• TFIDB EN
  • చిత్రలహరి
    UTelugu2h 10m
    వ్యక్తిగత, వృత్తి జీవితంలో నిరంతం వైఫల్యమవుతున్న విజయ్.. తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం వెతుకుతుంటాడు. కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వరు. అయితే స్వేచ్ఛ అనే యువతి అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సాయి ధరమ్ తేజ్
    విజయ్ కృష్ణ విజయ్
    కళ్యాణి ప్రియదర్శన్
    లహరి
    నివేదా పేతురాజ్
    కె. స్వేచ్ఛ
    సునీల్
    మైఖేల్ మైక్ / గ్లాస్‌మేట్
    వెన్నెల కిషోర్
    కిషోర్
    పోసాని కృష్ణ మురళి
    విజయ్ తండ్రి
    బ్రహ్మాజీ
    జనార్ధన్
    హిమజ
    నవనీత
    పవిత్ర లోకేష్
    స్వేచ్ఛా తల్లి
    జయప్రకాష్
    CEO
    రోహిణి హట్టంగడి
    న్యాయమూర్తి
    రావు రమేష్
    లాయర్ పురుషోత్తం
    భరత్ రెడ్డి
    భరత్
    హైపర్ ఆది
    అజయ్
    ప్రభాస్ శ్రీను
    రిపేర్ షాప్ ఓనర్
    సుదర్శన్ విజయ్ స్నేహితుడు
    యీషా అదరఃలహరి స్నేహితుడు
    సిబ్బంది
    కిషోర్ తిరుమల
    దర్శకుడు
    మైత్రీ మూవీ మేకర్స్ ప్రై. లిమిటెడ్
    నిర్మాత
    నవీన్ యెర్నేనినిర్మాత
    రవిశంకర్నిర్మాత
    మోహన్ చెరుకూరినిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    కార్తీక్ గట్టమ్నేని
    సినిమాటోగ్రాఫర్
    ఎ. శ్రీకర్ ప్రసాద్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    పిల్లా నువ్వులేని జీవితం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. చిత్రలహరి, విరూపాక్ష వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ డం సంపాదించాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం. సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు? ధరమ్ సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా? పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సాయి ధరమ్ తేజ్ పుట్టిన తేదీ ఎప్పుడు? October 15, 1986 సాయి ధరమ్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ క్రష్ ఎవరు? లారిసా బొనేసి(Larissa Bonesi). ఈమె తిక్క చిత్రంలో సాయి ధరమ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సాయి ధరమ్‌కు ఇష్టమైన సినిమా? గ్యాంగ్ లీడర్ సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, చిరంజీవి సాయి ధరమ్ తేజ్ తొలి హిట్ సినిమా? సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం సాయిధరమ్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. చిత్రలహరి, బ్రో, విరూపక్ష వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. సాయి ధరమ్‌కు ఇష్టమైన కలర్? నీలం రంగు సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రుల పేర్లు? విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్ సాయి దరమ్‌కు ఇష్టమైన ప్రదేశం? దుబాయ్, లండన్ సాయి ధరమ్ చదువు? MBA సాయి ధరమ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు. https://www.youtube.com/watch?v=G7ptLW3O0Qo సాయి ధరమ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? సాయి ధరమ్ 2024 వరకు 16 సినిమాల్లో నటించాడు.  సాయి ధరమ్‌కు ఇష్టమైన ఆహారం? రొయ్యల పలావు, పప్పు అన్నం సాయి ధరమ్ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సాయి ధరమ్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్ అభిరుచులు? ట్రావలింగ్, క్రికెట్ ఆడటం సాయి ధరమ్‌కు ఇష్టమైన హీరోయిన్? సమంత
    మార్చి 21 , 2024
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నివేత పేతురాజ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    తెలుగులో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోయిన్లలలో నివేత పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. పెళ్ళిరోజు, టిక్ టిక్ టిక్, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించింది. పాగల్, దాస్‌కా ధమ్కి వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నివేత పేతురాజు((Some Lesser Known Facts about Nivetha Pethuraj) గురించి కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నివేత పేతురాజ్ ఎప్పుడు పుట్టింది? 1991, నవంబర్  30న జన్మించింది నివేత పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన తొలి తెలుగు సినిమా? మెంటల్ మదిలో(2017) సినిమా ద్వారా ఆరంగేట్రం చేసింది. నివేత పేతురాజ్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు  నివేత పేతురాజ్ ఎక్కడ పుట్టింది? మదురై నివేత పేతురాజ్ అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ నివేత పేతురాజ్‌కు  ఇష్టమైన కలర్?  వైట్, బ్లాక్\ నివేత పేతురాజ్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్ నివేత పేతురాజ్ ఏం చదివింది? డిగ్రీ నివేత పేతురాజ్ పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. కోటి వరకు ఛార్జ్ చేస్తోంది. నివేత పేతురాజ్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది నివేత పేతురాజ్‌కు ఎమైన వివాదాలు ఉన్నాయా? 2018 మేలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నివేత పేతురాజ్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/nivethapethuraj/?hl=en నివేత పేతురాజ్‌కు టాటూలు ఎక్కడ ఉన్నాయి? నివేత ఎద పై భాగంలో క్రిసెంట్ మూన్‌తో పాటు ఆమె నడుముకు వెనుక భాగంలో టాటూ ఉంది. నివేత పేతురాజ్ దగ్గర ఉన్న  ఖరీదైన కారు? డాడ్జ్ ఛాలేంజర్ స్పోర్ట్స్ కారు https://www.youtube.com/watch?v=S6luYDlMNiY
    అక్టోబర్ 22 , 2024
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    Nivetha Pethuraj: సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ ప్రచారం.. నటి నివేత పేతురాజ్‌ సంచలన పోస్ట్‌!
    కోలీవుడ్ నటి నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టున్న ఈ భామ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల నివేతా గురించి ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. నివేతా పేతురాజ్‌ కోసం ఓ ప్రముఖుడు విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారంటూ తమిళ మీడియాలో ఆమెపై నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా వాటిపై నివేత స్పందిస్తూ ఎక్స్‌లో సంచలన పోస్టు పెట్టింది.  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం తమిళనాడులో తనను లక్ష్యంగా చేసుకొని వస్తున్న వార్తలపై నటి నివేతా పేతురాజ్ ఎక్స్‌ వేదికగా మండిపడింది. ‘నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల నాపై తప్పుడు వార్తలు రాశారు. ఈ తప్పుడు వార్తల వల్ల కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను సంపాదించడం మొదలుపెట్టాను. నేను డబ్బు కోసం అత్యాశపడే వ్యక్తిని కాదు. నా కోసం ఎవరో డబ్బు ఖర్చు చేస్తున్నారనంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఆ వార్తలు రాసేవాళ్లు ఒకసారి ఆలోచించండి. మీలో మానవత్వం ఉందనే అనుకుంటున్నా. మరోసారి నా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తప్పుడు వార్తలు సృష్టించరని భావిస్తూ లీగల్‌ యాక్షన్‌ తీసుకోకుండ వదిలేస్తున్నా. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’ అంటూ నివేతా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం నివేతా పేతురాజ్‌ ట్వీట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.  https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 అసలేం జరిగింది? గత కొన్నిరోజులుగా నివేతా పేతురాజ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin)కు మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, ఆమె కోసమే కోట్లు ఖర్చుపెట్టి కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చాడని, ఇంకా ఏది చేయడానికి అయినా ఉదయనిధి సిద్ధంగా ఉన్నాడని తమిళ మీడియాలో పుకార్లు.. షికార్లు చేసాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరిస్తూ వచ్చిన నివేతా.. దీనికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించింది. రోజు రోజుకు ఈ ప్రచారం మరింత విస్తృతం కావడంతో తాజాగా దానిపై స్పందించింది. తప్పుడు వార్తలన్నింటికీ ఓ పోస్టు ద్వారా చెక్‌ పెట్టింది. 
    మార్చి 05 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    Heroines Birthday: ట్విటర్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
    Heroines Birthday: ట్విటర్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
    కథానాయికలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇవాళ తెలుగు అగ్రకథానాయిక రష్మిక మందన్న పుట్టిన రోజు. దీంతో ట్విటర్‌లో రష్మిక బర్త్‌డే ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ అభిమాన నటికి విషెస్‌ చెబుతూ రష్మిక ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. #RashmikaMandanna హ్యాష్‌టాగ్‌తో ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో రష్మిక ఫొటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పుష్ప 2 లో రష్మికా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.  https://twitter.com/BheeshmaTalks/status/1643477077314904065 ఐపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో రష్మిక తన డ్యాన్స్‌ ప్రదర్శనతో అకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు రష్మిక పోస్టు చేసిన డ్యాన్స్‌  వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది.  https://twitter.com/iamRashmika/status/1641832071739084806 రష్మిక లేటెస్ట్‌ మూవీ ‘రెయిన్‌బో’ షూటింగ్‌ ప్రారంభోత్సవ ఫొటోలు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ సినిమా సూపర్‌ హిట్ అవుతుందని రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్‌ పెడుతున్నారు.  https://twitter.com/iamRashmika/status/1642859136558792705 తమిళ నటుడు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా రష్మికకు పెద్ద ఎత్తున విషెస్‌ చెబుతున్నారు. విజయ్‌తో రష్మిక ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.  https://twitter.com/itz_jaiTheri/status/1643469141662400513 పలు సినిమాలకు సంబంధించిన రష్మిక డిఫరెంట్‌ లుక్స్‌ ఫొటోను ఓ నెటిజన్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. https://twitter.com/SivaHarsha_1/status/1643484285998108674 https://twitter.com/SivaHarsha_1/status/1643484313055563777 ఇవాళ రష్మికతో పాటు మరో హీరోయిన్‌ కూడా బర్త్‌డే జరుపుకుంటోంది. హలో, చిత్ర లహరి సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్‌ పుట్టిన రోజు కూడా ఇవాళే. దీంతో ఆమె ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున ప్రియదర్శన్‌కు విషెస్‌ చెబుతున్నారు. #kalyanipriyadarshanతో నటి ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.  క్యూట్‌ లుక్స్‌తో ఉన్న కళ్యాణి ప్రియదర్శన్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శారీలో నటి దిగిన పిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి.  https://twitter.com/SivaHarsha_1/status/1593112240752058369 https://twitter.com/Pranay___Varma/status/1622950945335447555 ప్రియదర్శన్‌ చేసిన పలు సినిమాల్లోని మూవీ క్లిప్స్‌ ట్విటర్‌ ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిని ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.  https://twitter.com/24HoursUpdated/status/1511181288471871493 https://twitter.com/i/status/1643458567972990976 ఓ మూవీ ఈవెంట్‌లో ప్రియదర్శన్‌ సందడి ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పలు సినిమాల్లో మరింత అందంగా కనిపించిన వీడియో క్లిప్స్‌ను ఈ వీడియోకు ఫ్యాన్స్ జత చేశారు.  https://twitter.com/i/status/1643479187225976832
    ఏప్రిల్ 05 , 2023
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్‌ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్‌ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్‌, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్‌ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్‌-10 సూపర్ హిట్ సాంగ్స్‌ మీకోసం.. 1. పూనకాలు లోడింగ్ మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్‌’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్‌ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.  https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w 2. శ్రీవల్లి సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌కు మంచి పేరు వచ్చింది.  https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 3. బుల్లెట్‌ సాంగ్ రామ్‌ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్‌’ సినిమాలో ‘బుల్లెట్‌ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్‌ లవర్స్‌కు బాగా దగ్గరైంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్‌ బీట్‌కు రామ్‌, కృతి డ్యాన్స్‌ తోడవడంతో ఈ సాంగ్‌ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.  https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 4. జల జల జలపాతం నువ్వు చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయింది.  https://www.youtube.com/watch?v=PTpimuHzlvE 5. ఎంత సక్కగున్నావే రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్‌ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్‌చరణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పాటకు మరింత హైప్‌ తీసుకొచ్చింది.  https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic 6. ప్రేమ వెన్నెల చిరు మేనల్లుడు సాయిధరమ్‌ కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్‌ అని చెప్పాలి. లవ్‌ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్‌ కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మెలోడి సాంగ్‌గా నిలించింది.  https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E 7. మైండ్‌ బ్లాక్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్‌ అయింది. ముఖ్యంగా ‘మైండ్‌ బ్లాక్‌’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌కు మహేశ్‌, రష్మి హై వోల్టెజ్‌ పర్‌ఫార్మెన్స్‌ తోడవడంతో సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.  https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q 8. సీటీ మార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా హరీశ్ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్‌’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్‌ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్‌కు అల్లు అర్జున్‌ క్లాస్‌ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్‌ పెరిగిపోయింది.  https://www.youtube.com/watch?v=F5X694sak5U 9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభాస్‌ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్‌ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M 10. నువ్వుంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్‌ స్టార్టింగ్‌లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌ ఇప్పటికీ సూపర్‌హిట్‌గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది.  https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
    ఏప్రిల్ 04 , 2023
    కె విశ్వనాథ్ సినీ ప్రస్థానం : వెండితెరపై కళాఖండాలు చిత్రీకరించిన కళాతపస్వి
    కె విశ్వనాథ్ సినీ ప్రస్థానం : వెండితెరపై కళాఖండాలు చిత్రీకరించిన కళాతపస్వి
    ]అవార్డులు1992లో పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 5 జాతీయ అవార్డులు, 5నంది అవార్డులు, 10 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు అందుకున్నారు.
    ఫిబ్రవరి 11 , 2023
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    Tollywood Next Generation : తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన టాప్ హీరోల వారసులు… ఆ కళలు నిజమయ్యేనా?
    హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్‌ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్‌ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం. గౌతమ్ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.  మహాధన్‌ చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి  పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్‌ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు. అకీరా నందన్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్‌ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్‌ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.  సితార మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు. అల్లు అర్హ అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్‌ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.  అరియానా, వివియానా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.  అయాన్, అభిరామ్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
    ఏప్రిల్ 19 , 2023
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.  అలా తెరమీదకి.. ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.   https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20 స్టోరీ ఇదే.. పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్‌ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.   https://youtu.be/stcCZWCBegk త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా? మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది.  వాస్త‌వాల‌కు, భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.  https://www.youtube.com/watch?v=yNnJ9de339k 12 భాషల్లో చిత్రీకరణ డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.  https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 26 , 2023
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    The Kerala Story : రచ్చ రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’.. వివాదానికి ప్రధాన కారణం అదేనా?
    'ది కేరళ స్టోరీ ' చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపుతోంది. మే 5న ఈ సినిమా విడుదల కానుండగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయోద్దంటూ కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, సీపీఐ, ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘ది కేరళ స్టోరీ’ విద్వేషపూరితంగా చిత్రీకరించారని, సినిమా విడుదల చేస్తే మత సామరస్యం దెబ్బతింటుందని పలువురు ఏకంగా సుప్రీకోర్టునే ఆశ్రయించారు. ఈ స్థాయిలో వివాదం రాజుకోడానికి కారణమేంటి? ఈ చిత్రంపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? కేరళ కంటే తమిళనాడు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతోంది? అసలు ఈ సినిమా సెన్సార్‌ క్లియర్‌ చేసుకుందా? వంటి ప్రశ్నలకు ఈ ప్రత్యేక కథనంలో సమాధానం చూద్దాం. వివాదానికి బీజం: సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. కేరళలో 2016-17 మధ్య 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడ అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరతారు. ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో కథ చూపించడం వివాదానికి దారితీసింది. ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలవ్వగా అప్పటి నుంచే దీనిపై రాజకీయ రగడ మొదలైంది.  కేరళ సీఎం ఆగ్రహం 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌.. కేరళ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. ‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని పరోక్షంగా భాజపా, RSSలకు చురకలు అంటించారు.  సినిమాను బ్యాన్‌ చేయాలి ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను కేరళ అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడింది. రాష్ట్రంలో చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కూడా సినిమాను వ్యతిరేకిస్తూ ట్విట్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు.  తమిళనాడు అలెర్ట్‌ ది కేరళ స్టోరి రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్‌ బృందాలు అలెర్ట్‌ జారీ చేశాయి. తమిళనాడులో మూవీ విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ‘కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి నిఘా వర్గాలు సూచించాయి. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో సినిమాను విడుదల చేసేందుకు  ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని థియేటర్లలో పొన్నియన్‌ సెల్వన్‌-2 నడుస్తున్నట్లు చెప్పాయి. ధియేటర్‌ యాజమానులు ‘ది కేరళ స్టోరీ’ని ఇప్పట్లో రిలీజ్‌ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాయి. సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరాలు ‘ది కేరళ స్టోరీ’ ఇటీవలె సెన్సార్‌ పూర్తి చేసుకుంది. వివాదస్పదంగా మారిన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘A సర్టిఫికేట్’ ఇచ్చింది. అంతేగాక సినిమాలోని వివిధ సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేవుళ్లకు సంబంధించిన డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మరికొన్ని పదాలను సవరించాలని కోరింది. మొత్తం 10 సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. పలు సవరణలతో మే 5న చిత్ర విజయానికి అనుమతించింది.  సుప్రీంకోర్టు స్పందన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన అభ్యర్థనను ధర్మాసనం నిరాకరించింది. ‘ది కేరళ స్టోరీ’లో విద్వేషపూరితమైన ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయని దాఖలైన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. ‘ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందింది. మీరు దీని విడుదలను సవాల్‌ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. 
    మే 03 , 2023
    <strong>Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే&nbsp; ఓ వీర సైనికుడి గాథ</strong>
    Amaran Movie Review: హృదయాన్ని హత్తుకునే&nbsp; ఓ వీర సైనికుడి గాథ
    చిత్రం: అమరన్నటీనటులు: శివ కార్తికేయన్‌, సాయి పల్లవి, భువన్ అరోడ, రాహుల్ బోస్‌, లల్లు, శ్రీకుమార్‌, శ్యామ్ మోహన్సినిమాటోగ్రఫీ: సీహెచ్ సాయిఎడిటింగ్: ఆర్. కలైవానన్నిర్మాతలు: కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌, వివేక్‌ కృష్ణానిదర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామివిడుదల తేదీ: 31-10-2024 భారత సైనికుల త్యాగాలు, ధైర్యసాహసాలు కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రాల్లో అమరన్ ఒకటి. ఈ చిత్రం జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా(Amaran Movie Review) తీసుకుని చిత్రీకరించారు. ముకుంద్‌గా శివ కార్తికేయన్‌, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలసి కమల్‌హాసన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి పండుగ వేళ పలు భాషల్లో విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? ఓసారి చూద్దాం. కథ ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? అమరన్ చిత్రం ఒక దేశభక్తి, ప్రేమ, త్యాగం కలబోతైన సినిమా. సైనికుడు కష్టాల్లో ఉండగా ఆయన కుటుంబం ఎలా మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటుందో, కుటుంబం ఎంతటి త్యాగాలను చేస్తుందో ఈ చిత్రం హృదయానికి హత్తుకునేలా చూపించింది.(Amaran Movie Review) మాదెప్పటికీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్పే... ఇప్పుడూ అంతే" అనే ఇందు మాటలు ప్రేక్షకున్ని&nbsp; ప్రతి సన్నివేశంలో మమేకం చేస్తాయి. ముఖ్యంగా ముకుంద్, ఇందుల ప్రేమకథ ఒక అందమైన దృశ్యకావ్యంగా నిలుస్తుంది. వారి ప్రేమాయణం, సైనిక బాధ్యతలు వేర్వేరు ప్రపంచాలుగా ఉన్నా, ఆ పాత్రలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించారు. ముకుంద్ వ్యక్తిగత జీవితంలో భార్య, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగాలతో కట్టిపడేస్తాయి. అలాగే కశ్మీర్‌లో ప్రజలు- సైనికుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, వారి ప్రణాళికలు ఎలా ఉంటాయి, ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సైనికులు ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంటారు అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్‌లో అల్తాప్ వానీని హతం చేయడానికి&nbsp; ఖాజీపత్రి ఆపరేషన్‌ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఎవరెలా చేశారంటే? ఇప్పటి వరకు చేయని ఓ కొత్త పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్‌లో సరదా పాత్రల్లో ఎక్కువగా కనిపించే శివ కార్తికేయన్ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా, సీరియస్‌గా, సైనికుడి గంభీరతను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి, తన పాత్రలో సహజత్వాన్ని తెరపై ప్రదర్శిస్తూ, తల్లి, భార్యగా త్యాగపూరిత పాత్రలో తన ప్రతిభను చాటారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి సన్నివేశాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది. సాంకేతికత ఈ సినిమా టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉంది. సీహెచ్ సాయి తీసిన విజువల్స్ కశ్మీర్‌లోని సైనిక భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబింపజేస్తాయి.(Amaran Movie Review) జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం భావోద్వేగాలను హైలెట్ చేస్తుంది. ఎడిటింగ్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాకు అనువుగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి. బలాలు బలమైన కథ సెకాండాఫ్ బలమైన ఎమోషన్స్ శివకార్తికేయన్- సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ బలహీనతలు పస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు చిరవగా మేజర్ ముకుంద్ వరదరాజన్‌కి నివాళిగా, ఆయన ధైర్యసాహసాలను, కుటుంబం త్యాగాన్ని చూపించిన ఈ చిత్రం హృదయాలను హత్తుకుంటుంది. రేటింగ్: 4/5
    నవంబర్ 01 , 2024
    <strong>Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;</strong>
    Thandel Movie: శివ పార్వతుల్లా నాగ చైతన్య - సాయిపల్లవి.. ‘తండేల్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్స్‌!&nbsp;
    అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రంపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున బజ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘లవ్‌ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్‌’పై&nbsp; అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్‌ కోసం సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తండేల్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఇది చేసిన సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.&nbsp; శివరాత్రి స్పెషల్ సాంగ్‌ నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో రూపొందుతున్న ‘తండేల్‌’ చిత్రానికి చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. శివరాత్రి థీమ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌ను సైతం వేశారు. పాట విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు మేకర్స్‌ రూ.4 కోట్లు ఖర్చు చేశారని టాక్‌. అంతేకాదు వందలాది మంది డ్యాన్సర్లు ఈ పాటలో భాగం కాబోతున్నారట. సాయిపల్లవి, నాగచైతన్య శివపార్వతులను తలపించే నృత్యరీతులతో అలరించబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. శివరాత్రి థీమ్‌తో ఓ పాటను ఈ స్థాయిలో కంపోజ్ చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారని టాక్‌. షూటింగ్‌ స్పాట్‌ ఫొటోలను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇందులో చైతు-సాయిపల్లవి శివ పార్వతులను తలపిస్తున్నారు.&nbsp; https://twitter.com/ThandelTheMovie/status/1840612058691183016 తండేల్‌ స్టోరీ ఇదే నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. గుజరాత్‌ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతోంది. తండేల్ అంటే గుజరాతి భాషలో బోటు నడిపే ఆపరేటర్‌ అని అర్థం. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని డైరెక్టర్‌ చందూ మెుండేటి ఓ ఇంటర్యూలో వెల్లడించారు.&nbsp; చైతూ ఆశలన్నీ తండేల్‌ పైనే! ప్రస్తుతం నాగ చైతన్య తన&nbsp; ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత అతడికి సరైన హిట్‌ లభించలేదు. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్‌ యూ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్‌’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. మత్స్యకారుడి పాత్ర కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.&nbsp; సాయిపల్లవి ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్‌' అనే చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌ 31 థియేటర్లలోకి రానుంది. అలాగే బాలీవుడ్‌లో ‘రామాయణం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తోంది. ఇందులో సీతగా ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం రూ.15 కోట్లకు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే హీరో నాని, శేఖర్‌ కమ్ములా కాంబోలో రానున్న చిత్రంలోనూ సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    Ramayanam: ‘రామాయణం’ సెట్‌ నుంచి ఫొటోలు లీక్‌.. సీతగా ‘సాయిపల్లవి’ ఎంత బాగుందో చూడండి!
    Ramayanam: ‘రామాయణం’ సెట్‌ నుంచి ఫొటోలు లీక్‌.. సీతగా ‘సాయిపల్లవి’ ఎంత బాగుందో చూడండి!
    రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణం’ (Ramayanam) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలోనే సెట్‌ నుంచి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. రణ్‌బీర్‌, సాయిపల్లవి లుక్స్‌ లీక్‌ తాజాగా రామాయణం సెట్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ఫొటోలు లీకయ్యాయి. ఇందులో రణ్‌బీర్‌ రాముడి గెటప్‌లో కనిపించాడు. సీత కాస్ట్యూమ్‌లో సాయిపల్లవి అందంగా కనిపించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ముఖ్యంగా సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె కట్టు, బొట్టు, హుందాతనం చూస్తే అచ్చం సీతలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. సీత పాత్రకు ఆమె ఎంపిక 100 శాతం సరైనదని అంటున్నారు. అటు రాముడిగా రణ్‌బీర్‌ లుక్‌ కూడా బాగుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అతడి ఆహార్యం రాముడి సరిగ్గా సరిపోయిందని పేర్కొంటున్నారు. సీతారాములుగా వీరి పెయిర్‌ చూడ ముచ్చటగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/RKs_Tilllast/status/1784096317817708991 https://twitter.com/Udbhav1947/status/1784115819171233844 https://twitter.com/BFilmyOfficial/status/1784097462581604480 ఇద్దరు ఆస్కార్‌ విన్నర్లు! రామాయణం చిత్రానికి సంగీతం అందించ‌డం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. ఇందులో ఒక‌రు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కాగా.. ఇంకొక‌రు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్ద‌రూ క‌లిసి రామాయ‌ణం సినిమాకు సంగీతం అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై నితీష్‌ తీవారి ఏ.ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ చిత్రాల‌తో హన్స్ జిమ్మెర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించాడు. త్రివిక్రమ్‌కు కీలక బాధ్యత! రామాయణ తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)కు మేకర్స్‌ అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు. గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్‌ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్‌ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం.&nbsp;
    ఏప్రిల్ 30 , 2024
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!
    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్‌ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్‌ వెనక్కి తగ్గలేదు. అజిత్‌ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్‌ స్టంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పల్టీ కొట్టిన అజిత్‌ కారు! ప్రస్తుతం అజిత్‌ (Ajith) తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’ (Vida Muyarchi)లో నటిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.&nbsp; https://twitter.com/Fukkard/status/1775813515233878447 ‘ధైర్యానికి హద్దులు ఉండవు’ ఈ వీడియోను షేర్‌ చేసిన లైకా ప్రొడక్షన్స్‌.. దీనికి అదిరిపోయే క్యాప్షన్ సైతం ఇచ్చింది. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా, ‘విదా ముయార్చి’ చిత్రానికి మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
    ఏప్రిల్ 04 , 2024
    Devara Movie: ‘దేవర’ నుంచి తారక్‌ వీడియో క్లిప్‌ లీక్‌.. సర్‌ప్రైజ్‌ చేసిన మేకర్స్‌!
    Devara Movie: ‘దేవర’ నుంచి తారక్‌ వీడియో క్లిప్‌ లీక్‌.. సర్‌ప్రైజ్‌ చేసిన మేకర్స్‌!
    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత తారక్‌ (Jr NTR) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో జూ.ఎన్టీఆర్‌ ఈ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor), తారక్‌పై చిత్ర యూనిట్‌ ఓ సాంగ్‌ను అక్కడ చిత్రీకరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ‘దేవ‌ర’లో ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌ను మేక‌ర్స్ అధికారికంగా రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; రుద్రాక్షతో ఠీవీగా నిలబడ్డ తారక్‌! ‘దేవర’లో జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన లేటెస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ సోషల్‌మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలో న‌డుముపై చేతులు వేసుకొని చాలా దర్జాగా ఎన్టీఆర్ క‌నిపించాడు. మెడ‌లో రుద్రాక్షతో ఉన్న ఎన్టీఆర్ మాస్ లుక్‌ చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో పాటు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం క‌నిపించారు. గోవాలో చిత్రీక‌రిస్తున్న పాట‌కు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందింస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; ఎన్టీఆర్‌ వీడియో లీక్‌.. అంతకుముందు గోవాలో ‘దేవర’ షూటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట లీక్ అయ్యింది. సముద్రం ఒడ్డున లుంగీ ధరించి ఉన్న ఎన్టీఆర్‌.. ఆ వీడియోలో కనిపించాడు. సముద్రం నుంచి తీరం వైపునకు తారక్‌ నడుచుకుంటూ రావడం ఇందులో కనిపించింది. చిత్ర యూనిట్‌ పోస్టు చేసిన ఫొటోలో, ఈ వీడియోలో ఉన్న తారక్‌ లుక్‌ ఒకటే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో రెండు పాత్రల్లో తారక్‌ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రికొడులుగా అతడు నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లీకైన వీడియో ఫాదర్‌ క్యారెక్టర్‌కు సంబంధించిందని టాక్.&nbsp; https://twitter.com/Chaitanya9045/status/1770879170299781378 ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే! జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌బోతున్న‌ట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాల శివ.. ఈ మూవీతో&nbsp; ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. తొలి భాగాన్ని అక్టోబర్‌ 10 (Devara Release Date)న రిలీజ్‌ చేయనున్నారు.
    మార్చి 22 , 2024
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !
    మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వైజాగ్‌లో షూటింగ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.&nbsp; https://twitter.com/i/status/1768563620739453357 https://twitter.com/n_suren/status/1768531852414079277 https://twitter.com/i/status/1767734419715133518 https://twitter.com/venkysayzzz/status/1768539657896087692 చరణ్‌కు ఘన స్వాగతం వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1768308149847753158 https://twitter.com/i/status/1768557163746656272 https://twitter.com/i/status/1768447264660296074 చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌ రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.&nbsp; ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌! ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; మూవీ టైటిల్ అదేనా! రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.&nbsp;
    మార్చి 16 , 2024
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్‌ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్‌, కామెడీ, అడ్వెంచర్‌ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్‌ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్‌ సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; వివాహభోజనంబు ‘మాయాబజార్‌’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్‌ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.&nbsp; https://www.youtube.com/watch?v=dZejdBmYC3k ‘సుందరి నీవంటి’ సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్‌ చేస్తారు. కానీ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్‌ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్‌ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్‌ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=ScasolQHzxs 'నిలువరా వాలు కనులవాడా' జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్‌ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్‌ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.&nbsp; https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA 'చెప్పమ్మా.. చెప్పమ్మా..' ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్‌.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్‌ కనిపిస్తూ డిస్టర్బ్‌ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్‌ అవుతుందో ఈ సాంగ్‌ కళ్లకు కడుతుంది.&nbsp; https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI 'బుగ్గే బంగారమా..' ‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక ‌అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు. https://www.youtube.com/watch?v=WABcMeOf0oM ‘అసలేం గుర్తుకు రాదు’ ‘అంతపురం’లోని ఈ సాంగ్‌.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.&nbsp; https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss ‘ఇంకి పింకి పాంకీ’ సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్‌ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి. https://www.youtube.com/watch?v=FusD0RVkKAk ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మాస్‌ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్‌ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్‌ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=u_wB6byrl5k ‘ఐతే’ ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్‌ కళ్లకు కడుతుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4 ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్‌ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.&nbsp; https://www.youtube.com/watch?v=2a34XyiZO14 ‘చెలియా చెలియా’ ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి&nbsp; పక్కన ఉంటే&nbsp; ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
    మార్చి 02 , 2024
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా&nbsp; సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక&nbsp; (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
    నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు దర్శకత్వం: సముద్రఖని స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్ సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం. కథేంటంటే? మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే. https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20 ఎలా ఉంది? ‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్‌ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు. https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20 ఎవరెలా చేశారు? కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి. https://youtu.be/jnzuXnj6HE0 ప్లస్ పాయింట్స్ పవన్, సాయితేజ్ మధ్య సీన్స్ పవన్ సాంగ్స్ మిక్స్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఓవర్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’ రేటింగ్: 3/ 5 https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 28 , 2023
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    Salaar Teaser: సస్పెన్స్‌కు తెర… KGFతో ఉన్న లింక్‌ను బయట పెట్టిన సలార్ టీజర్ 
    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సలార్‌ టీజర్‌ వచ్చేసింది. తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలను టీజర్‌లో పుష్కలంగా చూపించారు. దీనిని చూసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే సలార్ టీజర్‌లో కనిపించిన అంశాలు ఇప్పటి వరకు అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు అయితే క్లారిటీ ఇచ్చింది. టీజర్ చివర్లో పార్ట్-1 సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు.&nbsp; అంటే సలార్ సినిమా రెండు భాగాల్లో తెరకెక్కనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయాన్ని బట్టి మూడో పార్ట్‌ను కూడా ప్రశాంత్ నీల్ చిత్రీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం సలార్ మూవీ రెండు పార్ట్స్‌గా తెరకెక్కే విషయంలో క్లారిటీ వచ్చింది. కేజీఎఫ్‌తో సలార్ లింక్ సలార్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కేజీఎఫ్‌ 2తో లింక్ ఉంటుందని చాలా మంది భావించారు. ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ టీజర్‌లో కొన్ని సీన్లు కనిపించాయి. టీజర్‌లో టిన్ను ఆనంద్ చెప్పిన డైలాగ్‌లో "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్.. అయితే జూరాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే.. ఆ పార్క్‌లో సలార్ నివసిస్తాడు” అనే అర్థం వచ్చేలా బ్యాక్‌గ్రౌండ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ గురించి చూపించారు.  అయితే జురాసిక్ పార్క్ అనే సినిమా 1993లో విడుదలయ్యింది. సలార్ బ్యాక్ డ్రాప్ 1990టైం నుంచి జరిగిందని ఊహించవచ్చు. కేజీఎఫ్ (KGF) 1980 సమయంలో జరిగింది. దీంతో సలార్‌ను కేజీఎఫ్‌తో లింక్ చేసే విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. కేజీయఫ్ తర్వాత సలార్ స్టోరీ చెప్పాలి కనుక ఈ విధంగా డైలాగ్స్ పేర్చి ఉండొచ్చు. అలాగే కేజీఎఫ్ 2లో రాకీ భాయ్ ఆర్మీలో 'సలార్'( ఈశ్వరీ రావు) కొడుకు జాయిన్ అవుతాడు. కానీ అతను అధీరా (సంజయ్ దత్‌)తో పొరాడే క్రమంలో సలార్ గాయపడినట్లు చూపిస్తారు.&nbsp; ఆ తర్వాత అతను ఇక సినిమాలో కనిపించడు. ఆ యువకుడే సలార్( ప్రభాస్‌) అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీజర్‌లో సలార్ ఎవరనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.&nbsp; ఫ్యాన్స్ రచ్చ రచ్చ మొత్తానికి సలార్ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. గ్యాంగ్‌ స్టర్ పాత్రకు ప్రభాస్‌కు మించిన కటౌట్ మరే ఏ హీరోకు నప్పదని కామెంట్లు చేస్తున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌కు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చారు. ప్రభాస్ ఫేస్ ఎక్కడా చూపించకపోయినా.. ఆయన చేస్తున్న యాక్షన్ సీన్లు, ఫర్పామెన్స్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ సందర్భంగా మిర్చి సినిమాలోని 'కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ డైలాగ్‌లు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో డార్లింగ్ ప్రభాస్ మరింత మాస్‌గా కనిపించారని ఊదరగొడుతున్నారు. అభిమానులుగా రెబల్ స్టార్ నుంచి కోరుకున్న ప్రతి అంశం టీజర్‌లో కనిపించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ టీజర్ ఉదయాన్నే మంచి కిక్‌ ఇచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.&nbsp; సలార్‌తో నడిచేది వీరే.. ఇక సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు సహా హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు యాక్ట్ చేస్తున్నారు. విలక్షణ నటుడు జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ రోల్‌లో నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి హిట్ చిత్రాలను నిర్మించి హోంబలే ఫిలిమ్స్.. సలార్ చిత్రాన్ని&nbsp; కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. సలార్ చిత్రం రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. https://www.youtube.com/watch?v=bUR_FKt7Iso
    జూలై 06 , 2023

    @2021 KTree