• TFIDB EN
  • చిరుత
    UATelugu2h 29m
    చరణ్ తన చిన్నతనంలో చేయని హత్యను అంగీకరించి 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తాడు. విడుదలైన తర్వాత, అతను పని కోసం బ్యాంకాక్ వెళ్లి ఒక ధనవంతుడి కుమార్తె సంజనతో ప్రేమలో పడతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్
    చరణ్
    నేహా శర్మ
    సంజన
    ఆకాష్ పూరి
    యంగ్ చరణ్
    ప్రకాష్ రాజ్
    సంజన తండ్రి
    ఆశిష్ విద్యార్థి
    మట్టు భాయ్
    తనికెళ్ల భరణి
    చరణ్ మామయ్య
    సాయాజీ షిండే
    ASP అజయ్
    డేనియల్ బాలాజీ
    మట్టు భాయ్ కొడుకు
    బ్రహ్మానందం
    క్రిష్
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    సంజన PA
    అలీ
    నచిమి
    ఎంఎస్ నారాయణ
    చరణ్ బాస్
    వేణు మాధవ్
    చరణ్ జైల్‌మేట్ మరియు స్నేహితుడు
    జివి సుధాకర్ నాయుడు
    జైలర్
    ఉత్తేజ్
    చరణ్ సహోద్యోగి
    శ్రీనివాస రెడ్డి
    కానిస్టేబుల్
    బండ్ల గణేష్
    చరణ్ సహోద్యోగి
    సూర్య
    చరణ్ తండ్రి
    సత్యం రాజేష్
    వాచ్‌మెన్
    ఖయ్యూమ్
    చరణ్ స్నేహితుడు
    సిబ్బంది
    పూరి జగన్నాధ్
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    శ్యామ్ కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    నేహా శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శర్మ తెలుగులో చిరుత చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం హిట్ అయినా నేహా శర్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత కుర్రాడు చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో హిందీ బాట పట్టింది. యంగిస్థాన్, ముబారకన్ వంటి హిందీ చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నేహా శర్మ గురించి(Some Lesser Known Facts about Neha Sharma) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేహా శర్మ ఎప్పుడు పుట్టింది? 1987, నవంబర్ 21న జన్మించింది నేహా శర్మ తెలుగులో నటించిన తొలి సినిమా? చిరుత నేహా శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 6అంగుళాలు  నేహా శర్మ ఎక్కడ పుట్టింది? బాగల్ పూర్, బిహార్ నేహా శర్మ అభిరుచులు? వంట చేయడం నేహా శర్మకు ఇష్టమైన ఆహారం? క్యారెట్ కేక్ నేహా శర్మకు ఇష్టమైన కలర్ ? బ్లాక్ నేహా శర్మకు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నేహా శర్మ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శర్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నేహా శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nehasharmaofficial/?hl=en&img_index=1 https://www.youtube.com/watch?v=cQPgwBRqe-c
    ఏప్రిల్ 04 , 2024
    <strong>HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?</strong>
    HBD Neha Sharma: నేహా శర్మ ఆ వ్యాధితో ఎంత బాధపడిందో తెలుసా?
    హాట్ బ్యూటీ నేహా శర్మ (Actress Neha Sharma) ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ముద్దు ముద్దు తెలుగు మాటలకు ఇక్కడి యూత్‌ ఫిదా అయ్యింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ అనే సినిమాలో మెరిసినప్పటికీ అది సక్సెస్‌ కాలేదు. దీంతో హిందీకి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వరుస చిత్రాలు చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇవాళ (నవంబర్‌ 21) నేహా శర్మ పుట్టిన రోజు. 36వ సంవత్సరంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శర్మ 1987 నవంబరు 21న బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్‌ శర్మ (Ajith Sharma) ప్రముఖ పొలిటిషియన్‌.&nbsp; భాగల్‌పూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014, 2015, 2020లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌ నటి ఐషా శర్మ (Aisha Sharma) ఈ భామకు స్వయనా సోదరి అవుతుంది. 2018లో వచ్చిన 'సత్యమేవ జయతే'తో ఐషా హిందీలో అడుగుపెట్టింది. భాగల్‌పుర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో నేహా శర్మ (HBD Neha Sharma) చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సు చేసింది.&nbsp; నేహా శర్మ చిన్నప్పుడు ఆస్తమాతో చాలా బాధలు అనుభవించింది. ఆస్తమా వల్ల పలుమార్లు ఆనారోగ్యానికి గురైందట. ఫ్యామిలీ సపోర్ట్‌తో దాని నుంచి బయటపడింది.&nbsp; నేహా శర్మ (HBD Neha Sharma)కు వంట చేయడం చాలా ఇష్టం. అలాగే పాటలు వినడం, పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం ఆమె హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; డ్యాన్స్‌పై నేహాకు చాలా పట్టు ఉంది. ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. కథక్‌లో ఆమెకు ప్రావీణ్యం ఉంది.&nbsp; సంప్రదాయ నృత్యంతో పాటు హిప్ హాప్‌, సల్సా, మరెంగ్యూ, జివ్‌, జాజ్‌ వంటి ఆధునిక నృత్యంలోనూ నేహాకు ప్రమేయం ఉంది.&nbsp; లండన్‌లోని ప్రముఖ 'పైనాపిల్‌&nbsp; డ్యాన్స్ స్టూడియోస్‌' (Pineapple Dance Studios) ఆమె వెస్ట్రర్న్‌ డ్యాన్స్ కోర్సులను నేర్చుకుంది.&nbsp; నేహా శర్మకు క్యారెట్‌తో చేసిన కేక్‌ చాలా ఇష్టమట. కనిపిస్తే కేజీ కేకునైనా అలవొకగా తినేస్తుందని ఆమె ఫ్రెండ్స్‌ చెబుతారు.&nbsp; నేహా శర్మకు ఇష్టమైన నటులు ఇండియాలో ఎవరు లేరట. ఆమెకు హాలీవుడ్‌ యాక్టర్‌ విల్ స్మిత్ (Will Smith) అంటే విపరీతమైన అభిమానమట. హీరోయిన్ల విషయానికే వస్తే ఆమె (HBD Neha Sharma)కు ఇద్దరు ఫేవరేట్‌ యాక్ట్రెస్ ఉన్నారు. అందులో ఒకరు విద్యాబాలన్‌ కాగా, మరొకరు మధుబాల. నేహా శర్మ హిందీ, ఇంగ్లీషు చిత్రాలు బాగా చూస్తారు. హాలీవుడ్‌లో 2006లో వచ్చిన ‘పర్సూట్‌ ఆఫ్ హ్యాపీనెస్‌’ (The Pursuit of Happyness) బాగా నచ్చిన ఫిల్మ్‌.&nbsp; నేహా శర్మకు పర్యటనలు అంటే చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికిన వెంటనే ఫ్లైట్‌ ఎక్కేస్తుందట. థాయిలాండ్ ఆమెకు బాగా నచ్చిన టూరిజం ప్లేస్‌. నాని నటించిన రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'లో నేహా శర్మ మోడల్‌గా ఒక చిన్న క్యామియో ఇచ్చింది. కానీ అది పెద్దగా హైలెట్‌ కాలేదు.&nbsp; హిందీలో త్రిప్తి దిమ్రి - విక్కీ కౌషల్‌ జంటగా నటించిన 'బ్యాడ్‌ న్యూస్‌' మూవీలోనూ ఈ అమ్మడు తళుక్కున మెరిసింది. సెజల్‌ అనే పాత్రలో కనువిందు చేసింది.&nbsp; రీసెంట్‌గా '36 డేస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌తో నేహా (HBD Neha Sharma) ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్ట్‌ చేయడం లేదు. హిందీలో 'దే దే ప్యార్‌ దే 2' చిత్రంలో నేహా శర్మ నటిస్తోంది.&nbsp;
    నవంబర్ 21 , 2024
    రామ్‌ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    రామ్‌ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్‌ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి... RRR చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినప్పటికీ.. అత్యంత డౌన్ టు ఎర్త్‌గా ఉండటంతో ఆయనకు విస్తృత అభిమానం పొందారు. ఈక్రమంలో రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ ఎవరు? టాలీవుడ్‌లో స్టార్ హీరో, RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రామ్ చరణ్ పుట్టినరోజు ఎప్పుడు? రామ్ చరణ్ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించారు. మెగాపవర్ స్టార్ వయసు 39 ఏళ్లు. రామ్‌ చరణ్ ముద్దు పేరు? చెర్రీ రామ్ చరణ్ ఎత్తు ఎంత? 5 అడుగల 8 అంగుళాలు రామ్‌ చరణ్ అభిరుచులు? చరణ్‌కు ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జిమ్‌లో సాధన చేస్తుంటాడు. హార్స్ రైడింగ్ అంటే కూడా ఇష్టం రామ్ చరణ్ హీరోగా ఎన్ని సినిమాలు వచ్చాయి? రామ్ చరణ్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 15 సినిమాల్లో నటించాడు రామ్ చరణ్ ఏ యాక్టింగ్ స్కూల్‌లో చదివాడు? తన సినీరంగ ప్రవేశానికి ముందు, చరణ్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఈ స్కూలు చాలా ఫేమస్. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ అందరూ ఇక్కడ నటనను అభ్యసించారు. రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడా? జూన్ 14, 2012న, రామ్ చరణ్ తన స్నేహితురాలైన కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు CEO. రామ్‌చరణ్‌కు ఉపాసనకు ఎలా పరిచయం అయింది? &nbsp;రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ లండన్‌లోని రీజెంట్ యూనివర్శిటీలో తమ చదువును పూర్తి చేసారు, ఆ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు. రామ్‌ చరణ్- ఉపాసనకు ఎంతమంది పిల్లలు? వీరిద్దరి ఒక పాప జన్మించింది. పాప పేరు క్లింకారా రామ్ చరణ్ ఎక్కడ నివసిస్తున్నారు? రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక విలాసవంతమైన ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. రామ్ చరణ్ కొత్త సినిమా ఏంటి? రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు దర్శకుడు శంకర్ https://www.youtube.com/watch?v=8zpKqO0QMn0 రామ్ చరణ్‌కి ఇష్టమైన ఆహారం? రామ్ చరణ్ వంట చేయడం చాలా ఇష్టం. బిర్యానీ అతనికి ఇష్టమైన వంటకం.&nbsp; రామ్‌ చరణ్ వ్యాపారాలు? &nbsp;గుర్రపు పందేలపై తనకున్న అభిరుచిని సూచించేందుకు చరణ్ హైదరాబాద్‌లో పోలో టీమ్‌ని కొనుగోలు చేశాడు. అతను స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాటా కలిగి ఉన్నాడు. రామ్ చరణ్‌కు వచ్చిన సినిమా అవార్డులు? తన కెరీర్ మొత్తంలో, రామ్ చరణ్ అనేక గౌరవాలను అందుకున్నాడు. మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు గెలుచుకున్నాడు.
    మార్చి 19 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.&nbsp; ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్‌, బన్నీ సరసన రామ్ చరణ్‌.. ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేయాల్సిందే!
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan) టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.&nbsp; సింగపూర్‌లో మైనపు విగ్రహం నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్‌ టీమ్‌ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Nilzrav/status/1840120654193897699 ఫస్ట్‌ తెలుగు హీరోగా రికార్డు! టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్‌ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో చరణ్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్‌ తెలుగు యాక్టర్‌ రామ్ చరణ్‌ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్‌ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్‌ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.&nbsp; చరణ్‌ కంటే ముందే..&nbsp; మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్‌ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బాలీవుడ్‌ స్టార్స్‌ విగ్రహాలు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ కండల&nbsp; వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.&nbsp; చరణ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రామ్‌చరణ్‌, తమిళ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్‌, సుకుమార్‌ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>చిరంజీవితో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే!</strong>
    చిరంజీవితో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే!
    టాలీవుడ్&nbsp; అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అత్యున్నత గౌరవాన్ని పొందారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మిగతా ప్రముఖులేవరో ఇప్పుడు చూద్దాం. రామోజీరావు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు గారు, గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈనాడు పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా ఎంతో సేవ చేశారు. దాసరి నారాయణ రావు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, దాసరి నారాయణరావు గారు రికార్డు సృష్టించారు. ఈ ఘనతతో అతనికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలు అని ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠి, మలయాళం భాషల్లో సుమారు 40,000కి పైగా పాటలు పాడారు. ఈ విషయంలో కూడా ఆయనకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. బాలు సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ప్రసిద్ధి పొందారు. దగ్గుబాటి రామానాయుడు దగ్గుబాటి రామానాయుడు, మూవీ మోఘల్‌గా ప్రసిద్ధి చెందారు. 100 చిత్రాలకు పైగా నిర్మాతగా నిలిచిపోయి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం పథ్మ భూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల, 44 చిత్రాలను దర్శకురాలిగా తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 2002లో గిన్నిస్‌ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2019లో ఆమె మరణించారు. పి. సుశీల భారతీయ సినీ పరిశ్రమలో 60 సంవత్సరాల పైగా ప్రసిద్ధి పొందిన గానకోకిల పి. సుశీల, 12 భాషల్లో దాదాపు 30,000 పాటలు పాడారు. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. భారత ప్రభుత్వం ఆమెకు పథ్మభూషణ్ అవార్డు అందించింది. బ్రహ్మానందం కన్నెగంటి బ్రహ్మానందం, ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు, ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించారు. ఆయన పూర్తి సమర్థవంతంగా 1250 సినిమాలకు పైగా నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించారు.
    సెప్టెంబర్ 25 , 2024
    <strong>Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!</strong>
    Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. డ్యాన్స్‌కు కేరాఫ్‌! ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్‌, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్‌ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్‌-15 సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రగులుతోంది మొగలిపొద (ఖైదీ) చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్‌ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్‌ ఓసారి మీరూ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q చక్కని చుక్క (పసివాడి ప్రాణం) కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్‌ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్‌ ద్వారానే చిరు బ్రేక్‌ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్‌ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=q5aetbezCqM నవ్వింది మల్లె చెండు (అభిలాష) ‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి&nbsp; ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను కట్టిపడేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=82hUDmPYazk హే పాప (త్రినేత్రుడు) ‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్‌ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్‌ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్‌ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్‌ చేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు) ‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్‌ క్లాప్‌ అంటూ సాంగ్‌ను స్టార్ట్‌ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్‌ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్‌ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్‌ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=fsnOGypjHI0 గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌ (కొదమ సింహం) కొదమ సింహం సినిమాలోని 'స్టార్‌ స్టార్‌ మెగాస్టార్‌' సాంగ్‌ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్‌ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్‌ వేయలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=cFKyIHvudzI బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు) రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్‌ ఏ స్థాయిలో సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్‌ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్‌ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్‌ చేయడం విశేషం. https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk రూపుతేరా మస్తానా (రిక్షావోడు) రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్‌ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్‌ బీట్‌ను మ్యాచ్‌ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్‌ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=mugdo_VO9pY నడక కలిసిన నవరాత్రి (హిట్లర్) ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్‌ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం. https://www.youtube.com/watch?v=j2HY4G63qaE ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి) ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్‌ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్‌ చేసి భుజాలు ఎగరేసే స్టెప్‌ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్‌ చుట్టుకొని మాస్‌ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=oppz5I9KeQA దాయి దాయి దామ్మ (ఇంద్ర) ‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్‌ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=39W78Hp4E8A ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య) ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్‌ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.&nbsp; https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY మన్మథ మన్మథ (ఠాగూర్) వి.వి. వినాయక్‌ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్‌ మెస్మరైజ్‌ చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150) ‘ఖైదీ నెంబర్‌ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
    సెప్టెంబర్ 23 , 2024
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద వాలిపోతున్నారు. వాటర్‌ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్‌ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీ వాని కపూర్‌.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్‌ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్‌ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.&nbsp; చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడ సన్‌ సెట్‌ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.&nbsp; బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్‌సెట్‌ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది.  మరో బ్యూటీ బార్ఖా సేన్‌ గుప్తా.. ఈ లేజీ సమ్మర్‌ డేస్‌ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ నటి మౌని రాయ్‌.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది.&nbsp; యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్‌లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్‌లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
    ఏప్రిల్ 16 , 2024
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    HBD Ram Charan: ‘రామ్‌చరణ్‌’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్‌ పెట్టాడో తెలుసా?
    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ (Ram Charan).. టాలీవుడ్‌ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్‌.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్‌ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్‌ (Allu Arjun), శిరీష్‌ (Allu Sirish) డ్యాన్స్‌ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.&nbsp; ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్‌ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్‌ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్‌ కోచింగ్‌ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం. రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.&nbsp; చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు. చరణ్‌ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌ తన బాల్యం నుంచి టీనేజ్‌ వరకూ తరచూ స్కూల్స్‌ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.&nbsp; నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.&nbsp; సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్‌ బైక్‌ రైడింగ్‌ చేస్తానంటే చిరు ఎంకరేజ్‌ చేసేవారు కాదట.&nbsp; రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు. రామ్‌చరణ్‌ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.&nbsp; అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్‌ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.&nbsp;&nbsp; తన సినిమాలు చూశాక మెగాస్టార్‌ చిరంజీవి చేసే కామెంట్స్‌ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్‌ తెలిపాడు. డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.&nbsp; ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్‌ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్‌’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.&nbsp; ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.&nbsp; ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్‌ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోంది.&nbsp; రామ్‌చరణ్‌.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్‌ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్‌ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    మార్చి 27 , 2024
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా.. 1. నకిలీ మనిషి (1980) చిరంజీవి తొలిసారి 'నకిలీ మనిషి' చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్‌.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు. 2. బిల్లా రంగా&nbsp; (1982) ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 3. రోషగాడు (1983) &nbsp;చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్‌ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్‌ స్మిత నటించారు. 4. సింహపురి సింహం (1983)&nbsp; కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. 5. జ్వాల(1985) రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు. 6. రక్త సింధూరం (1985) రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్‌ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. 7. దొంగమొగుడు (1987) ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు. 8. యముడికి మొగుడు (1988) రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్‌ రోల్‌లో మెప్పించారు. 9.రౌడీ అల్లుడు (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.&nbsp; 10. ముగ్గురు మొనగాళ్లు (1994) ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి... పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. రిక్షావోడు (1995) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు. 12. స్నేహం కోసం (1999) కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది. 13. అందరివాడు (2005) చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. 14. ఖైదీ నంబర్ 150 (2017) ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు. మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.
    నవంబర్ 10 , 2023
    <strong>Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!</strong>
    Allu vs Mega: మరింత ముదిరిన వివాదం.. పుష్ప2లో చిరు టార్గెట్‌గా డైలాగ్స్!
    అల్లు అర్జున్‌, మెగా (Allu vs Mega) కుటుంబాల మధ్య వివాదాలు తారా స్థాయికి చేరినట్లు గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బన్నీ (Allu Arjun) లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)ను బాయ్‌కాట్‌ చేయాలని మెగా ఫ్యాన్స్‌ నెట్టింట పిలుపు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ - సుకుమార్‌ కాంబోలోని పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజైంది. అయితే ఇందులో బన్నీ చెప్పిన డైలాగ్స్‌ మెగా ఫ్యామిలీ టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే పవన్‌ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్‌ మద్దతు ఇవ్వడం వల్లే ఈ స్థాయి మనస్పర్థలు వచ్చాయని అంతా భావిస్తున్నారు. కానీ, ఆ ఘటన కంటే ముందే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌కు చెడిందని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఖైదీ నెంబర్‌ 150 సమయంలో..&nbsp; మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రాజకీయాల్లో పెద్దగా కలిసి రాకపోవడంతో ‘ఖైదీ నెంబర్‌ 150’ (Khaidi No. 150) సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌ తండ్రి, గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) అధినేత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఎంతగానో ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా రామ్‌ చరణ్‌ తెరపైకి వచ్చి తాను నిర్మిస్తానని పట్టుబట్టాడు. ఈ విషయంలో చిరు కూడా కొడుకు పక్షాన నిలబడ్డాడు. దీంతో రామ్‌చరణ్‌ ప్రత్యేకంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేసి ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రాన్ని నిర్మించారు. ఈ విషయంలో అల్లు అరవింద్‌ బాగా హర్ట్ అయినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపించింది. ఆ తర్వాత అయినా చిరుతో చేయవచ్చని అల్లు అరవింద్ భావించారు. ఆ కోరిక ఇప్పటివరకూ నెరవేరలేదు. ‘ఖైదీ నెంబర్‌ 150’ తర్వాత చిరు వరుసగా ‘సైరా నరసింహా రెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రాలను రామ్‌చరణ్‌ బ్యానర్‌లోనే చేయడం గమనార్హం. గీతా ఆర్ట్స్‌ను దూరం పెట్టిన మెగా హీరోలు? ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రం నుంచే మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం మెుదలైందన్న వాదనలు ఉన్నాయి. 2017లో ఆ చిత్రం రిలీజవ్వగా అప్పటినుంచి ఒక్క మెగా హీరో కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించలేదు. 2016లో రామ్‌ చరణ్‌తో చేసిన ‘ధ్రువ’ చిత్రం మెగా హీరోలతో అల్లు అరవింద్‌ చేసిన ఆఖరి మూవీ. అంతకుముందు రామ్‌ చరణ్‌తో 'మగధీర', సాయి ధరమ్‌ తేజ్‌తో ‘పిల్ల నువ్వు లేని జీవితం’, చిరంజీవితో లెక్కలేనన్ని సినిమాలను అల్లు అరవింద్‌ ప్రొడ్యూస్ చేశారు. వాస్తవానికి గీతా ఆర్ట్స్‌లో వచ్చిన మెజారిటీ హిట్‌ చిత్రాలు చిరంజీవి నటించినవే. అప్పట్లో&nbsp; క్రమం తప్పకుండా చిరుతో అల్లు అరవింద్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే రామ్‌చరణ్‌ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ స్టార్ట్‌ చేశారో ఆ తర్వాత చిరు ఒక్క మూవీ కూడా అల్లు అరవింద్ బ్యానర్‌లో చేయలేదు. మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, పంజా వైష్ణవ్‌ కూడా ఆ బ్యానర్‌లో నటించలేదు. దీంతో అల్లు అరవింద్‌ను సినిమాల పరంగా దూరం పెట్టారా అన్న అనుమానం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.&nbsp; అల్లు బ్రాండ్‌ కోసమేనా ఇదంతా? నిన్న, మెున్నటి వరకూ అల్లు, మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ వర్గాలు, ఆడియన్స్‌ ఒకటిగానే చూశారు. ఆ రెండు కుటుంబాలకు చిరంజీవినే పెద్ద తలగా భావించారు. చిరు తర్వాతనే అల్లు అరవింద్‌ అయినా అన్న భావన చాలా మందిలో ఉండేది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి, స్టార్ ప్రొడ్యుసర్‌గా వెలుగొందుతున్న తన తండ్రికి మెగా కాంపౌండ్‌లో ఉండటం వల్ల సరైన గుర్తింపు రాలేదని అల్లు అర్జున్‌ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2021లో వచ్చిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించడం కూడా బన్నీ ఆలోచనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు టాక్ ఉంది. చిరంజీవి అంటే మెగా అనే బ్రాండ్‌ ఎలా ఉందో, తన పేరు మీద అల్లు అన్న బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలని బన్నీ భావించినట్లు టాక్‌. తద్వారా తన తండ్రికి చిరుకు మించిన గుర్తింపు తీసుకురావాలని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్‌ను దాటి బన్నీ బయటకు వచ్చేశారని తెలుస్తోంది. అందుకే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పవన్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం, అంతకముందు పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అని వ్యాఖ్యానించడం ఈ క్రమంలో జరిగినవేనని అంటున్నారు.&nbsp; చిరు కూడా దూరం పెట్టాడా? మెగాస్టార్‌ చిరంజీవి ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తుంటారు. మెగా హీరోలతో పాటు కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న వారిని సైతం స్వయంగా ఈవెంట్స్‌కు వెళ్లి మద్దతిస్తున్నారు. వారి చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసి తనవంతుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల ‘మట్కా’ సినిమా పోస్టర్‌ను సైతం షేర్‌ చేసి నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌కి అల్‌ ది బెస్ట్ చెప్పారు. అలాగే కూతురు నిర్మించిన ‘పరువు’ సిరీస్‌ను సైతం ప్రచారం చేశారు. అటువంటి చిరు తన మేనల్లుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ గురించి ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం చర్చకు తావిస్తోంది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘పుష్ప 2’ గురించి కనీసం ప్రస్తావించకపోవడం అల్లు - మెగా కుటుంబాల మధ్య ఉన్న వివాదానికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిరు కూడా అల్లు అర్జున్‌ను దూరం పెట్టారా? అన్న భావను కలిగిస్తున్నాయి. అటు అల్లు అర్జున్‌ సైతం ఇటీవల బాలయ్య షోలో పాల్గొని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను తోటి యాక్టర్లుగా మాత్రమే ట్రీట్‌ చేశాడు. మామయ్య అంటూ ఎక్కడా మాట్లాడలేదు.&nbsp; ‘పుష్ప 2’తో ముదిరిన వివాదం అల్లు, మెగా కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా వారంతా ఒకటే ఫ్యామిలీ అని న్యూట్రల్‌ ఆడియన్స్‌ ఇప్పటివరకూ అభిప్రాయపడుతూ వచ్చారు. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శ చేసుకోనప్పుడు ఎందుకు అనవసరంగా రూమర్లు స్ప్రెడ్‌ చేస్తారని ఫిల్మ్‌ వర్గాలు సైతం మండిపడుతూ వచ్చాయి. అయితే ‘పుష్ప 2’ లాంటి పాన్‌ ఇండియా చిత్రంలో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేసినట్లు వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇది కావాలని చేసి ఉంటే మాత్రం కచ్చితంగా అది రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుందని అంటున్నారు. సందర్భానుసారం వచ్చిన డైలాగ్స్‌ మాత్రమే అని బన్నీ ఫ్యాన్స్‌ చెబుతున్నప్పటికీ మెగా ఫ్యాన్స్‌ ఒప్పుకోవడం లేదు. తమ అభిమాన కుటుంబాన్ని కించపరిచేందుకే బన్నీ కావాలని టార్గెట్‌ చేశాడని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్ముందు ఈ వివాదం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.&nbsp;
    డిసెంబర్ 05 , 2024
    <strong>Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!</strong>
    Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
    తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి 'కంగువా' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండంతో నటుడు సూర్యతో పాటు కంగువా టీమ్‌ చురుగ్గా ప్రమోషన్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి గతంలో సూర్యతో సినిమా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. గతంలో రాజమౌళి తీసిన ఆ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాన్ని తొలుత సూర్యతోనే తీద్దామని అనుకున్నట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆ మూవీ ఏదంటే? మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కెరీర్‌లో ‘మగధీర’ (Magadheera) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో చరణ్‌ క్రేజ్‌ తారాస్థాయికి చేరింది. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాను తొలుత సూర్యతో చేయాలని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికే సూర్యను తీసుకోవాలని భావించినట్లు స్ట్రాంగ్‌గా రూమర్లు వచ్చినా అందులో వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్‌ కటౌన్‌ను చూసే ‘బాహుబలి’ స్టోరీ సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కాబట్టి ‘మగధీర’ కోసమే రాజమౌళి సూర్యను సంప్రదించి ఉండొచ్చని అంటున్నారు. ‘కంగువా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య చేసిన ‘గజిని’ చిత్రాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లెక్కన చూసినా ‘గజిని’ 2005లో రిలీజైంది. 2009లో మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగధీర చిత్రీకరణ మూడేళ్లపాటు జరిగింది కాబట్టి 2006 సమయంలోనే మగధీర స్క్రిప్ట్‌ను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ లాజిక్స్‌ పరంగా చూస్తే ‘మగధీర’ సినిమానే సూర్య చేయాల్సిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అదే జరిగి ఉంటే? ఒకవేళ నిజంగానే మగధీర చిత్రాన్ని గనుక రామ్‌చరణ్‌ చేయకుండా ఉండుంటే అతడి ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఎందుకంటే ‘మగధీర’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ లేకుండా చరణ్‌ సినీ జీవితాన్ని ఊహించుకోలేము. తొలి చిత్రం ‘చిరుత’ ఓ మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్‌ దృష్టిలో చరణ్‌ పెద్దగా రిజిస్టర్‌ కాలేదు. ఆ తర్వాత చేసిన సెకండ్‌ ఫిల్మ్‌ ‘మగధీర’తోనే చిరు తనయుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు చరణ్‌. మగధీర తర్వాత చాలా చిత్రాలే చేసినప్పటికీ ‘రంగస్థలం’ (2018) వరకూ సరైన బ్రేక్ రాలేదు. అప్పటివరకూ మగధీరతో వచ్చిన ఫేమ్‌తోనే చరణ్‌ నెట్టుకు వచ్చాడు. అటువంటి ‘మగధీర’ సినిమా చరణ్‌ కెరీర్‌లో లేకపోయి ఉంటే అతడి కెరీర్‌లో కచ్చితంగా డౌన్‌ఫాల్‌లో ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్‌ సైతం బయటకు చెప్పకపోయిన ఇదే ఫీలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘సూర్యతో చేసే ఛాన్స్ మిస్ అయ్యా’ కంగువా’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్‌ నటుడు సూర్య (Suriya)పై దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ఆ నటుడి స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో సూర్యనే తనకు స్పూర్తి అని జక్కన్న అన్నారు. ‘గజిని’ చిత్ర సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. వేరే చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగువారికి ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్న కేస్‌ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పినట్లు తెలిపారు. అలా తన పాన్‌ ఇండియా మూవీ బాహుబలికి సూర్య ప్రేరణగా నిలిచాడని గుర్తుచేశారు. సూర్య సినిమా చేయాలనుకున్నామని కానీ అది కుదర్లేదని స్పష్టం చేశారు. సూర్యతో చేసే ఛాన్స్‌ తాను మిస్‌ అయ్యాయని పేర్కొన్నారు. https://twitter.com/AadhanTelugu/status/1854710204740309097 ‘కథ చెప్పారు.. వర్కౌట్‌ కాలేదు’ తమిళ స్టార్‌ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య (Suriya), కార్తీ (Karthi) కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్‌ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్‌ రావాలి. గతంలో రాజమౌళి సర్‌ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్‌ ఆశ్చర్యపోయారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నించారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్‌ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
    నవంబర్ 08 , 2024
    <strong>ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!</strong>
    ANR 100th Birth Anniversary: టాలీవుడ్‌కు డ్యాన్స్‌ పరిచయం చేసిందే నాగేశ్వరరావు? ఇదిగో ప్రూఫ్స్‌!
    టాలీవుడ్‌ మూలస్తంభాల్లో ఒకరైన దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మవిభూషణ్‌గా, నటసామ్రాట్‌గా ఆయన ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్‌ 20, 1924లో జన్మించారు. నేటితో 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన అభిమానులు దేశ, విదేశాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఒక్క దిగ్గజ నటుడిగానే అందరికీ తెలుసు. కానీ, ఆయనలో బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నారు. అసలు టాలీవుడ్‌కు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే ఆయన అని ఈ జనరేషన్‌ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; [toc] డ్యాన్స్‌కు మూలపురుషుడు అక్కినేని టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే డ్యాన్స్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అగ్రకథానాయకులు డ్యాన్స్‌ వేసేందుకు ఆసక్తి కనబరిచేవారు కాదు. వారి ఫోకస్‌ మెుత్తం ఏ విధంగా నటించాలి, ఎలా హావాభావాలు ప్రదర్శిస్తే ప్రేక్షకులను నచ్చుతుంది అన్నదానిపైనే ఉండేది. ముఖ్యంగా 1960-70 మధ్య ఈ తరహా ధోరణి ఎక్కువగా కనిపించేది. హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంటే హీరో ఒక పక్కన నిలబడి కాళ్లు చేతులు కదుపుతున్నారన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఈ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారు. చాలా మందికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మెగాస్టార్‌ చిరంజీవి గుర్తుకువస్తారు. కానీ ఆయనకంటే ముందే నాగేశ్వరరావు తన సినిమాల్లో డ్యాన్స్‌కు పెద్ద పీట వేశారు. హీరోకు నటనతో పాటు డ్యాన్స్‌ కూడా ముఖ్యమని తెలియజేశారు. కథానాయికతో పోటీ పడి మరి స్టెప్పులు వేశారు. ఓ దశలో నాగేశ్వరరావును చూసి నందమూరి తారకరామారావు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారు కూడా పోటా పోటీగా తమ సినిమాల్లో స్టెప్పులు ఉండేలా జాగ్రత్తపడ్డారు.&nbsp; అక్కినేని స్టెప్స్‌కు ఆడియన్స్‌ ఫిదా! 1971లో వచ్చిన దసరాబుల్లోడు (Dasara Bullodu Movie) సినిమాలో ‘ఎట్టాగే ఉన్నాది ఓలమ్మీ’ అంటూ ఏఎన్ఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. అలాగే బంగారుబాబులో ‘చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది’ అంటూ అప్పట్లో తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అప్పటివరకూ కేవలం సాంగ్స్‌ వింటూ ఆనందించిన తెలుగు ప్రేక్షకులు అక్కినేని దెబ్బతో డ్యాన్స్‌ను కూడా ఆస్వాదించడం మెుదలుపెట్టారు. ముఖ్యంగా ప్రేమ్‌ నగర్‌ సినిమాలో ‘నేను పుట్టాను లోకం నవ్వింది’ పాటలో మద్యం సేవించిన వ్యక్తిలా నాగేశ్వరరావు వేసిన డ్యాన్స్ ట్రెండ్‌ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమాభిషేకం సినిమాలో ‘నీ కళ్లు చెబుతున్నాయి’ అంటూ శ్రీదేవితో పోటీపడి మరి వేసిన డ్యాన్స్‌ అందర్నీ మెప్పించింది. అదే సినిమాలో జయసుధతో కలిసి 'కోటప్పకొండకు వస్తానని మెుక్కుకున్నా' పాటలో వేసిన స్టెప్స్‌ కూడా అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అంతేకాదు మెకానిక్ అల్లుడు సినిమాలో మెగాస్టార్‌ చిరుతోనూ పోటీగా నాగేశ్వరరావు స్టెప్పులు వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో మచ్చుకకు కొన్ని లింక్స్‌ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిపై ఓ లుక్కేయండి.  https://www.youtube.com/watch?v=OG_H1fNnWJA https://www.youtube.com/watch?v=uWhPlHc0yoU https://www.youtube.com/watch?v=nTt-kp2Lndc https://www.youtube.com/watch?v=zA_uVs7H7G0 https://www.youtube.com/watch?v=y_p90nJNsB8 నాగేశ్వరరావు స్ఫూర్తితో.. టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న మెగాస్టార్‌ చిరంజీవికి సైతం ఒకనొక దశలో నాగేశ్వరరావు స్ఫూర్తిగా నిలిచారు. సినిమాల్లో డ్యాన్స్ ప్రాధాన్యతను నాగేశ్వరరావు చిత్రాలను చూసే చిరు తెలుసుకున్నారని ఆయన సన్నిహితులు అంటుంటారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చిరు ఎవరికీ సాధ్యం కాని స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు. ఒకనొక సందర్భంలో చిరు డ్యాన్స్‌ గురించి అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఈవెంట్‌లో చిరు పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు. సినిమాకు డ్యాన్స్‌ను పరిచయం చేసిందే తానని నాగేశ్వరరావు గుర్తుచేశారు. అసలు డ్యాన్స్ ఎందుకు మెుదలుపెట్టానా అని అప్పుడప్పుడు అనిపిస్తుందని అన్నారు. చిరు స్టెప్పులు చూస్తుంటే అతని శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయా? లేవా? అని అనుమానం కలుగుతుంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాల పాటు నటన, డ్యాన్స్‌లో తిరుగులేని హీరోగా చిరు నిలిచారు. నాగేశ్వరరావు మెుదలపెట్టిన డ్యాన్స్‌ను చిరు అందిపుచ్చుకోకా ప్రస్తుతం హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌ పోతినేని వంటి వారు ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=pFTIlMls-98 బాలకృష్ణ ఆసక్తికర పోస్టు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) శత జయంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ (Balakrishna) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆయన్ని స్మరించుకోవడం గర్వకారణం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతీ నటుడికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకూ ఆయన చేసిన ప్రయాణం ప్రతిఒక్కరికీ ప్రేరణ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.&nbsp; ఏఎన్నాఆర్‌ టాప్‌-10 చిత్రాల రీరిలీజ్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా&nbsp; ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వ‌ర్ స్క్రీన్’పేరుతో అక్కినేని పది క్లాసిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు దేశంలోనే అనేక ప్రాంతాలలో స్పెషల్ షోస్‌ను ప్రదర్శిస్తున్నారు. హైద‌రాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరు, వ‌రంగ‌ల్, కాకినాడ‌, తుమ‌కూరు, వ‌డోద‌ర‌, జ‌లంధ‌ర్‌, రూల్కెలాతో స‌హా మొత్తం 25 ప్రాంతాలలో ఈ స్పెషల్‌ షోస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ చూడాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవదాస్‌ (1951) అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో ప్రేమలో విఫలమైన వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ప్లాట్‌ ఏంటంటే ‘దేవదాసు, పార్వతి ప్రేమను సమాజం అంగీకరించకపోవడంతో మద్యానికి దేవదాసు బానిసవుతాడు. ఇంతలో చంద్రముఖి అనే వేశ్య అతనితో ప్రేమలో పడటం మొదలు పెడుతుంది. చివరికీ ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మిస్సమ్మ (1955) అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఇద్దరు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఒక చిన్న గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులుగా ఉపాధి పొందేందుకు భార్య భర్తలమని అబద్దం చెబుతారు. కొన్ని రోజుల ప్రయాణంలో వారు ఒకరినొకరు ఇష్టపడతారు. మరి వారు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది స్టోరీ Book Tickets మాయాబజార్‌ (1957) స్టోరీ ఏంటంటే ‘బలరాముడు తన కుమార్తెను సుభద్ర కుమారునికిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే కౌరవుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బలరాముడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets భార్య భర్తలు (1961) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘ఉప్యాధ్యాయురాలైన శారదను ఆనంద్‌ ఇష్టపడతాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. క్రమేణా ఆనంద్‌ వ్యక్తిత్వం నచ్చి ఆమె అతడ్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ&nbsp; ప్రేయసి ఆనంద్‌కు తారసపడి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ. Book Tickets గుండమ్మ కథ (1962) అక్కినేని నాగేశ్వరరావు, రామారావు కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ విజయాన్ని అందుకుంది. ప్లాట్‌ ఏంటంటే 'గుండమ్మకు ఒక కొడుకు, కూతురు. సవతి కూతురు లక్ష్మిని పని మనిషిలా చూస్తుంటుంది. లక్ష్మికి అనాథను ఇచ్చి పెళ్లి చేసి వారిద్దరినీ ఇంట్లో శాశ్వత పనోళ్లుగా చేసుకోవాలని గుండమ్మ చూస్తుంది. తన సొంత కూతుర్ని మాత్రం డబ్బున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటుంది. జమీందారు రామభద్రయ్య కొడుకులు ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; Book Tickets డాక్టర్‌ చక్రవర్తి (1964) ఏఎన్నార్‌కు మంచి పేరు తీసుకొచ్చి చిత్రాల్లో డాక్టర్‌ చక్రవర్తి ఒకటి. ప్లాట్ ఏంటంటే ‘డాక్టర్ చక్రవర్తి తన సోదరి మరణం తర్వాత మాధవిని సొంత చెల్లెలిగా భావిస్తాడు. ఎందుకంటే ఆమె తన ప్రవర్తనతో చక్రవర్తి సోదరిని గుర్తు చేస్తుంటుంది. అయితే వారి జీవిత భాగస్వాములు వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets సుడిగుండాలు (1968) ఈ మూవీ స్టోరీ ఏంటంటే ‘జస్టిస్ చంద్ర శేఖరం గొప్ప దయగల వ్యక్తి. దోషిగా నిర్ధారించబడిన వారి కుటుంబాలకు ఆశ్రయం ఇస్తుంటాడు. సొంత కొడుకు హత్యకు గురైనప్పుడు దానికి బాధ్యులైన దోషులను సమర్థిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమ్‌ నగర్‌ (1971) ఈ సినిమా స్టోరీ ఏంటంటే ‘జల్సాగా తిరిగే సంపన్న యువకుడు మధ్యతరగతి అమ్మాయిని ప్రేమిస్తాడు. యువతి తల్లి వారి పెళ్లికి అంగీకరించదు. దీంతో ఆ యువకుడు మద్యానికి బానిస అవుతాడు. చివరికి వారు ఒక్కటయ్యాారా? లేదా?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets ప్రేమాభిషేకం (1982) నటుడిగా నాగేశ్వరరావు మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘ప్రేమాభిషేకం’. స్టోరీ విషయానికి వస్తే 'రాజేష్‌ దేవిని గాఢంగా ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కొద్ది రోజుల ముందు రాజేష్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెకు తనపై ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు. దీంతో దేవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. చివరికి రాజేష్‌ పరిస్థితి ఏమైంది?’ అన్నది స్టోరీ.&nbsp; Book Tickets మనం (2014) అక్కినేని కుటుంబానికి, అభిమానలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’. ఆ ఫ్యామిలీకి చెందిన నలుగురు హీరోలు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌) ఈ సినిమాలో నటించారు. ‘పునర్జన్మలు - ప్రేమతో ముడిపడిన పాత్రల చుట్టు తిరిగే కథతో సినిమా రూపొందింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అన్నది కథ. Book Tickets
    సెప్టెంబర్ 20 , 2024
    <strong>Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?</strong>
    Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
    పూరి జగన్నాథ్‌ సినిమా అంటే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బైక్‌ల దొంగ (ఇడియట్‌) రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ఇడియట్‌ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్‌ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్‌ కూడా కన్ఫ్యూజ్‌ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్‌ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.&nbsp; స్కెచ్ ఆర్టిస్టు (సూపర్‌) నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్‌ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్‌ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్‌ సీన్‌ ఎప్పటికీ మర్చిపోలేరు.&nbsp; బిక్షగాడు (పోకిరి) మహేష్‌, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్‌ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.&nbsp; హిమాలయ బాబా (దేశ ముదురు) అల్లు అర్జున్‌ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్‌ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.&nbsp; గోలి (దేవుడు చేసిన మనుషులు) రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.&nbsp; నచ్చిమి (చిరుత) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.&nbsp; బోకా (ఇస్మార్ట్‌ శంకర్‌) రామ్‌ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్‌ చూసి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్‌ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్‌ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్‌ ఫారెస్ట్‌ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్‌ చేసినట్లు అలీ తెలిపారు.  
    ఆగస్టు 13 , 2024
    <strong>Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!</strong>
    Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న కుటుంబాల్లో 'మెగా ఫ్యామిలీ' (Mega Family) ఒకటి. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రామ్‌ చరణ్‌ (Ram Charan), అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్‌లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్‌, చరణ్‌ కలిసి ఒక మల్టీస్టారర్‌ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్‌ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; ‘అదే అతి పెద్ద పాన్‌ ఇండియా’.. మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్‌ కల్యాణ్‌ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్‌ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1817891248398795055 గతంలోనే స్పెషల్‌ క్యామియోలు! మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్‌ ఓ స్పెషల్‌ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్‌లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్‌ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్‌దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ మెరిశారు. ‌అలాగే ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా క్లైమాక్స్‌లోనూ అన్న చిరుతో కలిసి పవన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. అయితే చిరు, పవన్‌, చరణ్‌ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్‌ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.&nbsp; మెగా ఫ్యామిలీతో అనుబంధం దర్శకుడు హరీష్‌ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్‌ డైరెక్టర్‌కు ఉంది. మెగా ఆడియన్స్‌ పల్స్ గురించి హరీష్‌ శంకర్‌కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'గబ్బర్‌ సింగ్‌' (Gabbar Singh), అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), వరుణ్‌తేజ్‌తో 'గద్దలకొండ గణేష్‌' (Gaddalakonda Ganesh), సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌ వస్తే ఇక బాక్సాఫీస్‌ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.&nbsp; ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గుర్తుండిపోతుంది’&nbsp; పవన్‌ కల్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో 'మిస్టర్‌ బచ్చన్‌' (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్‌ శంకర్‌ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఉస్తాద్ భగత్‌ సింగ్‌ గురించి హరీష్‌ శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp;
    జూలై 30 , 2024
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.&nbsp; https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా&nbsp; పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.&nbsp; https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    Best Transformation Heroes in Tollywood: సినిమా కోసం బాడీని ఉక్కులా మార్చుకున్న హీరోలు వీరే!
    ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్‌ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్‌ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; చిరంజీవి (Chiranjeevi) ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్‌ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్‌ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్‌ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు. https://twitter.com/i/status/1752914245170364419 ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌లో మెస్మరైజింగ్‌ బాడీ అనగానే ముందుగా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్‌ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్‌.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్‌ మారాడు. రీసెంట్‌గా ‘సలార్‌’లోనూ ప్రభాస్‌ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.&nbsp; రానా (Rana) ప్రభాస్‌ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్‌’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.&nbsp; సుధీర్‌ బాబు (Sudheer Babu) శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్‌ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్‌ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్‌ ప్యాక్‌ బాడీని మెయిన్‌టైన్‌ చేస్తూ మెప్పిస్తున్నాడు.&nbsp; రామ్‌ చరణ్‌ (Ram Charan) మెగాస్టార్‌ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్‌. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్‌.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్ఆర్‌’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.&nbsp; అల్లు అర్జున్‌ (Allu Arjun) గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్‌.. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్‌ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.&nbsp; జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌ బాడీని కలిగి ఉన్న స్టార్‌ హీరోల్లో తారక్‌ ఒకరు. కెరీర్‌ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్‌’లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.&nbsp; రామ్ పోతినేని (Ram Pothineni) లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్‌.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం మళ్లీ సిక్స్‌ ప్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది.&nbsp; నాగ శౌర్య (Naga Shourya) యంగ్‌ హీరో నాగ శౌర్య.. కెరీర్‌ ప్రారంభంలో డెసెంట్‌ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి మాస్‌ హీరోగా రూపాంతరం చెందాడు.&nbsp; విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మంచి హైట్‌, ఫిజిక్‌ కలిగిన విజయ్‌ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ సినిమాలో మెస్మరైజింగ్‌ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్‌ తనను తాను మార్చుకున్నాడు.&nbsp; అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్‌ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్‌ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.&nbsp; సునీల్‌ (Sunil) టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్‌ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్‌.. హీరోగా మారాక సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.&nbsp;
    ఫిబ్రవరి 23 , 2024
    Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
    Mrunal Thakur: సీతారామం బ్యూటీకి తెలుగు కష్టాలు.. భాషపై పట్టుకోసం శ్రమిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌..!
    సీతారామం సినిమాతో నటి మృణాల్‌ ఠాకూర్ రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఈ మరాఠీ బ్యూటీకి తెలుగు నేర్చుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ భామ తెలుగు భాషపై ఫోకస్‌ పెట్టింది. మృణాల్‌ తెలుగు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ ‌అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు టీచర్‌ను ఏర్పాటు చేసుకొని భాషపై పట్టు సాధించేందుకు ఆమె యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ల్యాప్‌టైప్‌ ముందు తెలుగుతో ఈ భామ కుస్తీ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1701561309178081571 నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.&nbsp; కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సమయమా’ అనే సాంగ్‌ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఈ పాట లిరికల్‌ వీడియోను సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా తెలిపారు.&nbsp; https://twitter.com/VyraEnts/status/1702193014792388866 విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘VD 13’ మూవీలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా చేస్తోంది. రెండు పెద్ద చిత్రాలు చేతిలో ఉండటంతో లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ రాకుండా మృణాల్‌ జాగ్రత్త పడుతోంది. ఎలాగైన తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ బ్యూటీ భావిస్తోంది అటు చిరంజీవితోను కలిసి నటించే ఛాన్స్‌ను ఈ&nbsp; భామ కొట్టెసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ.. చిరుతో 157వ చిత్రాన్ని చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ఆ క్యారెక్టర్‌కు మృణాల్‌ అయితేనే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; టెలివిజన్ తెరపై సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమా ‘విట్టి దండు’తో వెండితెర ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; సీతారామం తర్వాత మృణాల్ ఈ యేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సెల్ఫీ’తో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమా మలయాళీ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమా టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ స్టార్‌డమ్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసాయి.&nbsp; మృణాల్‌కు తెలుగుతో పాటు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అక్కడ అరంగేట్రానికి మంచి కథ కోసం ఈ భామ వెతుకుతోందట. మృణాల్‌ త్వరలోనే తన తమిళం లేదా మలయాళీ సినిమా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తమిళ హీరో సూర్య మూవీలో మృణాల్‌కు ఓ&nbsp; కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2023
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. &nbsp; దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .&nbsp; సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.&nbsp; రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు.&nbsp;
    ఆగస్టు 11 , 2023
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
    ఒకప్పుడు టాలీవుడ్‌ అనగానే ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. పవన్‌ కల్యాణ్‌ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్‌ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్‌.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్‌ తీసిన వకీల్‌ సాబ్‌ (Vakeel saab), భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్‌ బిజీగా ఉన్నాడు.&nbsp; రామ్‌చరణ్‌ చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ సినిమా ఉండనుంది.&nbsp; అల్లుఅర్జున్‌ చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్‌ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.&nbsp; సాయిధరమ్‌ తేజ్‌ చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.&nbsp;సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్‌ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; వరణ్‌ తేజ్‌&nbsp; మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడిగా వరణ్‌ తేజ్‌(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్‌ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్‌ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.&nbsp; పంజా వైష్ణవ్‌ తేజ్‌ పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.&nbsp; అల్లు శిరీష్‌ చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్‌ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్‌... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్‌ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్‌ లేటెస్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది.&nbsp; కళ్యాణ్‌ దేవ్‌ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్‌ దేవ్‌ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్‌ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.&nbsp;
    ఏప్రిల్ 11 , 2023

    @2021 KTree