• TFIDB EN
  • కరెన్సీ నగర్
    UATelugu
    సత్యకు రూ.5 లక్షలు అవసరమవుతాయి. దొంగతనం చేసైనా ఆ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. మాట్లాడే పెట్టెలో బంగారం ఉందని తెలుసుకొని దానిని ఎత్తుకెళ్తాడు. అయితే ఆ పెట్టె సత్యతో మూడు కథలు చెబుతుంది. ఆ కథలు విని సత్య ఏం చేశాడు? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    సుదర్శన్
    గౌతమ్ కుమార్
    మహేష్ యడ్లపల్లి
    స్పందన సోమన్న
    చందు ఛార్మ్స్
    సిబ్బంది
    వెన్నెల కుమార్ పోతేపల్లిదర్శకుడు
    కోడూరు గోపాల కృష్ణనిర్మాత
    ముక్కామల అప్పారావునిర్మాత
    కథనాలు
    <strong>Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?</strong>
    Mufasa: The Lion King: మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్‌ యానిమేషన్‌ చిత్రం 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌' (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్‌ 20న రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్‌ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్‌ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్‌’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్‌ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్‌’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.&nbsp; అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్‌ గార్డ్‌’ కామిక్‌ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్‌ రూపంలో ఈ టెలివిజన్‌ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం. టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్‌’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్‌ కింగ్‌’ పేరుతో 1994లో కార్టూన్‌ యానిమేషన్‌ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.&nbsp; ఆ తర్వాత 2016లో ‘ది లయన్‌ కింగ్‌’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్‌ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసింది.&nbsp; 'ది లయన్‌ కింగ్‌' (2019) వరల్డ్‌ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 - 260 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్‌ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.&nbsp; ఇప్పుడు ది లయన్‌ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్‌ కింగ్‌ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; ‘ది లయన్‌ కింగ్‌’ (2019), ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్‌ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్‌ స్టార్స్‌ వర్క్ చేశారు.&nbsp; అరోన్‌ పీరే (ముఫాసా), డొనాల్డ్‌ గ్లోవర్‌ (సింబా), బియాన్స్‌ (నాలా), బ్లూ ఇవి కార్టర్‌ (కియారా), జాన్‌ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్‌ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు. ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్‌ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ యానిమేషన్‌ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.&nbsp; ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.  2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ముఫాసా తెలుగు వెర్షన్‌ ఈసారి మరింత హైలేట్‌ కాబోతోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దీంతో మహేష్‌ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1859107736920969300 ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్రంలో స్టార్‌ కమెడియన్స్‌ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్‌ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పగా, టిమోన్‌ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.  https://twitter.com/thetalkenti/status/1866815051316785331 2019లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్‌ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్‌ పాత్రలకు వారు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.&nbsp; తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్‌ డబ్బింగ్‌ చెప్పారు. అర్జున్‌ దాస్‌ (ముఫాసా), అశోక్‌ సెల్వన్‌ (టాకా), నాజర్‌ (కిరోస్‌), వీటీవీ గణేష్‌ (యంగ్‌ రఫీకీ), సింగం పులి (టిమన్‌) డబ్బింగ్‌ చెప్పారు.  https://twitter.com/DisneyStudiosIN/status/1868564630416855209 హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి.
    డిసెంబర్ 18 , 2024
    <strong>Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం!</strong>
    Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 11 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో 'కల్కి' మేనియా కొనసాగుతోంది. అక్కడి ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. 11 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 11 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. https://twitter.com/VyjayanthiFilms/status/1810220707357565060 నార్త్‌ అమెరికాలో రికార్డు కల్కి సినిమాకు నార్త్‌ అమెరికాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. అక్కడి సినీ లవర్స్‌ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మెుదటి 9 రోజుల్లోనే ఈ చిత్రం 14.82 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు ట్రెడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.123.76 కోట్లకు సమానమని పేర్కొన్నాయి. ఈ వీకెండ్‌కు భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా జరిగినట్లు చెబుతున్నారు. https://twitter.com/PrathyangiraUS/status/1809472342265065863 రూ.1000 కోట్లకు అడుగు దూరంలో! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇంకో రూ.100 కోట్లు సాధిస్తే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. తద్వారా రిలీజ్‌కు ముందు పెట్టుకున్న టార్గెట్‌ను అందుకుంటుంది. బుధవారం నాటికి రూ.1000 కోట్ల మార్క్‌ను కల్కి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకూ ఏ కొత్త సినిమా లేకపోవడం కల్కికి కలిసిరానుంది. కలెక్షన్స్‌ మరింత పెరగనున్నాయి. https://twitter.com/i/status/1808841062838063340 డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1806617136690839769 ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 08 , 2024
    <strong>Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!</strong>
    Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27) విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కల్కి సినిమా చూసి అదిరిపోయిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక తొలిరోజు రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిందోనని యావత్‌ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించిన వీకెండ్ కలెక్షన్స్ అంకెలు మతిపోగొడుతున్నాయి. హీరో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ స్టామినాకు అద్దం పడుతున్నాయి.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. వీకెండ్‌లో (గురు, శుక్ర, శని, ఆదివారాలు) వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన కల్కి.. తొలి నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్‌ సాధించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కల్కి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ను కల్కి రికవరి చేయడం విశేషం. కాగా, మరోవారం రోజులపాటు కొత్త సినిమాలు ఏవి విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కి కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వసూలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘కల్కి’ కొత్త చరిత్ర ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికా ఆడియన్స్‌ కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా అక్కడ కల్కి కొత్త చరిత్రను సృష్టించింది. నార్త్‌ అమెరికాలో మెుదటి వారంతంలో 11 మిలియన్‌ డాలర్ల వసూళ్లను ‘కల్కి 2898 ఏడీ’ రాబట్టింది. ఒక ఇండియన్‌ సినిమా.. వీకెండ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం నార్త్‌ అమెరికాలో ఇదే తొలిసారి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.91 కోట్లకు సమానం. ఏడేళ్లుగా నార్త్ అమెరికాలో పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్‌ను ‘కల్కి’ తొలి నాలుగు రోజుల్లోనే చెరిపేయడం విశేషం. ప్రస్తుత అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే రానున్న రోజుల్లో కల్కి మరిన్ని రికార్డులను నార్త్‌ అమెరికాలో క్రియేట్‌ చేస్తుందని చెప్పవచ్చు.&nbsp; నార్త్‌లో కల్కి ప్రభంజనం ప్రభాస్‌ కల్కి చిత్రం.. నార్త్‌ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూసేందుకు విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా హిందీ భాషలో కల్కి తొలి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.115 కోట్లకు (GROSS) పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ కలిపి) వీకెండ్‌లో రూ.171.15 కోట్లను ప్రభాస్‌ చిత్రం వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ.19.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. కల్కి బాక్సాఫీస్‌ సునామి మరిన్ని రోజులు కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి.&nbsp;
    జూలై 01 , 2024
    Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
    Bujji And Bhairava Review: ‘బుజ్జి - భైరవ’ పాత్రలపై క్లారిటీ వచ్చేసిందోచ్‌.. క్లిక్‌ అయితే సూపర్‌ హిట్టే!
    ప్రస్తుతం యావత్‌ దేశం ఆసక్తికగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లోబల్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, AI సాయంతో ఆలోచించే మెషీన్‌.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. అసలు భైరవ, బుజ్జి ఎవరు? ఎలా కలిశారు? అన్న పాయింట్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు కల్కి టీమ్ వినూత్న ఆలోచన చేసింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava Review) పేరుతో అమెజాన్‌ ప్రైమ్‌లో యానిమేటెడ్‌ సిరీస్‌ను విడుదల చేసింది. తొలిగా రెండు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి. మరో రెండు ఎపిసోడ్లు సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేయనున్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అయిన రెండు ఎపిసోడ్స్‌లో ఏం ఉంది? బుజ్జి, బైరవ పాత్రలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. బుజ్జి ఎవరో తెలుసా? బుజ్జికి సంబంధించిన సమాచారాన్ని ఈ యానిమేటెడ్‌ సిరీస్‌లో క్లుప్తంగా చూపించారు. BU - JZ - 1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌యే బుజ్జి. ఈ డివైస్‌ను ఒక శక్తివంతమైన షిప్‌కు కనెక్ట్‌ చేయడం సిరీస్‌లో చూపించారు. ఆ షిప్‌ 99 మిషన్లను విజయవంతంగా&nbsp; పూర్తి చేసి 100వ మిషన్‌లో ఉండగా దానిపై దాడి జరుగుతుంది. వెహికిల్ నాశనం అయిపోయి గ్లింప్స్‌లో చూపించిన ప్రధాన డివైస్ మాత్రం మిగులుతుంది. ఈ దాడితో కాంప్లెక్స్‌ (గ్లింప్స్‌లో చూపించిన పెద్ద ట్రయాంగిల్‌)కి షిఫ్ట్&nbsp; అయిపోవాలన్న బుజ్జి కల చెల్లాచెదురైపోతుంది. అయితే ఈ చిన్న డివైస్‌ను ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై BU - JZ - 1 కోడ్ నేమ్ మొత్తాన్ని కలిపి ‘బుజ్జి’ అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది. క్రేజీగా భైరవ పాత్ర? బుజ్జిలాగానే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌కి షిఫ్ట్ అయిపోవాలని కలలు కంటుంటాడు. కానీ, దానికి ఒక మిలియన్ యూనిట్స్ (క్రిప్టో కరెన్సీలాంటిది) అవసరం అవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు భైరవ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో భైరవ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది చూపించలేదు. భైరవ ఉండే ఇంటి ఓనర్‌గా బ్రహ్మానందం కనిపించడం విశేషం. రెండు ఎపిసోడ్‌ల సిరీస్‌లో బ్రహ్మానందం, ప్రభాస్‌ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి. శంభల నగరం మహా విష్ణువు పదో అవతారమైన కల్కి... శంభల నగరంలో పుడతాడని మన పురాణాల్లో ఉంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ సిరీస్‌లో చూపించారు. కాంప్లెక్స్‌కు వెళ్తున్న వెహికిల్స్‌పై శంభల సిటీకి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఆహారాన్ని కొల్లగొడతారు. శంభల సిటీలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్‌లో ఒకరు సినిమా గ్లింప్స్‌లో చూపించిన పశుపతిలా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంభల నగరానికి సంబంధించిన రెబల్ అనుకోవచ్చు. కల్కి- భైరవ వేర్వేరు పాత్రలా! మన పురాణాల ప్రకారం కల్కి శంభల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిన్నప్పుడు శంభల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా? లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలపై కల్కి సినిమాలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.&nbsp; సిరీస్‌ స్టోరీ ఏంటి? కల్కి సినిమా మెుదలయ్యే రెండేళ్ల కాలానికి ముందు కథ జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా కార్గో వెహికల్‌లో పనిచేసే ఏఐ మెషీన్‌ బుజ్జికి ప్రమోషన్‌ వస్తుంది. కాంప్లెక్స్‌ మెంబర్‌ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్‌ కావడానికి సిద్ధమవుతుంటుంది. ఈ క్రమంలో చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుండగా రెబల్స్‌ అటాక్‌ చేసి, ఆ షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్‌ సిటీతో కనెక్షన్‌ కట్‌ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ పట్టణంలోని చిల్లర దొంగతనాలు చేసే భైరవ (ప్రభాస్‌) కూడా కాంప్లెక్స్‌లో మెంబర్‌ కావాలని అనుకుంటాడు. దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్‌ ముక్కలైపోవడంతో దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్‌ కారును ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సిరీస్‌ స్టోరీ. Telugu.yousay.tv Rating : 3/5  
    జూన్ 01 , 2024
    <strong>Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్‌ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!</strong>
    Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్‌ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
    భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలకు ఇండియన్‌ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్‌ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్‌, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; పుతిన్ ఏమన్నారంటే? ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్‌’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్‌ సమావేశాల నేపథ్యంలో పుతిన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్‌ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్‌ తెలిపారు. 24 గంటలూ ఇండియన్‌ మూవీస్‌ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్‌ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్‌ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు. https://twitter.com/RT_com/status/1847495389303144506 ‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా! ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్‌ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్‌ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్‌ 8న రష్యాలో నేరుగా రిలీజ్‌ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్‌ రూబెల్స్‌ను కలెక్ట్‌ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్‌ ఇండియన్‌ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది.&nbsp; ‘పుష్ప 2’కి కలిసి రానుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ లేటెస్ట్‌ కామెంట్స్‌ ‘పుష్ప 2’ టీమ్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్‌ 6న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్‌కు తాము సహకరిస్తారమని పుతిన్‌ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్‌ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్‌ రిలీజ్‌లో భాగంగా రష్యన్‌ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్‌ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.&nbsp; హైప్‌ పెంచేసిన దేవిశ్రీ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్‌ అద్భుతం అంటూ సినిమాపై హైప్‌ పెంచేశారు. అటు 'పుష్ప 2' నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు.&nbsp; https://twitter.com/Cinema__Factory/status/1845798162478272773 మృణాల్‌తో ఐటెం సాంగ్‌! ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ&nbsp; అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్‌ సాంగ్‌ కోసం మృణాల్‌ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్‌ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. https://twitter.com/villan_97/status/1845762894119801258
    అక్టోబర్ 19 , 2024

    @2021 KTree