• TFIDB EN
  • కూలీ
    రేటింగ్ లేదు
    UATelugu
    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ'. స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. సత్యరాజ్‌, ఫహాద్‌ ఫాజిల్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రజనీకాంత్
    సత్యరాజ్
    శృతి హాసన్
    రెబా మోనికా జాన్
    మహేంద్రన్
    సిబ్బంది
    లోకేష్ కనగరాజ్
    దర్శకుడు
    కళానిధి మారన్
    నిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    గిరీష్ గంగాధరన్
    సినిమాటోగ్రాఫర్
    ఫిలోమిన్ రాజ్
    ఎడిటర్ర్
    కథనాలు
    <strong>Coolie Movie: రోలెక్స్‌ తరహాలో వైలెంట్‌గా నాగ్‌ మామ.. ‘కూలీ’ నుంచి యాక్షన్‌ సీన్‌ లీక్‌!</strong>
    Coolie Movie: రోలెక్స్‌ తరహాలో వైలెంట్‌గా నాగ్‌ మామ.. ‘కూలీ’ నుంచి యాక్షన్‌ సీన్‌ లీక్‌!
    సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాటిక్‌ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘కూలీ’ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ బయటకొచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు కూలీ మూవీకి సంబంధించి ఏకంగా ఓ వీడియోనే బయటకొచ్చింది. అది కూడా టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియో కావడంతో సోషల్‌ మీడియా మెుత్తం షేక్ అవుతోంది. వీడియో లీక్‌పై దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు.&nbsp; రూత్‌లెస్‌ యాక్షన్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇటీవల నాగ్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. సైమన్‌ పాత్రలో అతడు కనిపించనున్నట్లు ఆ పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపిస్తున్నాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహా చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌&nbsp; చేస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ గట్టిగానే ప్లాన్‌ చేశాడని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/simmu_prabhas/status/1836417013029486769 బాధపడ్డ లోకేష్‌ కనగరాజ్‌ నాగార్జున్‌ పాత్రకు సంబంధించిన యాక్షన్‌ సీన్ నెట్టింట ప్రత్యక్షం కావడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ షాక్‌కి గురయ్యారు. తమ రెండేళ్ల కష్టాన్ని ఇలా ఒక్క పనితో, ఒక్క లీక్‌తో నాశనం చేశారని బాధపడ్డారు. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాపై ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ను ఇలా పాడుచేయవద్దని నెటిజన్లకు సూచించారు. ఆ వీడియోను ఎవ్వరూ షేర్‌ చేయవద్దని రిక్వెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే నాగ్‌ వీడియోను మూవీ యూనిట్‌కు చెందిన వారే లీక్‌ చేసి ఉండొచ్చని సమాచారం. షూట్‌లో భాగమైన వారే లీక్‌ చేసి ఉంటారని మేకర్స్‌ సైతం అనుమానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.&nbsp; వైజాగ్‌ నుంచి లీక్‌..! ‘కూలీ’ చిత్రంలో పలువురు స్టార్‌ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగార్జునతో పాటు కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. స్టార్‌ హీరోయిన్ శృతిహాసన్‌, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరుగుతోంది. నాగార్జునకు సంబంధించిన వీడియో ఇక్కడ నుంచే లీకై ఉండొచ్చని సమాచారం. ఇక ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. కూలీ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 19 , 2024
    <strong>Coolie Movie: </strong><strong>రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!</strong>
    Coolie Movie: రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!
    భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్‌ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్‌ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.  క్రేజీ కాంబో లోడింగ్‌..! తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్‌ ఖాన్‌ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; 29 ఏళ్ల క్రితమే.. రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్‌ హై ఆటంక్‌’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్‌’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్‌ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్‌ ఖాన్‌, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలన్‌గా కన్నడ స్టార్‌! రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 171వ చిత్రంగా కూలీ తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్‌’ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. రజనీ వ్యాఖ్యలపై దుమారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్‌ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్‌ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్‌ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    Venkatesh Dual role Movies:&nbsp; విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Venkatesh Dual role Movies:&nbsp; విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. కూలీ నంబర్ 1 (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ?????????????????????????????????????????????????????????????? ముద్దుల ప్రియుడు(1994) ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ..&nbsp; ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోకిరి రాజా(1995) ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు. సూర్య వంశం(1998) ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. జయం మనదేరా(2000) జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవీ పుత్రుడు (2001) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర బోస్ (2005) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.&nbsp; నాగవల్లి(2010) ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు. ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    నవంబర్ 10 , 2023
    <strong>Pushpa 2 Record: వందేళ్ల బాలీవుడ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2!</strong>
    Pushpa 2 Record: వందేళ్ల బాలీవుడ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2!
    సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్‌ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేస్తూ, కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా, హిందీ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక నికర వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు (Pushpa 2 Hindi Collections) వసూలు చేసి, 100 ఏళ్ల బాలీవుడ్‌ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఈ మొత్తాన్ని కేవలం సినిమా విడుదలైన 15 రోజుల్లోనే రాబట్టడం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రూ.1508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేయడం విశేషం. విడుదలైన మొదటి 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి, భారతీయ సినీ చరిత్రలో ఒక అపూర్వమైన రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రూ.1,387 కోట్లు) వసూళ్లను అధిగమించిన ‘పుష్ప 2’, ఇప్పుడు ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా దూసుకెళ్తోంది. Pushpa 2 Full HD Movie Leaked ఈ సినిమా అభిమానులకు మరింత వినోదాన్ని అందించడానికి చిత్రబృందం కొన్ని కొత్త సన్నివేశాలను జోడించే యోచనలో ఉందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటిలోని సీన్ల రన్‌టైమ్‌ దాదాపు 20 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఇప్పటికే ‘పుష్ప 2’ నిడివి సుమారు 3 గంటల 20 నిమిషాలుగా ఉండగా, కొత్త సన్నివేశాలతో మరింత ఉత్కంఠను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల నుండి భారీ స్పందనను పొందడం, అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించడం తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలిపే సూచికగా చెప్పవచ్చు. ఇది సినీ ప్రియులకు ఆనందాన్ని పంచడమే కాక, టాలీవుడ్ ప్రతిష్ఠను గ్లోబల్ స్థాయికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది. కథేంటి ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp;
    డిసెంబర్ 20 , 2024
    <strong>Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!</strong>
    Pushpa 2 Box Office Collections: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’? ఐదు రోజుల్లోనే కొత్త చరిత్ర!
    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. దీంతో నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఇండియన్‌ సినిమా చరిత్రను తిరిగరాసిన పుష్ప రాజ్‌ వీకెండ్ పూర్తయ్యేసరికి మరిన్ని రికార్డులను కొల్లగొట్టాడు. బాక్సాఫీస్‌ (Pushpa 2 Day5 Box Office Collections) వద్ద ఊచకోత సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  రూ.800 కోట్ల క్లబ్‌లో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచి రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్‌ పూర్తయ్యే సరికి తొలి నాలుగు రోజుల్లో (Pushpa 2 Box Office Collections) ఈ చిత్రం రూ. వరల్డ్ వైడ్‌గా రూ.829 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అత్యంత వేగంగా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఇండియన్‌ సినిమాగా చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్పెషల్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రం తొలి రోజు రూ. 282.91 కోట్లు, రెండో రోజు రూ.134.63 కోట్లు, మూడో రోజు రూ.159.25 కోట్లు, నాల్గో రోజు రూ.204.52 కోట్లు తన ఖాతాలో వేసుకుందని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. థియేటర్లలో పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే కలెక్షన్స్‌ పరంగా మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాయి. https://twitter.com/PushpaMovie/status/1866057903498829889 హిందీలో రికార్డుల పరంపర బాలీవుడ్‌ ప్రేక్షకులు 'పుష్ప 2' (Pushpa 2&nbsp; day 5 Box Office Collections) చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్‌లో తొలి రోజు నుంచి కాసుల వర్షం కుపిరిస్తున్నారు. అక్కడ ఫస్ట్‌ డే రోజున రూ.72 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టి 'పుష్ప 2' ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నాల్గో రోజైన ఆదివారం (డిసెంబర్‌ 8) ఏకంగా రూ.86 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించి అక్కడ ఒక రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్‌ మూవీగా కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా హిందీలో వీకెండ్‌ పూర్తయ్యే సరికి రూ. 291 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను 'పుష్ప 2' తన ఖాతాలో వేసుకుంది. తొలి రోజు రూ.72 కోట్లు, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్ల నెట్‌ వసూళ్లను పుష్ప 2 రాబట్టినట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇది ఆల్‌ టైమ్‌ రికార్డు అంటూ స్పష్టం చేశారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1866041047488528542 https://twitter.com/PushpaMovie/status/1866022278150160679 రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి? ‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్‌ (Pushpa 2 Box Office Collections)లో చేరేందుకు రూ.171 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. బాక్సాఫీస్‌ వద్ద పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే రేపే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీకెండ్‌ అయిపోయిన నేపథ్యంలో ఒక వేళ కలెక్షన్స్ తగ్గినా ఎల్లుండి మాత్రం కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫాస్టెస్ట్‌ థౌజండ్‌ క్రోర్స్‌ (Fastest Rs.1000 Movie) సాధించిన చిత్రంగా ‘పుష్ప 2’ కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒక సారి ఆ ఫీట్‌ సాధించాక ‘పుష్ప 2’ టార్గెట్‌ రూ.1500 కోట్ల మైలురాయిపై  పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌గా చేశాడు. జగపతిబాబు, సునీల్‌, రావు రమేష్‌, అనసూయ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు పార్ట్‌ 3 కూడా రానుంది.  కథేంటి ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp;
    డిసెంబర్ 09 , 2024
    <strong>Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?</strong>
    Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు రచన, దర్శకత్వం: సుకుమార్‌ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ విడుదల: 05-12-2024 అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్‌ నిర్వహించి మరింత హైప్‌ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి&nbsp; ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్‌ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్‌, డ్యాన్స్‌లలో మెస్మరైజ్‌ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్‌ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో గ్లామర్‌ డోస్‌ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్‌ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్‌ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్‌, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్‌ సుకుమార్‌ పుష్ప రాజ్‌ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్‌, మైండ్‌ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్‌ ఇంట్రో, పుష్ప - షెకావత్‌ టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్‌ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్‌ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్‌ వేశారు సుకుమార్‌.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్‌ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్&nbsp; నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ అల్లు అర్జున్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ తేలిపోయిన విలనిజంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3.5/5 
    డిసెంబర్ 05 , 2024
    <strong>OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?</strong>
    OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions) అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. మట్కా (Matka) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్‌ ఏంటి?’ అన్నది స్టోరీ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ&nbsp; భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ. జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్‌ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ. మందిర (Mandira) సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్‌. యువన్‌ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్‌ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చింది. నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్‌ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ. కంగువా (Kanguva) తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. క (Ka) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ. వికటకవి (Vikkatakavi) యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్‌)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.&nbsp; ‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్‌ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్‌ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్‌ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
    డిసెంబర్ 05 , 2024
    <strong>Varun Tej: వరుస ఫ్లాప్స్‌.. వరుణ్‌ తేజ్‌ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?</strong>
    Varun Tej: వరుస ఫ్లాప్స్‌.. వరుణ్‌ తేజ్‌ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?
    మెగా హీరో వరుణ్‌తేజ్‌ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అతడి కెరీర్‌ పరంగా తిరుగుండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌ అతడ్ని పూర్తిగా ఢీలా పడేలా చేశాయి. రీసెంట్‌గా చేసిన ‘మట్కా’ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను వరుణ్‌ పట్టాలెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడిపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. హీరోగా మానేసి విలన్‌ పాత్రలు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.&nbsp;&nbsp; కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే? మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘మట్కా’ (Matka) ఫ్లాప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వరుణ్‌ తన నెక్స్ట్‌ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందించనున్నట్లు సమాచారం. 'మట్కా' షూటింగ్‌ దశలో ఉండగా దర్శకుడు మేర్లపాక గాంధీ కథకు సంబంధించి వరుణ్‌తేజ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు వరుణ్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.&nbsp; సినిమాలకు వరుణ్‌ బ్రేక్‌! కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఎంతో కష్టపడి చేసిన 'మట్కా' ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలవడం వరుణ్‌ తేజ్‌ను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి నెగిటివ్‌ టాక్‌ను మూటగట్టుకుంది. రొటీన్‌ స్టోరీ, పూర్ స్క్రీన్‌ప్లేతో అస్సలు బాలేదన్న టాక్‌ వచ్చింది. అయితే నటుడిగా వరుణ్‌ తేజ్‌ మాత్రం పూర్తిగా న్యాయం చేశాడన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఎన్నో ఎఫర్ట్స్‌ పెట్టి చేసిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకోవాలని వరుణ్‌ నిర్ణయించుకున్నారట. ఈసారి ఆడియన్స్‌ను మెప్పించే కథ రావాలని గట్టిగా ఫిక్సయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ‘విలన్‌గా చేసుకో’ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) చేసిన గత ఆరు చిత్రాల్లో ఒక్క 'ఎఫ్‌ 3' మాత్రమే మంచి విజయం సాధించింది. అది కూడా వరుణ్‌ తేజ్‌ స్ట్రైట్‌ ఫిల్మ్‌ కాదు. అందులో వెంకటేష్‌ కూడా చేయడంతో సక్సెస్ క్రెడిట్‌ పూర్తిగా వరుణ్‌కు ఇవ్వలేము. వరుస ఫ్లాప్స్‌తో అభిమానులను నిరాశ పరుస్తుండంతో వరుణ్‌ తేజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.&nbsp; స్క్రిప్ట్‌ మీదు అసలు శ్రద్ధ వహించడం లేదని విమర్శలు చేస్తున్నారు. మంచి హైట్‌, ఫిజిక్‌ ఉన్న నేపథ్యంలో విలన్‌గా ట్రై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాను వరుణ్‌ తేజ్‌ ఫాలో అయితే కెరీర్‌ బెటర్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.&nbsp; ‘మట్కా’ ఓటీటీ రిలీజ్‌ లాక్‌ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన 'మట్కా' (Matka OTT Release) చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘మట్కా’ (Matka)ను వీక్షించవచ్చని తెలిపింది. కాగా ఈ మూవీ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది.&nbsp; ‘మట్కా’ స్టోరీ ఇదే మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    నవంబర్ 30 , 2024
    <strong>Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?</strong>
    Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?
    నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్‌ చంద్ర, కిషోర్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, మైమ్‌ గోపి, రూపలక్ష్మీ తదితరులు రచన, దర్శకత్వం : కరుణ కుమార్‌ సంగీతం : జి. వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: కిషోర్‌ కుమార్‌ ఎడిటింగ్‌ : కార్తికేయ శ్రీనివాస్‌ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల విడుదల తేదీ: 14-11-2024 మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్‌ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review) కథేంటి మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోనితో పాటు నవీన్‌ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒకప్పటి గ్యాంగ్‌ స్టార్‌ రతన్‌ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్‌ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్‌ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్‌ అయ్యింది. కెమెరామెన్‌ కిషోర్‌ కుమార్‌ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పీరియాడిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి. వి. ప్రకాష్‌ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్&nbsp; వరుణ్‌ తేజ్ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Prabhas Upcoming Movies: </strong><strong>ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!</strong>
    Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్‌ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ లైనప్‌ (Prabhas Upcoming Movies) లో పెడుతూ ‌అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్‌ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్‌ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ తన సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌తో.. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘మాస్టర్‌’, ‘లియో’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు తెరకెక్కించి లోకేష్‌ కనగరాజ్‌ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్‌-లోకేష్‌ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. హిందీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్‌ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్‌ హిరానీ - ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘త్రీ ఇడియట్స్‌’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్‌ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్‌ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.&nbsp; కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో.. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్‌’ (Salaar) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్‌ కటౌట్‌ తగ్గ యాక్షన్‌ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్‌ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించారు. సలార్‌ మూవీ ఎండింగ్‌లో సెకండ్‌ పార్ట్‌కు సంబంధించిన లింక్‌ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్‌ - ప్రశాంత్ నీల్‌ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్‌ అయ్యింది. త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్‌ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్‌! ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies)&nbsp; ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ చెప్పిన కథకి ప్రభాస్‌ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్‌ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్‌ వర్మ చేతిలో రెండు బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘జై హనుమాన్‌’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మనే డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
    నవంబర్ 05 , 2024
    <strong>Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;
    ‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్‌ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్‌ జరగ్గా రానాపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.&nbsp; ‘రానా భయపెట్టాడు’ రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్‌’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్‌ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్‌ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్‌ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్‌ చేస్తూ సీరియస్‌ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్‌ లుక్‌ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1843720706057724332 కథ మార్చేసిన రజనీ వేట్టయన్‌ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్‌ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్‌ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేష్‌ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్‌, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్‌ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.&nbsp; రజనీపై తమిళ డైరెక్టర్‌ ఆరోపణలు సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. రజనీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌ 2’ చేయనున్నారు రజనీ.&nbsp;
    అక్టోబర్ 09 , 2024
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘రజనీ.. గందరగోళం చేసేశారు’ సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మూడు చిత్రాలకు వర్క్‌! దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.&nbsp; 33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..! రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ! సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్‌ 3 రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; దసరా బరిలో రజనీ చిత్రం రజనీ కాంత్‌ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కూలీ’లో స్టార్ క్యాస్ట్‌! ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్‌ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp;
    అక్టోబర్ 07 , 2024
    <strong>Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్</strong>
    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్
    తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.&nbsp; ‘రజనీ కంటే షూటింగ్‌ ముఖ్యం కాదు’ రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్‌ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్‌ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్‌ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్‌ పోర్షన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్‌ కనగరాజ్‌ మండిపడ్డారు. అక్టోబర్‌ 15 తర్వాత రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.&nbsp; రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే? రజనీకాంత్‌ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; కూలీలో స్టార్ క్యాస్ట్‌! రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp; సైమన్‌ యాక్షన్‌ సీన్‌ లీక్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ పోషిస్తున్న సైమన్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ గతంలో రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌&nbsp; చేశారు..&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582 లోకేష్‌పై పవన్‌ ప్రశంసలు కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్‌ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్‌ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్‌ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్‌’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్‌ వంటి స్టార్‌ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/i/status/1841446808888758277 https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
    అక్టోబర్ 05 , 2024
    <strong>Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!</strong>
    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!
    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది.&nbsp;వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌తో ఆ మూవీ ఉండనున్నట్లు చర్చించుకుంటున్నారు.&nbsp; ‘జైలర్‌’ డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా చిత్రం! మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ జూ.ఎన్టీఆర్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డాక్టర్‌, బీస్ట్ , జైలర్ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ స్టార్ డైరెక్టర్‌ నెల్సన్ దిలీప్ కుమార్‌తో తారక్‌ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తారక్‌కు నెల్సన్‌ కథ చెప్పారని అతి అతడికి బాగా నచ్చిందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని తెరెకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీస్ట్‌, జైలర్‌ హిట్స్‌తో నెల్సన్‌ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ముఖ్యంగా జైలర్‌తో రజినీకాంత్‌ను చూపించి తీరు అందరిని మెప్పించింది. అటువంటి డైరెక్టర్‌తో తారక్‌కు సినిమా పడితే రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.&nbsp; 2026 వరకూ ఆగాల్సిందే! తారక్ - నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం తారక్‌ 'వార్‌ 2' (War 2) పెండింగ్‌ షూటింగ్‌తో పాటు త్వరలో 'NTR 31'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అటు నెల్సన్‌ సైతం ‘జైలర్‌ 2’ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమా షూటింగ్ పూర్తికాగానే ‘జైలర్‌ 2’ షూటింగ్‌ మెుదలు కానుంది. ఇద్దరూ బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026లో ఈ సినిమా పట్టాలెక్క వచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో మూవీ చేయడం తనకు ఓకే అంటూ ఓపెన్‌గా ఇటీవల తారక్‌ ఆఫర్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో కూడా ఓ మూవీ ఉండే అవకాశం లేకపోలేదు.&nbsp; మా స్ట్రెంత్‌ అతడే: తారక్‌ 'దేవర' బ్లాక్‌ బాస్టర్‌ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తారక్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. కల్యాణ్‌ రామ్‌ బావమరిది (భార్య సోదరుడు) హరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘హరి ముందుకు ఎప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. చాలా మంది అతన్ని సరిగా అర్ధం చేసుకోరు. ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు. ఎవరేమి అన్నా, ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కి మూల స్థంభం హరి. నాకు, కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికీ స్ట్రెంత్ హరి. ఇందులో ఎటువంటి డోకా ఉండదు. నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు. నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు’ అని తారక్ అన్నారు. బంగ్లాదేశ్‌ రైతుగా జూ.ఎన్టీఆర్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌ ఫిక్సయ్యిందా? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 05 , 2024
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    Aho Vikramaarka Movie Review: నటనలో తేలిపోయిన మగధీర విలన్‌.. ‘అహో! విక్రమార్క’ ఎలా ఉందంటే?
    నటీనటులు : దేవ్‌ గిల్‌, చిత్రా శుక్ల, తేజస్విని పండిట్‌, ప్రవీణ్‌ టార్దే, పోసాని కృష్ణ మురళి, షియాజీ షిండే, కాలకేయ ప్రభాకర్‌, తదితరులు డైరెక్టర్‌ : పేట త్రికోఠి రచన, మాటలు : ప్రసాద్‌ వర్మ సంగీతం : రవి బస్రూర్‌ ఎడిటర్‌ : తమ్మిరాజు,&nbsp; నిర్మాతలు : దేవ్‌ గిల్‌, మిహిర్‌ సుధీర్‌, అశ్వనీ కుమార్‌ మిశ్రా విడుదల తేదీ : 30-08-2024 మగధీరలో విలన్‌గా చేసి నటుడు దేవ్‌ గిల్‌ (Dev Gill) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై మరికొన్ని తెలుగు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా చేసిన తాజా చిత్రం ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka Movie Review). త్రికోటి దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగ దేవ్‌ గిల్‌ సక్సెస్‌ అయ్యాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీలు పని కోసం వెళ్లి 25 ఏళ్లుగా కనిపించకుండా పోతారు. వారి ఆచూకి తెలియక, అసలు బతికున్నారో లేదో అర్థం కాక కుటుంబ సభ్యులు రోధిస్తుంటారు. ఈ క్రమంలోనే పూణే పోలీసు స్టేషన్‌కు ఎస్సైగా విక్రమార్క (దేవ్‌ గిల్‌) ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వస్తాడు. ఆపై డ్రాగ్‌ మాఫియా వ్యక్తి బిలాల్‌ (పోసాని కృష్ణమురళి)తో చేతులు కలిపి అక్రమాలకు తెరలేపుతాడు. ప్రేయసి అర్చన (చిత్రా శుక్లా) ప్రభావంతో నిజాయతీ గల పోలీసు ఆఫీసర్‌గా మారతాడు. విక్రమార్కలో మార్పుకు కారణమైన ఘటన ఏంటి? కూలి కోసం వెళ్లి మిస్సైన వారు ఏమయ్యారు? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? లేదా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే దేవ్‌ గిల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో యాక్షన్‌ కోసం అతడు పెద్దగా కష్టపడినట్లు కనిపించలేదు. అయితే లవ్ సీన్స్‌, భావోద్వేగ సన్నివేశాల్లో దేవ్‌ గిల్‌ పూర్తిగా తేలిపోయాడు. ముఖంలో హావభావాలు పలికించలేక బాగా తడబడ్డాడు. హీరోయిన్‌గా చిత్రా శుక్ల నటన బాగుంది. పాత్రకు తగ్గట్లు ఆమె ఒదిగిపోయారు. విలన్‌గా చేసిన ప్రవీణ్‌, ఏసీపీ భవానీగా నటించిన తేజస్విని పండిట్ ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే సెటిల్డ్‌ నటనతో మెప్పించారు. మిగతా పాత్రదారులు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు పేట త్రికోఠి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘టెంపర్‌’, ‘పటాస్‌’ చిత్రాలను గుర్తు చేస్తుంది. కథలో మాత్రం కొత్తదనం కనిపించదు. అటు కథనం కూడా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. కథకు తగ్గట్లు హీరో నుంచి నటన రాబట్టడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. హీరో-హీరోయిన్‌ మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. దేవ్‌ గిల్‌ హీరోయిన్‌ వైపు ప్రేమగా చూసిన అది విలన్‌ రోల్‌ను గుర్తు చేస్తుంటుంది. అయితే ఫైట్స్‌లో మాత్రం దర్శకుడు త్రికోఠి తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. విలన్లతో తలపడే క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ మంచి పనితీరు కనబరిచింది. రవి బస్రూర్‌ అందించిన సంగీతం పూర్తిగా తేలిపోయింది. నేపథ్య సంగీతం మాత్రమే అక్కడక్కడ కాస్త పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌నిర్మాణ విలువలు మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంహీరో నటనలాజిక్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 1.5/5&nbsp;&nbsp; .
    ఆగస్టు 30 , 2024
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌, అపర్ణ బాలమురళి, వినీత్‌ శ్రీనివాసన్‌, జిమ్మీ జీన్‌ లూయీస్‌, లీనా, సంతోష్‌ కీఝాత్తూర్‌, అకేఫ్‌ నజీం, శోభా మోహన్‌ తదితరులు దర్శకుడు : బ్లెస్సీ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : సునీల్‌ కే.ఎస్‌ నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్‌ లూయీస్‌, స్టీవెన్ ఆడమ్స్‌, కే.జీ అబ్రహం విడుదల తేదీ : 28-03-2024 ‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్‌ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్‌ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్‌ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్‌ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్‌. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్‌ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్‌ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్ స్లో నారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 28 , 2024
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    Chatrapathi Review: యాక్షన్‌ సీన్స్‌లో దుమ్మురేపిన బెల్లంకొండ.. ఛత్రపతితో హిట్‌ కొట్టినట్టేనా?
    నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, నుష్రత్‌ భరుచ్చా, కరణ్‌సింగ్‌ ఛబ్రా, సాహిల్ వేద్, అమీత్‌ శివదాస్‌, రాజేంద్ర గుప్త డైరెక్టర్‌: V.V. వినాయక్‌ సంగీతం: తనిష్క్‌ బాగ్చీ నిర్మాత : అక్షయ్‌, ధవల్‌, జయంతీ లాల్ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి.. తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచి ప్రభాస్‌కి మాస్ హీరో ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్‌లో మాస్ హీరోగా ఎదగడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని ఎంచుకున్నాడు. కాగా శ్రీనివాస్‌కు హిందీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయ్యి మంచి క్రేజ్‌ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునే క్రమంలో ఇవాళ ఛత్రపతి హిందీ సినిమా బాలీవుడ్‌లో రిలీజైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీనివాస్‌ నటన ఆకట్టుకుందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. కథ:&nbsp; ఛత్రపతి సినిమా కథ తెలుగు ప్రేక్షకలకు సుపరిచితమే. మారుమూల గ్రామంలో నివసించే మహిళ భాగ్యశ్రీకు ఇద్దరు పిల్లలు. అశోక్‌ (కరణ్‌ సింగ్‌ ఛబ్రా) సొంత బిడ్డ కాగా శివ (బెల్లంకొండ శ్రీనివాస్) పెంపుడు బిడ్డ. గ్రామంలోని వారంతా అనుకోకుండా ఊరిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ఆ గందరళగోళంలో శివ తల్లి నుంచి వేరుపడతాడు. అప్పటినుంచి తన తల్లిని వేతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో శివకు హీరోయిన్‌ సాయం చేస్తుంది. అయితే రోజువారీ కూలీగా ఉన్న శివ ఛత్రపతిగా ఎలా మారాడు? తన తల్లిని చేరుకున్నాడా? లేడా? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఛత్రపతి హిందీ వెర్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్స్‌లో తన మార్క్‌ను చూపిస్తూ దుమ్మురేపాడు. శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహం.. యాక్షన్‌ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫైట్ సీన్ల కోసం ఆయన పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎంతో స్టైలిష్‌గాను హీరో కనిపించాడు. నటన, డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. నటన పరంగా హీరోయిన్‌ నుష్రత్‌ భరుచ్చాకు పెద్ద స్కోపు లేదు. కేవలం పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నెగిటివ్‌ క్యారెక్టర్‌లో కరణ్‌సింగ్‌ ఛబ్రా ఆకట్టుకున్నాడు. సీనియర్‌ నటి భాగ్య శ్రీ, శరద్‌ ఖేల్కర్‌, ఫ్రెడ్డీ ధరువాలా, రాజేష్‌ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.&nbsp; విశ్లేషణ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ ఛత్రపతి గ్లింప్స్‌ను తిరిగి తీసుకురావడంలో విఫలమయ్యాడు. దశాబ్దం క్రితం వచ్చిన స్టోరీని ఇప్పటికీ అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుంటే బాగుండేది. ఇప్పటికే ఛ‌త్రపతి చూసిన వాళ్లకు సినిమా బోర్ కొట్టిస్తుంది. పాత కథనే మక్కీకి మక్కిగా తెర‌కెక్కించ‌డం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగిపోతుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమాలో ఏదైనా హైలెట్‌ సీన్స్‌ ఉన్నాయంటే అది యాక్షన్‌ సీన్స్‌ మాత్రమేనని ఆడియన్స్ చెబుతున్నారు. 1980-90లో వచ్చిన బాలీవుడ్‌ సినిమాను చూసినట్లు అనిపించిందని పేర్కొంటున్నారు. ఇక ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ ఛ‌త్ర‌ప‌తి ఒక‌ అవుట్ డేటెడ్ సినిమా అనే చెప్పాలి. ఫైట్స్‌ తప్ప సినిమాలో ఏమాత్రం పస లేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ హీరో నటనయాక్షన్‌ సీన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ పాటలురొటిన్‌ సీన్స్‌బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ రేటింగ్‌: 2/5
    మే 12 , 2023
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
    ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన అగ్ర నటుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్‌ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్‌ స్టార్‌ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్‌ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; నందమూరి తారకరామారావుతో.. టాలీవుడ్‌ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్‌ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్‌’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్‌ రెంటో కథానాయకుడిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా హీరోలుగా ‘ఖూన్‌ పసీనా’ పేరుతో రీమేక్‌ చేశారు.&nbsp; శోభన్‌ బాబుతో..&nbsp; నట భూషణ్‌ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్‌ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్‌ బాబు, రజనీకాంత్‌ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్‌ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్‌ కుమార్‌, శశికపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు.&nbsp; సూపర్‌ కృష్ణతో.. ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్‌ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్‌ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్‌’ (1978), ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.&nbsp; మెగాస్టార్‌ చిరంజీవితో..&nbsp; మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్‌ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.&nbsp; https://twitter.com/atheisttindian/status/1212794102867083265 డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుతో..&nbsp; తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్‌ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్‌ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.&nbsp; అక్కినేని నాగార్జునతో.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్‌ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్‌ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్‌ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్‌ షూట్‌ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు. జగపతి బాబుతో.. రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.  https://twitter.com/SolidLover123/status/1562791842898669568
    డిసెంబర్ 12 , 2024
    <strong>Pushpa 2 Day 2 Collection Worldwide: దారుణంగా పడిపోయిన ‘పుష్ప 2’ డే 2 కలెక్షన్స్‌.. ఎందుకంటే?</strong>
    Pushpa 2 Day 2 Collection Worldwide: దారుణంగా పడిపోయిన ‘పుష్ప 2’ డే 2 కలెక్షన్స్‌.. ఎందుకంటే?
    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం థియేటర్లను షేక్‌ చేస్తోంది. గురువారం (డిసెంబర్‌ 5) విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌ బన్నీ యాక్టింగ్‌ చూసి ఊగిపోతున్నారు. తాము ఊహించిన దాని కంటే అల్లు అర్జున్‌ నటన బాగుందని ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’పై జాతీయ స్థాయిలో బజ్ ఉండటంతో పాటు, సూపర్‌ హిట్‌ టాక్‌ లభించడంతో తొలి రోజు (Pushpa 2 Movie Box Office Collection) అన్ని చోట్లా భారీ ఓపెనింగ్స్‌ సాధించింది. ఇండియన్‌ హిస్టరీలో ఏ సినిమా సాధించని విధంగా తొలి రోజు రూ.294 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సెకండ్‌ డే వచ్చేసరికి పుష్ప 2 కలెక్షన్స్‌లో భారీ కోత పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  రెండో రోజు కలెక్షన్స్‌.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురువారం (డిసెంబర్‌ 5) వరల్డ్‌ వైడ్‌గా 12,500 పైగా థియేటర్లలో విడుదలైంది. దీనికితోడు బ్లాక్‌ బాస్టర్‌ టాక్ లభించడంతో ఈ మూవీకి రికార్డ్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. తొలి రెండ్రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.417.5 కోట్ల గ్రాస్‌ (Pushpa 2 Day 2 Collection Worldwide) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. రెండో రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.134.6 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌ (రూ.282 కోట్లు)తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయినట్లు స్పష్టమవుతోంది. 54 శాతం మేర ‘పుష్ప 2’ వసూళ్లలో కోత పడిందని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. కోతకు కారణమిదే! అయితే తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ (Pushpa 2 Day 2 Collection Worldwide) తగ్గడానికి ఓ కారణం ఉంది. డిసెంబర్‌ 5 ‘పుష్ప 2’ రిలీజ్‌ కాగా ముందు రోజు చాలా ఏరియాల్లో ప్రీమియర్స్‌ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌ 4 రా. 9:30, ఒంటి గంట తర్వాత స్పెషల్‌ షోస్‌ వేశారు. ఈ ప్రీమియర్స్‌కు ఒక్కో టికెట్‌ను రూ.1200కు పైగా విక్రయించారు. ఈ క్రమంలో డే 1 కలెక్షన్స్‌లో ఈ ప్రీమియర్స్‌ వసూళ్లను సైతం కలపడం వల్ల వసూళ్లు పెద్ద మెుత్తంలో కనిపించాయి. ఇక సెకండ్‌ డేకు వచ్చే సరికి టికెట్ల రేట్లు ప్రీమియర్స్‌తో పోలిస్తే తగ్గటం కూడా కలెక్షన్స్‌లో కోతకు కారణమైంది.  డే 1 కలెక్షన్స్‌ ఏరియాల వారీగా.. పుష్ప 2 చిత్రానికి తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.294 కోట్ల గ్రాస్‌ వసూలైనట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే హైయస్ట్‌ ఓపెనింగ్స్‌ అని ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కాగా, ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే రూ.190 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.92.36 కోట్లు, తమిళనాడు రూ. 10.71, కర్ణాటక రూ.17.89 కోట్లు, కేరళ రూ. 6.56 కోట్లు వసూలైనట్లు చెప్పాయి. హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ. 87.24 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.68.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1865012207060422928 రాజమౌళి రికార్డులకు పాతర తొలి రోజు కలెక్షన్స్‌తో ‘పుష్ప 2’ (Pushpa 2 Day 2 Collection Worldwide) చరిత్ర తిరగరాసింది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించి టాప్‌లో ఉంది. 'బాహుబలి 2' రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ ఆ రెండు చిత్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. రూ.294&nbsp; కోట్ల గ్రాస్‌తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాజమౌళి రికార్డులను పాతరేసి కొత్త బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసింది. అటు నార్త్‌లోనూ 'పుష్ప 2' చరిత్ర సృష్టించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హిందీలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా రూ. రూ.72 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా బాలీవుడ్‌ హీరోలకు సైతం బన్నీ కొత్త టార్గెట్‌ ఇచ్చాడు.&nbsp; https://twitter.com/MythriOfficial/status/1864976017733095871 కథేంటి ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp;
    డిసెంబర్ 07 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024

    @2021 KTree