• TFIDB EN
  • డెకాయిట్‌
    రేటింగ్ లేదు
    UATelugu
    అడివి శేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'డెకాయిట్‌'. షానియెల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరు మాజీ లవర్స్‌.. తమ జీవితాలు మార్చుకునేందుకు ఏ విధంగా దోపిడీలు చేశారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అడివి శేష్
    శృతి హాసన్
    సిబ్బంది
    షానీల్ డియోదర్శకుడు
    సుప్రియ యార్లగడ్డనిర్మాత
    అడివి శేష్
    రచయిత
    భీమ్స్ సిసిరోలియో
    సంగీతకారుడు
    కథనాలు
    <strong>Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్</strong>
    Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్‌: ఏ లవ్‌ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్‌ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్‌ డియో డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్‌' హీరోయిన్‌ను అనౌన్స్‌ చేశారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘ప్రేమించి మోసం చేశావ్‌’ యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్‌’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్‌ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి మృణాల్‌ ఠాకూర్‌ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్‌ - అడివి శేష్‌ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.  https://twitter.com/AdiviSesh/status/1868899040303431969 హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! డెకాయిట్‌ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్‌ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్‌ తీసుకున్నారు. అడివి శేష్‌, మృణాల్‌ పెయిర్‌ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424 డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్‌’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్‌’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయగా ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. https://twitter.com/TrackTwood/status/1737423086188925221 అడివి శేష్ ఫిల్మ్‌ జర్నీ ఇదే.. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 
    డిసెంబర్ 17 , 2024
    <strong>HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?</strong>
    HBD Sunny Deol: పడిలేచిన బాలీవుడ్‌ కెరటం.. సన్నీ డియోల్‌ లైఫ్‌లో అంత జరిగిందా?
    ప్రతీ మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. అయితే ఓటములకు కుంగిపోకుండా గెలుపు మార్గాన్ని అన్వేషించిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇందుకు సినీ నటులు ఏమాత్రం మినహాయింపు కాదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ (Sunny Deol) సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అతడి ఫిల్మ్‌ కెరీర్‌ పూల పాన్పులా సాగలేదు. అతడి కెరీర్‌ అయిపోయిందనుకున్న ప్రతీసారి బౌన్స్‌బ్యాక్‌ అవుతూ వచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్‌ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం తిరుగులేని స్టార్‌గా బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు. నేడు (అక్టోబర్‌ 19) సన్నీ డియోల్‌ 67వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ కెరీర్‌లో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం.&nbsp; ధర్మేంద్ర నటవారసుడిగా.. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ 1957 అక్టోబర్‌ 19న జన్మించాడు. దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ఆయన కుమారుడు. ఎవర్‌గ్రీన్‌ బాలీవుడ్‌ చిత్రం ‘షోలే’ (Sholey)లో అమితాబ్‌ బచ్చన్‌తో పోటీ పడి ధర్మేంద్ర నటించారు. అటువంటి ధర్మేంద్ర నట వారసుడిగా సన్నీ డియోల్‌ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిజానికి అతడి అసలు పేరు అజయ్‌ సింగ్‌ డియోల్‌. ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ డియోల్‌గా మార్చుకున్నారు. 1983లో వచ్చిన రొమాంటిక్‌ చిత్రం 'బేతాబ్‌' (Betaab)తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అద్భుత నటన కనబరిచి తొలి సినిమాకే బెస్ట్‌ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నాడు. ’బేతాబ్‌’లో సన్నీ చేసిన గుర్రపు స్వారీ సీన్స్‌ అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఎంతో కఠినమైన గుర్రపు స్వారీ సీన్లను అలవోకగా చేయడంతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. హీరోయిన్‌ అమృత సింగ్‌తో కలిసి అద్భుతంగా రొమాంటిక్‌ సన్నివేశాలను పండించాడు. తొలి మూవీతోనే స్టార్‌ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకున్నారు.  ఒకే ఏడాది 7 చిత్రాలు రిలీజ్‌ 'బేతాన్' సక్సెస్‌తో సన్నీ డియోల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే రెండో చిత్రం 'రాజ్‌ ఖోస్లా' (1985) తీసి మరో హిట్‌ అందుకున్నారు సన్నీ. రొమాంటింక్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం సన్నీలోని ప్రతిభను మరింత బహిర్గతం చేసింది. సన్నీ క్రేజ్‌ అమాంతం పెరగడం మెుదలైంది. ఆ తర్వాత అర్జున్‌ (1985), డెకాయిట్‌ (1987) చిత్రాలు చేశాడు. ఆ సినిమాలు కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత నుంచి కథల ఎంపికలో సన్నీ ఉదాశీనంగా వ్యవహరించారు. వచ్చిన కథను వచ్చినట్లు ఓకే చేశారు. తద్వారా 1989వ సంవత్సరంలో ఏకంగా 7 సినిమాలను రిలీజ్‌ చేశారు. కానీ వాటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన ఐదు మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. దీంతో సన్నీ క్రేజ్‌కు బీటలు వారడం మెుదలైంది. ఓటమి నుంచి పాటలు నేర్చుకున్న సన్నీ కథల విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడు.&nbsp; ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ 1990లో రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో 'ఘాయల్‌' అనే చిత్రం చేశాడు. ఈ మూవీని అతడి ధర్మేంద్ర నిర్మించడం విశేషం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందించింది. అంతకుముందు వచ్చిన వరుస ఫ్లాప్స్‌ను అందరూ మర్చిపోయేలా చేసింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజ్‌కుమార్‌ సంతోషి డైరెక్షన్‌లోనే వరుసగా దామిని (1993), ఘటక్‌ (1996) అనే రెండు బ్లాక్‌ బాస్టర్ చిత్రాలు చేశారు. ముఖ్యంగా ‘దామిని’ సినిమాలో వచ్చే కోర్టు సీన్‌లో కెరీర్‌ బెస్ట్ నటనతో సన్నీ డియోల్‌ మెస్మరైజ్‌ చేశారు. అంతేకాదు ఘటక్‌ సినిమాతో మరో నేషనల్‌ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో కలిసి చేసిన ‘డర్‌’ సినిమా సన్నీకి బిగ్‌ మైనస్‌గా మారింది. యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ ‘డర్‌’ సాఫ్ట్‌ రోల్‌ చేశాడు. దానికితోడు అందులో షారుక్‌ పాత్ర కనెక్టింగ్‌గా ఉండటంతో షారుక్‌ ముందు సన్నీ తేలిపోయాడన్న భావన ఆడియన్స్‌లో కలిగి ఉంది.&nbsp; ‘గదర్‌’తో చెక్‌! 1990వ దశకంలో పెద్ద ఎత్తున రొమాంటిక్‌ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందుకు అనుగుణంగా షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్.. ప్రేమ కథలను ఎంచుకుని మంచి విజయాలను సాధించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌ అన్న ముద్ర పడటంతో సన్నీకి ఆ తరహా లవ్‌స్టోరీలు రాలేదు. దీంతో ఒక వర్గం ప్రేక్షకులకు సన్నీ రీచ్‌ కాలేకపోయారు. అటు డ్యాన్స్‌లోనూ సన్నీకి పెద్దగా ప్రావీణ్యం లేకపోవడం కూడా అతడి క్రేజ్‌ను కొద్దిమేర డ్యామేజ్‌ చేసింది. ఇది అతడి కెరీర్‌లో వచ్చిన సెకండ్ స్ట్రగల్‌ ఫేజ్ అని చెప్పవచ్చు. అయితే 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) మూవీతో వాటన్నింటికి సన్నీ చెక్‌ పెట్టాడు. సరిహద్దులు దాటిన ప్రేమకథ చిత్రంలో అతడు అద్భుతంగా నటించారు. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చిన యాక్షన్‌తో మరోమారు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం అతడి కెరీర్‌లోనే అతి పెద్ద మైలురాయిగా నిలిచింది. తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.&nbsp; 23 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ (Gadar: Ek Prem Katha) వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత సన్నీకి ఇక తిరుగుండదని అంతా భావించారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ స్థాయి సక్సెస్‌ రాలేదు. ఓ దశలో హీరోగా అవకాశాలు కోల్పోయి క్యారెక్టర్ అర్టిస్టుగానూ సన్నీ డియోల్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్థిక సమస్యలను సైతం ఆయన ఫేస్‌ చేశారని సన్నిహితులు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్లుగా సాలిడ్‌ హిట్‌ కోసం సన్నీ అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక అతడి కెరీర్‌ అయిపోయిందనుకుంటున్న సమయంలో మరోమారు ‘గదర్‌ 2’ మరోమారు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 691.08 కోట్లు కొల్లగొట్టి మరోమారు సన్నీ డియోల్‌కు స్టార్ స్టేటస్‌ను అందించింది. ప్రస్తుతం 'లాహోర్‌ 1947', బోర్డర్‌ 2, రామాయణం వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌లో సన్నీ డియోల్ నటిస్తున్నారు. తెలుగు డైరెక్టర్‌తోనూ టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలోనూ సన్నీ డియోల్‌ (Sunny Deol) ఓ బిగ్‌ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 'జాట్‌' (Jaat) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను సైతం మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ డియోల్‌ శరీరమంతా బ్లడ్‌ మార్క్స్‌తో భారీ ఫ్యాన్‌ని పట్టుకొని ఉండటాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 
    అక్టోబర్ 19 , 2024
    <strong>Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!</strong>
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.&nbsp; https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.&nbsp;
    అక్టోబర్ 08 , 2024

    @2021 KTree