• TFIDB EN
  • C/o కంచరపాలెం
    UATelugu2h 31m
    కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    కంచరపాలెం రాజు
    రాజు
    రాధా బెస్సీ
    రాధా
    కేశవ కర్రిసుందరం
    కార్తీక్ రత్నం
    జోసెఫ్
    నిత్యశ్రీ గోరుసునీత
    ప్రణీత పట్నాయక్భార్గవి
    మోహన్ భగత్గడ్డం
    ప్రవీణ పరుచూరిసలీమా
    కిషోర్ కుమార్ పొలిమెరరామ్ మూర్తి
    శ్రావణి బెస్సీలీల, సుందరం తల్లి
    జెశ్వంత్ ముప్పాలకోటి
    నికితాఇందిర
    దుర్గాదేవి దాట్లదేవి దాట్ల
    శైలజ గోరుస్కూల్ ప్రిన్సిపాల్
    రమేష్ ఆదిత్యసునీత తండ్రి
    సిబ్బంది
    వెంకటేష్ మహా
    దర్శకుడు
    రానా దగ్గుబాటి
    నిర్మాత
    స్వీకర్ అగస్తీ
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.  గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.  బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.  దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.  కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.  ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.  కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.  ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.  రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.  గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.  . 
    మే 03 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    C/O కంచెరపాలెం డైరెక్టర్‌పై KGF ఫ్యాన్స్ ఫైర్… నెట్టింట్లో ట్రోల్స్
    C/O కంచెరపాలెం డైరెక్టర్‌పై KGF ఫ్యాన్స్ ఫైర్… నెట్టింట్లో ట్రోల్స్
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 07 , 2023
    <strong>Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;</strong>
    Viswam Movie: గోపిచంద్‌ కోసం సరికొత్త అవతారం ఎత్తుతున్న ప్రభాస్.. కెరీర్‌లో ఇదే తొలిసారి!&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas) హవా నడుస్తోంది. డార్లింగ్‌ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ పేరు దేశంలో మారుమోగుతోంది. ఇండియన్‌ ఫిల్మ్‌ లవర్స్‌ ప్రభాస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ నుంచి సౌత్‌ వరకూ ప్రభాస్‌ నామస్మరణలతో ఇండస్ట్రీలను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త హల్‌చల్‌ చేస్తోంది. తన మిత్రుడు గోపిచంద్‌ కోసం ప్రభాస్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ప్రభాస్‌తో ఎలివేషన్స్‌! మ్యాచోస్టార్‌ గోపిచంద్‌ (Gopichand) హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ (Prabhas) గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ ఈ సినిమా భాగస్వామ్యం అవ్వడం నిజమేనని తెలుస్తోంది. అయితే వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం ద్వారా ప్రభాస్‌ ఈ మూవీలో పాలుపంచుకుంటాడని టాక్‌ వినిపిస్తోంది. గోపిచంద్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌కు ప్రభాస్‌ తన వాయిస్‌తో ఎలివేషన్‌ ఇస్తాడని అంటున్నారు. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఓ సినిమాలో ఇలా వాయిస్‌ ఓవర్‌ ఇవ్వలేదు. స్నేహితుడైన గోపిచంద్‌ కోసమే ప్రభాస్‌ ఇందుకు ఓకే చెప్పినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్‌, గోపిచంద్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా! హీరో గోపిచంద్‌ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఆయన గత చిత్రాలు ఆయన నటించిన గత నాలుగు చిత్రాలు భీమా, రామబాణం, పక్కా కమర్షియల్‌, ఆరడుగుల బుల్లెట్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో గోపిచంద్‌కు సక్సెస్‌ తప్పనిసరిగా మారింది. అటు దర్శకుడు శ్రీను వైట్ల సైతం ఒకప్పటిలా బ్లాక్‌బాస్టర్స్‌ ఇవ్వలేకపోతున్నాడు. 2011లో వచ్చిన 'దూకుడు' తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకూ శ్రీను వైట్లకు రాలేదు. దీంతో అతడు కూడా 'విశ్వం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ప్రభాస్‌ను సినిమాలో భాగం చేయడం ద్వారా 'విశ్వం'పై హైప్‌ తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను సంప్రదించి అతడి ద్వారా హీరోకు ఎలివేషన్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందో? లేదో? చూడాలి.&nbsp; ఆఫ్‌ స్క్రీన్‌ ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ గోపిచంద్‌ ఎంత మంచి మిత్రులో ఇండస్ట్రీ మెుత్తం తెలుసు. ‘వర్షం’ సినిమాలో ఈ ఇద్దరు హీరోలు తొలిసారి కలిసి నటించారు. ఇందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపిచంద్‌ విలన్‌గా అలరించారు. అప్పటి నుంచి వీరి స్నేహం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఆహా వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్‌ షోలో వీరిద్దరు పాల్గొని హోస్ట్‌ బాలయ్యతో కలిసి సందడి చేశారు. వీరిద్దరిని తొలిసారి ఒక షోలో చూసి ఫ్యాన్స్‌ తెగ ఖుషి అయ్యారు. ప్రభాస్‌, గోపిచంద్‌ మంచి ఫ్రెండ్స్‌ అని తెలుసుగానీ, మరి ఈ స్థాయి బెస్ట్ ఫ్రెండ్స్‌ అని ఈ ఎపిసోడ్‌ తర్వాతనే తెలిసిందని చాలా మంది నెటిజన్లు పోస్టులు సైతం పెట్టారు.&nbsp; https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA ‘విశ్వం’ రిలీజ్ ఎప్పుడంటే? గోపిచంద్‌, శ్రీను వైట్ల కాంబోలో వస్తోన్న 'విశ్వం' చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్‌ (Kavya Thapar) నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపుగా పూర్తైనట్లు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. గతంలో రంజాన్‌ కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=1LoKTtrxjmM
    జూలై 16 , 2024
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.&nbsp; https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా&nbsp; పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.&nbsp; https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
    ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్‌ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్‌ చేసుకొని హిట్స్‌ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్‌ క్లైమాక్స్‌ సీన్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దసరా (Dasara) నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్‌ 'దసరా'. నూతన డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్‌ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/IUCbmWfVd8g?si=CPovFG1Ig_7cdS9b ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) రామ్‌చరణ్‌, తారక్‌ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్‌ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్‌, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్‌ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్‌ సైన్యాన్ని ఏరిపారేస్తాడు. https://youtu.be/8HTrv_MAuSE?si=CMqWkW8LRa3GqLA9 బాహుబలి 2 ‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్‌ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్‌ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్‌ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.&nbsp; https://youtu.be/4s6k7UpFnKc?si=7G-OJDfUuey9hKVV గ్యాంగ్‌ లీడర్‌ (Gang Leader) మాస్‌ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్‌ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో ‌అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్‌ మీద వేసి చిరు హతమారుస్తాడు.&nbsp; https://youtu.be/v0_E2uqVeaM?si=8z1LFqnzEJ3Wzy4x ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్‌ విలన్‌ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్‌ ఫైర్‌ అయ్యి విలన్‌ చనిపోయే సీన్స్‌ క్లాప్స్ కొట్టిస్తుంది.&nbsp; https://youtu.be/1SCFGWtXtDE?si=r1AnoKHjBFFyrNXu పోకిరి (Pokiri) తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్‌ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్‌ &amp; కోపై క్లైమాక్స్‌లో రివేంజ్‌ తీర్చుకునే సీన్ నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/PvkITH66FEc?si=2CJl4283NO85bYmd తమ్ముడు (Thammudu) స్పోర్ట్స్‌ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్‌ జగన్నాథ్‌ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్‌ కోర్టులో నిలిచిన పవన్‌ కల్యాణ్‌.. తొలుత విలన్‌ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్‌ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు.&nbsp; https://youtu.be/CZY-tl5JbSo?si=Ui97I0J_rOAi5s5j ఖుషి (kushi) పవన్‌ కల్యాణ్‌, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్‌.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్‌ ప్లాన్‌ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్‌ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్‌ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు.&nbsp; https://youtu.be/R9VXMjfP6Kc?si=nt00kn-z4dqexdCZ విరుపాక్ష (Virupaksha) సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్‌ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్‌ తెలియడంతో ఆడియన్స్‌ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్‌ చాలా థ్రిల్‌ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్‌ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.&nbsp; https://youtu.be/C1vmB8G2oTw?si=hcLk1a9tPl1WC6xQ సై (Sye) నితిన్‌ - జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్‌ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్‌ అయిన నితిన్‌ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.&nbsp; https://youtu.be/oc4J_qQcNkw?si=rSuIQ2jUftA4c4Mx రోబో 2.0 (Robo 2.0) డైరెక్టర్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్‌&nbsp; స్టేడియంలో విలన్‌ పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌)తో రోబో (రజనీకాంత్‌) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు.&nbsp; https://youtu.be/I04BTA2fl-E?si=9hCEwzbPcG-m81VM అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo) అల్లుఅర్జున్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్‌ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు.&nbsp; https://youtu.be/ljHApHUTWeo?si=90dOM8aTCAWsSHoU అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్‌ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్‌ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్‌ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=42tjl5fOTTS4xEz6 సుస్వాగతం (Suswagatham) భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ క్లైమాక్స్‌ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్‌ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్‌ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్‌ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్‌ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్‌ చెప్పే డైలాగ్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్‌ పేర్కొంటాడు.&nbsp; https://youtu.be/323OoE0Figo?si=pm-8iXzG8DleERw1
    మార్చి 12 , 2024
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    EXCLUSIVE: ఈ సీన్స్‌ చాలా ఎమోషనల్‌.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?&nbsp;
    సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్‌, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్‌ సీన్సే కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్‌ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్‌ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; సరైనోడు (Sarrainodu) అల్లు అర్జున్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఆ ఏమోషనల్‌ సీన్‌ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG- వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) రామ్‌చరణ్‌, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ జరిగాయి. ఇందులో చరణ్‌ ట్రైన్‌పై నిలబడి బీహార్‌ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్‌ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.&nbsp; https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej అరవింద సమేత (Aravinda Sametha) తారక్, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్‌ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్‌ చేస్తుంది. అప్పుడు తారక్‌ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్‌ పోస్టు చేశారు.&nbsp; https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1 మెుగుడు (Mogudu)&nbsp; కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్‌ సీన్‌ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్‌ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్‌, గోపిచంద్‌, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్‌ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.&nbsp; https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX అత్తారింటికి దారేది (Attarintiki Daredi) పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్‌ చాలా మందికి రుచించలేదు. పవన్‌ ఏడుస్తూ డైలాగ్స్‌ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్‌ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారు.&nbsp; https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO శ్రీమంతుడు (Srimanthudu) మహేష్‌, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్‌ సీన్‌పై కొన్ని సోషల్‌ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్‌ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్‌ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.&nbsp; https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn హ్యాపీ (Happy) అల్లు అర్జున్‌, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్‌ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్‌ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్‌ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్‌ చేశారు.&nbsp; https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7 మిర్చి (Mirchi) ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్‌ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్‌ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్‌ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
    మే 06 , 2024
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    Pushpa 2: బాలీవుడ్‌లో పుష్ప గాడి మేనియా.. టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌!
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ వైపు మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం (మే 1) ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది.&nbsp; హిందీలో తగ్గేదేలే! గతంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రానికి తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆదరణ లభించింది. బన్నీ అద్భుతమైన నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ‘పుష్ప 2’ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌ నార్త్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. తెలుగులో ఈ సాంగ్‌ 20 గంటల వ్యవధిలో 84 లక్షల వ్యూస్‌ సాధిస్తే.. హిందీలో ఏకంగా కోటి వ్యూస్‌ రాబట్టడం విశేషం. ఈ లిరికల్‌ సాంగ్‌ను తెలుగులో 4.8 లక్షల మంది లైక్‌ చేయగా.. హిందీలో 5.2 లక్షలుగా ఉంది. కాగా, విడుదలైన ఆరు భాషల్లోనూ ఈ చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళ్తుండటంతో మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా పుష్పగాడి హవా మెుదలైందంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; టైటిల్‌ సాంగ్ అదరహో.. బుధవారం సాయంత్రం పుష్ప 2 సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 02 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;
    EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్‌ రోల్స్‌.. ఓ లుక్కేయండి!&nbsp;
    సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్‌ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్‌ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి? సత్యరాజ్ (బాహుబలి) బాహుబలిలో ప్రభాస్‌, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్‌ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు. ప్రకాష్‌ రాజ్‌ (అతడు) మహేష్‌ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్‌ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్‌ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR సుకుమారి (మురారి) మహేష్‌ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్‌ నటి మెప్పించింది. మహేష్‌ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.&nbsp; https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18 శ్రీకాంత్‌ (శంకర్‌దాదా MBBS) మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్‌ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్‌ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’లోనూ శ్రీకాంత్‌ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు. https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3 రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు) డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.&nbsp; https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0 శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా) సిద్ధార్థ్‌ - త్రిష జంటగా డ్యాన్స్‌ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతాయి.&nbsp; https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd గొల్లపూడి మారుతిరావు (లీడర్‌) దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్‌’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్‌ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్‌ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y అభినవ్‌ గోమఠం (ఈ నగరానికి ఏమైంది) తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్‌ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.&nbsp; https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ - ఆర్తి అగర్వాల్‌ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్‌ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్‌ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్‌ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
    మే 01 , 2024
    Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌!&nbsp;
    Pushpa Pushpa Song: అల్లు అర్జున్‌ చేతిలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ సింబల్‌!&nbsp;
    తెలుగు చిత్ర పరిశ్రమలో పుష్ప (Pushpa) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్యాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారంతో పాటు గ్లోబల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అటు హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు కూడా ‘పుష్ప’తో మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; పవర్‌ఫుల్‌ టైటిల్‌ సాంగ్‌! పుష్ప చిత్రం సూపర్ సక్సెక్‌ కావడంతో త్వరలో రానున్న ఈ సినిమా సీక్వెల్‌పై అందరి దృష్టి పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ రిలీజ్‌ కాగా ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ టైటిల్‌ సాంగ్‌కు సంబంధించిన లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్‌లో ఈ సాంగ్‌ను రూపొందించారు. 'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్'&nbsp; అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. బన్నీ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ లిరిక్స్‌ ద్వారా చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌తో ఈ సాంగ్‌ చాలా క్యాచీగా మారిపోయింది.&nbsp; https://youtu.be/EdvydlHCViY?si=JqZTyOOLXxhGR8nr గాజు గ్లాస్‌తో స్టెప్పులు పుష్ప 2 నుంచి రిలీజైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లుఅర్జున్‌ తన స్టెప్పులతో అదరకొట్టాడు. ముఖ్యంగా సింగిల్‌ లెగ్‌పై వేసే హుక్‌ స్టెప్‌ ట్రెండ్‌ సెట్‌ చేసేలా కనిపిస్తోంది. కుడి కాలి చెప్పు విప్పి కాలిని ఎడమ కాలు మోకాలికి దిగువున పెట్టి వెసే స్వింగ్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకర్షించే అవకాశముంది. అంతేకాదు వీడియో చివర్లో గాజు గ్లాస్‌ చేతిలో పట్టుకుని వేసే మూమెంట్స్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌తో కావాలనే ఈ స్టెప్స్‌ క్రియేట్‌ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ మాత్రం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలానే ఉంది. రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2: ది రూల్ సినిమా.. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. కాగా, ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp;
    మే 01 , 2024
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    Cool Smoke Shots In Telugu: టాలీవుడ్‌ను షేక్‌ చేసిన స్టార్‌ హీరోల స్మోకింగ్‌ సీన్ల గురించి తెలుసా?
    టాలీవుడ్‌లో గత కొంత కాలంగా ఓ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోలంతా దాదాపు తమ చిత్రాల్లో సిగరేట్లతో దర్శనమిస్తున్నారు. మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఉద్దేశ్యంతో డైరెక్టర్లు కూడా స్మోకింగ్‌ వైపు హీరో పాత్రలను ప్రోత్సహిస్తున్నారు. సిగరేట్‌ పీకను నోట్లో పెట్టించి స్టైల్‌గా హీరోల చేత దమ్ము లాగిస్తున్నారు. అటు ఫ్యాన్స్‌ సైతం తమ హీరోను మాస్‌ లుక్‌లో చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే సిగరేట్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవచ్చని కొన్ని సినిమాలలోని సీన్లు నిరూపించాయి. వాటిలో హీరోలు నోట్లో సిగరేట్‌తో చాలా కూల్‌గా కనిపిస్తారు. అటువంటి క్రేజీ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌ చాలా క్రేజీగా ఉంటుంది. లాంగ్‌ హెయిర్‌ &amp; గడ్డం, ముఖాన బ్లాక్‌ కళ్లద్దాలు.. నోట్లో సిగరేట్‌తో ఓ అమ్మాయి వద్దకు వెళ్లే సీన్‌ అదిరిపోతుంది.&nbsp; https://youtu.be/fguH-dGjfVs?si=lOjPlRybnmb-RZkp యానిమల్‌ (Animal) యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) సైతం పదే పదే సిగరేట్లు తాగుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా సూట్‌లో లాంగ్‌ హెయిర్‌తో రణ్‌బీర్‌ సిగరేట్‌ తాగుతూ నడవడం ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించింది. అలాగే నోట్లో సిగరేట్‌తో రణ్‌బీర్‌ ఎంట్రీ సీన్‌ చాలా క్లాసిక్‌గా అనిపిస్తుంది. https://youtu.be/jeQYEIQ6eHw?si=9frMB1-0RO0Wx8p4 సలార్‌ (Salaar) సినిమాల్లో ప్రభాస్‌ (Prabhas) చాలా రేర్‌గా స్మోక్‌ చేస్తూ కనిపిస్తాడు. కానీ, రీసెంట్‌గా వచ్చిన ‘సలార్‌’లో మాత్రం డార్లింగ్‌.. సిగరేట్‌ తాగుతూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రౌడీలను చితకబాదిన ప్రభాస్ ఆ తర్వాత కూల్‌గా సిగరేట్‌ తాగడం ఆకట్టుకుంటుంది.&nbsp; https://twitter.com/i/status/1734970904613126484 రెబల్‌ (Rebel) రెబల్‌ సినిమాలో ప్రభాస్‌ సిగరేట్‌ తాగే స్టైల్‌ చాాలా యునిక్‌గా ఉంటుంది. ఓ సీన్‌లో విలన్లు అటాక్‌ చేయడానికి రాగా.. ప్రభాస్‌ ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా స్టైల్‌గా సిగరేట్‌ తాగుతూ ముందుకు వెళ్తాడు.&nbsp; https://youtu.be/LUWy8Kv-SuU?si=EpInRjYM0ukrR-1u గుంటూరు కారం (Guntur Kaaram) గుంటూరు కారం చిత్రంలో మహేష్‌ బాబు (Mahesh Babu) ఎంట్రీ సీన్‌ అదరహో అనిపిస్తుంది. నోట్లో బీడితో కారు నుంచి మహేష్‌ దిగే ఎంట్రీ సీన్‌ ప్రేక్షకుల చేత విజిల్‌ వేయిస్తుంది.&nbsp; https://youtu.be/DAa3crqj5-c?si=0IXCK7j_-kwXYdNv ఒక్కడు (Okkadu) ఒక్కడు సినిమాలో మహేష్‌ బాబు (Mahesh Babu)&nbsp; స్మోకింగ్‌ స్టైల్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మహేష్‌ సిగరేట్‌ వెలుగించుకొని దాన్ని ఆస్వాదించిన తీరు అద్భుతంగా మెప్పిస్తుంది.&nbsp; https://youtu.be/cPDWfvdj0ug?si=MU_TQkIlEWb9nnuf పుష్ప (Pushpa) పుష్ప సినిమాలో అల్లుఅర్జున్‌ బీడీ తాగే యాటిట్యూడ్‌ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఓ సీన్‌లో మంగళం శ్రీను (సునీల్‌) అగ్గిపెట్టే అవసరం అవుతుంది. సరిగ్గా అప్పుడే పుష్ప చాలా స్టైల్‌గా అగ్గిపుల్లను కాల్చి తన బీడీని వెలుగించుకుంటాడు. ఆ తర్వాత కొంత మంగళం శ్రీనుకు కొంత దూరంలో కాలుతున్న అగ్గిపుల్లను పెట్టగా అతడు వంగి సిగరేట్‌ వెలుగించుకునే సీన్‌ హైలెట్‌ అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/31woB__nwHU?si=yMBs9-OdpbLRTIBr అంతపురం (Anthahpuram) ఈ సినిమాలో హీరో జగపతి బాబు (Jagapathi Babu)కు సిగరేట్‌ అంటే అమితమైన ఇష్టం. క్లైమాక్స్‌లో ఒంటి నిండా గాయాలతో రైలు పట్టాల పక్కన కదలలేని స్థితిలో కూర్చుండిపోతాడు. అప్పుడు సిగరేట్‌ తాగుతూ అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెవర్‌ బీఫోర్ అన్నట్లు అనిపిస్తాయి. https://youtu.be/TqU-51z0ct4?si=_T7lNiqeWgM5YSlL రక్త చరిత్ర (Rakta Charitra) రక్త చరిత్ర సినిమాలో ఓ సీన్‌లో వివేక్‌ ఓబరాయ్‌ రౌడీలందర్నీ ఇంటికి పిలిపిస్తాడు. తన ఏరియాలో ఇకపై ఎవరూ నేరాలు చేయడానికి వీల్లేదని సిగరేట్‌ తాగుతూ చాలా ప్రశాంతంగా వార్నింగ్‌ ఇస్తాడు. ఈ సీన్‌ సినిమాకే హైలేట్‌.&nbsp; https://youtu.be/Qw7fa7583_0?si=QJXZqptCp4jeYOPm వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రంలో బాలయ్య ఇంట్రడక్షన్‌ సీన్ మెప్పిస్తుంది. సుమో నుంచి సిగర్‌ తాగుతూ బాలయ్య బయటకు వచ్చే ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/YUAhLONLVs8?si=hFjdcNcUWR_lw2jP ‘వి’ (V) హీరో నాని (Nani) ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ది బెస్ట్‌ ఎంట్రీ సీన్‌ ఈ సినిమాలోనే లభించిందని చెప్పవచ్చు. నోటి నుంచి వచ్చే సిగరేట్‌ పొగతో నాని ఇచ్చే క్లాసిక్‌ ఎంట్రీ వాహ్వా అనిపిస్తుంది.&nbsp; https://youtu.be/hNgs0iFDhik?si=P8rZK2EtBXNk6-Ym కొదమ సింహం (Kodama Simham) ఈ సినిమాలో మెగాస్టార్‌.. కౌబాయ్‌ డ్రెస్‌లో సిగర్‌ తాగుతూ చాలా సీన్లలో కనిపిస్తాడు. ముఖ్యంగా ఓ క్లబ్‌లో సిగర్‌ తాగుతూ కూల్‌గా పేకాట ఆడే సీన్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.&nbsp; https://youtu.be/ldmg-QK0bYM?si=ZNdkNWLUjlMPRQhx
    మార్చి 01 , 2024
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మృణాల్ ఠాకూర్ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సీతారామం(2022) చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈక్రమంలో మృణాల్ ఠాకూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Mrunal Thakur) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృణాల్ ఠాకూర్ దేనికి ఫేమస్? మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.&nbsp; మృణాల్ ఠాకూర్ వయస్సు ఎంత? 1992, ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు&nbsp; 31 సంవత్సరాలు&nbsp; మృణాల్ ఠాకూర్&nbsp; ముద్దు పేరు? గోళి మృణాల్ ఠాకూర్&nbsp; ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు&nbsp; మృణాల్ ఠాకూర్ ఎక్కడ పుట్టింది? ధూలే, మహారాష్ట్ర మృణాల్ ఠాకూర్‌కు వివాహం అయిందా? ఇంకా కాలేదు మృణాల్ ఠాకూర్ అభిరుచులు? క్రికెట్ చూడటం, ఫొటోగ్రఫీ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన ఆహారం? ప్రాన్స్, చేపలు, జిలేబీ మృణాల్ ఠాకూర్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మృణాల్, శరత్ చంద్ర అనే రచయితతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మృణాల్ ఠాకూర్‌ తల్లిదండ్రుల పేర్లు? ఉదయ్ సింగ్ ఠాకూర్(యూనియన్ బ్యాంక్‌లు అసిస్టెంట్ జనరల్ మెనేజర్‌గా పనిచేస్తున్నారు) మృణాల్ ఠాకూర్‌ ఫెవరెట్ హీరో? అమితాబ్ బచ్చన్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన హీరోయిన్? కరీనా కపూర్ మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన కలర్ ? యెల్లో, వైట్, పింక్ మృణాల్ ఠాకూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? సీతారామం(2023) మృణాల్ ఠాకూర్ ఏం చదివింది? జర్నలిజంలో డిగ్రీ చేసిందిత మృణాల్ ఠాకూర్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మృణాల్ సినిమాల్లోకి రాకముందు అనేక టీవీ షోల్లో నటించింది. మోడల్‌గా కొన్ని యాడ్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/mrunalthakur/?hl=en మృణాల్ ఠాకూర్ ఎన్ని లిప్ లాక్ సీన్లలో నటించింది? హాయ్‌ నాన్న చిత్రంలో నానితో కలిసి లిప్‌ లాక్ సీన్‌లో నటించింది. అలాగే జెర్సీ చిత్రంలో షాహిద్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో యాక్ట్ చేసింది. https://www.youtube.com/watch?v=36fZHQwlDCo
    ఏప్రిల్ 08 , 2024
    MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు
    MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు
    వేసవి సెలవులకు సమయం ఉండటంతో పెద్ద చిత్రాలు రాకముందే చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. స్పసెన్స్‌ థ్రిల్లర్లు, మోస్ట్ వెయిటింగ్ వెబ్‌ సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.&nbsp; సీఎస్‌ఐ సనాతన్‌ ఆది సాయి కుమార్‌, మిషా నారంగ్‌ జంటగా నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది… ఈ చిత్రంతో మెప్పిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.&nbsp; ట్యాక్సీ వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ కీలక పాత్రుల్లో నటించిన చిత్రం ట్యాక్సీ. వైవిధ్యమైన సస్పెన్స్‌ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హరీశ్ సజ్జా దర్శకత్వం వహించగా.. హరిత సజ్జా నిర్మించారు. ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నారు. నేడే విడుదల చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథతో రామ్‌ రెడ్డి పన్నాల నేడే విడుదల చిత్రాన్ని రూపొందించారు. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 10న రిలీజ్ అవుతోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. వాడు ఎవడు యదార్థ సంఘటనల ఆధారంగా వాడు ఎవడు చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తికేయ, అఖిల్ నాయర్‌ హీరో హీరోయిన్లుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 10న విడుదలకు సిద్ధమయ్యింది. ఎస్. శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆడమ్ డ్రైవర్‌ ‘65’ హాలీవుడ్‌ నుంచి వస్తున్న మరో యాక్షన్‌, అడ్వెంచరస్‌ మూవీ 65. ఆడమ్ డ్రైవర్‌, అరియానా గ్రీన్‌బ్లాట్‌, క్లో కోల్‌మన్‌ నటించారు. స్కాట్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 10న రిలీజ్‌ కానుంది. స్పెస్‌ షిప్‌లో తెలియని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే కథతో తెరకెక్కించారు. యాంగర్ టేల్స్‌ డిస్లీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మరో వెబ్‌ సిరీస్‌ రానుంది. దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్‌, బింధు మాధవి, మడోనా సెబాస్టియన్ వంటి స్టార్ నటులు ఇందులో ఉన్నారు. మార్చి 9న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో ఆశలతో ఉండే నలుగురికి నచ్చని జీవితం ఎదురైతే ఎలా అనేది కథాంశం. సుహాస్‌ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.&nbsp; రానా నాయుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటి రానా నాయుడు. వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటిస్తున్న వెబ్‌సిరీస్‌పై అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. వీరిద్దరికీ ఇదే తొలి వెబ్‌ సిరీస్‌ కాగా… మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. రే డొనోవాన్‌ టీవీ సిరీస్‌ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మరికొన్ని ఓటీటీ రిలీజ్‌లు Title CategoryLanguagePlatformRelease DateRekhaMovieMalayalamNetflixMarch 10The glorySeriesKoreanNetflixMarch 10Happy family: conditions applySeriesHindiPrime videoMarch 10Chang can dunkMovieEnglish&nbsp;disney+hotsarMarch 10Run baby runMovietamil/telugudisney+hotsarMarch 10Ram yo&nbsp;Moviekannadazee5March 10Bommai nayagiMovietamilzee5March 10Boudy canteenMovieBangla&nbsp;zee5March 10Accident farmer and coSeriesTamil&nbsp;Sony livMarch 10christyMoviemalayalamSony livMarch 10Bad trip&nbsp;Movie&nbsp;TeluguSony livMarch 10
    మార్చి 06 , 2023
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..&nbsp; స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్‌ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న. https://www.youtube.com/watch?v=z3zTPvCLNcI సింహాద్రి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్‌ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్‌ దేవ్‌ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా కథను తొలుత&nbsp; ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=53DHset7VEw సై.. నితిన్‌ హీరోగా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్‌ ప్రదీప్‌ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్‌ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు. https://www.youtube.com/watch?v=FUqXJb37DU4 ఛత్రపతి ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్‌ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్‌ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.&nbsp; https://www.youtube.com/watch?v=_rImbIj2wp8 విక్రమార్కుడు విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్‌ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి.&nbsp; ఈ సీన్‌ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=Tf8N3VNHt8w మగధీర మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు.&nbsp; మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి&nbsp; క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్‌ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. https://www.youtube.com/watch?v=Fl2plgSlZnE ఈగ ఈగలో కిచ్చ సుదీప్‌ క్యారెక్టర్‌ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్‌ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. https://www.youtube.com/watch?v=fUY1hIAZyzo బాహుబలి 2 బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది.&nbsp; దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్‌ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.&nbsp; https://youtube.com/shorts/Ih_Dnp-BbaI?feature=share https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 25 , 2023
    <strong>SS Rajamouli: సూర్య, కార్తీతోనే తొలుత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్లాన్‌ చేసిన రాజమౌళి? అదే జరిగి ఉంటే!&nbsp;&nbsp;</strong>
    SS Rajamouli: సూర్య, కార్తీతోనే తొలుత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్లాన్‌ చేసిన రాజమౌళి? అదే జరిగి ఉంటే!&nbsp;&nbsp;
    భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’తో దేశంలోనే టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో వరల్డ్‌ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్‌ సైతం సాధించి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబుతో 'SSMB29' ప్రపంచస్థాయి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇదిలాంటే దర్శకుడు రాజమౌళి గురించి క్రేజీ వార్త బయటకొచ్చింది. ఆయన గతంలో కోలీవుడ్‌ స్టార్స్‌ సూర్య, ఆయన సోదరుడు కార్తీతో సినిమా తీయాలని భావించినట్లు తెలిసింది. అది కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘కథ చెప్పారు.. వర్కౌట్‌ కాలేదు’ తమిళ స్టార్‌ హీరో కార్తీ తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ సినిమా ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్‌ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్‌ రావాలి. గతంలో రాజమౌళి సర్‌ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్‌ ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్‌ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.&nbsp; https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్టోరీనా! సూర్య, కార్తీలతో కలిసి రాజమౌళి చేయాలని భావించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అయి ఉండొచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌, తారక్‌ పాత్రల్లో తొలుత సూర్య, కార్తీలను రాజమౌళి ఊహించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కార్తీ, సూర్య ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేసి ఉంటే ఈ స్థాయి సక్సెస్‌ వచ్చేది కాదని తెలుగు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో యాక్షన్‌, డ్రామాతో పాటు డ్యాన్స్‌ కూడా హైలెట్‌గా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. చరణ్‌, తారక్‌తో పోలిస్తే సూర్య, కార్తీ డ్యాన్స్ పరంగా కాస్త వెనుకంజలోనే ఉంటారని అంటున్నారు.&nbsp; తారక్‌కు పోటీగా కార్తీ! కార్తీ లేటెస్ట్ చిత్రం సత్యం సుందరి రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో కార్తీతో పాటు ప్రముఖ నటుడు అరవింద స్వామి ముఖ్య పాత్రలో నటించాడు. ’96’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘దేవర’కు పోటీగా సెప్టెంబర్‌ 28న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ రిలీజవ్వగా అది ఆకట్టుకుంటోంది. ఇక కార్తీ తన నెక్స్ట్‌ సినిమా ప్రాజెక్ట్‌ను కూడా తాజాగా అనౌన్స్‌ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో 'Karthi 29' చిత్రం ఉంటుందని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఇతర తారాగాణం, టెక్నికల్‌ టీమ్‌ వివరాలు బయటకు రానున్నాయి.  డిసెంబర్‌లో ‘SSMB 29’ షూటింగ్‌! మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్‌ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!</strong>
    Mr Bachchan Movie Trolls: ‘మిస్టర్‌ బచ్చన్‌’పై మళ్లీ మెుదలైన ట్రోల్స్‌.. ఓటీటీలోనూ భారీగా ఎదురుదెబ్బ!
    రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపించాయి. ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘మిస్టర్‌ బచ్చన్‌’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులనైనా అలరించాలన్న ఉద్దేశ్యంతో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమాను వీక్షించిన ఓటీటీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మళ్లీ ట్రోల్స్‌ మెుదలు పెట్టారు.&nbsp; ఓటీటీలోనూ వెక్కిరింపే! మాస్ మాహారాజ రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్‌ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓటీటీలోనూ ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 ట్రెండింగ్‌ లిస్ట్‌లో కనీసం చోటు కూడా దక్కపోవడం గమనార్హం. రవితేజ లాంటి స్టార్‌ హీరో చేసిన చిత్రం అయినప్పటికీ ‘మిస్టర్‌ బచ్చన్‌’కు కనీస వ్యూస్‌ రాకపోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఈ సినిమాను చూసిన కొద్దిమంది కూడా నెట్టింట ట్రోల్స్‌ చేస్తుండంతో చూడాలని అనుకుంటున్నవారు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.&nbsp; దారుణంగా ట్రోల్స్‌ మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని కొన్ని సీన్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైరెక్టర్‌ హరీష్‌ శంకర్ ఇలా ఎలా ఆ సన్నివేశాలను తీశారంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓ ఫైట్‌ సీన్‌లో రవితేజను చూసి ‘మెుదటిసారి మగాడిగా పుట్టినందుకు బాధేస్తోంది బావా.. అదే ఆడదాన్ని అయ్యుంటే’ అంటూ ఓ నటుడు చెప్పే డైలాగ్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. అలాగే సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ వేసిన స్టెప్స్‌ చూడటానికి ఆడల్ట్‌ కంటెంట్‌ను తలపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. సాంగ్స్‌ కూడా అసందర్భంగా ఉన్నాయని సీన్లకు మధ్యలో వాటిని బలవంతంగా ఇరిక్కించినట్లు ఉన్నాయని మండిపడుతున్నారు. హిందీలో వచ్చిన ‘రైడ్‌’ మక్కీకి మక్కీ దించేసిన కూడా హిట్‌ అయ్యేది కదా అంటూ డైరెక్టర్ హరీష్‌ శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ ఒక గంట కూడా చూడలేకపోయానని, అరగంటకే ఆపేసా అంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు.&nbsp; https://twitter.com/nenuneneh/status/1834511822277234953 https://twitter.com/BalaRTCultFan/status/1834481953619542526 https://twitter.com/koppalapn/status/1834462816470007925 https://twitter.com/IamanMCA/status/1834453046287630562 https://twitter.com/Dynamic_boy_7/status/1834439289717096574 https://twitter.com/BunnyJashu3/status/1834299241700757520 కథేంటి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీ పరుడు. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సొంతూరు కోటిపల్లికి వెళ్లి అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి ప్రేమలో పడతాడు. పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలో తిరిగి ఉద్యోగంలో చేరాలని బచ్చన్‌కు పిలుపు వస్తుంది. తదుపరి రైడ్‌ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. అధికారులను సైతం భయపట్టే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? బచ్చన్‌ - జిక్కీ ప్రేమ వ్యవహారం ఏమైంది? పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది మిగిలిన కథ.
    సెప్టెంబర్ 13 , 2024
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    Rashmika Mandanna: ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక క్లారిటీ ఇచ్చిందోచ్!
    వెండితెరపై మంచి జోడీగా పేరున్న జంటల్లో విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న ముందు వరుసలో ఉంటారు. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. అతి తక్కువ సమయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే వీరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ - రష్మిక డీప్‌ లవ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. తాము కేవలం స్నేహితులమేనని పలు సందర్భాల్లో వీరు స్పష్టం చేసిన్పపటికీ ఈ రూమర్లకు బ్రేక్‌ పడలేదు. అయితే తాజాగా రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు విజయ్‌, ఆమెకు మధ్య ఏదో ఉందన్న సంకేతాలు ఇచ్చాయి.&nbsp; ‘నీ యబ్బ.. నువ్వు నా ఫ్యామిలీరా’ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన 'గం గం గణేశా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ వేడుకలో రష్మికను ఆనంద్‌ పలు ప్రశ్నలు అడిగాడు. ఇటీవల రష్మిక పోస్టు చేసిన పెట్‌ డాగ్‌ ఫొటోల్లో విజయ్ పెట్‌ కూడా ఉంది. ఆ ఫొటోలు చూపించి వాటిలో ఏది నీ ఫేవరేట్‌ అని అడగ్గా రష్మిక.. ఆరా (రష్మిక పెట్‌ డాగ్‌) నా ఫస్ట్‌ బేబీ, స్మార్ట్‌ (విజయ్‌ పెట్‌ డాగ్‌) నా సెకండ్‌ బేబీ అని చెప్పింది. తర్వాత నీ ఫేవరేట్‌ కో-స్టోర్‌ ఎవరు అని ఆనంద్‌ ప్రశ్నించాడు. అప్పుడు రష్మిక మైక్‌ పక్కన పెట్టి నీ యబ్బ అని సరదాగా తిట్టింది. వెంటనే మైక్‌ తీసుకొని “ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలిరా.. ఇలా స్పాట్లో పెడితే ఎలా” అని చెప్పడంతో అక్కడి వారంతా కేకలు పెట్టారు. ఫ్యాన్స్‌ వెంటనే రౌడీ, రౌడీ స్టార్‌ అని అరడవంతో రౌడీ బయ్‌ నా ఫేవరేట్ అని విజయ్‌ను ఉద్దేశించి చెప్పింది. ప్రస్తుతం రష్మిక - ఆనంద్‌ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://youtu.be/LGt6bCE2ZMo?si=uV2RIkLzfv8Kjj_p క్లారిటీ ఇచ్చేసినట్లేనా? రష్మిక లేటెస్ట్ కామెంట్స్‌తో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరోతో ఉన్న రిలేషన్‌పై ఇన్నాళ్లకు రష్మిక నోటి నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్‌ దేవరకొండతో ‘మనం ఓ ఫ్యామిలీ’ అంటూ చెప్పడం ద్వారా విజయ్‌తో తన ప్రేమయాణాన్ని రష్మిక రివీల్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో విజయ్‌, రష్మిక విడివిడిగా పోస్టు ఫొటోలు ఒకే లోకేషన్‌వి కావడంతో వారు డేట్‌లో ఉన్నట్లు వార్తలు పుకార్లు మెుదలయ్యాయి. ఇందులో వాస్తవమేదో తెలియక అటు విజయ్‌ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తలలు బాదేసుకునేవారు. ఇన్నాళ్లకు తమకు కావాల్సిన సమాధానం వచ్చిందని ఇరువురు ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. విజయ్‌ - రష్మిక రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ చూడముచ్చటగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మెంటల్‌ క్యారెక్టర్‌ చేయాలి: రష్మిక ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' (Baby) ద్వారా బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ సాయి రాజేష్‌ (Sai Rajesh) కూడా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి రష్మిక మాట్లాడుతూ 'నేను బేబీ సినిమా చూశాను. ఆ సినిమా చూశాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. మీ హార్డ్‌ వర్క్‌, డెడికేషన్‌ నాకు తెలుసు. మెుదటిసారి బేబీ చూసినప్పుడు ఏడ్చేశా. ఒక నటిగా ఆ సినిమా చూశాక.. ఒక మెంటల్‌ క్యారెక్టర్‌ అయినా మీ డైరెక్షన్‌లో చేయాలనిపించింది' అని రష్మిక వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1795146872748728505 ‘గం గం గణేశా’ రిలీజ్‌ ఎప్పుడంటే? ఇక గం గం గణేశా చిత్రానికి వస్తే.. ఈ మూవీకి ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాత్సవ, నయన్‌ సారిక నటించారు. ఈ సినిమాలో జబర్దస్త్‌ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌, బిగ్‌ బాగ్‌ ఫేమ్‌ ప్రిన్స్‌ యావర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ‘గం గం గణేశా’ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.&nbsp;
    మే 28 , 2024
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    Naga Chaitanya: ప్రభాస్‌ ‘బుజ్జి’ని ఆడేసుకున్న&nbsp; నాగ చైతన్య.. ఏం చేశాడో చూడండి!&nbsp;
    ప్రభాస్‌ (Prabhas) - నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మూవీ కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇటీవల కల్కీ మూవీ యూనిట్‌.. ‘బుజ్జి’ అనే కొత్త క్యారెక్టర్‌ను ఓ స్పెషల్‌ ఈవెంట్ ద్వారా పరిచయం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాలో తనకు ఫ్రెండ్‌గా చేసిన ఓ రోబోటిక్‌ వెహికల్‌ను హీరో ప్రభాస్‌ స్వయంగా నడిపి ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వెహికల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో కార్లను అమితంగా ఇష్టపడే స్టార్‌ హీరో నాగ చైతన్య కన్ను.. బుజ్జిపై పడింది. అప్పుడు అతడు ఏం చేశాడో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; బుజ్జిని డ్రైవ్‌ చేసిన చైతూ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya)కు కార్లు అంటే యమా క్రేజ్‌. మార్కెట్‌లోకి ఏ కొత్త స్పోర్ట్స్‌ కారు వచ్చిన కొనేందుకు అతడు ఆసక్తి కనబరుస్తాడు. అయితే తాజాగా బుజ్జి అనే స్పెషల్‌ మేకింగ్‌ వెహికల్‌పై విపరీతంగా చర్చ జరుగుతుండటంతో చైతూ దృష్టి దీనిపై పడింది. ఇంకేముందు తాను ఓసారి బుజ్జిని నడపాలని నిర్ణయించుకొని చైతూ చిత్ర యూనిట్‌ సంప్రదించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంతో చైతూ ఆ కారును నడిపి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును చైతు డ్రైవ్ చేసాడు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా నాగచైతన్య దానిని రీట్వీట్ చేశాడు.&nbsp; This was nothing like I’ve ever imagined .. hats off to the entire team for translating this vision into reality .. truly an engineering marvel . Had a great time chilling with Bujji . https://t.co/fmwCJPsLCl— chaitanya akkineni (@chay_akkineni) May 25, 2024 ‘ఇంజనీరింగ్ అద్భుతం..’ కల్కి మేకర్స్‌ షేర్‌ చేసిన వీడియోను రీట్విట్‌ చేస్తూ.. బుజ్జిని నడిపిన అనుభవాన్ని నాగ చైతన్య తెలియచేశాడు. తమ విజన్‌ను విజయవంతంగా రియాలిటీలోకి అనువదించినందుకు మెుత్తం టీమ్‌కి నాగ చైతన్య హ్యాట్సఫ్‌ చెప్పాడు. నిజంగా ఇదోక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జి కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇంజనీరింగ్‌ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మెుత్తంగా బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; Witness the epic entry of Bhairava (#Prabhas) with Bujji at the #Bujji event! Feel the energy and excitement! ❤️‍🔥 @deepikapadukone @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms#BhairavaEntry #Tollywood #EventHighlights #Kalki2898AD #AmitabhBachchan #DeepikaPadukone #NagAshwin… pic.twitter.com/XaQJvWvoqa— SIIMA (@siima) May 22, 2024 బుజ్జి ప్రత్యేకతలు ఇవే బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; #Bujji has arrived! 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #ActorPrabhas @deepikapadukone @DishaPatani @VyjayanthiFilms @DjokerNole pic.twitter.com/IDYUiFMHNz— INOX Movies (@INOXMovies) May 23, 2024 రూ. 600 కోట్ల బడ్జెట్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 25 , 2024

    @2021 KTree