UATelugu
పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు ఉండటంతో సర్చంచ్ బుజ్జి (సాయి కుమార్)పై శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగుతాడు. గత జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఉత్సవం పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? స్నేహితులు తిరిగి కలిశారా? లేదా? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్EtvAppఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
2024 Aug 282 months ago
సెప్టెంబర్ 7 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానున్న 'కమిటీ కుర్రోళ్లు'.
రివ్యూస్
YouSay Review
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యా...read more
How was the movie?
తారాగణం
సందీప్ సరోజ్
యశ్వంత్ పెండ్యాల
ఈశ్వర్ రాచిరాజు
త్రినాధ్ వర్మ
ప్రసాద్ బెహరా
టీనా శ్రావ్య
రాధ్య సురేష్
తేజస్వీ రావు
పి. సాయి కుమార్
సిబ్బంది
యదు వంశీదర్శకుడు
నిహారిక కొణిదెల
నిర్మాతఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఎలా ఉందంటే?
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాద్యా సురేశ్, తేజశ్వీరావు, సాయికుమార్
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం : అనుదీప్ దేవ్
సినిమాటోగ్రాఫర్ : రాజు ఎడురోలు
ఎడిటర్ : అన్వర్ అలీ
నిర్మాత : నిహారిక కొణిదెల
విడుదల: 09-08-2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu Review). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? నిర్మాతగా నిహారికకు మంచి సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి గ్రామంలో 12 ఏళ్లకు ఒకసారి భరింకాళమ్మతల్లి జాతర నిర్వహిస్తారు. ‘బలి చేట’ పేరుతో జరిగే ఈ ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఈసారి జాతర జరిగిన 10 రోజులకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండటంతో సర్చంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)కి పోటీగా శివ (సందీప్ సరోజ్) బరిలోకి దిగేందుకు రెడీ అవుతాడు. అయితే 12 ఏళ్ల క్రితం జరిగిన జాతర గొడవలో శివ స్నేహితులైన 10 మందిలో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. స్నేహితుల మధ్య జరిగిన కులాల కొట్లాట ఇందుకు కారణం కావడంతో ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పంచాయతీలో తీర్మానం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? రిజర్వేషన్ల అంశం శివ గ్యాంగ్‌ను ఎలా విచ్ఛిన్నం చేసింది? 12 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా? అసలు ఈ గొడవలో సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏంటి? శివ సర్పంచ్‌గా గెలిచాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ చిత్రంలో 11మంది కుర్రాళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. శివగా సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియంగా ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల ఇలా ఎవరికి వారే తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి వారి నటనానుభవం ఈ కథకు అదనపు బలాన్ని అందించింది. పెద్దోడుగా ప్రసాద్ బెహరా నటన అందర్నీ అలరిస్తుంది. వినోదభరిత సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతగా ఎమోషన్‌ను పండించాడు. ఇతర పాత్రదారులు కూడా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు యదు వంశీ 90'sలో కథను నడిపించారు. సమాజంలో అంతర్భాగమైన రిజర్వేషన్ల అంశాన్ని సున్నితంగా టచ్ చేశారు. ఒకే కథలో స్నేహం, ప్రేమ, కులాల సమస్య, రాజకీయం చూపించే ప్రయత్నం చేశారు. గోదావరి యాసలో రాసుకున్న సంభాషణలు, జాతర సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అయితే చాలా వేగంగా గోదావరి స్టైల్ కామెడీతో కథను నడిపించారు. ఆయా సన్నివేశాలకు 90స్ కిడ్స్ సూపర్‌గా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు ఎమోషనల్ సీన్స్‌పై దర్శకుడు ఫోకస్ పెట్టారు. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ స్లో అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు నేటి పొలిటికల్ లీడర్స్‌కు సెటైరికల్‌గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రేమ కథనలు అసంపూర్తిగా వదిలేయడం, రిజర్వేషన్ల అంశాన్ని కథలో అర్థంతరంగా ముగించడం, అనవసరంగా కొన్ని సన్నివేశాలను ఇరికించడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే అనుదీప్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా జాతర నేపథ్యంలో వచ్చే నేపథ్య సంగీతం కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రాఫర్ రాజు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిహారిక కొణిదెల ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
కథా నేపథ్యంగోదావరి స్టైల్ కామెడీజాతర సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంద్వితియార్థం
Telugu.yousay.tv Rating : 3/5
ఆగస్టు 09 , 2024
Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్’ సరసన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్ కాదు భయ్యా!
2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్ - కలెక్షన్స్ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
ఆయ్ (Aay)
నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ కూడా కలుపుకుంటే ‘ఆయ్’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ & ఫ్యూచరిక్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటివారు స్పెషల్ క్యామియోలతో అలరించారు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.
హనుమాన్ (Hanuman)
తేజసజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్ క్రేజ్‌తో ప్రశాంత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టనున్నారు.
సెప్టెంబర్ 17 , 2024
Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్ మెప్పించిందా?
నటీనటులు: వైభవ్ రెడ్డి, రితికా సింగ్, చరణ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను తదితరులు
రచన, దర్శకత్వం : మానస శర్మ
సినిమాటోగ్రఫీ : ధనుష్ భాస్కర్
సంగీతం : పి.కె. దండి
నిర్మాత : నిహారిక కొణిదెల
నిర్మాణ సంస్థ: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్
ఓటీటీ వేదిక: సోనీలివ్
విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కొత్త నటీనటులతో సరికొత్త కథాంశాన్ని తెరెకెక్కించి నిహారిక ప్రశంసలు అందుకున్నారు. దీంతో తాజాగా ఆమె నిర్మించిన వెబ్‌సిరీస్ 'బెంచ్ లైఫ్'పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందడం, ఐటీ బ్యాక్‌డ్రాప్ ఉన్న మానస శర్మ అనే మహిళ డైరెక్షన్ చేయడంతో మరింత హైప్ ఏర్పడింది. ఇందులో వైభవ్ రెడ్డి, చరణ్ పెరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. సోనీలివ్‌లో సెప్టెంబర్ 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? నిహారిక ఖాతాలో మరో సక్సెస్ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
బాలు (వైభవ్ రెడ్డి), రవి (చరణ్ పెరి), మీనాక్షి (రితికా సింగ్) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులు. మంచి స్నేహితులు కూడా. అదే ఆఫీసులో పని చేసే ఇషా (ఆకాంక్ష సింగ్)ను తొమ్మిదేళ్లుగా బాలు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు చెప్పడు. మరోవైపు మీనాక్షి డైరెక్టర్ కావాలని కలలుకంటుంది. కథలు రాసుకొని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలోనే భార్య (నయన్ సారిక), ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రవి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అందుకు ముగ్గురు ఫ్రెండ్స్ బెంచ్ అడుగుతారు. బెంచ్ వచ్చిన తర్వాత ఏమైంది? కంపెనీలో ప్రసాద్ వశిష్ఠ (రాజేంద్ర ప్రసాద్) రోల్ ఏంటి? భార్యతో రవికి మనస్ఫర్థలు రావడానికి కారణం ఏంటి? రవి తన ప్రేమను ఇషాకు చెప్పాడా? లేదా? డైరెక్టర్ కావాలన్న ఇషా కల ఏమైంది? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బాలు పాత్రకు నటుడు వైభవ్ పూర్తిగా న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో ఫన్ జనరేట్ చేశాడు. ఆయన ప్రేమించే అమ్మాయిగా ఆకాంక్ష సింగ్ చక్కగా నటించింది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని సెటిల్డ్ యువతిగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో హైలెట్ అంటే చరణ్ పెరి, నయన్ సారిక అని చెప్పవచ్చు. వాళ్లిద్దరి నటనతో పాటు వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. మీనాక్షి పాత్రలో రితిక చక్కగా ఒదిగిపోయింది. ఇష్టంలేని జాబ్ చేయలేక డైరెక్టర్ అయ్యేందుకు కష్టపడే యువతి పాత్రలో ఆమె మెప్పించింది. తులసి ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి కామెడీ టైమింగ్, ఎమోషన్స్ పరంగా మెప్పించారు. తనికెళ్ల భరణి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథలో కీలమైన సందర్భంలో హుందాగా నటించారు. నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, వెంకట్ అతిథి పాత్రల్లో మెరిశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకురాలు మానస శర్మ యువతరానికి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప్రతి పాత్రను ఒక అర్థం ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ముగింపు బాగుంది. అయితే రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్ మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సహజత్వం కనిపించదు. రాజేంద్రప్రసాద్-వైభవ్ రెడ్డి కామెడీ ట్రాక్ బాగా ప్లస్ అయ్యింది. అలాగే రాజేంద్రప్రసాద్ & నయన్ సారిక పాత్రలతో పండించిన సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా డైరెక్టర్ మానస శర్మ మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే వైభవ్ నోటి నుంచి వచ్చే బూతులు, ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ అయ్యేలా సిరీస్ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. సాఫ్ట్‌వేర్ ఆఫీస్ వాతావరణాన్ని చక్కగా ప్రజెంట్ చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ వంటి ఇతర విభాగాలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటనడైరెక్షన్ స్కిల్స్‌కామెడీ
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా బోల్డ్ డైలాగ్స్‌ఐటీ ఉద్యోగులకు మాత్రమే కనెక్ట్ కావడం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 12 , 2024
New Telugu Movies on OTT: థియేటర్లలో సందడంతా చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న బిగ్ ఫిల్మ్!
'కల్కి 2898 ఏడీ', 'భారతీయుడు 2' తర్వాత టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా మళ్లీ మెుదలైంది. గత వారం లాగే ఆగస్టు సెకండ్ వీక్‌లోనూ చిన్న హీరోల సినిమాలే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
కమిటీ కుర్రోళ్ళు
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. సాయికుమార్, గోపరాజు రమణ ఇతర ముఖ్య రోల్స్‌లో కనిపించనున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
సింబా
జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bharadwaj) కీలక పాత్రల్లో మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింబా’ (Simbaa). సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకృతిని నాశనం చేస్తే, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ఆగస్టు 9న థియేటర్లలో చూడబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
తుఫాన్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘తుఫాన్’ (Toofan Movie 2024). విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 2న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా పడి ఈ వీక్ థియేటర్లలోకి రాబోతోంది.
భవనమ్
సప్తగిరి (Sapthagiri), ధనరాజ్ (Dhanraj), షకలక శంకర్ (Shakalaka Shankar), అజయ్ (Ajay), మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ‘భవనమ్’ (Bhavanam) చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలాచారి కూరెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ గుడ్ ఫిలింస్ సమర్పణలో ఆర్.బి.చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలకు, వినోదాన్ని జోడించి ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
భారతీయుడు 2
కమల్ హాసన్ (Kamal Hassan), శంకర్ (Director Shankar) కాంబోలో రూపొందిన 'భారతీయుడు 2' (Bharateeyudu 2) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. జులై 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలను సైతం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులను 'భారతీయుడు 2' ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateKingsman Golden CircleMovieEnglishNetflixAugust 9The Umbrella AcademySeriesEnglishNetflixAugust 8Bharateeyudu 2MovieTeluguNetflixAugust 9Phir Aaye Haseena DilrubaMovieHindiNetflixAugust 9Romance In the HiceMovieKorean/EnglishNetflixAugust 10TurboMovieTelugu/MalayalamSonyLIVAugust 9Bheema : Andhkaar se Adhikaar TakMovieHindiZee 5August 5Amar SanghiMovieBengaliZee 5August 5Gaharah GaharahMovieHindiZee 5August 9ManorathangalSeriesTelugu DubZee 5August 15The Zone : Survival MissionMovieKorean/EnglishHotstarAugust 7AAAMovieHindiHotstarAugust 8Are You SureMovieKorean/EnglishHotstarAugust 8Life Hill GayeeMovieHindiHotstarAugust 9Darling MovieTeluguHotstarAugust 13Veeranjaneyulu Vihara YatraMovieTeluguETV WinAugust 14
ఆగస్టు 05 , 2024
Viral Video: ‘దేవర కంటే పొట్టేల్ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్ ‘దేవర’తో ‘పొట్టేల్’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘దేవర కన్నా చాలా బెటర్’
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్ వంటి టాప్ నాచ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/1849871631818293722
కంటెంట్‌కే ప్రాధాన్యత
సినిమాలో కంటెంట్ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
పొట్టేల్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ‘పొట్టేల్’లో ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
కథ ఇదే
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
https://telugu.yousay.tv/pottel-movie-review-comparisons-with-rangasthalam-before-release-is-pottel-at-that-level.html
అక్టోబర్ 26 , 2024
Game Changer: మూడు హిట్ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మెలోడీ సాంగ్.. ఇదెక్కడి అరాచకం!
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్క పాటకు రూ.20 కోట్లు!
'గేమ్ ఛేంజర్' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యింది. అయితే త్వరలో థర్డ్ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్ సింగిల్ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరించాల్సి ఉంది.
మూడు హిట్ చిత్రాల బడ్జెట్!
ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్ ఛేంజర్‌లో ఒక్క సాంగ్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శంకర్ మారాల్సిన అవసరం ఉందా?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.
రికార్డు ధరకు ఓటీటీ హక్కులు!
గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.110 కోట్లకు గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవలం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ కోసమే అమెజాన్ ఇంత మెుత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిటల్ రైట్స్‌ను మరో ఓటీటీ సంస్థకు అమ్మేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేకర్స్ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్ ఛేంజర్' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తండేల్ vs గేమ్ ఛేంజర్
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్ సైతం సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్ ఛేంజర్ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్ కొట్టి హిట్ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్ వర్సెస్ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
అక్టోబర్ 18 , 2024
Tollywood Women Producers: టాలీవుడ్‌లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!
సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ఆ సినిమా నిర్మాత ఎవరు అని సినీ లవర్స్ తెలుసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఒక సినిమా నిర్మాణంలో ఎక్కువగా కష్టపడేది నిర్మాతే. సినిమా బాగా రావడం కోసం ఖర్చులో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు హీరోను డైరెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లేదే నిర్మాతలే. హీరోలు, డైరెక్టర్లకు ఈ సినిమా పోతే ఇంకోటి అనే ఆప్షన్ ఉంటుంది. కానీ నిర్మాతల పరిస్థితి అలా కాదు. ఎక్కడెక్కడి నుంచే డబ్బు కూడగట్టి తీసిన ఫిల్మ్ ఫ్లాప్ అయితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అంతటి రిస్క్ కలిగిన నిర్మాణ రంగంలోకి స్టార్ల కుమార్తెలు వచ్చేస్తున్నారు. కుమారులు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాము ఏమాత్రం తక్కువ కాదని నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. యంగ్ ప్రొడ్యుసర్స్‌గా సత్తా చాటేందుకు సై అంటున్నారు. వారెవరో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
తేజస్విని నందమూరి
టాలీవుడ్‌లో నటుడిగా బాలకృష్ణ (Bala Krishna) చెరగని ముద్రవేశారు. యంగ్ హీరోలతో సమానంగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నట వారసత్వాన్ని మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) తీసుకొని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతోనే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ఆమె దీనిని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది.
నిహారిక కొణిదెల
మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చి అలరిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని భారతీయ సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ సత్తా చాటేందుకు మెగా ఫ్యామిలీ వారసురాళ్లు రెడీ అయ్యారు. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవల నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించింది. దాని ద్వారా తొలిసారి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని నిర్మించింది. వైవిధ్యభరితమైన కథతో, కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మించి ప్రశంసలు దక్కించుకుంది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కమిటీ కుర్రోళ్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్లకుపైగా వసూలు చేసింది.
సుస్మితా కొణిదెల
మెగా కుటుంబం నుంచి మరో నిర్మాత కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల (Sushmita Konidela) ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. దీనిపై తొలి చిత్రమే తన తండ్రితో తీయనున్నట్లు ఆమె ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుస్మిత కొణిదెలకు మంచి పేరుంది. చిరంజీవి హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ ఆమె ప్రతిభ చూపడం ఖాయమని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అశ్వనీదత్ వారసురాళ్లు
టాలీవుడ్‌లో ‘వైజయంతీ మూవీస్’కు ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. అశ్వనీదత్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆయన కుమార్తెలు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt)లు సిద్ధమయ్యారు. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రపంచస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. త్వరలోనే మరిన్ని సినిమాలు తీయనున్నట్లు తెలిపారు. అంతకముందు ‘స్వప్న సినిమా’, ‘త్రీ ఏంజెల్స్ స్టూడియో’, ‘ఎర్లీ మన్‌సూన్ టేల్స్’ వంటి సబ్ బ్యానర్లను ఏర్పాటు చేసి ‘మహానటి’, ‘సీతారామం’, ‘బాణం, ‘సారొచ్చారు’ వంటి హిట్ చిత్రాలను అశ్వని దత్ కుమార్తెలు నిర్మించారు.
ప్రసీద ఉప్పలపాటి
దిగ్గజ నటుడు కృష్ణం రాజు కుమార్తె, రెబల్ స్టార్ ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) సైతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ‘గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి దానితో ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ (Radheshyam)ను నిర్మించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
మంజులా ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా ఓ మహిళ నిర్మాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కృష్ణ కుమార్తె, మహేష్ బాబు (Mahesh Babu) సోదరి అయిన మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘షో’, ‘నాని’, ‘పోకిరి’, ‘ఏమాయ చేసావె’ వంటి చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. ఆ తర్వాత నటిగాను మారి పలు చిత్రాల్లో పాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 11 , 2024
OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మత్తు వదలరా 2 (Mathu Vadalara 2)
శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్ తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.
ధూం ధాం (Dhoom Dhaam)
చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్ నిర్మాత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్.రామ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చారు.
ఉత్సవం (Utsavam)
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
ఆయ్ (Aay)
నార్నే నితిన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.
తలవన్ (Thalavan)
జిస్ జాయ్ దర్శకత్వంలో బిజు మేనన్, ఆసిఫ్ అలీ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
సెప్టెంబర్ 09 , 2024
Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాలు!
టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, శ్రీను వైట్ల, రామ్ గోపాల్ వర్మ, వి.వి. వినాయక్, తేజ, గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్లు హిట్స్ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
అంజి కె. మణికుమార్
ఎన్టీఆర్ బామ మరిది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ఆయ్' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.
యదువంశీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
ముఖేశ్ ప్రజాపతి
అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఈ సిరీస్ ద్వారా దర్శకుడిగా ముఖేశ్ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకొని మంచి వ్యూస్ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది.
శౌర్యువ్
నాని రీసెంట్ చిత్రం 'హాయ్ నాన్న'తో శౌర్యువ్ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.
కల్యాణ్ శంకర్
ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో 'మ్యాడ్' ఒకటి. దర్శకుడు కల్యాణ్ శంకర్ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్ ఉందని కల్యాణ్ శంకర్ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్, డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కార్తిక్ దండు
‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
వేణు యెల్దండి
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.
ప్రశాంత్ వర్మ
అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
గౌతమ్ తిన్ననూరి
నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.
బుచ్చిబాబు సానా
తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్ చరణ్‌తో అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.
ఆగస్టు 27 , 2024
Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ ఫోకస్ మెుత్తం రాజకీయాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) సినీ రంగ ప్రవేశం చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో అకీరాకు సంబంధించిన ఏ చిన్న ఫొటో లభించినా దానిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. పవన్ లుక్స్‌ను అతడిలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఎప్పటికైనా అకీరా ఇండస్ట్రీలో అడుగుపెడతారని ఫ్యాన్స్ ధీమాలో ఉన్నారు. అయితే మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) చేసిన లేటెస్ట్ కామెంట్స్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. అకీరా నందన్ ఫిల్మ్ ఎంట్రీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘ఆ ఆలోచన ఉందని తెలియదు’
మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్లోళ్లు’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాపై తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో అకీరా నందన్‌కు సంబంధించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉందని నిహారికను ఓ జర్నలిస్టు అడిగారు. అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సి వస్తే మీ బ్యానర్‌లో ఆయన డెబ్యూ ఉండొచ్చా? అని ప్రశ్నించారు. దీనికి నిహారిక స్పందిస్తూ ‘అకీరా ఇంకా చిన్న కుర్రాడు. అతడికి సినిమాలోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. నేను వాడ్ని ఎప్పుడు అడగలేదు. వస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ నిహారిక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
https://twitter.com/i/status/1833762404749996233
నెటిజన్ల మిశ్రమ స్పందన
అకీరా ఎంట్రీపై నిహారిక స్పందన చూసి మెగా అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పవన్ వారసత్వం గురించి ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తుంటే నిహారిక మాత్రం తెలియదని సింపుల్‌గా చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ అకీరాను అడగలేదని నిహారిక చెప్పడం సమంజసంగా లేదని అంటున్నారు. అకీరా ఎంట్రీపై ఓ క్లారిటీ సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారిక వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. తెలియనప్పుడు తెలీదు అని చెప్పకుండా ఇంకేమి సమాధానం ఇస్తారని అంటున్నారు. అకీరా సినిమాల్లోకి వస్తే కచ్చితంగా మూవీ చేస్తానంటూ ఆమె చెప్పింది కదా అని గుర్తుచేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక లేటేస్ట్ కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
హీరోగా చూడాలని ఉంది: రేణూ దేశాయ్
అకీరా సినీ రంగ ప్రవేశంపై అతడి తల్లి రేణు దేశాయ్ గతంలోనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అకీరాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తిలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నటనకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కూడా అకీరా ఆసక్తి చూపించేవాడు కాదని తేల్చి చెప్పారు. సినిమాల్లోకి రావాలని ఆసక్తి ప్రస్తుతానికి అతడిలో లేదని రేణు దేశాయ్ తెలిపారు. అకీరా ఏం కావాలనుకుంటే అతడి ఇష్టమని చెప్పారు. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం దాన్ని బ్యాండ్ బాజా భారత్ లెవల్లో అనౌన్స్ చేస్తానని స్పష్టం చేశారు. తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు అదే అవుతుందని చెప్పుకొచ్చారు. అకీరాను హీరోగా చూడాలని తనకూ కోరికగా ఉందని మనసులో మాట చెప్పుకొచ్చారు.
అకీరా.. మల్టీ టాలెంటెడ్
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు మల్టీ టాలెంటెడ్. ఆటలు, పాటలు, మ్యూజిక్ ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. కర్రసాము కూడా అకీరా నేర్చుకున్నాడని సమాచారం. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అటు చదువులో కూడా అకీరా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్ కోర్సులు చేస్తున్నట్లు తెలిపారు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అకిరాతో ఓ స్పెషల్ పర్ఫామెన్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో యానిమల్ (Animal) సినిమాలోని నాన్న సెంటిమెంట్ ఉన్న సాంగ్‌కు పియానో వాయించాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
https://twitter.com/i/status/1747251367033577947
సెప్టెంబర్ 11 , 2024
Sai Pallavi: నిత్యామీనన్.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్ రాకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాయిపల్లవిని కాదని..!
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్ సంయుక్తంగా వరించింది.
నిత్యా మీనన్ ఏం గొప్ప..!
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు.
https://twitter.com/david_bro18/status/1824390579129815154
https://twitter.com/jammypants4/status/1824662625713521129
https://twitter.com/tum_saath_ho/status/1824438399735869460
బెస్ట్ యాక్టర్‌గా సౌత్ స్టార్
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా 'ఆట్టమ్' (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్ 2', బెస్ట్ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు.
జాతీయ అవార్డు విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్‌మోహర్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్‌మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)
జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్‌మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్ - లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్)
ఆగస్టు 17 , 2024
SS Rajamouli: రాజమౌళిపై స్పెషల్ డాక్యుమెంటరీ.. ఎలివేషన్స్ ఇవ్వనున్న ఆ స్టార్ హీరోలు!
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ముందు వరుసలో ఉంటాడు. ఆయన తీసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలు.. సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఆస్కార్‌తో పాటు పలు గ్లోబల్ స్థాయి పురస్కారాలను అందుకుంది. ‘RRR’ తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఆస్కార్ కమిటీ నుంచి సైతం రాజమౌళికి ఆహ్వానం అందింది. ఇంతటి ఘనకీర్తిని సాధించిన రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌లోకి రానుంది.
‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో..
దర్శకధీరుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (MODERN MASTERS) పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. ‘ఒక మనిషి.. అనేక బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో మోడ్రన్ మాస్టర్స్ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్‌ఫ్లిక్స్ సంస్థ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నట్లు తెలిపింది.
View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)
స్టార్ సెలబ్రిటీల కామెంట్స్!
'మోడ్రన్ మాస్టర్స్' డాక్యుమెంట్‌లో రాజమౌళి గొప్పతనం గురించి పలువురు స్టార్ సెలబ్రిటీలు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్స్ జేమ్స్ కామెరాన్, జో రోసో రాజమౌళి దర్శకత్వ నైపుణ్యం గురించి చెబుతారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు తమ ఒపినీయన్స్ షేర్ చేసుకుంటారని సమాచారం. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్‌ను స్టార్టింగ్ నుంచి చూపిస్తారా? లేదా బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ గురించి మాత్రమే ప్రస్తావిస్తారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఆగస్టు 2న స్పష్టత రానుంది.
ఆస్కార్ కమిటీకి రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళికి ఇటీవల అస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్ సిద్వానీ, రవి వర్మన్ తదితరులు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
‘SSMB29’తో బిజీ బిజీ..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. కథ కూడా ఇటీవలే ఫైనల్ అయినట్లు ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు.
జూలై 06 , 2024
Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్’ డే 1 కలెక్షన్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
రజనీకాంత్ హీరోగా నటించిన ‘వేట్టయాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పటికీ తలైవా ఒక్కరే..
‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించారు. వేట్టయన్ కంటెంట్‌కు తలైవా మాస్ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334
‘వేట్టయన్’లో ఇవే హైలెట్స్!
'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్ అయ్యింది. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. రజనీకాంత్ ఇంట్రడక్షన్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్, శరణ్య రేప్ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్ బచ్చన్ - రజనీ మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.
కథేంటి
పోలీసు ఆఫీసర్ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అక్టోబర్ 11 , 2024
Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్’ మెప్పించిందా?
నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు
దర్శకుడు : టీజీ జ్ఞానవేల్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్. ఆర్. ఖదీర్
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించిందా? ‘జైలర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీకి మరో సాలిడ్ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పోలీసు ఆఫీసర్ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్ మూమెంట్స్, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్ ఫాజిల్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్ అయ్యింది. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. రజనీకాంత్ ఇంట్రడక్షన్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్, శరణ్య రేప్ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్ బచ్చన్ - రజనీ మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఎడిటిర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
రజనీకాంత్ నటనసోషల్ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Indian Oscar Entry 2025: ఆస్కార్ బరిలో ‘కల్కి 2898 ఏడీ’..? ‘RRR’ను ఫాలో కానున్నారా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ (Hollywood) నటీనటులకైతే జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ ఏడాది మన దేశం తరుపున ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలవడం లాంఛనమేనని అనుకున్నారు. అయితే అనూహ్యంగా హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’ 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఎంపికైంది. దీంతో గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో కావాలని కల్కి టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘కల్కి’కి అన్యాయం జరిగిందా?
కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies For Oscars) 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో 12 మందితో కూడిన జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనికి అస్సామీ దర్శకుడు జాహ్ను బారువా నేతృత్వం వహించారు. మెుత్తం 29 చిత్రాలు భారత్ తరపున నామినేట్ అయ్యేందుకు పోటీలో నిలిచాయి. అందులో టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’, ‘మంగళవారం’ చిత్రాలు ఉన్నాయి. అయితే గ్లోబల్ స్థాయిలో సక్కెస్ అయినా కల్కిని కాదని లాపతా లేడీస్‌ను భారత్ తరపున ఎంపిక చేయడంపై సినీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆస్కార్ సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్'కు జరిగిన అన్యాయమే ‘కల్కి’కి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ బాటలో కల్కి!
గతేడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో భారత్ తరపున ‘ఆర్ఆర్‌ఆర్’కు చోటుదక్కలేదు. దీంతో దర్శకధీరుడు రాజమౌళి జనరల్ కేటగిరిలో ఆస్కార్‌ను నామినేషన్స్ పంపించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు, ఉత్తమ డైరెక్టర్ సహా 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు పంపారు. ఈ క్రమంలో ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు కల్కి టీమ్ కూడా భారత్ తరపున అధికారికంగా కాకపోయిన జనరల్ చిత్రాల కేటగిరిలో ఆస్కార్ బరిలో నిలవాలని భావిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరహాలోనే వివిధ కేటగిరీల కింద నామినేషన్స్ పంపాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ కమిటీ కల్కి పంపిన నామినేషన్స్‌ను పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తే అధికారికంగా పోటీలో నిలుస్తుంది. అటు ‘హనుమాన్’ టీమ్ కూడా జనరల్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేషన్స్ పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
‘లాపతా లేడీస్’ ఎంపికకు కారణం ఇదే
లాపతా లేడీస్ చిత్రాన్ని భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ బరిలో నిలపడానికి గల కారణాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, అస్సామి దర్శకుడు జాహ్ను బారువ వెల్లడించారు. ‘జ్యూరీ అన్ని రంగాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సరైన చిత్రాలను చూడాలి. ముఖ్యంగా లాపతా లేడీస్ భారతదేశ సామాజిక వ్యవస్థలు, నైతికతను చాటిచెప్పింది. భారతీయతను గొప్పగా చూపారు. అందుకే నామినేట్ అయిన 29 చిత్రాల్లో మేము దీన్ని ఎంపిక చేశాం. ఇది కేవలం ఒక్కరోజులో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు. 8 రోజుల పాటు జ్యూరీ సభ్యులందరం చర్చించుకొని లాపతా లేడీస్‌ను ఎంపిక చేశాం’ అని జాహ్ను బారువా తెలిపారు. ఇక ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడంపై దర్శకురాలు కిరణ్‌రావు కూడా ఆనందం వ్యక్తంచేశారు. ‘అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. భారత్‌లో ప్రేక్షకులు ఏవిధంగా మా చిత్రాన్ని ఆదరించారో.. ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
సౌత్ నుంచి పోటీ పడ్డ చిత్రాలు ఇవే!
ఆస్కార్ అవార్డుల రేసులో భారత్ తరపున బరిలోకి దిగేందుకు మెుత్తం 29 చిత్రాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు కాగా, కోలివుడ్ నుంచి 6 చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించాయి. వాటిలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’, విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’, సూరి ప్రధాన పాత్ర పోషించిన ‘కొట్టుక్కాళి’, లారెన్స్ - ఎస్.జే. సూర్య నటించిన ‘జిగర్తండా డబుల్ ఎక్స్’, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ హీరోగా చేసి దర్శకత్వం వహించిన ‘జమ’ చిత్రాలు ఉన్నాయి. మలయాళం నుంచి ‘ఆట్టం’, ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్), ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’, ‘ఉళ్ళోజుక్కు’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే భారత్ నుంచి ‘లాపతా లేడిస్’ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన రానుంది.
లాపతా లేడీస్ ప్రత్యేకత ఏంటి?
సినిమాకి కథే హీరో అని ‘లాపతా లేడీస్’ చిత్రం మరోసారి నిరూపించింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారవుతారు. మరి ఆ తర్వాత వారి జీవితాలు ఎలా సాగాయి? వాళ్ల భర్తల దగ్గరికి ఎలా చేరుకున్నారు? అనేది ఇందులో చూపించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఓ వైపు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మరోవైపు సమాజంలోని మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తేలా తీర్చిదిద్దారు. పితృస్వామ్య వ్యవస్థపై తీసిన వ్యంగ్య చిత్రమిది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధోబీ ఘాట్’కు దర్శకత్వం వహించిన కిరణ్, 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
సెప్టెంబర్ 24 , 2024
Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!
టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శరత్‌బాబు 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో తెరంగేట్రం చేశారు. 300లకు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్‌బాబు (71).. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన చివరిగా నరేష్- పవిత్ర జంటగా చేసిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నటించారు. శరత్‌బాబు మరణం నేపథ్యంలో ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన టాప్-10 చిత్రాలు మీకోసం..
1. సీతాకోక చిలుక
1981లో వచ్చిన ‘సీతాకోక చిలుక’ సినిమా నటుడిగా శరత్ బాబుకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. ఇందులో హీరోయిన్ కరుణకు అన్నగా శరత్ బాబు అద్భుతంగా నటించారు. జాలి, దయ, ప్రేమ, కరుణ లేని డేవిడ్ పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా విజయంలోనూ శరత్‌బాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో సీతాకోక చిలుక చిత్రం ఒక ప్రభంజనమే సృష్టించింది.
https://www.youtube.com/watch?v=lPf-cPdYjq0
2. అన్వేషణ
1985లో వచ్చిన ‘అన్వేషణ’ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో జేమ్స్ అనే ఫారెస్టు రేంజ్ అధికారి పాత్రను శరత్ బాబు పోషించారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత నుంచి శరత్ బాబుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
3. సితార
1980వ దశకంలో వచ్చిన ‘సితార’ చిత్రం శరత్ బాబు నటనా పాఠవాలను తెలియజేసింది. ఇందులో హీరోయిన్‌కు అన్నగా శరత్ బాబు నటించారు. చందర్ పాత్రలో ఒదిగిపోయాడు. చెల్లిని అమితంగా ఇష్టపడే అన్నగా.. కోర్టు గొడవలతో సతమతమయ్యే వ్యక్తిగా శరత్‌బాబు ఎంతో వైవిధ్యంతో నటించారు.
https://www.youtube.com/watch?v=ZK4qaJMWwoc
4. సంసారం చదరంగం
‘సంసారం చదరంగం’ సినిమా కూడా శరత్‌బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో అప్పల నరసయ్య కుమారుడి పాత్రలో శరత్ కుమార్ నటించారు. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండే ప్రకాష్ పాత్రలో ఆయన అలరించాడు. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో శరత్ బాబు అద్భుతమే చేశాడు. తన నటన ఎంత లోతైనదో చూపించాడు.
https://www.youtube.com/watch?v=esucI1zKcM4
5. సాగర సంగమం
కె. విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమల్ హసన్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా ఇది మిగిలిపోయింది. ఇందులో రఘుపతి పాత్ర పోషించిన శరత్‌బాబుకు కూడా ఈ సినిమా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. కమల్‌కు స్నేహితుడిగా ఇందులో శరత్‌బాబు నటించారు.
https://www.youtube.com/watch?v=CtBi8524GAc
6. స్వాతి ముత్యం
కమల్ హాసన్ కథానాయకుడిగా చేసిన ‘స్వాతి ముత్యం’ సినిమాలోనూ శరత్‌బాబు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సోదరుడు చలపతి పాత్రలో శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచాడు. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కురిశాయి.
7. ముత్తు
రజనీకాంత్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ముత్తు’ ఒకటి. ఇందులో జమీందారైన రాజా పాత్రలో శరత్‌బాబు ఆకట్టుకున్నాడు. రజనీకాంత్‌తో పోటీ పడి మరీ నటించాడు. రజనీ - శరత్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శరత్‌బాబు అత్యుత్తమ నటన కనబరిచిన సినిమాల్లో ముత్తు కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
https://www.youtube.com/watch?v=0h6qh6ABmdk
8. అన్నయ్య
చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన అన్నయ్య సినిమాలో శరత్‌బాబు విలన్ పాత్ర పోషించారు.
సోదరులను అడ్డుపెట్టుకొని చిరంజీవిపై పగ తీర్చుకునే రంగారావు పాత్రలో శరత్‌బాబు మంచి నటన కనబరిచాడు.
https://www.youtube.com/watch?v=Deoo7_CQFdg
9. మగధీర
రామ్‌చరణ్ - రాజమౌళి కాంబో వచ్చిన మగధీర చిత్రంలోనూ శరత్ కుమార్ నటించారు. కాజల్‌కు తండ్రిగా, విక్రమ్ సింగ్ మహారాజ్‌గా మెప్పించాడు.
https://www.youtube.com/watch?v=G7haVu5g-Qw
10. వకీల్‌సాబ్
పవన్ కల్యాణ్ రీసెంట్ మూవీ వకీల్‌సాబ్ సినిమాలోనూ శరత్‌కుమార్ కనిపించారు. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నటించారు. పవన్‌ను ఉద్దేశిస్తూ ‘ఇప్పుడు జనాలకు నీ అవసరం ఉంది’ అని శరత్ బాబు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది.
మే 22 , 2023
పవన్ కల్యాణ్ మేనియా షురూ.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్… మనల్ని ఎవడ్రా ఆపేది?
పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.
మనల్ని ఎవడ్రా ఆపేది
గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/sunny4u007/status/1633901586413154304
ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.
https://twitter.com/i/status/1633886352583565313
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు
ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.
https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20
వరుస పెట్టి సినిమాలు
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్ శంకర్ షూటింగ్‌ను మార్చి 28నుంచి పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.
https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025
https://twitter.com/SupremePSPK/status/1630933852058423302
ఫటా ఫట్
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి.
పవన్ క్యూ
జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు.
ఎన్నికలకు వేళాయే
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
మార్చి 10 , 2023
Samantha: సినిమాల నుంచి సడెన్‌గా తప్పుకున్న సమంత… ఆందోళనలో అభిమానులు, హీరోలు.. కారణం ఇదే!
Samantha Ruth Prabhu: ఈ వార్త నిజంగా సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండతో సామ్ నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమా చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుంది. ఈ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. చివరి షెడ్యూల్ పూర్తైన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సమంత తాజాగా వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్(Citadel) వెబ్‌సిరీస్ షూటింగ్ చివరి షెడ్యూల్ సైతం సెర్బియాలో పూర్తైంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఏ సినిమాకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ... ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలకు తీసుకున్న ఆడ్వాన్స్ పేమెంట్‌ను సైతం నిర్మాతలకు సమంత తిరిగిచ్చేస్తోందని తెలిసింది. దాదాపు ఒక ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సామ్ భావిస్తోందట.
Courtesy Instagram: samantha
ఆదే కారణమా?
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆ వ్యాధితో సామ్ ఆరు నెలలు పోరాడింది. ఆ సమయంలో సమంత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లింది. చికిత్స తీసుకుంటూ స్నేహితులతో కలిసి దేశ విదేశీ టూర్లు చేసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందింది. అయితే ఇప్పుడు అదే మయోసైటిస్(Myositis) వ్యాధి తిరగబడినట్లు సమాచారం. శరీరం, ముఖంపై వస్తున్న మార్పులు గమనించిన సామ్.. పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని భావించింది. అందుకే కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కోలుకున్నాకే మూవీస్‌పై ఫొకస్ పెట్టాలని నిశ్చయించుకుంది.
సమంత రాబోయే సినిమాలు
శివ నిర్వాణ డైరెక్షన్‌లో సమంత-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.
అభిమానుల అండ
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత... కొద్దికాలంలోనే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు, రామ్‌చరణ్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కోలివుడ్‌లోనూ అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ చైతు- సామ్ వివాహ బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఇరువురి మధ్య అభిప్రాయ భేదంతో విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత సమంత తరుచు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాను ఏ పని చేసినా హైలెట్ అవుతూ వస్తుంది. ఎంత మంది ట్రోల్ చేసిన.. ధైర్యం కోల్పోకుండా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఆమెను అభిమానించే ఫ్యాన్ ఎల్లప్పుడూ సామ్‌కు అండగా ఉంటూ మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో నటించి అందర్ని అకట్టుకోవాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూలై 05 , 2023
17 Years for POKIRI: ఇండస్ట్రీ హిట్ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో అసలు ప్రత్యేకత ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరో…! సింపుల్ స్టోరీ లైన్… ! చివర్లో చిన్న ట్విస్ట్…! కానీ, ఇందులో పాత్రలు మాట్లాడాయి. డైలాగులు గుర్తిండిపోయేలా పేలాయి. పాటలు మార్మోగాయి. ఇన్నీ జరిగాయి కనుకే ఇండస్ట్రీ హిట్ అనే కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దాదాపు మూడేళ్ల పాటు ఆ సినిమా కలెక్షన్లను కొట్టే చిత్రమే రాలేదంటే నమ్ముతారా? ఏం సినిమా అనుకుంటున్నారా ! మహేశ్ బాబు నటించిన “పోకిరి”. చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు అయ్యింది. ఈ సమయంలో మరొక్కసారి అలా ఓసారి సినిమాను గుర్తు చేసుకుందాం.
మాస్ టచ్
“ గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని తీయ్ 200 సెంటర్స్ 100 డేస్”. ఈ సినిమాకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లేకపోతే మహేశ్ బాబు లాంటి హీరోను పెట్టి “పోకిరి” అనే టైటిల్ పెట్టి ఏకంగా రికార్డులు తిరగరాశాడంటే పూరి జగన్నాథ్ గట్స్‌ను మెచ్చుకోవాలా? వద్దా?. మాస్ ఆడియన్స్ మెుత్తం థియేటర్లకు క్యూ కట్టారంటే టైటిల్ వల్లే కదా.
స్టైల్ సాలా
సినిమాలో హీరో ఓ గ్యాంగ్‌స్టర్. డిఫరెంట్‌గా కనిపించాలి కదా మరి. అందుకే ఇద్దరూ కలిసి అలా కాసేపు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఏంటంటే? షర్ట్ మీద షర్ట్ వేసేద్దాం గురూ అని. ఇంకేముంది అదో ట్రెండ్ సెట్ అయ్యింది.
మాటల తూటాలు
పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైలాగులే. పోకిరి చిత్రంలో వాటికి కొదవ లేదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఇలా పవర్ ప్యాక్డ్ డైలాగులు ఒక్కటేమిటీ బోలేడున్నాయి. సినిమా ఆ స్థాయిలో ఉండటానికి కారణం అయ్యాయి.
స్వాగ్ సాంగ్స్
పోకిరి సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డోలే డోలే దిల్ జర జర అంటూ మహేశ్ కుర్చీలో కూర్చొని వేసిన ఓ స్వాగ్ స్టెప్ ఎవరైనా మర్చిపోతారా? అంతేనా..ఇందులో ఉన్న 6 పాటలు సూపర్ హిట్టే.
https://www.youtube.com/watch?v=obUCNoFPG1Y
https://www.youtube.com/watch?v=Cuzj7kbftwU
కృష్ణమనోహర్ IPS
గ్యాంగ్‌స్టర్ పండుగాడు శత్రువులపై బుల్లెట్స్ వర్షం కురిపించి ఒక్కసారిగా కృష్ణ మనోహర్ IPSగా పోలీస్ గెటప్‌లో కనిపిస్తే ఆ సీన్ గుర్తొస్తేనే గూస్‌బంప్స్ వస్తాయి కదా ! పూరీ మార్క్ మరి ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్
సినిమా తీశాక ఇందులో ఏముంది అనుకున్నారంటా? అస్సలు ఆడదని కొందరు చెప్పారంటా? ఒక్కసారి విడుదలయ్యాక వాళ్లే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. దెబ్బకి కొడితే ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ పదాన్ని అప్పుడే సృష్టించారంటే నమ్మండి. పక్కా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన మాటలు, పాటలు అన్నీ ఉన్నాయి కనుకే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. ఏకంగా రూ. 66 కోట్లు వసూలు చేసింది. అప్పుడు రూ 66 కోట్లు అంటే ఇప్పుడు రూ. 1000 కోట్లకు సమానమే అవుతుంది కదా. రీరిలీజ్‌లోనూ పోకిరి చిత్రం రూ. 1.7 కోట్లు వసూలు చేసింది.
ఎందరిని దాటుకుని మహేశ్ దగ్గరికి వచ్చిందో తెలుసా?
పూరి సినిమా తీస్తున్నాడంటే మూడు నెలల్లో అయిపోవాల్సిందే. అస్సలు సమయం వృథా చేయడు. ఓ హీరోకి కథ చెప్పి ఎక్కువ ఆలస్యం అవుతుందనిపిస్తే ఇంకో హీరోతో తీసేస్తాడంతే. పోకిరి కూడా మహేశ్‌బాబుకి అలా వచ్చిందే. సినిమా స్టోరీని మెుదట పవన్ కల్యాణ్‌కు చెప్పాడు పూరీ. కానీ, పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత రవితేజకు వినిపించాడు. ఓకే చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అనంతరం సోనూసూద్‌ని పెట్టి తీసేద్దాం అనుకున్నాడట. ఇది కూడా మూలన పడింది. తర్వాత మహేశ్ ఓకే చెప్పడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.
పోకిరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్
పోకిిరి సినిమాకు ముందు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ పెట్టాడు జగన్. కానీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చాలని సూచించాడు మహేశ్. దానికి ఒప్పుకున్న పూరి పోకిరి అనే ఖరారు చేశాడు.
ఏప్రిల్ 28 , 2023