• TFIDB EN
  • కొలంబస్
    UATelugu
    అశ్విన్ తన కాలేజీలో ఇందుని చూసి ప్రేమలో పడుతాడు. కాలం గడిచేకొద్దీ, అశ్విన్ తన కెరీర్ లక్ష్యాలన్నింటినీ వదిలేసి కేవలం ఇందు దృష్టితో జీవితాన్ని గడుపుతాడు. దీంతో అతన్ని వదిలేసి ఇందు వెళ్లిపోతుంది. ఆమెను కనిపెట్టేందుకు సాయం చేస్తానని అశ్విన్‌కు నీరజ పరిచయమవుతుంది. నీరజ పరిచయంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుమంత్ అశ్విన్
    అశ్విన్
    మిష్టి చక్రవర్తి
    ఇందు
    సీరత్ కపూర్
    నీరజ
    సప్తగిరి
    టీవీ సీరియల్ డైరెక్టర్
    రోహిణి
    అశ్విన్ తల్లి
    పృథ్వీఅశ్విన్ తండ్రి
    రోషన్ బషీర్
    వంశీ[ఆధారం కావాలి]
    నాగినీడు
    నీరజ తండ్రి
    సిబ్బంది
    ఆర్. సామలదర్శకుడు
    అశ్వనీ కుమార్ సెహదేవ్నిర్మాత
    జితిన్ రోషన్సంగీతకారుడు
    సామల భాస్కర్
    సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన సీరత్‌.. ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన సీరత్‌.. ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ సీరత్‌ కపూర్‌ (Seerat Kapoor).. ఇటీవల వచ్చిన ‘భామకలాపం 2’ (Bhamakalapam 2) వెబ్‌సిరీస్‌తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అందం, నటనతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించింది. టాలీవుడ్‌లో తన అరంగేట్ర చిత్రంతోనే బ్లాక్‌ బ్లాస్టర్‌ విజయాన్ని అందుకున్న సీరత్‌ కపూర్‌.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత చిత్రాలు చెప్పుకోతగ్గ విజయాలు సాధించకపోవడంతో ఈ భామకు అవకశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ‘భామకలాపం 2’ మళ్లీ మెరవడంతో అందరి దృష్టి ఈ బ్యూటీపై పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.  సీరత్‌ కపూర్‌ ఎవరు? సీరత్‌ కపూర్‌.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించింది.  సీరత్‌ కపూర్‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర ముంబైలో ఈ భామ జన్మించింది. సీరత్‌ కపూర్‌ ఎప్పుడు జన్మించింది? ఏప్రిల్ 3, 1993 సీరత్‌ కపూర్‌ వయసు ఎంత? 31 సంవత్సరాలు (2024) సీరత్‌ కపూర్‌ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ) సీరత్‌ కపూర్‌ తల్లిదండ్రులు ఎవరు? వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్‌ దంపతులకు సీరత్‌ జన్మించింది. ఆమె తండ్రి ముంబయిలోని ప్రముఖ హోటల్‌కు యజమాని. తల్లి ఎయిర్‌ హోస్టేస్‌గా పనిచేసింది.  సీరత్‌ కపూర్‌కు తోబుట్టువులు ఉన్నారా? ఈ భామకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు వరుణ్‌ కపూర్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) సీరత్‌ కపూర్‌ ఎక్కడ చదువుకుంది?  ముంబయిలోని పోదర్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సీరత్‌ ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆర్‌.డి నేషనల్‌ కాలేజీలో బిఏ మాస్‌ కమ్యూనికేషన్‌లో చేరిన సీరత్‌..చదువు మధ్యలోనే ఆపేసింది. సీరత్‌ కపూర్‌కు పెళ్లి అయ్యిందా? ఆమెకు ఇంకా మ్యారేజ్‌ కాలేదు సీరత్‌ కపూర్‌ తన కెరీర్‌ను ఎలా మెుదలుపెట్టింది? సీరత్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 16 ఏళ్లకే బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ యాష్లే లోబో వద్ద అసిస్టెంట్‌గా తన కెరీర్‌ ప్రారంభించింది.  సీరత్‌ కపూర్‌ కొరియోగ్రాఫ్‌ చేసిన చిత్రం? బాలీవుడ్‌ చిత్రం రాక్‌స్టార్‌కు సీరత్ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది.  సీరత్‌ కపూర్‌ మోడల్‌గా చేసిందా? సినిమాల్లోకి రాకముందు మోడల్‌గానూ ఈ బ్యూటీ పనిచేసింది. రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో నటనకు శిక్షణ కూడా తీసుకుంది.  సీరత్‌ కపూర్‌ తెరంగేట్ర చిత్రం? 2014లో బాలీవుడ్‌లో వచ్చిన 'జిద్‌' ఆమెకు మెుట్ట మెుదటి సినిమా. నాన్సీ పాత్రతో ఆమె హిందీ ఆడియన్స్‌ను పలకరించింది.  సీరత్‌ కపూర్‌ చేసిన తొలి తెలుగు చిత్రం? శర్వానంద్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వచ్చిన 'రన్‌ రాజా రన్‌'.. సీరత్‌కు తొలి తెలుగు చిత్రం. ప్రియా పాత్రలో గ్లామర్‌గా కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  సీరత్‌ కపూర్‌ నటించిన తెలుగు చిత్రాలు? ‘రన్‌ రాజా రన్‌’తో పాటు ‘టైగర్‌’, ‘కొలంబస్‌’, ‘రాజు గారి గది - 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్‌ చేసి చూడు’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ చిత్రాల్లో సీరత్‌ నటించింది.  సీరత్‌ కపూర్‌ చేసిన బాలీవుడ్‌ చిత్రాలు? తొలి చిత్రం జిద్‌తో పాటు మార్రిచ్‌ (Maarrich) సినిమాలో ఆమె నటించింది.  సీరత్‌ కపూర్‌ హాబీస్? ట్రావెలింగ్‌ & డ్రాయింగ్‌ సీరత్‌ కపూర్‌కు ఇష్టమైన హీరో? హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌.. తెలుగులో మహేష్‌ బాబు అంటే తనకూ ఎంతో ఇష్టమని సీరత్‌ ఓ ఇంటర్యూలో తెలిపింది.  సీరత్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా? https://www.instagram.com/iamseeratkapoor/?hl=en https://www.youtube.com/watch?v=Hv1HLoWBEMU
    ఏప్రిల్ 05 , 2024

    @2021 KTree