• TFIDB EN
  • డెమోంటే కాలనీ 2
    UATelugu2h 24m
    డెబీ (ప్రియా భవానీ శంకర్) భర్త శ్యామ్‌ అనుమానస్పదంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓ పుస్తకం చదవడం వల్లే అతడు చనిపోయినట్లు ఆమెకు తెలుస్తుంది. తన భర్తలాగే ఆ బుక్‌ చదివిన మరికొందరు కూడా సూసైడ్‌ చేసుకున్నట్లు గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ (అరుళ్‌ నిధి) అతడి కవల సోదరుడు కూడా బుక్‌ చదువుతారు. ఇది గ్రహించిన డెబీ వారిని ఎలా కాపాడింది? ఇంతకీ ఆ బుక్‌ వెనకున్న దుష్ట శక్తి ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 Sep 113 months ago
    డిమొంటి కాలనీ 2 సినిమా సెప్టెంబర్ 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
    2024 Aug 243 months ago
    డిమోంటి కాలనీ 2 సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 సంస్థ సొంతం చేసుకుంది.
    రివ్యూస్
    YouSay Review

    Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?

    అరుల్‌ నిధి, ప్రియ భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. అజయ్‌ ఆర్‌.జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్‌.సి.రా...read more

    How was the movie?

    తారాగణం
    అరుళ్నితి
    ప్రియా భవానీ శంకర్
    ఆంటి జాస్కెలినెన్
    అరుణ్ పాండియన్
    ముత్తుకుమార్
    సెంథి కుమారి
    రవి వెంకట్రామన్
    ప్రియదర్శిని రాజ్‌కుమార్
    రణేష్
    సనంత్
    రమేష్ తిలక్
    అభిషేక్ జోసెఫ్ జార్జ్
    ఎంఎస్ భాస్కర్
    సిబ్బంది
    అజయ్ జ్ఞానముత్తు
    దర్శకుడు
    బాబీ బాలచంద్రన్నిర్మాత
    సామ్ సిఎస్
    సంగీతకారుడు
    హరీష్ కన్నన్సినిమాటోగ్రాఫర్
    కుమారేష్ డిఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?</strong>
    Demonte Colony 2 Movie Review: హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’ భయపెట్టిందా?
    నటీ నటులు : అరుల్‌ నిధి, ప్రియ భవానీ శంకర్‌, అరుణ్‌ పాండియన్‌, ముత్తుకుమార్‌, మీనాక్షి గోవిందరాజన్‌, సర్జనో ఖలీద్‌, అర్చన చందోక్ తదితరులు దర్శకత్వం : ఆర్‌. జ్ఞానముత్తు సంగీతం : శ్యామ్‌ సీ. ఎస్‌ నిర్మాత : బాబీ బాలచంద్రన్‌ విడుదల తేదీ : 23-08-2024 అరుల్‌ నిధి, ప్రియ భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. అజయ్‌ ఆర్‌.జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్‌.సి.రాజ్‌కుమార్‌ నిర్మాతలు. తమిళంలో ఈనెల 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆగస్టు 23న తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను కూడా అలరించిందా? గతంలో వచ్చిన డిమోంటి కాలనీ తరహాలోనే విజయం సాధించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి శామ్యూల్ రిచర్డ్ (సర్జనో ఖాలిద్) అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు. క్యాన్సర్‌ వంటి మహమ్మారిని జయించిన అతడు ఇలా సుసైడ్‌ చేసుకోవడాన్ని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేకపోతుంది. భర్త ఎందుకు అలా చేశాడని తెలుసుకోవడం కోసం అతడి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓ లైబ్రరీలోని పుస్తకం కారణంగా తాను చనిపోవాల్సి వచ్చిందని శ్యామ్‌ ఆత్మ చెబుతుంది. అయితే ఆ పుస్తకం చదివిన చాలా మంది ఇలాగే చనిపోయినట్లు డెబీ కనుగొంటుంది. రీసెంట్‌గా శ్రీనివాస్‌ (అరుళ్‌ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్‌ (అరుళ్‌ నిధి) కూడా ఈ పుస్తకాన్ని చదివారని డెబీ తెలుసుకుంటుంది. వారి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని గ్రహిస్తుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి? దాని వెనకున్న దుష్ట శక్తి రహాస్యం ఏంటి? ఆ కవల సోదరులను రక్షించేందుకు తన మామయ్య రిచర్డ్‌ (అరుణ్‌ పాండియన్‌)తో కలిసి డెబీ ఏం చేసింది? వాళ్ల ప్రయత్నాలకు బౌద్ద సన్యాసులు ఎలాంటి సాయం చేశారు? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో అరుళ్ నిధి ఇందులో కవలలుగా ద్విపాత్రాభినయం చేశాడు. రెండు క్యారెక్టర్ల మధ్య లుక్స్, నటన పరంగా చక్కటి వేరియేషన్స్‌ చూపించాడు. మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో ప్రియా భవాని శంకర్‌ అదరగొట్టింది. గత చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలో అలరించిన ఆమె ఈసారి నటన స్కోప్‌ ఉన్న పాత్రలో మెప్పించింది. హెయిర్ స్టయిల్ మార్చడం వల్ల ఆమె లుక్ కొత్తగా కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించిందని చెప్పవచ్చు. ప్రియా భవానీ మామ పాత్రలో చేసిన అరుణ్‌ పాండియన్‌ పర్వాలేదనిపించారు. నటి అర్చనా రవిచంద్రన్ కనిపించేది కాసేపే అయినా నవ్వించారు. ముత్తు కుమార్, సర్జనో ఖాలిద్ తదితరులు చక్కగా చేశారు. ముఖ్యంగా బౌద్ధ బిక్షువులుగా కనిపించిన వాళ్ళు ఆకట్టుకునేలా నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గతంలో వచ్చిన 'డిమోంటి కాలనీ' కథకు ముడిపెడుతూ దర్శకుడు ఆర్‌. జ్ఞానముత్తు పార్ట్‌ 2ను రూపొందించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతీ అరగంటకు ట్విస్ట్‌ ఇస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని రగిలించారు. మొదటి భాగంలో లేని ఒక కుటుంబాన్ని రెండో భాగంలోకి తీసుకొచ్చి రెండు కథలను మిక్స్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ ప్రారంభంలోనే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, భర్త ఆత్మతో మాట్లాడాలని భార్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కేవలం హారర్‌ మాత్రమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు వంటివి తీసుకొచ్చి కాస్తంతా వినోదాన్ని కూడా పంచారు. కవల సోదరులను కాపాడం కోసం డెబీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో వచ్చే హారర్‌ ఎలిమెంట్స్‌ థ్లిల్లింగ్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌తో పాటు మూడో భాగానికి లింకప్‌ చేసే సీన్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తాయి. అయితే పేలవమైన గ్రాఫిక్స్‌, కొన్ని సాగదీత సీన్స్‌, క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్స్‌ మైనస్‌లుగా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ మంచి పనితీరు కనబరిచాడు. రెగ్యులర్‌ హారర్‌ చిత్రాల లాగా డార్క్‌ మోడ్‌లో కాకుండా కలర్‌ఫుల్‌గా చూపించి ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్స్‌ విభాగం ఇంకాస్త బెటర్‌గా వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం బాగుంది. సన్నివేశాలపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్‌ కథ, స్క్రీన్‌ప్లేఅరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ నటనహారర్‌ అంశాలు, మలుపులు మైసన్‌ పాయింట్‌ పేలవమైన గ్రాఫిక్స్‌కొన్ని బోరింగ్‌ సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 23 , 2024
    <strong>This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!</strong>
    This Week Movies: ‘దేవర’ వచ్చేస్తున్నాడు.. ఓటీటీలోనూ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు లోడింగ్‌!
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలు సందడి చేస్తున్నాయి. దసరా పండగకు ముందు క్రేజీ చిత్రాలు, అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు దేవర (Devara) ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; సత్యం సుందరం (Sathyam Sundaram) తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్‌ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్‌’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబరు 28న (meiyazhagan release date) విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. పెళ్లి మండపంలో కలుసుకున్న సత్యం, సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా సి.ప్రేమ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. హిట్లర్‌ (Hitler) తమిళ హీరో విజయ్‌ ఆంటోని నటించిన లేటెస్ట్ చిత్రం 'హిట్లర్‌'. దర్శకుడు ధన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 27న ‘దేవర’ మాదిరిగానే హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు, సిరీస్‌లు.. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని అందుకుంది.ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం కానుంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్‌ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)&nbsp; ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అరుళ్‌ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్‌ చేసిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్‌ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది.&nbsp; ముంజ్యా (Munjya) బాలీవుడ్ న‌టి శార్వారీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలలో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘ముంజ్యా’. ఆదిత్య చోప్రా య‌ష్ రాజ్‌ ఫిల్మ్స్‌ యూనివర్స్‌ రూపొందించిన‌ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.&nbsp; ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వ‌హించాడు. ఇటీవల హిందీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DatePenelopeSeriesEnglishNetflixSept 24Heaven And HellMovieEnglishNetflixSept 26The True GentlemanMovieEnglishNetflixSept 26RezballMovieEnglishNetflixSept 27Will And HarperSeriesEnglishNetflixSept 27School FriendsSeriesHindiAmazonSept 25Nobody Wants ThisSeriesEnglishAmazonSept 26Stree 2MovieHindiAmazonSept 27VazhaMovieMalayalamHotstarSept 239-1-1SeriesHindiHotstarSept 24GrotesqueMovieEnglishHotstarSept 16Taja Khabar 2SeriesHindiHotstarSept 27RTIMovieTeluguETV WinSept 26
    సెప్టెంబర్ 23 , 2024

    @2021 KTree