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్’
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.
మార్చి 21 , 2024
Rashi Singh: జీన్స్ బటన్ విప్పి.. చెమటలు పట్టిస్తున్న కుర్ర హీరోయిన్
కుర్ర హీరోయిన్ రాశి సింగ్ హాట్ ఫోటో షూట్‌తో పరువాల విందు చేస్తోంది. అందాల ప్రదర్శనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.
బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ వేసుకున్న ఈ ముద్గుగుమ్మ జీన్స్ బటన్ తొలగించి హాట్ ఫొటో షూట్ చేసింది.
rashi singh
ఎద, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అనే పంథాలో సాగుతున్నట్లు రాశి సింగ్ కనిపిస్తోంది.
ఇన్‌స్టాలో హాట్ ఫోటో షూట్ తాలుకు ఫోటోలు పెడుతూ కవ్విస్తుంటుంది.
ముఖ్యంగా తనకు ఇష్టమైన బ్లాక్, లైట్ పింక్ కలర్ డ్రెస్సులో నిండైన అందాలను ఎర వేస్తుంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే రాశి సింగ్(Rashi singh Hot) చలాకీగా ఉంటుంది. ఎప్పటికప్పుడూ రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది.
ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
తెలుగులో జమ్ (2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు
.
అయితే ఆది సాయికుమార్ నటించిన శశి చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో మెప్పిస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.
రాశి సింగ్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఈమె ఛత్తీస్ గఢ్‌లోని బిలాయిలో 1994 జనవరి 5న జన్మించింది.
బిలాయిలోని కృష్ణ పబ్లిక్ స్కూల్‌లో సెకండరీ విద్యను, ముంబైలో పీజీ చదివింది. రాశి సింగ్‌కు డ్యాన్స్ చేయడం, సాంగ్స్ వినడమంటే ఇష్టం
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన "భూతద్దం భాస్కర్ నారాయణ'' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విలేజ్ క్లైమ్ నేపథ్యంలో రానుంది.
ఈ సినిమా విజయంపై రాశి సింగ్(Rashi singh Movies) గంపెడు ఆశలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే అవకాశాలు దారి చూపుతాయని కలలు కంటోంది.
ఫిబ్రవరి 26 , 2024
This WeeK OTT Movies (Oct 02- 7) : ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
దసరా పండుగ మరో రెండు వారాల టైం ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీగా దిగకుండా.. ఇప్పుడే థియేటర్లలో విడుదలయ్యేందుకు ఈవారం పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈవారం ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలాగే ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్ వేద్దాం..
రూల్స్ రంజన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, టిల్లు పాప నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సమ్మోహనుడా సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. యూత్ ఇన్‌స్టారీల్స్‌లో ఈ సాంగ్‌ను పెద్దఎత్తున అనుసరించారు. కాగా సినిమాను రత్నం కృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పణలో మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు.
మామ మశ్చీంద్ర
వినూత్నమైన టైటిల్‌తో సుధీర్ బాబు హీరోగా వస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ సినిమాను హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, హీందీ భాషల్లో ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది.
చిన్నా
సిద్ధార్థ్, అంజలీ నాయర్ కీలక పాత్రల్లో.. అరుణ్‌కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న మలయాళ చిత్రం 'చిత్త'. తెలుగులో 'చిన్నా' పేరుతో అక్టోబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సిద్ధార్థ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మంత్ ఆఫ్ మధు
క్రేజీయాక్టర్ నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కాంబోలో వస్తున్న వినూత్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. భావోద్వేగాల నేపథ్యంగా ఈ చిత్రం రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు.
800
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం '800'. మురళీ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. ఆయన భార్య మదిమలర్ క్యారెక్టర్లో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, హిందీ, సింహాలి, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో 800 వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంఎస్. శ్రీపతి డైరెక్ట్ చేశాడు.
ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు (October 1- 7)
TitleCategoryLanguagePlatformRelease DateBeckham SeriesEnglishNetflixOct 04Race to the SummitMovieGermanNetflixOctober 04Everything Now SeriesEnglishNetflixOctober 05Sister Death MovieEnglish NetflixOctober 05Miss Shetty Mr. Polishetty MovieTelugu Movie NetflixOctober 05 Fair Play MovieEnglishNetflixOctober 06Insidious: The Red DoormovieEnglishNetflixOctober 06Strong Girl Nam SoonSerieskoreanNetflixOctober 07 Mumbai Diaries Season 2SeriesHindi Amazon PrimeOctober 06 Totally Killer MovieEnglishAmazon PrimeOctober 06Desperately Seeking Soulmate SeriesEnglish Amazon PrimeOctober 06Haunted Mansion Movie English HotstarOctober 04Loki: Season 2SeriesEnglishHotstarOctober 06Mr. Pregnant MovieTeluguAhaOctober 06The Great Indian SuicideMovieTeluguAhaOctober 06Nee Vente NenuMovieTeluguCine BazaarOctober 06Gadar 2MovieHindiZee5October 06The Nun 2 MovieEnglishBook My ShowOctober 03Gran Turismo MovieEnglishBook My ShowOctober 05Asteroid City MovieEnglish Book My ShowOctober 06
అక్టోబర్ 02 , 2023
Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్ మోడల్ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్ కేర్ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం.
తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram A post shared by @forestessentials
'లైవ్ యువర్ ఫెయిరీ టేల్' అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.
2020లో హాలీవుడ్ యాక్టర్ ‘రాబర్ట్ హాఫ్‌మన్’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్ చేశాడు.
మలీషా కోసం ‘గో ఫండ్ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.
సోషల్ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.
మలీషాకు పాపులారిటీని గమనించిన ‘ది పికాక్’ అనే మ్యాగజైన్ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్ పేజ్ మీద ప్రింట్ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా మలీషా స్టోరీని పబ్లిష్ చేశాయి.
మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్ వెరిఫైడ్ బ్లూ టిక్ ఇచ్చింది.
‘ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.
మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.
చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది.
మే 24 , 2023
ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
తల్లి కాబోతుంది
గోవా బ్యూటీ ఇలియానా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చిన్నారి టీషర్ట్‌ని, తన మెడలోని ‘మామా’ అంటూ ఉన్న ఫోటోలను షేర్ చేసినా హీరోయిన్… “లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను” అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సుందరి గుడ్ న్యూస్ చెబుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)
ఇలియానా జీవితం
కెరీర్ పీక్ దశలో ఉండగానే ఇలియానా సినిమాలకు దూరం అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలే విడిపోవడానికి కారణం.
ఆమె సోదరుడితో డేటింగ్
ఆండ్రూతో విడిపోయిన తర్వాత ఇలియానా మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని ఇల్లీ బేబి అధికారికంగా ధ్రువీకరించలేదు. స్పందించడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో వార్తలు నిజేమనని అనుమానాలు చాలామందిలో కలిగాయి.
తండ్రి ఎవరు?
ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టి ఒక్కసారిగా షాకిచ్చింది ఇలియానా. భర్తతో విడిపోయి మూడేళ్ల తర్వాత ఇలా ప్రకటించడంతో.. తండ్రి ఎవరంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసని.. ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
పరిచయం చేస్తుందా?
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రేమికుడిని ఇలియానా పరిచయం చేసే ఛాన్స్ ఉందనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అటు సరోగసి లేదా దత్తత తీసుకోవటం ద్వారా ఆమె తల్లి అవుతుందేమో అని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇలియానా జీవిత భాగస్వామి ఎవరనేది సస్పెన్స్. దీనికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
టాప్ హీరోయిన్
దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా కొద్ది రోజుల్లోనే గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా హిట్‌తో ఏకంగా మహేశ్ సరసన పోకిరి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి అగ్రహీరోలతో నటించి హిట్లు అందుకుంది. అల్లు అర్జున్‌తో జులాయి తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ…. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం… ఇలియానా బొద్దుగా మారటంతో ఆఫర్లు తగ్గిపోయాయి.
ఏప్రిల్ 18 , 2023
Mufasa: The Lion King Review: మహేష్ ప్రాసలు, పంచ్‌లు అదరహో.. ‘ముఫాసా’ ఎలా ఉందంటే?
నటులు: మహేష్ బాబు, సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ (డబ్బింగ్ చెప్పినవారు)
దర్శకత్వం: బబ్యారీ జెన్ కిన్స్
సినిమాటోగ్రఫీ: జేమ్స్ లక్ట్సాన్
ఎడిటింగ్: జోయ్ మెక్‌మిలన్
సంగీతం: డేవ్ మెట్జర్, నికోలక్ బ్రిటెల్, లిన్ మాన్యుల్ మిరాండ
నిర్మాతలు: అడెలె రొమన్‌స్కీ, మార్క్ కారియాక్
నిర్మాణ సంస్థ: డిస్నీ
విడుదల: డిసెంబర్ 20, 2024
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King Review In Telugu) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేష్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పాడు. అలాగే సత్యదేవ్, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్ కూడా పలు తమ స్వరాన్ని అందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 20న ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? మహేష్ డబ్బింగ్ ఆకట్టుకుందా? యానిమేషన్ వర్స్క్ మెప్పించాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
ముఫాసా (మహేష్ బాబు వాయిస్ ఓవర్) చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు వింటూ పెరుగుతాడు. దూరంగా ఉండే మిలేలే అనే స్వర్గం లాంటి రాజ్యం గురించి తరచూ వింటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓరోజు వరదల రావడంతో ముఫాసా కొట్టుకుపోతాడు. అలా టాకా (సత్యదేవ్ వాయిస్ ఓవర్) ఉన్న రాజ్యానికి వస్తాడు. ముఫాసా రాకను టాకా తండ్రి ఒప్పుకోడు. కానీ టాకా తన అన్నలా పెంచుకుందామని పట్టుబడతాడు. టాకా తల్లి కూడా సపోర్ట్ చేయడంతో ముఫాసా వారి ఫ్యామిలీలో భాగమవుతాడు. ఓ రోజు టాకా తల్లిపై తెల్ల సింహాలు దాడి చేయగా ముఫాసా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తెల్ల సింహాల యువరాజును చంపేస్తాడు. అది తెలిసిన తెల్ల సింహాల రాజు కిరోస్ ముఫాసా ఉంటున్న రాజ్యంపై దాడి చేస్తాడు. ఆ దాడి నుంచి తప్పించుకొని ముఫాసా, టాకాలు చిన్నప్పుడు విన్న మిలేలే రాజ్యం వైపు పయనమవుతారు. ఈ ప్రయాణంలో వాటికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ముఫాసాను చంపడానికి కిరోస్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ముఫాసాకు టాకా ఎందుకు ఎదురు తిరిగాడు? చివరకూ ముఫాసా ఎలా రాజయ్యాడు? అన్నది స్టోరీ.
డబ్బింగ్ ఎలా ఉందంటే
ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa: The Lion King Review) లైవ్ యానిమేషన్ చిత్రం. ఇందులో నటీనటులు కనిపించరు వారు చెప్పిన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. డబ్బింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగులో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఫాసా పాత్రకు మహేష్ డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది. తెరపై సింహాం ప్లేస్‌లో మహేష్‌ను ఊహించుకునేంతలా అతడు తన వాయిస్‌తో మెస్మరైజ్ చేశాడు. సెటైర్లు, పంచ్‌లు, గంభీరమైన డైలాగ్స్‌తో మహేష్ అదరగొట్టాడు. టాకా పాత్రకు నటుడు సత్యదేవ్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. మంచి సోదరుడిగా, ఆ తర్వాత విలన్లతో చేతులు కలిపిన వెన్నుపోటు దారుడిగా వాయిస్‌లో మంచి వేరియేషన్స్ ప్రదర్శించాడు. అటు పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు. వారిద్దరు తమ వాయిస్‌తో కామెడీని బాగా పండించారు. మిగిలిన పాత్రలకు డబ్బింగ్ చెప్పినవారు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
https://twitter.com/DisneyStudiosIN/status/1867064334456615039
డైరెక్షన్ ఎలా ఉందంటే
2019లో వచ్చిన 'ది లయన్ కింగ్' చిత్రానికి ప్రీక్వెల్‌గా దర్శకుడు బ్యారీ జెన్ కిన్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ముఫాసా రాజు కాగా అతడి కొడుకు సింబా చుట్టూ కథ తిరిగింది. తాజా చిత్రంలో ముఫాసా ఎలా రాజు అయ్యాడు? టాకా అలియాస్ స్కార్ ఎవరు? అనేది చూపించాడు. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా మెరుపులు కనిపించవు. కానీ విజువల్స్, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్‌లో ఆసక్తి రగిలించాడు దర్శకుడు. ముఖ్యంగా మిలేలే అనే స్వర్గం లాంటి ప్రపంచంలో ప్రేక్షకులను లీనం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ముఫాసా, టాకా సోదరుల కథ ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టేలా ఉండటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే రొటీన్ స్టోరీ, ఊహాజనీతమైన కథనం మైనస్‌గా చెప్పవచ్చు. పెద్దలు, మాస్ ఆడియన్స్ సంగతి ఏమోగానీ, చిన్నారులకు మాత్రం ముఫాసా పక్కా ఎంటర్‌టైన్ చేస్తుందని చెప్పవచ్చు. రెండున్నర గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్లి వస్తారు.
టెక్నికల్‌గా..
టెక్నికల్‌గా హాలీవుడ్ స్టాండర్డ్స్ (Mufasa: The Lion King Review) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ డిపార్ట్‌మెంట్ టాప్ నాచ్ పనితీరు కనబరిచింది. నిజమైన సింహాలను తెరపై చూస్తున్నట్లుగా భ్రమను కల్పించడంలో వారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో డిస్నీ ఎక్కడా రాజీపడలేదు. చాలా నాణ్యమైన గ్రాఫిక్స్‌ను అందించారు.
ప్లస్ పాయింట్స్
మహేష్‌బాబు డబ్బింగ్‌గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ మాయజాలంసంగీతం, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
ఊహాజనితంగా సాగే కథనంట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
డిసెంబర్ 20 , 2024
Citadel Honey Bunny Review: ఇండియన్ స్పైగా అదరగొట్టిన సామ్.. ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఎలా ఉందంటే?
నటీనటులు: వరుణ్ ధావన్, సమంత, కేకే మేనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్ తదితరులు
రచన: సీత.ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
దర్శకత్వం: కృష్ణ డి.కె, రాజ్ నిడిమోరు
సంగీతం : అమన్ పంత్
సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్
ఎడిటింగ్ : సుమిత్ కొటియన్
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : నవంబర్ 7, 2024
హిందీలో 'ఫ్యామిలీ మ్యాన్' (Family Man), 'ఫర్జీ' (Farzi) వంటి విజయవంతమైన సిరీస్‌లను రూపొందించి దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఎంతో గుర్తింపు సంపాదించారు. రీసెంట్‌గా వారి దర్శకత్వంలో రూపొందిన మరో మోస్ట్ వాంటెడ్ సిరీస్ ‘సిటాడెల్’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), గ్లామర్ బ్యూటీ సమంత (Samantha Ruth Prabhu) ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review) పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. జేమ్స్ బాండ్ మూవీల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే సమంత మరోమారు ఆకట్టుకుంటుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. అదే సమయంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. గురు (కేకే మేనన్) ప్రైవేటు సీక్రెట్ ఏజెన్సీ నాయకుడిగా ఉంటాడు. ఓ రోజు షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టు హనీ (సమంత)తో బన్నీకి పరిచయం ఏర్పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీతో కలిసి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసేందుకు హనీ ఒప్పుకుంటుంది. మిషన్ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. 8 ఏళ్ల తర్వాత హనీ బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అంతేకాదు తమ కలయికతో పుట్టిన నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలుసుకుంటాడు. దీంతో విదేశాల్లో ఉన్న బన్నీ ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హనీ దగ్గర ఉన్న అర్మాడాలో ఏముంది? దాని కోసం ఎందుకు విలన్ గ్యాంగ్ వెతుకుతుంది? అన్నది స్టోరీ. (Citadel Honey Bunny Review)
ఎవరెలా చేశారంటే
బన్నీ పాత్రలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తనమార్క్ చూపించి అదరగొట్టాడు. ఇక సిరీస్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సమంత నటన గురించే. తన నటనతో పాటు ఫైట్ సీన్స్‌లోనూ సామ్ దుమ్మురేపింది. సీక్రెట్ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా సమంత మూడు వేరియేషన్స్‌లో చక్కగా నటించింది. సమంత, వరుణ్ లిప్‌లాక్ సీన్స్ యూత్‌కు కన్నుల విందుగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది. సిరీస్ మెుత్తం వరుణ్, సామ్ స్క్రీన్ ప్రజెన్స్ చుట్టే తిరిగింది. తన గ్లామర్‌తో సమంత కట్టిపడేసింది. నాడియా పాత్ర కథలో భావోద్వేగాలను పండించేందుకు బాగా ఉపయోగపడింది. ఆ పాత్ర చేసిన చిన్నారి అద్భుతంగా నటించింది. కేకే మేనన్, సిమ్రన్, సహా బన్నీ టీమ్‌లో ఉన్న మిగిలినవాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ పరంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny Review)లో పెద్దగా కొత్త దనం కనిపించదు. కానీ కథను ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం రాజ్ అండ్ డీకే టీమ్ తమ మార్క్ చూపించారు. ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించి 1992, 2000 సంవత్సరాల్లో పార్లర్‌గా కథను నడపడం ఆకట్టుకుంది. ప్రస్తుత కథలోని పాత్రలు, వాటికి గతంలో ఒకదానితో ఒకటికి ఉన్న కనెక్షన్స్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా క్లీన్‌గా ప్రజెంట్ చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ పాత్రల పరిచయానికే సరిపోయినా మూడో ఎపిసోడ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్లారు డైరెక్టర్స్. ప్రపంచాన్ని, దేశాధినేతలను శాసించగల ఆర్మార్డ్ వస్తువును దక్కించుకునేందుకు హనీ-బన్నీ, విలన్ గ్యాంగ్ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, ఎలాంటి ట్విస్టులు లేకుండా కూల్‌గా కథ సాగిపోవడం, ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పైనే నిడివి ఉండటం మైనస్‌గా మారింది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు (Citadel Honey Bunny Review) మంచి పనితీరు కనబరిచాయి. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జోహన్ హెర్లీన్ సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఫైట్స్, ఛేజింగ్ సీన్లను క్యాప్చర్ చేసిన తీరు యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకొనేలా ఉంది. అయితే నిడివి విషయంలో జాగ్రత్త పడి ఉంటే బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉండాల్సింది. రూసో, రాజ్ డీకే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
సమంత, వరుణ్‌ధావన్‌యాక్షన్ సీక్వెన్స్‌టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ నిడివిట్విస్టులు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
నవంబర్ 07 , 2024
Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్ ఇచ్చినట్లేనా?
నటీనటులు : గోపిచంద్, కావ్యా థాపర్, నరేష్, ముఖేష్ రిషి, జిషూ సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సునీల్, శ్యామ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వీ తదితరులు
దర్శకత్వం : శ్రీను వైట్ల
సంగీతం : చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : కె. వి. గుహన్
ఎడిటింగ్ : అమర్ రెడ్డి
నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి. విశ్వ ప్రసాద్
విడుదల తేదీ : అక్టోబర్ 11, 2024
ప్రముఖ నటుడు గోపిచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా చేసింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్ల, యాక్షన్ హీరో గోపిచంద్ గతకొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న (Viswam Movie Review) విడుదలైన ‘విశ్వం’ వారికి విజయాజాన్ని అందించిందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమె పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే గోపిరెడ్డి ఆ కుటుంబానికి పరిచయం కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇటలీలో కలిసిన సమైరా (కావ్య థాపర్)కు గోపిరెడ్డి ఎందుకు దూరమయ్యాడు? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నటుడు గోపిచంద్ ఎప్పటిలాగే తన సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. తనలో మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందని విశ్వంతో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే గత చిత్రాలతో పోలిస్తే గోపిచంద్ పాత్రలో పెద్దగా వైవిధ్యం లేదు. రొటీన్ పాత్రనే చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కావ్యా థాపర్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. అయితే గ్లామర్‌గా మాత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, రాహుల్ రామకృష్ణ పాత్రలు సినిమాలో బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్‌లో వారి పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘ఆనందం’, ‘సొంతం, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు తీసిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో కాస్త ట్రాక్ తప్పారు. అయితే తన బలాబలాలు గుర్తించి ‘విశ్వం’తో మళ్లీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఔట్‌డేటేడ్ స్టోరీని ఎంచుకోవడం మైనస్‌గా చెప్పవచ్చు. పంచ్‌లు, కామెడీ ట్రాక్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, పృథ్వీ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటలీ ట్రాక్‌లో కొత్త దనం కనిపించదు. విలన్ పాత్ర కూడా బలహీనంగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా విశ్వం పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం డీసెంట్‌గా అనిపిస్తుంది. రెండు, మూడు సాంగ్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కె.వి గుహన్ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. అమర్ రెడ్డి కుడుముల తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టే ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్ రిచ్‌గా కనిపించింది.
ప్లస్ పాయింట్స్
గోపిచంద్ నటనకామెడీ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఔట్‌డేటెడ్ స్టోరీ సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
Sopathulu Review: మిమ్మల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ఓటీటీ చిత్రం.. ‘సోపతులు’ ఎలా ఉందంటే?
నటీనటులు : భాను ప్రకాష్, సృజన్, మణి ఏగుర్ల, మోహన్ భగత్, రవీందర్ బొమ్మకంటి, అంజయ్య మిల్కూరి, పద్మ, తదితరులు
రచన, దర్శకత్వం : అనంత్ వర్ధన్
సంగీతం : సంజీత్ ఎర్రమిల్లి
సినిమాటోగ్రఫీ : ముత్యాల సునీల్
ఎడిటర్: వెంకట్ రెడ్డి
నిర్మాత : వినోద్ అనంతోజు
ఓటీటీ : ఈటీవీ విన్
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఇటీవల వరుసగా ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‍లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ‘సోపతులు’ అనే ఫిల్మ్‌ను స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. విద్యార్థుల స్నేహ బంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రధానంగా ఇద్దరు బాలలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆ స్నేహితుల మధ్య అనుబంధం ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
చింటు (మాస్టర్ భానుప్రకాశ్), గుడ్డు (సృజన్) బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అనుకోకుండా వచ్చిన కొవిడ్‌తో వారు దూరమవ్వాల్సి వస్తుంది. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో గుడ్డూ కుటుంబం మహబూబాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిపోతుంది. గుడ్డూ దూరం కావడంతో చింటు ఒంటరి తనం ఫీలవుతాడు. దోస్తును కలుసుకునేందుకు వయసుకు మించిన ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు గుడ్డూ సైతం ఎలాగైనా మిత్రుడిని చూడాలని అనేక ప్రయాసలు పడుతుంటాడు. మరి వారిద్దరు కలిశారా? ఫొటోగ్రాఫర్‌గా స్థిరపడాలనే చింటు అన్నయ్య కల నెరవేరిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఇందులో పాత్రలు తక్కువే అయినా తెరపైన కనిపించిన ప్రతీ ఒక్కరి నటన సంతృప్తి ఇస్తుంది. చింటుగా మాస్టర్ భాను ప్రకాశ్ ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. గుడ్డూగా సృజన్ సైతం మెప్పించాడు. వారిద్దరు ఎంతో సహజంగా నటించారు. కథ మెుత్తం వారిద్దరి చుట్టే తిరిగింది. అటు ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ కూడా ఓ కీలక పాత్రలో నటించి పర్వాలేదనిపించాడు. చింటు అన్నయ్యగా మణి ఏగుర్ల, అనూష రమేశ్, అంజిమామ తదితరులు పాత్రల మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
కొవిడ్/లాక్‌డౌన్‌ను కథా వస్తువుగా తీసుకొని ఇద్దరు చిన్నారుల స్నేహాన్ని ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనంత్ వర్ధన్. కొవిడ్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలాంటి ఇబ్బిందులు పడ్డాయో కళ్లకు కట్టాడు. చింటు, గుడ్డు, వారి ఫ్యామిలీ నేపథ్యంతో కథను నెమ్మదిగా ప్రారంభించిన డైరెక్టర్ కథలో ముందుకెళ్లెకొద్ది ఆసక్తి రగిలించాడు. ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ లేక గుడ్డూ పడే ఇబ్బందులు హృదయాన్ని హత్తుకుంటాయి. చింటూ అన్నయ్య పాత్రను నేటి యువతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తి ఇస్తుంది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడం, మలుపు కొరవడటం, ఊహకందేలా కథనం సాగడం, పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని పాత్రల ముగింపు అంసపూర్ణంగా ఉండటం వంటివి మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
బాలల నటనభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
కమర్షియల్ హంగులు లేకపోవడంఊహాకందేలా కథనం సాగటం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 20 , 2024
Kalki 2898 AD: రామ్‌చరణ్ కూతురికి కల్కి టీమ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ప్లాన్ అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రంపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన AI వెహికల్.. బుజ్జిని ప్రముఖ నగరాల్లో తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను బుజ్జి వెహికల్‌ను నడపాలని కోరి వరల్డ్ వైడ్‌గా సినిమాపై అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక తాాజాగా మరో కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రమోషన్స్‌ను మేకర్స్ షురూ చేశారు.
క్లింకారకు స్పెషల్ గిఫ్ట్
సరికొత్త ప్రమోషన్స్‌కు కల్కి టీమ్ నాంది పలికింది. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్‌లు పంపుతోంది. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు (Klinkaara) మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి. క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది.
చిన్నారులపై ఫోకస్
సాధారణంగా ఏ సినిమా మేకర్స్ అయినా రిలీజ్ సందర్భంగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంటారు. అయితే కల్కి టీమ్ ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఓ వైపు పెద్దలను ఆకర్షిస్తూనే చిన్నారులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారులపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల కిడ్స్‌ను టార్గెట్ చేస్తూ 'బుజ్జి అండ్ భైరవ' (Bujji And Bhairava) పేరుతో సరికొత్త యానిమేషన్ సిరీస్‌ను తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది చిన్నారులను ఎంటగానో ఆకర్షిస్తోంది. అటు పెద్దల నుంచి సైతం సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా స్పెషల్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్‌ను కూడా పిల్లల కోసమే లాంచ్ చేశారు.
కారణం ఇదేనా!
‘కల్కి 2898 ఏడీ’ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన బుజ్జి, భైరవ సిరీస్, గ్లింప్స్‌ను పరిశీలిస్తే కల్కి చిత్రం సూపర్ హీరోల కాన్సెప్ట్‌ను తలపిస్తోంది. సాధారణంగా ఈ తరహా చిత్రాలు.. పెద్దల కంటే పిల్లలనే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో వచ్చిన అవెంజర్స్, మార్వెల్ సిరీస్ చిత్రాలు ఈ విషయాన్నే రుజువు చేశాయి. కాబట్టి కల్కి టీమ్ కూడా ఆ పాయింట్‌నే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముందుగా పిల్లల్లో కల్కి సినిమాపై ఆసక్తి రగిలిస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులను కూడా థియేటర్లకు రప్పించవచ్చని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. అటు యూత్, టీనేజర్స్‌ను ఆకర్షించడానికి ప్రభాస్ ఉండనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది.
కల్కి రన్‌టైమ్ లాక్?
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) రన్ టైమ్ ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రీసెంట్ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఈ సినిమా నిడివిని 3.10 గం.లుగా మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని ప్రచారం జరుగుతోంది. అయితే రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు.
జూన్ 03 , 2024
Kalki 2898 AD: ‘కల్కి’ రన్‌టైమ్ లాక్.. సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న లేటెస్ట్ సైన్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలకు ఇంకా నాలుగు వారాలే గడువు ఉండటంతో మేకర్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రన్ టైమ్‌ను లాక్ చేసినట్లు ఓ బజ్ బయటకొచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్‌పై హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
కల్కి రన్‌టైమ్ ఎంతంటే?
'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీలోని పాత్రలను ఒక్కొక్కరిగా రివీల్ చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రభాస్ (భైరవ), అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), బుజ్జి (రోబోటిక్ వెహికల్) పాత్రలు బయటకొచ్చాయి. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినినా నిడివిని 3.10 గం.లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లి ఏమైన కత్తెరలు పడినా కూడా నిడివి 3 గం.లకు తగ్గే పరిస్థితి ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దాని వల్లే కల్కి బడ్జెట్ పెరిగింది: ప్రభాస్
కల్కి సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్‌పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి చిత్రాన్ని దేశ ప్రజలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్ భారీగా పెరిగిందని అన్నారు. గ్లోబల్ రేంజ్ సినిమా కావడం వల్ల కల్కిలోని పాత్రల పేర్లు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి సినిమా చూశాక ప్రేక్షకులు మరో కొత్త ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలోకి వెళ్తారని అన్నారు. అవతార్ చూశాక పొందిన కొత్త అనుభూతినే కల్కి తర్వాత ప్రేక్షకులు పొందుతారని హామి ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కల్కి విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.
చెన్నై వీధుల్లో బుజ్జి సందడి
కల్కి చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఇటీవల చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. ఆ మూవీని పలు నగరాల్లో తిప్పుతూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇప్పటికే ఈ వాహనాన్ని టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య డ్రైవ్ చేశారు. మరోవైపు బుజ్జిని నడపాలంటూ టెస్లా, స్పెస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ కోరారు.
https://twitter.com/i/status/1795776188931305863
31న స్పెషల్ వీడియో!
కల్కి సినిమాలో బుజ్జి - భైరవ (ప్రభాస్) ప్రయాణం ఎలా సాగిందో తెలియజేసేందుకు మే 31న ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. 'బుజ్జి అండ్ భైరవ' (Bujji And Bhairava) పేరుతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. చిన్నారులను ఎంటర్‌టైన్ చేసే ఉద్దేశ్యంతో ఓ కార్టూన్ రూపంలో వీడియోను రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ఏముందో తెలియాలంటే స్పెషల్ వీడియో వచ్చేవరకూ ఆగాల్సిందే.
https://twitter.com/i/status/1795100292314186235
తెలుగులో అత్యధిక రన్‌టైమ్ చిత్రాలు
కల్కి తరహాలోనే ఇప్పటివరకూ అత్యధిక రన్‌టైమ్ కలిగిన చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.
https://telugu.yousay.tv/tfidb/list/Animal_Runtime_3.21_Hours:_Do_You_Know_the_Longest-Running_Telugu_Movie$$7660d6ac-0846-43e3-b679-c28804e28ed4
మే 30 , 2024
Avika Gor: వెస్టిండీస్ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్!
సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇక్కడి సినిమాలపై రీల్స్ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్ క్రికెటర్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. టాలీవుడ్ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
చీరకట్టులో అందాల జాతర
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. ఓ వైపు క్రికెట్.. మరోవైపు పాటల ఆల్బమ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్.. యంగ్ హీరోయిన్ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్‌చల్ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.
https://twitter.com/i/status/1788784603085582657
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ..
బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)
నెట్టింట హాట్ ట్రీట్
యంగ్ బ్యూటీ అవికాగోర్ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తూ వారిని ఎంటర్‌టైన్ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మే 11 , 2024
Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబ్.. పురాణాల్లో ఆ పాత్ర గురించి ఏముందో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
అశ్వత్థామ ఎవరంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్ లుక్స్ అచ్చం అలాగే ఉండటం గమనార్హం.
గ్లింప్స్‌లో ఏముంది?
కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది.
https://twitter.com/i/status/1782338404421927223
రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్!
అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్ అశ్విన్ కూడా అమితాబ్ బచ్చన్ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్ ‘భైరవ’ టీజర్ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.
నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!
‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్’లోనే విడుదల తేదీని రివీల్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఏప్రిల్ 22 , 2024
Rashi Singh: రాశి సింగ్ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
యంగ్ హీరోయిన్ రాశి సింగ్ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.
రాశి సింగ్ పుట్టిన రోజు ఎప్పుడు?
రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్ సింగ్, సరితా సింగ్. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్ సింగ్.
రాశి సింగ్ విద్యాభ్యాసం ఎక్కడ?
ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.
View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real)
రాశి సింగ్ కెరీర్ ఎలా మెుదలైంది?
ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్ హోస్టేస్ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.
రాశి సింగ్ వయసు ఎంత?
రాశి సింగ్ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.
రాశి సింగ్ ఎత్తు, బరువు ఎంత?
రాశి సింగ్ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ భామ బాడీ కొలతలు 32-26-34.
రాశి సింగ్ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది?
చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది. ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
రాశి సింగ్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?
ఎయిర్ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.
రాశి సింగ్ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది?
రాశి సింగ్ ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.
రాశి సింగ్ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.
రాశి సింగ్ తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరు?
రాశిసింగ్ ఫేవరేట్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.
రాశి సింగ్ మెుదటి సినిమా ఏది?
తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు.
రాశి సింగ్ గుర్తింపు తెచ్చిన చిత్రం?
ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.
రాశి సింగ్ మద్యం సేవిస్తుందా?
లేదు.
రాశి సింగ్ సిగరేట్ దాగుతుందా?
లేదు.
రాశి సింగ్ మాంసాహారం తింటుందా?
అవును. రాశి సింగ్ చికెన్, మటన్‌తో చేసిన నాన్ వెజ్ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్?
https://www.instagram.com/rashi.real/?hl=en
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు?
ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
మార్చి 05 , 2024