• TFIDB EN
  • దంగల్
    UTelugu2h 41m
    మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) మాజీ రెజ్లర్. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. తన కలను తన కూతుర్ల ద్వారా నెరవేర్చాలని భావిస్తాడు. వారిని రెజ్లర్లుగా తీర్చిదిద్దే క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వారికి స్వయంగా కఠోర శిక్షణ ఇస్తాడు. మరి మహవీర్ సింగ్ ఫోగట్ కల నెరవేరిందా? లేదా? అనేది మిగతా కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అమీర్ ఖాన్
    సాక్షి తన్వర్
    ఫాతిమా సనా షేక్
    జైరా వసీం
    సన్యా మల్హోత్రా
    సుహాని భట్నాగర్
    అపరశక్తి ఖురానా
    రిత్విక్ సాహోరే
    లక్షిత గోయల్
    గిరీష్ కులకర్ణి
    వివాన్ భటేనా
    శిశిర్ శర్మ
    మీను ప్రజాపతి
    బద్రుల్ ఇస్లాం
    కర్మవీర్ చౌదరి
    అనురాగ్ అరోరా
    సిబ్బంది
    నితేష్ తివారీ
    దర్శకుడు
    అమీర్ ఖాన్
    నిర్మాత
    కిరణ్ రావు
    నిర్మాత
    సిద్ధార్థ్ రాయ్ కపూర్
    నిర్మాత
    నితేష్ తివారీ పీయూష్ గుప్తా శ్రేయస్ జైన్ నిఖిల్ మెహరోత్రారచయిత
    ప్రీతమ్ చక్రబర్తి
    సంగీతకారుడు
    కథనాలు
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    Suhani Bhatnagar: ‘దంగల్‌’ నటి ప్రాణం తీసిన చిన్న గాయం.. ఏం జరిగిందంటే?
    బాలీవుడ్‌ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'దంగల్‌'లో బాల నటిగా చేసిన ‘సుహాని భట్నాగర్’ (Suhani Bhatnagar) కన్నుమూసింది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. https://twitter.com/kadak_chai_/status/1758784936247746905?s=20 కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె కాలుకి గాయమైంది. చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి.  సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సుహానీ ఈ ఉదయం ప్రాణాలు విడిచింది.  సుహానికి సంబంధించిన అంత్యక్రియలను ఫరిదాబాద్‌ సెక్టార్‌ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. సుహానీ 2016లో వచ్చిన ‘దంగల్‌’ (Dangal) సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అమీర్‌ఖాన్‌తో పాటు కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్‌కు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు వచ్చింది.  ఈ సినిమా తరువాత ఈ ఫాతిమా, సన్యాస, సుహానిలకు ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్స్‌ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకున్నారు.  కానీ సుహాని (Suhani Bhatnagar) మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని స్టడీస్‌పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై చదువులో బిజీ అయ్యింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను సుహాని పలకరిస్తూనే ఉండేది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని వారితో పంచుకునేది.  ఈ క్రమంలో సుహాని పోస్టు చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యేవారు. సుహాని ట్రాన్స్‌ఫార్మేషన్‌, అందం చూసి ఆశ్చర్యపోయేవారు.  సుహాని అందాన్ని కచ్చితంగా వెండితెరపై చూడాల్సిందేనని బాలీవుడ్ ఆడియన్స్‌ భావించారు. ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ ఎదురైంది.  సుహాని అకస్మిక మరణంతో బాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
    ఫిబ్రవరి 17 , 2024
    Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
    Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
    బాలీవుడ్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) మరోమారు స్టన్నింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను తన వైపునకు తిప్పుకుంది.  కర్లీ హెయిర్‌తో ఎద అందాలను చూపిస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. టైట్‌ ఫిట్‌ జాకెట్‌తో చూపు తిప్పుకోనికుండా చేసింది.  ఫిబ్రవరి 24, 1992లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన సన్యా.. ఢిల్లీలో డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.  డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తన అద్భుతమైన నృత్యంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది.  ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ (Sanya Malhotra).. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లింది.  ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రతీసారి సన్యా (Sanya Malhotra)కు నిరాశే ఎదురైంది. కానీ, పట్టుదలతో అమీర్‌ఖాన్‌ (Amir Khan) పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.  అమీర్‌ ఖాన్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'దంగల్‌' (Dangal)తో అరంగేట్రం చేసి నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆ తర్వాత సన్యాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ (Secret Superstar), పటాకా (Pataakha), బదాయి హో (Badhaai Ho) సినిమాల్లో నటించింది.  ఫొటోగ్రాఫ్‌ (Photograph), శకుంతలా దేవి (Shakuntala Devi), లూడో (Ludo), పగ్‌లైట్‌ (Pagglait), మీనాక్షి సుందరేశ్వర్‌ (Meenakshi Sundareshwar) చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో స్థిరపడింది.  తెలుగు చిత్రం హిట్‌కు రీమేక్‌గా వచ్చిన బాలీవుడ్‌ మూవీలో ఈ భామ (Sanya Malhotra) హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.  రాజ్‌కుమార్‌ రావు హీరోగా చేసిన ఈ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ‘HIT: The First Case’ పేరుతో ఈ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌' (Jawan) సినిమాలోనూ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటించింది. డా. ఈరమ్‌ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది.  హిందీలో బయోగ్రఫికల్‌ వార్‌ డ్రామాగా వచ్చిన 'శామ్ బహదూర్‌' మూవీలోనూ ఈ భామ చేసింది. ఇందులో చక్కటి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ప్రస్తుతం సన్యా చేతిలో రెండు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి. ఒకటి 'బేబీ జాన్' కాగా రెండోదానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదు.  ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ (Sanya Malhotra) సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 
    ఫిబ్రవరి 13 , 2024
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    Adipurush: అమీర్‌ఖాన్‌ను ఢీకొట్టే మెునగాడు ప్రభాస్‌ ఒక్కడేనా.. దంగల్‌ రూ.2200 కోట్ల రికార్డు ఫసక్?
    దేశంలో ‘ఆదిపురుష్‌’ మేనియా ప్రారంభమైంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కడంతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఆదిపురుష్‌ రిలీజైతే అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన దంగల్‌ను వెనక్కి నెడుతుందని జోస్యం చెబుతున్నారు. మరీ ఆదిపురుష్‌ నిజంగానే దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందా? ఆదిపురుష్‌కు ఉన్న ప్రతికూల, అనుకూల పరిస్థితులు లేంటి? ఈ YouSay ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆదిపురుష్‌ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిపురుష్‌ చిత్రానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను రూ.550 కోట్లుగా అంచనా వేశారు. అయితే టీజర్‌ రిలీజయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీజర్‌లోని VFX కార్టూన్‌ను తలపిస్తున్నాయని పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన మేకర్స్‌ సినిమాలోని VFX ఎఫెక్ట్స్‌ను మళ్లీ రీ ఎడిటింగ్‌ చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లను ఖర్చు చేశారు. ఫలితంగా ఆదిపురుష్‌ బడ్జెట్‌ రూ.700కు పెరిగిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాహుబలి, RRR, పఠాన్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు మించి ఆదిపురుష్‌కు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాయి. దీంతో దేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా ‘ఆదిపురుష్‌’ నిలిచింది.  పెట్టుబడికి ఢోకా లేదు ఆదిపురుష్‌కు పెట్టిన బడ్జెట్‌ కచ్చితంగా తిరిగి వచ్చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, డిజిటల్‌ రైట్స్‌ ద్వారానే బడ్జెట్‌ మెుత్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఫోకస్ ఆదిపురుష్‌ ఏ మేర రికార్డులను బద్దలు కొడుతుందన్న దానిపై ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రామాయణం కథ యావత్‌ దేశానికి తెలిసిందే. అయినప్పటికీ రాముడు ఆధారంగా వస్తున్న సినిమాలంటే ప్రతీ ఒక్కరిలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. దానిని ఏమేర నిలబెట్టుకుంటారన్న దానిపై ఆదిపురుష్‌ కలెక్షన్స్‌ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆదిపురుష్‌ టీమ్‌ ఇంకా ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు కనిపించడం లేదు. సినిమాను ప్రతీ ఒక్కరికీ చేరువ చేయడంలో ప్రమోషన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ఇకనైన ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  దంగల్‌ VS ఆదిపురుష్‌ దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ నిలిచింది. వికీపీడియా ఇచ్చిన సమాచారం మేరకు ఈ చిత్రం రూ.1,968 - 2,200 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్‌ చేయాలంటే ఆదిపురుష్‌ పెద్ద సవాలేనని చెప్పొచ్చు. ఎందుకంటే దంగల్‌.. చైనా, హాంకాంగ్‌, మలేషియా, UAE, బ్రిటన్‌, అమెరికా దేశాల్లోనూ రిలీజై కాసుల వర్షం కురిపించింది. మరీ ఆ స్థాయిలో ఆదిపురుష్‌ మెప్పిస్తుందా అన్నది సందేహమే. అయితే ఆదిపురుష్‌ కథ యూనివర్సల్‌ సబ్జెట్‌ కావడం సినిమాకు కలిసిరానుంది. రామాయణం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కాబట్టి ఆదిపురుష్‌ను సరిగ్గా ప్రమోట్‌ చేసి, మార్కెటింగ్ చేయాలి. ఆదిపురుష్‌పై విదేశీయుల్లో ఆసక్తిని రగిలించాలి. మేకర్స్‌ అలా చేయగలిగితే భారీ వసూళ్లను రాబట్టవచ్చు. దంగల్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేసి రూ.2000 కోట్ల క్లబ్‌లో ఆదిపురుష్‌ను నిలపొచ్చు. అంతేగాక భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఇదోక చక్కని అవకాశంగా మారనుంది. ఇక ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌కు సినిమా హిట్‌ టాక్‌ తోడైతే ఆదిపురుష్‌ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.  రిలీజ్ ఎప్పుడంటే? ప్రభాస్ రాఘవుడిగా చేసిన ఆదిపురుష్‌ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీతగా నటించింది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్‌’ జూన్‌ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, వంశీ, ప్రమోద్‌, ఓంరౌత్‌ నిర్మించారు. 
    మే 11 , 2023
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    Celebrities in Summer: వేసవిలో చిల్‌ అవుతున్న అందాల భామలు.. ఎలాగో మీరే చూడండి?
    దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు అందాల భామలు సముద్ర తీరాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద వాలిపోతున్నారు. వాటర్‌ బేబీలుగా మారి రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ అందాలతో ఈ వేసవిని మరింత హీట్‌ చేస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం.  బాలీవుడ్‌ బ్యూటీ వాని కపూర్‌.. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ను ఆశ్రయిస్తోంది. చల్లటి నీటిలో హాయిగా గడుపుతూ ఫొటోకు ఫోజు ఇస్తోంది. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా.. బికినీతో స్విమ్మింగ్‌ చేసి అహ్లాదంగా గడిపింది. రెడ్ డ్రెస్‌ బికినీలో ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  చిరుత బ్యూటీ నేహా శర్మ.. ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తింటోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నేహా స్వయంగా పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌.. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు గోవా బీచ్‌కు వెళ్లింది. అక్కడ సన్‌ సెట్‌ సమయంలో దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.  బాలీవుడ్ భామ.. సనయ ఇరానీ ప్రస్తుతం గ్రీసులో పర్యటిస్తోంది. అక్కడ ఓ తీరంలో సన్‌సెట్‌ సందర్బంగా దిగిన ఫొటోను ఈ బ్యూటీ పంచుకుంది.  మరో బ్యూటీ బార్ఖా సేన్‌ గుప్తా.. ఈ లేజీ సమ్మర్‌ డేస్‌ను కాఫీ తాగి గడుపుతున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది.  బాలీవుడ్‌ స్టార్‌ నటి మౌని రాయ్‌.. ఈ వేసవిని చాలా అహ్లాదకరంగా గడుపుతోంది. ఖాళీ సమయాన్ని స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద గడుపుతూ చిల్ అవుతోంది.  యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. ఈ సమ్మర్‌లో ఎక్కువ సమయాన్ని గార్డెనింగ్‌లో గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
    ఏప్రిల్ 16 , 2024
    Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఏంటంటే?
    Ranbir Kapoor - Sai Pallavi: ‘రామాాయణం’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. ఏంటంటే?
    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా.. నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా బాలీవుడ్‌లో ‘రామాయణం’ (Ramayanam) అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కేజీఎఫ్‌ (KGF) ఫేమ్‌ యష్‌ (Yash) రావణసురుడిగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్‌కు ‘దంగల్‌’ (Dangal) లాంటి బ్లాక్‌ బాస్టర్‌ను అందించిన స్టార్‌ డైరెక్టర్‌ నితేష్‌ తివారి (Nitesh Tiwari) ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం మూవీ గురించి అంతా మర్చిపోయారు. అయితే తాజాగా సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు రావడంతో అందరిదృష్టి ఈ సినిమాపై పడింది.  షూటింగ్‌ ప్రారంభం ఆ రోజే! లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'రామాయణం' చిత్రానికి సంబంధించి ఏప్రిల్‌ 17న అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) కావడంతో సినిమా అనౌన్స్‌కు అదే సరైన సమయంగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో మూవీ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజున ఎలాంటి ప్రకటను రానుందోనని.. నటీనటుల ఎంపిక గురించి కూడా అనౌన్స్‌మెంట్‌ చేస్తారేమోనని అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ‘రామాయణం’కు సంబంధించిన ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ముంబయిలో ఈ నెలాఖరు నుంచి ప్రారంభమవుతుందని టాక్‌.  ఆ స్టార్లను సాయిపల్లవికి అవకాశం! ‘రాయాయణం’ చిత్రంలో సీత పాత్రలో నటించేందుకు తొలుత అలియా భట్ (Alia Bhatt), దీపికా పదుకొణె (Deepika Padukone), కరీనా కపూర్‌ (Kareena Kapoor)ల పేర్లను మూవీ టీమ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చివరికీ సాయిపల్లవి (Sai Pallavi)ని మేకర్స్ ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది. సీతాదేవి పాత్రకు సాయిపల్లవి అయితేనే సరిగ్గా సరిపోతుందని యూనిట్‌ భావించిందట. ఆమె సహజసిద్ధమైన నటన ఆ పాత్రకు చాలా ప్లస్ అవుతుందని మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారు.  ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీతో గ్రాఫిక్స్‌! రామాయణం చిత్రాన్ని విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాలని డైరెక్టర్‌ నితేష్‌ తివారి (Nitesh Tiwari) భావిస్తున్నారట. ఇటీవల వచ్చిన ఆదిపురుష్‌ సినిమా గ్రాఫిక్స్‌పై విపరీతంగా ట్రోల్స్‌ రావడంతో ఆయన జాగ్రత్తపడుతున్నారట. గ్రాఫిక్స్‌ కోసం హాలీవుడ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ ‘DNEG’తో చిత్ర యూనిట్‌ చర్చలు జరిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ కంపెనీనే.. ఈ మూవీకి VFX అందించనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అమీర్‌ఖాన్ కొడుకుతో సినిమా ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌లో మరో సినిమాను సైతం చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కుమారుడు జునైద్ ఖాన్‌ (Junaid Khan)తో ఈ భామ నటిస్తోంది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ను ఇంకా ఫిక్స్‌ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ సాయి పల్లవి బిజీ బిజీగా గడుపుతోంది.  సాయిపల్లవి ఫూచర్‌ ప్రాజెక్ట్స్‌ తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో సాయిపల్లవి పరిచయమైంది. అంతకు ముందు ఈమె మలయాళంలో ’ప్రేమమ్’ సినిమాలో మలర్‌గా పలకరించింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తోంది. లేటెస్ట్‌గా నాగచైతన్య (Naga Chaitanya)తో ‘తండేల్‌’ (Thandel)లో చేయగా ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్‌ (Siva Karthikeyan)తో ‘అమరన్‌’ (Amaran) చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది. 
    మార్చి 02 , 2024
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన  సినిమాలు ఇవే !
    1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !
    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం. దంగల్ అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్‌ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది. బాహుబలి 2 తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్‌  టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి.  కేజీఎఫ్‌ 2 “అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్‌ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్‌ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్‌ మైన్స్‌ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం.  RRR భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్‌ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది. పఠాన్‌ ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్‌ హిట్‌ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్‌. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది. భజరంగీ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్‌. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్‌ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్‌ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.
    ఏప్రిల్ 28 , 2023
    <strong>Pushpa 2: ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఈ యాడ్స్ గమనించారా? ఫొటోలు వైరల్</strong>
    Pushpa 2: ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఈ యాడ్స్ గమనించారా? ఫొటోలు వైరల్
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది దీనిని గమనించకపోవచ్చు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.  సాంగ్స్‌లో యాడ్స్.. ‘పుష్ప 2’ చిత్రంతో పాటు అందులోని టైటిల్‌ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ‘పుష్ప.. పుష్ప..’ అంటూ సాగే ఈ పాటలో బన్నీ తన మ్యానరిజంతో మెస్మరైజ్‌ చేశాడు. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సాంగ్‌లో మనం గమనించాల్సిన అంశం మరోటి కూడా ఉంది. దర్శకుడు సుకుమార్‌ పాట మధ్యలో వచ్చే సీన్స్‌లో పలు బ్రాండెడ్‌ కంపెనీలను ప్రమోట్‌ చేశారు. ఓ లారిపై జేకే టైర్స్‌, కజారియా (Kajaria Ceramics), షాప్‌ డోర్స్‌పై కల్యాణ్‌ జ్యూయలర్స్‌, అంబూజ సిమెంట్స్‌, టాటా చక్రా గోల్డ్ (బన్నీ తాగే టీ గ్లాస్‌పై) వంటి కంపెనీ పేర్లు దర్శనమిచ్చాయి. అలాగే ‘పీలింగ్స్‌’ పాటలో ‘అస్ట్రాల్‌’ అనే ప్రముఖ పైపుల కంపెనీ పేరు ఓ సీన్‌లో కనిపించింది. దీంతో సుకుమార్‌ సాంగ్స్‌ను అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ కోసం కూడా ఉపయోగించుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.  డబ్బుల కోసమేనా! సాధారణంగా ఒక పాటలో ఇలా కంపెనీ బ్రాండ్స్‌ను దర్శక నిర్మాతలు ఉపయోగించారు. ఓపెన్‌ ప్లేస్‌లో సాంగ్‌ షూట్‌ చేసే క్రమంలో ఒరిజినల్‌ పేర్లకు బదులుగా వాడుకలో లేని పేర్లను వినియోగిస్తుంటారు. ఉచిత ప్రమోషన్స్‌ ఇవ్వడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో మేకర్స్ ఇలా చేస్తుంటారు. మరి ‘పుష్ప 2’ వంటి నేషనల్‌ వైడ్‌ బజ్‌ ఉన్న సినిమాలో ఇలా పలు కంపెనీ బ్రాండ్ల పేర్లు కనిపించడం ఆసక్తి రేపుతోంది. అయితే సుకుమార్‌ కావాలనే వాటిని పెట్టారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలా పెట్టడం ద్వారా ఆయా కంపెనీల నుంచి మేకర్స్‌ కొంత మెుత్తంలో వసూలు చేసి ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.  కొత్త ట్రెండ్‌ షురూ! ‘పుష్ప 2’ టైటిల్‌ సాంగ్‌లో ప్రముఖ కంపెనీల ప్రొడక్ట్స్‌ను ఇలా ప్రమోట్‌ చేయడం ద్వారా దర్శకుడు సుకుమార్‌ కొత్త ట్రెండ్‌ను సృష్టించారని చెప్పవచ్చు. కొత్త వ్యాపార అవకాశాన్ని టాలీవుడ్‌ మేకర్స్‌కు ఆయన అందించారు. ఇకపై ఇలా పబ్లిక్‌ సాంగ్స్‌ చేసేటప్పుడు ప్రముఖ బ్రాండ్లకు అడ్వర్‌టైజింగ్‌ చేసే అవకాశాన్ని దర్శక నిర్మాతలు పరిశీలించే ఛాన్స్ ఉంది. తద్వారా కొంత మెుత్తాన్ని సినిమా కోసం సమకూర్చుకునే వెసులుబాటు ఉంటుంది. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, తారక్‌ వంటి బడా హీరోల చిత్రాలకైతే కోట్లలో యాడ్స్‌ రూపంలో వసూలు చేసే అవకాశం లభిస్తుంది. మరి నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.  ‘పుష్ప 2’ రెండు వారాల కలెక్షన్స్‌.. ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై బుధవారంతో (డిసెంబర్‌ 18) సరిగ్గా రెండు వారాలు (14 రోజులు) పూర్తయింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ రూ.1450 కోట్ల మైలురాయి (Pushpa 2 Box Office Collections)ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఇంకో రూ.50 కోట్ల దూరంలో మాత్రమే పుష్పరాజ్‌ ఉన్నాడని పేర్కొన్నారు. రేపో, మాపో ఆ ఘనత కూడా ‘పుష్ప 2’ ఖాతాలో వచ్చి చేరుతుందని తెలిపారు. సంక్రాంతి వరకూ పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడంతో పుష్పరాజ్ జైత్రయాత్ర ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ప్రస్తుతం ‘పుష్ప 2’  మూడో స్థానంలో కొనసాగుతోంది. దంగల్‌ (రూ. 2,051 కోట్లు), బాహుబలి 2 (రూ.1,810.60) చిత్రాలు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.  https://twitter.com/ManobalaV/status/1869609840668270618
    డిసెంబర్ 19 , 2024
    Pushpa 2 Film: ‘పుష్ప 2’ రికార్డుల మోత.. ‘కేజీఎఫ్ 2’, ‘RRR’ వెనక్కి.. ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో
    Pushpa 2 Film: ‘పుష్ప 2’ రికార్డుల మోత.. ‘కేజీఎఫ్ 2’, ‘RRR’ వెనక్కి.. ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్‌ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ఆదరణ పొందుతోంది. ఆడియన్స్‌ పుష్పగాడి రూల్‌కు జై కొడుతున్నారు. దీంతో 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూళ్లు సాధించి ‘పుష్ప 2’ సత్తా చాటింది. రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరి 12వ రోజున ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  12 రోజుల కలెక్షన్స్‌..&nbsp; అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా వసూళ్లు రాబడుతోంది. 12 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.1450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క ఇండియాలోనే ఇప్పటివరకూ రూ.933.92 కోట్లు వసూలు చేసినట్లు తెలిపాయి. అయితే గత 11 రోజులుగా రోజుకు రూ.100 కోట్లు తగ్గకుండా వసూలు చేసిన ‘పుష్ప 2’ 12వ రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించినట్లు పేర్కొన్నాయి. అధికారిక వసూళ్లను మేకర్స్‌ అనౌన్స్‌ చేస్తే ఈ విషయంపై స్పష్టత వచ్చే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డాయి. అయితే రూ.1500 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప 2’ ఈజీగానే చేరుతుందని స్పష్టం చేశాయి.  కలెక్షన్స్ పరంగా టాప్‌.. ‘పుష్ప 2’ చిత్రం ఓ అరుదైన ఘనత సాధించింది. పోస్టు కోవిడ్‌ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా తీసుకుంటే రూ.1914 - 2100 కోట్ల గ్రాస్‌తో ‘దంగల్‌’ చిత్రం తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 చిత్రం రూ.1747 కోట్లకు పైగా వసూళ్లతో సెకండ్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇప్పటివరకూ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న RRR (రూ.1,387), కేజీఎఫ్‌ 2 (రూ. 1215) చిత్రాలను వెనక్కి నెట్టి ‘పుష్ప 2’ (రూ.1400+ కోట్లు) మూడో స్థానంలో నిలిచింది. అయితే ‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ను బీట్‌ చేయడానికి మరో రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్పరాజ్‌ దూకుడు చూస్తుంటే ‘బాహుబలి 2’ కలెక్షన్స్‌ కూడా దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  నార్త్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు ‘పుష్ప 2’ చిత్రానికి నార్త్‌లో విశేష స్పందన వస్తోంది. రోజు రోజుకు కలెక్షన్స్‌ భారీగా పెరుగుతున్నాయి. హిందీ రీజియన్‌లో 12 రోజుల వ్యవధిలో రూ.582 కోట్ల నెట్‌ వసూళ్లను ‘పుష్ప 2’ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రెండో సోమవారం (డిసెంబర్‌ 16) హిందీలో రూ.20.50 కోట్ల నెట్‌ వసూలైనట్లు తెలిపింది. ఇప్పటివరకూ ఏ సినిమా ఇలాంటి వసూళ్లు రాబట్టలేదని తెలిపింది. హిందీలో ‘పుష్ప 2’ వచ్చిన కలెక్షన్స్ ఆల్‌టైమ్‌ రికార్డు అని వెల్లడించింది. ప్రస్తుతం హిందీలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  'పుష్ప 2' ఓటీటీ డేట్‌ లాక్‌ థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ రోజునే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ పట్టుబడుతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్‌తోనే ‘పుష్ప 2’ స్ట్రీమింగ్‌లోకి రానుంది. థియేటర్లలో పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓటీటీలోనూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశముంది. 
    డిసెంబర్ 17 , 2024
    <strong>Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఇవే..</strong>
    Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఇవే..
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచనలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని సైతం ‘పుష్ప 2’ అందుకుంది. తద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; అత్యంత వేగంగా.. ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్‌, సౌత్‌, ఓవర్సీస్‌ అన్న తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేవలం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేరక్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంత వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన చిత్రం ఇదేనని మేకర్స్‌ వెల్లడించారు. ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రం ఇంత తక్కువ సమయంలో రూ.1000 కోట్లు రాబట్టలేదని పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్ల మైలురాయిని అందుకునే దిశగా పుష్ప 2 సాగుతోంది. అయితే భారతీయ సినీ చరిత్రలో ‘పుష్ప 2’తో పాటు మరో 7 చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1866731687578833350 దంగల్ (Dangal) అమీర్‌ ఖాన్‌ (Amir Khan) లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘దంగల్‌’. ఫొగాట్‌ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్‌ తేవాలనుకునే తండ్రి తన కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో దంగల్ రూపొందింది. 2016లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా వరల్డ్‌వైడ్‌గా రూ. 2000 కోట్లు సాధించింది. కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్‌ టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’ (Bahubali). ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా&nbsp; రూ.1810 కోట్లు రాబట్టింది. RRR రామ్‌చరణ్‌ (Ramcharan), జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. ఇందులో రామ్‌ - భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. రూ. 550 కోట్లతో ఈ తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 1,390 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.&nbsp; కేజీఎఫ్‌ 2 (KGF 2) కన్నడ నటుడు యష్‌ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్‌’ (KGF: Chapter 1) చిత్రం ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ దానికి మించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. రూ.100 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం&nbsp; రూ.1250 కోట్లు కొల్లగొట్టింది. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రభాస్‌ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్స్‌ నటించారు. దీనికి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp; జవాన్‌ (Jawan) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్‌’ చిత్రం గతేడాది విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.1,148 కోట్లు రాబట్టింది. తమిళ స్టార్‌ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేసింది. విజయ్‌ సేతుపతి విలన్‌గా అలరించాడు.&nbsp; పఠాన్‌ (Pathan) గతేడాది షారుక్‌ నటించిన మరో చిత్రం కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో నిలిచింది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పఠాన్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 1,050 కోట్లు వసూలు చేసింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేసింది. షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో అలరించాడు. బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం విలన్‌గా నటించాడు.
    డిసెంబర్ 11 , 2024
    <strong>Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్</strong>
    Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; 15 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఇది&nbsp; నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927 ఏకైకా సౌత్‌ హీరోగా ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్‌ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్‌ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్‌ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్‌, పఠాన్‌ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.&nbsp; త్వరలో టాప్‌-3లోకి ‘కల్కి’ తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్‌ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్‌ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్‌’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, జవాన్ సినిమాలకు షాక్‌ తప్పేలా లేదు. డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 13 , 2024
    Fastest 500Cr Movies: జెట్‌ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
    Fastest 500Cr Movies: జెట్‌ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?
    ఒకప్పుడు దేశంలో సూపర్‌ హిట్‌ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్‌ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్‌ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్‌ 10 భారతీయ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 1. బాహుబలి-2 ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.508 కోట్లు కొల్లగొట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1,810 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. 2. ఆర్‌ఆర్‌ఆర్‌ బాహుబలి-2 తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘RRR’ నిలిచింది. ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లోనే రూ.570 కోట్లు రాబట్టడం విశేషం. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం తెలిసిందే. 3. కేజీఎఫ్‌ 2 యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌-2’ చిత్రం కూడా నాలుగు రోజుల్లోనే రూ.560 కోట్లు రాబట్టింది. RRRతో పోలిస్తే రూ.10 కోట్లు తక్కువ రావడంతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1,200-1,250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం. 4. పఠాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ మూవీ ‘పఠాన్‌’ సైతం అత్యంత వేగంగా రూ.500 కోట్లను రాబట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.545 కోట్లు వసూలు చేసింది.&nbsp; 5. రోబో 2.0 రజనీకాంత్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో 2.0’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. 6. సుల్తాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘సుల్తాన్‌’ చిత్రం కూడా డివైడ్‌ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.&nbsp; 7. దంగల్‌&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం 13 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.1,968-2,200 కోట్లను రాబట్టింది.&nbsp; 8. పీకే&nbsp; అమీర్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘పీకే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆ మూవీ సైతం 14 రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టడం జరిగింది. 9. టైగర్‌ జిందా హై బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘టైగర్‌ జిందా హై’ చిత్రం 15 రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టింది.&nbsp; 10. సంజు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా చేశాడు. ఈ చిత్రం విడుదలైన 21 రోజుల్లో రూ.586 కోట్ల వసూళ్లను రాబట్టింది.&nbsp;
    సెప్టెంబర్ 05 , 2023
    Tollywood Cult&nbsp; Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!&nbsp;
    Tollywood Cult&nbsp; Movies: శివ To దసరా.. తెలుగు ప్రేక్షకుడ్ని మీసం మెలేసేలా చేసిన సినిమాలు ఇవే!&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ అంటే దేశంలోని సినీ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉండేది. తెలుగు సినిమాలంటే&nbsp;నార్త్‌ ఇండియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. మన డైరెక్టర్లు కూడా కేవలం సరిహద్దులు గీసుకొని కేవలం తెలుగు ఆడియన్స్‌ కోసమే సినిమా రిలీజ్‌ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జాతీయ అవార్డు ఫంక్షన్లకు ఆహ్వానం లభించని స్టేజీ నుంచి ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనే స్థాయికి మన డైరెక్టర్లు ఎదిగారు. అంతర్జాతీయ బహుమతులను దేశానికి అందిస్తూ ప్రతీ ఒక్కరినీ గర్వపడేలా చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1990 నుంచి ఇవాళ్టి దసరా వరకూ ఎన్నో కల్ట్‌ సినిమాలు టాలీవుడ్‌ గతిని మార్చాయి. తెలుగు ఇండస్ట్రీని రేంజ్‌ను ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నాయి. కల్ట్ మూవీ అంటే? కల్ట్ మూవీకి పర్యాయ పదంగా ట్రెండ్ సెట్టర్ సినిమా అని కూడా సినీ విశ్లేషకులు పిలుస్తారు. విభిన్న కథాంశం. విడుదలయ్యాక ఆ మూవీ పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ సంపాదించడం, ఆ చిత్రం పంథాను కొన్నేళ్లపాటు మరికొన్ని సినిమాలు అనుసరించి రావడం, ఆ సినిమా డైలాగ్స్.. ఇప్పటికీ జనాల నాలుకలపై నానడం వంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపించే సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. 90వ దశకం నుంచి యాక్షన్ కల్ట్ మూవీలు శివ(1989) ఎలాంటి అంచనాలు లేకుండా 1989లో రిలీజైన 'శివ' మూవీ ఇండస్ట్రీ కల్ట్ గా నిలిచింది. అప్పటి వరకు సామాజిక ఆర్థిక అంశాలే ప్రధానం రూపొందిన చిత్రాల పంథాను ఒక్కసారిగా మార్చింది. పక్క యాక్షన్ మూవీగా తెరకెక్కిన శివ నాగార్జునకు స్టార్ డామ్ తెచ్చిపెట్టింది. ఆయన కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. నాగార్జున పట్ల యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సైకిల్ చైన్ లాగే మెనరిజాన్ని అప్పట్లో యూత్ పిచ్చిగా ఫాలో అయ్యేవారు. ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో మూవీలు చేసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. అంతే కాదు శివ యాక్షన్ సిక్వెన్స్‌ను అనుసరిస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. గాయం(1993) 1993లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లోనే&nbsp; వచ్చిన 'గాయం' సైతం మంచి యాక్షన్ కల్ట్‌ గా నిలిచింది. ఈ మూవీని యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా పెరొందిన జగపతి బాబు ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ లుక్ లోకి మారిపోయారు. దుర్గ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. జగపతి బాబు సరసన రేవతి, కోటా శ్రీనివాస్ రావు, సిరివెన్నెల సితారామశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికి తెలిసిందే. భారతీయుడు(1996) శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన భారతీయుడు ఆల్ టైమ్ యాక్షన్ కల్ట్ చిత్రంగా పేరొందింది. రొటీన్ మూవీలకు భిన్నంగా అవినీతికి వ్యతిరేకంగా సరికొత్త కథాంశంతో శంకర్ తెరకెక్కించాడు. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ తర్వాత ఇదే తరహా కథాంశాలతో వచ్చిన రమణ, ఠాగూర్, మల్లన్న చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో మెప్పించాడు. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించాడు. సమరసింహా రెడ్డి(1999) నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'సమరసింహా రెడ్డి(1999), నరసింహా నాయుడు(2001) యాక్షన్ ఎంటర్ టైన్మెంట్‌కు కొత్త నిర్వచనం అందించాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ చిత్రాల్ని డెరెక్టర్ బీ గోపాల్ అద్భుతంగా తెరకెక్కించాడు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్&nbsp; బాగా పేలాయి. ఈ చిత్రాల్లో బాలయ్య డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసింది. ఈ రెండు సినిమాలను అనుకరిస్తూ వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. ఫాక్షనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఇంద్ర, ఆది, యజ్ఞం మూవీలు హిట్ కొట్టాయి. పోకిరి(2006) తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ కల్ట్ మూవీ పోకిరి(2006). అప్పటివరకు తెలుగు తెరకు పరిచయం లేని గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో పూరి ముందుకొచ్చాడు. పోకిరి దెబ్బకు అన్ని రికార్డులు దాసోహం అయ్యాయి. హీరో మేనరిజం, డెలాగ్స్, చిత్రీకరణ విలువలు, మణిశర్మ మ్యూజిక్&nbsp; ప్రతి ఒక్కటీ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పోకిరి యాక్షన్ సిక్వెన్స్ ను ఫాలో అయ్యాయి.&nbsp;&nbsp;&nbsp; మగధీర(2009) రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర క్లాసిక్ కల్ట్ గా చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను మగధీర బ్రేక్ చేసింది. పూర్వ జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ చాల ఏళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక వాసనను తెలుగు తెరకు గుర్తు చేసింది. కత్తులు, యుద్ధం వంటి యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మంచి బ్రెక్ ఇచ్చింది. నటించిన రెండో సినిమాతోనే చరణ్ కు స్టార్ హోదా దక్కింది. ఈ చిత్రం పోలికలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత విజయం సాధించలేదు.&nbsp;&nbsp; అర్జున్ రెడ్డి(2017) కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి డెరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి(2017)' టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం పెద్దఎ త్తున ఫ్యాన్ బేస్ సంపాదించింది.&nbsp; విజయ్ దేవరకొండ కేరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఊహించని సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాను హిందీ, తమిళ్ ఇండస్ట్రీల్లో రీమేక్ చేశారు. యూత్ లో ఫుల్ జోష్ ను నింపింది. అర్జున్ రెడ్డిగా నటించిన విజయ్ ని రౌడీ బాయ్ అంటూ అభిమానులు పిలవడం మొదలు పెట్టారు. బాహుబలి-2(2017) రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కావ్యం 'బాహుబలి-2(2017)' భారత చలనచిత్ర గతినే మార్చింది. అన్ని భాషలను ఏకం చేసి పాన్ ఇండియా ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యమనుకునే&nbsp; భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్ రికార్డును బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులే కాదు సౌత్ సినిమాలను పెద్దగా ఆదరించని నార్త్ ఆడియన్స్ మనసులను సైతం కొల్లగొట్టింది. సౌత్, నార్త్ కాదు మన సినిమా ఇండియన్ సినిమా అనే స్థాయికి ఇండస్ట్రీ వర్గాలను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రంగస్థలం (2018) ఒకేరకమైన కథలతో వెళ్తున్న టాలీవుడ్‌కు రంగస్థలం సినిమా కొత్త మార్గాన్ని చూపించింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పక్కా పల్లెటూరు కథతోనూ హిట్‌ కొట్టొచ్చని డైరెక్టర్ సుకుమార్‌ ఈ తరం దర్శకులకు చూపించారు. ఇందులో రామ్‌ చరణ్, సమంత నటన మూవీకే హైలెట్‌ అని చెప్పాలి. రామ్‌చరణ్‌లోని కొత్త నటుడ్ని ఈ సినిమా ఆవిష్కరించింది. ఈ సినిమా స్ఫూర్తితో ప్రస్తుతం చాలా మంది దర్శకులు పల్లెటూరి కథలో దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో షేక్‌ చేస్తున్న దసరా, బలగం సినిమాలకు ఈ సినిమానే స్ఫూర్తి అని చెప్పొచ్చు.&nbsp; పుష్ప(2022) పాన్ ఇండియా మూవీగా వచ్చిన 'పుష్ప' భారీ విజయాన్ని సాధించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ&nbsp; అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గేస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా డైలాగులను రాజకీయ నాయకులు మొదలు క్రికెటర్లు, WWE స్టార్ల వరకు వల్లవేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అయితే.. రాజకీయ నాయకులు 'తగ్గేదేలే'.. 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చే వరకు వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేశాడు. టాలీవుడ్‌ శక్తి సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించింది. తద్వారా భారతీయుల హృదయాలను ఉప్పొంగేలా చేసింది. ఒకప్పుడు జాతీయ అవార్డులు రావడమే గగనంగా ఉన్న పరిస్థితి నుంచి తెలుగు సినిమా ఆస్కార్‌ స్థాయికి ఎదిగింది. కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌లు కూడా RRRలో ఎంతో అద్భుతంగా నటించారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.&nbsp; బలగం (2023) సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయిన ఘనవిజయం సాధిస్తుందని బలగం సినిమా నిరూపించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ప్రభంజనే సృష్టించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను డైరెక్టర్‌ వేణు చక్కగా చూపించాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.&nbsp; దసరా (2023) టాలీవుడ్‌ రేంజ్‌ను దసరా చిత్రం మరింత పెంచింది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన తొలి సినిమాతోనే రూ.100 కోట్ల మార్క్‌ అందుకున్నాడు. ఈ సినిమా కూడా పల్లెటూరు కథాంశంతో తెరకెక్కి పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ముఖ్యంగా హీరో నాని ఈ సినిమా తన నటా విశ్వరూపమే చూపించాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఊరమాస్‌గా ఇరగదీశాడు. హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. మహానటి తర్వాత కీర్తి అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూడొచ్చు.
    ఏప్రిల్ 12 , 2023
    <strong>Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌ నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని విడుదల తేదీ : జులై 5, 2024 ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్‌' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు&nbsp; ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; గత సీజన్లలో ఏం జరిగిందంటే? మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే&nbsp; ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే&nbsp; ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు&nbsp;గత సీజన్లతో&nbsp; పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating :3/5&nbsp;
    జూలై 05 , 2024
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    Telugu Sea/Ocean Movies: దేవర సినిమా మాదిరి సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు తెలుసా?
    టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్‌ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్‌ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; దేవర 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్‌ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, టామ్‌ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; తండేల్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘తండేల్‌’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్‌ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, షాన్‌ కక్కర్‌ ప్రధాన పాత్రుల పోషించనున్నారు. మట్కా వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్‌ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్‌. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. KGF 3 ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో కన్నడ స్టార్‌ యష్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్‌ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. RC16 మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'RC 16'. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్‌. ఇందులో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.&nbsp; వాల్తేరు వీరయ్య గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఉప్పెన సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్‌ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్‌ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.&nbsp; ఘాజీ 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ లీడ్‌ రోల్స్‌లో నటించారు. సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; మహా సముద్రం&nbsp; అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.&nbsp;
    జనవరి 10 , 2024
    Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!
    ]కొమెుండోర్‌ హంగేరి దేశానికి చెందిన బ్రీడ్‌. ఇవి ప్రధానంగా మంచు ప్రాంతాల్లో జీవిస్తుంటాయి. ఇవి మనుషుల పట్ల మంచి అప్యాయతను చూపుతాయి.కొమొండోర్
    మే 25 , 2024
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. [toc] సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5&nbsp; (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.&nbsp; https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన&nbsp; రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. &nbsp;Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది. &nbsp;Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL&nbsp; ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత&nbsp; కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు. &nbsp;Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు&nbsp; BMW X5&nbsp; ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.&nbsp; Lamborghini Aventador Roadster&nbsp; &nbsp;లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.&nbsp; ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography&nbsp; ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL&nbsp; దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2&nbsp; అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.&nbsp; వోల్వో XC90 T8 ఇది&nbsp; వోల్వో&nbsp; ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు&nbsp;&nbsp; ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.&nbsp; ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ&nbsp; కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.&nbsp; విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు&nbsp; https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు&nbsp; లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.&nbsp; అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.&nbsp; Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.&nbsp; తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,&nbsp; టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.&nbsp; అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా &nbsp;రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్, &nbsp;రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-&nbsp;&nbsp; రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.&nbsp; విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో&nbsp; స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్ &nbsp;హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-&nbsp; దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్&nbsp;&nbsp; సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    అక్టోబర్ 22 , 2024
    <strong>Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!</strong>
    Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
    2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన 'కల్కి', 'పుష్ప 2', హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం. 1. ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా డిజాస్టర్ల జాబితాలో చేరారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాల ప్రభావంతో, నేటి యువ దర్శకులు సరికొత్త కథలు తీసుకోకుండా, భారీ బడ్జెట్‌తో యాక్షన్ సన్నివేశాలు, భారీ గన్స్, విచిత్రమైన ఫ్లాష్‌బ్యాక్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ 'ఈగల్' కథపై దృష్టి పెట్టకుండా ఒక్కో సన్నివేశం మాత్రమే బాగా రావాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. భారీ బడ్జెట్ వృథాగా అయిందని చెప్పుకోవచ్చు. 2. మిస్టర్ బచ్చన్ 2024లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రీమేక్ సినిమాల విషయంలో ఎలా చేయకూడదో అనిపించేలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టల్ క్లియర్ కథనం లేకపోవడం, క్రింజ్ కామెడీ సన్నివేశాలు సినిమాను పూర్తిగా డీలా పడేయించాయి. మంచి నటీనటుల ఫేస్ వాల్యూ వృథా అయింది. ఒక రీమేక్ సినిమాలో కథకు ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు సులభంగా తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది. 3. సైంధవ్ వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉండేవి. కానీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం లేకపోవడంతో పండగ రోజు సినిమా థియేటర్ల నుంచి రానివ్వకుండా వెళ్లిపోయింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటుడు సైతం ఈ సినిమాలో ప్రాభవాన్ని చూపించలేకపోయాడు. కథలో లోపాలు, ఆర్య పాత్ర లాంటి అనవసరమైన పాత్రలు సినిమాను మరింతగా దెబ్బతీశాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 4. డబుల్ ఇస్మార్ట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు పూరికి ఇటు రామ్‌ పొత్తినేనికి వరుస ఫ్లాప్స్ ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. పూరీ స్టైల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన ప్రామాణికతను అందించకపోవడం ఈ చిత్రానికి పెద్ద షాక్‌గా మారింది. వరుస ఫ్లాప్‌లతో రామ్‌కు ఈ సినిమా మరో పెద్ద మైనస్‌గా మారింది. 5. ఆపరేషన్ వాలెంటైన్ &amp; మట్కా మెగా ప్రిన్సెస్‌ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు – 'ఆపరేషన్ వాలెంటైన్' మరియు 'మట్కా'. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ లాంటి ప్రామాణిక నటుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వినూత్న కథా సామర్థ్యం లేకపోవడం ఈ సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం. 6. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 2024లో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కామెడీ డ్రామా జానర్‌ను ప్రయత్నించినప్పటికీ, కథలో లోపాలు సినిమాను కిందికి దించాయి. 7. మనమే శర్వానంద్ నటించిన 'మనమే' కూడా ఈ ఏడాది మరో నిరాశపరిచిన మరో సినిమా. వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ ఈసారి సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమా మొత్తం స్లో నేరేషన్, అర్థరహితమైన ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యమైన పాయింట్లను సరిగా హైలైట్ చేయకపోవడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది. 8. తిరగబడరా సామీ, బడ్డీ, శివంభజే ఇంకా యంగ్ హీరోలు అశ్విన్ బాబు, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలు కూడా నిరాశపరిచారు. అశ్విన్ బాబు నటించిన 'శివంభజే', అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ', రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామీ' చిత్రాలు నాటకీయ అంచనాలను తలపించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయకపోవడంతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. 9. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కార్తికేయ సిరీస్‌ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్‌కు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్‌, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించారు. 10. చిన్న సినిమాలు 2024లో చిన్న సినిమాల జాబితాలో కూడా చాలా నిరాశ ఎదురైంది. మంచి కథా బలం ఉన్నా సరైన ప్రమోషన్ లేకపోవడం, కొత్త దర్శకుల సినిమాలు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోలేదు. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలకు ఆర్థిక నష్టాలు మిగిలాయి. 2024లో టాలీవుడ్ పెద్ద ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచాయి. రవితేజ, వెంకటేష్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ విజయాల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. ఒక వైపు 'పుష్ప 2', 'కల్కి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టాలీవుడ్‌ను ముందుకు నడిపిస్తే, మరో వైపు ఈ డిజాస్టర్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. కొత్త సంవత్సరం 2025లో వీరు తిరిగి పుంజుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.
    డిసెంబర్ 19 , 2024
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు&nbsp;
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు&nbsp;
    ‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.&nbsp; తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.&nbsp; కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.&nbsp; బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్‌ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.&nbsp; ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.&nbsp; డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.&nbsp; హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.&nbsp; డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.&nbsp; ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ.&nbsp;
    మే 01 , 2023
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!
    ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్‌ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్‌ వెహికల్‌ పాత్రను కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆడియన్స్‌ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మోహినిగా దిశా పటానీ! లేటెస్ట్ బజ్‌ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్‌ అయిన కమల్‌ హాసన్‌.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్‌) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్‌తో ప్రభాస్‌ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; ఆ లాజిక్‌ మాటేంటి? ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్‌ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్‌ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్‌ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్‌పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌లో నిజం లేకపోవచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు. &nbsp; దిశాతో ప్రభాస్ స్పెషల్‌ సాంగ్‌ 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్‌కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్‌ - దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్‌ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.&nbsp; View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) దీపికా, కమల్‌ పాత్రలు అవేనా?&nbsp; ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్‌ను ఢీకొట్టే పాత్రలో కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది.&nbsp;
    మే 24 , 2024
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్‌ హీరో నవీన్‌కు జతగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.&nbsp; అనుష్క.. గ్రేట్‌ కమ్‌బ్యాక్‌! ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్‌ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్‌ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి ‌అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్‌ సైతం ట్రైలర్‌ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్‌ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; రెమ్యూనరేషన్‌ ఎంతంటే? ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్‌ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు ‌అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
    ఆగస్టు 22 , 2023

    @2021 KTree