• TFIDB EN
  • సినిమా చూపిస్త మావా
    UATelugu2h 23m
    సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాజ్ తరుణ్
    కత్తి
    అవికా గోర్
    పరిణీతా ఛటర్జీ
    రావు రమేష్
    పరిణీత తండ్రి
    బ్రహ్మానందం
    దయా
    సప్తగిరి
    రాఖీ పండగ
    ప్రవీణ్
    రాహుల్
    సత్య అక్కల
    బస్ కండక్టర్
    రామ్ ప్రసాద్కత్తి స్నేహితుడు
    లక్ష్మి
    అభయ్ బేతిగంటి కత్తి స్నేహితుడు
    శంకర్ మెల్కోటే
    కళాశాల ప్రిన్సిపాల్
    పోసాని కృష్ణ మురళి
    డాక్టర్
    కృష్ణ భగవాన్
    పరిణీత బంధువు
    చెలకి చంటిపరిణీత బంధువు
    తాగుబోతు రమేష్
    సత్యం రాజేష్
    ప్రయాణీకుడు
    సుడిగాలి సుధీర్
    కాలేజీ విద్యార్థి
    శీనుకాలేజీ విద్యార్థి
    బస్సులో మెహబూబ్ బాషారౌడీ
    సిబ్బంది
    త్రినాధ రావు నక్కిన
    దర్శకుడు
    జి. సునీతనిర్మాత
    బెక్కం వేణుగోపాల్నిర్మాత
    రూపేష్ డి గోహిల్నిర్మాత
    శేఖర్ చంద్ర
    సంగీతకారుడు
    కార్తీక శ్రీనివాస్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం. అవికా గోర్ పూర్తి పేరు? అవికా సమీర్ గోర్ అవికా గోర్ ఎందుకు ఫేమస్ అవికా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అవికా గోర్ వయస్సు ఎంత? 1997,  జూన్ 30న జన్మించింది అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా? ఉయ్యాల జంపాల(2013) అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా? కేర్‌ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009) అవికా గోర్ ఎత్తు ఎంత? 5 అడుగుల 4 అంగుళాలు  అవికా గోర్ ఎక్కడ పుట్టింది? ముంబై అవికా గోర్ అభిరుచులు? ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్ అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం? పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్ అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా? మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అవికా గోర్‌కు  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ అవికా గోర్‌కు ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. అవికా గోర్ తల్లిదండ్రుల పేరు? సమీర్ గోర్, చేతన గోర్ అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/avikagor/?hl=en అవికా గోర్ పెట్  పేరు? షీరో https://www.youtube.com/watch?v=Md7ASbr-6LQ
    ఏప్రిల్ 02 , 2024
    Avika Gor: వెస్టిండీస్‌ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్‌!
    Avika Gor: వెస్టిండీస్‌ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్‌!
    సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఇక్కడి సినిమాలపై రీల్స్‌ చేసి భారతీయులకు దగ్గరయ్యాడు. ఇటీవల దర్శకుడు రాజమౌళితో కలిసి ఏకంగా ఓ యాడ్‌లో కూడా కనిపించాడు. తాజాగా వెస్టిండిస్‌ క్రికెటర్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌.. టాలీవుడ్‌ బ్యూటీ అవికా గోర్‌తో చిందేశాడు. ఓ ప్రత్యేక సాంగ్‌ ఆల్బమ్‌లో వీరిద్దరు కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  చీరకట్టులో అందాల జాతర వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండ్రీ రస్సెల్‌.. ఓ వైపు క్రికెట్‌.. మరోవైపు పాటల ఆల్బమ్స్‌ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్‌.. యంగ్‌ హీరోయిన్‌ అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్బమ్‌ చేశాడు. హిందీలో ‘లడ్కీ తూ కమల్ కీ’ (Ladki Tu Kamaal Ki) పాటతో హల్‌చల్‌ చేశాడు. అయితే ఈ సాంగ్‌ను రస్సెల్‌ స్వయంగా పాడటం విశేషం. ఇందులో అవికాతో కలిసి రస్సెల్‌ చిందేశాడు. రంగు అద్దాలు, నల్లటి టోపీ, పొడుగు చేతుల చొక్కా, లుంగీ ధరించి దేశీ స్టైల్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అటు అవికా గోర్ నీలిరంగు చీర కట్టుకొని అందాల ప్రదర్శన చేసింది. వీరిద్దరి కలయికలోని ఈ ఆల్బమ్‌ చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.  https://twitter.com/i/status/1788784603085582657 చైల్డ్‌ ఆర్టిస్టుగా ఎంట్రీ.. బుల్లితెరపై (Ladki Tu Kamaal Ki) వచ్చిన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో నటి అవికా చైల్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు.. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆ సినిమా సక్సెస్‌తో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు చుట్టు ముట్టాయి. తన తర్వాతి చిత్రాలు.. ‘సినిమా చూపిస్తా మావ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలు సైతం విజయాన్ని అందుకోవడంతో ఇక ఈ సుందరికి ఇక తిరుగులేదని అంతా భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం హిందీపై ఫోకస్‌ పెట్టిన అవికా.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బ్లడీ ఇష్క్‌ మూవీలో చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.  View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) నెట్టింట హాట్‌ ట్రీట్‌ యంగ్‌ బ్యూటీ అవికాగోర్‌ (Avika Gor Russell Dance).. ఓ వైపు సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలోనూ హల్‌ చల్‌ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్‌ ఇస్తూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన పోస్టులు పెడుతూనే అదే సమయంలో తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లను పంచుకుంటోంది. ఈ భామ హోయలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవికా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    మే 11 , 2024
    Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ
    Anupama Parameswaran: ఎద ఎత్తులపై టాటూ చూపిస్తూ టెంప్ట్‌ చేస్తున్న అనుపమ
    సినిమాల ఎంపిక విషయంలో అనుపమ పరమేశ్వరన్ రూటే సపరేటు. స్క్రిప్టులను ఆచితూచి ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంటుంది ఈ కేరళ కుట్టి. ఇలా క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్‌లో ఏనాడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. కానీ, ఈ మధ్యన అనుపమ యూ టర్న్ తీసుకుంది. అందాలను ఆరబెడితేనే ఫ్యాన్స్ గాలి తగులుతుందేమోనని అనుకున్నట్లుంది. ఇక తగ్గేదే లే అంటూ గ్లామర్ డోజ్ పెంచి నెటిజన్లను మత్తులోకి దించుతోంది.  లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వీరంగం సృష్టించింది. ఎద అందాలను ఏకరువు పెడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. సెల్ఫీ తీసుకుంటూ మూతిని వయ్యారంగా పక్కకు తిప్పింది.  ఏకంగా ఎద ఎత్తులపై టాటూను వేసుకుంది. కొత్తగా టాటూ వేసుకున్నా ఎలా ఉందంటూ సైడ్ యాంగిల్‌లో చూపించింది. టాటూను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.   ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ ‘హంగ్రీ’ అంటూ కామెంట్ చేసింది. ఆకలి అంటూ అర్థం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్ పెడుతూ ఫొటోలు దిగింది అనుపమ.  ఈ ఆకలి దేనికోసం అంటూ నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆకలిని తీరుస్తామంటూ రిప్లై ఇస్తున్నారు. ఈ టాటూ ఏంటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. రౌడీ బాయ్స్ సినిమాతో కొత్త అనుపమను పరిచయం చేసింది. ఈ సినిమాలో ప్రియ అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ పాత్రను పోషించింది. అంతకు ముందు వరకు డీసెంట్‌గా కనిపించిన అనుపమ ఈ సినిమాలో తన ముద్రను చెరిపేసుకుంది.  https://www.youtube.com/watch?v=jKxDgdOO6P4 లిప్ లాక్ సీన్లలో నటించి బాగా రెచ్చిపోయింది. సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.  https://www.youtube.com/watch?v=BG2YC0VSuIA రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.  https://www.youtube.com/watch?v=pOvRUu61TUk కార్తికేయ2, 18 పేజెస్ సినిమాతో హిట్ అందుకుంది ఉంగరాల జుట్టు చిన్నది. బటర్ ఫ్లై అనే వెబ్‌సిరీస్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) టిల్లు స్క్వేర్ సినిమాలోనూ అనుపమ నటిస్తోంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో సిద్ధుతో అనుపమ కారులోనే రొమాన్స్ చేస్తోంది. లిప్ లాక్‌కి మధ్యలో వేలు పెట్టి కవ్విస్తోంది. 
    జూన్ 15 , 2023
    Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం
    Andrea Jeremiah: బీచ్‌లో థైస్ షోతో తికమక పెడుతున్న తమిళ్ అందం
    హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ థైస్ షో చేసింది ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. ఆలీవ్ గ్రీన్ కలర్ షర్ట్, వైట్ షార్ట్‌తో అందాల ఎర వేసింది పొట్టి షార్ట్‌లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది తెలుగులో పెద్దగా సినిమాలు తీయకపోయినా.. తమిళ్‌ మాత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు ఉంది.  గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది. యుగానికి ఒక్కడు చిత్రంలో సెంటిస్టుగా పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది.  2005లో 'కందా నాల్ ముదల్' అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆండ్రియా  పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. 'యంగ్ ఇసాదర్సు' ర్యాప్ బృందంలో సాంగ్స్ పాడేది.  కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది.  ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.  తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తడాఖా సినిమాలో కమెడియన్ సునీల్ సరసన నటించడం వల్లే ఆమెకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదన్న వాదన ఉంది తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండా పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది
    జూలై 06 , 2023
    Disha Patani: బోల్డ్‌  వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!
    Disha Patani: బోల్డ్‌  వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!
    హాట్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోమారు తన గ్లామర్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌ పాపులర్ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ బామ బోల్డ్‌ శారీ లుక్‌లో తళుక్కుమంది. ఎద, నడుము అందాలను చూపిస్తూ పలుచటి శారీలో రెచ్చిపోయింది. పార్టీకి వచ్చిన వారందర్నీ తన ఒంపుసొంపులతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఇదిలా ఉంటే దిశా లేటెస్ట్ బాలీవుడ్‌ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్‌ 15, 2023న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్‌ డేట్‌ను రీషెడ్యూల్‌ చేయడంపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన #DishaPatani హ్యాష్‌టాగ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.  ‘యోధ’ సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్‌ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. మరోవైపు దిశా పటాని పెట్టే బోల్డ్‌ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్‌ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతుంటారు.  https://twitter.com/fitbabesbytes/status/1721358334786416642?s=20 లోఫర్‌ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  లోఫర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్‌ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.  దిశా నటించిన ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2),  బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.  భాగీ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే టైగర్, దిశా రిలేషన్‌ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్‌ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది. 
    నవంబర్ 07 , 2023
    Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?
    Andrea Jeremiah: కనిపించి కనిపంచని సొగసులతో ఆండ్రియా అందాల దాడి.. చూడకుండా వెళ్లగలరా?
    తమిళ్ హాట్ బ్యూటీ ఆండ్రియా జర్మియా తన తాజా హాట్‌ఫోటోలు షేర్ చేసి టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విలక్షణ నటనకు పెట్టింది పేరుగా ఉన్న ఆండ్రియా ఒంపుసొంపులతో కుర్రకారు హార్ట్ బీట్ అమాంతం పెంచేసింది. పింక్, బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఫొటో షూట్‌లో ఆండ్రింగా హాట్ లుక్స్‌లో కనిపించింది. ఎద అందాలు కనిపించి కనిపించకుండా చూపిస్తూ కవ్విస్తోంది. ఆండ్రియా జర్మియా తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించింది.  కార్తి హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో పాపులారిటీ సంపాదించింది.  ఆ తర్వాత తెలుగులో సునీల్, నాగ చైతన్య కాంబోలో వచ్చిన తడాఖా చిత్రంలో మెరిసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఆండ్రియా తన పరువాల విందుతో కుర్రకారుకు కైఫెక్కిస్తుంటుంది. తాజా ఫొటో షూట్‌లో ఇంపైన బ్యాక్ షోతో సొగసుల విందు చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో అందాల ఎర వేసింది పొట్టి షార్ట్‌లో నడుము అందాలను చూపిస్తూ ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ ఉండే ఈ తమిళ్ తెగింపు.. అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంటుంది గతంలో ధనుష్, అనిరుధ్ రవిచందర్, ఫహాద్ ఫాజిల్ వంటి సెలబ్రెటీలతో ఆఫైర్స్ నడిపి వార్తల్లో నిలిచింది. ఆండ్రియా తన తొలి చిత్రం 'కందా నల్ల ముదల్'(2005)తో సినిమాల్లోకి ఆరంగేట్రం ఇచ్చింది. స్టైలిష్‌గా కనిపిస్తూ, మంచి నటన కనబరుస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆండ్రియా జర్మియా ఇండస్ట్రీలోకి రాకముందు సింగర్‌గా కొనసాగింది.  ఆండ్రియా  పదేళ్ల వయసు నుంచే మంచి యాక్టివ్ పిల్ల. 'యంగ్ ఇసాదర్సు' ర్యాప్ బృంందంలో సాంగ్స్ పాడేది.  కాలేజీలోనూ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ నటనపై తన అభిరుచిని చాటుకుంది.  ఆండ్రియా స్వస్థలం తమిళనాడులోని అరక్కోణం. ఆమె ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో 1985 డిసెంబర్ 21న జన్మించింది.  తడాఖా సినిమా ద్వారా తెలుగు తెరకు పరచయమైన ఈ సుందరాంగి ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అడపాదడపా తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో అవకాశాలు రాకపోతేనేం.. అందాల ఆరబోతతో తమిళ్, తెలుగు కుర్రాళ్లను ఆకర్షిస్తునే ఉంది. ప్రస్తుతం ఈ అందాల బామకు చేతినిండ పని ఉంది. పిశాసు-2, నో ఎంట్రీ, వట్టం చిత్రాల్లో నటిస్తోంది
    ఫిబ్రవరి 14 , 2024
    Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్‌ లీక్‌!
    Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్‌ లీక్‌!
    బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ లేటెస్ట్‌ గ్లామర్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది. ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్‌ చేశాడా? అని కరణ్‌ జోహర్‌ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్‌ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్‌ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.  మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్‌ జోహార్‌ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.  ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్‌తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది. శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'దేవర' చిత్రంలో నటిస్తోంది. న్యూయర్‌ సందర్భంగా దేవర పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్‌.. జనవరి 8న సినిమా గ్లింప్స్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ గ్లింప్స్‌ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్‌ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్‌. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్‌ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. ఇక దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌, మలయాళం స్టార్‌ టామ్‌ చాకోలు విలన్స్‌గా కనపడబోతున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్‌ తర్వాత అఖిల్‌ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్‌ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్. ఇక జాన్వీ రెమ్యూనరేషన్‌ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
    జనవరి 04 , 2024
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ:  ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్‌ (కరణ్‌ సింగ్‌ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్‌ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహం.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్‌ నుష్రత్‌ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్‌ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్‌ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటి భాగ్య శ్రీ, శరద్‌ ఖేల్కర్‌, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్‌ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.  విశ్లేషణ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్‌ సీన్స్‌ ఉన్నాయంటే అది యాక్షన్‌ సీన్స్‌ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్‌ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు.  ప్లస్‌ పాయింట్స్ హీరో నటనయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ పాటలురొటిన్‌ సీన్స్‌బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ రేటింగ్‌: 2/5
    మే 12 , 2023
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    Virat Kohli Biopic: విరాట్‌ కోహ్లీగా రామ్‌చరణ్ సెట్ అవుతాడా? సినిమా స్టోరీ, క్లైమాక్స్‌, డైరెక్టర్ల‌పై నెట్టింట్లో రచ్చ..
    రామ్‌చరణ్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడు. సినిమా సినిమాకు తనలోని నటుడుని మెరుగు పరుచుకుంటూ స్థాయిని పెంచుకుంటున్న హీరో. RRR తర్వాత చరణ్ మేనియా మరింత పెరిగింది. దీంతో చెర్రీ అప్‌కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఎనలేని ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలో రామ్‌చరణ్ చెప్పిన చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.  అవకాశం వస్తే రన్ మెషిన్ Virat Kohli Biopicలో నటిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చరణ్. ఎప్పటి నుంచో క్రీడా నేపథ్యం కలిగిన సినిమా చేయాలని భావిస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు. ఈక్రమంలో విరాట్ కోహ్లీ బయోపిక్ మూవీ స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో కథ ఇలా.. విరాట్ కోహ్లీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సినిమాలో చూపించొచ్చు. అండర్19 వరల్డ్‌కప్ ఛాంపియన్, జాతీయ జట్టుకు ఎంపిక, 2011 వన్డే వరల్డ్‌కప్, కెప్టెన్సీ బాధ్యతలు, రికార్డులు, ఫామ్ లేమి, కమ్‌బ్యాక్ వంటి దశలను ఫస్టాప్‌లో చపిస్తే బాగుంటుంది. అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతడి జీవితంలో కీలక ఘట్టం. దీంతో సినిమాలో లవ్ ట్రాక్‌కి రూట్ క్లియర్ అయినట్లే. విరాట్ కోహ్లీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కెరీర్‌లో వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మనోగతం ఏంటో సినిమా ద్వారా చూపించొచ్చు.  క్లైమాక్స్ ఇలా ఉంటే సూపర్బ్ భారత్‌కు కోహ్లీ ఎన్నో విజయాలు అందించాడు. జట్టును అత్యుత్తమంగా నడిపించాడు. కానీ, చిరస్థాయిలో నిలిచిపోయే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోలేక పోయాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్, టెస్టు ఛాంపియన్‌షిప్.. ఇలా కీలక ట్రోఫీలన్నీ నోటిదాకా అంది చేజారిపోయినవే. ఇలాంటివి సినిమాలో మంచి ఎమోషన్స్‌ను పండిస్తాయి. టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్ గెలిస్తే విరాట్ బయోపిక్‌కి స్టోరీ లైన్ దొరుకుతుంది. అప్పుడు సినిమాకు మంచి క్లైమాక్స్ పాయింట్ దొరుకుతుంది.  బహుశా విరాట్ కోహ్లీ ఆడబోయే చివరి వన్డే వరల్డ్‌కప్ కూడా ఇదే అయ్యుంటుంది. మళ్ళీ వరల్డ్‌కప్ 2027లో జరుగుతుంది. అప్పటికి కోహ్లీ వయసు 38కి చేరుకుంటుంది. కాబట్టి ఈ వరల్డ్‌కప్ కోహ్లీకి గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా బయోపిక్ కోసం ఈ వరల్డ్‌కప్‌ విజయాన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా.. విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించిన ఘటనను ఇంటర్వేల్ బ్యాంగ్‌గా ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వరుస సెంచరీలతో కోహ్లీ కమ్ బ్యాక్‌ ఇచ్చిన తీరును సెకండాఫ్‌లో హైలెట్ చేస్తే బాగుంటుంది. వివాదాలపై క్లారిటీ.. విరాట్ ఓ పోరాటయోధుడు. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగాడు.  అతనిపై కెప్టెన్సీ వివాదం తీవ్ర ప్రభావం చూపించింది. భారత జట్టుకు నాయకత్వ బాధ్యతల నుంచి తనను అర్ధంతరంగా తప్పించారని విరాట్ ఆరోపించాడు. అయితే, ఇది వాస్తవం కాదని అప్పటి బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఇలాంటి వివాదాలపై సినిమాలో ఓ క్లారిటీ ఇస్తే అది ఫలప్రదంగా ఉంటుందని విరాట్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.  రామ్ చరణ్- కోహ్లీ పోలికలు రామ్‌చరణ్, విరాట్ కోహ్లీ ముఖ కవలికలు ఒకే విధంగా ఉంటాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ మేరకు విరాట్, చెర్రీల ఫొటోలను పక్కపక్కన పెట్టి పోల్చుతున్నారు. విరాట్‌ బయోపిక్‌ని చేయడానికి చరణ్ సరిగ్గా నప్పుతాడని అంటున్నారు.  https://twitter.com/Thyview/status/1636936587237003264?s=20 చరణ్‌లోనూ క్రికెటర్.. రామ్‌చరణ్‌లోనూ ఓ క్రికెటర్ ఉన్నాడు. సెలబ్రిటీల కోసం జరుపుతున్న ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌’లోనూ చరణ్ పాల్గొన్నాడు. తెలుగు వారియర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆడటం చరణ్‌కి అలవాటే కాబట్టి విరాట్ స్టైల్‌లో షాట్లు ఆడగలడని చెబుతున్నారు.  https://twitter.com/AlwysVenuCharan/status/1337393959786532867?s=20 ఫిట్‌నెస్..  విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటాడు. రామ్‌చరణ్‌కూ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంటుంది. క్రికెట్ ఆడాలన్నా, ఆడుతున్నట్లు నటించాలన్నా ఫిట్‌నెస్ అవసరం. కొన్ని షాట్లు ఎక్కువ టేక్‌లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలోనూ చరణ్ మనుగడ సాగించగలడు.  https://twitter.com/BingedHelps/status/1636943158197252097?s=20 ఈ డైరెక్టర్లు కావాలంట.. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టేకప్ చేయడం కూడా డైరెక్టర్లకు ఒక సవాళే. కాబట్టి, ఫ్యాన్స్ కొందరి డైరెక్టర్ల పేర్లు సూచిస్తున్నారు. ‘జెర్సీ’ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి పేరు ముందుగా వినిపిస్తోంది. ఎం.ఎస్ ధోనీ సినిమా తీసిన ‘నీరజ్ పాండే’కు అనుభవం కలిసొస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు సుకుమార్ ఈ ప్రాజెక్టును మరో స్థాయికి తీసుకెళ్తాడని భావిస్తున్నారు. హీరోయిజంను పండించే సందీప్ రెడ్డి వంగా, పూరీ జగన్నాథ్; కొరటాల శివ, గౌతమ్ మీనన్, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి పేర్లను సూచిస్తున్నారు.   హీరోయిన్‌లు.. విరాట్ బయోపిక్‌లో హీరోయిన్‌గా పూర్తిగా న్యాయం చేయగలిగే నటి అనుష్క శర్మనే. విరాట్ రియల్ లైఫ్ పార్ట్‌నర్ కావడం ఈమెకు ప్లస్ పాయింట్. పైగా తన అనుభవం కూడా సినిమాకు పనికొస్తుంది. కృతిసనన్, శ్రద్ధా కపూర్, లవ్‌టుడే నటి ఇవానా, కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్ ఈ పాత్రలకు సెట్ కాగలరని ఊహిస్తున్నారు. 
    మార్చి 18 , 2023
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    Jailer Movie Review: జైలర్‌లో విశ్వరూపం చూపించిన రజనీకాంత్‌.. మరి సినిమా హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు. డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.  https://twitter.com/OnlineRajiniFC/status/1689512670238846976?s=20 ఎలా ఉంది? కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.  https://twitter.com/OnlineRajiniFC/status/1689497366481514496?s=20 ఎవరెలా చేశారు? జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.  టెక్నికల్‌గా.. గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్‌ బాగున్నాయి. https://twitter.com/tupakinews_/status/1689519979182612480?s=20 పాజిటివ్ పాయింట్స్ రజినీ ఎలివేషన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డార్క్ కామెడీ నెగెటివ్ పాయింట్స్ బోర్ కొట్టించే సన్నివేశాలు రేటింగ్.. 2.75/5
    ఆగస్టు 11 , 2023
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    Poonam Bajwa: పూనమ్ బ్లాక్ అందాలు చూశారా? చూశారంటే తట్టుకోలేరు..!
    నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఏ డ్రెస్‌ వేసుకుని ఫొటో షూట్ చేసినా… ఆరోజు సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురవాల్సిందే. తాజాగా పూనమ్ బజ్వా మరోసారి హాట్ షోతో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్‌లో నడుము అందాలు చూపిస్తూ.. నాభిని ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. నడుము అందాలతో కుర్రకారుకు హుషారెక్కిస్తోంది. చేతులు పైకి లేపి నాభి అందాలను సంపూర్ణంగా చూపించి రెచ్చిపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కొద్ది నెలల నుంచి ఈ సుందరి హద్దులు దాటి సోయగాల ప్రదర్శన చేస్తోంది. ఇప్పుడు బీచ్‌లో బికినీ అందాలతో మత్తెక్కిస్తోంది పూనమ్. పూనమ్ 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'మొదటి సినిమా'తో తెరంగ్రేటం చేసింది. తర్వాత నాగ్ సరసన బాస్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పరుగు సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసినప్పటికీ అవకాశాలు తలుపు తట్టలేదు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటంతో తమిళ్‌, మళయాళం చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్‌లో రెండు ఐటెమ్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరిసింది ఈ చిన్నది. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి ఈ హీరోయిన్‌కు పెద్దగా హిట్లు రాకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సినిమాలతో ఆకట్టుకోలేకపోయినా అందచందాలు ప్రదర్శించి యువతలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది పూనమ్. గత కొద్ది నెలలుగా వరుసగా హాట్‌ లుక్స్‌తో ఫొటోలు పెట్టి సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది ఈ అమ్మడు. మూడు పదులు దాటిన వయసులోనూ తనలో అందాల ఎసరు ఎమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది
    అక్టోబర్ 27 , 2023
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?  టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.  లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.  టిల్లు:  పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.  టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.  అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'  https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..  టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..  టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:  డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..  లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..  టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..  మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:  లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:  నాదా...? నా హార్ట్ చాలా వీకూ..  ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:  నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..  పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్:  ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    యంగ్‌ హీరోయిన్‌ రాశి సింగ్‌ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్‌ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.  రాశి సింగ్‌ పుట్టిన రోజు ఎప్పుడు?  రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్‌ సింగ్‌, సరితా సింగ్‌. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్‌ సింగ్‌.  రాశి సింగ్‌ విద్యాభ్యాసం ఎక్కడ? ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.  View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) రాశి సింగ్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్‌ హోస్టేస్‌ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌  (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.  రాశి సింగ్‌ వయసు ఎంత? రాశి సింగ్‌ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.  రాశి సింగ్‌ ఎత్తు, బరువు ఎంత?  రాశి సింగ్‌ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ  భామ బాడీ కొలతలు 32-26-34. రాశి సింగ్‌ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది.  ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.  రాశి సింగ్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఎయిర్‌ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.  రాశి సింగ్‌ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది? రాశి సింగ్‌ ఇంగ్లీష్‌, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.  రాశి సింగ్‌ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ? వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.  రాశి సింగ్‌ తెలుగులో ఫేవరేట్‌ హీరో ఎవరు? రాశిసింగ్‌ ఫేవరేట్‌ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.    రాశి సింగ్‌ మెుదటి సినిమా ఏది? తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. రాశి సింగ్‌ గుర్తింపు తెచ్చిన చిత్రం? ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.  రాశి సింగ్‌ మద్యం సేవిస్తుందా? లేదు. రాశి సింగ్‌ సిగరేట్‌ దాగుతుందా? లేదు. రాశి సింగ్‌ మాంసాహారం తింటుందా? అవును. రాశి సింగ్‌ చికెన్‌, మటన్‌తో చేసిన నాన్‌ వెజ్‌ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్‌? https://www.instagram.com/rashi.real/?hl=en ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు? ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
    మార్చి 05 , 2024
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! ‘ఫ్యామిలీ స్టార్‌’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్‌ హిట్‌ తర్వాత డైరెక్టర్‌ పరుశురామ్‌ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఓ సాంగ్‌ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్‌ కూడా అవుతోంది.  ఈ సాంగ్‌ నా ఫేవరేట్‌: విజయ్‌ 'ఫ్యామిలీస్టార్‌'కి సంబంధించి మొదటి సాంగ్‌ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్‌  చేసింది. 'నంద నందన' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్‌ BGM అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్‌ శ్రీరామ్‌ స్వరపరచగా సిద్‌ శ్రీరామ్‌ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్‌ చేసిన విజయ్‌.. 'మొదటిపాట.. నా ఫెవరేట్‌.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్‌ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం ‌అందిస్తున్నారు.  View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) ఫిదా చేస్తున్న మృణాల్‌..! ఈ సాంగ్‌ ప్రోమోలో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 'సీతారామం' తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్‌ లుక్‌లో మృణాల్‌ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్‌ ఈ స్థాయి ఇంపాక్ట్‌ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్‌ చేస్తుందోనని ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్‌ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్‌ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి. ‘దేవర’ స్థానంలో..! 'ఫ్యామిలీ స్టార్‌'  రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda) కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్‌ (Jr NTR) 'దేవర' (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో 'ఫ్యామిలీ స్టార్‌'ను రిలీజ్‌ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. 'ఖుషీతో మంచి హిట్‌ అందుకున్న విజయ్‌.. ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్‌! గతంలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్‌' గ్లింప్స్‌.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి?' అని విజయ్‌ చెప్పిన డైలాగ్‌ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్‌పై రీల్స్‌ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్‌ ఫెమినిస్ట్‌ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.  సినిమా కథపై క్రేజీ అప్‌డేట్‌! ఇక ఫ్యామిలీ స్టార్‌ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్‌ మూవీ కూడా ‘గ్యాంగ్‌ లీడర్‌’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్‌ రీవెంజ్‌ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
    ఫిబ్రవరి 06 , 2024
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్‌ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్ సాంగ్స్‌ మీకోసం.. 1. ఈ గాలిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అగ్ని పర్వతం’ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ గాలిలో’ పాట అప్పట్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. కృష్ణ ఫొటోలతో ఈ పాట సాగుతుంది. ఓ సీన్‌లో హీరోయిన్‌ విజయశాంతి కృష్ణ ఫొటోపై పడుకొని అతని కోసం కళ్లతో వెతుకుతూ పాడుతుంటుంది. ఆమె తన తలను పైకి ఎత్తి కిందకి చూసే సరికి ఫొటో ప్లేస్‌లో కృష్ణ కనిపిస్తారు. రాఘవేంద్రరావు సృజనాత్మకత ఏ పాటిదో ఈ ఒక్క సీన్‌ తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=MceWRlMzHYo 2. అబ్బని తియ్యని దెబ్బ చిరంజీవి - శ్రీదేవి జంటగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్‌ రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులోని ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్‌. చిరంజీవి, శ్రీదేవి వేసే రొమాంటిక్ స్టెప్పులను చూసి ఈ జనరేషన్‌ వారు కూడా ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ పాటలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=zloL0fdu5aM 3. మా పెరటి జామ చెట్టు పెళ్లిసందడి సినిమాలోని ‘మా పెరటి జామ చెట్టు’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్‌ రవళిని దర్శకేంద్రుడు ఎంతో అందంగా చూపించారు. రవళి బొడ్డుపై జామ పండు పడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఆడియన్స్‌ ఫ్లాట్ కావాల్సిందే.  https://www.youtube.com/watch?v=e92ff-s1yRk 4. రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా అల్లరి ప్రియుడు సినిమాలోని ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ సాంగ్‌ రాఘువేంద్రరావు సినిమాల్లోని టాప్‌-5 సూపర్‌ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా కచ్చితంగా ఉంటుంది. ఈ పాటలో రమ్యకృష్ణ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. దర్శకేంద్రుడు ఆమెను పాలరాతి శిల్పంలా చూపించారు. పాట మెుత్తాన్ని పూలతో నింపేశారు.  https://www.youtube.com/watch?v=S1X_-z7JTcE 5. సై సై సయ్యారే ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘సై సై సయ్యారే’ పాటను కూడా రాఘవేంద్రరావు చాలా రొమాంటిక్‌గా తీశారు. కుండలు, గొడుగులను సెట్‌ ప్రొపార్టీలుగా ఉపయోగించుకొని పాటను తెరకెక్కించారు.  ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  https://www.youtube.com/watch?v=lRc1LOiYthY 6.  భీమవరం బుల్లోడా ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా’ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట మెుత్తం స్టీల్‌ బిందెలే కనిపిస్తాయి. నాగార్జున, ఆమని డ్యాన్స్ అలరిస్తుంది.  https://www.youtube.com/watch?v=kQD5NHAxtXk 7. మీనా మీనా ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాలోని ‘మీనా మీనా’ పాట రాఘవేంద్రరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. శిల్పా శెట్టి నడుముపై వెంకటేష్‌ ముత్యాలు వేసే సీన్‌ దర్శకేంద్రుడి మార్క్‌ను చూపిస్తుంది.  https://www.youtube.com/watch?v=X-37Hz673RE 8. అస్మదీయ  అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలోనూ దర్శకేంద్రుడు తన మార్క్‌ను విడిచిపెట్టలేదు. మోహన్‌ బాబు, రోజాల మధ్య వచ్చే ‘అస్మదీయ’ పాటలో మళ్లీ పండ్లకు పని చెప్పారు. ద్రాక్ష పండ్ల నడుమ రోజా నడుమును చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  https://www.youtube.com/watch?v=4YRwSezPqmE 9. చాలు చాలు శ్రీరామదాసు సినిమాలోని ‘చాలు చాలు’ పాట కూడా రాఘవేంద్రరావు రొమాంటిక్ పాటలలో ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటలో నాగార్జున, స్నేహా మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది.  https://www.youtube.com/watch?v=xj5yoitVQTQ 10. గందర్వ లోకాల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాలోనూ ఆయన మార్క్‌ కనిపించింది. హీరోయిన్‌ శ్రీలీలను గందర్వ లోకాల పాటలో ఎంతో ‌అద్భుతంగా చూపించారు. పైనుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీలీల కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=0d3ktyClW8Q
    మే 23 , 2023
    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
    యంగ్‌ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన ‌అందచందాలతో సోషల్‌మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  తాజా ఫొటోల్లో మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.  స్టార్‌ హీరోయిన్‌ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.  తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది. ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.  గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 
    నవంబర్ 16 , 2023
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    Priya Prakash Varrier: తడి చీరలో కుర్ర అందాలను దోరగా వడ్డిస్తున్న ప్రియా ప్రకాశ్!
    మిల్క్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రకృతి ఒడిలో అందాలను ఒలకబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో గ్లామర్ షో చేసింది.   తడి చీరకట్టు అందాలతో హీటెక్కించింది. క్రీమ్ కలర్ చీరను పద్దతిగా కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నడుమమందాలను చూపిస్తూ కైఫెక్కించింది.  తడిసిన ఎద అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తడిచిన చీరలో నడుమందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.  ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయం చేస్తోంది. తాజాగా ప్రియా తన హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి.  ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే ఫ్లయింగ్ కిస్‌ గన్‌తో ఫిల్మ్ మేకర్లను కూడా ఆకర్షించింది.  ప్రస్తుతం ఈ భామ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.  క్లీవేజ్ షో చేయడంలో ఈ భామను మించిన హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు.  ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కుర్రకారుపై అందాల దాడి చేస్తూనే ఉంటుంది.  నాజుకైన నడుమందాలను ఇంపుగా వడ్డీస్తూ కొంటె చూపులతో సెగలు పుట్టిస్తుంటుంది ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ దాదాపు సౌత్‌లోని అన్ని భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగులో నితిన్ సరసన చెక్‌ మూవీలో యువ హీరో తేజా సజ్జాకు జోడీగా ఇష్క్‌ సినిమాలో నటించింది. ఇక తన కేరీర్ గురించి చెబుతూ.. తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపింది. మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ప్రియా పాపులర్ అయింది. ఈ సినిమాలోని కన్ను కొట్టే సీన్‌తో ఈ ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది. 
    అక్టోబర్ 17 , 2023
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    Heeramandi Telugu Review: ఓటీటీలో విడుదలైన ‘హీరామండి’ ఎలా ఉందంటే?
    నటీనటులు : మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సేగల్‌ తదితరులు దర్శకత్వం : సంజయ్‌ లీలా భన్సాలీ సంగీతం : సంజయ్‌ లీలా భన్సాలీ, బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ సినిమాటోగ్రఫీ : సుదీప్‌ ఛటర్జీ, మహష్ లిమాయే, హున్‌స్టాంగ్‌ మహాపాత్రా, రగుల్‌ ధరుమాన్‌ ఎడిటర్‌ : సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణ సంస్థ: భన్సాలీ ప్రొడక్షన్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ : నెట్ ఫ్లిక్స్‌  విడుదల తేదీ : 1 మే, 2024 గత కొన్ని రోజులుగా దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సిరీస్‌ 'హీరామండి ; ది డైమండ్‌ బజార్‌' (Heeramandi: The Diamond Bazaar). బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌తోనే ఆయన తొలిసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు.  ఈ వెబ్‌సిరీస్‌లోబాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్‌ (Sanjeeda Sheikh)లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ సిరీస్‌ అందరి అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి? ఈ సిరీస్‌ కథ బ్రిటీష్ పాలనలో 1930-1940ల మధ్య జరుగుతుంటుంది. పాకిస్తాన్‌ లాహోర్‌లోని హీరామండి ప్రాంతంలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్‌ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరికొందరు కూడా మల్లికాజాన్‌ పీఠంపై కన్నేస్తారు. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే? మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కోయిరాలా అదరగొట్టింది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో మెప్పించింది. పాత్రలోని గ్రేస్‌, ఆథారిటీ, కామాండింగ్‌ను తన హావాభావాలతో చూపిస్తూ ఆకట్టుకుంది. మల్లికా జాన్‌కు సవాలు విసిరే పాత్రలో సోనాక్షి సిన్హా మెరిసింది. జిబ్బోజాన్ పాత్రలో అదితిరావ్ హైదరి ఆకట్టుకుంది. హీరామండిలోని దుర్భర పరిస్థితులపై పోరాడే యువ వేశ్య పాత్రలో ఆమె మెప్పించింది. విధి నుంచి తప్పించుకోవాలనుకునే అమాయకమైన యువతి పాత్రలో షర్మిన్‌ సెగల్‌ కనిపించింది. తాహా షా, జేసన్ షా, శేఖర్ సుమన్, పర్హీద్ ఖాన్, ఇంద్రేశ్ మాలిక్ తదితరులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ మరోమారు ఈ సిరీస్‌ ద్వారా తన మార్క్ ఏంటో చూపించాడు. సంఘర్షణ, డ్రామా చాలా స్ట్రాంగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలన్నీ కథపై బలమైన ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా బ్రిటిష్‌ కాలంలో వేశ్యల స్థితిగతులు, వారి మధ్య ఆదిపత్య పోరు ఎలా ఉండేదో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. కథకు దేశ భక్తిని జోడించడం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వీక్షకులు బోర్‌గా ఫీలవుతారు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు మ్యూజిక్‌ బాగా ప్లస్ అయ్యింది. బెనెడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అటు సినిమాటోగ్రాఫర్ల పని తనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా చక్కటి పనితీరు కనబరిచింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనకథ, కథనంసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుస్లో న్యారేషన్ Telugu.yousay.tv Rating : 3/5 
    మే 01 , 2024
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు:  బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి ఎడిటింగ్‌ : తమ్మిరాజు నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి విడుద‌ల తేదీ: 15-03-2024 తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.  సాంకేతికంగా సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ మితిమీరిన హింసతెలిసిన కథ కావడం.. Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 15 , 2024

    @2021 KTree