• TFIDB EN
  • డీజే టిల్లు (2022)
    U/ATelugu2h 4m

    డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @phps1317570403

    23 days ago

    తారాగణం
    సిద్ధు జొన్నలగడ్డబాల గంగాధర్ తిలక్ అకా డీజే టిల్లు
    నేహా శెట్టిఎం. రాధిక
    ప్రిన్స్ సెసిల్క్లబ్ యజమాని
    బ్రహ్మాజీఇన్‌స్పెక్టర్ రావు
    ఫిష్ వెంకటయ్యహెడ్ కానిస్టేబుల్ చేప
    ప్రగతి మహావాదిన్యాయమూర్తి I. శారదా దేవి
    నర్రా శ్రీనివాస్చంద్రకాంత్
    రాజా రవీందర్సంగీత దర్శకుడు
    కిరీటి దామరాజురాధిక ప్రియుడు
    సిబ్బంది
    విమల్ కృష్ణదర్శకుడు
    సూర్యదేవర నాగ వంశీనిర్మాత
    శ్రీచరణ్ పాకాలసంగీతకారుడు
    నవీన్ నూలిఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్‌’లో అనుపమా అందాల ఆరబోతకు ఇంత డబ్బు తీసుకుందా?
    యంగ్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పేరు చెప్పగానే క్లాస్‌ లుక్స్‌, పద్దతిగా ఉండే పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే 'డీజే టిల్లు 2' సినిమాలో ఈ భామను చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.  ఎందుకంటే రీసెంట్‌గా రిలీజైన  'డీజే టిల్లు 2' ట్రైలర్‌ ఈ భామను చూసిన వారంతా నోరేళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో అనుపమా గట్టిగానే అందాలు ఆరబోసినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.  తాజా ట్రైలర్‌లో ఈ భామ హీరో సిద్ధుతో ఓ సీన్‌లో ఘాటైన ముద్దు సీన్‌లో కనిపించింది. ఇది చూసిన అనుపమా ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు. ఒకప్పుడు చూసిన అనుపమానేనా తాము చూస్తోందని ప్రశ్నించుకుంటున్నారు.  కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' (Rowdy Boys) సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి అందరికి షాకిచ్చింది.  ఆ సినిమాలో ఒక్క లిప్‌లాక్‌కే పరిమితం కాలేదు ఈ కేరళ కుట్టి. నాలుగైదు సన్నివేశాల్లో హీరో ఆశిష్ పెదాలను తన అదరాలతో లాక్ చేసేసింది. హీరో పెదాలకు ఊపిరి ఆడకుండా ముద్దులిచ్చింది.  రౌడీబాయ్స్ సినిమాలో బెడ్ రూం సీన్లకు కూడా అనుపమ ఒకే చెప్పేసింది. నిర్మొహమాటంగా నటించి రొమాన్స్‌ని పండించింది. ఈ సినిమా విడుదలయ్యాక అనుపమ రొమాన్స్ సీన్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి.  దీని తర్వాత మళ్లీ ‘కార్తికేయ 2’, ‘18 పేజీస్’ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించి ఒకప్పటి అనుపమాను గుర్తు చేసింది. ఈ చిత్రాల్లో తన అందం, అభినయంతో అనుపమా ఆకట్టుకుంది.  ఇప్పుడు 'డీజే టిల్లు 2' ఈ భామ పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడంతో పాటు ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమ గతంలో చేయలేదు. ఇదే ఆమెకు తొలిసారి.  అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం అనుపమా గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసున్న అనుపమ.. 'టిల్లు స్వ‍్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.  గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. .  కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' (Premam) మూవీతో హీరోయిన్ అయిపోయింది. నితీన్‌ హీరోగా చేసిన 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. ఎక్కడా గీత దాటలేదు. మాస్‌ మహారాాజా రవితేజ లేటెస్ట్ చిత్రం ఈగల్‌ (Eagle)లోనూ అనుపమా మెరిసింది. ఇందులో జర్నలిస్టు పాత్ర పోషించి మంచి నటనను కనబరిచింది.  అలాగే తమిళంలో 'సైరెన్‌' అనే సినిమాలో ఈ కేరళ కుట్టి నటించింది. ఈ చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది.  ప్రస్తుతం మలయాళంలో 'JSK Truth Shall Always Prevail' అనే సినిమాలో నటిస్తున్న వికిపీడియాను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉన్నట్లు సమాచారం. 
    ఫిబ్రవరి 21 , 2024
    <strong>Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!</strong>
    Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!
    యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్‌) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్‌ 3’లో ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; ఆ స్టార్ హీరోయిన్లు ఎవరంటే? ‘టిల్లు స్క్వేర్‌’ బ్లాక్ బాస్టర్ కావడంతో ‘టిల్లు క్యూబ్‌’ను అంతకుమించి రూపొందించేలా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్లాన్‌ చేస్తున్నారు. కీలకమైన హీరోయిన్‌ పాత్రకు స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందా? అన్న యోచనలో చిత్ర యూనిట్ ఉంది. అంతేకాదు వారి పరిశీలనలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నట్లు లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుస్తోంది. సమంత (Samantha), తమన్నా (Tamannah Bhatia)ను ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్‌ భావిస్తోందట. షూటింగ్‌ ప్రారంభం లోపు దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్‌ పరంగానూ ఈ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్లాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; సినిమా అంతా ఫారెన్‌లోనే! ‘డీజే టిల్లు’లో అందాలు ఆరబోసిన హీరోయిన్‌ నేహా శెట్టి.. ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. దీంతో ఇదే ఫార్మూలాను టిల్లు క్యూబ్‌లోనూ రిపీట్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టితో పాటు సీక్వెల్‌లో చేసిన అనుపమా పరమేశ్వరన్‌ కూడా మెరవనున్నట్లు సమాచారం. అయితే మెయిన్‌ హీరోయిన్‌గా మాత్రం స్టార్ నటి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పార్ట్‌-3’ కథ అంతా ఫారెన్‌లోనే జరుగుతుందట.కాగా,ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్‌తో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘టిల్లు క్యూబ్’ సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ.. సిద్దూకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు తెలుస్తోంది. &nbsp; టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా&nbsp; మొదలుపెడతానని స్పష్టం చేశాడు. https://twitter.com/i/status/1774843442021196268
    ఏప్రిల్ 12 , 2024
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    Tillu Square sequel: టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా?... మూవీ మేకర్స్ క్లారిటీ!
    టాలీవుడ్‌లో ఈ ఏడాదిలో మరో బ్లాక్ బాస్టర్ చిత్రం టిల్లు స్కేర్ అని చెప్పాలి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), క్యూట్ గల్ అనుపమ పరమేశ్వరణ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. నాగ్ అశ్వీన్ నిర్మాణంలో దర్శకుడు మల్లిక్ రామ్ డెరెక్ట్ చేసిన టిల్లు స్కేర్ చిత్రానికి మేకర్స్ అనుకున్నదానికంటే ఎక్కువ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి తిరిగి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ ఓటిటి డీల్‌కి సంబంధించి క్రేజీ బజ్ తెలిసింది. టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఉందా? డీజే టిల్లు నుంచి 'టిల్లు స్కేర్' సీక్వేల్‌గా వచ్చింది. మరి టిల్లు స్కేర్ నుంచి మరో సీక్వేల్ వస్తే బాగుంటుందని ఈ సినిమా హిట్ తర్వాత అభిమానులు అనుకుంటున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ బజ్ ఉండగా.. సినిమా విడుదల తర్వాత ఇది కాస్త ఎక్కువైంది. అయితే ఇదే విషయంపై మేకర్స్ టిల్లు స్క్వేర్‌ విడుదల తర్వాత స్పష్టత ఇచ్చారు. డీజే టిల్లు చిత్రం క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వ లేదు. దీంతో మరో సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. అయితే ప్రేక్షకుల మదిలో ఎక్కడో ఓ మూలన టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.&nbsp; టిల్లు స్కేర్‌కు సీక్వేల్ ఇస్తే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేక పోతే ఇబ్బందుల్లో పడుతామని తొలుత మేకర్స్ ఆలోచించారు. ఇదే విషయాన్ని&nbsp; చిత్ర నిర్మాత నాగ్ వంశీ కూడా తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో టిల్లు క్యూబ్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నిజానికి మీడియా నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సీక్వేల్‌పై ఓ ఐడియా ఇచ్చారు. ఇదే విషయంపై హీరో సిద్ధూ నేను మాట్లాడుకున్నాం. అతి త్వరలోనే&nbsp; చేద్దామని నిర్ణయించుకున్నాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ స్లో మోషన్‌ మీద టిల్లు 3 అనౌన్స్ చేస్తాం. సోమవారం నుంచి ప్రేక్షకులకు అది కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. టిల్లు క్యూబ్ అనౌన్స్ చేయడంలో డీజే టిల్లు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. https://twitter.com/GulteOfficial/status/1773664243654471818?s=20
    మార్చి 30 , 2024
    <strong>EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!</strong>
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?&nbsp; టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.&nbsp; టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి&nbsp; https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.&nbsp; లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.&nbsp; టిల్లు:&nbsp; పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.&nbsp; టిల్లు:&nbsp; నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.&nbsp; టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ&nbsp; టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది. &nbsp;అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.&nbsp; నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'&nbsp; https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..&nbsp; టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..&nbsp; టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:&nbsp; డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..&nbsp; లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..&nbsp; టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..&nbsp; మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:&nbsp; లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:&nbsp; నాదా...? నా హార్ట్ చాలా వీకూ..&nbsp; ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:&nbsp; నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..&nbsp; పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్: &nbsp;ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    <strong>Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!</strong>
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.&nbsp; యువ నటుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న రిలీజ్‌ కానుంది.&nbsp; ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.&nbsp; నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్‌ 6, 1999లో జన్మించింది.&nbsp; సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. మిస్‌ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; 2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.&nbsp; పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా చేశాడు.&nbsp; ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.&nbsp; 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.&nbsp; యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో చెరగని ముద్ర వేసింది.&nbsp; ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్‌ రంజన్‌' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.&nbsp; ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.&nbsp; యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.&nbsp; ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.&nbsp; ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు.&nbsp;
    ఏప్రిల్ 13 , 2024
    Tillu Square Day 1 Collections: హిట్ కొట్టిన టిల్లు భయ్యా.. తొలి రోజే కలెక్షన్ల సునామి!
    Tillu Square Day 1 Collections: హిట్ కొట్టిన టిల్లు భయ్యా.. తొలి రోజే కలెక్షన్ల సునామి!
    స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ చిత్రానికి మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది.  భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకుని పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.23.7కోట్ల గ్రాస్(Tillu Square Day 1 Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.12 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.11 కోట్లు గ్రాస్ రాబట్టింది. 'అట్లుంటది మనతోని' అంటూ టిల్లు స్కేర్ ప్రభంజనాన్ని పోస్టర్‌ ద్వారా మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పారు. శని, ఆది( వీకెండ్స్‌)  ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్‌ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సిద్ధు జొన్నలగడ్డ  గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్‌ డే 1 కలెక్షన్స్‌గా చెప్పవచ్చు.  నెట్ వసూళ్లు ఎంతంటే? ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Day 1 1 Net Collections) తొలి రోజు మంచి షేర్ రాబట్టింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.11.2 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ ఎంతంటే? సిద్ధు జొన్నలగడ్డ&nbsp; గత చిత్రం 'డీజే టిల్లు చిత్రం' బ్లాక్‌ బాస్టర్‌ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 24కోట్లుగా ఉంది. ప్రస్తుతం టిల్లు స్కేర్ హిట్‌ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టం కాదు. మరో రెండు రోజుల్లో సులభంగా ఈ టార్గెట్‌ను రీచ్ చేసే అవకాశం ఉంది.&nbsp; టిల్లు స్కేర్ సక్సెస్‌కు కారణం ఇదే! స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్‌ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి. https://telugu.yousay.tv/tillu-square-review-in-telugu-tillu-square-is-a-hit-with-comedy-timing-how-is-the-sequel.html https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 30 , 2024
    <strong>Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?</strong>
    Tillu Square Weekend Collections: మూడు రోజుల్లో టిల్లు స్కేర్ ప్రభంజనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో టిల్లు?
    స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ప్రేక్షకుల నుంచి ఎక్కువ రెస్పాన్స్&nbsp; వస్తుండటంతో.. వసూళ్లు భారీగా రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.68.1 కోట్ల గ్రాస్(Tillu Square&nbsp; Weekend Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్‌గా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఏ టాలీవుడ్ మూవీ రాబట్టలేదు. ఈ చిత్రం ఈవారంలో రూ.100కోట్ల మార్క్‌ను అవలీలగా దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు.&nbsp; ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.37 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.31కోట్లు గ్రాస్ రాబట్టింది.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ&nbsp; గత చిత్రాల్లో టిల్లు స్కేర్ కలెక్షన్లు ఓ మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. నెట్ వసూళ్లు ఎంతంటే? ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Weekend Net Collections)&nbsp; మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.40-45 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలిసింది. లాభాల్లో టిల్లు స్కేర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండటంతో... మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ&nbsp; గత చిత్రం 'డీజే టిల్లు చిత్రం' బ్లాక్‌ బాస్టర్‌ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్‌ బిజినెస్‌ బాగానే(Tillu Square 3days Collections) జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 24కోట్లుగా ఉంది. ఇప్పటికే ఈ టార్గెట్‌ను దాటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు రూ.15కోట్ల లాభం కళ్లజూపింది. టిల్లు స్కేర్ సక్సెస్‌ కారణం ఇదేనా? స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్‌ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి. ఓటీటీ పార్ట్నర్‌&nbsp; ఫిక్స్ టిల్లు స్కేర్ ఓటీటీ ప్రసార హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకుంది. చూసుకుంటే టిల్లు స్కేర్ మంచి నెంబర్‌నే సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం... ఓటీటీ ద్వారా గట్టి నెంబర్ సాధించడం పట్ల మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టిల్లు క్యూబ్&nbsp; మరోవైపు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో ఈరోజు నుంచి ఈ ప్రకటన వేయనున్నట్లు పేర్కొన్నారు.
    ఏప్రిల్ 01 , 2024
    <strong>This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;</strong>
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.&nbsp; గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన&nbsp; తాజా చిత్రం&nbsp; ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter&nbsp;MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.&nbsp; హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.&nbsp; సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది.&nbsp;
    మార్చి 21 , 2024
    <strong>సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు సినిమా సక్సెస్‌తో యూత్‌లో మంచి గుర్తింపు పొందాడు. తనదైన స్లాంగ్, మెనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సిద్ధు జొన్నల గడ్డ అసలు పేరు? సిద్ధార్థ జొన్నలగడ్డ సిద్ధు జొన్నల గడ్డ ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు సిద్ధు జొన్నలగడ్డ తొలి సినిమా? జోష్ చిత్రం ద్వారా సిద్ధు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. &nbsp;హీరోగా అతను నటించిన తొలి చిత్రం 'పెళ్లికి ముందు జీవితం'&nbsp; సిద్ధు జొన్నలగడ్డ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్, తెలంగాణ సిద్ధు జొన్నలగడ్డ పుట్టిన తేదీ ఎప్పుడు? 1992 సిద్ధు జొన్నలగడ్డకు వివాహం అయిందా? &nbsp;ఇంకా కాలేదు సిద్ధు జొన్నల గడ్డ ఫెవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన సినిమా? అర్జున్ రెడ్డి, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అల వైకుంఠపురములో సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో? వెంకటేష్ సిద్ధు జొన్నలగడ్డ తొలి హిట్ సినిమా? గుంటూరు టాకీస్ చిత్రం సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే డిజే టిల్లు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన కలర్? బ్లాక్ సిద్ధు జొన్నలగడ్డ తల్లిదండ్రుల పేర్లు? శారద, సాయి కుమార్ జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చదివాడు? ఇంజనీరింగ్, MBA సిద్ధు జొన్నలగడ్డ అభిరుచులు బైక్ రైడింగ్, మోడలింగ్ సిద్ధు జొన్నలగడ్డ ఎన్ని సినిమాల్లో నటించాడు? సిద్ధు 2024 వరకు 13 సినిమాల్లో నటించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డకు ఇష్టమైన ఆహారం? బిర్యాని సిద్ధు జొన్నలగడ్డ నికర ఆస్తుల విలువ ఎంత? రూ. 7కోట్లు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి ఎంత తీసుకుంటాడు? సిద్ధు ఒక్కో సినిమాకి దాదాపు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటాడు . సిద్ధు జొన్నలగడ్డకు స్మోకింగ్ అలవాటు ఉందా? చాలా సందర్భాల్లో స్మోకింగ్ అలవాటు ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ మద్యం తాగుతాడా?&nbsp; అవును, వీక్లీ వన్స్ తాగుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు https://www.youtube.com/watch?v=i817fCTiZ3g
    మార్చి 21 , 2024
    <strong>నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. &nbsp;నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ముద్దు పేరు? &nbsp;నేహా &nbsp;నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;నేహా శెట్టి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి&nbsp; ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే &nbsp;నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి&nbsp; ఏం చదివింది? డిగ్రీ &nbsp;నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. &nbsp;నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=p4XBBBW5STM
    ఏప్రిల్ 13 , 2024
    <strong>Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?</strong>
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్‌, ప్రణీత్‌ రెడ్డి కల్లెం, ఫిష్‌ వెంకట్‌, రాజ్‌ తిరణ్‌దాస్‌, శ్రీరామ్‌ రెడ్డి తదితరులు.. దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌ సంగీతం: రామ్‌ మిర్యాల, శ్రీచరణ్‌ పరకాల, ఎస్‌.ఎస్‌ థమన్‌, సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు ఎడిటింగ్‌ : నవీన్ నూలి నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ విడుదల తేదీ : 29-03-2024 సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి ‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్‌ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్‌, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. డైరెక్షన్‌ ఉందంటే డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్‌’ను కూడా ఫన్‌ &amp; ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. అయితే కామెడీ, డైలాగ్స్‌ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్‌ విషయంలో మల్లిక్‌ రామ్‌ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్‌, కామెడీ పరంగా చూస్తే మల్లిక్‌ రామ్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ సిద్ధు జొన్నలగడ్డ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్ రొటీన్ స్టోరీఆకట్టుకోని ట్విస్టులు Telugu.yousay.tv Rating : 3.5/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 29 , 2024
    Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న&nbsp; మీనాక్షి చౌదరి
    Meenakshi Chaudhary: నాజూకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తున్న&nbsp; మీనాక్షి చౌదరి
    కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది మీనాక్షి చౌదరి. తన నటన, అందంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; హర్యానా అందాల తెగింపు మీనాక్షి చౌదరి మరోసారి అందాల విందు చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ పెట్టి కవ్విస్తోంది. 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' చిత్రంలో ఈ భామ నటిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి నాజుకైన నడుమందాలతో సోగసుల పసందు చేస్తోంది. నాభి అందాలను ఏకరువు పెడుతూ గిలిగింతలు పెడుతోంది.&nbsp; అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్-2’లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత రవితేజ పక్కన ‘ఖిలాడి’ మూవీలో నటించి అందాల జాతర చేసింది. ఈ సినిమా పెద్దగా హిట్‌ కాకపోవడంతో ఈ సుందరాంగి కెరీర్ సైడ్‌ ట్రాక్‌లోకి వెళ్లింది. గుంటూరు కారంతో పాటు, ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న డీజే టిల్లు సిక్వేల్‌లో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇక మీనాక్షి చౌదరి వ్యక్తిగత&nbsp; విషయానికి వస్తే.. సినిమాల్లోకి రాకముందు ఈ చక్కనమ్మ.. తొలుత కొన్ని సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల్లో నటించింది.&nbsp; 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఈ సుందరాంగి.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేట్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో పెద్ద ఎత్తున ఫాలోవర్లను సంపాదించుకుంది. తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతోంది. నాజుకైన నాభి అందాలతో సెగలు పుట్టిస్తోంది.
    జూలై 05 , 2023
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    Tollywood Heroines: యంగ్‌ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
    స్టార్‌ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్‌ హీరోయిన్‌ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, అనుష్క శెట్టి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు యంగ్‌ హీరోలతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరుస ఫ్లాపులు, చేతిలో సినిమాలు లేకపోవడంతో వీరంతా చిన్న హీరోలతోనూ రొమాన్స్‌ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.&nbsp; సమంత అగ్రకథానాయిక అయిన సమంత.. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ‘ఖుషీ’ సినిమా పూర్తికాగనే ఆ చిత్రం పట్టాలెక్కుతుందని టాక్.&nbsp; సమంత - సిద్ధూ జంటగా చేయబోయే సినిమాకు మహిళా డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ కథను సిద్ధూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.&nbsp; ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమాలోనూ సమంతకు జంటగా యంగ్‌ హీరో దేవ్‌ మోహన్‌ నటిేంచాడు. సినిమా ఫ్లాప్‌ అయినా వీరి మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి సినిమాల ద్వారా హీరోయిన్‌ అనుష్క శెట్టి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ కుడా యంగ్‌ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.&nbsp; ‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో యువ హీరో నవీన్‌ పొలిశెట్టికి జోడీగా నటించింది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనుష్క కెరీర్‌ను 2015లో వచ్చిన జీరో సైజ్‌ సినిమా దెబ్బతీసింది. సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తిరిగి తగ్గలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.&nbsp; రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మహేష్‌, రవితేజ, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, తారక్‌, రామ్‌పోతినేని వంటి స్టార్ హీరోలతో జత కట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిగా ఓ వెలుగు వెలుగింది.&nbsp; గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో రకుల్‌ సింగ్‌ తర్జనభర్జన అవుతోంది. దీంతో యంగ్‌ హీరోలతోనూ సినిమా చేసేందుకు వెనకాడటం లేదు. 2021లో వచ్చిన కొండ పొలం సినిమాలో యంగ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ సరసన రకూల్ నటించింది.&nbsp; కొండ పొలం సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించి రకూల్‌ మెప్పించింది. తెలివిగల గిరిజన యువతి పాత్రలో ఒదిగిపోయింది. వైష్ణవ్‌ - రకూల్‌ జంటకు కూడా మంచి మార్కులే పడ్డాయి.&nbsp; తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో కుర్ర హీరోలతో సైతం నటించేందుకు ఈ బ్యూటీ సై అంటోంది.&nbsp; 2021లో వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినప్పటికీ వారి జంటకు మాత్రం మంచి పేరే వచ్చింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.&nbsp; కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రానికి రీమేక్‌గా ‘గుర్తుందా శీతాకాలం ’ సినిమా తీశారు. డైరెక్టర్‌ నాగశేఖర్‌ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.&nbsp;
    మే 24 , 2023
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా&nbsp; సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా&nbsp; సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)&nbsp; మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.&nbsp; తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.&nbsp; కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి&nbsp; ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),&nbsp; 'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
    ఆగస్టు 03 , 2023
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; పుష్ప 2 అల్లుఅర్జున్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ - 2&nbsp; దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. డబల్‌ ఇస్మార్ట్‌ రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్‌ డైరెక్షన్‌‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్‌ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.&nbsp; గూఢచారి 2 యంగ్‌ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్‌, ప్రీ లుక్‌ టీజర్‌ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్‌ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్‌ పార్ట్‌ తిరగనుందని సమాచారం.&nbsp; హిట్‌ 3 తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ చిత్రం హిట్‌ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. హిట్‌-2 (HIT 2)లో అడవిశేష్‌ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్‌-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను హింట్‌ ఇచ్చేశారు. ఇందులో అర్జున్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రను నాని పోషించనున్నాడు.&nbsp; ప్రతినిధి-2 యంగ్‌ హీరో నారా రోహిత్‌ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్‌ 15న టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.&nbsp; బింబిసార 2 గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్‌.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.&nbsp; సలార్‌&nbsp; ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్‌ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్‌ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్‌ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ K ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
    ఆగస్టు 02 , 2023
    Movies to watch with friends: ఈ 5 సినిమాలు ఫ్రెండ్స్‌తో చూస్తే ఆ కిక్కే వేరు!
    Movies to watch with friends: ఈ 5 సినిమాలు ఫ్రెండ్స్‌తో చూస్తే ఆ కిక్కే వేరు!
    ఏటా ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. కానీ, కొన్నే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాలను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇక, కొన్ని ఫ్రెండ్స్‌తో చూసే సినిమాలుంటాయి. ఒంటరిగా చూసినప్పుడు పొందని అనుభూతి.. ఫ్రెండ్స్‌తో కలిసి చూసినప్పుడు కలుగుతుంది. దోస్తులతో కూర్చొని చూస్తున్నప్పుడు తెగ ఎంజాయ్ చేస్తాం. తెలుగులో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. ఈ నగరానికి ఏమైంది? తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైంది. విభిన్న ప్రవృతులు కలిగిన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. వీరందరూ ఒక చోట కలిసి తమ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకోవడం, గోవాకి వెళ్లడం, డబ్బుల కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొనడం వంటి ఘట్టాలతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంటుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులో ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=wERgpPK44w0 సొంతం సినిమా కోసం కన్నా కామెడీ సీన్ల కోసం ‘సొంతం’ మూవీ చూసేవాళ్లు చాలామంది. ఇందులోని సన్నివేశాలు అంతలా నవ్వు పుట్టిస్తాయన్నమాట. ముఖ్యంగా, సునీల్, ఎం.ఎస్. నారాయణ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఈ సీన్ల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటారు నెటిజన్లు. ఒకరకంగా సినిమాకు హీరో ‘సునీల్’ అని చెప్పవచ్చు. శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. https://www.youtube.com/watch?v=kDro5bBnZkE వెంకీ ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే వెంకీ సినిమా ఫుల్ టైం ఎంటర్‌టైనర్. ఇందులోని ట్రైన్ సీన్ బెస్ట్ కామెడీ ట్రాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఎస్సై సెలక్షన్స్‌కి ఎంపికైన నలుగురు స్నేహితులు అనుకోని ప్రమాదంలో పడితే ఎలా తప్పించుకున్నారనేదే సినిమా కథ. హీరోకు లవ్ ట్రాక్ జోడించి మరింత ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ మూవీ మ్యూజికల్‌గానూ మంచి విజయం సాధించింది. డీఎస్పీ స్వరాలు సమకూర్చాడు.&nbsp; https://www.youtube.com/watch?v=pG4_xm-UilM హ్యాపీడేస్ ఫ్రెండ్‌షిప్‌కి కేరాఫ్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇంజినీరింగ్ చదువులు, స్నేహితుల మధ్య సంబంధాలను చక్కగా చూపించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాలేజీ స్టూడెంట్స్‌ జీవితాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మ్యూజికల్‌గానూ హిట్ టాక్ తెచ్చుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=pG4_xm-UilM జాతిరత్నాలు ఈ మధ్య కాలంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘జాతిరత్నాలు’. సిటీలో ఉండాలని అనుకుని ఊరి నుంచి వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది సినిమాలో చూపించాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. పనీ పాట లేకుండా ఊరిలో తిరగడం, నగరానికి వచ్చి ఇబ్బందులను కోరి తెచ్చుకోవడం, వాటి నుంచి బయట పడటానికి ప్రయత్నించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. నిజంగా మనలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=Hgc07_BX4_8 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఓ వైపు ఫ్యామిలీ డ్రామాను నడిపిస్తూనే ఫ్రెండ్‌షిప్‌ని తెలియజేస్తుందీ చిత్రం. తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో ఒకరికొకరు ఎలా తోడున్నారనే సీన్స్‌ని చక్కగా చూపించాడు శేఖర్. నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ, అభిజీత్, తదితరులు ఇందులో నటించారు.&nbsp; https://www.youtube.com/watch?v=Xl912NaaKf0 వున్నది ఒకటే జిందగీ ‘మన కష్టసుఖాలను చెబితే వినేవాడు ఫ్రెండ్‌.. కానీ, ఆ కష్టసుఖాల్లో తోడుండే వాడే బెస్ట్ ఫ్రెండ్’ అంటూ ఫ్రెండ్‌కి, బెస్ట్ ఫ్రెండ్‌కి తేడా చెప్పిన సినిమా ఇది. రామ్ పోతినేని, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే ఓ ఫీల్ కలుగుతుంది. మ్యూజికల్‌గా సినిమా మంచి విజయాన్ని సాధించింది. https://www.youtube.com/watch?v=CJLJl1ckbOA డీజే టిల్లు రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. ఆహా, సోనీ లివ్ ప్లాట్‌ఫారంలలో స్ట్రీమింగ్ అవుతోంది.&nbsp; https://www.youtube.com/watch?v=BHfLK-swJFA
    జూన్ 22 , 2023
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    OTT MOVIES: స్నేహితులతో కలిసి ఓటీటీలో చూడగలిగే 10 సినిమాలు
    సినిమా చూసేందుకు వెళ్లాలి అనుకున్నప్పుడు&nbsp; అందరికన్నా ముందు గుర్తొచ్చేది స్నేహితులే. వాళ్లతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడిపేస్తాం. ఇక బ్యాచ్‌లర్‌గా ఉంటే వేరే లెవల్. రూమ్‌లో ఉంటూ ఫ్రెండ్స్‌తో కలిసి మజా చేయాలనుకుంటే… ఓటీటీలో చూసేందుకు కొన్ని ఎవర్‌ గ్రీన్ సినిమాలు ఉన్నాయి. అవేంటో చదివి మీ దోస్తులతో చూసి ఎంజాయ్ చేయండి.&nbsp; ఈ నగరానికి ఏమైంది సరాదాగా దోస్తులతో కలిసి మందు కొట్టినప్పుడు “గోవా పోవాలి” అని ఎన్ని బ్యాచ్‌లు అనుకొని ఉంటాయి. ఎంతమంది వెళ్లి ఉంటారు. మన జీవితాల్లోనే జరిగే ఇలాంటి ఎన్నో సరాదా సంఘటనలను గుర్తు చేస్తుంది ఈ సినిమా. విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను, సాయి సుశాంత్ రెడ్డి లీడ్‌ రోల్స్ చేశారు. రూ. 2కోట్లతో తీస్తే రూ. 12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.&nbsp; జాతిరత్నాలు ఈ సినిమా గుర్తొస్తే మెుదట తలుచుకునేది క్రేజీ డైరెక్టర్ అనుదీప్ KV. జాతిరత్నాలు చిత్రాన్ని అంతలా ప్రేక్షకుల మదిలో ఉండిపోయేలా తీర్చిదిద్దాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలోని వన్‌లైన్‌ పంచులు బాగా పేలాయి. ఎండాకాలం ఉక్కపోస్తున్న, వాన కాలం వర్షం పడుతున్నా… అలా రూమ్‌లో కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేయవచ్చు. రూ. 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు పెడితే.. ఏకంగా రూ.75 కోట్లు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని చూడవచ్చు. డీజే టిల్లు డీజే టిల్లు సినిమా వచ్చి రెండేళ్లైనా సిద్ధూ జొన్నలగడ్డ స్వాగ్‌ ఇంకా మర్చిపోలేరు. టిల్లుతో రాధిక చేయించే విన్యాసాలు.. తెలంగాణ యాసలో పేలిన పంచులను స్నేహితులతో కలిసి చూస్తే కాలక్షేపమే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆహా, సోని లివ్‌ వేదికగా సినిమాను వీక్షించవచ్చు.&nbsp; హుషారు మద్యం తాగే మిత్రులు కొనడం ఎందుకు దాన్నే తయారు చేద్దామనే క్రేజీ ఆలోచన వస్తే హుషారు సినిమా. సరదాగా గడిపే నలుగురు వ్యక్తులు, కెరీర్‌ను సెట్‌ చేసుకోవాలని తిప్పలు పడుతుండటంతో పాటు కష్టం వచ్చిన స్నేహితుడికి అండగా నిలిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సరదాగా నవ్వుకోవాలి అనిపించినప్పుడు కబూమ్‌ హుషారు సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.&nbsp; బ్రోచెవారెవరురా&nbsp; స్నేహితులు ఎంతవరకైనా తోడు ఉంటారనేది చూడాలంటే బ్రోచెవారెవరూ చూడాల్సిందే. ఫీజు కట్టాలని చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలు, షికార్లు చుట్టేయడం. ఆఖరికి కిడ్నాప్‌లో కూడా స్నేహితులు తోడు వస్తారనే కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో బ్రోచెవారెవరూ రూపొందింది. శ్రీ విష్ణు, దర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్‌ రోల్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో ఈ సినిమా చూడొచ్చు. ఒకే ఒక జీవితం టైమ్ ట్రావెల్‌ కథాంశంతో ముగ్గురు మిత్రులు వాళ్ల చిన్నతనంలోకి వెళితే ఎలా ఉంటుందనే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఒకే ఒక జీవితం తెరకెక్కింది. ఇందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శర్వానంద్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సరాదాగా సాగే థ్రిల్లింగ్ సినిమాను దోస్తులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సోని లివ్‌లో అందుబాటులో ఉంది. మిషన్ ఇంపాజిబుల్‌ చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మనం ఎలా ఉండేవాళ్లమో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది ఈ సినిమా. రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు చిచ్చరపిడుగులు చేసిన విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.&nbsp; హృదయం కాలేజ్‌ లైఫ్, లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన హృదయం సూపర్ హిట్ అయ్యింది. మోహన్‌ లాల్ కుమారుడు ప్రణవ్, కల్యాణి ప్రియదర్శి లీడ్‌ రోల్స్‌లో వచ్చింది. స్నేహితులతో కలిసి చూస్తూ దర్శనా అంటూ పాటలు పాడుకునేంత బాగుంటుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.&nbsp; చిచ్చోరే ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఈ సినిమాను ఇష్టపడతారు. కళాశాల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ , శ్రద్ధాకపూర్, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ సినిమా కాలేజ్ డేస్‌ను గుర్తు చేస్తాయి. డిస్నీ + హాట్‌స్టార్‌ ఓటీటీలో చిచ్చొరే సినిమా ఉంది. రొమాంచనమ్ హారర్‌ కామెడీ జానర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ. ఏడుగురు బ్యాచిలర్స్‌ ఉండే ఓ ఇంట్లో ఆత్మను పిలిచే గేమ్‌ ఆడతారు. ఆత్మ వస్తుందా? వస్తే ఏం చేసింది? ఇది కథ. బ్యాచిలర్‌ రూమ్‌లను కళ్లకు కట్టినట్టు చూపిండటమే గాక అదిరిపోయే కామెడీ ఉంటుంది. స్నేహితులతో కలిసి చూస్తే కడుపుబ్బా నవ్వుతూ చిల్‌ అవ్వొచ్చు. హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడొచ్చు. మీకు ఏవైనా మూవీస్ పక్కాగా చూడాల్సినవి తెలిస్తే కామెంట్‌ చేయండి.
    ఏప్రిల్ 21 , 2023

    @2021 KTree