• TFIDB EN
 • దీపావళి (2023)
  U/ATelugu

  శీనయ్య తన భార్య మీనమ్మ, మనవడు గణేష్‌తో జీవిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. ఈక్రమంలో దీపావళి పండుగ సందర్భంగా తన మనవడికి కొత్త బట్టలు కొని ఇవ్వాలని ఆశ పడతాడు. డబ్బుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పు దొరకదు. దీంతో తన మనవడు గణేష్ ప్రాణంగా ప్రేమించే మేకను అమ్మేయాలని శీనయ్య నిర్ణయం తీసుకుంటాడు. అది ఇష్టం లేని గణేష్ ఏం చేశాడు? ఇంతకీ శీనయ్య మేకను అమ్మాడా ? లేదా ? అన్నది మిగతా కథ

  ఇంగ్లీష్‌లో చదవండి
  రివ్యూస్
  How was the movie?

  సిబ్బంది
  Ra. వెంకట్దర్శకుడు
  కథనాలు
  <strong>Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!</strong>
  Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
  అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2&nbsp; సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.&nbsp; కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని&nbsp; డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.&nbsp; ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని&nbsp; హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.&nbsp; రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.&nbsp;
  అక్టోబర్ 26 , 2023
  <strong>This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!</strong>
  This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
  దసరా సందర్భంగా థియేటర్లలో నెలకొన్న చిత్రాల హంగామా దీపావళికి కూడా కొనసాగనుంది. ఈసారి దీపావళి సందర్భంగా పలు డబ్బింగ్ చిత్రాలు సందడి చేయనున్నాయి. తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు టైగర్‌ 3 బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘టైగర్‌3 ’ (Tiger 3) దీపావళి కానుకగా రాబోతోంది. నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ (Katrina Kaif)&nbsp;నటించింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు, సల్మాన్‌పై చిత్రీకరించిన ఫైట్‌ సీక్వెన్స్‌లు అదరహో అనేలా ఉన్నాయి.&nbsp; జపాన్‌ కథనాయకుడు కార్తి (Karthi) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్’ (Japan). రాజు మరుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా చేసింది. ఇందులో కార్తి ‘జపాన్‌’ అనే దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? వంటి ఆసక్తికర అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’ (Jigarthanda DoubleX). ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఆధారంగా సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు ఆ గ్యాంగ్‌స్టర్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సివస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిగర్‌ తండ’. ఇప్పుడు ఆ కథకే మరింత యాక్షన్‌ను జోడించి తెరపైకి ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలా నిన్ను చేరి దినేశ్‌ తేజ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేమ, కుటుంబ వినోదంతో కూడిన ఈ సినిమా ఇంటిల్లిపాదినీ మెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయని పేర్కొంది.&nbsp; ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమా ‘ది మార్వెల్స్‌’ (The Marvels) కూడా ఈ వారమే థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.&nbsp; ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దీపావళి అందమైన పల్లెటూరి కథతో ‘దీపావళి’ సినిమా రూపొందింది. రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్‌ దర్శకత్వం వహిచారు. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం తాత తన మేకను బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అహ్లాదకరమైన కథే ఈ సినిమా. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateRainbow rishtaSeriesEnglishAmazon PrimeNov 07BTS: Yet To ComeMovieEnglishAmazon PrimeNov 09PippaMovieHindiAmazon PrimeNov 10IrugapatruMovieTamilNetflixNov 06Escaping twin flamesSeriesEnglishNetflixNov 08The killerMovieEnglishNetflixNov 10The RoadMovieTamilAhaNov 10The Santa Clause 2SeriesEnglishDisney+HotstarNov 08LabelSeriesTeluguDisney+HotstarNov 10Ghoomer&nbsp;MovieHindiZee 5Nov 10 ………………………………………………………………………………………………………………. APP: దీపావళి సందర్భంగా సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 6 నుంచి 12వ తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏవో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.
  నవంబర్ 06 , 2023
  <strong>Disha Patani: బోల్డ్‌&nbsp; వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!</strong>
  Disha Patani: బోల్డ్‌&nbsp; వీడియోలో రెచ్చిపోయిన దిశా పటానీ.. హాట్‌ ట్రీట్‌ అదరహో!
  హాట్‌ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) మరోమారు తన గ్లామర్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌ పాపులర్ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో ఈ బామ బోల్డ్‌ శారీ లుక్‌లో తళుక్కుమంది. ఎద, నడుము అందాలను చూపిస్తూ పలుచటి శారీలో రెచ్చిపోయింది. పార్టీకి వచ్చిన వారందర్నీ తన ఒంపుసొంపులతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; ఇదిలా ఉంటే దిశా లేటెస్ట్ బాలీవుడ్‌ మూవీ 'యోధ' (Yodha) మరోమారు వాయిదా పడింది. డిసెంబర్‌ 15, 2023న ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా తాజాగా దాన్ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.&nbsp; ఇప్పటికే మూడుసార్లు ‘యోధ’ విడుదల తేదీ వాయిదా పడింది. నాల్గోసారి కూడా రిలీజ్‌ డేట్‌ను రీషెడ్యూల్‌ చేయడంపై బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన #DishaPatani హ్యాష్‌టాగ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; ‘యోధ’ సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా చేశాడు. వాస్తవానికి ఈ సినిమా జులై 7న రిలీజ్‌ కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో పలు దఫాలుగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ వాయిదా వేస్తూ వస్తున్నారు. మరోవైపు దిశా పటాని పెట్టే బోల్డ్‌ ఫొటోలు ట్రెండింగ్‌లో నిలవడం గత కొంతకాలంగా కామన్‌ అయిపోయింది. ఈ భామ నుంచి పోస్టు వచ్చిందంటే ఇక తమకు పండగేనని నెటిజన్లు కేరింతలు కొడుతుంటారు.&nbsp; https://twitter.com/fitbabesbytes/status/1721358334786416642?s=20 లోఫర్‌ సినిమా ద్వారా దిశా పటానీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దిశా హోయలు చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.&nbsp; లోఫర్‌ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ.. అక్కడ పలు హిట్‌ చిత్రాలు తీసి హిందీ ప్రేక్షకులను అలరించింది.&nbsp; దిశా నటించిన ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni), భాగీ 2 (Baaghi 2),&nbsp; బాగీ 3 (Baaghi 3), రాధే వంటి చిత్రాలు మంచి హిట్‌ టాక్ తెచ్చుకున్నాయి.&nbsp; భాగీ సినిమా షూటింగ్‌ సమయంలో హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వారి ఇరువురి డేటింగ్ అంశం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అయితే టైగర్, దిశా రిలేషన్‌ ఎక్కువ కాలం నిలబడలేదు. ఏదో కారణాల వల్ల వారు బ్రేక్‌ చెప్పుకున్నట్లు అప్పట్లో బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ బడ్జెట్‌ సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రాబోతున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో దిశా కూడా నటిస్తోంది. అలాగే తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’లో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తోంది.&nbsp;
  నవంబర్ 07 , 2023
  Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్‌.. వీటిని ధరిస్తే తిరుగుండదు!
  Top 10 Kurta sets: పండగల వేళ యువతుల అందాన్ని రెట్టింపు చేసే కుర్తా సెట్స్‌.. వీటిని ధరిస్తే తిరుగుండదు!
  కుర్తాలు యువతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. వారికి మరింత సొగసైన రూపాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే యువతులు ఎక్కువగా కుర్తాలు వేసుకునేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో పండగల సీజన్‌ ప్రారంభమైంది. దసరా, దీపావళి, క్రిస్మస్‌ వంటి ప్రముఖ పండగలన్నీ రాబోతున్నాయి. వాటికి తోడు ఫ్యామిలీలో ఏదోక ఫంక్షన్‌ ఉంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. పండగ రోజున యువతుల అందాన్ని అమాంతం పెంచే టాప్‌-10 కుర్తా సెట్స్‌ను మీ ముందుకు తెచ్చింది. వీటిలో మీ మనసు దోచిన కుర్తాను వెంటనే ఆర్డర్‌ చేసేయండి.&nbsp; Aachho Women Neria Gotapatti Tier Suit Set ఈ కుర్తా సెట్‌ యువతుల అందాన్ని అమాంతం పెంచుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఇది రెగ్యులర్‌ ఫిట్‌తో వస్తోంది. ఫొటోలలో మరింత బ్రైట్‌నెస్‌గా ఈ సూట్‌ కనిపిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ.5,750గా ఉంది.&nbsp; Buy Now INDO ERA Women's Viscose Embroidered Straight Kurta&nbsp; ఈ కుర్తా ఎరుపు రంగులో అందుబాటులో ఉంది. ఇది కూడా యువతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తుంది. ఇది XS, S, M, L, XL, 2XL సైజులలో అందుబాటులో ఉంది. దీని ధర అమెజాన్‌లో రూ.1599గా ఉంది.&nbsp; Buy Now LYMI LABEL Kurta Set for Women&nbsp; అనార్కలీ స్టైల్‌ కుర్తాను ఇష్టపడే వారు దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ కుర్తా రెగ్యులర్‌ ఫిట్‌లో అందుబాటులో ఉంది. దీనిని డ్రై క్లీనింగ్‌ ద్వారానే ఉతకాల్సి ఉంటుంది. అమెజాన్‌లో దీని ప్రైస్‌ రూ.1,944. Buy Now SheWill Silk Hand Work Kurta&nbsp; పది మందిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునేవారు SheWill Silk Hand Work Kurta ట్రై చేయవచ్చు. వివాహల కోసం ప్రత్యేకంగా దీనిని రూపొదించారు. ఇది సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌ను ‌అందిస్తుంది. దీనికి మ్యాచింగ్‌ జ్యూయలరీ తోడైతే తిరుగుండదు. అమెజాన్‌లో ఇది రూ. 2,179 అందుబాటులో ఉంది.&nbsp; Buy Now Janasya Women's Grey Georgette Foil Print గ్రే కలర్‌లో అందమైన కుర్తాను కోరుకునేవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఇది మీకు సింపుల్‌ అండ్‌ రిచ్‌ లుక్‌ను తీసుకొస్తుంది. XS, S, M, L, XL, 2XL, 3XL సైజుల్లో ఇది లభిస్తోంది. అమెజాన్‌లో ఈ కుర్తా రూ.1,664 లభ్యమవుతోంది.&nbsp; Buy Now PANASH TRENDS Women's Net Embroidery Sharara Salwar ఎంబ్రాయిడరీ డిజైన్‌తో వచ్చే కుర్తాను ఇష్టపడేవారు దీన్ని పరిశీలించవచ్చు. ఈ కుర్తాను ధరిస్తే మీరు మరింత అందంగా కనిపించడం ఖాయం. ఇది రెగ్యులర్‌ ఫిట్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో రూ.2,097లకు లభిస్తోంది.&nbsp; Buy Now SheWill Womens &amp; Girls Womens Festive Ethnic&nbsp; అమెజాన్‌లో లభిస్తోన్న బెస్ట్‌ కుర్తాలలో ఇది కూడా ఒకటి. పండగల కోసమే ప్రత్యేకించి కుర్తా సెట్‌ను తయారు చేశారు. ఈ కుర్తా నలుగురిలో మిమ్మల్ని స్పెషల్‌గా ఉంచుతుంది. అమెజాన్‌లో దీని ధర రూ.1,999గా ఉంది. Buy Now LYMI LABEL Kurta Suit&nbsp; సల్వార్‌ సూట్‌ కుర్తాను కోరుకునే వారు LYMI LABEL Kurta Suit ట్రై చేయవచ్చు. ఇది పండగలు, పెళ్లిళ్లు, ఫ్యామిలీ పంక్షన్లలో మీకు యునిక్‌ లుక్‌ను తీసుకొస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.1,708లకే అందుబాటులో ఉంది.&nbsp; Buy Now PANASH TRENDS Women's Georgette Embroidery Suit&nbsp; అమెజాన్‌లో లభిస్తోన్న మరో అందమైన కుర్తా సెట్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పసుపు, నలుపు కాంబినేషన్‌లో తయారైంది. ఈ కుర్తా యువతులకు పర్‌ఫెక్ట్‌ లుక్‌ను తీసుకొస్తుంది. అమెజాన్‌లో ఇది రూ. 2,256 లభిస్తోంది.&nbsp; Buy Now LYMI LABEL Gown for Women కంప్లీట్‌ బ్లాక్‌ లుక్‌ను ఇష్టపడేవారు ఈ కుర్తాను ట్రై చేయవచ్చు. S, M, L, XL, 2XL, 3XL సైజుల్లో ఇది లభిస్తోంది. అమెజాన్‌లో దీని వెల రూ.2,675. Buy Now
  సెప్టెంబర్ 25 , 2023
  <strong>TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!</strong>
  TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
  నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,&nbsp; ఇమ్రాన్ హష్మీ,&nbsp; సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,&nbsp; అనీష్ కురువిల్లా,&nbsp; కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే. డైరెక్టర్: ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా మ్యూజిక్: తనూజ్ టికు ఎడిటర్: రామేశ్వర్ S. భగత్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున) సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ:&nbsp; అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ ఎలా ఉందంటే? టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.&nbsp; భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి&nbsp; న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్. టెక్నికల్ పరంగా సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది. బలాలు సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు,&nbsp;కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్ బలహీనతలు స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం చివరగా: హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు. రేటింగ్: 2.5/5
  నవంబర్ 12 , 2023
  <strong>Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?</strong>
  Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్‌.. మరి ‘జపాన్‌’ హిట్టా? ఫట్టా?
  నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు&nbsp; దర్శకత్వం: రాజు మురుగన్ ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్ సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు విడుదల తేదీ: నవంబర్ 10, 2023&nbsp;&nbsp; టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్‌ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్‌’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, ప్రమోషనల్‌ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ &amp; ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్‌ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్‌ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్‌, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.&nbsp; సాంకేతికంగా టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కార్తీ నటనకామెడీ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ రేటింగ్‌: 2.5/5
  నవంబర్ 10 , 2023
  Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?
  Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?
  అందుబాటు ధరలోనే యూజర్లకు 5G ఫోన్‌ని అందించాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో అడుగులేస్తోంది. ఈ మేరకు గతేడాది నుంచే గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు కలిగిన ఫోన్‌ని డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే, తాజాగా జియో 5G(Jio&nbsp; 5G Phone) ఫోన్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ లేనప్పటికీ లీకైన ఫొటోలు, ఇంతకుముందు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఎంట్రీ లెవెల్ ఫోన్‌లా కనిపిస్తోంది. మరి దీని ఫీచర్లేంటో ఓ సారి చూసేద్దామా.&nbsp; కెమెరా లీకైన ఫొటోలను బట్టి జియో 5G స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ క్లారిటీతో ఏఐ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్‌తో రానుంది. ఇక సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్‌తో డిజైన్ అయి ఉండొచ్చు.&nbsp; కలర్స్ ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ, ఫొటోల్లోని డివైజ్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తోంది. ఫైబర్ ప్లాస్టిక్‌తో బాడీని తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జియో లోగో ఉంది.&nbsp; పర్ఫార్మెన్స్ జియో 5G ఫోన్ యునిసోక్ 5G(Unisoc 5G) లేదా డైమెన్సిటీ 700 SoC(Dimensity 700 SoC) చిప్‌సెట్‌తో రానుందని ఓ ట్విటర్ యూజర్ వెల్లడించారు. అయితే, ఇందులో స్నాప్‌డ్రాగన్ 480 SoC వాడుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌కి సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సర్వీసెస్‌ డీఫాల్ట్‌గా రానున్నాయి. స్టోరేజీ&nbsp; జియో 5G స్మార్ట్‌ఫోన్ స్టోరేజీకి సంబంధించి ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 4GB ర్యామ్(RAM)తో పాటు 32GB ఇంటర్నల్ మెమొరీ ఇందులో ఉండనుంది.&nbsp; డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగులాల HD+LCD డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. రిఫ్రెష్ రేటు 90Hzగా ఉండనుంది.&nbsp; బ్యాటరీ&nbsp; జియో 5G స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీతో రానుంది. 5,000mAh కెపాసిటీతో వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు 18 వాట్స్ ఛార్జర్ వస్తుంది.&nbsp; https://twitter.com/ArpitNahiMila/status/1671799350329217028?s=20 ధర ఈ జియో 5G ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉండనుందని ట్విటర్ యూజర్ షేర్ చేశారు. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉండనున్నట్లు తెలిసింది.&nbsp; ఈ ఏడాదే లాంచ్? జియో 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీపావళి నుంచి న్యూ ఇయర్ మధ్యలో ఎప్పుడైనా ఫోన్ లాంచ్ కావొచ్చని ఓ ట్విటర్ యూజర్ తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
  జూన్ 23 , 2023
  UGADI: తెలుగు కొత్తసవంత్సరం ఉగాది… ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?
  UGADI: తెలుగు కొత్తసవంత్సరం ఉగాది… ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?
  తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. తెలుగు సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు కనుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉగాది పండుగను తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, బెంగాళ్ వంటి రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కానీ, వీటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి? అక్కడ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారనే విషయాలు తెలుసుకుందాం. ఉగాది ఉగాదిలో యుగం, ఆది అనే పదాలు ఉన్నాయి. యుగ ఆరంభం అవుతుందని దీని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి ( చైత్ర మాసం ) తొలి రోజున నిర్వహించడం ఆనవాయితీ. శాలివాహనుడు అనే చక్రవర్తి&nbsp; పట్టాభిషిక్తుడై పరాక్రమాలు చూపి యుగకర్తగా బాసిల్లడంతో ఉగాది జరుపుకుంటారని ఇతి వృత్తం. తెలుగు క్యాలెండర్ కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజున ఉగాది జరుపుకుంటారు.&nbsp; ఇంటిని పువ్వులు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి, రంగురంగుల ముగ్గులు వేసుకుంటారు.&nbsp; షడ్‌ రుచుల మేళవింపుతో&nbsp; ఉగాది పచ్చడి చేసుకొని తాగుతారు. పిండివంటలు, భక్షాలు వంటివి తయారు చేసి ఆరగిస్తూ ఇంటిల్లిపాది ఆనందగా గడుపుతారు. పంచాంగ శ్రవణం వింటూ భవిష్యత్తు ఖర్చులు, శుభకార్యాలపై చర్చించుకుంటారు. గుడి పడ్వా మహారాష్ట్రలోని మరాఠా, కొంకణి హిందువులు ఈ పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ పండుగను గోవా, మధ్యప్రదేశ్‌, దాద్రా నగర్ హవేలీలోనూ జరుపుకుంటారు. తెలుగువారి మాదిరి మరాఠిలు కూడా చైత్రమాసంలోనే ఉగాది జరుపుకుంటారు. ఈ పండుగను వసంతకాలం, రబీ కోతలకు గుర్తుగా చేస్తారని నానుడి. ఇదే రోజున బ్రహ్మ సృష్టించిన ఆరంభించాడని పురాణాన్ని కూడా నమ్ముతారు ప్రజలు. అయోధ్యలో రావణుడిపై రాముడి విజయం తర్వాత గుడి పడ్వా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందనే ప్రచారం కూడా ఉంది.&nbsp; IMAGE: Wikimedia Commons గుడి పడ్వా సాంప్రదాయం గుడి పడ్వా రోజున కర్రకు ఓ బట్టను కట్టి దానిని మామిడి, నిమ్మ ఆకులు, పూలతో అలంకరిస్తారు. దీనిపై రాగి లేదా వెండి వంటి కలశాన్ని విజయానికి గుర్తుగా అమరుస్తారు. దీన్ని ఇంటి కిటికీ లేదా భవనంపైన కట్టడం అక్కడ ఆచారం. స్థానికంగా ఉన్న కొంతమంది కలిసి ఈ గుడి కవాద్‌ను రూపొందించి దగ్గర్లోని శివుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెల్లి వేడుకను జరుపుతారు. మిగిలినవన్నీ తెలుగు రాష్ట్రాల మాదిరిగా నిర్వహిస్తారు. అక్కడ పూరీలు కూడా చేసుకుంటారు.&nbsp; Wikimedia Commons పుత్తాండు&nbsp; పుత్తాండు పండుగను పుతువరుదమ్ అని కూడా పిలుస్తారు. తమిళ్ హిందువులు అక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఒకరినొకరు పుత్తాంటు వాల్తుక్కల్‌ అని శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. హ్యాపీ న్యూ ఇయర్‌ అని అర్థం వస్తుంది. ఒక పళ్లెంలో పళ్లు, పూలు వంటివి పెట్టి పూజలు చేసి కుటుంబ సమేతంగా కూర్చొని వెజిటేరియన్ ఫీస్ట్‌ చేసుకుంటారు.&nbsp; Wikimedia Commons తమిళనాడులో ఈ పండుగ సమయంలో వివాదం ఉంది. 2008లో అధికారంలో ఉన్న DMK పార్టీ పుత్తాండును జనవరి14న పొంగల్‌తో పాటు నిర్వహించుకోవాలని బిల్‌ పాస్ చేసింది. దీనిని చాలామంది వ్యతిరేకించారు. ఏప్రిల్‌ కాలంలోనే జరుపుకున్నారు. 2011లో ఏఐడీఎంకే పార్టీ అధికారం చేపట్టి వెనక్కి తీసుకున్నారు. విషు కేరళలో ఉగాదిని విషు పేరుతో జరుపుకుంటారు. మలయాళి క్యాలెండర్‌లో మొదటి మాసం మెటం నెల తొలిరోజున (April 14, 15)&nbsp; జరుపుకుంటారు. ఈరోజున&nbsp; శ్రీ మహా విష్ణువు… శ్రీకృష్ణుడిగా అవతారం దాల్చాడని ప్రతీతి.&nbsp; కర్ణాటకలోని తులునాడు&nbsp; ప్రాంత వాసులు కూడా విషు చేసుకుంటారు. ఇక్కడ ఈ పండుగకి ముందు రోజు టపాసులు కాల్చడం సంప్రదాయం. దీపావళి మాదిరిగా వేడుకను జరుపుతారు ప్రజలు.&nbsp; Wikimedia Commons కొత్త సంవత్సరం రోజున ఏది ముందు చూస్తారో అలానే జరుగుతుందనే ఆచారాన్ని నమ్ముతూ ముందురోజున ఒక పళ్లెంలో బియ్యం, నిమ్మకాయ, కొబ్బరికాయ, కొట్టిన కొబ్బరి, జాక్ ఫ్రూట్ వంటివి పెట్టి అలంకరిస్తారు. ఉదయం లేవగానే వాటిని చూడటం అక్కడి సంప్రదాయం. దీనిని విషుఖని అంటారు. సాయంత్రం వివిధ రకాల వంటలు చేసి తింటారు.&nbsp; యుగాది తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని ఎలా జరుపుకుంటారో కర్ణాటకలోనూ అచ్చం అలానే నిర్వహిస్తారు. కానీ, అక్కడ యుగాది అనే పేరుతో పిలుస్తారు. సిక్కులు ఉగాదిని వైశాఖీ పేరుతో, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌ అని చేసుకుంటారు. ఆచార వ్యవహారాల్లో కేవలం కొద్దిపాటి మార్పులు మాత్రమే ఉంటాయి.&nbsp;
  మార్చి 15 , 2023

  @2021 KTree