UATelugu
కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. చెల్లెలి మూడో సంతానం నుంచి ప్రాణ గండం ఉందని తెలిసి ఆమె భర్తను చంపేస్తాడు. 21 ఏళ్లు జైలుకు వెళ్తాడు. మరోవైపు కంసరాజు చెల్లెలికి సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి వచ్చిన కంసరాజు సత్యను ఏం చేశాడు? కృష్ణ ఆమెను ఎలా కాపాడుకున్నాడు? అన్నది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
రివ్యూస్
YouSay Review
Devaki Nandana Vasudeva Review: మ్యాటర్ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్ వర్మ? పాపం అశోక్ గల్లా!
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ‘ (Devaki Nandan...read more
How was the movie?
తారాగణం
అశోక్ గల్లా
మానస వారణాసి
దేవదత్తా నాగే
సిబ్బంది
అర్జున్ జంధ్యాలదర్శకుడు
సోమినేని బాలకృష్ణనిర్మాత
కథనాలు
Tollywood Box office: 75% పడిపోయిన విష్వక్ సేన్ మార్కెట్.. సత్యదేవ్, ఆశోక్ గల్లా పరిస్థితి మరీ దారుణం!
ఈ వారం టాలీవడ్ నుంచి మూడు కీలక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. మాస్ కా దాస్ విష్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky) శుక్రవారం (నవంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు విలక్షణ నటుడు సత్యదేవ్(Sathyadev) హీరోగా చేసిన ‘జిబ్రా’ (Zebra) కూడా ఆడియన్స్‌ను పలకరించింది. అలాగే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ ఇచ్చిన కథతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అయితే విష్వక్, సత్యదేవ్ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకోగా అశోక్ గల్ల (Ashok Galla) నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మరీ తొలి రోజు ఈ చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయా? లేదా మంచి వసూళ్లనే సాధించాయా? ఇప్పుడు పరిశీలిద్దాం.
‘మెకానిక్ రాకీ’ కలెక్షన్స్ ఎంతంటే
విష్వక్ సేన్ (Vishwaksen) హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా చేసిన చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanik Rocky Day 1 Collections). రవితేజ ముళ్లపూడి (Raviteja Mullapudi) దర్శత్వం వహించారు. శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో విష్వక్ ప్రేక్షకులను పలకరించాడు. మంచి హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాడు. ‘మెకానిక్ రాకీ’తో ఎలాగైన హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావించిన విష్వక్‌కు ఈ మూవీ ఝలక్ ఇచ్చారు. యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ప్రభావం తొలి రోజు కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. మెకానిక్ రాకీ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 2.3 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. ఇది విష్వక్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. ఆయన గత చిత్రాలు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’ తొలి రోజున వరుసగా రూ.8 కోట్లు, రూ.8.6 కోట్ల గ్రాస్ సాధించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా ధమ్కీ’ కూడా రూ.8.88 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రాలతో పోలిస్తే మెకానిక్ రాకీ డే 1 కలెక్షన్స్ 75% మేర పడిపోయాయని చెప్పవచ్చు.
‘జిబ్రా’ కలెక్షన్స్ ఎంతంటే
సత్యదేవ్ (Satya Dev), డాలి ధనంజయ్ (daali dhananjaya) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra Movie Review). ‘పెంగ్విన్’ సినిమాను డైరెక్ట్ చేసిన ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ కథానాయికలుగా చేశారు. వైట్ కాలర్ క్రైమ్ డ్రామాలో దీనిని రూపొందించారు. మెగాస్టార్ చిరు (Chiranjeevi) ఈ మూవీ ప్రమోషన్స్‌లో స్వయంగా పాల్గొనడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తడబడింది. యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.65.8 లక్షలు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.55.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. శని, ఆది వారాల్లో సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ లేకపోలేదని తెలిపాయి.
దేవకీ నందన వాసుదేవ కలెక్షన్స్ ఎంతంటే
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 22) రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అందరినీ షాక్‌కు గురించేసింది. మూవీ టాక్‌కు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.15.5 లక్షలు మాత్రమే దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరీ ఏం జరుగుతుందో చూడాలి.
నవంబర్ 23 , 2024
Devaki Nandana Vasudeva Review: మ్యాటర్ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్ వర్మ? పాపం అశోక్ గల్లా!
నటీనటులు : అశోక్ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే తదితరులు
డైరెక్టర్ : అర్జున్ జంధ్యాల
కథ : ప్రశాంత్ వర్మ
డైలాగ్స్: బుర్ర సాయి మాధవ్
సినిమాటోగ్రాఫీ: ప్రసాద్ మురెళ్ల, రసూల్
ఎడిటింగ్: తిమ్మరాజు
విడుదల తేదీ: నవంబర్ 22, 2024
ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ మెుదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 22న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కథలో ప్రశాంత్ వర్మ మార్క్ కనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. ఒక రోజు కాశీకి వెళ్లిన కంసరాజుకు అఘోరా తారసపడి నీ మరణం నీ చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం చేతిలో ఉందని చెప్తాడు. దీంతో కడుపుతో ఉన్న చెల్లి (దేవయాని)పై కంసరాజు దాడి చేస్తాడు. ఆమె భర్త చనిపోవడంతో 21 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. అయితే కంసరాజు చెల్లికి ఆడపిల్ల సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన కంసరాజు మేనకోడలు సత్యను ఏం చేశాడు? కంసరాజుకు తెలియకుండా అతడి చెల్లెలు దాచిన సీక్రెట్ ఏంటి? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సత్య ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
కృష్ణ పాత్ర కోసం అశోక్ గల్లా (Devaki Nandana Vasudeva Review) చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. గత చిత్రంతో పోలిస్తే నటన, బాడీ లాంగ్వెజ్‌పరంగా అశోక్ మెరుగయ్యాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా మానస వారణాసి అలరించింది. తెరపై వారి కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే భావోద్వేగాలు పలికించే విషయంలో మానస అక్కడక్కడ తడబడింది. విలన్‌గా దేవదత్తా నాగే ఆకట్టుకున్నాడు. అతడి చెల్లెలు పాత్రలో దేవయాని నటన బాగుంది. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ చక్కగా చేసింది. సంజయ్ స్వరూప్, శత్రు, శ్రీధర్ రెడ్డి, గెటప్ శ్రీను తదితరులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
హనుమాన్ (Hanuman) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) అందించిన కథలో పెద్దగా స్టఫ్ లేదు. స్టోరీకి మైథాలజీని ముడిపెట్టినప్పటికీ అది ఎక్కడా సింక్ అయినట్లు అనిపించదు. పురాణాల నేపథ్యం లాజిక్ లెస్‌గా అనిపిస్తుంది. దర్శకుడు అర్జున్ జంధ్యాల కథనంలోనైనా మ్యాజిక్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. స్క్రీన్‌ప్లేను ఇంట్రస్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. ఓ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కించిన సీన్స్ స్వాగతించేలా లేవు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా పేలవంగా అనిపిస్తుంది. కృష్ణ, కంసరాజు మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సైతం బలంగా చూపించలేకపోయారు. కృష్ణ పాత్రను ఎలివేట్ చేసేందుకు తీసిన కొన్ని సీన్స్ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మెుత్తానికి దర్శకుడు చాలా చోట్లనే ప్రేక్షకులకు బోర్ కలిగించాడు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయాలకు వస్తే భీమ్స్ సిసిలియో సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్ సీక్వెన్స్‌ను అతడి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్ తమ్మిరాజు పనితనం ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
అశోక్ గల్లా నటనయాక్షన్ సీక్వెన్స్‌సంగీతం
మైనస్ పాయింట్స్
మెరుపులు లేని కథనంలవ్‌ట్రాక్‌మిస్‌ఫైర్ అయిన మైథాలజీ టచ్
Telugu.yousay.tv Rating : 2/5
నవంబర్ 22 , 2024
This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia & VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
నవంబర్ 18 , 2024
Mahesh Babu: తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు
యాడ్స్‌లో ఎక్కువగా కనిపించే స్టార్ హీరోల్లో నటుడు మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ ఏదోక యాడ్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే యాడ్స్‌కు సైతం సమయాన్ని కేటాయిస్తుంటాడు. సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రెమ్యూనరేషన్స్ అందుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్-తమన్నా కలిసి ఓ కొత్త యాడ్ చేశారు. ఇందులో వీరి పెయిర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ లుక్కేయండి.
క్యూట్ కపుల్స్‌గా మహేష్-తమన్నా!
మహేష్ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కాంబోలో గతంలో ‘ఆగడు’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైనప్పటికీ వీరి కాంబో బాగుందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రముఖ ఎలక్ట్రానికి కంపెనీ ‘లాయిడ్’ (LLOYD) తమ ప్రొడక్ట్స్‌కు వారిని బ్రాండ్ అంబాసీడర్లుగా నియమించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆ కంపెనీ తీసుకొచ్చిన ‘లాయిడ్ నొవాంటే’ (Lloyd Novante) అనే అత్యాధునిక వాషింగ్ మిషన్ (LLOYD Washing Machine) యాడ్‌లో మహేష్, తమన్నా కలిసి నటించారు. 25 సెకన్ల పాటు సాగిన ఈ ప్రకటనలో వీరిద్దరి పెయిర్ చాలా క్యూట్‌గా అనిపించిదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్‌ను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?app=desktop&v=thhQfEk9ZPs
గతంలోనూ ఇలాగే..
మహేష్ బాబు (Mahesh Babu), తమన్నా (Tamannaah Bhatia) కలిసి ఓ ప్రకటనలో నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరిద్దరు లాయిడ్ కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో నటించారు. లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ ఎసీ, లాయిడ్ ఏసీ తదితర ప్రకటనల్లో వారు క్యూట్ జంటగా కనిపించారు. అందమైన కపుల్స్‌లాగా కనిపిస్తూ ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రత్యేకతలను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ యాడ్స్ వినియోగదారుల్లోకి బాగా దూసుకెళ్లాయి. ఈ స్టార్ నటుల క్రేజ్ దెబ్బకి లాయిడ్ ప్రొడక్ట్స్ సేల్స్ బాగా పెరిగిందన్న ప్రచారం ఉంది.
https://www.youtube.com/watch?v=lWf3C90zBuM&t=6s
https://www.youtube.com/watch?v=scd5zQmuQ_c
ప్రియుడితో దీపావళి సంబరాలు
మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరాణి తాజాగా నిర్వహించిన దీపావళి ఈవెంట్‌కు వీరిద్దరు జంటగా హాజరయ్యారు. ముఖ్యంగా తమన్న పింక్ కలర్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించి అక్కడి వారిని కట్టిపడేసింది. ఎద, నడుము అందాలు చూపిస్తూ ట్రెడిషనల్ పార్టీని సైతం ఎంతో హాట్‌గా మార్చేసింది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తమన్నా-విజయ్ వర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
https://twitter.com/Anamika_upi/status/1850805298019316066
కృష్ణుడిగా మహేష్‌బాబు!
మహేష్ - రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే మహేష్‌కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తన మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తోన్న 'దేవకీ నందన వాసుదేవ' చిత్రంలో మహేష్ శ్రీకృష్ణుడి గెటప్‌లో ఓ చిన్న క్యామియో ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖం చూపించకుండా కల్కిలో కృష్ణుడు ఎలా కనిపించాడో అలానే కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను అందించగా శ్రీకృష్ణుడి రోల్‌ను అతడు ఎంతో పవర్‌ఫుల్‌గా రాశాడని టాక్ ఉంది. క్లైమాక్స్‌లో శ్రీకృష్ణుడి ఉగ్రరూపం షాట్ కూడా ఉంటుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/RajivAluri/status/1850877605630599469
అక్టోబర్ 28 , 2024
Ugadi Special Movie Posters: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కొత్త సినిమా పోస్టర్లు.. ఓ లుక్కేయండి!
ఉగాది సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. ఉగాది స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
సరిపోదా శనివారం
నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaram) చిత్రం నుంచి ఓ ఆకర్షణీయమైన పోస్టర్ రిలీజైంది. ప్రముఖ నటుడు సాయికుమార్ నానితో పాటు ఈ పోస్టర్‌లో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ చేసింది. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
RT 75
ఇటీవల ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. తన తర్వాతి ప్రాజెక్టును ఉగాది సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
లవ్ మౌళి
ప్రముఖ నటుడు నవదీప్ (Navdeep) హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
https://twitter.com/i/status/1777920829575078381
అరణ్మనై 4
రాశీ ఖన్నా (Rashi Khanna), తమన్నా (Tamannaah), సుందర్. సి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరణ్మనై 4’ (Aranmanai 4) చిత్రం నుంచి కూడా ఉగాది కానుకగా ఓ పోస్టర్ విడుదలైంది. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
కమిటీ కుర్రోళ్లు
నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ఉగాది సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేశారు. 'కమిటీ కుర్రోళ్లు' అనే పేరును ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. దర్శకుడు యదు వంశీ కొత్త వాళ్లతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం.
https://twitter.com/i/status/1777941376782786758
ధూం ధాం
చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ (Hebha Patel) జంటగా నటిస్తున్న 'ధూం ధాం' (Dhoom Dhaam) చిత్రం నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా కనిపించింది. ఈ మూవీని దర్శకుడు సాయి కిషోర్ తెరకెక్కిస్తున్నారు.
ఏ మాస్టర్ పీస్
సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఏ మాస్టర్ పీస్' (A Master Peace). అరవింద్ కృష్ణ, జ్యోతి పుర్వాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పండగ సందర్భంగా పోస్టర్ రిలీజైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
దేవకి నందన వాసుదేవ
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vaasudeva). మేకర్స్ ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా లుక్ ఆకట్టుకుంటోంది.
భలే ఉన్నాడే!
యువ నటుడు రాజ్ తరుణ్ (Raj Tharun) హీరోగా రూపొందుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో రాజ్ తరుణ్ ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనిపించాడు.
ప్రతినిధి 2
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా ప్రముఖ జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రతినిధి 2’ (Pratinidhi 2). ఈ మూవీ పోస్టర్ కూడా ఉగాది సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణమ్మ
సత్యదేవ్ (Satya Dev) లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ (Krishnamma) నుంచి ఉగాది సందర్భంగా ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని దుర్గమ్మ పాటను ఏప్రిల్ 11న ఉ.11.11 గం.లకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇందులో సత్యదేవ్ త్రిశూలం పట్టుకొని చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ఏప్రిల్ 10 , 2024
New Movie Posters: శివరాత్రి వేళ కొత్త సినిమా పోస్టర్ల సందడి.. ఓ లుక్కేయండి!
శివరాత్రి సందర్భంగా పలు కొత్త సినిమాల పోస్టర్లు విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. పోస్టర్‌లతో పాటు తమ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌లను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చాయి. శివరాత్రి స్పెషల్‌గా వచ్చిన కొత్త సినిమా పోస్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' నుంచి శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరును పోస్టర్ ద్వారా మూవీ టీమ్ తెలియజేసింది. ప్రభాస్ పాత్ర పేరును భైరవగా ప్రకటిస్తూ భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
కన్నప్ప (Kannappa)
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు ఈ పోస్టర్‌లో కనిపించాడు. కాగా, ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109
నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ కాంబోలో వస్తున్న 'NBK 109' చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలయ్యను బాబీ ‘నేచురల్ బోర్న్ కింగ్’ (NBK)గా చూపించారు. గ్లింప్స్‌లో చాలా స్టైలిష్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
https://twitter.com/i/status/1766375268804120887
ఓదెల 2 (Odela 2)
తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హీరోయిన్ హెబ్బా పటేల్ లీడ్ రోల్‌లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివ శక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగ సాధువు వేషంలో తమన్నా కనిపించింది.
షరతులు వర్తిస్తాయి! (Sharathulu Varthisthai)
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం నుండి కూడా శివరాత్రి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. ‘ఈ దేశంలోని 80% మంది సామాన్యుల కథనే మన సినిమా’ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
‘దేవకీనందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)
తొలి సినిమాతోనే హీరోగా ఆకట్టుకున్న మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) చేస్తున్న రెండో సినిమా ‘దేవకీనందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం చేస్తున్నారు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. కాగా, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi)
హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శుక్రవారం శివరాత్రితో పాటు ‘ఉమెన్స్ డే’ కూడా కావడంతో దానికి గుర్తుగా ఇందులోని అంజలి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరంగ నీతులు (Sri Ranga Neethulu)
సుహాస్ హీరోగా ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’. ఈ సినిమాలో కార్తిక్ రత్నం మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుహాస్, కార్తిక్ రత్నంతో పాటు నటి రుహాని శర్మ పోస్టర్‌లో కనిపించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari)
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా మేకర్స్ అంజలికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సత్యభామ (Sathyabhama)
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఉమెన్స్ డే సందర్భంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
మార్చి 09 , 2024
Family Star: ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్! ‘ఫ్యామిలీ స్టార్’.. చిరంజీవి హిట్ సినిమాకు రీమేక్?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్' (Family Star). ‘గీతా గోవిందం’ (Geetha Govindam) లాంటి క్లాసిక్ హిట్ తర్వాత డైరెక్టర్ పరుశురామ్ (Parasuram) విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్.. తాజాగా ఓ సాంగ్ ప్రొమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో.. మ్యూజిక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #FamilyStar హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.
ఈ సాంగ్ నా ఫేవరేట్: విజయ్
'ఫ్యామిలీస్టార్'కి సంబంధించి మొదటి సాంగ్ ప్రోమోను సోమవారం రాత్రి చిత్రబృందం రిలీజ్ చేసింది. 'నంద నందన' అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్ BGM అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. పూర్తి పాటని రేపు (బుధవారం) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ‘నంద నందన’ పాటను అనంత్ శ్రీరామ్ స్వరపరచగా సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడారు. దీంతో పాటపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్ చేసిన విజయ్.. 'మొదటిపాట.. నా ఫెవరేట్.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రానికి గోపి సుందరం సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
ఫిదా చేస్తున్న మృణాల్..!
ఈ సాంగ్ ప్రోమోలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తళతళ మెరిసిపోయింది. మృణాల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'సీతారామం' తర్వాత తిరిగి ఆ స్థాయిలో ట్రెడిషనల్ లుక్‌లో మృణాల్ కనిపించింది. నుదిటిన బొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిగా కనువిందు చేసింది. 28 సెకన్లు ఉన్న ఈ చిన్న ప్రోమోలోనే మృణాల్ ఈ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తే ఇక సినిమాలో ఆమె ఎంతగా మెస్మరైజ్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మృణాల్‌ను ఎలా చూడాలని తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్నారో ఈ చిత్రంలో ఆమె రోల్ అలాగే ఉంటుందన్న అంచనాలు కూడా ఈ ప్రోమోతో మెుదలయ్యాయి.
‘దేవర’ స్థానంలో..!
'ఫ్యామిలీ స్టార్' రిలీజ్‌పై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆ రోజునే ఎన్టీఆర్ (Jr NTR) 'దేవర' (Devara) చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ‘దేవర’ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో 'ఫ్యామిలీ స్టార్'ను రిలీజ్ చేసేందుకు ఆ డేట్‌నే మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు. 'ఖుషీతో మంచి హిట్ అందుకున్న విజయ్.. ఇక ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
ఒక్క డైలాగ్‌తో మూవీపై హైప్!
గతంలో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' గ్లింప్స్.. ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 'ఐరనే వంచాలా ఏంటి?' అని విజయ్ చెప్పిన డైలాగ్ సినిమాకు బోలెడంత బజ్‌ను తీసుకొచ్చింది. అప్పట్లో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ డైలాగ్‌పై రీల్స్ చేస్తూ సినిమాను నెటిజన్లకు మరింత చేరువ చేశారు. దీంతో ఈ సినిమా కథ ఏంటి? ఇందులో విజయ్ ఫెమినిస్ట్ (Feminist) పాత్రలో కనిపిస్తాడా? అన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగి పోయింది.
సినిమా కథపై క్రేజీ అప్‌డేట్!
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కథకు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సినిమా కథ అదేనంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కథ.. మెగాస్టార్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader Movie)కి దగ్గరగా ఉంటుందట. విజయ్ మూవీ కూడా ‘గ్యాంగ్ లీడర్’లాగే ముగ్గురు అన్నదమ్ముల కథ అట. అందులో విజయ్ శాంతి.. చిరంజీవి ఇంట్లో అద్దెకి వచ్చినట్టు, ఇందులో మృణాల్ ఠాకూర్ .. విజయ్ ఇంట్లో రెంట్‌కి దిగుతుందట. కాకపోతే ఇది హీరోయిన్ రీవెంజ్ స్టోరీ అని అంటున్నారు. చివర్లో విజయ్ ఆమెకు అండగా నిలబడతాడని చెబుతున్నారు. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.
ఫిబ్రవరి 06 , 2024
PAWAN KALYAN: IMDBలో పవర్ స్టార్ టాప్ రేటెడ్ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..!
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్ క్రేజ్ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్ రేటెడ్ పవన్ మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. తొలి ప్రేమ
IMDBలోని పవన్ కల్యాణ్ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ అని సాంగ్.
2. ఖుషి
పవన్ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్ మేనరిజమ్స్, సొంతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్స్ మూవీకే హైలెట్ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.
3. తమ్ముడు
1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్ కల్యాణ్ నటించాడు. ఇందులో పవన్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.
4. జల్సా
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.
5. బద్రి
పూరి జగన్నాథ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్' అనే డైలాగ్ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.
6. అత్తారింటికి దారేది
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.
7. గోపాల గోపాల
పవన్ కల్యాణ్, వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్ దేవుడిలా కనిపించడం విశేషం.
8. గబ్బర్ సింగ్
హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.
9. వకీల్‌సాబ్
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్ సాబ్ (Vakeel saab). హిందీ పింక్ చిత్రానికి ఇది రీమేక్. 2021లో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్ సంపాదించింది.
10. పంజా
‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్, అంజలి లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం.
జూలై 31 , 2023
This Week OTT Movies: ‘దేవర’ ఎఫెక్ట్.. థియేటర్లలో ఒకే ఒక్క తెలుగు చిత్రం.. ఓటీటీలో మాత్రం జాతరే!
సెప్టెంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు ఒకే ఒక్క తెలుగు చిత్రం సిద్ధమైంది. ఈ వారం సుహాస్ సింగిల్‌గా రాబోతున్నాడు. తర్వాతి వారమే 'దేవర' రిలీజ్ ఉండటంతో తమ చిత్రాలు రిలీజ్ చేసేందుకు తెలుగు దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండు బ్లాక్‌బాస్టర్ చిత్రాలు రీరిలీజ్ వచ్చేస్తున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గొర్రె పురాణం
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సుహాస్ (Suhas) నటించిన మరో వినూత్న చిత్రం ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). బాబీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది? ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు? అనే ఆసక్తికర కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో గొర్రెకు దర్శకుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
యుద్ర
సిద్ధాంత్ చతుర్వేది, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో రవి ఉద్యావర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘యుద్ర’ (Yudhra Movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 20న హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ మూవీతోనే మాళవి బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆమె పలు ఇంటిమేట్, ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేశారు.
కహా షురూ.. కహా ఖతం
ధ్వని భానుశాలి, ఆషిమ్ గులాటీ కీలక పాత్రల్లో శౌరబ్ దాస్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కహా షురూ.. కహా ఖతం’ (Kahan Shuru Kahan Khatam). సెప్టెంబరు 20న ఈ మూవీ హిందీలో విడుదలకు సిద్ధమైంది. ‘మిమి’, ‘జర హట్కే జర బచ్కే’ వంటి కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీకి కథను అందించడం విశేషం.
బొమ్మరిల్లు
సిద్ధార్థ్, జెనీలియ జంటగా భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'బొమ్మరిల్లు' (Bommarillu) చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2006లో విడుదలైన ఈ చిత్రం పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలేట్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21న తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్‌లో ‘బొమ్మరిల్లు’ విడుదల కానుంది.
జర్నీ
తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘జర్నీ’ (Journey Movie). జై, శర్వానంద్, అంజలి అనన్య కీలక పాత్రల్లో నటించారు. భారీ బస్ యాక్సీడెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఇప్పుడు మరోమారు థియేటర్లలో అలరించేందుకు జర్నీ రాబోతోంది. సెప్టెంబరు 21న ‘జర్నీ’ కూడా రీ-రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
తంగలాన్
తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్' (Thangalaan). ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు అందుబాటులోకి రానుంది. అయితే ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం మాత్రం ఎంథుసన్ ఓటీటీలో శనివారమే ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రావడం గమనార్హం.
తిరగబడరా సామి
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించిన ‘తిరగబడరా సామీ’ (Thiragabadara Saami) మూవీ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
హంట్
మలయాళం హారర్ మూవీ ‘హంట్’ (Hunt) థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 వేదికగా సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజైన హంట్ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. భావన యాక్టింగ్ బాగున్నా రొటీన్ స్టోరీ కారణంగా హంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island). ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateGrave TortureMovieEnglishNetflixSept 16Culinary Class WarsSeriesEnglish/KoreanNetflixSept 17Fast XMovieEnglishNetflixSept 18Leave from the other sideTalk ShowEnglishNetflixSept 18Twilight of the GodsSeriesEnglishNetflixSept 19He’s Three DaughtersMovieEnglishNetflixSept 20Evil Dead RiseMovieEnglishNetflixSept 21Saripodhaa SanivaaramMovieTeluguNetflixSept 26A very Royal Scandal SeriesEnglishAmazonSept 19Stree 2MovieHindiAmazonSept 27DurgaMovieHindiJio CinemaSept 16Jo Tera Hai Woh Mera HaiMovieHindiJio CinemaSept 20The PenguinSeriesEnglishJio CinemaSept 29UnPrisonedMovieEnglishHotstarSept 16Agatha All AlongMovieEnglishHotstarSept 17The Judge From HellSeriesEnglishHotstarSept 21
సెప్టెంబర్ 16 , 2024
Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
"పుష్ప 2" క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నా స్ఫూర్తిదాయకమైన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకోనుంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానులను అలరిస్తోంది.
ఈ చిత్రంలోని పాటలు ప్రతీ సీన్‌లోని భావోద్వేగాలను, కథలోని ప్రధాన అంశాలను దృశ్యమాలికగా మన కళ్ల ముందు కదిలేలా చేస్తున్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన "పుష్ప: ది రైజ్" చిత్రానికి కొనసాగింపుగా, "పుష్ప 2: ది రూల్"లో పాటలు కథనానికి మరింత జీవం పోసేలా ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు విడుదలైన పుష్ప: ది రూల్ చిత్రంలోని పాటల లిరిక్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్ వేయండి.
Peelings Song Lyrics in Telugu
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
ఆరుంటికోసారి
యేడింటికోసారి
పావు తక్కువ పదింటికోసారి
పడుకుంటే ఓసారి
మేల్కుంటే ఓసారి
యేమి తోసక కూసుంటే ఓసారి
యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి
కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి
నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
ఛీ అంటే ఓసారి
పో అంటే ఓసారి
చాటు మాటుగా సై అంటే
ఓసారి
పూలెడ్తే ఓసారి
నాగలెడ్తే ఓసారి
సాదా సీదా చీర కట్టెత్తే
ఓసారి
ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి
యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి
నీళ్లు తోడుతుంటే నిజంగ
ఓసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
రోటి పచ్చడి నువ్వు
నూరుతున్నప్పుడు ఆఁ
పైటతోటి సెమట నువ్వు
తుడుసుకున్నప్పుడు
దండాన నీ సొక్క
ఆరేస్తున్నప్పుడు
నీ వొంటి వాసన
తెగ గుర్తొచ్చినప్పుడు
రెండు సేతుల నీ జుట్టు
ముడిసినప్పుడు
దిండు కత్తుకొని
పడుకున్నప్పుడు
అలసిపోయి నువ్వు
ఆవలించినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
అంబిలి పూనిలా నముకలో
ముళ్ల మలార్ మని చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
తువ్వాలు తో నా
తలను తుడిసినప్పుడు
నడుమ నడుమ నువ్వు నా
నడుము తురిమినప్పుడు
అన్నం కలిపి నోట్లో
ముద్ద పెట్టినప్పుడు
యెంగిలి మూఁతితో నువ్వు
ముద్దు పెట్టినప్పుడు
సీర సెంగుని నువ్వు
సవరించినప్పుడు
సాయం సేత్తో
సెయ్యేసినప్పుడు
సొంత మొగుడు సెంత
సిగ్గు పడినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ
వచ్చి వచ్చి చంపేస్తుండాయ్
పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా
కన్మున తుముకలో
అంబిలి పూనిలా నముకలో
పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో
నిన్ మని చుండుకలో
తేన్ తెరేంజెతున్న వండుకలో
పూన్కినా తుండుకలో
https://www.youtube.com/watch?v=8RAd-_Qj_ac&ab_channel=T-SeriesTelugu
Kissik Song Lyrics in Telugu
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు
బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా
దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో
భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి
పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో
ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు
కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి
పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
Pushpa Title Song Lyrics In Telugu
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
దేశం దద్దరిల్లే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
భూమే బద్దలయ్యే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
నువ్వు నిలవాలంటే ఆకాశం
ఎత్తే పెంచాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
లోతే తవ్వాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు వుంటే నీదే తప్పవదా
పెద్ద గద్దలాగమబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి
కాళ్ళ కింద కురిసెయ్‍దా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంటా
వణుకే రాదు ఓటమి రాదు
వెనకడుగు ఆగడము
అస్సలు రానే రాదు
అన్నీ ఉన్న పుష్పాకి
పాపం కొన్ని లేవంటా
భయమే లేదు బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు
ఎయ్ దండమెడితే దేవుడికే
సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా
తల దించినావా బానిసవి
ఎత్తినావా బాద్‍షావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా
ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే
హే వాడు నీకు గొప్పే కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
నీ పేరే నీ బ్రాండు
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
అస్సలు తగ్గేదెలే
Suseki Song lyrics In Telugu
వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు
వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు
ఓ ఓ మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
హో ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు
కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి
హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు
బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ
డిసెంబర్ 03 , 2024
Jigra Movie Review: తమ్ముడి కోసం అక్క చేసే విరోచిత పోరాటం.. ‘జిగ్రా’ ఎలా ఉందంటే?
నటీనటులు : అలియా భట్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా, అకాంక్ష రంజన్ కపూర్, మనోజ్ పహ్వా, యువరాజ్ విజయన్, జసన్ షా, ధీర్ హిరా, ఆదిత్య నంద తదితరులు
దర్శకత్వం : వాసన్ బాల
సంగీతం : అచింత్ థక్కర్
సినిమాటోగ్రఫీ : స్వప్నిల్ ఎస్. సోనావానే
ఎడిటింగ్ : ప్రేర్నా సైగల్
నిర్మాతలు : కరణ్ జోహార్, అలియా భట్, షాహీన్ భట్, అపూర్వ మెహతా
విడుదల తేదీ : 11-10-2024
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘RRR’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించింది. హిందీ ‘దేవర’ ప్రమోషన్స్‌లోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అటువంటి అలియా భట్ లీడ్‌రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జిగ్రా’ (Jigra Movie Review). వాసన్ బాలా దర్శకుడు. తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబరు 11న (Jigra Release Date) ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్ మేనేజ్‌మెంట్ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. మంచి బిజినెస్ ఐడియాతో ఉన్న అంకుర్ ఇన్వెస్టర్లను కలిసేందుకు మలేషియా దగ్గర్లో ఉన్న హన్షి దావో దేశానికి వెళ్తాడు. అక్కడ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి మరణశిక్ష విధిస్తారు. దీంతో తమ్ముడిని కాపాడటానికి సత్యభామ తనకు కుదిరిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. దీంతో జైలు నుంచి తప్పించడం తప్ప మరో మార్గం లేదని సత్య నిర్ణయిస్తుంది. మరి ఈ ప్రయత్నంలో సత్య విజయం సాధించిందా? ముత్తు (రాహుల్ రవీంద్రన్), భాటియా (మనోజ్ పహ్వా) ఎవరు? సత్యకు వారు ఏ విధంగా సాయపడ్డారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సత్యభామగా ఆలియా భట్ అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. తమ్ముడిని కాపాడుకునే అక్క పాత్రలో అలియాను తప్ప మరొకరిని ఊహించలేనంత బాగా నటించింది. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్మురేపింది. తమ్ముడు అంకుర్ పాత్రలో వేదాంగ్ రైనా మంచి నటన కనబరిచాడు. అటు ముత్తు రూపంలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్‌కు మంచి పాత్ర దక్కింది. కథలో అతడి రోల్ ఎంతో కీలకం. మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వాసన్ బాలా జైల్ బ్రేక్ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభమైన వెంటనే నేరుగా కథలోకి వెళ్లి అక్క, తమ్ముళ్ల బాండింగ్‌ను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. వారి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్‌ను ఆడియన్స్ ఫీలయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే అంకుర్ అరెస్టు వరకూ కథను అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అరెస్టు తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. జైలులో అతడు పడే తిప్పలు, తమ్ముడ్ని బయటకు తీసుకొచ్చేందుకు సత్య చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తమ్ముడ్ని జైలు నుంచి తప్పించాలని సత్య నిర్ణయించుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అందుకు ఆమె చేసే సాహాసోపేత ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్. క్లైమాక్స్ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అయితే సాగదీత సన్నివేశాలు, ఊహజనీతంగా కథనం, ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక విభాగాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. జైలు వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ చక్కగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో కొన్ని షాట్లు విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తాయి. సంగీతం కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లు ఉంది. ఎడిటర్ మూవీని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అలియా భట్ నటనఅక్కా-తమ్ముడి సెంటిమెంట్‌యాక్షన్ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఊహాజనీత కథనం
Telugu.yousay.tv Rating : 2.5/5
అక్టోబర్ 11 , 2024
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు
నందమూరి బాలకృష్ణ ఎవరు?
బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం.
నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు?
చెన్నై
నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు?
1960 జూన్ 10
నందమూరి బాలకృష్ణ భార్య పేరు?
వసుంధర దేవి
బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?
ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని)
నందమూరి బాలకృష్ణ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, కుకింగ్
NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు?
తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ
బాలకృష్ణ అభిమాన నటుడు?
నందమూరి తారక రామారావు
బాలకృష్ణ అభిమాన హీరోయిన్?
సావిత్రి
బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు?
మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ.
బాలకృష్ణకు ఇష్టమైన కలర్?
వైట్
బాలకృష్ణ ఏం చదివాడు?
నిజాం కాలేజీలో డిగ్రీ
బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 108 సినిమాల్లో నటించాడు
బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం?
చికెన్ పలావు
బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.
బాలకృష్ణ 100వ సినిమా పేరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM
బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
హిందూపురం
బాలయ్య గెలుచుకున్న అవార్డులు?
బాలయ్య 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
మార్చి 19 , 2024
Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్, తారక్‌కు బండ్ల గణేష్ చురకలు!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు బాహాటంగా మద్దతు తెలుపుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ సంచలన పోస్టు పెట్టారు. శుక్రవారం (నవంబర్ 9) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రమే సీఎం కావాలని సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌పై బండ్ల గణేష్ ఫైర్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 8న ఘనంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకరిద్దరు మినహా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్‌గా మారింది.
https://twitter.com/ganeshbandla/status/1855087509103165519
తారక్, ప్రభాస్‌కు చురకలు?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్‌గా టికెట్ల రేటు పెంపు విషయాన్ని బండ్ల గణేష్ ప్రస్తావించడం చర్చకు తావిస్తోంది. స్టార్ హీరోలు ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌లను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’, తారక్ చేసిన ‘దేవర’ చిత్రాలు టికెట్ పెంపునకు తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అయితే శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్బంగా తారక్, ప్రభాస్ నుంచి ఎలాంటి విషింగ్ పోస్టు రాలేదు. దీంతో బండ్ల గణేష్ వారిద్దరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విష్ చేసిన స్టార్స్ వీరే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. 'రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం రేవంత్ రెడ్డిని విష్ చేశారు. దేవుడు మీకు ఆరోగ్యాన్నివ్వాలని, రాష్ట్రాన్ని మరింత సుభిక్షం వైపు నడిపించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌ను ప్రశంసించాడు.
https://twitter.com/KChiruTweets/status/1854736624749625361
https://twitter.com/PawanKalyan/status/1854776671339262428
https://twitter.com/AlwaysRamCharan/status/1854859851509141522
https://twitter.com/urstrulyMahesh/status/1854818024030929039
నంది అవార్డుల విషయంలో రగడ!
ఈ ఏడాది జనవరిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఈ ప్రకటన చేసి ఆరేడు నెలలు గడిచినా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ఓ వేదికపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పెద్దల మౌనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, అతడి ఫ్యామిలీపై కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు టాలీవుడ్‌ను కుదిపేశాయి. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ పెద్దలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
https://twitter.com/RamMohanINC/status/1752717581834916020
నవంబర్ 09 , 2024
Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్ మాత్రం బాక్స్ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా.
అతడు- మహేష్ బాబు
"ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే
పెను తుఫాను తలొంచి చూసే
తొలి నిప్పు కణం అతడే... అతడే..
అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ
పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది
"బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.
https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K
ప్రభాస్- బాహుబలి 2
బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు.
https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92
దసరాలో నాని
దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్ ఫ్యాన్స్ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు.
https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF
బాలకృష్ణ- లెజెండ్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ.
https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j-
రామ్ చరణ్- చిరుత
తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్ చేత పూనకాలు పెట్టించింది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
జూ.ఎన్టీఆర్- RRR
కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu
పవన్ కళ్యాణ్- పంజా
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది.
https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby
మహేష్ బాబు- పోకిరి
పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది.
https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg
అల్లు అర్జున్- ఆర్య
మ్యాన్ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు.
https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ
సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్
సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది.
https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE
స్టాలిన్- చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. అమ్మాయిని కిడ్నాప్ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT
రామ్ చరణ్- మగధీర
ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు.
https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i
ప్రభాస్- బిల్లా
హాలీవుడ్ రేంజ్ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.
https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta
ఘర్షణ- వెంకటేష్
ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు.
https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
ఫిబ్రవరి 26 , 2024
Shaakuntalam Review: శకుంతలగా సమంత ఓకే.. మరి డైరెక్టర్‌గా గుణశేఖర్ సక్సెస్ అయ్యాడా?
నటినటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్, గౌతమి, అల్లు అర్హ
దర్శకత్వం: గుణశేఖర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత గతేడాది ‘యశోద’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఇవాళ (ఏప్రిల్ 14) ‘శాంకుతలం’ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు గుణశేఖర్ డైరెక్టర్ కావడం, దిల్ నిర్మాతగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దీనికి తగ్గట్టుగానే పాటలు, ప్రచార చిత్రాలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో శాకుంతలంపై ఆసక్తి రెట్టింపు అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సమంత, గుణశేఖర్‌లకు హిట్ తెచ్చి పెట్టిందా? వంటివి రివ్యూలో చూద్దాం.
కథ:
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు ఆదేశంతో మేనక (మధుబాల) భూమిపైకి వస్తుంది. తన అందంతో తపస్సును నాశనం చేయడమే కాకుండా విశ్వామిత్రుడికి శారీరకంగా దగ్గరై పాపకు జన్మనిస్తుంది. ఆ పాపకు కణ్వ మహర్షి (సచిన్ ఖడేకర్) శాంకుతల(సమంత)గా పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. శాంకుతల పెద్దయ్యాక ఓ రోజు కణ్వ అశ్రమానికి వచ్చిన దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఆమె అందచందాలు చూసి ఇష్టపడతాడు. గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు. త్వరలోనే తిరిగి వచ్చి రాజ్యానికి తీసుకెళ్తానని దుష్యంతుడు హామి ఇస్తాడు. ఈ క్రమంలో సమంత గర్భవతి అవుతుంది. ఈ నేపథ్యంలో దుష్యంతుడు, సమంత ఎలా కలిశారు? వారు విడిపోవడానికి దుర్వాస మహాముని (మోహన్‌బాబు)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే:
శకుంతల పాత్రకు సమంత పూర్తిగా న్యాయం చేసింది. భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించింది. అయితే ఈ పాత్రకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం మైనస్ అని చెప్పొచ్చు. పౌరాణిక పాత్ర కావడంతో సమంత వాయిస్ అతికినట్లు అనిపించదు. భరతుడి పాత్రలో అల్లు అర్హ ఆకట్టుకుంది. ఎంతో చలాకీగా నటించింది. ముద్దుముద్దు మాటలతో అలరించింది. అటు దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటన ఆకట్టుకుంటుంది. సమంత, దేవ్ మోహన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దుర్వాస మహర్షి పాత్రకు మోహన్‌బాబు నిండుదనం తీసుకొచ్చారు. ఆయన తెరపై కనిపించేంది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా వంటి నటులు తెరపై చాలా మందే ఉన్నప్పటికీ నటనపరంగా వారికి పెద్దగా అవకాశం దక్కలేదు.
టెక్నికల్‌గా:
శాకుంతలం సినిమాను తీయడంలో డైరెక్టర్ గుణశేఖర్ తడబడినట్లు కనిపిస్తోంది. అందరికీ తెలిసిన ప్రేమ కావ్యాన్ని ఓ దృశ్య కావ్యంలా ఆవిష్కరించడంలో డైరెక్టర్ విఫలమయ్యారు. గ్రాఫిక్స్ విజువల్స్ విషయంలో మరింత శ్రద్ధ వాహించి ఉంటే బాగుండేది. దుష్యంతుడు రాజుగా కంటే కమర్షియల్ సినిమాల్లో హీరోగానే ఎక్కువగా అనిపిస్తాడు. పైగా శాంకుతలం కథ దుష్యంతుడి కోణంలో చెప్పుకుంటూపోవడం ప్రేక్షుకులకు అంతగా రుచించలేదు. అయితే మణిశర్మ సంగీతం ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటలే సినిమాలో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
సమంత నటనమణిశర్మ సంగీతం విరామ, పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంగ్రాఫిక్స్‌సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 2/5
ఏప్రిల్ 15 , 2023
Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడ మిక్స్‌డ్ టాక్ మినహా ఓవరాల్‌గా పాటిజివ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్‌తో దేవర ప్రదర్శితమవుతోంది. ఎన్టీఆర్ నటన, అనిరుధ్ మ్యూజిక్, కొరటాల శివ డైలాగ్స్ అదిరిపోయాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేవర రూ.172 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్ ఎన్ని కోట్లకు చేరాయో ఇప్పుడు చూద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో మూడు రోజులు పూర్తైనా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ చిత్రం వీకెండ్‌లో ఏకంగా రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద దేవర ఊచకోత కొనసాగుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరిన ‘దేవర’ ఈ వారంలోనే ఈజీగా రూ.500 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
https://twitter.com/DevaraMovie/status/1840623014981075232
ప్రాంతాల వారీగా..
దేవర మేకర్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రమే ప్రకటించారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ప్రాంతాల వారీగా దేవర వసూళ్లను అంచనావేసే ప్రయత్నం చేశాయి. వాటి ప్రకారం దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వ్యవధిలో రూ.126.5 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క నైజాంలోనే రూ.38.77 కోట్లు రాబట్టింది. సీడెడ్ ఏరియాల్లో రూ.17.90 కోట్లు దేవరకు వచ్చి చేరాయి. కర్ణాటకలో రూ. 20.9 కోట్లు, తమిళనాడులో రూ.5.9 కోట్లు, కేరళలో రూ.1.4 కోట్లు, రెస్ ఆఫ్ ఇండియాలో రూ.35.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. అటు ఓవర్సీస్‌లో రూ.65 కోట్లకు పైగా దేవర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మెుత్తంగా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ తారక్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు.
డే 1 కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు!
ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దేవర నిలిచింది. దేవర చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ‘RRR’ తర్వాత తారక్ కెరీర్‌లో ఇదే అత్యధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.83.71 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క నైజాంలోనే 19.32 కోట్ల వసూళ్లు అందుకొని 'RRR' తర్వాత ఆల్‌టైమ్ టాప్- 2లో నిలిచిందని పేర్కొన్నాయి.
దేవర సక్సెస్‌కు కారణాలు ఇవే!
దేవరలో ఎర్ర సముద్రం అనే సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కొరటాల శివ సృష్టించారు. ఈ సినిమాలో తారక్ వన్ మ్యాన్ షో చేశారు. దేవర, వర అనే తండ్రి కొడుకుల పాత్రలో అద్వితీయమైన నటన కనబరిచాడు. మరోవైపు విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుధ్ బీజీఎం గూస్‌బంప్స్ తెప్పించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తనదైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించిన తీరు అభినందనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఆడియన్స్‌కు మంచి మజాను అందించాయి. అయితే సాగదీత సన్నివేశాలు, పేలవమైన లవ్‌ట్రాక్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
దేవర స్టోరీ
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సెప్టెంబర్ 30 , 2024
Devara Run Time Fear: దేవర సెన్సార్ వర్క్ కంప్లీట్.. తెలిసి కూడా తప్పు చేస్తున్నారా?
ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను 'దేవర' (Devara: Part 1) పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ను కూడా సెన్సార్ సభ్యులు ఫిక్స్ చేశారు. సుదీర్ఘమైన ఈ సినిమా నిడివిని చూసి అభిమానుల్లో కొత్త టెన్షన్ మెుదలైంది. తెలిసి కూడా దేవర టీమ్ రిస్క్ చేస్తున్నారా? అన్న కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెన్సార్ క్లియర్
జూ.ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన దేవర చిత్రం సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా నిడివిని 2 గంటల 57 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే దాదాపుగా మూడు గంటల నిడివితో దేవర థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. సాధారణంగా మూడు గంటలు అంటే పెద్ద నిడివే అని చెప్పవచ్చు. అయితే, దేవర మూవీలో యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఉండడం, కథను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండటంతో ఎక్కువ నిడివికే మేకర్స్ నిర్ణయించుకున్నారు.
తెలిసే రిస్క్ చేస్తున్నారా?
దేవర చిత్రాన్ని దాదాపు మూడు గంటల నిడివితో తీసుకొస్తుండటం పెద్ద రిస్కే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు గంటల పాటు ప్రేక్షకులను సీట్‌లో కూర్చోపెట్టడం అంటే మాములు విషయం కాదని అంటున్నారు. కథ ఏమాత్రం ల్యాగ్ అనిపించినా, అనసవర సన్నివేశాలు వచ్చినా అది సినిమాపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని తేల్చి చెబుతున్నారు. గతంలో వచ్చిన పలు చిత్రాల విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. కథ ఎంత బాగున్నప్పటికీ నిడివి కారణంగా ఆ సినిమాలు దెబ్బతిన్నాయని గుర్తుచేస్తున్నారు. కాబట్టి ‘దేవర’ విషయంలో ఏమాత్రం అంచనాలు మిస్ అయినా భారీ ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. అటు కొందరు తారక్ ఫ్యాన్స్ సైతం నిడివి విషయంలో నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!
ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.
కొరటాల పైనే భారం!
గత చిత్రాల్లో లాగా కొరటాల శివ మ్యాజిక్ చేయగలిగితే నిడివి పెద్ద సమస్య కాదని చెప్పవచ్చు. తారక్ యాక్టింగ్‌తో పాటు కథ, కథనం, మేకింగ్‌తో కొరటాల కట్టిపడేస్తే 'దేవర' రన్‌టైమ్ బిగ్ ప్లస్‌గా మారే అవకాశం లేకపోలేదు. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్ సక్సెస్ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’తో పాటు అంతకుముందు వచ్చిన 'కల్కి 2898 ఏడీ', యానిమల్ 'సలార్', యానిమల్ చిత్రాలు కూడా మూడు గంటల నిడివితో వచ్చే సక్సెస్ అయ్యాయి. కొరటాల శివ గతంలో మాదిరి దేవర విషయంలోనూ మ్యాజిక్ చేయగలిగితే ఈ సినిమా సకెస్స్‌ను ఎవరూ అడ్డుకోలేరు.
రాజమౌళి ఫ్లాప్ భయం!
‘దేవర’ చిత్రాన్ని మరో భయం కూడా వెంటాడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో పనిచేసిన హీరోలు తమ తర్వాతి చిత్రాల్లో భారీ ఫ్లాప్స్‌ను అందుకున్నారు. రవితేజ, ప్రభాస్, రామ్‌చరణ్ విషయాల్లో ఇదే రుజువైంది. అంతేందుకు రాజమౌళితో చేసిన ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’ వంటి హిట్ చిత్రాల తర్వాత తారక్ చేసిన మూవీస్ డిజాస్టర్లుగా నిలిచాయి. సుబ్బు, ఆంధ్రావాలా అతడి కెరీర్‌లో మాయని మచ్చలా మారిపోయాయి. తారక్ గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన నేపథ్యంలో ‘దేవర’పై ఆందోళన వ్యక్తంమవుతోంది. దేవర విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ‘దేవర’తో ఈ సెంటిమెంట్‌ను బద్దలు కొడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 12 , 2024
Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ట్రైలర్ వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దేవర ట్రైలర్‌పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మార్క్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది. కొన్ని డైలాగ్స్ చాలా బాగా పేలాయి.
ట్రైలర్ రిలీజ్..!
ముంబైలో గ్రాండ్‌గా ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 2 నిమిషాల 39 సెకన్లున్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు, యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ క్రియేట్ చేసిన ప్రత్యేకమైన ప్రపంచం, ఆయన విజన్ అద్భుతంగా ఉన్నాయి. ఆద్యంతం ఈ ట్రైలర్ యాక్షన్‌తో నిండిపోయింది. ఇందులో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు.
https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
ఎలా సాగిందంటే?
ట్రైలర్‌ను పరిశీలిస్తే ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్‌గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.
ట్రైలర్‌లో అవే హైలెట్స్!
ట్రైలర్ చూశాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో తారక్ డైలాగ్స్, నటన, మాస్ లుక్ తెగ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కూడా చాలా క్యూట్‌గా పల్లెటూరి పిల్లగా కనిపించింది. 'వాడికి వాడి అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే' అని తారక్‌ను జాన్వీ కపూర్ అంటుంది. దీంతో ఎన్టీఆర ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఆకట్టుకుంది. ట్రైలర్ చివరలో ఎన్టీఆర్ షార్క్‌పై ఉండి రైడ్ చేసే సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అటు ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో మరో లెవల్లో ఉంటాయని ట్రైలర్‌ని బట్టే తెలిసిపోతుంది. అనిరుధ్ మార్క్ బీజీఎంతో సెప్టెంబర్ 27న థియేటర్లు మోతమోగనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
సెప్టెంబర్ 10 , 2024
Devara Run Time: భయపెడుతున్న ‘దేవర’ రన్‌టైమ్..! అదే జరిగితే ఎదురుదెబ్బ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరిగ్గా 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైగ్ ఆడియన్స్‌ను పలకరించనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో తారక్‌కు జోడీగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), బాబీ డియోల్ (Bobby Deol) వంటి హిందీ స్టార్ నటులు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దేవర’ రన్‌టైమ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది చూసి తారక్ ఫ్యాన్స్ అందోళనకు గురవుతున్నారు.
రన్ టైమ్ ఎంతంటే?
తారక్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన దేవర చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రన్ టైమ్ ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మెుత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను దేవర టీమ్ ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఎడిటింగ్ వర్క్ మెుత్తం పూర్తైన అనంతరం ఈ మేరకు నిడివి వచ్చిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద నిడివి ‘దేవర’ను ఇబ్బంది పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన చాలా వరకు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని గుర్తుచేస్తున్నారు. అయితే ఈ నిడివే ‘దేవర’కు ఫైనల్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే సెన్సార్ బోర్డు సమీక్షకు ఈ మూవీ వెళ్లాల్సి ఉంటుంది. బోర్డ్ సభ్యులు ఏదైన కత్తెరలు విధిస్తే నిడివి కాస్త తగ్గే అవకాశముంది.
కొరటాల మ్యాజిక్ చేసేనా?
సెన్సార్ ఎన్ని కత్తెరలు విధించిన ‘దేవర’ నిడివి 3 గంటల కంటే తగ్గే పరిస్థితులు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల స్క్రీన్‌ప్లే ప్రెజెన్స్‌పై సినిమా సక్సెస్ ఆధారపడనుంది. కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాలను పరిశీలిస్తే ఆయన డైరెక్షన్ స్కిల్స్ అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ లైన్‌కు అద్భుతమైన డ్రామా, స్క్రీన్‌ప్లేను జత చేసి కొరటాల సూపర్ సక్సెస్ అయ్యారు. ‘దేవర’లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ కూడా దాదాపుగా 3 గంటల నిడివితో రిలీజైంది. అయినప్పటికీ అద్భుతమైన యాక్షన్ డ్రామా, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ స్కిల్స్, నాని - ఎస్.జే. సూర్య అద్భుతమైన నటనతో నిడివి పెద్దగా సమస్య కాలేదు.
నిడివితో దెబ్బతిన్న చిత్రాలు!
ఇటీవల కాలంలో రిలీజైన ‘భారతీయుడు 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఎక్కువ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘భారతీయుడు 2’ను పక్కన పెడితే మిగిలిన రెండు చిత్రాలు మంచి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో అవి విఫలమయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ మంచి నటన కనబరిచినప్పటికీ నిడివి ఎక్కువ ఉంటడం వల్ల బాగా సాగదీసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది. ‘అంటే సుందరానికి’ విషయంలోనూ ఇదే జరిగింది. విభిన్న మతాలకు చెందిన యువతి, యువకుడు ప్రేమలో పడితే వచ్చే సమస్యలు ఏంటన్న యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ, సుదీర్ఘమైన నిడివి వల్ల సీరియల్‌గా ఉందంటూ విమర్శలు ఎందుర్కొంది.
కొత్త పోస్టర్ రిలీజ్
దేవర చిత్రం నుంచి నేడు మూడో సాంగ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్టమల్లే పాటలను విడుదల చేయగా.. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి 'దావుడి' పేరుతో థర్డ్ సింగిల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తారక్, జాన్వీ కపూర్ ఇచ్చిన రొమాంటిక్ ఫోజు ఆకట్టుకుంటోంది.
https://twitter.com/DevaraMovie/status/1831219654229913706
‘దేవర’ స్టోరీ అదేనా?
'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
సెప్టెంబర్ 04 , 2024
Dev Mohan: సమంతను ఇంప్రెస్ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?
శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్ మోహన్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్ మోహన్ 18 సెప్టెంబర్ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే దేవ్ మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే 2016లో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచాడు. 2020లో రజీనా అనే అమ్మాయిని దేవ్ పెళ్లి చేసుకున్నాడు.
2020 లో మళయాళం మూవీ 'సూఫీయుం సుజాతయుమ్' చిత్రం ద్వారా తొలిసారి దేవ్ మోహన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో ‘సూఫీ రోల్‌లో కనిపించి దేవ్ మెప్పించాడు. ఆ తర్వాత 2021లో పులి, పంత్రండు చిత్రాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గుణశేఖర్ కంట్లో పడ్డ దేవ్ మోహన్ శాకుంతలం చిత్రంలో కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్యూ ఇచ్చిన దేవ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: శాకుంతలం ఆఫర్ ఎలా వచ్చింది?
దేవ్: నిర్మాత నీలిమ నా ఫస్ట్ ఫిల్మ్ 'సూఫీయుం సుజాతయుమ్' చూశారు. నా నటను ఆమెకు నచ్చింది. శాకుంతలంలో దుశ్యాంత పాత్రకు నేను సరిపోతానని ఆమె ఫీలయ్యారు. దీంతో ఆమె నన్ను సంప్రదించారు. మెుదట ఏదో ప్రాంక్ చేస్తున్నారని భావించా. నీలిమ, డైరెక్టర్ గుణశేఖర్‌తో మాట్లాడిన తర్వాత నిజమని నిర్ధారించుకున్నా. ఇందులో చేయడం ద్వారా నా కల నేరవేరినట్లు భావిస్తున్నా.
ప్రశ్న: తెలుగు ఇండస్ట్రీ, గుణశేఖర్ గురించి మీకు అవగాహన ఉందా?
దేవ్: తెలుగు సినీ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మా దగ్గర (కేరళ) చాలా ఫేమస్. ఆర్య, హ్యాపీ సినిమాలు చూశాను. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చూశాను. గుణశేఖర్ గారి ఒక్కడు, రుద్రమదేవి చిత్రాలు చూశాను. ఆయనో చాలా గొప్ప దర్శకులు.
ప్రశ్న. శాకుంతలం కోసం మీరు తీసుకున్న ట్రైనింగ్ ?
దేవ్: ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా. రోజుకు రెండు గంటలు గుర్రపు స్వారీ చేసే వాడ్ని. తొలి రోజుల్లో చాలా కష్టంగా అనిపించింది. భుజం, వెన్ను నొప్పి వచ్చేది. క్రమంగా ఎంజాయ్ చేయడం ప్రారంభించా. గుర్రానికి బాగా కనెక్ట్ అయ్యి ట్రైనింగ్‌ను ఆస్వాదించాను.
ప్రశ్న. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు?
దేవ్: డైలాగ్స్‌ను డైరెక్టర్ నాకు వాయిస్ నోట్ పంపేవారు. నేను దాన్ని విని మలయాళంలో రాసుకునే వాడ్ని. షూటింగ్‌కు ముందు రోజు డైరెక్టర్‌ను కలిసి డైలాగ్ చెప్పేవాడ్ని. ఏమైనా తప్పు ఉంటే సరిచేసుకొని షూటింగ్‌లో డైలాగ్స్ చెప్పాను.
పూర్తి ఇంటర్యూ కోసం ఇక్కడ చూడండి..
https://youtu.be/TrcHf9vOscM
అవార్డులు దాసోహం...
అరంగేట్రం సినిమాలతోనే దేవ్ మోహన్ తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. 'సూఫీయుం సుజాతయుమ్’ మూవీకి ‘ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’లో ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కించుకున్నాడు. సమయం మూవీ అవార్డులోనూ ఉత్తమ అరంగేట్ర యాక్టర్‌గా దేవ్ మోహన్ ఎంపికయ్యాడు. అటు 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో బెస్ట్ డెబ్యూట్ మేల్ పురస్కారాన్ని దేవ్ అందుకున్నాడు.
దేవ్ మోహన్, రష్మిక మందన్నా జంటగా కొత్తగా రెయిన్‌బో చిత్రం తెరకెక్కబోతోంది. అక్కినేని అమల ఈ చిత్రం షూటింగ్‌ను క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏప్రిల్ 7 నుంచి రెయిన్‌బో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఫాంటసీగా రూపొందనున్న ఈ సినిమాకు శాంతరూబన్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఏప్రిల్ 03 , 2023